ప్రధాన వార్తలు

లోకేష్ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసు జులుం
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజూ కొనసాగింది. ఆ సమయంలో మంతత్రి నారా లోకేష్ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి 1,056 మంది యోగా టీచర్లు సీఎం నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అయినా కలిచి తమ గోడును వినిపించాలని వాళ్లు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. యోగాసనాలు వేస్తూ నిరసనలతో లోకేష్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. అయితే..ఇవాళ మళ్లీ నిరసనకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో పలువురిని అరెస్ట్ చేయగా.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమ వద్ద నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని, దురుసుగా ప్రవర్తించారని యోగా టీచర్లు వాపోయారు.

ఇంటర్నెట్ను ఈ వీడియో కుదిపేయకపోతే మంచిదే!
విజయ్ మాల్యా-లలిత్ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు. ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక నేరగాళ్లుగా పరాయి దేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తులు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ పార్టీలో తెగ ఎంజాయ్ చేస్తూ గడిపిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. I Did It My Way అంటూ అలనాటి అమెరికన్ సింగర్ ఫ్రాంక్ సినాత్రా(Frank Sinatra) పాడిన ప్రసిద్ధ గీతాన్ని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ-పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కలిసి ఆలపించారు. లండన్‌లో గత ఆదివారం తన నివాసంలో లలిత్ మోదీ ఇచ్చిన పార్టీలో ఇది జరిగింది. ఈ విలాసవంతమైన పార్టీ వీడియోను ఈ వీడియోను లలిత్ మోదీ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పైగా ముందుగానే ఏం జరుగుతుందో ఊహిస్తూనే.. “Controversial for sure. But that’s what I do best” అంటూ సందేశం ఉంచారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను లలిత్ మోదీ తన నివాసంలోనే నిర్వహించారట. ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని ఆయన తెలిపారు. వాళ్లలో విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కూడా ఉన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ను కుదిపేయకపోతే మంచిదే. వివాదాస్పదమైతే ఏముంది... అదే నా స్టైల్! అంటూ లలిత్ మోదీ చివర్లో సందేశం ఉంచారు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi)గేల్ గతంలో ఐపీఎల్ ఆర్సీబీ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. గేల్ సైతం తన మాజీ బాస్‌లు లలిత్ మోదీ, మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “We living it up. Thanks for a lovely evening” అని రాశారు. లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్‌కు కావలసిన నిందితుడు. 2017లో లండన్‌లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ ఇద్దరూ చట్టపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ.. తరచూ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తుండడం, పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తుండడం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) సీజన్ 2 కోసం ఇండియా ఛాంపియన్స్ మెనెజ్‌మెంట్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి ఎంపికయ్యాడు. 2024లో అరంగేట్ర ఎడిషన్‌లో యువీ సారథ్యంలోనే భారత జట్టు విజేతగా నిలిచింది.ఇక ఈ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో శిఖర్ ధావన్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో ఇండియా జట్టు సమతుల్యంగా కన్పిస్తోంది.పేస్ బౌలింగ్ విభాగంలో వరుణ్ ఆరోన్, సిద్ధార్థ్ కౌల్, వినయ్ కుమార్ చోటు దక్కించుకోగా.. స్పిన్ బాధ్యతలు హర్భజన్, పియూష్ చావ్లా, పవన్ నేగి నిర్వహించనున్నారు. ఇక బ్యాటింగ్ లైనప్‌లో యువీ, ధావన్, సురేష్ రైనా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.తొలి పోరు పాక్‌తోనే..ఇక డబ్ల్యూసీఎల్ సెకెండ్ సీజన్ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లండ్‌లోని నాలుగు వేదికలలో జరగనుంది. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాలు ఈ మెగా టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి.ఈ టోర్నీలో భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మొత్తం ఆరు జట్లు పాల్గోనున్నాయి. ఈ మెగా ఈవెంట్ రౌండ్-రాబిన్ లీగ్ ఫార్మాట్లో జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్దానాల్లో నిలిచే జట్లు సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఇక ఇండియా ఛాంపియన్స్ తమ తొలి మ్యాచ్‌లో జూలై 20న పాకిస్తాన్‌తో తలపడనుంది.ఇండియా ఛాంపియన్స్ జట్టుయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, గురుకీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్దార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి మిథున్

‘తమ్ముడు’ మూవీ ట్విటర్ రివ్యూ
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (జులై 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నరు.తమ్ముడు కథేంటి? ఎలా ఉంది? నితిన్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్‌లో తమ్ముడు చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది.. బాగోలేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.#Thammudu Review : A Good emotional Ride with Solid Production values - 3/5 💥💥💥Mainly Youth Star ⭐️ @actor_nithiin has given one of the career best performance 🔥🔥🔥💥💥 with a good comeback film 🎥👍❤️🔥 #Nithiin Director #SriramVenu Handled the subject very well with… pic.twitter.com/Xy0CFOvlKH— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) July 4, 2025 తమ్ముడు సినిమాలో విలువలతో పాటు మంచి ఎమోషన్ పండించే సన్నివేశాలు ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. నితిన్ కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. దర్శకుడు శ్రీరామ్ వేణు కథను చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో చాలా బాగా హ్యాండిల్ చేశాడు. బీజీఎమ్ బాగుంది. క లయ, సప్తమీ గౌడ, వర్ష బొలమ్మ యాక్టింగ్ బాగుందంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. Second half has excellent fight sequences…fans ki full meals aa fight sequences…Overall good movie. One time watch.Must in Theaters.#Thammudu @actor_nithiin https://t.co/ZHf0uZ0tr2— Mythoughts 🚩 (@MovieMyPassion) July 4, 2025 ఫస్టాఫ్ పర్వాలేదు. సెకండాఫ్‌లో ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతాయి. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లా ఫైట్ సీక్వెన్స్ తీర్చిదిద్దారు. ఓవరాల్‌గా తమ్ముడు గుడ్ మూవీ. ఒక్కసారి చూడొచ్చు. కచ్చితంగా థియేటర్స్‌లో చూడాలి’ అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. Below average film. Apart from two fight sequences, the film is boring in the second half.The issue with #Thammudu is the lack of emotion and the brother/sister emotion doesn’t work. The choreography for action sequences which is important for this film could’ve been much…— Sharat chandra 🦅 (@Sharatsays2) July 4, 2025బిలో యావరేజ్ సినిమా ఇది. రెండు ఫైట్ సీక్వెన్స్ మినహా సెకండాఫ్ అంతా బోరింగ్‌గా సాగుతుంది. అక్కా తమ్ముడు సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. సినిమాకు అదే ప్లస్ అయింది. వేణు శ్రీరామ్ డిసప్పాయింట్ చేశాడు. టెక్నికల్‌గా సినిమాను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో సక్సెస్ అయ్యాడు కానీ.. సరైన కథనే రాసుకోలేకపోయాడు. టీం పడిన కష్టం తెరపై కనిపించింది. కానీ అది ప్రేక్షకుడిపై ప్రభావం చూపలేకపోయింది’అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Thammudu A Lackluster Action-Adventure Drama That Tests Your Patience from start to finish! Director Venu Sriram attempts to deliver a unique action-adventure film with an interesting backdrop. However, he completely fails. The on-screen proceedings are outright silly at…— Venky Reviews (@venkyreviews) July 4, 2025 విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నా.ఆ పాత్ర తాలుకు సంఘర్షణ ఆకట్టుకోలేకపోయింది. బీజీఎం బాగుంది. సెకండాఫ్‌లో ఒక సీన్ బాగుంది. అంతకు మించి సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదంటూ మరో నెటిజన్ 1.75 రేటింగ్ ఇచ్చాడు.#Thammudu is a super knit commercial movie.First half starts a bit slow and the director takes his own time to establish the plot. There’s no looking back from the pre-interval to the superb INTERVAL BANG 💥.Post interval scenes are the major highlights of the movie.3.5/5— Peter Reviews 🔥🪓 (@urstruelypeter) July 4, 2025#thammudu First Half Review: Starts off with a familiar setup and unfolds at a slow pace, especially during the forest portions. The drama and stakes feel underwhelming so far. Hoping the second half picks up and delivers better.#ThammuduTrailer #nithin #DilRaju— Dingu420 (@dingu420) July 4, 2025

ట్రంప్ భారీ విజయం.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సభ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల సాకారమైంది. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. దీంతో, ఈ బిల్లును తీసుకురావడంలో ట్రంప్ విజయం సాధించారు.అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. అనంతరం, దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. బిల్లును వ్యతిరేకిస్తూ.. సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్.. 8 గంటల 32 నిమిషాలపాటు మాట్లాడారు. ఇక, అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాత చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు. ✅ The House of Representatives just officially PASSED the One Big Beautiful Bill.The largest middle-class tax cut in American history — and so much more — is on its way to President Trump's desk.MAGA! pic.twitter.com/V3U8xhenrS— Rapid Response 47 (@RapidResponse47) July 3, 2025ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' అమెరికా కాంగ్రెస్‌లో అధికారికంగా ఆమోదం పొందడంపై పలువురు స్పందిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం అనేది ట్రంప్ సాధించిన పెద్ద విజయంగా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పన్ను తగ్గింపులు, రక్షణ, సరిహద్దు భద్రతపై భారీ నిధులు కేటాయించే ఈ బిల్లు అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ బిల్లులో మెడికెయిడ్ ఖర్చుల్లో కోతలు, వలస నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ పథకాల్లో మార్పులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు ఆమోదానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. రిపబ్లికన్ సభ్యులతో ఆయనే మాట్లాడారు.The One Big Beautiful Bill:✅ Passed ✅ Signed ✅ Heading to President Trump’s desk to become lawMuch-needed and much-deserved relief for hardworking Americans is on the way! pic.twitter.com/zoh2dKlfO5— Speaker Mike Johnson (@SpeakerJohnson) July 3, 2025ట్రంప్ ఆనందం.. ఈ బిల్లు ఆమోదం పొందడంపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా సోషల్ టూత్ వేదికగా ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో రిపబ్లికన్లు బిల్లును ఆమోదించారు. తద్వారా మన పార్టీ ఏకతాటిపై ఉంది. ఈ బిల్లు ఆమోదంతో దేశం వేడిగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వైట్ హౌస్‌లో ఈ బిల్లుపై సంతకం వేడుక జరుగుతుందని ప్రకటించారు. అన్ని పార్టీలకు చెందిన అమెరికా శాసనసభ్యులను, సెనేటర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే రోజు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం కావడం గమనార్హం. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని, అలాగే కొత్త సువర్ణ యుగం ప్రారంభాన్ని కలిసి జరుపుకుందాం. అమెరికా ప్రజలు ఎప్పటికన్నా సంపన్నులుగా, సురక్షితులుగా, గర్వంగా ఉండేలా ఈ శాసన బిల్లుతో మార్పు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Jul 03, 2025, 6:15 PM ET )The Republicans in the House of Representatives have just passed the “ONE BIG BEAUTIFUL BILL ACT.” Our Party is UNITED like never before and, our Country is “HOT.” We are going to have a… pic.twitter.com/qR2Dql3IYh— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) July 3, 2025బిల్లుకు సంబంధించిన కీలక అంశాలు..2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు. ఓవర్‌టైం వేతనాలు, టిప్ ద్వారా ఆదాయం పొందే కార్మికులకు ప్రత్యేక పన్ను మినహాయింపులు అందించే ఏర్పాటు చేశారు. అలాగే SALT (State And Local Tax) మినహాయింపు పరిమితిని 10,000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు పెంచారు. ఈ కొత్త మినహాయింపులు తదుపరి 10 సంవత్సరాల్లో ఫెడరల్ బడ్జెట్ లోటును 3.4 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు. కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే పని చేయగల వ్యక్తులకు వయో పరిమితిని 54 నుంచి 64 సంవత్సరాలకు పెంచారు.వలస నియంత్రణపై ఫోకస్...ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు 45 బిలియన్ డాలర్లు, సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఆశ్రయం కోరే వ్యక్తుల కోసం ముందుగా ప్రతిపాదించిన 1,000 డాలర్ల ఫీజును 100 డాలర్లకు తగ్గించారు. బిల్లులో భాగంగా, ట్రంప్ ప్రభుత్వం బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిపివేసింది.ఆరోగ్య పథకంలో భారీ కోతలుతక్కువ ఆదాయ వర్గాల కోసం ఉన్న మెడికెయిడ్ ఆరోగ్య పథకంలో భారీ కోతలు విధించారు. కొత్తగా విధించిన పని నిబంధనలతో, సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయడం, లింగ మార్పు చికిత్సలకు నిధులు నిలిపివేయడం వంటి చర్యలు బిల్లులో పొందుపరిచారు. రూరల్ ఆసుపత్రులను పరిరక్షించేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు ఏర్పాటు చేశారు.

ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఇవాళ నగరంలోని ఎల్బీ స్టేడియంలోనిర్వహించబోయే సామాజిక న్యాయ సమరభేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అయితే, ఖర్గే పర్యటన వేళ హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణే మా ధ్యేయం.. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదంటూ ప్లెక్సీలు వెలిశాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. ‘జై భీం ఎస్సీ,ఎస్టీలే మా లక్ష్యం. జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు’ అనే స్లోగన్లతో ఏర్పాటు చేసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.కాగా, మల్లికార్జున ఖర్గే ఇవాళ(శుక్రవారం) వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు గాందీభవన్‌లో టీపీసీసీ పీఏసీ భేటీలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో పాటు పార్టీ ఇటీవల నియమించిన అన్ని కమిటీలతో సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే గ్రామ, మండల పార్టీ అధ్యక్షుల బహిరంగ సభలో పాల్గొంటారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.

ఇవిగో సాక్ష్యాలు..!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరులో మాయాజాలం.. ఈవీఎంలలో పోలైన ఓట్లకు (ఫారం–17 ప్రకారం), లెక్కించిన ఓట్లకు (ఫారం–20 ప్రకారం) మధ్య భారీ వ్యత్యాసం ఉండటం.. అదే రోజు రాత్రి ఈసీ తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికీ, ఆ తర్వాత నాలుగు రోజులు గడిచాక ప్రకటించిన శాతానికి మధ్య దేశంలోనే అత్యధికంగా భారీ తేడా ఉండటం.. తొలుత ప్రకటించిన దానితో పోలిస్తే అనూహ్యంగా పోలింగ్ ఏకంగా 12.54 శాతం పెరగడం.. దీనివల్ల సగటున ఒక్కో శాసనసభ స్థానంలో 28 వేల ఓట్లు, లోక్‌సభ స్థానం పరిధిలో 1.96 లక్షల ఓట్లు పెరగడం.. అంతిమంగా ఇది 87 శాసనసభ స్థానాల పరిధిలో గెలుపోటములను నిర్దేశించడం.. తదితర అంశాలపై వైఎస్సార్సీపీ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) ఫిర్యాదు చేసింది. పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరు అనుమానాస్పదంగా ఉందన్న అంశాన్ని సాక్ష్యాధారాలతో సీఈసీ ముందుంచింది. ఈవీఎంల పనితీరుపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటిని పక్కనపెట్టి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ను సీఈసీ దృష్టికి గట్టిగా తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుకు సంబంధించి సాంకేతిక అంశాలు, కొన్ని పోలింగ్ బూత్‌లలో చోటుచేసుకున్న అసంబద్ధ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ గతంలోనే సీఈసీకి ఫిర్యాదుచేసింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు నిర్వహించిన సమావేశానికి వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభ పక్షనేత పి.మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ హాజరయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం మిథున్‌రెడ్డి, చంద్రశేఖర్‌తో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈవీఎం, వీవీ ప్యాట్లను పోల్చి చూడాలి2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల తీరుపై అనేక అనుమానాలున్నందున వాటిని నివృత్తి చేయాలని కోరాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఓట్లను పోల్చి చూడాలని కోరాం. ఇందుకు ఫీజు కింద నిర్ణీత రుసుము కూడా ఇప్పటికే చెల్లించాం. బ్యాటరీ చార్జింగ్ విషయంలో కూడా ఈవీఎంలపై అనేక సందేహాలున్నాయి. పోలింగ్ పూర్తయ్యాక 80 శాతం ఉంటే.. 40 రోజుల తర్వాత కౌంటింగ్ సమయంలో 98 శాతం చార్జింగ్ ఉన్న సందర్భాలు కనిపించాయి. సాయంత్రం 6 గంటల తర్వాత చాలాచోట్ల పోలింగ్ శాతం పెరిగింది. నాలుగు కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పోలయ్యాయి. వీటిపై అనేక అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని సీఈసీని కోరాం. అయితే, వీవీ ప్యాట్లను కంపారిజన్ చేయడం కుదరదని చెప్పారు. అవి రీ చార్జబుల్ బ్యాటరీలు కావడం వల్ల చార్జింగ్ పెరగడం, తగ్గడం అంటూ జరగదని చెబుతున్నారు.రాయచోటి ఓ ఉదాహరణ..2014–19 కంటే గతేడాది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిన విషయాన్ని సీఈసీకి వివరించాం. రాయచోటి నియోజకవర్గం దీనికి ఉదాహరణ అని చెప్పాం. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎక్కువ శాతం పోలింగ్ అంశంపై నియోజకవర్గం డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల పెరుగుదలపై మావద్ద ఉన్న ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్‌కు అందించాం. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందిస్తూ.. ఓటర్ల జాబితా విషయంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక విస్తృత సవరణ) చేపడతామని హామీ ఇచ్చింది.మీడియాతో మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి. పక్కన పి.మిథున్‌రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ హిందూపురం ఓటింగ్ సరళిలో వ్యత్యాసాలు..ఈవీఎంలపై సాంకేతికతపరంగా ఉన్న సందేహాలను ఈసీకి వివరించాం. మేం ఓడిపోయాం కదా అని నేరం ఎవరిపైనా మోపట్లేదు. అందుకే ప్రత్యేకంగా హిందూపురం నియోజకవర్గంలో జరిగిన అవకతవకలను సీఈసీ ముందుంచాం. హిందూపురం నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్–157, 28లలో వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థికి 472 ఓట్లు పోలవ్వగా, అదే బూత్‌లో అసెంబ్లీ అభ్యర్థికి కేవలం ఒకే ఒక్క ఓటు పోలైన విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఇక కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థికి ఒక ఓటు రాగా, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థికి 8 ఓట్లు పోలవ్వగా, అసెంబ్లీ అభ్యర్థికి 95 ఓట్లు వచ్చిన విషయాన్ని ఆధారాలతో సహా సీఈసీ ముందుంచాం. ఓటింగ్ సరళిలో ఇన్ని తేడాలు రావడం మా అనుమానాలకు కారణం. దీనిపై క్షుణ్ణంగా విచారణ చేపట్టాలని కోరాం. దీంతో.. బిహార్ తరహాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించేందుకు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ అంగీకరించారు.బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరపాలి..ప్రస్తుత పరిస్థితుల్లో ఈవీఎంలను, వీవీ ప్యాట్లను విశ్వసించేందుకు ఏమాత్రం ఆస్కారం లేనందున బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియచేశాం. అమెరికా, జర్మనీ, యూరప్ దేశాల్లో సైతం బ్యాలెట్‌తోనే ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని వారికి గుర్తు చేశాం. బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరిగితే ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, పారదర్శకత ఉంటుందని వివరించాం. వీవీ ప్యాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కించబోమని.. ఆయా పోలింగ్ బూత్‌లకు సంబంధించి సీసీ ఫుటేజీలను కూడా ఇచ్చేది లేదని సీఈసీ చెప్పింది.ఎన్నికల ప్రక్రియ బలోపేతం: ఈసీఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను ప్రత్యక్షంగా కమిషన్ దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ బృందంతో చర్చలు జరిపినట్లు సీఈసీ తెలిపింది. ఈమేరకు ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకే వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు గురువారం వైఎస్సార్సీపీ నేతలతో భేటీ అనంతరం సీఈసీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ పార్టీలతో నిర్మాణాత్మక చర్చలు అవసరమని ఈసీ పేర్కొంది.

బీజేపీ రాజకీయ వ్యూహం.. మహిళకు అధ్యక్ష పదవి!.. రేసులో ముగ్గురు!
ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధ్యక్షుడు ఎవరు అని రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. అయితే, బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, కీలక పదవి ఎవరిని వరిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇక, ఈసారి అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు నేషనల్ మీడియా(ఇండియా టుడే)లో కథనాలు వెలువడ్డాయి.బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నుంచి ముగ్గురు మహిళల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. నిర్మల ముందంజ..అయితే, రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరు ప్రముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆమె విస్తృత అనుభవం, నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. అధ్యక్ష బాధ్యతలను సీతారామన్‌కు ఇస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరించడానికి సహాయపడుతుందనే అంచనాకు పార్టీ నాయకత్వం ఆలోచన చేసినట్టు సమాచారం. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిర్మల కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి, రక్షణమంత్రిగా విజయవంతంగా నిర్వర్తించారు. ఈమెకు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెనే అధ్యక్షురాలు అవ్వొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణాలతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలకు బాధ్యతలు ఇచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. వనతి శ్రీనివాసన్..తమిళనాడుకు చెందిన న్యాయవాది, బీజేపీ నాయకురాలు వనతి శ్రీనివాసన్ కూడా పరిశీలనలో ఉంది. ఆమె ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కోయంబత్తూర్ సౌత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1993లో బీజేపీలో చేరినప్పటి నుండి రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవి సహా అనేక కీలక బాధ్యతలను ఆమె నిర్వహించారు. 2020లో పార్టీ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, ఆమె పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలకు ఆమెకు అప్పగిస్తే తమిళనాడులో వనతి మార్క్ కనిపించే అవకాశం ఉంది.పురందేశ్వరిరాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకురాలైన పురంధేశ్వరి ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగారు.ఆర్ఎస్ఎస్ ఆమోదంమహిళా నాయకత్వం, ప్రతీకాత్మక, వ్యూహాత్మక ప్రయోజనాలను గుర్తించి, పార్టీ అత్యున్నత పదవికి మహిళను నియమించాలనే ఆలోచనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆమోదించిందని పార్టీ సైతం వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, ఈసారి అధ్యక్ష బాధ్యతలను మహిళకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జపాన్‌లో వరుస భూకంపాలు.. తత్సుకీ మెగా సునామీ సంకేతమా?
టోక్యో: వరుస భూకంపాలు జపాన్‌లోని మారుమూల ద్వీపాలను నిద్రలేకుండా చేస్తున్నాయి. కేవలం రెండు వారాల్లో 900 భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలకు రాత్రుళ్లు నిద్ర ఉండటం లేదు. ఏ క్షణం ఏం జరగుతుందోని ఆందోళనతో రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. జూన్ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ ఉన్న సముద్రాలలో భూకంప కార్యకలాపాలు చాలా చురుగ్గా ఉన్నాయని, బుధవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.అయితే ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ అవసరమైతే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న దేశాలలో జపాన్ ఒకటి. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రదేశంలో ఉండటంతో తరచూ భూకంపాలు వస్తుంటాయి. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 1,500 భూకంపాలను ఎదుర్కొంటుంది. కాగా, 12 టోకారా దీవులలో ఏడింటిలో దాదాపు 700 మంది నివసిస్తున్నారు. ఈ సుదూర దీవులలో కొన్నింటిలో ఆసుపత్రులు లేవు. ప్రిఫెక్చురల్ రాజధాని కగోషోమాకు వెళ్లాలంటే ఫెర్రీలో కనీసం ఆరు గంటలు ప్రయాణించాలి. భూకంపాల కారణంగా టోకారా దీవుల్లోని కొన్ని గెస్ట్‌హౌస్‌లు పర్యాటకులను అనుమతించడం లేదు. త్వరలో భారీ, ప్రాణాంతక భూకంపం సంభవించవచ్చనే వదంతులలో దేశం మొత్తం ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వరుస ప్రకంపనలు వస్తున్నాయి. 🌏 Current Earthquake Swarm ongoing south of Southern mainland #Japan near Tatsugō.Several M 4.5+ events - could portend a stronger #earthquake to come, and the region should be monitored closely 👀⚠️ This is one of the riskiest world areas in JULY 2025 because of this. pic.twitter.com/K0dmPQZMrP— Weather & Earth 25 (@Weather_Earth25) July 2, 2025ఇదిలా ఉండగా.. శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దీంతో, శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్లైన్లో ట్రండింగ్‌లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు.తత్సుకీ ఏం చెప్పారు? కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరమ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’ అంటూ వర్ణించారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరీ తత్సుకీ? తత్సుకీ జపాన్‌కు చెందిన మాంగా ఆర్టిస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు.

ఘోర ప్రమాదం: రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవదహనం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమయ్యారు.ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీల్లో ఒకటి గ్రానైట్ లోడుతో, మరొకటి చేపల దానాతో వెళ్తున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక లారీ విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుండగా, మరో లారీ వరంగల్ నుంచి ఏపీ వైపు వెళ్తుందని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదం కారణంగా ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్యాబిన్లో సజీవదహనమైన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు.
ఓటీటీలో 'నార్నే నితిన్' ఫస్ట్ సినిమా స్ట్రీమింగ్
తీపి వద్దు.. సున్నా ముద్దు.. ఈ డ్రింక్స్‌కు భారీ డిమాండ్
ట్రిపుల్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ ఆటగాడి ట్రాప్‌లో పడ్డ గిల్! వీడియో
బిగ్ రిలీఫ్! మళ్లీ కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే
గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
నిలకడగానే కేసీఆర్ ఆరోగ్యం
ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్..పర్స్ వడ్డాణం..!
చదివింది ఇంటర్, ఫస్ట్ సినిమానే హిట్.. లగ్జరీ కారు కొన్న నటి
Neha Reddy అమెరికాలో అందెల సవ్వడి, డాక్టర్ కావాలనేది కల
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్‌బై..!
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత
వైఎస్ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు!
వాళ్లు ‘జగనన్న గోరుముద్ద’ పెట్టారు.. మనం ‘బాబు బొద్దింక భోజనం’ అని పెట్టేద్దాం మేడమ్!!
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
ఎల్లుండే మెగా సునామీ?
ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
ఒంటరిగా ఉండలేను.. ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా : అభిషేక్
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత ప్లేయర్‌గా
బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం
బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎలాన్ మస్క్
జనసేనకు షాక్.. వైఎస్సార్సీపీలోకి దేవమణి
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఓటీటీలో 'నార్నే నితిన్' ఫస్ట్ సినిమా స్ట్రీమింగ్
తీపి వద్దు.. సున్నా ముద్దు.. ఈ డ్రింక్స్‌కు భారీ డిమాండ్
ట్రిపుల్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ ఆటగాడి ట్రాప్‌లో పడ్డ గిల్! వీడియో
బిగ్ రిలీఫ్! మళ్లీ కరుగుతోన్న బంగారు కొండ.. తులం ఎంతంటే
గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
నిలకడగానే కేసీఆర్ ఆరోగ్యం
ఖర్గే పర్యటన వేళ ఫ్లెక్సీల కలకలం
లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్..పర్స్ వడ్డాణం..!
చదివింది ఇంటర్, ఫస్ట్ సినిమానే హిట్.. లగ్జరీ కారు కొన్న నటి
Neha Reddy అమెరికాలో అందెల సవ్వడి, డాక్టర్ కావాలనేది కల
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్‌బై..!
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత
వైఎస్ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు!
వాళ్లు ‘జగనన్న గోరుముద్ద’ పెట్టారు.. మనం ‘బాబు బొద్దింక భోజనం’ అని పెట్టేద్దాం మేడమ్!!
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
ఎల్లుండే మెగా సునామీ?
ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
ఒంటరిగా ఉండలేను.. ఐశ్వర్య సలహానే పాటిస్తున్నా : అభిషేక్
చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత ప్లేయర్‌గా
బాలునిపై ఏడాదిగా మహిళా టీచర్ దారుణం
బిగ్ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకిస్తున్న ఎలాన్ మస్క్
జనసేనకు షాక్.. వైఎస్సార్సీపీలోకి దేవమణి
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
సినిమా

సైకో కిల్లర్‌గా చేయాలని ఉంది: వర్ష బొల్లమ్మ
‘‘హీరోయిన్గా కొన్ని సినిమాలు చేశాను. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చినా చేస్తాను. స్క్రీన్‌పై వర్ష బాగా నటిం చిందనే పేరు తెచ్చుకుంటే చాలు. ఉదాహరణకు నిత్యా మీనన్‌గారికి మంచి పెర్ఫార్మర్గా పేరుంది. ఆమెలా పేరు తెచ్చుకోవాలని ఉంది. ‘తమ్ముడు’ కథ విన్నప్పుడు, ఈ సినిమాలో నేను చేసిన చిత్ర క్యారెక్టర్ కొత్తగా అనిపించింది.సవాల్‌గా తీసుకుని, ఈ సినిమా చేశాను’’ అని హీరోయిన్ వర్ష బొల్లమ్మ అన్నారు. నితిన్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘తమ్ముడు’. ఈ చిత్రంలో లయ, సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, బాల నటి శ్రీరామ్ దిత్య ఇతర కీలక పాత్రల్లో నటించారు.శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘అక్కాతమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమా ‘తమ్ముడు’. కానీ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ జైకి ఓ డ్రైవింగ్ ఫోర్స్‌లా ఉంటుంది చిత్ర పాత్ర.ఏదైనా చేయాలనుకుంటే వెంటనే చేసేయాలనుకునే మనస్తత్వం చిత్రది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఇక ఓ సైకో కిల్లర్ రోల్ చేయాలన్నది నా ఆకాంక్ష. ప్రస్తుతం ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్, మరో వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. మరో రెండు సినిమాలు ఉన్నాయి’’ అని అన్నారు.

హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
ఆవేశం అనర్థదాయకం అని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాల్లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా నాజ్. ఆమె సోదరి టబు.చిన్న వయసులోనే..హైదరాబాద్‌లో పుట్టిన ఫరా నాజ్ (Farah Naaz Hashmi) తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా 'ఫాల్సే' మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 17 ఏళ్లు మాత్రమే! ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్‌కు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులిచ్చారు. మార్తే డం టక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, ఇమాందార్, వీరు దాదా, దిల్జలా, బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.ఆవేశంస్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఫరా నాజ్‌కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవపడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు, కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట! తన బాధ ఇంట్లోవాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది.చెంప చెళ్లుమనిపించిందికసం వర్దీకీ సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్‌కు ఒళ్లంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెళ్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురీ దీక్షిత్‌ను హీరోయిన్గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్టయ్యేదని అనిల్ కపూర్ ఫీలయ్యాడట! ఈ విషయం తెలిసిన ఫరా.. అనిల్‌ను బెదిరించినట్లు భోగట్టా! ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగెటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్ను దెబ్బ తీసింది.చెల్లితో అసభ్యంగా..జాకీ ష్రాఫ్‌తో కలిసి దిల్జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజోంగ్ప ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా.. టబును తీసుకుని వెళ్లింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్.. టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్‌ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా.. మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతరకాలంలో మాత్రం అపార్థం చేసుకున్నానని యూటర్న్ తీసుకుంది.రెండు పెళ్లిళ్లుఫరా.. రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్‌ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన ఆరేళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాదే నటుడు సుమీత్ సైగల్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనక్కూడా ఇది రెండో పెళ్లే! అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఫరా.. తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ

మెట్లు ఎక్కలేని స్థితిలో స్టార్ హీరో కూతురు.. ఇప్పుడేకంగా హీరోయిన్గా!
తండ్రి బాటలో అడుగులు వేసేందుకు సిద్ధమైంది విస్మయ (Vismaya Mohanlal). మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కూతురిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపనుంది. తుడక్కం అనే మలయాళ చిత్రంతో వెండితెరపై రంగప్రవేశం చేయనుంది. అయితే విస్మయ ఇప్పటికే రచన, మార్షల్ ఆర్ట్స్‌లో ఆరి తేరింది. 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్' అనే పుస్తకంతో రచయిత్రగా ప్రయాణం ప్రారంభించింది. థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ఇప్పుడు హీరోయిన్గా అలరించనుంది.థాయ్‌ల్యాండ్‌లో ఫిట్నెస్ ట్రైనింగ్విస్మయ మొదట్లో కాస్త బొద్దుగా ఉండేది. థాయ్‌ల్యాండ్‌లో ఫిట్నెస్ క్యాంప్‌నకు వెళ్లి తన శరీరంపై ఫోకస్ చేసింది. అటు మార్షల్ ఆర్ట్స్, ఇటు ప్రత్యేక వ్యాయామాలతో 22 కిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని 2020 డిసెంబర్లో తనే ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. నాలుగు మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వచ్చేది. ఫిట్‌గా ఉండాలనిపించేది కానీ అందుకోసం ఏదీ చేయకపోయేదాన్ని. కానీ, ఇక్కడికి వచ్చాక అంతా మారిపోయింది.నా వల్ల కాదనుకున్నప్పుడల్లా..కొండలు ఎక్కేస్తున్నాను. ఎక్కువసేపు స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇదంతా నా కోచ్ వల్లే సాధ్యమైంది. నాకోసం 100 శాతం కష్టపడ్డాడు. ఎప్పుడూ నా వెంటే ఉన్నాడు. గాయాలవుతున్నా సరే.. నా ఫిట్నెస్ జర్నీ ఆపకూడదని నాకు ధైర్యాన్ని నూరిపోశాడు. నా వల్ల కాదనుకున్న ప్రతిసారి.. కచ్చితంగా అవుతుందని వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఇక్కడకు వచ్చాక కేవలం బరువు తగ్గడమే కాదు, కొత్త విషయాలు నేర్చుకున్నాను, కొత్తవారిని కలిశాను. నన్ను నేను నమ్మడం మొదలుపెట్టాను. నా జీవితమే మారిపోయిందినేను చేయలేను అనే ఆలోచన నుంచి ఏదైనా చేయగలిగేలా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడికి వచ్చాక నా జీవితమే మారిపోయింది అని రాసుకొచ్చింది. అప్పటినుంచి తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ వస్తోంది. తుడక్కం సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి జూడ్ ఆంథొనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూడ్ ఆంథొని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంథొనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Vismaya Mohanlal (@mayamohanlal) చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి

జానీ మాస్టర్ ఎఫెక్ట్.. 'నయనతార' దంపతులపై తీవ్ర విమర్శలు
మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన కొంతకాలం జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. నయనతార, విఘ్నేష్ శివన్‌లు తమ సినిమా కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రకటించారు. దీంతో ఈ దంపతులపై కోలీవుడ్‌లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు బాలీవుడ్ మీడియా కూడా పలు కథనాలు ప్రచురించింది.నయనతార, విఘ్నేష్ శివన్‌లు నిర్మిస్తున్న కొత్త సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కోసం కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ పనిచేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని చెబుతూ కొన్ని ఫోటోలను కూడా జానీ షేర్ చేశాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత నయనతార దంపతులను కోలీవుడ్ మీడియా తప్పుబడుతుంది. తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన బాలికపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కొరియోగ్రాఫర్‌గా ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తప్పనిపించలేదా..? కోలీవుడ్‌లో మీకు ఎవరూ కొరియోగ్రాఫర్ దొరకలేదా..? అంటూ విమర్శించారు.నేరస్థులకే ఛాన్సులు: చిన్మయికోలీవుడ్ టాప్ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. జానీ మాస్టర్, విఘ్నేష్ ఫోటోలను షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'జానీ, ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చాడు. మనం 'ప్రతిభావంతులైన' నేరస్థులను ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటాము. వారినే అధికార స్థానాల్లో ఉంచుతాము. మహిళలను ఎక్కువగా వేధించేది నేరస్థులే అని గుర్తుపెట్టుకోవాలి. 'నాకు ఏమీ జరగకుండా చూడండి' మనం ఏం చేస్తున్నామో ఆలోచించండి స్వీట్' అంటూ ఆమె తెలిపారు.చిన్మయి చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది. ఆన్లైన్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. తీవ్రమైన నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి పనిచేయాలనే ఈ జంట నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు. మరికొందరు వారు "లైంగిక వేటగాడిని వేదికగా చేసుకున్నారని" ఆరోపించారు. నయన్ తనను తాను స్వయంకృషి కలిగిన మహిళగా చెప్పుకుంది. మహిళా నటుల కష్టాలను ఆమె తెరపైకి తీసుకొచ్చింది. వేదికలపై తారలు మాట్లాడాలని కోరింది. కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. అయినప్పటికీ, పోక్సో కింద నిందితుడైన వ్యక్తికి తన భర్త మద్దతు ఇవ్వడం ఆమెకు బాగానే ఉంది అంటూ కొందరు విమర్శించారు. ఏదేమైన నయనతార దంపతులు తీసుకున్న నిర్ణయం పట్ల కోలీవుడ్ నుంచి తీవ్రంగా వ్యతిరేఖత వస్తుంది.Jani is out on conditional bail involving a minor’s sexual assault.We as a people seem to love ‘talented’ offenders and will keep promoting them and keeping them in positions of power which the offenders use to harangue the women more - “See nothing will happen to me.” It is… pic.twitter.com/irXOqZp824— Chinmayi Sripaada (@Chinmayi) July 2, 2025Nayan called herself a self-made woman who knows the struggles of female actors, urged stars to speak out, and thanked those who supported her. Yet she's fine with her husband backing a man accused under POCSO. Why the double standards? #Jani #VigneshShivan pic.twitter.com/Bz1sXpumvq— Films Spicy (@Films_Spicy) July 2, 2025don't know when wikki is gonna understand he's not a single person anymore.Whatever he does/speaks directly attached to #Nayanthara.She is a self made woman who stood up for herself and women in cinema in the past.A happy post with a pedophile dance master is seriously a big mess pic.twitter.com/SaG9sT2kQD— common_man (@IronladyNa5366) July 2, 2025It's not news that Vignesh Shivan and Nayan support predators. Why are y'all surprised? pic.twitter.com/f9u97SB2Ko— ஜமுனா (@velu_jamunah) July 2, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

ఏపీలో గత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యలో పెరుగుదలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రుజువులు అందజేసిన వైఎస్సార్సీపీ... తమ విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించిందన్న పార్టీ నేతలు

ఘటన జరిగిన రెండేళ్లకు కేసు నమోదు చేయడం ఏమిటి?... వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య... బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం

ప్రజలకు అండగా నిలబడాలి, నిత్యం వారికి అందుబాటులో ఉండాలి... వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం

ఏపీలో ధాన్యం బకాయిలు వేయి కోట్లు. రెండు నెలలు దాటినా రైతులకు చెల్లింపు లేదు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం

ఏపీలో ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలొచ్చి 45 రోజులైనా ప్రారంభించకపోవడం ఏమిటి?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌లో బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘హైస్కూల్ ప్లస్’లు వ్యూహాత్మకంగా నిర్వీర్యం

ప్రమాదానికి ప్రయాణికులు బాధ్యులవుతారా? సింగయ్య మృతి ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు... నల్లపాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం

హైకోర్టులో విచారణ జరుగుతున్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా?... టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఇంటింటికీ వంచన. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై గ్రామగ్రామాన.. ఇంటింటా ప్రచారం. పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు

ఆగిన దాడులు!. యుద్ధం ముగిసిందంటూ తొలుత ట్రంప్ ప్రకటన. అయినా కొనసాగిన దాడులు, విమర్శలు. ట్రంప్ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్
క్రీడలు

టెస్టు క్రికెట్‌కు సరికొత్త రారాజు.. ఇంక అంతా 'శుభ్' మయం
"ఈ సిరీస్‌లో నేను బెస్ట్ బ్యాటర్‌గా నిలుస్తా.. కెప్టెన్‌గా ఎటువంటి ఒత్తిడి తీసుకోను".. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత యువ సారథి శుబ్‌మన్ గిల్ చెప్పిన మాటలివి. ఇప్పుడు అందుకు తగ్గట్టే దూసుకుపోతున్నాడు ఈ యువ రాజు.ఎవరైతే అతడిని కెప్టెన్‌గా ఎంపికచేయడాన్ని వ్యతిరేకించారో.. ఇప్పుడు వారితోనే శెభాష్ అనిపించుకుంటున్నాడు. కెప్టెన్‌గా తొలి టెస్టులోనే సెంచరీతో మెరిసిన గిల్.. ప్రస్తుతం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఏకంగా ద్విశతకంతో మెరిశాడు.తన అసాధారణ ప్రదర్శనతో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా చరిత్రను తిరగ రాశాడు. ఈ సిరీస్ ముందు వరకు ఇంగ్లండ్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా చేయని శుబ్‌మన్.. ఇప్పుడు శతకాల మోత మ్రోగిస్తున్నాడు. ఇంతకుముందు ఒక్క లెక్క.. కెప్టెన్ అయ్యాక ఒక లెక్క అన్నట్లు గిల్ ప్రయాణం సాగుతోంది.జయహో నాయక..ఒక జట్టు నాయకుడికి ఉండవలసిన అన్ని లక్షణాలు గిల్‌కు ఉన్నాయి. జట్టు గెలిస్తే క్రెడిట్ తీసుకున్న వాడు నిజమైన కెప్టెన్ కాడు.. అదే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి ఆదుకున్న వాడే నిజమైన లీడర్. ఇది గిల్‌కు సరిగ్గా సరిపోతుంది.తొలి టెస్టులో ఓటమికి నైతిక బాధ్యత వహించిన గిల్.. ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును.. తన బాధ్యయుత ఆటతీరుతో ఆదుకున్నాడు.ఆచితూచి ఆడి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలుత 100 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన ఈ పంజాబీ ఆటగాడు.. క్రీజులో నిలదొక్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. గిల్ తొలి టెస్టు డబుల్ సెంచరీ వెనక ఎంతో శ్రమ దాగి ఉంది. దాదాపు రెండు రోజుల పాటు ఎంతో ఓర్పు, నిబద్దతతో బ్యాటింగ్ చేసి జట్టును పటిష్ట స్ధితిలో నిలిపాడు. అతడి ఆటతీరుకు ప్రత్యర్ధి ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. అప్పటిలో సచిన్, కోహ్లి.. భారత టెస్టు జట్టులో నాలుగో నంబర్‌కు ప్రత్యేక స్ధానం ఉంది. ఒక దశాబ్ధం క్రితం జోహన్నెస్‌బర్గ్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వదిలిపెట్టి వెళ్లిన నాలుగో నంబర్ స్ధానాన్ని లెజెండరీ విరాట్ కోహ్లి భర్తీ చేశాడు. ఆ స్ధానంలో దాదాపు పుష్కరకాలం పాటు విరాట్ కోహ్లి విజయవంతంగా కొనసాగాడు. విరాట్ తన అద్బుత ప్రదర్శనలతో మాస్టర్‌బ్లాస్టర్‌ను మరిపించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లి వారసుడిగా అదే ఎంఆర్ఎఫ్( MRF) బ్యాట్‌తో 25 ఏళ్ల గిల్ బాధ్యతలు చేపట్టాడు. ఈ సిరీస్ ఆరంభానికి ముందు వరకు ఈ కీలకమైన స్దానంలో ఎవరి బ్యాటింగ్ వస్తారన్న చర్చ తీవ్ర స్ధాయిలో జరిగింది.కొంతమంది మాజీలు కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్‌ను నాలుగో స్ధానంలో బ్యాటింగ్ పంపాలని సూచించారు. కానీ కెప్టెన్ గిల్ మాత్రం విరాట్ కోహ్లి స్దానానికి తానే సరైనోడనని ముందుకు వచ్చాడు. అందుకు తగ్గట్టే ఆ స్ధానంలో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టాడు. ఇప్పుడు రెండో టెస్టులో 269 పరుగులు చేసి సత్తాచాటాడు. ఓవరాల్‌గా గిల్ ఇప్పటివరకు 34 టెస్టులు ఆడి 40.65 సగటుతో 2317 పరుగులు చేశాడు.పట్టు బిగిస్తున్న భారత్..ఇక ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీ బ్రూక్(30), జో రూట్(18) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు, సిరాజ్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు.

గిల్ రికార్డుల హోరు ఇంగ్లండ్ బేజారు
‘హెడింగ్లీలో నేను 147 పరుగులకే అవుటయ్యా... మరింత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సింది. తప్పుడు షాట్‌తో వెనుదిరిగా’... రెండో టెస్టుకు ముందు భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చెప్పిన మాట ఇది. తాను నిజంగా నిలబడి పట్టుదలగా ఆడితే ఎలా ఉంటుందో ఇప్పుడు అతను ఎడ్జ్‌బాస్టన్‌లో చూపించాడు. 8 గంటల 29 నిమిషాల అసాధారణ బ్యాటింగ్, ఎక్కడా చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకుండా... 94 శాతం నియంత్రణతో కూడిన చక్కటి షాట్లతో గిల్ అదరగొట్టాడు... ఏకంగా 269 పరుగులు చేసి పలు రికార్డులను అలవోకగా అధిగమిస్తూ పోయాడు. గిల్‌కు జడేజా, వాషింగ్టన్ సుందర్ అండగా నిలవడంతో టీమిండియా భారీ స్కోరుతో ప్రత్యర్థికి సవాల్ విసిరింది. ఒక దశలో 211/5తో కష్టాల్లో నిలిచిన జట్టు చివరి 5 వికెట్లకు ఏకంగా 376 పరుగులు జోడించింది. ఆపై బుమ్రా లేని లోటును తీర్చేలా ఆకాశ్‌దీప్, సిరాజ్ చెలరేగిపోయి ఇంగ్లండ్ టాప్–3ని కుప్పకూల్చారు. మూడో రోజూ మన బౌలర్ల జోరు సాగితే టీమిండియాకు మ్యాచ్‌పై పట్టు చిక్కడం ఖాయం. బరి్మంగ్‌హామ్: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసి కూడా ఓడిన భారత్ ఈసారి అంతకంటే మరింత భారీ స్కోరును నమోదు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 310/5తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 587 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ క్రికెట్లో స్టోక్స్–మెకల్లమ్ (బజ్‌బాల్) శకం మొదలైన తర్వాత ఆ జట్టుపై ప్రత్యర్థి సాధించిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా, రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (103 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో వికెట్‌కు జడేజాతో 203 పరుగులు జోడించిన గిల్... ఏడో వికెట్‌కు సుందర్‌తో 144 పరుగులు జత చేశాడు. అనంతరం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఫాలోఆన్ తప్పించుకునేందుకు కూడా ఆ జట్టు మరో 311 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా చేజారిన సెంచరీ మ్యాచ్ రెండో రోజు తొలి బంతికి సింగిల్‌తో గిల్, జడేజా భాగస్వామ్యం 100 పరుగులకు చేరింది. అనంతరం 80 బంతుల్లో జడేజా అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా... ధాటిని పెంచిన గిల్ టెస్టుల్లో తన అత్యధిక స్కోరును అందుకోవడంతో పాటు కెరీర్లో తొలిసారి 150 పరుగులు (263 బంతుల్లో) దాటాడు. ఆ తర్వాత మరింత జోరు ప్రదర్శించిన వీరిద్దరు బషీర్ ఓవర్లో చెరో సిక్స్ బాదారు. ఇదే ఊపులో శతకం దిశగా దూసుకుపోయిన జడేజా దురదృష్టవశాత్తూ ఆ అవకాశం కోల్పోయాడు. టంగ్ వేసిన షార్ట్ బంతి నుంచి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా... గ్లవ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచి కీపర్ చేతుల్లో పడింది. దాంతో ద్విశతక భాగస్వామ్యానికి తెర పడింది. అనంతరం సుందర్ కూడా చక్కటి షాట్లతో గిల్‌కు తగిన సహకారం అందించాడు. తొలి సెషన్లో భారత్ 25 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి 109 రన్స్ చేసింది. కొనసాగిన జోరురెండో సెషన్లో గిల్ మరింత చెలరేగిపోయాడు. బషీర్ ఓవర్లో సిక్స్ కొట్టిన అతను టంగ్ ఓవర్లో రెండు ఫోర్లతో 195కు చేరుకున్నాడు. ఆ తర్వాత టంగ్ బౌలింగ్‌లోనే ఫైన్ లెగ్ దిశగా సింగిల్ తీయడంతో 311 బంతుల్లో గిల్ డబుల్ సెంచరీ పూర్తయింది. ఆపై 200 నుంచి 250 వరకు చేరేందుకు గిల్‌కు కేవలం 37 బంతులు (8 ఫోర్లు, 1 సిక్స్) సరిపోయాయి. ఈ క్రమంలో బ్రూక్ ఓవర్లో అతను వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఎట్టకేలకు సుందర్‌ను రూట్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్‌కు కాస్త ఊరట లభించింది. రెండో సెషన్లో భారత్ 31 ఓవర్లలో ఓవర్‌కు 4.6 రన్‌రేట్‌తో ఏకంగా 145 పరుగులు సాధించడం విశేషం. టీ విరామానంతరం ‘ట్రిపుల్’పై కన్నేసిన గిల్‌ను నిలువరించడంలో ఇంగ్లండ్ సఫలమైంది. టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో సునాయాస క్యాచ్ ఇవ్వడంతో గిల్ అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో 13 పరుగుల తర్వాత భారత్ తమ చివరి 2 వికెట్లు కోల్పోయింది. టపటపా ప్రత్యర్థి చేసిన కొండంత స్కోరు కనిపిస్తుండగా ఒత్తిడిలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. ఆకాశ్‌దీప్ చెలరేగిపోతూ వరుస బంతుల్లో డకెట్ (0), పోప్ (0)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ తర్వాత క్రాలీ (19)ని సిరాజ్ పెవిలియన్ పంపడంతో పరిస్థితి మరింత దిగజారింది. అయితే రూట్, బ్రూక్ పట్టుదలగా నిలబడి ఇంగ్లండ్‌ను ఆదు కున్నారు. ఆరంభంలో కొంత తడబడినా చివరకు 12.5 ఓవర్లు నిలిచి రోజును ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (సి) పోప్ (బి) టంగ్ 269; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (సి) స్మిత్ (బి) టంగ్ 89; సుందర్ (బి) రూట్ 42; ఆకాశ్‌దీప్ (సి) డకెట్ (బి) బషీర్ 6; సిరాజ్ (స్టంప్డ్) స్మిత్ (బి) బషీర్ 8; ప్రసిధ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (151 ఓవర్లలో ఆలౌట్) 587. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211, 6–414, 7–558, 8–574, 9–574, 10–587. బౌలింగ్: వోక్స్ 25–6–81–2, కార్స్ 24–3–83–1, టంగ్ 28–2–119–2, స్టోక్స్ 19–0–74–1, బషీర్ 45–2–167–3, రూట్ 5–0–20–1, బ్రూక్ 5–0–31–0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) సిరాజ్ 19; డకెట్ (సి) గిల్ (బి) ఆకాశ్‌దీప్ 0; పోప్ (సి) రాహుల్ (బి) ఆకాశ్‌దీప్ 0; రూట్ (బ్యాటింగ్) 18; బ్రూక్ (బ్యాటింగ్) 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 77. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25. బౌలింగ్: ఆకాశ్‌దీప్ 7–1–36–2, సిరాజ్ 7–2–21–1, ప్రసిధ్ కృష్ణ 3–0–11–0, నితీశ్ రెడ్డి 1–0–1–0, జడేజా 2–1–4–0.

ENG VS IND 2nd Test: నిప్పులు చెరిగిన ఆకాశ్‌దీప్, సిరాజ్.. పీకల్లోతు కష్టాల్లో ఇంగ్లండ్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.వరుస షాక్లుఅనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ నిప్పులు చెరిగాడు. వరుస బంతుల్లో తొలి టెస్ట్‌లో సెంచరీలు చేసిన బెన్ డకెట్, ఓలీ పోప్లను డకౌట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 13 పరుగలకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.మరో ఎదురుదెబ్బ13 పరుగుల వద్ద వరుస బంతుల్లో ఇన్ ఫామ్ బ్యాటర్లు డకెట్, పోప్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 25 పరుగుల వద్ద జాక్ క్రాలే (19) ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో క్రాలే పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 33/3గా ఉంది. రూట్ (5), బ్రూక్ (5) క్రీజ్‌లో ఉన్నారు.

ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు ఈ స్థాయి స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఇవాళ డబుల్ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు.
బిజినెస్

ఎలక్ట్రానిక్ కంపెనీల హవా
గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సరీ్వసెస్ (ఈఎంఎస్) రంగం దుమ్మురేపుతోంది. వ్యవస్థాగత వృద్ధికి పలు అంశాలు తోడవడంతో ఈ రంగంలోని కంపెనీలు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. చైనాయేతర తయారీ తదితర అంశాలతో ఏర్పడుతున్న డిమాండ్ ఈ రంగానికి బలాన్నిస్తోంది. దీంతో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లో హవా చూపుతున్న ఈఎంఎస్ దిగ్గజాలు మరింత స్పీడందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మేకిన్ ఇండియాతో తయారీకి దన్నుగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు, చైనాయేతర దేశాలలో తయారీ యూనిట్ల ఏర్పాటుపై గ్లోబల్ దిగ్గజాల దృష్టి దేశీయంగా ఈఎంఎస్ కంపెనీలకు జోష్‌నిస్తోంది. దీనికితోడు కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఇండ్రస్టియల్, ఎనర్జీ, డిఫెన్స్, మెడికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల నుంచి పటిష్ట డిమాండ్ వీటికి జత కలుస్తోంది. వెరసి ఈఎంఎస్ రంగంలోని పలు లిస్టెడ్ కంపెనీలు కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటు దేశీ డిమాండుకుతోడు అటు ఎగుమతులు సైతం పుంజుకోవడం కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. నిజానికి ఈ రంగంలో మార్జిన్లు తక్కువకావడంతో అధిక అమ్మకాల పరిమాణమే కంపెనీలకు లబ్ధిని చేకూరుస్తుంది. అయినప్పటికీ కొద్ది నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తోంది. భారీ అంచనాలు దేశీయంగా ఈఎంఎస్ రంగం 2022–23 నుంచి 2027–28 కాలంలో వార్షికంగా 25 శాతం వృద్ధి సాధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 2027–28కల్లా రూ. 27.7 లక్షల కోట్లను తాకగలదని అంచనా వేశాయి. ఈ రంగం విలువ 2022లో రూ. 8.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం వేసిన అంచనాలివి. కాగా.. ప్రభుత్వం స్థానిక తయారీకి దన్నునిస్తూ ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతోంది. తద్వారా గ్లోబల్ దిగ్గజాలను దేశీయంగా తయారీకి ఆహ్వానిస్తోంది. దేశీయంగా పటిష్టస్థాయిలో ఇంజనీరింగ్, డిజైన్ సామర్థ్యాలు అందుబాటులో ఉండటానికితోడు.. నైపుణ్యంగల మానవవనరులు చౌకగా లభిస్తాయి. అంతేకాకుండా ఈఎంఎస్ రంగానికి భారత్ భారీ మార్కెట్ కూడా. అధిక శాతం కంపెనీలు బీటూబీ కస్టమర్లపైనే దృష్టిపెడుతున్నాయి.కీలక రంగాల దన్ను అధిక మార్జిన్లకు వీలున్న ఏరోస్పేస్, ఇండ్రస్టియల్స్, ఆటోమోటివ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆర్డర్లు లభిస్తుండటంతో లిస్టెడ్ కంపెనీల లాభదాయకత మెరుగుపడుతోంది. ఇందుకు దేశీ కంపెనీలు సంక్లిష్ట ప్రొడక్టుల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. దేశీయంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విస్తృతి తక్కువగా ఉండటం, వినియోగంపై వెచి్చంచగల ఆదాయాలు పుంజుకోవడం వంటి అంశాలు కంపెనీలకు అండగా నిలుస్తున్నాయి. తయారీలో స్థానికతకు ప్రాధాన్యత, అధిక విలువగల ప్రొడక్టుల తయారీలో నైపుణ్యం వంటి అంశాలతో లిస్టెడ్ దిగ్గజాలు దేశీయంగా ఈఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఫలితంగా ప్రపంచస్థాయిలో పోటీపడే తయారీ కేంద్రంగా భారత్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బలపడుతున్న ఆర్డర్ల బుక్ లిస్టెడ్ దిగ్గజాలకు బూస్ట్‌నిస్తోంది. దిగ్గజాల దూకుడు దేశీ లిస్టెడ్ దిగ్గజాలలో డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అవలాన్ టెక్నాలజీస్, సిర్మా ఎస్జీఎస్, సైయెంట్ డీఎల్ఎం, డేటా ప్యాటర్న్స్ ఇండియా తదితరాలున్నాయి. వీటిలో డిక్సన్, అంబర్‌ను మినహాయిస్తే మొత్తం ఆర్డర్ బుక్ విలువ గతేడాదికల్లా(2024–25) వార్షికంగా 23 శాతం పురోభివృద్ధిని సాధించింది. రూ. 16,300 కోట్లకు చేరింది. ఇక గతేడాది లిస్టెడ్ దిగ్గజాల మొత్తం ఆదాయం వార్షికంగా 84 శాతం జంప్‌చేసి రూ. 58,600 కోట్లను తాకింది. ఆదాయంలో డిక్సన్ 2 రెట్లు దూసుకెళ్లగా.. కేన్స్ 51 శాతం, అంబర్ 48 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇతర సంస్థల ఆదాయం సగటున 20 శాతానికిపైగా ఎగసింది. మొత్తం నిర్వహణ లాభం 73 శాతం పురోగమించి రూ. 3,500 కోట్లను తాకింది.– సాక్షి, బిజినెస్ డెస్క్

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఓకే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3 శాతం పెరిగాయి. 19,048 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇదే కాలంలో దేశవ్యాప్తంగా టాప్–8 నగరాల్లో చూస్తే భిన్నమైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గినట్టు నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతులు) లీజింగ్ మార్కెట్ మాత్రం బలమైన పనితీరు చూపించింది. → దేశవ్యాప్తంగా టాప్ 8 నగరాల్లో 2025 జనవరి–జూన్ కాలంలో ఇళ్ల అమ్మకాలు 1,70,201 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 2 శాతం తక్కువ. → ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు 2 శాతం నుంచి 14 శాతం మధ్య పెరిగాయి. → ఇళ్ల అమ్మకాల్లో 49 శాతం రూ.కోటి అంతకుమించి ధరల శ్రేణిలోనే ఉన్నాయి. మిగిలిన 51 శాతం ఇళ్ల ధరలు రూ.కోటిలోపు ఉన్నాయి. → ముంబై నగరంలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి మార్పు లేకుండా 47,035 యూనిట్లుగా ఉన్నాయి. అహ్మదాబాద్ నగరంలో అమ్మకాలు కూడా పెద్ద మార్పు లేకుండా 9,370 యూనిట్లుగా ఉన్నాయి. → చెన్నై నగరంలో క్రితం ఏడాది ఇదే కాలంలోని విక్రయాలతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగి 26,795 యూనిట్లుగా నమోదయ్యాయి. → బెంగళూరులో అమ్మకాలు 3 శాతం తగ్గి 26,599 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో 8 శాతం తగ్గి 26,795 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో ఒక శాతం తగ్గాయి. 24,329 యూనిట్ల విక్రయాలు జరిగాయి. కోల్‌కతాలో అమ్మకాలు 11 శాతం తగ్గి 8,090 యూనిట్లకు పరిమితమయ్యాయి.జోరుమీదున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ హైదరాబాద్ సహా టాప్–8 నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 41 శాతం పెరిగి 48.9 మిలియన్ (489 లక్షలు) చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) నమోదైంది. ఈ ప్రకారం చూస్తే ఈ ఏడాది మొత్తం మీద లీజింగ్ 80–90 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరుకుంటుందని నైట్‌ఫ్రాంక్ అంచనా. → చెన్నైలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 68 శాతం వృద్దితో 5.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → ముంబైలో మాత్రం క్రితం ఏడాది మొదటి ఆరు నెలల కాలం గణాంకాలతో పోల్చి చూస్తే 5 శాతం క్షీణించి 5.5 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది. → బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజింగ్ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెట్టింపై 18.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో బలమైన వృద్ధి నమోదైంది. 27 శాతానికి పైగా పెరిగి 7.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → పుణెలో లీజింగ్ 17% వృద్ధితో 5.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. → కోల్‌కతాలో ఏకంగా 60 శాతం పెరిగి 1.1 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. → అహ్మదాబాద్‌లో 51 శాతం తగ్గిపోయి 0.8 మిలియన్ ఎస్ఎఫ్టీకి పరిమితమైంది.

లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఆర్బీఐ కొత్త రూల్
వ్యక్తిగత, గృహ, వ్యాపార రుణాల గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని ఫ్లోటింగ్-రేట్ రుణాలకు వర్తించే ప్రీ-పేమెంట్ ఛార్జీలను రద్దు చేసింది. గృహ రుణాలు, వ్యాపార అవసరాల కోసం తీసుకున్నవి, వ్యక్తులు, ఎంఎస్ఈలు పొందిన రుణాలన్నింటికీ ఆర్బీఐ కొత్త నిబంధన వర్తిస్తుంది. 2026 జనవరి 1 లేదా ఆ తర్వాత మంజూరు చేసే లేదా పునరుద్ధరించే రుణాలు, అడ్వాన్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది.ఈ మేరకు బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు (కో-ఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ, అఖిల భారత ఆర్థిక సంస్థలు) ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వ్యాపారం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వ్యక్తిగత రుణగ్రహీతలకు మంజూరు చేసిన ఏదైనా ఫ్లోటింగ్ రేటు టర్మ్-లోన్‌పై జప్తు ఛార్జీలు / ప్రీ-పేమెంట్ పెనాల్టీలను విధించడానికి వీల్లేదని ఆర్బీఐ సర్క్యులర్ తెలిపింది. ఎంఎస్ఈలకు సులభమైన, సరసమైన ఫైనాన్సింగ్ లభ్యత అత్యంత ముఖ్యమైనదని తెలిపింది.ఎంఎస్ఈలకు మంజూరు చేసిన రుణాల విషయంలో ముందస్తు చెల్లింపు ఛార్జీల విధింపునకు సంబంధించి నియంత్రిత సంస్థల (ఆర్ఈ) మధ్య భిన్నమైన పద్ధతులను ఆర్బీఐ పర్యవేక్షక సమీక్షల్లో గుర్తించింది. దీనిపై ఫిర్యాదులు, వివాదాలు కూడా వెల్లువెత్తాయి. ముసాయిదా సర్క్యులర్‌పై వచ్చిన స్పందన, ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆర్బీఐ ఇప్పుడు ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది.

ముందు లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.450 కోట్లతో ప్రచారం
ముంబై: బీమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే దిశగా జీవిత బీమా కంపెనీలు చేతులు కలిపాయి. రూ.450 కోట్లతో మూడేళ్ల పాటు పలు మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. సబ్సే పెహలే లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రచారాన్ని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ ప్రారంభించింది.అన్ని జీవిత బీమా కంపెనీలు తమ ప్రీమియం ఆదాయానికి అనుగుణంగా ఈ ప్రచారం కోసం నిధులు అందించనున్నాయి. ‘ఏటా రూ.150–160 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. మూడేళ్ల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సరిపడా ఖర్చును సమకూర్చేందుకు ఇప్పటికే హామీ లభించింది’ అని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ చైర్మన్ కమలేష్ రావు తెలిపారు.గత కొన్ని సంవత్సరాల్లో బీమా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 2022–23లో జీవిత బీమా విస్తరణ జీడీపీలో 4% కాగా, 2023–24లో 3.7%కి, గత ఆర్థిక సంవత్సరంలో 3.2%కి తగ్గుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బీమా విస్తరణలో భారత్ 10వ స్థానంలో ఉంది.
ఫ్యామిలీ

'చేత్తో తినడం' ఇది ఎప్పటి అలవాటంటే..!
న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ చేతులతో బిర్యానీ తింటున్న వైరల్ వీడయో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఉంటూ ఇలా చేత్తో తినడం అనాగరికం అని, మీరు థర్డ్ వరల్డ్‌లోనే బతకండి అంటూ మామ్దని తీరుని తప్పుపట్టారు. అయితే కొందరు నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలిచి చేత్తో తింటే తప్పేంటి అని కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చేత్తో తినడం అనే అలవాటు ఏనాటిది? పాశ్చాత్యులు తొలి నుంచే ఫోర్క్‌లు, స్పూన్లు,చాకులతోనే తినేవారా అంటే..చేతులతో తినడం అనేది పాశ్చాత్య దేశాలకు సుపరిచితమైన అలవాటు కాకపోయినా..ఇది మన భారతీయ ఆచారం. అది మన సంస్కృతిలో భాగం కూడా. సింపుల్‌గా చెప్పాలంటే భారతీయులకు కేవలం పోషణ కాదు ఒక విధి విధానం. చరిత్ర ప్రకారం ఆదిమానవుల కాలం నాటిది ఈ అలవాటు. ఈజిప్షియన్లు, గ్రీకులు, మెసొపొటేమియన్లు, సింధులోయ నాగరికత ప్రజలు అంతా చేత్తోనే తినేవారు. ఇది మైండ్‌ఫుల్‌గా తినేందుకు చిహ్నం.అంతేగాదు జీర్ణక్రియకు నేరుగా ఆహారాన్ని అందించే ప్రక్రియ అని ఆయుర్వేదం చెబుతోంది. ఇక భారతీయ గ్రంథలు, ఉపనిషత్తులు కూడా చేతులతో తినడం అనేది శరీరాన్ని ఆత్మకు అనుసంధానం చేసే ఒక ప్రక్రియగా పేర్కొన్నాయి. ఎందుకంటే చూడటం, వాసన రుచి, స్పర్శతో కూడిన ఇంద్రియానుభవమే భోజనం అని పురాణాలు చెబుతున్నాయి. మన భారతీయ భోజనం బియ్యం, కూరలు కలయిక. కాబట్టి వాటిని తినాలంటే చేతులతో కలుపుకుని తింటే చక్కటి రుచిని ఆస్వాదించగలరు. అదే పాశ్చాత్యులకు రోస్ట్‌లు, గ్రిల్డ్ మాంసం, పాస్తా, బ్రెడ్ వంటివి ఆహారాలు. వాటిని తినాలంటే వాళ్లు చాక్‌లు, ఫోర్క్‌లు ఉపయోగించి తినాల్సిందే. ఎందుకంటే వాటిని అలానే తినేయం సాధ్యం కాదు. అయినా భారతీయుల ఆహారం అంతలా ఘనపదార్థాలుగా ఉండదు కాబట్టి ఆ అవసరం మనకు రాలేదు. పైగా ఇది మన సంస్కృతిలో భాగం. చాప్‌స్టిక్స్ సంగతేంటి?చైనా, జపాన్‌లోని ప్రజలు చాప్‌స్టిక్‌లను ఉపయోగిస్తారు. వాళ్లు వీటిని క్రీశ 400 ఏళ్ల నాటి నుంచి ఆచరిస్తున్నారట. ఇటీవలే వాళ్ల భోజన విధానంలో ఫోర్క్‌లు, చాక్‌లు వచ్చాయట. ప్రస్తుతం అది ఆదునికతకు గుర్తుగా మారిందని చెబుతున్నారు నిపుణులు. ఇక చైనా, జపాన్‌లో చాప్‌స్టిక్‌తో తినడానికి కారణం.. బుద్దిపూర్వకంగా మనసుపెట్టి తినాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అదీగాక వాళ్ల ఆహారం చాలామటుకు చిన్ని చిన్న ముక్కులుగానే ఉంటుంది. వాళ్లకు భోజనం అనేది ఏకాగ్ర చిత్తంతో చేసే ప్రక్రియ. ఈ విధానంలో తింటే మాటలు దొర్లవు, తింటున్న దానిపై ఫోకస్ ఉంటుదంట. అందులోనూ ఆకలితో ఉంటే..స్పీడ్‌గా తినాంటే ఆ చాప్స్టిక్లపై ఫోకస్ పెడితేనే తినగలరు లేదంటే వాటి మధ్య నుంచి ఆహారం జారిపోతుంది. పైగా అలా గనుక ఆహారం పారేస్తుంటే చైనా పెద్దలు తిట్టడమే గాక మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే తినమని ఆదేశిస్తారట.చేత్తో తినడం మంచిదేనా.. చేత్తో తినడం పరిశభ్రకరమైనదా అని పాశ్చాత్యులు ప్రశ్నిస్తుంటారు. కాని ఇది పరిశుభ్రతకు సంబంధించిన అంశమని నొక్కిచెబుతున్నారు శాస్త్రవేత్త అదితి. ఎందుకంటే భోజనానికి ముందు తర్వాత చేతులు తప్పక కడుక్కుంటారు. అలాగే కుడిచేయి అనేది పవిత్రమైన పనులకే ఉపయోగిస్తారు భారతీయులు. తిలకం పెట్టుకోవడం దగ్గర నుంచి ఇతరులకు డబ్బులు ఇవ్వడం, శుభాకార్యలకు అన్నింటికి కుడి చేతినే ప్రధానం ఉపయోగిస్తారు. అలాగే ఎడమ చేతిని వ్యక్తిగత పరిశుభ్రతకే కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇక చేత్తే తినడం వల్ల మనసారా తింటున్న అనుభూతి తోపాటు జీర్ణక్రియ నేరుగా వెళ్లి సులభంగా అరిగిపోయేలా చేయడంలో దోహదపడుతుందట. చేత్తో తింటేనే త్వరితగతిన అరిగిపోతుందని, ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైందని చెప్పుకొచ్చారు వైద్యులు.(చదవండి: Zohran Mamdani: పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!)

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఐతే హెల్ప్ అయ్యే 'జీరో కేలరీ ఫుడ్స్' ఇవే..
బరువు తగ్గడమే సవాలుగా మారింది యువతకు. ఎందుకంటే దాదాపు చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరిని బాధించే భారమైన సమస్య ఇది. అయితే ఎంతలా డైట్ పాటించినా..ఒక్కోసారి చీట్ మీల్స్ తినక తప్పదు. అలాంటప్పుడూ కడుపు నిండుగా..బరువు పెరగకుండా ఉండే కొన్ని రకాలా ఆహారాలు ట్రై చేస్తే చాలంటున్నారు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ సామ్ ఎవెరింగ్హామ్. జస్ట్ అవి శ్రద్ధ పెట్టి తీసుకుంటే చాలట బరువు పెరిగే ప్రసక్తే లేదంటున్నారు. భోజనంలోనూ, బ్రేక్‌ఫాస్ట్‌లోనూ ఈ ఆహారాలను జోడిస్తే..హాయిగా కడుపు నిండా తిన్న అనుభూతి తోపాటు బరువు తగ్గుతారని చెబుతున్నారు. మరి అవేంటో చూద్దామా..!కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు మొత్తం 20 ఉన్నాయట. ఇవన్నీ జీరో కేలరీ ఆహారాలట. వీటిని డైట్లో జోడిస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా హెల్దీగా కూడా ఉంటామని నమ్మకంగా చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ సామ్. మరి అవేంటొ చూసేద్దామా..పూల్‌మఖానా – 100 గ్రాములకు 15 కిలో కేలరీలుస్ట్రాబెర్రీలు – 100 గ్రాములకు 32 కిలో కేలరీలుపుట్టగొడుగులు – 100 గ్రాములకు 22 కిలో కేలరీలుబ్రోకలీ – 100 గ్రాములకు 34 కిలో కేలరీలుక్యారెట్లు – 100 గ్రాములకు 41 కిలో కేలరీలుటమోటాలు – 100 గ్రాములకు 18 కిలో కేలరీలుకీరదోసకాయ – 100 గ్రాములకు 17 కిలో కేలరీలుకాలీఫ్లవర్ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుక్యాప్సికం – 100 గ్రాములకు 31 కిలో కేలరీలుపైనాపిల్ – 100 గ్రాములకు 50 కిలో కేలరీలుయాపిల్స్ – 100 గ్రాములకు 52 కిలో కేలరీలుఊరబెట్టిన దోసకాయలు (గెర్కిన్స్) – 100 గ్రాములకు 12 కిలో కేలరీలుకొత్తిమీర– 100 గ్రాములకు 14 కిలో కేలరీలుఉల్లిపాయలు – 100 గ్రాములకు 40 కిలో కేలరీలునిమ్మకాయ/నిమ్మకాయ – 100 గ్రాములకు 29 కిలో కేలరీలుపాలకూర – 100 గ్రాములకు 23 కిలో కేలరీలుకాలే(క్యాబేజీ జాతికి చెందిన కూరగాయ) – 100 గ్రాములకు 35 కిలో కేలరీలుక్యాబేజీ – 100 గ్రాములకు 25 కిలో కేలరీలుప్రయోజనాలు..వీటిలో ఎక్కువగా నీరు, పైబర్ని ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడం సులభం అవ్వడమే కాదు అదుపులో పెట్టొచ్చు. ఇవి తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. తద్వారా అతిగా తినడం నివారించగలుగుతాం. అదీగాక దీనిలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. మలబద్దకాన్ని నివారించి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇందులో చాలా వరకు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకుంటే అదనపు కేలరీల కోసం అదనంగా పోషకాలను జోడించాల్సిన అవసరం రాదు అని చెబుతున్నార ఫిట్నెస్ కోచ్ సామ్.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యుల లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!)

అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్‌మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా

‘స్కామర్..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్‌కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్‌లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్‌లలో ఒకేసారి మూన్లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్‌లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్‌ను బహుళ కంపెనీలలో మూన్‌లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్‌లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్‌గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్‌ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్‌లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్నిపుణురాలు ట్వీట్ చేశారు.
ఫొటోలు


నలుగురు టాప్ హీరోయిన్లతో ధనుస్ పార్టీ.. ఎందుకో తెలుసా (ఫోటోలు)


చినుకుల్లో డార్జిలింగ్ అందాలు.. రా రమ్మని ఆహ్వానించే పచ్చటి కొండ కోనలు!


వైఎస్ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ (ఫొటోలు)


'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)


నేచురల్ బ్యూటీ 'వర్ష బొల్లమ్మ' స్పెషల్ ఫోటోలు చూశారా..? (ఫొటోలు)


మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)


నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)


కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)


చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్ బీచ్‌లు ఇవే...


తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుతమైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)
అంతర్జాతీయం

‘భాగస్వామ్యమే కాదు.. సహ ప్రయాణం’.. ఘనాలో ప్రధాని మోదీ
అక్రా: ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, సహ ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇరు దేశాలు ద్విమార్గ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, భారత్.. ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహ ప్రయాణం చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయన్నారు. రాబోయే ఐదేళ్లలో పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.This… pic.twitter.com/coqwU04RZi— Narendra Modi (@narendramodi) July 2, 2025ఫిన్‌టెక్ రంగంలో, భారతదేశం ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రతా రంగంలో తాము సంఘీభావం ద్వారా భద్రత అనే సూత్రంతో ముందుకు సాగుతామన్నారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా సంస్కృతి, సాంప్రదాయ వైద్యంతోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?

అందుకే ట్రంప్ నన్ను టార్గెట్ చేశారు
ట్రంప్-మామ్దానీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్ట్ చేయాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్‌లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగానే స్పందించారు. వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి భారతీయ మూలాలున్న అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.. తనను అరెస్ట్ చేసి, దేశం నుండి పంపించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారాయన. 33 ఏళ్ల ఈ డెమొక్రటిక్ సోషలిస్ట్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలే గుప్పించారు. వర్కింగ్ క్లాస్ పీపుల్‌ను ట్రంప్ మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని మమ్దానీ అన్నారు. ‘‘నిన్న ట్రంప్ నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుండి పంపించాలని, పౌరసత్వం తీసేయాలని అన్నారు. నేను ఈ నగరానికి తరాలుగా మొదటి వలసదారుడిగా, మొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలున్న మేయర్‌గా నిలవబోతున్నాను. ఇది నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే, నేను ఏం కోసం పోరాడుతున్నానో దాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే అని మమ్దానీ అన్నారు. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన. Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025న్యూయార్క్ నగర మేయర్ పదవీ రేసులో.. డెమొక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ఆపై ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ పెద్ద కమ్యూనిస్టు పిచ్చోడని.. న్యూయార్క్‌ను నాశనం చేయకుండా తానే కాపాడతానని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈలోపు.. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై మమ్దానీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించివేస్తుందని, ఆకలితో ఉన్నవారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉంది అని మమ్దానీ విమర్శించారు.

ఇండోనేసియాలో పడవ మునక
బాలి: ఇండోనేసియాలోని బాలిలో పడవ మునిగిన ఘటనలో ఆరుగురు చనిపోయారు. కనీసం 29 మంది గల్లంతయ్యారు. 31 మందిని రక్షించామని అధికారులు తెలిపారు. కేఎంపీ తును ప్రతమ జయ అనే పడవ బుధవారం సాయంత్రం తూర్పు జావాలోని కేతాపాంగ్ ఓడరేవు నుంచి బాలిలోని గిలిమనుక్‌కు బయలుదేరిన అరగంటకే అలల తాకిడికి గురైంది. ప్రమాద సమయంలో ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 22 వాహనాలు, ట్రక్కులు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు 31 మందిని కాపాడారు. వీరిలో సుమారు 20 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. టగ్ బోట్లు, నౌకలతో సహా తొమ్మిది బోట్లతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అలలు రెండు మీటర్ల ఎత్తులో ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. పూర్తిగా మునిగిపోయిన పడవలో చిక్కుకుని ఎవరూ ఉండే అవకాశాల్లేవని చెప్పారు. కాగా, అధికారులు చెబుతున్న దానికంటే పడవలో ఎక్కుమంది ప్రయాణికులు ఉండే అవకాశాలున్నాయని ప్రత్యక్ష సాకు‡్ష్యలు అంటున్నారు. ఇలా ఉండగా, ఇండోనేసియాలోని దీవుల మధ్య రోజూ ప్రయాణించే లక్షలాది మందికి పడవలే ఆధారం. అయితే, కాలం చెల్లిన ఓడలు, తగినంత భద్రతా తనిఖీలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బాలి సమీపంలో ఒక పర్యాటక పడవ బోల్తా పడటంతో ఆ్రస్టేలియాకు చెందిన ఓ మహిళ మరణించింది. 2018లో టోబా సరస్సులో పడవ మునిగిన ఘటనలో 150 మందికి పైగా జల సమాధి అయ్యారు. ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం

Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ
న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే నేపధ్యంలో మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అపహరించింది. దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తూ, మాలి ప్రభుత్వం ఆ ముగ్గురు భారతీయుల సురక్షితమైన విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.మాలిలోని కేస్లోగల డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ ముగ్గురు భారతీయులు పనిచేస్తున్నారు. వీరి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. జూలై ఒకటిన సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ప్రాంగణంలో దాడి చేసి, ముగ్గురు భారతీయులను బందీలుగా తమ వెంట తీసుకువెళ్లిందని ఎంఈఏ తెలిపింది.అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్ఐఎం)మాలి అంతటా జరిగిన దాడులకు బాధ్యత వహించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆ ముగ్గురు భారతీయుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం ఖండిస్తోందని, అపహరణకు గురైన భారత పౌరులను సురక్షితంగా విడుదల చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఎంఈఏ కోరింది. మాలిలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని,అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని ఎంఈఏ సూచించింది.ఇది కూడా చదవండి: విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే..
జాతీయం

కేరళలో విషాదం.. కూలిన ప్రభుత్వ ఆసుపత్రి భవనం
కేరళలో విషాదం చోటు చేసుకుంది. కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని ఒక భాగం కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పలువురు గాయపడ్డారు. అధికారులు వెల్లడించిన వివరాలు ప్రకారం ఆసుపత్రిలోని 14వ వార్డుకు ఆనుకుని ఉన్న భవనం ఉదయం 11 గంటల ప్రాంతంలో కూలిపోయింది.తక్షణమే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా దాదాపు వంద మంది రోగులను అక్కడి నుంచి తరలించారు. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పరిశీలించారు.అధికారులు ఈ భవనం వాడుకలో లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, భవనం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆసుపత్రిలో రోగులు ఆ టాయిలెట్లను ఉపయోగించారంటూ కొందరు తెలిపారు.

మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025

రామ్‌దేవ్ పతంజలికి డాబర్ దెబ్బ
బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థకు ఢిల్లీ హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. డాబర్ చ్యవన్‌ప్రాష్(Chyawanprash)ను లక్ష్యంగా చేసుకుని పతంజలి ప్రసారం చేస్తున్న సెటైరిక్ యాడ్‌ను తక్షణమే నిలిపివేయాలని ఉన్నతన్యాయస్థానం గురువారం ఆదేశించింది. న్యూఢిల్లీ: చ్యవన్‌ప్రాష్‌ను తాము మాత్రమే ఆయుర్వేద గుణాలకు అనుగుణంగా తయారు చేస్తున్నామని, డాబర్(Dabur)లాంటి కంపెనీలు సాదాసీదాగా తయరు చేసి మార్కెట్లోకి వదులుతున్నారని పతంజలి గత కొంతకాలంగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై డాబర్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తమ కంపెనీకి చెందిన పాపులర్ ప్రొడక్టుపై పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని, తక్షణమే ఆ ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశించాలని డాబర్ కంపెనీ పిటిషన్లో పేర్కొంది. అంతేకాదు.. తమ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించినందుకుగానూ రూ.2 కోట్ల పరిహారం పతంజలి నుంచి ఇప్పించాలని డాబర్ కోరింది. మార్గదర్శకాలకు అనుగుణంగా తాము ఉత్పత్తులు తయారు చేస్తున్నామని, ఇలాంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుడు దారి పట్టించేలా ఉన్నాయంటూ పేర్కొంది. ‘‘మా(డాబర్) చ్యవన్‌ప్రాష్‌లో 40 మూలికలు ఉన్నాయని, కాబట్టి ఇది సర్వసాధారణమైందని పతంజలి ప్రచారం చేస్తోంది. అలాగే.. పతంజలి ప్రకటనల్లో తమ ఉత్పత్తిలో 51కు పైగా ఔషధ మూలికలు ఉన్నాయని చెప్పినా, వాస్తవానికి 47 మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, పతంజలి ఉత్పత్తిలో మెర్క్యురీ వాడుతున్నారని, ఇది పిల్లలకు హానికరం’’ అని డాబర్ తన పిటిషన్లో ప్రస్తావించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జడ్జి మినీ పుష్కర్ణా యాడ్ నిలిపివేయాలని ఆదేశిస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ జులై 14వ తేదీన జరగనుంది. చ్యవన్‌ప్రాష్ (Chyawanprash) అనేది ఆయుర్వేద లేహ్యం. ఇది శరీరానికి బలం, రోగనిరోధక శక్తి, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వాడే ఔషధ గుణాలు కలిగిన మిశ్రమం. ఆరోగ్యాన్ని పునరుద్ధరించేందుకు చ్యవన్ ఋషి అనే మహర్షి ఈ లేహ్యాన్ని తయారు చేసినట్లు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి.

యజమానురాలు తిట్టిందని.. తల్లీ కుమారులపై సహాయకుని ఘాతుకం
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని లజ్‌పత్ నగర్-Iలో ఘోరం చోటుచేసుకుంది. ఎంతో నమ్మకంతో ఇంటి పనిలో పెట్టుకున్న సహాయకుడే యజమానురాలితో పాటు, ఆమె కుమారుని గొంతు కోశాడు. యజమానురాలు తిట్టిందని, ఆగ్రహంచిన ఆ సహాయకుడు ఇంతటి దారుణానికి తెగించాడు.లజ్‌పత్ నగర్లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కుమారుడు వారి ఇంటి లోపల హత్యకు గురయ్యారనే వివరాలు తెలియగానే, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి నుంచి పరారైన సహాయకుడు ముఖేష్(24)ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా, నేరాన్ని అంగీకరించడంతోపాటు ఘటనాక్రమాన్ని పోలీసులకు వివరించాడు. తన యజమాని రుచికా సేవ, ఆమె కుమారుడు క్రిష్‌ల గొంతులను కోసినట్లు నిందితుడు ముఖేష్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. #WATCH | Delhi's Double murder case | The bodies of a woman, Ruchika (42) and her son, Krish (14) were found at their residence in the Lajpat Nagar-1 area. The suspect house help has been apprehended. Further investigation underway: Delhi Police(Visuals from the spot) pic.twitter.com/bI338FWx1N— ANI (@ANI) July 3, 2025రుచిక భర్త కుల్దీప్ రాత్రి 9:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆయనకు మెట్లపై రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు లోపలి నుంచి లాక్ చేసి ఉన్న తలుపును బలవంతంగా తెరిచారు. అక్కడ వారు రుచిక మృతదేహాన్ని బెడ్రూమ్లో, క్రిష్ మృతదేహాన్ని బాత్రూంలో గుర్తించారు. ఇద్దరికీ మెడపై కత్తితో చేసిన గాయాలన్నాయి. ఈ ఘటనకు వారింటిలో పనిచేసే ముఖేష్ కారణమని భావించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో ముఖేష్ తనను యజమానురాలు రుచిక తిట్టిందునే ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపాడు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా?
ఎన్ఆర్ఐ

మాట న్యూజీలాండ్ నూతన కార్యవర్గం ఏర్పాటు
మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ - మాట న్యూజీలాండ్ నూతన కార్యవర్గం కొలువుతీరింది. ఈ సందర్భంగా న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ లో నిర్వహించిన స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ ఇన్కార్పొరేటెడ్ యొక్క మేనేజ్మెంట్ కోర్ కమిటీని పరిచయం చేశారు. మన ఆంధ్ర తెలుగు సంఘం అధ్యక్షుడిగా బుజ్జే బాబు నెల్లూరి బాధ్యతలు స్వీకరించారు. రిలీజియస్ ఇంఛార్జి వి. నాగరాజు, స్పోర్ట్స్ వింగ్ ఇన్చార్జ్ బాల శౌరెడ్డి కాసు, ట్రెజరర్ దుర్గా ప్రసాద్, జనరల్ సెక్రటరీ సాయి సుశ్వంత్, జాయింట్ సెక్రటరీ కృష్ణ ముళ్లపూడి, మహిళా విభాగం కోఆర్డినేటర్ గీర్వాణి హారిక కామనూరు, మహిళా విభాగం కోఆర్డినేటర్ హారిక సుంకరి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి కూనపరెడ్డి, ఐటీ ఇన్చార్జ్ వెంకటరామయ్య కూనపరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. PRO రవి తుమ్మల, మహిళా విభాగం సమన్వయకర్త కళ్యాణి , ఇన్వెంటరీ స్పెషలిస్ట్ రాజారెడ్డి వూటుకూరుతో పాటు మరో ఇద్దరు కార్యనిర్వాహక సభ్యులు ఆన్లైన్లో హాజరయ్యారు. మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఘౌస్ మజీద్ తో పాటు పలువురు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఘౌస్ మజీద్ MATA NZ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. అసోసియేషన్‌కు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. నూతనంగా ఎన్నికైన కమిటీని మజీద్ హృదయపూర్వకంగా అభినందించారు. నూతన మేనేజ్మెంట్ కోర్ కమిటీకి అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.

NRI ఐయోవాలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఐయోవాలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు నిర్వహించింది. ఐయోవాలోని హియావత పబ్లిక్ లైబ్రరీలో ఐయోవా నాట్స్ విభాగం నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో తెలుగువారికి ఎన్నో కీలకమైన ఆర్థిక అంశాలను నిపుణులు వివరించారు. స్థానిక ఆర్థిక నిపుణులు కుజల్ హార్వానీ, మధు బుదాటి, తరుణ్ మండవలు ఈ సదస్సులో ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పన్ను ప్రణాళిక, వీలునామాలు, కళాశాల ప్రణాళిక, ట్రస్ట్ అండ్ విల్ లాంటి కీలకమైన ఆర్థిక అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా నిపుణులు వివరించారు. స్థానిక తెలుగు వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆర్థిక సందేహాలను నివృత్తి చేశారు. ఈ ఆర్థిక అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు నాట్స్ ఐయోవా విభాగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

NRI డాలస్‌లో యోగాడే సెలబ్రేషన్స్
డాలస్, టెక్సాస్: అమెరికాలో ఇర్వింగ్ (డాలస్) నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జూన్ 21 న మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్యాన కార్యక్రమానికి ‘హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ సారధ్యం వహించింది. ఈ కార్యక్రమంలో ఇషా ఫౌండషన్, ది ఐ వై ఇసి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ చాన్స్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, డి ఎఫ్ డబ్లు హిందూ టెంపుల్ మొదలైన సంస్థలనుండి వందలాదిమంది పాల్గొన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల అతిథులందరికీ స్వాగతం పలికి, యోగా చెయ్యడం కోసం సుప్రభాత సమయంలో తరలివచ్చిన వారందరికీ ధన్యవాదములు అని సభను ప్రారంభించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో ఛైర్మన్ రాజీవ్ కామత్ శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “యోగా, ధ్యానం కేవలం జూన్ 21 న మాత్రమేగాక మన దైనందిన జీవితంలో దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకం అన్నారు.” మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండిముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాపర్ మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అన్ని వయస్సులవారు వందలాదిమంది ఈ రోజు యోగాలో పాల్గొనడం సంతోషం అని, ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిభావంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గసభ్యుల విజ్ఞప్తి ననుసరించి, అతిత్వరలో 5 మిలియన్ డాలర్లకు పైగా ధనాన్నివెచ్చించి ఈ 18 ఎకరాల సుందరమైన పార్క్ లో వాకింగ్ ట్రాక్స్, ఎల్ యి డి విద్యుత్ దీపాలను మెరుగుపరుస్తామని ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు.ప్రత్యేకఅతిథులుగా హాజరైన కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజు మాథ్యూ, రమేష్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డ్ సభ్యుడు సురేష్ మండువ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కల్గించింది అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర సహచర కార్యవర్గ సభ్యులు రాజీవ్ కామత్, రావు కల్వాల, బి.ఎన్ రావు, తయాబ్కుండావాల, రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, మహేంద్ర రావు, జె పి పాండ్య, రన్నా జానీ, అనంత్ మల్లవరపులతో కలసి అతిథులందర్నీ సత్కరించారు.యోగా అనంతరం నిర్వాహాకులు చక్కటి ఉపాహారాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు బి.ఎన్ రావు తన ముగింపు సందేశంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నవారికి, అతిథులకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ నిర్వాహాకులు సురేఖా కోయ, ఉర్మిల్ షా మరియు వారి బృంద సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ స్మారక సిరికోన నవలారచన పోటీ తుది ఫలితాలు
తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రో త్సహించడానికి సిరికోన సాహితీ అకాడెమీ ( వాట్సప్) తరపున, స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ నవలా రచన పోటీ 2024కు సంబంధించిన తుది ఫలితాలను సంస్థ ప్రకటించింది. గత నాలుగు సంవత్సరాల నుంచి, ప్రతి ఏడాదీ ఉత్తమ నవలారచన పోటీల్లో భాగంగా ఉత్తమ రచనకు ముప్ఫై వేల నగదు బహుమతితో కూడిన పురస్కారాన్ని అందిస్తుంది., ఇతర రచయితలకు ప్రోత్సాహకంగా ఒకటి రెండు ప్రత్యేక బహుమతులను కూడా ప్రకటిస్తుంది. 2024 వ సంవత్సరానికి అనూహ్యమైన స్పందన లభించింది.. ఎక్కువమంది ప్రేమను కేంద్రవస్తువుగా తీసుకుని రాసినా, గణనీయ సంఖ్యలో ఆధునిక జీవన వైవిధ్యాన్ని చిత్రించే నవలలు రచించి పోటీకి సమర్పించారు.. ప్రాథమిక వడబోత పిమ్మట 26 నవలలు పోటీకి నిలిచాయి. తర్వాత వాటిని మరొక నిర్ణేత పరిశీలించి ఎంపిక చేసిన 7 నవలలను ముగ్గురు న్యాయనిర్ణేతలకు పంపడం జరిగింది. a. కథావవస్తువు, b. ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత/ తార్కికతలు, c. శైలి- శిల్పం, d. సామాజిక ప్రయోజనం అంశాల ఆధారంగా గుణ పరిశీలన జరిగిందని సంస్థ ప్రతినిధి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఉత్తమ నవల: 'కిలారి': డా.బి.నాగశేషుప్రత్యేక బహుమతులు: 1. “కావేరికి అటూ ఇటూ”: రెంటాల కల్పన 2. “ లింగాల కంఠంలో” : రంజిత్ గన్నోజుఅసాధారణ నిర్మాణచాతురితో, అద్భుత మాండలిక భాషా కథనంతో, సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తున్న నవల 'కిలారి, మూడుతరాల నారీచేతనకు అద్దం పడుతున్న రచన 'కావేరికి అటూ ఇటూ..', నల్లమల అడవుల్లోని చెంచుల జీవితాన్ని అత్యంత సన్నిహితంగా పరిచయం చేస్తున్న రచన 'లింగాలకంఠంలో నవలలు నిస్సందేహంగా సిరికోనకు గర్వకారణంగా నిలిచే రచనలని పేర్కొంది. విజేతలకు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్రైమ్

57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు. ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్‌పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ అయ్యారు.

విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో కదిలిన డొంక
సాక్షి, విశాఖపట్నం: మరో బెట్టింగ్ యాప్ ముఠాను విశాఖ పోలీసులు గుట్టురట్టు చేశారు. విశాఖలో తీగ లాగితే.. బెంగళూరులో డొంక కదిలింది. ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 13 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విశాఖ పోలీసులు.. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులు.. బెంగళూరులో బెట్టింగ్ డెన్ ఏర్పాటు చేసి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. విశాఖకు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లా కసింకోటకు చెందిన నిందితుడు కీలక పాత్ర వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ ముఠా సభ్యులు వద్ద నుంచి 57 మొబైల్ ఫోన్లు,137 బ్యాంకు పాస్ పుస్తకాలు, 11 ల్యాప్ టాప్‌లు, 132 ఏటిఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఒక కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు.

హైదరాబాద్‌లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. టాలీవుడ్‌లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పుగోదావరికి చెందిన జన కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనస్థలిపురంలో ఏసీ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 65 సినిమాలకు రికార్డు చేసినట్లు కిరణ్ పేర్కొన్నాడు. హెచ్డీ ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.నిందితుడిపై 66(c), 66(e) ఐటీ యాక్ట్, 318(4),r/w 3(5), 338 BNS, 63, 65 కాపీ రైట్, 6-AA,6AB,7(1A) సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కామ్ కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్‌కుమార్.. 1TAMILBLASTERS, 5MOVIEZRULZ, 1TAMILMV వెబ్‌సైట్స్‌లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఒక థియేటర్ వేదికగా ఈ పైరసీకి పాల్పడినట్లు తేలింది. పైరసీ కారణంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7కోట్ల నష్టం ఏర్పడింది. టెలిగ్రామ్‌లో సైతం కొత్త పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారుగా ఏడాదిన్నర నుంచి హైదరాబాద్‌లోని పలు థియేటర్స్‌లో 40 సినిమాలు రికార్డింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.సినిమా థియేటర్లోనే పైరసీ చేసి మాఫియాకి అమ్ముతున్న కిరణ్.. ఒక్కొక్క సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని తీసుకుంటున్నాడు. క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ ఛేంజర్, సినిమాల ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడు కిరణ్ నుంచి రెండు మొబైల్స్‌ను సీజ్ చేశారు.

మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025
వీడియోలు


కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు


నా 58 ఏళ్ల జీవితంలో ఇలాంటి మోసం చూడలేదు.. బాబుని ఏకిపారేసిన రాచమల్లు


ఇనుప రాడ్డుతో టీడీపీ ఎటాక్.. వెంటిలేటర్ పై YSRCP సర్పంచ్..


గొంతు మార్చిన రాజేశ్


YSRCP సర్పంచ్ పై లోకేష్ అనుచరుల దాడి..!


సింగయ్యను చంపేసారా? మరణం వెనుక మిస్టరీ?


అమరన్ డైరెక్టర్ తో అమరేంద్ర బాహుబలి చర్చలు


వాడు డ్రైవర్ కాదు కిల్లర్.. ఓనర్ తో పాటు ఆమె కొడుకు హత్య


వంశీని చంపేందుకు కుట్ర.. పోలీసులకు భార్య పంకజశ్రీ లేఖ


సింగయ్య లేచి వచ్చి చెప్పిన.. అది కూడా మేనేజ్ అంటారేమో చంద్రబాబు