లోకేష్‌ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసు జులుం | Ap Police Rudely Against Yoga Teachers | Sakshi
Sakshi News home page

లోకేష్‌ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసు జులుం

Jul 4 2025 9:43 AM | Updated on Jul 4 2025 11:47 AM

Ap Police Rudely Against Yoga Teachers

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజూ కొనసాగింది. ఆ సమయంలో మంతత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో  యోగా టీచర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. 

‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్‌ చేస్తూ నిన్నటి నుంచి 1,056 మంది యోగా టీచర్లు సీఎం నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.  అయితే.. 

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అయినా కలిచి తమ గోడును వినిపించాలని వాళ్లు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. యోగాసనాలు వేస్తూ నిరసనలతో లోకేష్‌ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. 

అయితే..ఇవాళ మళ్లీ నిరసనకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రి లోకేష్‌ ఆదేశాలతో పలువురిని అరెస్ట్‌ చేయగా.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమ వద్ద నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని, దురుసుగా ప్రవర్తించారని యోగా టీచర్లు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement