karakatta
-
కరకట్ట కొంపలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు.. విజయవాడకు పారిపోయిన చంద్రబాబు
-
వరదలపై చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: వాతావరణ శాఖ హెచ్చరికలను పట్టించుకోకుండా ముంపు పరిస్థితికి కారణమైన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు సహాయక చర్యల విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నాలుగు రోజులు గడిచినా.. ఇంకా విజయవాడ జలదిగ్బంధంలోనే ఉండిపోయింది.అయితే స్వయంగా తానే గ్రౌండ్లెవల్లో ఉన్నానంటూ ఫొటోలకు ఫోజులు, బిల్డప్‌లు ఇచ్చుకుంటున్న చంద్రబాబు.. తాజాగా వరదలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో.. సాక్షి రిపోర్టర్ కరకట్టలోని చంద్రబాబు నివాసం మునిగిన విషయాన్ని ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా.. ఆ విజువల్స్, ఫొటోలు చూపించారు. అయితే.. అదంతా అబద్ధం అంటూ సాక్షి విలేఖరికి అంతెత్తు ఎగిరిపడ్డారు సీఎం చంద్రబాబు. విజయవాడలో చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అందరి ఇళ్లలాగే మా ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏంటి?.. అంటూ అసహనం ప్రదర్శించారాయన. -
కరకట్ట అతలాకుతలం..
-
ప్రమాదకరంగా చంద్రబాబు కరకట్ట నివాసం
సాక్షి,అమరావతి : ప్రకాశం బ్యారేజ్‌కు రికార్డ్ స్థాయిలో వరద నీరు చేరింది. వరద ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 11.43 లక్షల క్యూసెక్కులు దాటింది. దీంతో కరకట్ట మీదగా నీరు ప్రవహించడంతో.. ఆ వరద చంద్రబాబు నివాసంలోపలకి వెళ్లింది. నీరు లోపలికి రాకుండా సిబ్బంది ఆదివారం లారీలతో ఇసుక తరలించి అడ్డుపెట్టారు. అయినప్పటికీ వరద తీవ్రతతో నీరు చంద్రబాబు ఇంటి లోపలికి చేరింది. దీంతో సిబ్బంది ఆరుకు పైగా మోటర్లను ఉపయోగించి వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరదఆదివారం రాత్రి 7గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది. ఇందులో నారా లోకేష్ గెస్ట్ హౌస్‌గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది. అయితే ఇసుక బస్తాలు వేసి వరద నీరు లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కలెక్టర్ కార్యాలయంలో బాబు బసఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని, రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జనవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు. -
కృష్ణ కరకట్ట ఆక్రమణల తొలగింపు ఎప్పుడు?
-
బాబు కస్టడీకి మరో పిటిషన్: కరకట్ట రీఅలైన్మెంట్ స్కాం ఏంటీ?
సాక్షి, అమరావతి: విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. కరకట్ట ఇన్నర్ రింగ్ స్కాం అసలు కథ ఇదే? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అని దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు దక్కాయని తేలిపోయింది. అసలేం జరిగింది? అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉంది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమయింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని తేలింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్నారు. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదు. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని తేలింది. లోకేశ్‌దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తేలింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది. -
ఆవనిగడ్డ కరకట్ట కేసు.. ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?
సాక్షి, కృష్ణా: చోడవరం వద్ద కరకట్ట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో.. గాజుల రత్నభాస్కర్ (47) మృతదేహంగా దొరికిన సంగతి విదితమే. అయితే ఈ కేసు పెద్ద మిస్టరీగా మారడంతో.. చేధించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ముదినేపల్లికి కారులో వెళ్లాల్సిన భాస్కర్ చోడవరం వైపు వెళ్లడం.. చివరకు శవమై కనిపించడం, పైగా వెంట తీసుకెళ్లిన డబ్బులూ కనిపించకుండా పోవడంతో.. కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ ప్రమాదం కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కెనాల్లో కారు దూసుకెళ్లిన 36 గంటల తర్వాత(మంగళవారం ఉదయం).. తోట్లవల్లూరు మండలం కళ్లంవారిపాలెం వద్ద నగ్నంగా రత్నభాస్కర్ మృతదేహం తేలింది. మృతుడి కుటుంబ సభ్యులు అవనిగడ్డ నుంచి వచ్చి మృతదేహాన్ని చూసి రత్నభాస్కర్‌దేనని గుర్తించారు. ఒంటిపై గాయాలు - ఎలాంటి క్లూ లేకపోవడంతో ఏం జరిగిందన్నది నిర్ధారించుకోలేకపోయారు పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు. అర్థరాత్రి ఏం జరిగింది.. రత్నభాస్కర్ ఇంటి నుంచి బయల్దేరిన రోజు అర్ధరాత్రి ఏం జరిగిందనేదే మిస్టరీగా మారింది. ఇంటి నుంచి ఆయన రూ.4 లక్షలతో బయల్దేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో.. ఆర్థిక లావాదేవీలు, శత్రువులున్నారా? లేదంటే దొంగల పనా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అలాగే.. రత్నభాస్కర్ కారు జర్నీ ఆధారంగా సీసీఫుటేజ్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రెండు చోట్ల ఒంటరిగానే వెళ్తున్నట్లు కనిపించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం కీలకం.. రత్నభాస్కర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం దొరికినా కేసులో మిస్టరీ మాత్రం వీడలేదు. ఈ కేసులో పోస్టుమార్టం కీలకంగా మారనుంది. నివేదిక వస్తేనే.. ఏం జరిగిందనేదానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జరిగింది ఇదే.. ముదినేపల్లికి చెందిన ఐస్ ఫ్యాక్టరీ యజమాని గాజుల రత్నభాస్కర్ ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించిన టీడీపీ సమావేశానికి వెళ్లాడు. అక్కడి నుంచి ముదినేపల్లి ఐస్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన సోమవారం వేకువజామున చోడవరం వద్ద తాను ప్రయాణిస్తున్న కారుతో సహా కేఈబీ కెనాల్లోకి దూసుకువెళ్లాడు. మచిలీపట్నంలో ఉన్న రత్నభాస్కర్ ముదినేపల్లికి వెళ్లకుండా చోడవరం వచ్చి శవమై తేలడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడాలని కారులోనే దుస్తులు విప్పి కాలువలోకి రత్నప్రసాద్ దిగి మృతి చెందాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న దుస్తులు, సెల్‌ఫోన్ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేసును అన్ని కోణాల నుంచి విచారణ చేస్తామని డీఎస్పీ జయసూర్య తెలిపారు. -
చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ క్విడ్ ప్రోకో బట్టబయలు
-
చంద్రబాబు కరకట్ట నివాసం కేసుపై నేడు విచారణ
-
చంద్రబాబు కరకట్ట నివాసం కేసు.. విచారణ 30కు వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో చంద్రబాబు కరకట్ట నివాసాన్ని అటాచ్ చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 30కు వాయిదా వేసింది. ఈ కేసుపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో బుధవారం వాదనలు సందర్భంగా కరకట్ట నివాసానికి సమాన విలువైన ఆస్తిని ష్యూరిటీగా చూపిస్తామని లింగమనేని రమేశ్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దానిపై సీఐడీ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక ఇదే కేసులో నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయడంపై న్యాయస్థానం కోరిన వివరాలను సీఐడీ న్యాయవాది సమర్పించారు. అనంతరం ఈ కేసును న్యాయమూర్తి ఈ నెల 30కు వాయిదా వేశారు. -
‘కరకట్ట నివాసం జప్తు’ పిటిషన్.. ఇరువైపులా ముగిసిన వాదనలు
సాక్షి, కృష్ణా: కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసాన్ని(లింగమనేని గెస్ట్‌హౌజ్) జప్తునకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) వాదనలు కొనసాగాయి. వాస్తవానికి ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సీఐడీ వాదనలు పూర్తి కాగా.. తమ వాదనలూ వినాలని లింగమనేని తరపు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. లింగమనేని తరపున అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఇవాళ(జూన్ 2, 2023 శుక్రవారం) వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లో సీఐడీ తరపున అడ్వొకేట్ వివేకానంద వాదించారు. ఇరు పక్షాల వాదనలు నేటికి పూర్తి కావడంతో జూన్ 6వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అదే రోజు ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ చెబుతోంది. ఇదీ చదవండి: చంద్రబాబు అద్దె కొంప కహానీ ఇదీ! -
ఏపీ సీఐడీ పిటిషన్ పై తీర్పు వాయిదా
-
చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై ముగిసిన వాదనలు.. జూన్ 2న తీర్పు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కరకట్ట నివాసం జప్తు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బిందుమాధవి.. తీర్పు జూన్ 2న వెలువరించనున్నారు. కాగా కరకట్టపై చంద్రబాబు ఇల్లు జప్తునకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ అభియోగాలు మోపింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఈ మేరకు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద మాట్లాడుతూ.. ఏపీ సీఐడీ తరపున 2 పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటి కాగా, మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్ మరొకటని తెలిపారు. 1944 ఆర్డినెన్స్ ప్రకారం తన పిటిషన్‌పై ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నేరం జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే అఫిడవిట్ వేసిన అధికారిని కోర్టు విచారణ చేయవచ్చని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసు ఇచ్చే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపారు. జప్తు ఉత్తర్వులు ఇవ్వటమా, నిరాకరించటమా అనేది ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. చదవండి: మరోసారి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.. -
కరకట్టపై చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు జప్తునకు సీఐడీ దరఖాస్తు
-
చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై నేడు విచారణ
సాక్షి, విజయవాడ: కరకట్టపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌పై వాదనలు విననుంది. చంద్రబాబు ఉంటున్న ఆ నివాసం.. లింగమనేని రమేష్ పేరిట(గెస్ట్హౌజ్గా) ఉంది. అయితే.. దానిని చంద్రబాబు అక్రమంగా పొందారని, దానిని జప్తు చేసేందుకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలంటూ నాలుగురోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది సీఐడీ. దీంతో.. విచారణ తర్వాత తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. -
కరకట్ట నివాసం ఎవరిది బాబూ?
(సాక్షి, అమరావతి) : ఇంతకీ కరకట్ట నివాసం ఎవరిది? చంద్రబాబుదా... లేక ప్రభుత్వానిదా? ‘‘ఆ ఇంటికి సంబంధించి అవినీతికి తావెక్కడుంది? ఎందుకంటే ఆ ఇల్లు ప్రభుత్వానిది. లింగమనేని రమేశ్ నుంచి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా తీసుకున్నాం. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే భూసేకరణ ద్వారా తీసుకుని ఉండేవాళ్లం’’ అని నేరుగా చంద్రబాబే.. సాక్షాత్తూ అసెంబ్లీలో చెప్పారు. ఇక లింగమనేని కూడా... ఆ ఇల్లు పూలింగ్‌లో తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని, అక్కడ భారీ భవంతులు కడితే తనకెంతో సంతోషమని కూడా చెప్పారు. వీళ్ల మాటలకు వీడియో సాక్ష్యాలూ ఉన్నాయి. ఇక్కడ అసలు ప్రశ్నేమిటంటే... : ఆ ఇల్లు ప్రభుత్వానిది అయినపుడు ప్రభుత్వ రికార్డుల్లో ఆ సంగతి ఉండాలి కదా? ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక కూడా చంద్రబాబు అందులో ఉంటున్నారంటే... అందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి కదా? అసలు ఆ ఇల్లు ప్రభుత్వానిదన్న సంగతి ప్రభుత్వ రికార్డుల్లోనే లేదంటే ఏమనుకోవాలి? వీళ్లంతా కలిసి ఎంతటి దొంగల రాజ్యాన్ని నడిపించారో తెలియటం లేదా? ప్రభుత్వాస్తుల్ని కూడా ప్రయివేటు ఆస్తుల్లా ఎలా మార్చేసుకున్నారో తెలియటం లేదా? చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం అది ప్రభుత్వ ఆస్తే అయినపుడు... : ప్రభుత్వం ఇపుడు ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణంలో భాగంగా ఆ ఇంటిని జప్తు చేస్తుంటే ఉలుకెందుకు? అదేదో చంద్రబాబు సొంత ఆస్తిలా ఫీలవుతూ... ‘ఈనాడు’ దుర్మార్గపు రాతలెందుకు? బాబును టార్గెట్ చేస్తున్నారంటూ రామోజీ శోకాలెందుకు? ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనంటూ తెలుగుదేశం డ్రామాలెందుకు? ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తుంటే వీళ్లంతా ఎందుకింత దుష్ప్రచారానికి తెగిస్తున్నారు? ఇంకెన్నాళ్లు బాబూ ఈ డ్రామాలు? నాడు అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిందిదీ.. : ప్రజా వేదిక నాది కాదు. ప్రభుత్వానిది. నేనుంటున్న భవనం నాది కాదు. రమేష్ అనే డెవలపర్‌ది. నేను తాత్కాలికంగా ఉంటున్నాను. నేనొక టెనెంటే (అద్దెకుంటున్న వాడిని). ప్రెస్మీట్లో చంద్రబాబు చెప్పిందిదీ..: గ్యాస్ ఇచ్చామని ప్రతిఫలంగా ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. ఇల్లు ఇవ్వడమేంటి? అది గమర్నమెంట్ ఇల్లు. నేనున్నానంటే..అది గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నాను. నేను మొదటి రోజే చెప్పాను. దిస్ ప్రొపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. నువ్ ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటాం. ఇస్తే ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటాం. ఇవ్వకపోతే లాండ్ అక్విజిషన్‌లో తీసుకంటాం. టెంపరరీగా నేను ఉండాలి. కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి నేను అక్కడ ఉంటున్నా. కట్టకు ఆవతల ఉండే ల్యాండ్ అంతా, కట్టడాలన్నీ పోయి టూరిజం, మిగతావన్నీ వస్తాయి. మాస్టర్ ప్లాన్‌లో కూడా నోటిఫై చేశారు. లింగమనేని రమేష్ విలేకరులతో చెప్పిందిదీ.. : ప్రభుత్వం ఆ భవనాన్ని పూలింగ్‌లో తీసుకుంది. దేశంపై భక్తితో ఇచ్చేశాను. నాకు ఆ భవనంతో ఏ రకమైన సంబంధం లేదు. -
చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ‘కరకట్ట నివాసం’: సజ్జల
సాక్షి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లెఫ్ట్ పార్టీలు సంపన్నుల వైపు నిలబడతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంట్లా పవన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని అన్నారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం జగన్ పాలన ఉంది. మేనిఫెస్టోలో 98.2 శాతం హామీలను అమలు చేసి చూపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి. బాబు అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. లింగమనేని రమేష్‌కి, హెరిటేజ్‌కి మధ్య లావాదేవీలు జరిగాయి. చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ఈ అక్రమ నివాసం. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు. డబ్బున్న వాళ్లకోసం పేదలకు ఇవ్వకుండా చేశారు. రియల్ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.' అని సజ్జల ఫైర్ అయ్యారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. -
చంద్రబాబు బినామీగా ఆస్తులు కూడబెట్టిన లింగమనేని రమేష్
-
కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ చేసిన ప్రభుత్వం
-
అక్కడ టీడీపీ, జనసేన లేవు.. సజావుగా అక్రమ కట్టడాల కూలివేత!
కొద్ది రోజుల క్రితం దేశరాజధానికి అల్లంత దూరంలో ఉన్న నోయిడాలోని అతి పెద్ద ట్విన్ టవర్స్‌ను ప్రభుత్వ యంత్రాంగాలే దగ్గరుండి కూల్చివేశాయి. ఇందుకోసం 3,700 కిలోలో పేలుడు పదార్ధాలను వినియోగించాయి. టవర్స్ నిర్మాణానికి కొన్ని ఏళ్లు పడితే వాటిని కూల్చి వేయడానికి కేవలం 9 సెకన్లు మాత్రమే పట్టింది. ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్లలో 900 ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తి ఇది. కుతుబ్ మీనార్ కన్నా పొడవైన నిర్మాణం ఇది. ఇంతటి ఆస్తిని కూల్చివేయడానికి కారణం ఒక్కటే. టవర్స్ నిర్మించిన రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేసుకుపోయింది. దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. అన్నీ విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ టవర్స్‌ను కూల్చివేయాల్సిందేనని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఆగస్టు 28న ఈ టవర్స్ ను కూల్చివేశారు. దీనికి రెండేళ్ల క్రితం.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మారాడు గ్రామంలో అద్భుతమైన సరస్సును ఆనుకుని నాలుగు పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లను అధికారులు కూల్చివేశారు. 2020 జనవరి 11న అత్యంత విలాసవంతమైన ఈ అపార్ట్ మెంట్లను పేలుడు పదార్ధాలతో కూల్చివేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఫిర్యాదు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేసినా భవన నిర్మాణాలు చేపట్టిన సంస్థ పట్టించుకోలేదు. మనల్ని ఎవరేం చేస్తారులే అని ధీమా వారిది. డబ్బుతో దేన్నయినా కొనేయచ్చన్న అహంకారం. వెరసి నిబంధనలను తొక్కి పారేసి అపార్ట్ మెంట్లు కట్టి పారేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో అపార్ట్ మెంట్లు కొనుకున్న వారు తాము జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఇళ్లు కొనుక్కున్నామని వాటిని కూల్చివేయవద్దని విజ్ఞప్తులు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కోట్లాది రూపాయల డబ్బు ఉన్నా కూడా పర్యావరణ నిబంధనలు అమలు చేయడమే ముఖ్యమని భావించింది. అందుకే ఈ అపార్ట్మెంట్లను కూల్చివేయాల్సిందిగా 2019 డిసెంబరులో తీర్పు నిచ్చింది. కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు ఏడు నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ లో కృష్ణా నది తీరాన అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణ నిబంధనలకు పాతరేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సంకల్పించిన నాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమార్కులందరికీ ఈ కూల్చివేత అనేది ఓ హెచ్చరికగా ఉండాలని భావించింది. అందుకే అంతకు ముందు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల్లోనే ఓ కట్టడంలో ప్రభుత్వ కార్యకలాపాలు మరో కట్టడాన్ని సాక్ష్యాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంగా ఉంచుకోగా మరి కొందరు అక్రమ కట్టడాల్లో రక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కూల్చివేత అనేది ముందుగా అక్రమంగా నిర్మించిన ప్రభుత్వ భవనంతోనే మొదలు పెట్టడం పద్ధతిగా ఉంటుంది కాబట్టి ప్రజావేదిక ను కూల్చివేశారు. దీంతో పాటే కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన యజమానులందరికీ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. అంతే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు వీధుల్లోకి వచ్చేసి తమపై రాజకీయ కక్ష సాధింపునకు దిగారంటూ గగ్గోలు మొదలు పెట్టింది. తమ ఆర్ధిక మూలాలు దెబ్బతీయడానికే ఈ కుట్ర అంటూ ఆరోపణలు చేసింది. దానర్ధం ఏంటి? ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వారి వందిమాగధులవేనని తేటతెల్లం అయిపోలా? చిత్రం ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణా నదిలో బోటులో పర్యటిస్తూ కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. వాటిని త్వరలోనే కూల్చివేసి తీరతామని స్పష్టం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత ఏమైందో కానీ కరకట్టపై మరికొన్ని అక్రమ కట్టడాలు యధేచ్ఛగా పుట్టుకొచ్చాయి. అందులోని ఓ అక్రమ కట్టడం చంద్రబాబుకు తెగ నచ్చేసింది. అందులోనే తాను ఉంటానని అనడంతో దాని యజమాని కూడా ఉదారంగా ఓకే అనేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చి వేయడం మొదలు పెట్టిన వెంటనే సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ తో పాటు పలువురు పర్యావరణ వేత్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. టిడిపి హయాంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు నదీ తీరాన అక్రమకట్టడాలు చూసి రాజేంద్ర సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై ఆయన ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన టిడిపి నేతలు రాజేంద్ర సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపి ఆయనపై దాడికి దిగారు. అధికారం పోయాక ఎల్లో వాయిస్‌లో తేడా వచ్చింది. టిడిపికి మద్దతుగా ఉండే కొందరు ఎల్లో మేథావులు అయితే అక్రమ కట్టడాలైనా కూడా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు కదా..వాటిని ఏదో ఒక పనికి వాడుకోవాలి తప్ప కూల్చివేయడం ఏంటి అంటూ చెత్త లాజిక్ ఒకటి తెరపైకి తెచ్చారు. కొన్ని కోట్లతో కట్టిన ప్రజావేదిక కన్నా.. అక్రమ కట్టడాల కన్నా కూడా కృష్ణా నదికి అక్రమ కట్టడాల వల్ల జరిగిన నష్టం కొన్ని వేల కోట్లకు పైనే ఉంటుందన్న స్పృహ వారిలో లేదు. అసలు పర్యావరణం అంటేనే అది తమకి సంబంధంలేని విషయం అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ వచ్చారు. నొయిడాలో ట్విన్ టవర్స్‌ను పేల్చినపుడు వందల కోట్ల రూపాయల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటి? అని అక్కడి ప్రతిపక్షాలు గొడవ చేయలేదు. అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రజాసంఘం కానీ ప్రశ్నించలేదు. ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆ టవర్స్ నిర్మించిన కంపెనీతో అంటకాగే రాజకీయ పార్టీలు ఆరోపించలేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం, జనసేన వంటి బాధ్యతారహిత రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇపుడు మన పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యేకించి బెంగళూరు నగరాన్ని తాజాగా భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో చెరువులు, పార్కుల కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి కార్పొరేట్ కార్యాలయాలు కొలువు తీరిన బహుళ అంతస్థుల భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. అదృష్టం ఏంటంటే బెంగళూరు లో టిడిపి, జనసేన వంటి పార్టీలు లేవు కాబట్టి కూల్చివేతలపై ఎలాంటి రాజకీయాలు లేకుండా సజావుగా సాగుతున్నాయి. -
కరకట్ట రోడ్డు విస్తరణను వేగంగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లేందుకు వీలుగా కరకట్ట రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అనుకున్న సమయం కంటే ముందే పూర్తిచేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సీఆర్డీఏ అధికారులను అదేశించారు. సచివాలయంలో సోమవారం ఏపీ సీఆర్డీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా చేస్తున్న పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాల నిర్మాణ ప్రగతిపైనా మంత్రి ఆరా తీశారు. పట్టణాభివృద్ధి విభాగంపై నిర్వహించిన సమీక్షలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. 124 యూఎల్బీల్లో చెత్త సేకరణ కోసం ఇప్పటివరకు 1.13 కోట్ల మూడు రంగుల డబ్బాలు పంపిణీ చేశామని, మరో 10 లక్షల డబ్బాల పంపిణీ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని వివరించారు. -
కరకట్ట గొడవ.. వాస్తవాలు తెలుసుకోవాలి: డీఐజీ
-
Andhra Pradesh: శాసన రాజధానికి రహదారి
సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది కుడి కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. బ్యారేజీ వద్ద కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కరకట్ట రోడ్డును 15.52 కిలోమీటర్ల మేర రూ.150 కోట్ల ఖర్చుతో విస్తరించనున్నారు. కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం వద్ద నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అనంతరం విస్తరణ పనులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పూర్తి నాణ్యతతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కరకట్ట పటిష్టం.. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా ఈ రోడ్డును విస్తరిస్తున్నారు. రెండు లైన్లలో వాహనాలు వెళ్లేందుకు, మరో రెండు వరుసలు ఇరువైపులా నడకదారుల కోసం కేటాయించారు. ఈ రోడ్డులో కొండవీటి వాగు బ్రిడ్జిని పునఃనిర్మించనున్నారు. అమరావతి ఎన్–1, ఎన్–2, ఎన్–3 రహదారులతోపాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, గొల్లపూడి – చినకాకాని –విజయవాడ బైపాస్ రోడ్లను కరకట్ట రోడ్డుకు అనుసంధానం చేస్తారు. దీనిద్వారా రాజధాని ప్రాంతానికి పూర్తిస్థాయి రహదారి సౌకర్యం కలుగుతుంది. సచివాలయం, పలు విద్యా సంస్థలతోపాటు ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. సచివాలయం, హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. రోడ్డు విస్తరణతో కరకట్ట పటిష్టంగా మారి తరచూ వరదల ముంపు బారిన పడే ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాలకు మేలు జరుగుతుంది. ఈ రోడ్డు వల్ల ప్రధానంగా విజయవాడ వైపు నుంచి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లి వచ్చే అధికారులు, ఉద్యోగులు, ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీరతాయి. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, అనిల్‌కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, చెరకువాడ శ్రీరంగనాథరాజు, నారాయణస్వామి, సీహెచ్ వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలత, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మద్దాలి గిరి, అన్నాబత్తుల శివ, షేక్ ముస్తఫా, గుంటూరు మేయర్ మనోహర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. -
AP: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కృష్ణా నది కరకట్ట పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. కరకట్ట విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, సూచరిత, రంగనాధ రాజు, నారాయణ స్వామి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రహదారితో అమరావతిలోని ఎన్-1 నుంచి ఎన్-3 రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్, గొల్లపూడి- చిన్నకాకాని- విజయవాడ బైపాస్ రోడ్లకు అనుసంధానమవుతుంది. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడునుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇవ్వండి -
కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం
తాడేపల్లి రూరల్: అమరావతి, ఉండవల్లి కరకట్టపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వలస కూలీల కుటుంబాన్ని అతి వేగంగా వస్తున్న కారు ఆదివారం ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోట మరియదాసు (35), భార్య యేసుకుమారి, ఇద్దరు కుమారులు తేజ, ప్రవీణ్ (10) అమరావతి మండలం మునుగోడుకు చెందినవారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక కుటుంబం గడవడం కష్టం కావడంతో అత్తగారి ఊరైన మైలవరం వెళ్లి పనులు చేసుకుంటుండేవారు. లాక్డౌన్ సడలించడంతో తిరిగి ద్విచక్ర వాహనంపై సొంత ఊరు వస్తుండగా అమరావతి కరకట్టమీద మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద మందడం నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఈ నలుగురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న మరియదాసు కుటుంబం పది అడుగుల పైకి లేచి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. బైక్‌ను ఈడ్చుకుంటూ కారు 15 అడుగుల దూరం వెళ్లింది. మరియదాసు, చిన్న కుమారుడు ప్రవీణ్‌లకు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు 108కు ఫోన్ చేశారు. తీవ్ర గాయాలైన తేజ, యేసుకుమారిలకు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. యేసుకుమారి చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్‌లో కన్నుమూసింది. తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని ఉమా మహేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం