AP: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

YS Jagan Lay Foundation Stone For Krishna River Dam Road Widening Works - Sakshi

సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కృష్ణా నది కరకట్ట పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. కరకట్ట విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్‌ యాదవ్, బొత్స సత్యనారాయణ, సూచరిత, రంగనాధ రాజు, నారాయణ స్వామి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ రహదారితో అమరావతిలోని ఎన్‌-1 నుంచి ఎన్‌-3 రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్‌ యాక్సిస్‌ రోడ్, గొల్లపూడి- చిన్నకాకాని- విజయవాడ బైపాస్‌ రోడ్లకు అనుసంధానమవుతుంది. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడునుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: ప్రైవేట్‌ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇవ్వండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top