చంద్రబాబు కరకట్ట నివాసం కేసు.. విచారణ 30కు వాయిదా | Chandrababu Karakatta house case Adjournment of hearing 30th June | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కరకట్ట నివాసం కేసు.. విచారణ 30కు వాయిదా

Jun 29 2023 5:49 AM | Updated on Jun 29 2023 5:49 AM

Chandrababu Karakatta house case Adjournment of hearing 30th June - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో చంద్రబాబు కరకట్ట నివాసాన్ని అటాచ్‌ చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 30కు వాయిదా వేసింది. ఈ కేసుపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో బుధవారం వాదనలు సందర్భంగా కరకట్ట నివాసానికి సమాన విలువైన ఆస్తిని ష్యూరిటీగా చూపిస్తామని లింగమనేని రమేశ్‌ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

దానిపై సీఐడీ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక ఇదే కేసులో నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్‌ చేయడంపై న్యాయస్థానం కోరిన వివరాలను సీఐడీ న్యాయవాది సమర్పించారు. అనంతరం ఈ కేసును న్యాయమూర్తి ఈ నెల 30కు వాయిదా వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement