చంద్రబాబు కరకట్ట ఇంటికి కొత్త హంగులు.. భారీగా ఖర్చు! | AP Govt Release Funds For Chandrababu Karakatta House | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కరకట్ట ఇంటికి కొత్త హంగులు.. భారీగా ఖర్చు!

Oct 28 2024 7:46 PM | Updated on Oct 28 2024 7:57 PM

AP Govt Release Funds For Chandrababu Karakatta House

సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కొత్త హంగులు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కరకట్ట నివాసానికి వీవీఐపీ సదుపాయాల కోసం భారీ ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కరకట్టపై ఉన్న సీఎం చంద్రబాబు ఇంటి హంగులకు 1.44 రూపాయల కోట్లు ఖర్చు చేయనున్నారు. కరకట్ట నివాసంలో వీవీఐపీ సదుపాయాలు కోసం భారీ ఖర్చు చేస్తున్నారు. కరకట్ట నివాసానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం 21 లక్షలు ఖర్చు చేయనున్నారు. అలాగే, కరకట్ట నివాసం లోపల, బయట నిఘా కోసం 81 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు. సీఎం ఇంటికి వచ్చే వాహనాల తనిఖీ, నియంత్రణ, యూవీఎస్ఎస్, హైడ్రాలిక్ బోలార్డ్స్ కోసం 42 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement