ఎమ్మెల్యే గౌతు శివాజీకి మళ్లీ అవమానం | tdp mla gouthu syam sundar sivaji faced Bitter Experience again in ap assembly premises | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే గౌతు శివాజీకి మళ్లీ అవమానం

Mar 24 2017 11:12 AM | Updated on Aug 21 2018 5:51 PM

ఎమ్మెల్యే గౌతు శివాజీకి మళ్లీ అవమానం - Sakshi

ఎమ్మెల్యే గౌతు శివాజీకి మళ్లీ అవమానం

నిన్న కరకట్ట... ఇవాళ ఏపీ అసెంబ్లీ ఎదుట శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, అధికారపార్టీ సభ్యుడు గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీకి సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది.

అమరావతి: నిన్న కరకట్ట... ఇవాళ ఏపీ అసెంబ్లీ ఎదుట శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, అధికారపార్టీ సభ్యుడు గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీకి సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. శుక్రవారం శాసనసభ సమావేశాలకు హాజరు అవుతున్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా సిబ్బంది ఎమ్మెల్యే శివాజీని అసెంబ్లీ లోపలకి అనుమతించలేదు. అయితే ఐడీకార్డు చూపించి తనిఖీ చేసిన తర్వాతే ఆయనను లోనికి అనుమతించారు.

కనీసం పీఏ కూడా లేని తనలాంటి వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపుతున్నారని, అదే సుమారు ఓ 15మందిని వెంట తీసుకొచ్చే బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నల లాంటివారికి మాత్రం  సెల్యూట్‌ కొడతారని ఎమ్మెల్యే శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా  ఆయన నాలుగురోజుల క్రితం కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో  శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట‍్ట దగ‍్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement