కరకట్ట బంగ్లాలోనే కుంభకోణాల మూలాలు

Perni Nani Comments On Chandrababu - Sakshi

ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడితో కలసి చంద్రబాబు హవాలా వ్యాపారం: మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడ ఐటీ సోదాలు, ఈడీ దాడులు జరిగినా వాటి మూలాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు కరకట్ట నివాసంలో బయట పడుతున్నాయని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో దోచుకున్న సొమ్మును దాచుకుని దేశం దాటించేందుకు ఎస్‌ బ్యాంక్‌ను వాడుకున్నారని ఆరోపించారు. ఆ బ్యాంకు అవినీతి మూలాలు చంద్రబాబు దగ్గర తేలుతున్నాయన్నారు. ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో కలసి చంద్రబాబు హవాలా వ్యాపారం చేశారన్నారు. టిట్కో ద్వారా చదరపు అడుగుకు రూ.1,100 చొప్పున నిర్మించాల్సిన పేదల ఇళ్లకు రూ.2,400 ప్రకారం చెల్లించి చంద్రబాబు రూ.వేల కోట్ల ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఆ సొమ్ము ఎస్‌ బ్యాంకు ద్వారా విదేశాలకు హవాలా రూపంలో తరలినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

- బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖలు రాసిన చంద్రబాబు ఓట్ల కోసం ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. 
- స్థానిక ఎన్నికల్లో బీసీలకు పార్టీ తరపున 34 శాతం సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించాకే గత్యంతరం లేక చంద్రబాబు అదే దారి అనుసరించారు.
- తిరుమల శ్రీవారి సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఎస్‌ బ్యాంక్‌లో రూ.1,300 కోట్లు డిపాజిట్‌ చేయించారు. 
ఢిల్లీలో ఎస్‌ బ్యాంక్‌తో కలిసి చంద్రబాబు గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌ నిర్వహిస్తే పెట్టుబడులు రాలేదు. టూరిజం మిషన్‌ డాక్యుమెంట్‌ తయారీకి రూ.లక్షల్లో ఫీజు చెల్లించారు. 
ఇవన్నీ చాలా చిన్నవి. చంద్రబాబు ఐదేళ్లలో దోచుకున్న మొత్తాన్ని దేశం బయటకు తరలించేందుకు ఎస్‌ బ్యాంక్‌ను వాడుకున్నారు. 
- ఆర్థిక నేరగాడు రాణాకపూర్‌ నెలకోసారి చంద్రబాబు వద్దకు వచ్చి రాత్రంతా కరకట్ట బంగ్లాలో గడిపేవారు. 
తనకు నోటీసులు వస్తాయని భయపడుతున్న చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని పెద్ద లాయర్లతో చర్చిస్తున్నారు.
- పవన్‌ రోజుకో మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలను మోసగించడం మానుకోవాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top