
సాక్షి, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద గురువారం రాత్రి ఏనుగుల గుంపు కలకలం సృష్టించింది. సుమారు ఐదారు ఏనుగులు ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో నుంచి ఏడవ మైలు వద్ద రహదారిపైకి వచ్చేందుకు ప్రయతి్నంచాయి.
దీంతో అటు వెళుతున్న వాహనాలన్నీ నిచిపోయాయి. వెంటనే వాహనచోదకులు టీటీడీ అటవీశాఖకు, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపారు. ఈ సందర్భంగా ఏనుగులు అటవీశాఖ సిబ్బంది పైకి వచ్చేందుకు ప్రయత్నించాయి. వారు చాకచక్యంగా ఏనుగులను అడవిలోకి తరిమేశారు.