
ఆర్ట్ అండ్ కల్చర్
..మన కళలు మనతో ఉంటే ఏ దేశంలో ఉన్నా...మన దేశం మనలో ఉన్నట్లే! ఆ భావనతో కూచిపూడికి దగ్గరైంది నేహా. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేహ నృత్యప్రదర్శన ఇచ్చింది. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ నేహా రెడ్డి ఆళ్లకు భారతీయ నృత్యకళలపై మంచి అవగాహన ఉంది.
చిన్నవయసులోనే కూచిపూడి నృత్యకారిణిగా ‘శభాష్’ అనిపించుకుంది. తల్లిదండ్రులు శివరామిరెడ్డి, నాగమల్లేశ్వరిల చొరవ, ప్రోత్సాహంతో వర్జీనియాలోని ‘కళామండపం’ నృత్య పాఠశాలలో గురువు మృణాళిని సదానంద దగ్గర కూచిపూడి నేర్చుకుంది నేహ.
రేపు శనివారం మరోసారి తన నృత్యప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయింది. నృత్యంలోనే కాదు చదువులోనూ రాణిస్తున్న నేహాకు డాక్టర్ కావాలనేది లక్ష్యం. నృత్య కళలో మరింతగా రాణించాలని, డాక్టర్ కావాలనే తన కలను నెరవేర్చుకోవాలని ఆశిద్దాం.
ఇదీ చదవండి : Tip of the Day : రాగుల జావతో మ్యాజిక్