
బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అస్వస్థతతో గురువారం సాయంత్రం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. జ్వరం, మధుమేహ సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(71) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉన్న ఆయన.. వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో నిన్న నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనతోపాటు కుటుంబ సభ్యులు ఉండగా.. తాజాగా కూతురు-ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
కేసీఆర్ నీరసంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వైద్య బృందం ఇదివరకే ఉందని ప్రకటించింది. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరగగా, సోడియం లెవెల్స్ కాస్త తగ్గాయని తెలిపింది. ప్రస్తుతం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని హెల్త్ బులిటెన్ ద్వారా వెల్లడించింది. అయితే..
ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకా కొన్ని పరీక్షలు చేయాల్సి ఉందన్న వైద్యులు.. కోలుకునేందుకు మరో రెండు రోజులు పట్టొచ్చని, అప్పుడే ఆయన్ని డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

KCR ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యులు, అధికారులతో స్వయంగా మాట్లాడిన సీఎం.. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా కేసీఆర్ ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. మరోవైపు.. కేసీఆర్ అనారోగ్య వార్తలతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు తరలి వస్తున్నారు.