
మంత్రి, ఎంపీని పథకాల గురించి నిలదీస్తున్న ప్రజలు
జరుగుమల్లి (సింగరాయకొండ): కూటమి ప్రభుత్వ హామీల అమలు, అవకతవకలపై అడుగడుగునా మహిళలు నిలదీయడంతో రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యకు చేదు అనుభవం ఎదురైంది.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల కేంద్రంలో గురువారం తొలిరోజు ప్రారంభమైన ‘తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా నాయకులు జరుగుమల్లి మండల కేంద్రానికి వచ్చారు.‘అయ్యా.. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పాపకు మాత్రమే తల్లికి వందనం నగదు పడింది.. మిగతా వారికి పడలేదు’ అని మహిళ అడగ్గా, ‘మాకు గ్యాస్ డబ్బులు పడలేదు’ అంటూ మరికొందరు నిలదీశారు. ‘సార్.. నాకు ఇంటి స్థలం ఉంది.. ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఇల్లు మంజూరు కాలేదు’ అని మరో మహిళ ఆగ్రహం వ్యక్త చేసింది.