ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో గెలిచింది వీళ్లే.. అధ్యక్షుడిగా సురేశ్ బాబు
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ఆఫీస్‌లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు.. ఈ నాలుగు విభాగాల కౌన్సిల్‌తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఇప్పుడు దీని ఫలితాలు బయటకు వచ్చేశాయి.ఛాంబర్ ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ పోటీపడ్డాయి. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు బలపరుస్తున్న 'ప్రోగ్రెసివ్ ప్యానల్' ఒకవైపు.. సి. కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు బలపరుస్తున్న 'మన ప్యానెల్' మరోవైపు రేసులో నిలిచాయి. చివరకు ప్రొగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు.నిర్మాతల సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఐదుగురు, మన ప్యానెల్ నుంచి ఏడుగురు గెలుపొందారు. స్టూడియో సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి ఒకరు, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది, మన ప్యానెల్ నుంచి ఇద్దరు గెలిచారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ నుంచి 8 మంది, మన ప్యానెల్ నుంచి ముగ్గురు విజయం సాధించగా ఒకటి టై అయింది. ఓవరాల్‌గా 48 మంది కార్యవర్గానికి ప్రోగ్రెసివ్ ప్యానెల్ లో 31 మంది, మన ప్యానెల్ లో 17 మంది గెలిచారు. తద్వారా ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో ప్రొగ్రెసివ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది.ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. కార్యవర్గ పదవీకాలం ఈ ఏడాది జూలైలోనే ముగిసింది. కానీ కొన్ని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. వీళ్లంతా 2027 జూలై వరకు పదవుల్లో కొనసాగనున్నారు. ఇప్పుడు ఎవరికి ఏ పదవి అనేది నిర్ణయించారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా సురేశ్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా నాగవంశీ, సెక్రటరీగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్ ఎన్నికవగా.. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా భరత్ చౌదరి, స్టూడియో సెక్టార్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా కిరణ్ ఎన్నికయ్యారు.
91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..
తల్లి ప్రేమకు మించిది ఏది లేదు. ఈ సృష్టిలో తల్లికి మించిన దైవం లేదు అన్న ఆర్యోక్తి ఎప్పటికీ ప్రకాశంతంగా వెలుగుతుంటుంది. ముదుసలి వయసులో సైతం తన బిడ్డకు తానే ఏదో చేయాలని తప్పనపడుతుంటుంది. అందుకోసం ఎంతలా తల్లి కష్టపడేందుకైనా సిద్ధపడుతుంది అనేందుకు ఈ 91 ఏళ్ల తల్లే ఉదాహారణ. ఆ ముదసలి వయసులో కూడా కొడుకు కోసం తప్పన పడుతూ అల్లిన స్వెటర్లో ప్రతి అల్లికలో ఆమె ప్రేమ, కష్టం కనిపిస్తుంది. ఎంత ఖరీదైన స్వెటర్ కూడా ఈ అమ్మ అల్లిన స్వెటర్ ఇచ్చిన వెచ్చదనంతో సరితూగదు.సోషల్ మీడియోలో అరుణ్ భాగవతులు తన తల్లి అంతులేని ప్రేమకు నిదర్శనమైన ఓ సన్నివేశాన్ని షేర్ చేసుకున్నారు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అమ్మ ప్రేమ అనంతం అని కీర్తిస్తున్నారు. ఇంతకీ అతడు పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే..అరుణ్ భాగవుతుల తల్లి 91 ఏళ్ల వయసులో మంచానికే పరిమితమై ఉందామె. అయినా తన కొడుక్కు తన చేతనైనది ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. అందుకోసం తన చేత్తో తానే స్వయంగా స్వెటర్ అల్లాలనుకుంది. అలా మంచం మీద స్వెటర్ కుట్టేందుకు రెడీ అయ్యింది. చేతులు నొప్పి పుట్టినప్పుడల్లా కాసేపు ఆగి విశ్రాంతి తీసుకుని అల్లడం ప్రారంభించేది. కొడుకు మీద ఉన్న ప్రేమ అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టేలా చేసింది. అయితే ఈ వయసులో ఇదంతా ఎందుకు అని కొడుకు వారించిన వినలేదామె. అయితే ఆమె మందుగా పైభాగాంలోని మెడ భాగాన్ని పూర్తిచేసింది. ఒక్కసారి ధరించి చూసి..సరిపోయిందో లేదో చెప్పమంది. అయితే అరుణ్ దాన్ని వేసుకుని చూసి..కొంచెం పొడవు చేయమని సూచించాను. అందుకోసం అల్లిందంతా విప్పేయాల్సి వస్తుందని తెలియదు. అయితే తన తల్లి ఒక మాటకూడా మారుమాట్లాడకుండా కామ్‌గా అంత విప్పేసి కుట్టింది. నడుము కొలత కాకుండా ఛాలికొలత తీసుకుని కుట్టడంతో కాస్త టైట్ అయ్యిందని వివరించాడు అరుణ్. అయితే ఆమె ముందు వెనుక భాగాలు అల్లడం పూర్తయ్యాక.. మరోసారి అది సరిపోయిందో లేదో చూడమని కోరగా..అప్పుడు ముందు భాగానికి, వెనుక భాగానికి, ఆరు అంగుళాలు ఖాళీ ఉంది. దాంతో ఆమె షాక్ అయ్యింది. అయినా సరే ఏదో రకంగా తన తల్లి స్వెట్టర్‌ని పూర్తిచేసి మళ్లీ ఇచ్చారట చూడమని. ఈసారి అది కాస్తా సరిపోయినా..పొట్టైందట. అయితే ఈసారి మార్పులు చేర్పులు గురించి చెప్పబుద్దిగాక, ఊరుకున్నానని ఆయన పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేగాదు ఆ స్వెట్టర్ పొట్టిగా ఉందేమో..ఆమె ప్రేమ మాత్రం చిన్నది కాదు అని షేర్ చేయడం నెటిజన్లు మనసును హత్తుకుంది. బ్రాండెడ్ స్వెటర్లలో అత్యంత అమూల్యమైన స్వెటర్ అని కొనియాడుతూ పోస్టులు పెట్టారు.
నకిలీ ఆరోగ్య ఉత్పత్తులతో జాగ్రత్త
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
ఇంటి చిట్కాలకు మించి ఆలోచిద్దాం: హెయిర్ ఫాల్‌కి అసలైన పరిష్కారం ఏది?
కోల్‌కాతాకు చెందిన యానీ(28), ఢిల్లీకి చెందిన భావన(40) లకు, ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద ఆందోళనగా మారాయి. వీరి కథ, ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్న ఎంతోమంది భారతీయ మహిళల కథ లాంటిదే.పోషకాహార లోపం, స్ట్రెస్ (stress), హార్మోన్ల మార్పుల వల్ల సిటీల్లో ఉండేవాళ్లకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతోందని డెర్మటాలజీ స్టడీస్ చెబుతున్నాయి. అందరిలాగే వీళ్ళు కూడా మొదట్లో ఇంటి చిట్కాలు, రకరకాల నూనెలు వాడి చూసారు. కానీ చివరికి క్లినికల్ ట్రీట్మెంట్ (clinical treatment) అవసరమని తెలుసుకున్నారు.ఇంటి చిట్కాలు పనిచేయకపోతే?యానీ, భావన ఇద్దరూ హెయిర్ ఫాల్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు.షాంపూ చేసుకున్నప్పుడు చేతి నిండా జుట్టు రావడం యానీకి గుర్తుంది. ''చేతిలో అంత జుట్టు చూసి నాకు భయమేసింది. అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏం చెయ్యాలి? అనిపించింది. ఆన్లైన్లో దొరికిన ప్రతి కిచెన్ రెమెడీ (kitchen remedy) ట్రై చేశాను. కానీ ఏదీ పనిచెయ్యలేదు. అవి ట్రీట్మెంట్ కోసం చేసినవి కాదు, జనరల్ చిట్కాలు మాత్రమే" అని అన్నారు.భావన కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉండేవారు. తల స్నానం చేసాక దువ్వెన నిండా జుట్టు వచ్చేది. కరివేపాకు, ఉల్లిపాయ రసం.. అన్నీ ట్రై చేశాను, కానీ లాభం లేకపోయింది. ఏ హెయిర్ సీరమ్ (hair serum) వాడాలో తెలియక దాదాపు ఒక నెల రోజులు అయోమయంలో ఉన్నానని ఆమె చెప్పారు.వీరి అనుభవం డాక్టర్లు చెప్పేదాన్ని నిజం చేస్తోంది: ఇంటి చిట్కాలు సేఫ్‌గా అనిపించినా, అవి దీర్ఘకాలిక హెయిర్ ఫాల్‌ను తగ్గించలేవు.సైన్స్ వైపు మలుపువీళ్లు తీసుకున్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదు. నెలల తరబడి ఇంటి వైద్యం, డాక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం. యానీ స్వయంగా ఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆమెకు ఆన్లైన్లో Bontress గురించి తెలిసింది."నేను ఒక మంచి ఫార్మా కంపెనీ ప్రొడక్ట్ కోసం వెతుకుతున్నాను. ఏదో పేరుకు కాకుండా.. నిజంగా ట్రీట్మెంట్ కోసం పనిచేసేది కావాలి." ఆమె అందులోని ఇంగ్రీడియంట్స్ (ingredients) చెక్ చేసి, గూగుల్‌లో రివ్యూస్ చదివిన తర్వాతే డిసైడ్ అయ్యాను'' అని యానీ చెప్పారు.భావనకు, ఆమె కజిన్ Bontress Pro+ గురించి చెప్పారు. జుట్టు పెరగడానికి ఇందులో సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. Nykaaలో రివ్యూస్ చూసాక ఆమె నమ్మకం ఇంకా బలపడింది. చాలామంది తమకు 'బేబీ హెయిర్' (baby hair) వస్తోందని, హెయిర్ ఫాల్ తగ్గిందని రాశారు. అది చూశాక నాకు నమ్మకం వచ్చింది" అని భావన అన్నారు.మార్పు నిశ్శబ్దంగా వచ్చినప్పుడుఇద్దరూ అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదు. హెయిర్ ఫాల్ తగ్గడానికి 6-8 వారాలు, కొత్త జుట్టు రావడానికి కనీసం 3 నెలలు పడుతుందని సైన్స్ చెబుతోంది.యానీకి, నుదుటి దగ్గర సన్నని కొత్త వెంట్రుకలు రావడం కనిపించింది. మా అమ్మ నన్ను చూసి, 'నీకు చాలా బేబీ హెయిర్స్ వస్తున్నాయే' అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నిజంగా పనిచేస్తోందని. ఆమె ప్రతి రాత్రి క్రమం తప్పకుండా (without fail) Bontress వాడారు.భావన ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. ''ఒకటిన్నర నెల తర్వాత, నాకు బేబీ హెయిర్ కనిపించింది. కానీ నాకు డౌట్ వచ్చింది. సో, పార్లర్‌కు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చెక్ చేయమన్నాను. తను 'అవును మేడమ్, చిన్న వెంట్రుకలు వస్తున్నాయి'' అని చెప్పింది. అది వినగానే చాలా హ్యాపీగా అనిపించింది." దువ్వెనలో జుట్టు రావడం కూడా తగ్గిందని ఆమె గమనించారు.చిత్రం: Bontress Pro+తో భావన జుట్టు పెరుగుదల ప్రయాణంఎవరూ మాట్లాడని ఎమోషనల్ మార్పుజుట్టు పెరగడమే కాదు, ఇద్దరూ మానసికంగా కూడా చాలా రిలీఫ్ ఫీలయ్యారు. రిజల్ట్ రాకముందు పడ్డ టెన్షన్ గురించి.. ''ఇది పనిచేయడం మొదలుపెట్టాకే నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. అంతకు ముందు వరకు చాలా కంగారుగా ఉండేది'' అని యానీ చెప్పారు.ఏ సీరమ్ కొనాలన్నా భావనకు మొదట్లో భయంగా ఉండేదట. "ఇవి చాలా కాస్ట్లీ (costly). డబ్బులు ఖర్చు పెట్టి రిజల్ట్ రాకపోతే బాధేస్తుంది కదా. Bontress వాడేటప్పుడు కూడా ఇది పనిచేస్తుందా లేదా అని డౌట్ ఉండేది. కానీ మార్పు కనిపించాక చాలా రిలీఫ్‌గా అనిపించింది'' అని అన్నారు.హెయిర్ ఫాల్ వల్ల ఆడవాళ్లు ఎంత ఎమోషనల్ స్ట్రెస్ ఫీలవుతారో వీరి కథలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా చిట్కాలను పక్కన పెట్టి, Bontress లాంటి క్లినికల్ సొల్యూషన్స్ వైపు వస్తున్నారు. యానీ చెప్పినట్టు: ట్రీట్మెంట్ అన్నాక టైమ్ పడుతుంది. మ్యాజిక్ లాగా జరగదు. కానీ ట్రీట్మెంట్ కోసం చేసిన ప్రొడక్ట్ అయితే కచ్చితంగా పనిచేస్తుంది. భావన కూడా.. టెన్షన్ పడకండి. సైన్స్ ప్రకారం పనిచేసే ప్రొడక్ట్ ఎంచుకోండని అన్నారు.
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
ఐబొమ్మ రవి కేసులో మరో బిగ్ ట్విస్ట్
అనసూయ ఫన్నీ ఫేస్.. మాళవిక ఇంత అందంగా
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్
భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం
శ్రీలంకతో నాలుగో టీ20.. తొలిసారి టీమిండియాకు చేదు అనుభవం
2025లో దక్షిణ మధ్య రైల్వే విజయాలివే..!
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..!
2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో ఈ రోజుల్లోనే..
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'దేవర' నటి
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
రాజ్‌తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
45 సిక్సర్లతో భయోత్పాతం సృష్టించిన అభిషేక్ శర్మ
ఐబొమ్మ రవి కేసులో మరో బిగ్ ట్విస్ట్
అనసూయ ఫన్నీ ఫేస్.. మాళవిక ఇంత అందంగా
భారీగా పెరిగిన వెండి ధరలపై.. మస్క్ ట్వీట్
భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం
శ్రీలంకతో నాలుగో టీ20.. తొలిసారి టీమిండియాకు చేదు అనుభవం
2025లో దక్షిణ మధ్య రైల్వే విజయాలివే..!
టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..!
2026 జనవరిలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో ఈ రోజుల్లోనే..
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'దేవర' నటి
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
శివాజీకి మహిళా కమిషన్ సూటి ప్రశ్నలు
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
రాజ్‌తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
ఫొటోలు
'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)
ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)
బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ సందడి.. ఫోటోలు
బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)
చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
సినిమా
సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ వారం ఓటీటీల్లోకి చాలానే తెలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో ఆంధ్ర కింగ్ తాలూకా, బాహుబలి ద ఎపిక్, అష్టదిగ్బంధనం, రివాల్వర్ రీటా తదితర స్ట్రెయిట్ చిత్రాలతో పాటు వృత్త అనే డబ్బింగ్ బొమ్మ, ఏక్ దివానే కీ దివానియత్ అనే హిందీ మూవీ, స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్ రెండో వాల్యూమ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో రెండు తెలుగు సినిమాలు సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అమ్మరాజశేఖర్, ధనరాజ్, చమ్మక్ చంద్ర, సుమన్ శెట్టి తదితరులు నటించిన హారర్ కామెడీ మూవీ 'సుగుణ'. 2024లో రిలీజైంది. కాకపోతే ఎప్పుడు థియేటర్లలోకి వచ్చి వెళ్లిందనే సరైన సమాచారం లేదు. ఇప్పుడీ మూవీ సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది.గతేడాది రిలీజైన 'బాగుంది' అనే సినిమా కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. రామ్ కుమార్ దర్శకుడు కాగా కిశోర్ తేజ, భవ్యశ్రీ, పద్మిని, పద్మజయంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీటి ట్రైలర్స్ చూస్తే ఏమంత పెద్ద గొప్పగా లేవు. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాయో చూడాలి?(ఇదీ చదవండి: ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్)
నా కులం చూసి హీరోగా తీసేశారు : రవికృష్ణ
సీరియల్ నుంచి సినిమాల్లోకి వచ్చిన నటుడు రవికృష్ణ. మొగలిరేకులు సీరియల్‌తో బుల్లితెరకు పరిచమైన రవికి బిగ్‌బాస్ షోతో మరింత గుర్తింపు వచ్చింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా చాన్స్‌లు వచ్చాయి. విరూపాక్ష సినిమా రవి కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత రవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల విడుదలైన దండోరాలో కీలక పాత్ర పోషించాడు. కులం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవి..తక్కువ కులానికి చెందిన యువకుడిగా నటించాడు. అగ్ర కులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడి.. ఆమె కులం వాళ్ల చేతిలో హత్యకు గురవుతాడు. సినిమా ప్రేక్షకులు రవి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందంటున్నారు రవి. దండోరా సినిమాలో మాదిరే తాను కూడా కుల వివక్షకు గురయ్యాడట. తన కులం చూసి సినిమా చాన్స్‌లు ఇవ్వలేదట. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందుల గురించి వివరించాడు. ‘మాది విజయవాడ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నా కంటే ముందు మా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇండస్ట్రీలోకి రాలేదు. నాకు సినిమాలంటే పిచ్చి. కానీ ఇండస్ట్రీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళతా అంటే..ఇంట్లో తిట్టారు. దీంతో డిగ్రీ చేసి.. సినిమాల్లోకి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలియక..చెన్నై వెళ్లాను. అక్కడ ఓ సీరియల్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశా. కొన్నాళ్ల తర్వాత వాళ్లే ఓ తెలుగు సీరియల్ చేస్తే..అందులో నటించాడు. అది మూడు నెలలకే ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉంటుందని తెలుసుకొని.. ఇక్కడకు వచ్చాడు. మా మేనత్త వాళ్ల ఇంట్లో ఉంటూ.. అవకాశాల కోసం తిరిగాను. మొగలి రేకులు సీరియల్‌కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లే..అప్పటికే పూర్తయిపోయానని చెప్పారు. వాళ్లను రిక్వెస్ట్ చేసి ఆడిషన్స్ ఇచ్చాను. అలా ఆ సీరియల్‌తో నా కెరీర్ ప్రారంభం అయింది. ఆ ఫేమ్‌తో సినిమాల్లోకి వచ్చాయి. ఇక్కడ నాకు కుల వివక్ష ఎదురైంది. కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్ చేసి.. చివరిలో నా కులం చూసి పక్కకు తప్పించారు. ఓ సినిమాకి హీరోగా సెలెక్ట్ అయ్యాను. అగ్రిమెంట్ సమయంలో నా ఆధార్ కార్డు పంపించా. అక్కడ నా కులం చూసి.. తప్పించారు. కారణం ఏంటని అడిగితే.. ఈ కథ మీకు సెట్ కాదు.. ఇంకో ప్రాజెక్ట్‌కి చూద్దాం అని చెప్పేవాళ్లు. అలా మూడు సినిమాలు అగ్రిమెంట్ వరకు వచ్చి..కులం చూసి ఆగిపోయాయి’ అని రవి చెప్పుకొచ్చాడు.
ఫ్రీగా సినిమాలు చేశా.. అడిగితే ఒక్కరు సపోర్ట్ చేయట్లేదు: సుదీప్
కన్నడ హీరో సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త పరిచయమే. ఎందుకంటే సొంత భాషలో స్టార్ అయినప్పటికీ మన దగ్గర 'ఈగ'లో ప్రతినాయకుడిగా అదరగొట్టేశాడు. తర్వాత కూడా బాహుబలి, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాల్లో అతిథి పాత్రలు పోషించాడు. టాలీవుడ్‌లోనూ కాసోకూస్తో ఫేమ్ సొంతం చేసుకున్నాడు. అయితే తను ఇలా చేస్తున్నప్పటికీ మిగతా ఇండస్ట్రీలకు చెందిన హీరోలు.. తమని సపోర్ట్ చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: 'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్)'మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదు. నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర.. మిగతా భాషల్లో అతిథి పాత్రలు చేశాం. కాకపోతే ఆయా భాషల స్టార్స్ మాత్రం కన్నడలో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. నేను అయితే ఇతర భాషల్లో చేసిన అతిథి పాత్రలకుగానూ డబ్బులే తీసుకోలేదు. వ్యక్తిగతంగా మిగతా ఇండస్ట్రీలోని పలువురు హీరోలని నా మూవీలో అతిథి పాత్రలు చేయమని అడిగా. కానీ వాళ్లు ఆసక్తి చూపించలేదు' అని సుదీప్ చెప్పుకొచ్చాడు.సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మార్క్'. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైంది. కాకపోతే డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర నిలబడటం కష్టమే అనిపిస్తుంది. తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు కానీ తర్వాత ఎందుకో వెనక్కి తగ్గారు.(ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. 'రాజాసాబ్'కి రూ.2000 కోట్లు వస్తాయి: సప్తగిరి)
'ఛాంపియన్' కలెక్షన్స్.. జోష్ పెంచిన రోషన్
క్రిస్మస్ కానుకగా విడుదలైన ఛాంపియన్ సక్సెస్‌బాటలో నడుస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీకాంత్ తనయుడు రోషన్.. ఈ మూవీతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఛాంపియన్‌లో తన నటనతో రోషన్ మంచి మార్కులు అందుకున్నారు. దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రియాంక దత్, జీకే మోహన్, జెమిని కిరణ్ నిర్మించారు. ఇందులో రోషన్ సరసన అనస్వర రాజన్, సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది తదితరులు నటించారు.కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ‘ఛాంపియన్’’ అంటూ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు రూ. 4.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. మూడురోజుల్లో రూ. 8.89 కోట్లు రాబట్టి క్రిస్మస్ విజేతగా దూసుకుపోతుంది. ఈమేరకు తాజాగా అధికారికంగా ప్రకటించారు.మహానటి, సీతారామం వంటి భారీ విజయాల తర్వాత స్వప్న దత్ నిర్మించిన ఛాంపియన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే, వారు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ పరంగా రాబట్టడం లేదు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ మూవీలో చూపించారు. హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు తెలంగాణలోని గ్రామాలు ఏ విధంగా వణికిపోయాయో ఇందులో చూపించారు.
క్రీడలు
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజానికి అరుదైన గౌరవం
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీకి (Brett Lee) అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈ స్పీడ్‌గన్ స్వదేశీ (Australia) హాల్ ఆఫ్ ఫేమర్ల (Hall Of Fame) జాబితాలోకి ప్రవేశించాడు. అత్యంత అరుదైన ఈ జాబితాలో లీ 66వ ఆటగాడిగా చేరాడు. లీకి ముందు చాలామంది ఆసీస్ దిగ్గజాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.లీకి ముందు ఇదే ఏడాది (2025) మైఖేల్ క్లార్క్, మైఖేల్ బెవాన్, క్రిస్టినా మాథ్యూస్ ఆసీస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ప్రవేశించారు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్, షేన్ వార్న్, రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు ఉన్నారు.49 ఏళ్ల లీ దశాబ్దానికిపైగా (1999-2012) తన ఫాస్ట్ బౌలింగ్‌లో ప్రపంచ బ్యాటర్లను గడగడలాడించాడు. ప్రపంచ క్రికెట్లో ఆసీస్ ఆధిపత్యం కొనసాగించడంలో కీలకపాత్ర పోషించాడు. వికెట్లు తీయడం కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన లీ.. కెరీర్లో ఎన్నో సార్లు స్పీడో మీటర్లు (బౌలింగ్ వేగాన్ని కోలిచే యంత్రం) బద్దలు కొట్టాడు.అత్యుత్తమంగా లీ గంటకు 161.1 కిమీ వేగంతో బంతిని సంధించాడు. క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన బంతిగా నేటికీ చలామణి అవుతుంది. లీ కంటే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కేవలం 0.2 వేగాన్ని అధికంగా సాధించాడు.తనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవం (ఆస్ట్రేలియా హాల్ ఆఫ్ ఫేమ్) దక్కడం పట్ల లీ సంతోషం వ్యక్తం చేశాడు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం పేస్ దిగ్గజం డెన్నిస్ లిల్లీ అని చెప్పాడు. తొమ్మిదేళ్ల వయసు నుంచి గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయాలని కలలు కన్నట్లు తెలిపాడు.
సొంత దేశ క్రికెట్ బోర్డునే కోర్టుకు లాగిన సౌతాఫ్రికా ప్లేయర్
సౌతాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషి సొంత దేశ క్రికెట్ బోర్డునే (Cricket South Africa) కోర్టుకు లాగాడు. న్యాయపోరాటంలో విజయం కూడా సాధించాడు. జోహన్నెస్‌బర్గ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో క్రికెట్ సౌతాఫ్రికాకు షాక్ తగిలినట్లైంది. కోర్టు తీర్పు మేరకు షంషికి భారీ ఊరట లభించింది.అసలేం జరిగిందంటే..?SA20 వేలంలో షంషిని ఎం కేప్‌టౌన్ ఫ్రాంఛైజీ 5 లక్షల ర్యాండ్లకు సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్‌కు షంషి నో చెప్పాడు. సమాంతరంగా ఇతర లీగ్‌లతో (ILT20, BBL) ఒప్పందాలు చేసుకున్నాడు. ఈ లీగ్‌ల్లో ఆడేందుకు షంషికి సొంత దేశ క్రికెట్ బోర్డు (CSA) అనుమతి తప్పనిసరి. ఇక్కడే షంషికి, క్రికెట్ సౌతాఫ్రికాకు వివాదం మొదలైంది.సొంత దేశ క్రికెట్ బోర్డు ఆథ్వర్యంలో జరిగే లీగ్‌ను కాదని, పరాయి దేశ లీగ్‌లు ఆడాలనుకున్న షంషికి CSA అనుమతి నిరాకరించింది. NOC ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో షంషి జోహన్నెస్‌బర్గ్ హైకోర్టును ఆశ్రయించాడు. షంషి పిటీషన్‌పై విచారణ జరిపిన కోర్టు అతనికి అనుకూలంగానే తీర్పునిచ్చింది. షంషి విదేశీ లీగ్‌ల్లో పాల్గొంనేందుకు వీలుగా NOC జారీ చేయాలని క్రికెట్ సౌతాఫ్రికాను ఆదేశించింది. కోర్డు తీర్పు మేరకు షంషి ఇకపై ఏ విదేశీ లీగ్‌ల్లో అయినా ఆడుకోవచ్చు.ఈ కేసులో క్రికెట్ సౌతాఫ్రికా కూడా తమ వాదనలు వినిపించింది. బోర్డు నిబంధనల ప్రకారం.. SA20 వేలంలో కొనుగోలు చేయబడిన ఏ ఆటగాడైనా తప్పనిసరిగా లీగ్‌లో ఆడాలి. అయితే షంషి ఈ నిబంధనను ఉల్లంఘించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే NOC ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని కోర్టును తెలిపింది.అయితే క్రికెట్ సౌతాఫ్రికా వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆటగాడి జీవనోపాధిని అడ్డుకోకూడదని మందలించింది. షంషి 2024 అక్టోబర్‌లోనే CSA సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయినా, సౌతాఫ్రికా తరఫున ఐసీసీ టోర్నీల్లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
గౌతమ్ గంభీర్‌పై వేటు.. తుది నిర్ణయం ప్రకటించిన బీసీసీఐ
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం మిశ్రమ ఫలితాలతో కూడుకొని ఉంది. అతని మార్గదర్శకత్వంలో భారత జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అదరగొడుతున్నా.. టెస్ట్‌ల్లో మాత్రం తేలిపోతుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలొ క్లీన్ స్వీప్‌తో (0-3)మొదలైన గంభీర్ టెస్ట్ ప్రస్తానం (టీమిండియా హెడ్ కోచ్‌గా).. తాజాగా స్వదేశంలోనే సౌతాఫ్రికా చేతిలో క్లీన్ స్వీప్ (0-2) వరకు సాగింది.ఈ మధ్యలో గంభీర్ మార్గదర్శకత్వంలో భారత జట్టు ఒక్క విండీస్‌పై మాత్రమే సానుకూల ఫలితం (2-0) సాధించింది. దీనికి ముందు ఆసీస్ పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోయి, ఇంగ్లండ్ పర్యటనలో డ్రాతో (2-2) గట్టెక్కింది.టెస్ట్‌ల్లో పేలవ ట్రాక్ రికార్డు కలిగి ఉండటంతో పాటు అనునిత్యం వివాదాలతో సావాసం చేసే గంభీర్‌ను టెస్ట్ జట్టు హెడ్ కోచ్ విధుల నుంచి తప్పించాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. త్వరలో గంభీర్‌పై వేటు ఖాయమని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.గంభీర్ స్థానంలో భారత టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్షణ్ ఎంపిక ఖరారైందని పలు జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేశాయి.ఇదే అంశంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. గంభీర్‌పై వేటు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. టెస్ట్ జట్టు విధుల నుంచి గంభీర్‌ను తప్పించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. గంభీర్ టెస్ట్ జట్టు కోచ్‌గా కొనసాగడానికి మద్దతు ప్రకటించారు. సైకియా చేసిన ఈ ప్రకటనతో గంభీర్ టెస్ట్ హెడ్‌కోచ్‌మెన్‌షిప్‌పై ఊహాగానాలు తొలగిపోయాయి.ముందుంది ముసళ్ల పండగప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో (2005-27) గంభీర్ మార్గదర్శకత్వంలో భారత టెస్ట్ జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది. గంభీర్ రాకకు ముందు వరుసగా రెండు డబ్ల్యూటీసీ సైకిల్స్‌లో ఫైనల్స్‌కు చేరిన టీమిండియా.. గత ఎడిషన్‌లో ఫైనల్స్‌కు చేరుకుండానే ఇంటిదారి పట్టింది. తాజా సైకిల్లో కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది. ఈ సైకిల్లో భారత్ ఇప్పటివరకు ఆడిన 9 టెస్ట్ మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ సైకిల్లో టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే ఇంకా ఆడాల్సిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు సాధించాలి. అయితే ఇలా జరగడం అంత ఈజీగా కనిపించడం లేదు. భారత్ తదుపరి ఐదు ఆస్ట్రేలియాతో, రెండు న్యూజిలాండ్‌తో ఆడాల్సిన ఉంది. మిగిలిన రెండు శ్రీలంకతో ఆడాల్సి ఉంది. శ్రీలంకపై టీమిండియా పైచేయి సాధించినా.. ఆసీస్, కివీస్‌పై గెలవడం మాత్రం అంత ఈజీగా కాదు.
పొలార్డ్ విధ్వంసం.. ప్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ILT20)లో ఎంఐ ఎమిరేట్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎంఐ ఎమిరేట్స్ ఘన విజయం సాధించింది. ఎమిరేట్స్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. డిసెంబర్ 30న జరగనున్న క్వాలిఫైయర్ 1లో 'డెజర్ట్ వైపర్స్' జట్టుతో ఎమిరేట్స్ తలపడనుంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎమిరేట్స్ బౌలర్ల ఆరంభం నుంచే ప్రత్యర్ది బ్యాటర్లకు చుక్కలు చూపించారు. స్పిన్నర్ అల్లా గజన్ఫర్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. షకీబ్, మౌస్లీ, ఫరూఖీ తలా వికెట్ సాధించారు. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో కెప్టెన్ మహ్మద్ నబీ(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.పొలార్డ్ విధ్వంసం.. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎమిరేట్స్‌కు ఓపెనర్లు మహమ్మద్ వసీం (27), ఆండ్రీ ఫ్లెచర్ (21) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఫ్లెయర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కిరాన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.అబుదాబి మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ వకార్ సలాంఖైల్కు చుక్కలు చూపించాడు. 14 ఓవర్ వేసిన సలాంఖైల్ బౌలింగ్‌లో పొలార్డ్ ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్లో కిరాన్ నాలుగు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదాడు.ఈ ఒక్క ఓవర్‌తోనే మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశాడు. ఫలితంగా 123 పరుగుల లక్ష్యాన్ని ఎమిరేట్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. పొలార్డ్ మొత్తంగా 31 బంతులు ఎదుర్కొని 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 44 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్
అభాగ్యులతో చంద్రబాబు సర్కారు చలగాటం... 19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
బిజినెస్
రతన్ టాటా అప్పుడా పని చేసుంటే..
రతన్ టాటాను (Ratan Tata) ఒక పారిశ్రామికవేత్తగా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా, అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం కాంక్షించిన వ్యక్తిగా అందరూ గుర్తుంచుకుంటారు. అందరూ పుడతారు.. కానీ కొందరే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి మనందరికీ దూరమయ్యారు. నేడు రతన్ టాటా జయంతి. ఈ సందర్భంగా ఆయన కెరియర్ ప్రస్థానం.. ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం ఈ కథనంలో..1937 డిసెంబర్ 28న జన్మించిన రతన్ టాటా నాయకత్వం, సమగ్రతకు ప్రతిరూపంగా ఎదిగారు. నాణ్యత, సామాజిక బాధ్యత, నైతిక విలువలకు కట్టుబడి ఉంటూనే టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయి వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన రతన్ టాటా జీవన ప్రయాణం సంకల్పం, క్రమశిక్షణ, ప్రేరణలతో నిండినది.టాటా గ్రూప్‌లో తొలి అడుగులుకార్నెల్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, 1961లో రతన్ టాటా టాటా గ్రూప్‌లో జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM) నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అయితే తన ప్రతిభను విదేశీ సంస్థకు ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. దీంతో ఆ అవకాశాన్ని వదులుకుని టాటా స్టీల్‌లో కొనసాగారు. ఆయన నాయకత్వంలో సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. అప్పుడాయన ఆ ఉద్యోగంలో చేరిపోయి ఉంటే ఇప్పుడున్న ‘టాటా’ ఎలా ఉండేదో..టాటా గ్రూప్ పగ్గాలు1991లో జేఆర్డీ టాటా తర్వాత రతన్ టాటా టాటా సన్స్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆరోగ్య సమస్యల కారణంగా జేఆర్డీ టాటా సంస్థ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. రతన్ టాటా పదవీకాలంలో టాటా గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. టెట్లీ (2000), కోరస్ స్టీల్ (2007), జాగ్వార్ ల్యాండ్ రోవర్ (2008) వంటి అంతర్జాతీయ సంస్థల కొనుగోళ్లతో టాటా గ్రూప్ గ్లోబల్ బిజినెస్ పవర్‌హౌస్‌గా మారింది.ఇక్కడో విషయం చెప్పుకోవాలి.. ఒకానొక సమయంలో టాటామోటర్స్ ప్యాసింజర్ కార్ల విభాగాన్ని అమ్మేద్దాం అనుకున్నారు. అమెరికా ఆటోమొబైల్స్ సంస్థ ఫోర్డ్.. ఈ విభాగాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. చర్చల సందర్భంగా ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లు టాటాను "మీరు కార్ల వ్యాపారంలోకి ఎందుకు వచ్చారు? దాని గురించి మీకు ఏమీ తెలియదు. మేము మీ కార్ల విభాగాన్ని కొనుగోలు చేస్తే అది మీకు చాలా మేలు చేసినట్లవుతుంది" అని వారిలో ఒకరు ఎగతాళి చేశారు. దీంతో ఆ డీల్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు టాటా. తర్వాత ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఫోర్డ్.. దాని లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను అమ్మకానికి పెట్టగా టాటానే కొనుగోలు చేశారు. టాటాకు ఫోర్డ్ చేసిన అవమానానికి ఇలా ప్రతీకారం తీరిందన్నమాట.పురస్కారాలు2012లో టాటా సన్స్ ఛైర్మన్ పదవికి వీడ్కోలు పలికిన రతన్ టాటా, 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ వంటి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా, మానవతావాదిగా, విలువల ప్రతీకగా గుర్తింపు పొందిన రతన్ టాటా 86వ ఏట 2024 అక్టోబర్ 9న ఈ లోకాన్ని వీడినా ఆయన పంచిన స్ఫూర్తి కొనసాగుతోంది.
రెనో కారు.. ఇక మరింత రేటు
రెనో ఇండియా తన వాహన ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. జనవరి నుంచి కార్ల ధరలను 2% మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ‘‘పెరిగిపోతున్న ముడి సరుకు వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ధరలు పెంచక తప్పలేదు. ధరలు పెంచినప్పట్టకీ.., కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులు, అత్యున్నత సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటాము’’ అని వివరణ ఇచ్చింది. ఇప్పటికే యూరో మారకంలో రూపాయి క్షీణత కారణంగా మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి సంస్థలు సైతం వచ్చే నెల నుంచి వాహన ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ ధరల పెంపు వల్ల ఎంట్రీ-లెవల్ కార్ల నుంచి ఎస్‌యూవీల వరకు స్వల్పంగా అయినా భారం పెరగనుంది. ముఖ్యంగా క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లపై ధరల ప్రభావం ఉంటుందని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ధరలు పెరగనున్న నేపథ్యంలో, డిసెంబర్ నెలలో వాహన కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి చూపే అవకాశం ఉందని డీలర్లు భావిస్తున్నారు. పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.మరోవైపు ఆటోమొబైల్ రంగం మొత్తం వ్యయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముడి సరుకుల ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఇందుకు కారణంగా మారుతున్నాయి. దీంతో ఇతర కార్ల తయారీ సంస్థలు కూడా దశలవారీగా ధరల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కంపెనీలు ధరలతో పాటు కొత్త ఫీచర్లు, భద్రతా ప్రమాణాలు, మెరుగైన సర్వీస్ ప్యాకేజీలపై దృష్టి పెడుతున్నాయి. దీంతో వినియోగదారులకు ధరల పెంపు ఉన్నప్పటికీ విలువైన ఆఫర్లు లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
చిన్న అపార్ట్మెంట్.. ఇరుకు ఇళ్లకు ఇలాంటి డోర్లే బెస్ట్!
ఇంటికొచ్చే అతిథులకు తలుపులు స్వాగతం పలుకుతాయి. అందుకే ప్రధాన ద్వారం వద్ద తలుపుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అడుగు స్థలం కూడా ఖరీదైన మహానగరంలో వెడల్పాటి తలుపుల స్థానంలో స్థలాన్ని ఆదా చేసే డోర్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్లైడింగ్, ఓపెన్, ఫోల్డింగ్ డోర్స్ జోరు మార్కెట్లో కొనసాగుతోంది. విభిన్న రంగులు, డిజైన్లతో లభ్యమవుతుండటంతో యువ కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. మధ్యలో మడతపెట్టి.. సాధారణ తలుపుల మాదిరిగా కాకుండా తక్కువ స్థలంలో, మడతపెట్టే వీలుగా ఉండటమే ఈ డోర్స్ ప్రత్యేకత. వీటిని కలప, అల్యూమీనియంతో తయారు చేస్తారు. తలుపులు తెరిచినప్పుడు మధ్యలో 1/2 లేదా 1/3 లేదా 2/3 నిష్పత్తిలో మడత పడుతుంది. వీటినే ఫోల్డింగ్ డోర్స్ అంటారు. రెండు ప్యానెల్స్ సమాన పరిమాణంలో ఉండొచ్చు లేదా అసమాన పరిమాణంలో ఒక ప్యానెల్ కంటే మరోటి వెడల్పుగా కూడా ఉండొచ్చు. ఎలా ఉన్నా ఒకవైపు తిరగానికి, మధ్యలో ఫోల్డ్ కావడానికి వీలుగా స్క్రూలను అమరుస్తారు. కస్టమర్ల అభిరుచి, అవసరాలను బట్టి తలుపులు ఎడమ లేదా కుడి వైపునకు తెరుచుకుంటాయి. ఈ ఫోల్డింగ్, స్లైడింగ్ డోర్స్‌కు అద్దాలను జోడించి మరింత అందంగా తయారు చేస్తున్నారు.గాలి, వెలుతురు సులువుగా.. చిన్న సైజు అపార్ట్మెంట్లకు, తక్కువ స్థలంలో నిర్మించే వ్యక్తిగత గృహాలకు ఈ తరహా తలుపులు బాగుంటాయి. ప్రధాన ద్వారం వద్ద కాకుండా ఇతర గదులకు ఈ డోర్స్ ఏర్పాటు చేసుకుంటే ఇల్లు అందంగా కనిపించడంతో పాటు వంద శాతం స్థలం వినియోగం అవుతుంది. అలాగే కప్బోర్డ్లు, వార్డ్ రోబ్‌లు, కారిడార్లు, వంటగది, బాత్రూమ్లు ఇతర యూటిలిటీ ప్రాంతాలలో ఈ ఫోల్డింగ్, స్లైడింగ్ డోర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. పైగా వీటిని ఇన్స్టాల్ చేయడం చాలా సులువు. నిర్వహణ కూడా తేలిక. ఫోల్డింగ్, స్లైడింగ్ డోర్స్‌తో ఒక గది నుంచి మరో గదిలోకి గాలి, వెలుతురు సులువుగా ప్రసరిస్తుంది.కర్టెన్ ఉందిగా.. ఇంట్లో వెచ్చగా.. నగరంలో రోజురోజుకూ చలి పెరుగుతోంది.. ఉదయం నుంచే ఇంట్లోంచి బయటకు రావాలంటే గజగజలాడాల్సిందే.. సాయంత్రమైతే శీతల గాలులు వణికిస్తున్నాయి. ఈ చలికాలంలోనూ ఇంటి లోపలి వాతావరణం వెచ్చగా ఉండాలంటే కిటికీలకు ఉండే కర్టెన్లే కీలకమని అంటున్నారు కర్టెన్ ఇంటీరియర్ డిజైనర్లు. అయితే వాటిలోని రకం, రంగులను బట్టి ఇంటి లోపలి వాతావరణం గడ్డకట్టే చలిలోనూ వెచ్చగా ఉంటుందని చెబుతున్నారు.ఈ కాలంలో కర్టెన్లకు పలుచటి, కాటన్, లెనిన్ కర్టెన్లు కాకుండా మందంగా లేదా థర్మల్ కర్టెన్లను వెల్వెట్, ఉన్ని, స్వెడ్ లేదా థర్మల్ లైన్డ్, బ్లాక్అవుట్ కర్టెన్లను వినియోగించడం ఉత్తమం. ఇంటి లోపల వేడి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో కర్టెన్ల రంగులు కూడా కీలకమే. ఎరుపు, నారింజ, పసుపు వంటి రంగులకు వేడిని గ్రహించే గుణం ఉంటుంది కాబట్టి శీతాకాలంలో ఇంటి లోపల వెచ్చగా ఉంచుతాయి.
బంగారం ధరలు.. ఒక్క రోజూ తగ్గలేదు!
దేశంలో బంగారం, వెండి ధరలు గత వారం చుక్కలు చూపించాయి. వారంలో ఒక్క రోజూ తగ్గకుండా వరుసగా భారీ పెరుగుదలను నమోదు చేస్తూ వచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన ఏడు రోజుల్లో పసిడి, వెండి ధరలు పెరిగిన తీరు తెన్నుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.బంగారం ధరలు24 క్యారెట్ బంగారం తులం (10గ్రాములు) ధర డిసెంబర్ 21న రూ.1,34,180 ఉండగా సరిగ్గా వారం తిరిగేసరికి డిసెంబర్ 28 నాటికి రూ.1,41,220 లకు చేరింది. అంటే వారంలో ఏకంగా రూ.7,040 ఎగిసింది.ఇక 22 క్యారెట్ బంగారం విషయానికి వస్తే.. డిసెంబర్ 21న రూ.1,23,000 ఉన్న తులం ధర డిసెంబర్ 28 నాటికి రూ.1,29,450 లకు చేరింది. అంటే వారంలో రూ.6,450 పెరిగింది.వెండి ధరలుగత వారం వెండి ధరల పెరుగుల వేగం బంగారాన్ని మించిపోయింది. డిసెంబర్ 21న రూ.2,26,000 ఉన్న కేజీ వెండి ధర డిసెంబర్ 28 నాటికి రూ.2,74,000లను తాకింది. మొత్తంగా ఏడు రోజుల్లో రూ.48,000 దూసుకెళ్లింది.పెరుగుదలకు కారణాలివే..అంతర్జాతీయ పరిస్థితులు: అమెరికా వడ్డీ రేట్ల తగ్గుదల, గ్లోబల్ ఆర్థిక అస్థిరతలుసేఫ్‑హేవెన్ డిమాండ్: పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెంచారుఎంసీఎక్స్/కామెక్స్ ధరల ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్ రేట్లు దేశీయ ధరలను నేరుగా ప్రభావితం చేశాయి.దేశీయ వినియోగం, కొనుగోలు:భవిష్యత్తు అవసరాల కోసం స్థానిక కొనుగోలు పెరగడం.ఇది చదివారా? వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
ఫ్యామిలీ
ఫ్యాషన్ ఫార్వర్డ్.. జెండర్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ..
టైమ్‌లెస్ ఇండియన్ గార్మెంట్‌గా పేరున్న చీరకు యువతరం కొత్త లుక్ ఇస్తోంది. ప్రీ–డ్రేప్డ్ శారీస్, డెనిమ్–ఇన్ఫ్యూజ్డ్ ఫ్యాబ్రిక్స్, బాంబర్ జాకెట్లతో జత చేసే చీరలు... మొదలైనవి యువతరం ఫ్యాషన్‌లో కొన్ని. సంప్రదాయం, సమకాలీన నైపుణ్యాలను మిశ్రమం చేసిన ట్రెండ్ ఇది.సంప్రదాయ దుస్తులతో జత చేసిన కోర్సెట్లు ఆకట్టుకుంటున్నాయి. కుర్తాలతో జత చేసిన డెనిమ్ కోర్సెట్ నుండి షరారాలపై ధరించే ఎంబ్రాయిడరీ డిజైన్ల వరకు... ఈ ట్రెండ్ మోడ్రన్ ఇండియన్ ఫ్యాషన్ క్రియేటివిటీకి అద్దం పడుతుంది.‘హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ మోడ్రన్ సిల్హవుటీ’ ట్రెండ్ మొదలైంది. ఖాదీ, ఇకత్, లినెన్లాంటి చేనేత వస్త్రాలను జంప్సూట్లు, వోవర్సైజ్డ్ కోట్స్, కో–ఆర్డర్ సెట్స్‌గా రూపొందించే ధోరణి పెరిగింది. ఈ ట్రెండ్ స్థానిక కళాకారులకు వృత్తిపరంగా సహాయపడుతోంది. ఎకో–ఫ్రెండ్లీ (Eco Friendly) ఛాయిసెస్‌గా యువతరానికి అవకాశం కల్పిస్తోంది.సంప్రదాయ జెండర్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ న్యూట్రల్–కలర్డ్ కుర్తాలు, పఠానీ సూట్స్, యునీసెక్స్ ధోతీలు యువతరంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. సెల్ఫ్–ఎక్స్ప్రెషన్స్కు అవకాశం ఇస్తున్నాయి.చదవండి: లేత రంగుల లేటెస్ట్ చీరల ట్రెండ్ఇంజినీరింగ్ వైపు మ్యూజిక్ స్టూడెంట్స్ మొగ్గువిద్యలు వేటికవి విడి విడి ద్వీపాలు కావు. అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... ఇంజినీరింగ్ స్టూడెంట్స్ (Engineering Students) మ్యూజిక్‌పై ఆసక్తి ప్రదర్శించడం. మ్యూజిక్ స్టూడెంట్స్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి చూపడం. సంగీత నేపథ్యం ఉన్న విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని ఐఐటీ, మద్రాస్ డైరెక్టర్ప్రొఫెసర్ వి.కామకోటి అన్నారు. మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. ఐఐటీ, మద్రాస్‌లో ‘ఇళయరాజా సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ మ్యూజిక్’ ఏర్పాటు చేయడం ద్వారా కళలతో, ఇంజినీరింగ్ విద్యను అనుసంధానించే పనికి శ్రీకారం చుట్టారు.
నా కంటే వీధికుక్కలే ఎక్కువంట!.. ఓ భర్త ఆవేదన వైరల్
‘ఒకప్పుడు దంపతులు కలిసి ఉండటానికి రాజీ కుదర్చాల్సిన పరిస్థితులు కనిపించేవి. ఇప్పుడు జంటలు విడిపోవడానికి అధిక శాతం రాజీ పడుతున్నారు’ అంటున్నారు న్యాయ నిపుణులు. అంతేకాదు, చిన్న చిన్న విషయాలు భూతద్దంలో చూసి,విడాకులకువచ్చేవారి సంఖ్య పెరుగుతోంది అంటున్నారు. భార్య కుక్కలు పెంచుతోందని భర్త విడాకులకు వెళ్లడం, బ్యూటీ పార్లర్ ఖర్చు కోసం భరణం ఎక్కువ ఇవ్వాలని భార్య తిరిగి కోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ ఇప్పుడు పెద్ద సమస్యలే అయ్యాయని అంటున్నారు. వైవాహిక బంధంలో వస్తున్న ఈ పెనుమార్పులు రాబోయే కాలానికి ఈ యేడాది చెబుతున్న కొత్త భాష్యం.. ‘‘ఈ యేడాది న్యాయపరంగా చూస్తే విడాకుల సంఖ్య బాగా పెరిగింది. సెక్షన్ 490ఎ కింద వరకట్న కేసులు కోర్టులలో చాలా సులువుగా వీగిపోతున్నాయి. ఇప్పుడు జాతీయ లోక్ అదాలత్‌లో చాలావరకు ఈ కేసులను నిర్వహిస్తున్నారు. ఇరువైపుల వాళ్లు ఈ విషయంలో రాజీ కుదుర్చుకొని, డబ్బు విషయాలలో ఒక ఒప్పందానికి వచ్చి, త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. దీని వల్ల కోర్టులకు పనిభారం కూడా తగ్గింది’’ అంటున్నారు న్యాయనిపుణులు ఈమని పార్వతి.సమయానికే ప్రాధాన్యతచిన్న వయసు జంటలు విడాకులకు లాయర్లను సంప్రదించే వారి శాతం బాగా పెరిగింది. దంపతులలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరిలోనూ ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ గ్యాప్‌ని పూరించడానికి చాలా సమయం పట్టవచ్చు. సమయం వృథా అయ్యేలా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశాలు తగ్గుతాయి అనుకుంటున్నారు. డబ్బు, సమయం, పనులు మానేసి కోర్టుల చుట్టూ తిరగడం.. నవతరానికి నచ్చడం లేదు. అందుకే విడాకులు తీసుకునే సందర్భంలో డబ్బు పంపకాలలో ఒక కచ్చితమైన ధోరణి ఉండేది. ఉదాహరణకు... ఒక విడాకుల కేసులో అమ్మాయి తనకు పది లక్షలు ఇవ్వాలని ముందు పంతం పట్టినా రెండు మూడు సిట్టింగ్‌లలో 5–6 లక్షలకు రాజీకి వచ్చేస్తుంది.విడాకులకు ఏదైనా కారణమే...!ఇంత చిన్న విషయానికే బంధాన్ని విడగొట్టుకుంటారా అనిపించే హాస్యాస్పదమైన కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. ఉదాహరణకి.. ‘ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకొచ్చి, వాటికి ఆహారం పెడుతూ, వాటితో ఆడుతూ–పాడుతూ ఆనందంగా ఉంటోంది. దీంతో ఖర్చు ఎక్కువైపోయింది, ఆ వాసన భరించలేకపోతున్నాను అని ఆ భర్త ‘నా భార్య నన్ను మానసికంగా టార్చర్ చేస్తుంది, విడాకులు కావాలని’ కోర్టును ఆశ్రయించాడు. అది సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అతని ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతోందని ఆమెను హెచ్చరించిన కోర్టు విడాకులు మంజూరు చేయడానికి ఇంకాస్త టైమ్ ఇచ్చింది. ఒక కేసులో జంటలో ఒకరు మాంసాహారులు, మరొకరు శాకాహారులు. తమ భాగస్వామి నుంచి వచ్చే ఉల్లి, వెల్లుల్లి వాసన నచ్చడం లేదు. ఈ కారణంగా విడాకులకు అప్లై చేశారు. అస్తమానం ల్యాప్‌ట్యాప్ ముందు కూర్చొని తనను పట్టించుకోవడం లేదని మరొక కేసు ఫైల్ అయ్యింది. ఇలాంటివన్నీ క్రూయల్టీ కింద అంటే మానసిక వేదనకు కారణం అవుతుందనే విషయంగా ఆలోచిస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐ కేసు విషయంలో... భర్త అమెరికాలో ఉన్నాడు, భార్య ఇండియాకు వచ్చింది. ఆమె తిరిగి వెళ్లడం లేదు. ఆ భర్త అమెరికా నుంచి కేసు ఫైల్ చేశాడు భార్య తిరిగి రావాలని. ఆమెకు ఇష్టం లేక ‘క్రూయల్టీ అమౌంట్’ అనే విషయం మీద కేసు వేసింది. అదేమింటంటే, భర్త తాను పంపే డబ్బుకు ప్రతీ పైసాకు లెక్క అడుగుతున్నాడనేది ఆమె అభియోగం. అతనిపైన క్రిమినల్ కేసు నమోదయ్యింది. హైకోర్టులో కూడా అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో అతను సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు. సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. విడాకులు తీసుకున్న ఒకామె భరణం పెంచాలని కోర్టును ఆశ్రయించింది. ఆమె చెప్పిన విషయాలు.. బ్యూటీ΄ార్లర్కు వెళ్లడానికి, షాపింగ్ చేయడానికి డబ్బులు సరిపోవడం లేదని కేసు ఫైల్ చేసింది.సర్దుబాటు «ధోరణి దంపతుల్లో లోపించడం, డబ్బులు, ఇతరుల పట్ల ఆకర్షణ, అవసరాలు పెరగడంతో బంధాలు చాలా సులువుగా విచ్ఛిన్నమవుతున్నాయి. బంధాలు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తేనే అవి మనుగడ సాధిస్తాయి. విడిపోవడానికి రాజీ చేసుకునేవాళ్లు, కలిసుండే విషయంలో ప్రయత్నిస్తే దాంపత్య జీవనం సామాజికంగానూ పటిష్టంగా ఉంటుంది. పిల్లలు ఉన్నా.. ఒత్తిడి లేదు..విడాకులు తీసుకోవాలనుకున్న జంటలకు పిల్లలు ఉంటే, వారిపై తమ ప్రభావం ఏ విధంగా ఉంటుందో అనే ఒత్తిడి ఈ రోజుల్లో లేదు. ఇరువైపుల ఇద్దరికీ తల్లిదండ్రులు ఉంటున్నారు. వారు కూడా సంతానం నిర్ణయాన్నే ఆమోదిస్తున్నారు. విడాకులు తీసుకున్న జంటలకు పిల్లల కస్టడీ గురించి పెద్ద సమస్యలు లేవు. విజిటింగ్ రైట్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎవరికి వారు తమ వ్యక్తిగత జీవితం చూసుకుంటూ, తమ పిల్లల విషయంలో సమాన బాధ్యతలు నిర్వర్తించేందుకు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన సహజీవనాలు2022లో దీపక్ శర్మ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వివాహేతర సంబంధాలలో సమాజం ప్రకారం అనైతికం కానీ, చట్టరీత్యా శిక్ష పడేటటువంటి నేరం కాదు అనేది వచ్చింది. అయితే, అందరి విషయాల్లో కాదు, కొన్ని సందర్భాలలో మాత్రమే అని కూడా చె΄్పారు. కానీ, చట్టాన్ని ఒక సాకుగా చూపుతున్నారు. లివింగ్ రిలేషన్ కూడా పెరిగింది. సమస్య వచ్చినప్పుడు కోర్టును ఆశ్రయిస్తున్నారు. దూరం అయినప్పుడు లైంగిక హింస, రేప్ వంటి కేసులు వస్తున్నాయి. ఇద్దరు ఒక ఇష్టప్రకారం ఉండి, ఎవరో ఒకరికి నష్టం జరిగినప్పుడు తట్టుకోలేక కేసులు ఫైల్ అవుతున్నాయి. అయితే, ఈ కేసులు అంతగా నిలబడటం లేదు.
న్యూ ఇయర్ ట్రీట్.. నేచర్ టచ్..
హైదరాబాద్ నగరం ఎప్పుడూ కొత్త ట్రెండ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఇందులో భాగంగానే మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న స్ట్రెస్, వేగవంతమైన సిటీ లైఫ్ మధ్య నగరవాసులు ఇప్పుడు సెలబ్రేషన్స్‌కే కొత్త అర్థం ఇస్తున్నారు. ముఖ్యంగా 2025కి బైబై.. చెప్పే ఇయర్ ఎండ్ వేడుకలను ఈసారి సరికొత్త కోణంలో జరుపుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోలా లౌడ్ మ్యూజిక్, పబ్బులు, డీజే నైట్స్, భారీ జన సమీకరణతో సందడిగా కాకుండా ప్రశాంతతకే ప్రధాన్యం ఇస్తూ.. థీమాటిక్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తున్నారు. సాధారణంగా న్యూ ఇయర్ అంటే నగరంలోని స్టార్ హోటల్స్, పబ్బులు, ఓపెన్ ఎయిర్ కాన్సర్ట్‌లు, రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, హడావుడి వాతావరణం గుర్తుకొస్తాయి. కానీ ఈసారి మాత్రం చాలా మంది నగరవాసులు ఈ రద్దీకి దూరంగా ప్రకృతి ఒడిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కుటుంబంతోనో, సన్నిహితులతోనో, మిత్రులతోనో కలిసి నిశ్శబ్దంగా, ఆహ్లాదకరంగా కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలన్న ఆలోచన పెరుగుతోంది. హోమ్ స్టైల్.. పక్కా లోకల్.. ఫుడ్ విషయంలోనూ ఈసారి ట్రెండ్ మారుతోంది. హెవీ బఫేలు, ఫాస్ట్ ఫుడ్ కంటే ఆర్గానిక్, లోకల్ వంటకాలు, హోమ్‌స్టైల్ మెనూకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని రిసార్టుల్లో ఫాం–టు–టేబుల్ కాన్సెప్్ట్స అమలు చేస్తూ, అక్కడే పండిన కూరగాయలతో వంటకాలు అందిస్తున్నారు. డ్రింక్స్ విషయంలోనూ లిమిటెడ్, సాఫ్ట్ సెలబ్రేషన్స్‌కే ఓటు వేస్తున్నారు. లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం ఒక ట్రెండ్ మాత్రమే కాకుండా, నగరవాసుల్లో పెరుగుతున్న మెంటల్ హెల్త్ అవగాహనకు సూచికగా భావిస్తున్నారు. ఏడాది పొడవునా పని ఒత్తిడి, ట్రాఫిక్, డిజిటల్ లైఫ్ మధ్య గడిపిన ప్రజలుం ఏడాది చివర్లో కనీసం రెండు రోజులు ప్రకృతితో కనెక్ట్ కావాలన్న కోరికతో ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.రష్ కంటే రిలాక్సేషన్ ఉత్తమం.. యువత ఈసారి న్యూ ఇయర్‌ను పూర్తి స్థాయి అనుభూతిని ఆస్వాదించాలనే తలంపుతో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్ గ్రూప్‌లుగా విడిపోయి ప్రైవేట్ ఫామ్ హౌస్‌లు/అగ్రీ క్యాంప్స్ బుక్ చేసుకుని మ్యూజిక్, క్యాంప్ ఫైర్, బార్బిక్యూ, ట్రెక్కింగ్ వంటి యాక్టివిటీస్‌తో సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. సొంత ఫామ్ హౌస్‌లు ఉన్నవారు మాత్రం పరిమిత అతిథులతో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తూ హోమ్ స్టైల్ గ్యాదరింగ్స్ నిర్వహిస్తున్నారు. సినిమా రంగానికి చెందిన వారు పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా నేచర్ రిసార్టులు, ప్రైవేట్ విల్లాల్లో ప్రశాంతంగా వేడుకలు జరుపుతుండగా, వ్యాపారస్థులు రిలాక్సేషన్‌తో పాటు నెట్వర్కింగ్ కలిసిన ఎక్స్‌క్లూజివ్ గెట్ టు గెదర్లను ఎంచుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ తమ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టు న్యూఇయర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి, హైదరాబాద్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రశాంతతను, ప్రకృతి అనుభూతులను, రిలాక్సేషన్‌ను ఎంచుకుంటున్నారు. 2025కి బై బై చెప్పే ఈ ప్రయాణంలో నగరవాసులు ప్రకృతితో చేతులు కలిపి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నారు. ఇది హైదరాబాద్ లైఫ్ స్టైల్లో కనిపిస్తున్న ఒక అందమైన మార్పు అని చెప్పవచ్చు. నేచర్ థీమ్.. బెస్ట్ స్పాట్..ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈసారి ట్రెక్కింగ్ ఉన్న నేచర్ స్పాట్స్‌కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. న్యూ ఇయర్ డే ఉదయం ట్రెక్కింగ్ చేసి, ప్రకృతితో కలిసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలన్న ఆలోచన యువతను భారీగా ఆకర్షిస్తోంది. వికారాబాద్ అడవులు, షామీర్పేట్ పరిసర ప్రాంతాలు, నగరానికి సమీపంలోని హిల్ స్టేషన్స్ ఉన్న ప్రాంతాలతో పాటు అగ్రీ బేస్డ్ క్యాంప్స్కు మంచి ఆదరణ లభిస్తోంది.
పిల్లలూ ప్రపంచమూ
బై బై 2025... వెల్కమ్ 2026. మరో నాలుగు రోజుల్లో అందరూ ఇదే అనబోతున్నారు. న్యూ ఇయర్లో చేయాల్సిన పనులు, అందుకోవాల్సిన విజయాల గురించి ఆరాటపడుతున్నారు. ఈ పెద్దల ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మరి పిల్లలూ... మన సంగతి? 2025 ఘటనలు, పరిణామాలు మనకు ఏం చెప్పాయి? ఎలా స్ఫూర్తినిచ్చాయి? ఏం నేర్పాయి? ఏమి హెచ్చరికలు చేశాయి? ఒకసారి అలా ఒక రౌండేసి చూద్దామా?వీరే మన ఇన్స్పిరేషన్2025లో మెరిసిన తారలు బాలల్లో ఉన్నారు. బాలలకు స్ఫూర్తినిచ్చేలా వార్తల్లో నిలిచినవారూ ఉన్నారు.టైమ్ పత్రిక ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ అమెరికన్ టీనేజర్ తేజస్వి మనోజ్ ప్రోగ్రామర్‌గా, వెబ్సైట్ డెవలపర్‌గా వార్తల్లో నిలిచింది. కాలిఫోర్నియాలో జన్మించిన తేజస్వి టెక్సాస్‌లో పెరిగింది. సైబర్ నేరాల నుండి వృద్ధులను రక్షించడానికి ఒక యాప్‌ను కనిపెట్టింది. ఆమె చొరవకు 2025లో టైమ్ పత్రిక వారి ’కిడ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది. ఆమె ఫ్రిస్కోలోని లెబనాన్ ట్రైల్ హైస్కూల్లో చదువుకుంటోంది.‘సర్కాడియావి’ యాప్..ఎన్ ఆర్ఐ విద్యార్థి అయిన సిద్ధార్థ్ నంద్యాలకు 14ఏళ్లు. అంత చిన్న వయసులోనే గుండె జబ్బులను గుర్తించడానికి ఏఐను ఉపయోగించి ‘సర్కాడియావి’ అనే యాప్‌ను అభివృద్ధి చేశాడు. సిద్ధార్థ్ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న రాష్ట్రనేతలు అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ యాప్ ద్వారా గుండె జబ్బులను నియంత్రించడంతో పాటు మరణాలను అరికట్టవచ్చు.గుకేష్... ది గ్రాండ్‌మాస్టర్..2025లో భారతీయ చదరంగంలో డి.గుకేశ్ పేరు మారుమోగింది. 2025లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా మారి, ఆ తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. గుకేశ్ తన ఆట శైలికి, ఆత్మవిశ్వాసానికి ప్రసిద్ధి చెందాడు. కష్టపడితే కలలెలా నిజమవుతాయో చెప్పడానికి అతను నిదర్శనంగా మారాడు. గుకేష్ చాలా మంది పిల్లలకు నేడు ఐడెల్గా కనిపిస్తున్నాడు.క్రికెట్ స్టార్... వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రికెట్లో దూసుకు΄ోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. జనవరి 2024లో అరంగేట్రం చేసి ఇండియన్ లిస్ట్ ఏలో కెరీర్ మొదలుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా పేరుపొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్నవయసు ఆటగాడిగా మారాడు. ఇటీవల రాష్ట్రపతి భవన్ లో వైభవ్ సూర్యవంశీకి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందజేశారు.2025ల పిల్లలూ.. పరిణామాలుసోషల్ మీడియా ఈ ఏడాది జరిగిన పరిశోధనల్లో సోషల్ మీడియా ప్రభావం చిన్నారులపైనా పడుతోందని గుర్తించారు. చాలామంది తల్లిదండ్రులు తమ 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఎలా వాడుతున్నారు, ఎందుకోసం వాడుతున్నారనేది గమనించడం లేదు. అయితే కొందరు చిన్నారులు అనైతిక చర్యల కోసం సోషల్ మీడియాను వాడుతున్నారని, మరికొందరు మానసిక సంబంధిత సమస్యలకు గురవుతున్నారని తేలడంతో ఆస్ట్రేలియా ఇటీవల చిన్నారుల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. తమ పిల్లలకు డిజిటల్ వ్యవహారజ్ఞానం అందించాలని అనుకోవడం మంచిదే కానీ, దానిపైనా పెద్దల అజమాయిషీ అవసరం అని 2025లో నిపుణులు తేల్చారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్2025లో ఏఐ బలంగా దూసుకు΄ోయింది. రాబోయే కాలంలో దీని ప్రభావం మరింత పెరుగనుంది. ఈ నేపథ్యంలో పిల్లల హక్కులపై దాని ప్రభావం తప్పకుండా పడుతుందని నిపుణులు అంటున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఏఐ మీద నమ్మకంతో అన్ని విషయాలు దాంతో పంచుకుంటున్నారు. కొందరు తమ ఆస్తిపాస్తుల వివరాలు, తమ వ్యక్తిగత విషయాలు, తన లైంగికేచ్ఛలు కూడా వాటితో చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరితనం నుంచి వారు దూరమవడానికి చేసే క్రమంలో జరుగుతున్న పరిణామం ఇది. దీనివల్ల దీర్ఘకాలికంగా చాలా నష్టాలు ఉన్నాయనేది నిపుణుల మాట. ముఖ్యంగా పిల్లలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకొని, కేవలం ఏఐతోనే అనుబంధం పెంచుకోవడం భారీ ముప్పుగా మారుతుందని అంటున్నారు.రికార్డ్స్ కామిక్ పుస్తకం ఖరీదు రూ.81.8 కోట్లు2025 నవంబర్‌లో అత్యంత అరుదైన ఓ కామిక్ పుస్తకం 9.12 మిలియన్ డాలర్ల (రూ.81.8 కోట్ల)కు అమ్ముడు΄ోయింది. సూపర్‌మ్యాన్ కథలుండే ‘సూపర్‌మ్యాన్’ కామిక్ పుస్తకాల శ్రేణిలో ఇది మొదటి సంచిక. ఒక అటకపై కనుగొన్న ఈ పుస్తకాన్ని ఆ ఇంటివారు వేలం వేయగా ఇంత భారీ ధర పలికింది. ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కామిక్ పుస్తకంగా నిలిచింది.80 ఏళ్ల వయసు ఐరన్ మ్యాన్అక్టోబర్ 11న, 2025 ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయాథ్లాన్ లో 1,600 మందికి పైగా అథ్లెట్లు ఈత కొట్టారు. అనంతరం వారు 100 మైళ్లకు పైగా సైకిల్ తొక్కారు. ఆ తర్వాత ఒక మారథాన్ పరుగును పూర్తి చేశారు. ఇందులో 80 ఏళ్ల నటాలీ గ్రాబో ఈ మొత్తం రేసును పూర్తి చేశారు. ఈ ΄ోటీని పూర్తి చేసిన అత్యంత వృద్ధ మహిళగా రికార్డు సృష్టించింది.ఓటీటీ స్పెషల్ ‘అడాలసెన్స్’ సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్2025లో విడుదలైన ‘అడాలసెన్స్’ సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్ అనేకమందికి కనువిప్పుగా మారింది. 13 ఏళ్ల పిల్లాడు తన పాఠశాలలో ఒక అమ్మాయి హత్య చేసి అరెస్టయిన ఉదంతం ఇందులోని కథ. కథంతా అతని చుట్టూ, అతని ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌ను ఒకే టేక్‌లో చిత్రీకరించడం విశేషం. మార్చి 13, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ విడుదలైంది.వాతావరణంలో మార్పులు..వాతావరణ మార్పు పిల్లల భవిష్యత్తుకు అత్యంత తీవ్రమైన ముప్పుగా మారుతోందని 2025 హెచ్చరించింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం వల్ల ఆహార అభద్రత ఏర్పడి ఆరోగ్య సంక్షోభాలు లక్షలాది మంది పిల్లల భవితను ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. అందుకే 2025లో పలు దేశాల్లో చిన్నారులు బృందాలుగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కోసం తమ వాణి వినిపించారు. భూమిని కాపాడాలని, తమ భవితకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలని కోరారు. 2026 నుంచి ప్రపంచమంతా ఈ విషయంపై బలమైన దృక్పథం ఏర్పరచుకోవాలని నిపుణులు అంటున్నారు.ఆరోగ్యంపిల్లలకు తినడానికి ఆహారం ఇచ్చి స్కూళ్లకు పంపితే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అయితే శ్రమ లేని జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆటపాటలకు దూరమవడం, రసాయనిక ఆహార పదార్థాలు, వేళ కాని వేళల్లో నిద్ర వంటి అంశాలన్నీ కలిసి చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ఊబకాయం రేట్లు ఒకపక్క, ప్రపంచ ΄ోషకాహార లోపం మరో పక్క 2025ను ఆందోళనకు గురి చేశాయి. ఈ ప్రభావం చిన్నారుల మీద వెంటనే పడక΄ోయినా, రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితిని తేనుందని నిపుణులు అంటున్నారు. జంక్ ఫుడ్ ఉత్పత్తులను చిన్నారుల దాకా చేరకుండా అడ్డుకోవడం తల్లిదండ్రులకు సవాలే అని తేల్చారు.బాల కార్మికులుగా చాకిరీలో..2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను అంతం చేయాలని 2015లో ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2025 వచ్చి వెళ్లి΄ోతున్నా ఇంకా 138 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూఎన్ బాలల నిధి విడుదల చేసిన బాల కార్మిక నివేదికలో పేర్కొంది. అతి త్వరలో ప్రపంచంలో బాల కార్మిక వ్యవస్థ రూపుమాసి΄ోతుందని తెలిపింది. అందరూ సమష్టిగా కృషి చేసి ఎక్కడా బాలకార్మికులు లేకుండా చూడాలని పిలుపునిచ్చింది.పరిశోధనలూ హెచ్చరికలూ జన్యు–సవరణ విధానంపిల్లలూ... ఈ సంవత్సరం వైద్య రంగంలో ఒక మంచి జరిగింది. జన్యుపరమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే చిన్నారుల కోసం శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి జన్యు–సవరణ విధానాన్ని సృష్టించారు. తన డీఎన్ఏలో సమస్య కారణంగా అనారోగ్యంతో ఉన్న ఓ చిన్నారిపై అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ CRISPR (Clustered Regularly Interspaced Short Palindromic Repeats) విధానంతో చికిత్స అందించారు. ఆ చిన్నారి ఇప్పుడు చాలా వరకు కోలుకున్నాడు. త్వరలోనే ఇతర పిల్లల్లాగే అతనూ ఎదుగుతాడని, వైద్యశాస్త్రంలో ఇది కీలక పరిణామని శాస్త్రవేత్తలు అంటున్నారు.2025 పుస్తకాలు2025లో పిల్లల కోసం అనేక పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. అందులో కొన్ని మాయలు, మంత్రాలతో కూడిన ఊహా ప్రపంచం కాగా, మరికొన్ని వారిలో మంచిని పెంచి, ఆసక్తికరంగా చదివించే విషయాలు ఉన్నాయి. ఇవి బాగా అమ్ముడు΄ోయాయి.ది లాస్ట్ బుక్‌స్టోర్ ఆన్ ఎర్త్ – లిల్లీ బ్రాన్–ఆర్నాల్డ్ ఒక వినాశకరమైన తుఫాను లిజ్ ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసి ఏడాది సంవత్సరం గడిచింది. ఇప్పుడు మరో ప్రళయం రాబోతోంది. ఈ సమయంలో ఆమె సురక్షితంగా భావించిన ఏకైక ప్రదేశంలో ఆమె గతంలో పని చేసిన పుస్తకాల దుకాణం ఉంది. అక్కడ ఏం జరిగిందనేది ఇందులోని కథ.పీపుల్ లైక్ స్టార్స్ – పాట్రిస్ లారెన్స్ 13 ఏళ్ల ముగ్గురు అపరిచితులకు నడుమ ఒక పెద్ద రహస్యం ముడిపడి ఉంది. అదేమిటనేదే ఇందులోని కథ. వారెవరు? వారికీ, ఆ రహస్యానికీ సంబంధం ఏమిటి అనే ఆసక్తికరంగా సాగుతుంది. విచ్ఛిన్నమైన కుటుంబాలు తిరిగి కలవడం, చరిత్రలోని రహస్యాలు తెలుసుకోవడం ఇందులో చూడొచ్చు.ది డే మై స్కూల్ గాట్ ఫేమస్ – జెన్ కార్నీ పాఠశాలకు మంచి డిజైన్ సూచించాలని ప్రధాన ఉపాధ్యాయుడు సవాలు విసిరారు. గెలిచినవారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఫెర్రిస్ తన సోదరుడు నైల్‌తో కలిసి ఆ డిజైన్ కోసం ప్రయత్నించాలనుకున్నాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళినా అల్లరి చేస్తాడు. బహుమతిని గెలుచుకోవడానికి వారిద్దరూ తమ విభేదాలను పక్కన పెట్టారా అనేది ఇందులోని కథ. పులోమా అండ్ ది బేర్ – జస్బిందర్ బిలాన్ పులోమా అనే బాలికకు సవాల్ ఎదురైంది. ఓ ప్రమాదం నుంచి ఒకేసారి నైలా అనే ఎలుగుబంటిని, తనను తాను రక్షించుకోవాలి. అది సాధ్యమేనా? అప్పుడు ఆమె ఏం చేసింది? ఎటువంటి మార్గాలు అన్వేషించింది? ఉత్కంఠభరితమైన ఈ సాహసయాత్ర చిన్నారుల్ని విశేషంగా అలరిస్తోంది. బందీగా ఉన్న ఎలుగుబంటిని రక్షించడానికి పులోమా ధైర్యాన్ని చదివి తీరాలి.
అంతర్జాతీయం
2025: ట్రంప్ నామ సంవత్సరం
కాలం నిజంగానే మాయల మరాఠీ. రెప్పపాటే అనిపిస్తుంది గానీ చూస్తుండగానే శరవేగంగా సాగిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. మంచీ చెడుల మిశ్రమ అనుభూతులు పంచి 2025 త్వరలో వీడ్కోలు చెప్పనుంది. ఈ సంవత్సరంలో ఎంతోమంది ప్రముఖులు మెరుపులు మెరిపించారు. కొందరు మరకలు అంటించుకుని తల దించుకున్నారు. ఇంకొందరు అనన్య సామాన్యమైన సాహసాలు, రికార్డులతో ప్రముఖుల జాబితాలో చేరిపోయారు. అలా 2025లో వార్తల్లో వ్యక్తులుగా నిలిచి అందరి నోళ్లలోనూ నానిన టాప్ 10 ప్రముఖుల గురించి ఒకసారి చూద్దాం...తంపులమారి (డొనాల్డ్ ట్రంప్) నిస్సందేహంగా 2025 ట్రంప్ నామ సంవత్సరమే అని చెప్పాలి. మీడియా వ్యతిరేకత, దు్రష్పచారాల మోత తదితరాలను సమర్థంగా కాచుకుంటూ 78 ఏళ్ల లేటు వయసులో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఔరా అనిపించారు. కానీ ఈ ఏడాది మొదట్లో పీఠమెక్కింది మొదలు రోజుకో ఆకస్మిక నిర్ణయంతో దేశాల గుండెల్లో అక్షరాలా రైళ్లు పరుగెత్తించారు. ముఖ్యంగా ఆయన ఎడాపెడా బాదిన టారిఫ్‌ల ధాటికి భారత్ తో సహా చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరే అయ్యాయి. అయితే వాటిని అంతే వేగంగా తగ్గించడం, రద్దు చేయడం వంటి చర్యలతో ట్రంప్ నవ్వులపాలు కూడా అయ్యారు. అమెరికాతో పరువుతో పాటు అగ్ర రాజ్య అధ్యక్ష పీఠం హుందాతనాన్నీ తన ప్రవర్తనతో పలుమార్లు పలుచన చేశారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ ఘర్షణలను తానే ఆపానని ఇప్పటికి కనీసం 75 సార్లకు పైగా ప్రకటించుకున్నారు. భారత్ నిర్ద్వంద్వంగా ఖండించినా, పాక్ కాళ్లబేరానికి వచ్చినందుకే కాల్పుల విరమణ జరిగిందని స్పష్టం చేసినా పట్టించుకోలేదు. ఈ విషయంలో సెంచరీ కొట్టడమే ట్రంప్ లక్ష్యం కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో జోకులు కూడా పేలాయి. రష్యా–ఉక్రెయిన్, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాలను కూడా చిటికెలో ఆపేస్తానంటూ బీరాలు పలికినా అవిప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గాజాను స్వా«దీనం చేసుకునేందుకు, వెనిజులాలోని చమురు నిల్వలను చెర పట్టేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయంగా కాక రేపుతున్నాయి. రెండో టర్ములో ఇంకా ఏడాదైనా పూర్తవకుండానే ఇన్ని చుక్కలు చూపిన తంపులమారి ట్రంపు 2026లో ఇంకెంత విశ్వరూపం చూపుతారో చూడాలి!నిప్పులు చిమ్మి... (ఎలాన్ మస్క్) ఈ ప్రపంచ కుబేరునికి 2025 అక్షరాలా ఒక పీడకలగా మిగిలిపోతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ తో కుదిరిన దోస్తీ మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసింది. దాంతో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దేందుకంటూ ట్రంప్ తనకు అప్పగించిన డోజ్ సారథ్యం కూడా అటకెక్కింది. చూస్తుండగానే ట్రంప్ తో మస్క్ విభేదాలు రచ్చకెక్కాయి. వారి రచ్చ నిత్యం వార్తల్లో నిలిచింది. దాంతో మస్క్ కంపెనీలు ఎక్స్, టెస్లా షేర్లు ఈ ఏడాదంతా భారీగా నేల చూపులే చూశాయి. కాకపోతే, ఏదో ఒక రూపంలో నిత్యం పతాక శీర్షికల్లో మాత్రం నిలవడం ఒక్కటే ఆయనకు ఊరట!నిరసన పతాక (మరియా కొరీనా మచాడో) వెనిజులా విపక్ష నేత. మదురో నియంతృత్వానికి వ్యతిరేకంగా చేసిన మడమ తిప్పని పోరాటానికి ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఆమెను వచ్చి వరించింది. దేశాన్ని ప్రజాస్వామ్యం వైపు నడిపే పోరాటంలో అవసరమైతే ప్రాణార్పణకు కూడా సిద్ధమంటూ కొన్నాళ్ల క్రితం ఆమె చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంది. ఆమెకు నోబెల్ బహుమానం నేపథ్యంలో వెనిజులాలో మానవ హక్కుల ఉల్లంఘన, మదురో నియంతృత్వం తదితరాలు మరోసారి చర్చల్లో నిలిచాయి. ట్రంప్ ను వెనక్కి నెట్టి మరీ ఆమె నోబెల్ శాంతి పురస్కారం అందుకోవడం విశేషం. అయితే, ’వెనిజులా ప్రజాస్వామిక పోరాటానికి ఇస్తున్న నిరంతర మద్దతుకు’ గాను ఆమె తన పురస్కారాన్ని ట్రంప్ కు అంకితం చేయడం విశేషంగా నిలిచింది. మచాడో తరఫున ఆమె కూతురు ఇటీవలే నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.కుట్రలకు బలి (షేక్ హసీనా)బంగ్లాదేశ్ లో తెర వెనక కుట్రలకు బలైన మరో నేతగా నిలిచిన మాజీ ప్రధాని. భారత్ తో నిత్యం సత్సంబంధాలు కొనసాగించడమే ఆమె పాలిట శాపమైంది. విద్యార్థులు, యువత మాటు మతోన్మాద, భారత వ్యతిరేక శక్తులు ఆజ్యం పోసిన అల్లర్లకు ప్రధాన లక్ష్యంగా మారారు. ప్రధాని పదవిని, దేశాన్ని వీడి భారత్ కు పారిపోయి వచ్చారు. అనంతరం పలు నేరాలపై అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష తో సహా పలు కఠిన శిక్షలు విధించాయి. ఆమె పార్టీ అవామీ లీగ్ గుర్తింపు కూడా రద్దయింది. 15 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన హసీనా ఇప్పుడు 78 ఏళ్ల వయసులో పొరుగు దేశంలో చివరి రోజులు గడపాల్సిన పరిస్థితిలో పడ్డారు. నారీ శక్తులు (వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషి) నారీ శక్తికి ప్రతిరూపాలు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్ లో మన సైన్యం సాగించిన విధ్వంసం తాలూకు విశేషాలను ఎప్పటికప్పుడు మీడియాకు వివరి స్తూ 3 రోజుల పాటు ప్రపంచమంతటి దృష్టినీ ఆకర్షించారు. పాక్ తప్పుడు ప్రచారాలను రుజువులతో సçహా ఎండగట్టారు. యుద్ధరంగంలోనే గాక మీడియా వార్ లో కూడా భారత్ ను తిరుగులేని స్థాయిలో నిలిపారు. దాంతో వారి పేర్లు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. అంతర్జాతీయ సైనిక కవాతులో భారత దళానికి సారథ్యం వహించిన తొలి మహిళా ఆఫీసర్ అన్న రికార్డు సోఫియాది. కాగా వైమానిక దళంలో ఉజ్వలమైన కెరీర్ తో దేశ మహిళలకు స్పూర్తినిచ్చారు వ్యోమిక.వ్యోమ వీరుడు (శుభాంశు శుక్లా) ఆక్సియం – 4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించారు. రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో కాలు పెట్టిన రెండో భారతీయుడు ఆయనే కావడం విశేషం. ఈ ఏడాది మన నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పేర్లలో చేరారు. వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు అంతరిక్ష యాత్ర దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆ రంగం పట్ల ఎనలేని ఆసక్తిని పెంచింది. జపాన్‌లో నారీ భేరి (సనాయే టకైచీ) ఈ అక్టోబర్ లో జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాజకీయ రంగంలో స్త్రీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే సంప్రదాయం ప్రబలంగా ఉన్న జపాన్ లో ఇది నిజంగా అనూహ్యమే. అయితే టకైచీ కేబినెట్ మాత్రం పూర్తిగా పురుషులతోనే కిటకిటలాడిపోవడం విశేషం. దాంతో, స్త్రీ శక్తిపరంగా నిజమైన మార్పులను ఊహించిన వారంతా ఆశాభంగమే చెందారు.నూతన సారథి (పోప్ లియో 14) పోప్ ఫ్రాన్సిస్ మరణానంతరం సుదీర్ఘ ఎంపిక ప్రక్రియ అనంతరం వాటికన్ పగ్గాలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోమన్ కాథలిక్కులకు సారథిగా గత మే నెలలో కొలువుదీరారు. అమెరికా ఖండం నుంచి వచ్చిన తొట్ట తొలి పోప్ గా కొత్త చరిత్ర సృష్టించారు.అప‘హాస్యం’ (సమయ్ రైనా, రణ్ వీర్ అలహాబాదియ) హాస్యం కాస్తా శ్రుతి మించితే ఏమవుతుందో ఫేమస్ యూట్యూబర్ రణ్ వీర్, స్టాండప్ కమెడియన్ రైనా వివాదం నిరూపించింది. తల్లిదండ్రులు, పిల్లల గురించి లైంగికపరంగా అత్యంత అసభ్యమైన కామెంట్లు, దివ్యాంగుల గురించి చౌకబారు వ్యాఖ్యలతో ప్రసారమైన వీరి పాడ్ కాస్ట్ లు అందరి ఆగ్రహానికి గురయ్యాయి. చివరికి విషయం అంటున్న న్యాయస్థానం దాకా చేరింది. కోర్టు వాళ్లకు పదేపదే అక్షింతలు వేయాల్సి వచ్చింది. క్రియేటివ్ ఫ్రీడం పేరిట వెర్రితలలు వేసే పోకడలను భారత సమాజం హర్షించబోదని ఈ ఎపిసోడ్ మరోసారి చాటింది.కాసుల వర్షమే (టేలర్ స్విఫ్ట్) సూపర్ సింగర్ టేలర్ స్విఫ్ట్ ఈ ఏడాది అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆమె ’ఎరాస్’ అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సింగిల్ టూర్ గా కొత్త చరిత్ర సృష్టించింది. ఈ షోలో భాగంగా స్విఫ్ట్ ఏకంగా ఐదు ఖండాల్లో 149 షోలు చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దాంతో ’ఎరాస్’ షో దాదాపుగా 200 కోట్ల డాలర్ల కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపించింది.– సాక్షి, నేషనల్ డెస్క్
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు..దిగొచ్చిన యూనస్ ప్రభుత్వం
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవల మైనారిటీలపై, ముఖ్యంగా హిందూ సమాజంపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఆలయాలపై దాడులు, ఇళ్ల ధ్వంసం, వ్యాపారాలపై దాడులు, మతపరమైన వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా ఖండించింది. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మైనారిటీల భద్రత కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయబడింది. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిపై కఠిన శిక్షలు విధిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.హిందూ సమాజానికి చెందిన నాయకులు, ముఖ్యంగా దీపు చంద్ర దాస్, ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ, “మైనారిటీలపై దాడులు దేశ ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు విరుద్ధం. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి” అని అన్నారు. ఈ ఘటనలపై అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. పలు మానవ హక్కుల సంస్థలు బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించాయి. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉండాలని కోరాయి.మొత్తానికి, బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు దేశ ప్రజాస్వామ్యానికి, సామాజిక సమగ్రతకు పెద్ద సవాలుగా మారాయి. తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. మైనారిటీల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం కూడా కళ్లప్పగించి చూస్తోంది.
పెళ్లి చేసుకోలేదంటే జరిమానా.. గ్రామస్తుల తీర్మానం
బీజింగ్: చైనాలోని ఓ గ్రామం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆ దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. గ్రామ కమిటీ ప్రత్యేకంగా రూపొందించిన నియమావళి ప్రకారం.. ఆ ఊరి గ్రామస్తులు ఆలస్యంగా వివాహం చేసుకోవడం, గర్భధారణకు సంబంధించిన నియమాలు పాటించని వారికి, అలాగే పిల్లల పెంపకం విధానాల్లో మార్పులు చేసిన వారికి జరిమానాలు విధిస్తూ ఆ ఊరి పెద్దలు తీర్మానించారు. జరిమానా వివరాలు• పెళ్లి కాకముందే గర్భం దాల్చితే 3,000 యువాన్ (సుమారు రూ.35,000).• పెళ్లి కాకముందే కలిసి నివసిస్తే సంవత్సరానికి 500 యువాన్ (సుమారు రూ.6,000).• బయటి ప్రావిన్స్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే 1,500 యువాన్ (సుమారు రూ.18,000).• అసత్య వదంతులు వ్యాప్తి చేస్తే 500 నుంచి 1,000 యువాన్ జరిమానా.ఈ వార్త వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఊరు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా మంది నెటిజన్లు ఈ నియమాలను వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. వివాహం ఎప్పుడు చేసుకోవాలి? పిల్లల్ని ఎప్పుడు కనాలి? అనేది వ్యక్తిగత నిర్ణయం. దానిపై గ్రామ కమిటీకి హక్కు ఎలా వస్తుంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం గ్రామంలో జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలుగా సమర్థిస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనాలో ప్రస్తుతం జనన రేటు తగ్గుదల (Demographic Winter) ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం జనన రేటు పెంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో, గ్రామ స్థాయిలో ఇలాంటి జరిమానాలు విధించడం వ్యతిరేక ధోరణిగా కనిపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విధానాలకు విరుద్ధమని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ సంఘటనతో చైనా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక నియంత్రణ ఎంత కఠినంగా అమలవుతోందో బయటపడింది. ఒకవైపు ఆధునికీకరణ, ఆర్థికాభివృద్ధి దిశగా చైనా దూసుకెళ్తుంటే, మరోవైపు గ్రామాల్లో ఇలాంటి నియమాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. మొత్తానికి, ఈ గ్రామం తీసుకున్న నిర్ణయాలు స్థానిక సమస్యగానే కాకుండా, జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.
రాకెట్ లాంటి రైలు.. 2 సెకన్లలోనే 700 KMPH వేగంతో పరుగులు..
బీజింగ్: చైనాలో మాగ్లేవ్ రైలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రైలు కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని చేరి రికార్డు సృష్టించింది. చాంగ్షాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనాలో సాంకేతిక ఆధిపత్యాన్ని మరోసారి చాటింది.మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతలో రైలు పట్టాలపై నేరుగా నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది. దీని వల్ల ఘర్షణ తగ్గి అత్యధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఈ రికార్డు స్థాయి వేగం భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది.నిపుణుల అంచనా ప్రకారం, బీజింగ్ నుంచి షాంఘై వరకు ప్రయాణం కేవలం రెండు గంటల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. పర్యావరణహితమైన ఈ రైలు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాకుండా శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. చైనా ప్రభుత్వం దీన్ని జాతీయ గర్వంగా భావిస్తూ, రాబోయే దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా మాగ్లేవ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విజయంతో చైనా ప్రపంచ రవాణా రంగంలో ముందంజలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.అమెరికా, జపాన్, యూరప్ వంటి దేశాలు కూడా మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ, చైనా సాధించిన ఈ వేగం వారిని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా, ఈ ప్రయోగం కేవలం చైనాకే కాకుండా ప్రపంచ సాంకేతికతలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.Reporter left speechless after witnessing Japan's new $70 million Maglev train in action at 310 mphpic.twitter.com/nexIApcmRh— Massimo (@Rainmaker1973) November 25, 2025
జాతీయం
నిన్న భార్య.. నేడు భర్త.. రెండు నెలలకే విషాదాంతం
యశవంతపుర(బెంగళూరు): కల్యాణం.. కమనీయం అన్నారు. కానీ ఘోర విషాదంగా పరిణమించింది. పట్టుమని 2 నెలలు కూడా కాపురం చేయని నవ వధూవరులు ఆత్మహత్యలతో పరలోకానికి చేరారు. ఈ ఘోరం బెంగళూరులోనే జరిగింది. నవవివాహిత గానవి (26) ఆత్మహత్యాయత్నం, మృతి కేసు అనూహ్య మలుపు తిరిగింది. భార్యను వేధించాడని, నపుంసకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త సూరజ్ మహారాష్ట్ర నాగపూర్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది తెలిసి సూరజ్ తల్లి జయంతి కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అట్టహాసంగా పెళ్లయితే.. గానవి, సూరజ్ (30)లకు అక్టోబర్ 29న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో అట్టహాసంగా వివాహమైంది. 12 రోజుల కిందట శ్రీలంకకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఇద్దరి మధ్య పోట్లాటలు జరిగి మధ్యలోనే ముగించుకొని బెంగళూరుకు వచ్చేశారు. మీ కూతురిని తీసుకెళ్లాలని ఆమె తల్లిదండ్రులకు సూరజ్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ గొడవలతో 24న గానవి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆస్పత్రిలో 26న చనిపోయింది. నాగపూర్‌కు వెళ్లిపోయి.. గానవి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సూరజ్ కుటుంబంపై పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యాయత్నం అభియోగాలతో రామమూర్తినగర పోలీసులు కేసును నమోదు చేశారు. అరెస్టు భయంతో సూరజ్, తల్లి జయంతి, సోదరుడు సంజయ్ నాగపూర్‌కు పరారయ్యారు. శనివారం అక్కడే ఓ విల్లాలో సూరజ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి జయంతి కూడా ఆస్పతిర్లో చికిత్స పొందుతోంది. ఈ మేరకు స్థానిక సోనేగావ్ పోలీసులు బెంగళూరు పోలీసులకు సమాచారమిచ్చారు.గానవి తల్లి ఏమన్నారు? సూరజ్ ఆత్మహత్యకు అతని తప్పుడు భావనలే కారణమని గానవి తల్లి ఆరోపించింది. నెలన్నర పాటు సూరజ్ సంసారం చేయలేదు, భార్య పక్కన కూర్చుని భోజనం కూడా చేసేవాడు కాదు. భర్త, అత్తల ప్రేమ కోసం గానవి ఎంతో ప్రయతి్నంచింది, పుట్టింటికీ వెళ్లను ఇక్కడ ఉండి బతుకుతా, నాకు ప్రేమను పంచండి అని గానవి భర్త, అత్తతో మొరపెట్టుకుంది. కానీ పుట్టింటికి వెళ్లిపో అని ఒత్తిడి చేశారు. తప్పుడు ఆలోచనలు, గానవి శాపమే సూరజ్ ఆత్మహత్యకు కారణం అని దుయ్యబట్టారు. భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
28న ఆరావళిపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: దేశంలోని ఆరావళి పర్వత శ్రేణుల నిర్వహణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన ఆరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు డిసెంబర్ 28న విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా (స్వచ్ఛందంగా) స్వీకరించడం గమనార్హం.చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.జి. మసీహ్లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోర్టు జాబితాలో ఈ అంశాన్ని ‘ఆరావళి కొండలు-పర్వత శ్రేణుల నిర్వచనం, సంబంధిత అంశాలు’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనం చుట్టూ వివాదం నెలకొంది. ఈ కొత్త నిబంధనల కారణంగా ఈ పర్వత పర్యావరణ వ్యవస్థలో భారీగా మైనింగ్‌కు అవకాశం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విస్తారమైన ఆరావళి ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఎటువంటి శాస్త్రీయ అంచనా లేకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతానికైతే మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరావళి ప్రాంతంలో కొత్త లీజులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణం, భూగర్భ శాస్త్రం, ప్రకృతి పరిరక్షణ ఆధారంగా మైనింగ్ నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ)ని ఆదేశించింది. కేంద్రం ఇప్పటికే నిషేధించిన ప్రాంతాలకు అదనంగా ఈ జోన్లను గుర్తించాల్సి ఉంటుంది. సోమవారం సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో ఆరావళి భవిష్యత్తుపై ఎటువంటి ఆదేశాలు వెలువడుతాయనే ఆసక్తి నెలకొంది.ఇది కూడా చదవండి: ‘షార్ట్‌లతో తిరగొద్దు’.. హుకుం జారీ!
అస్సాంలో 10.56 లక్షల పేర్లు తొలగింపు
గౌహతి: అస్సాంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 10.56 లక్షల ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు ముసాయిదా ఓటర్ల జాబితాను శనివారం విడుదల చేసింది. రాష్ట్రంలో 2.51 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నట్లు తేల్చింది. అంతేకాకుండా 93,021 డి–ఓటర్లు(డౌట్ఫుల్ఓటర్స్) ఉన్నట్లు గుర్తించింది. మరణించడం, వలసవెళ్లడం, బహుళ ఎంట్రీలు వంటి కారణాలతో 10,56,291 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. పౌరసత్వం లేకున్నా ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారిని డి–ఓటర్లుగా పరిగణిస్తారు. వీరికి ఓటు వేసే హక్కు ఇవ్వడం లేదు.
బొగ్గు గని ప్లాంట్ వద్ద నిరసన సెగ
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో జిందాల్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించిన బొగ్గు గని ప్లాంట్ వద్ద స్థానికులు చేపట్టిన ఆందోళన శనివారం హింసాత్మకంగా మారింది. తమనార్ పరిధిలోని లిబ్రా గ్రామంలో ఉన్న కోల్ హ్యాండింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు తరలించే వాహనాలను అడ్డుకుంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉద్యమ నాయకుడు రాధేశ్యామ్ శర్మ, మరో 40 మందిని అరెస్ట్‌చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంచేశారు. అయితే సైకిల్‌పై వెళ్తున్న స్థానికుడిని మరో బొగ్గు ట్రక్కు ఢీకొట్టిందన్న వార్తతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తర్వాత ప్లాంట్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. కోల్ ప్లాంట్‌లోని కన్వేయర్ బెల్ట్, ట్రాక్టర్లు, పోలీస్ బస్సు, జీప్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. సెక్టార్–1 కోల్‌బ్లాక్ పరిధిలోని 14 గ్రామాలకు చెందిన వేయి మందికిపైగా గ్రామస్తులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారు. అయినాసరే పరిస్థితి అదపులోనే ఉందని జిల్లా ఎస్పీ శనివారం వెల్లడించారు.
ఎన్ఆర్ఐ
అమెరికాలో నల్లగొండ యువకుడు మృతి
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అమెరికాలో మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం పవన్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అంతలోనే పవన్ కుమార్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
బ్రిటన్, కువైట్‌లో వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజు
వేంపల్లె/కడప కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజును యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్‌లో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో–ఆర్డినేటర్లు ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, ఎల్.ఎన్.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడిగా, జననేతగా మాజీ సీఎం వైఎస్ ప్రఖ్యాతి పొందారన్నారు. ఆయన పుట్టినరోజును బ్రిటన్‌లో నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ యూకే కన్వీనర్లు సహాయ కన్వీనర్లు, కోర్ కమిటీ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, పెద్ద ఎత్తున యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కువైట్‌లో మెగా రక్తదానం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలు కువైట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో కువైట్‌లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్. ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్‌లో ఉన్న జగనన్న అభిమానులు భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చారని, కువైటీల ఇళ్లలో పని చేస్తున్న మహిళలు, డ్రైవర్లు అనుమతి తీసుకొని వచ్చి 82 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేసిన వారికి జగనన్న సంతకంతో కూడిన సరి్టఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్లు కె. రమణయాదవ్, మర్రి కళ్యాణ్, షా హుసేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేష్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మీ ప్రసాద్ యాదవ్, షేక్ రహమతుల్లా, షేక్ అఫ్సర్ అలీ, కార్యవర్గ సభ్యులు షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు.. అక్కడి ప్రవాస భారతీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా? అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీలోని బోండి బీచ్‌లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు.జాత్యహంకార కోరలుకొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అధికంగా కనిపిస్తుంది. ఈ జాబితాలోని దేశాలలో అమెరికా, కెనడా పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు (Hate Crimes) మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కెనడాలో భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో 2024 నుంచి ఇప్పటివరకు 11 మందికి పైగా భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది స్థానిక భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. డబ్లిన్‌లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి, సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అభద్రతా భావంవిద్యా కేంద్రాల్లో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులకు క్యాంపస్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల టెహ్రాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై దాడులు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా, స్థానిక అధికార యంత్రాంగం స్పందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విద్యాభ్యాసం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కనీస రక్షణ లేక జాత్యహంకార దాడులకు బలవుతుండటం గమనార్హం.సైద్ధాంతిక విద్వేషంవిదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు.. రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కూడా కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారాయి. సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడటం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాంగ శాఖ అప్రమత్తం విదేశాలలో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి సందర్భాల్లో విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పు అనుకున్నంతగా కనిపించడం లేదు. భారతీయ రాయబార కార్యాలయాలు విద్యార్థులకు, వలసదారులకు రక్షణ కల్పించడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పలువురు అంటున్నారు.భద్రతా సంక్షోభం?ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇవి పునరావృతం అవుతాయని పలువురు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. దీనిని గుర్తించి అయినా అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాలనే వాదన వినిపిస్తుంటుంది. ప్రవాస మేధావులు, విద్యార్థులపై దాడులు కొనసాగితే, అది ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుందనేవారూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేవలం నిరసనలు తెలపడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో విదేశీ కలలు కనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్
క్రైమ్
మృత్యువులోనూ వీడని స్నేహం
భీమడోలు: ఆ యువకులు ముగ్గురూ మంచి స్నేహితులు.. ముగ్గురూ కలిసి శుభకార్యాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ముగ్గురూ కలిసే వెళ్తారు. శనివారం తెల్లవారుజామున డెకరేషన్ పుష్పాల కోసం వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న వారిని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఏలూరు నుంచి పొలసానిపల్లి వైపుగా ముగ్గురు యువకులు కలిసి వెళ్తుండగా వీరి బైక్ భీమడోలు వద్ద ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ద్వారకాతిరుమల మండలం తిమ్మపురానికి చెందిన మాండ్రోజు చరణ్‌కుమార్ (26), ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగర శ్రీరాములు అలియాస్ బన్నీ (21) ఉన్నారు. ఘటనాస్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న బిడ్డలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.దట్టమైన పొగమంచే కారణమా ?ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగే ఓ ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం పువ్వుల కొనుగోలుకు చరణ్‌కుమార్ తన తమ్ముడి కొత్త బైక్‌పై రఫీ, బన్నీతో కలిసి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. ఏలూరులో ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తున్న వీరు భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలో చనిపోయారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమడోలు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘ఓ’ పాజిటివ్‌కు బదులు ‘ఏ’ పాజిటివ్ బాలింత మృతి
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా, నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో ఇటీవల సంచలనంగా మారిన బాలింత మృతిపై జరిగిన విచారణలో దారుణ వాస్తవాలు వెల్లడయినట్లు తెలుస్తోంది. రక్త మార్పిడి విషయంలో ప్రభుత్వ డాక్టర్, బ్లడ్ బ్యాంక్ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని విచారణలో తేలినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన సాగరమ్మ (21) పురిటినొప్పులతో ఈ నెల 15వ తేదీన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు వచ్చింది. 17న కాన్పు చేశారు. శస్త్రచికిత్స తర్వాత ఆమెకు ‘ఓ’ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాలలో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తీసుకువచ్చారు. అయితే రక్తం ఎక్కించే సమయంలో ఆమె శరీరంపై దద్దుర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర నిర్లక్ష్యం ‘ఓ’ పాజిటివ్ బదులుగా ‘ఏ’ పాజిటివ్ రక్తం ఎక్కించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇందుకు సంబంధించి విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. దీంతో రక్త గ్రూప్ నిర్ధారణ, క్రాస్ మ్యాచ్, డబుల్ చెక్.. వంటి ముఖ్య విధానాలను అటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది.. ఇటు వైద్యులు విస్మరించారన్న విషయం స్పష్టమైంది. విచారణ నేపథ్యంలో తప్పు మాది కాదంటే మాది కాదంటూ ఇటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, అటు వైద్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా వీరిపై చర్యలు తీసుకోవద్దంటూ ఉన్నతాధికారులపై అధికార పార్టీ నేత ఒకరు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. బ్లడ్ బ్యాంక్‌పై డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణసైతం పూర్తిగా కొరవడినట్లు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి వివాదాన్ని సర్ధుమణిగింపచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. త్వరలో చర్యలు.. బాలింత మృతిపై విచారణ జరిపి నివేదికను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వైద్యశాఖ ఉన్నతాధికారులకు పంపించాం. బాధ్యులపై త్వరలో చర్యలుంటాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – ఎం ప్రసూన, డీసీహెచ్ఎస్, పల్నాడు జిల్లా
దేవుడా.. నా తోడును తీసుకెళ్లిపోయావా...
అయ్యా.. కాపాడండయ్యా.. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లండయ్యా.. ఈయనే నాకు దిక్కయ్యా.. బతికించండయ్యా.. దేవుడా... బస్సు చక్రాలకింద నా తోడును నలిపేశావా.. నా ఐదోతనాన్ని తీసుకెళ్లిపోయావా అంటూ భర్త తలవద్ద కూర్చుని ఓ వృద్ధురాలు రోదిస్తుంటే అక్కడివారిని కన్నీరుపెట్టించింది. కళ్లముందే తనువుచాలించిన భర్తను చూసి బోరున విలపించింది. ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస పట్టణంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. కొత్తవలస: మండలంలోని నిమ్మలపాలెం గ్రామానికి చెందిన సంపర్తి పెదరాము(67), అప్పలకొండ వృద్ధ దంపతులు ప్రతిరోజు కొత్తవలస మండల కేంద్రంలోని పలు షాపుల ముందు చెత్తను ఊడ్చుతూ, నీళ్లు చల్లి ముగ్గులు పెట్టే పనులు చేస్తారు. షాపుల యజమానులు ఇచ్చిన కొద్దిపాటి పైకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారు ఉన్నా ఎవరిదారి చూసుకొని వారు వెళ్లిపోయారు. ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టు జీవనం సాగిస్తున్నారు. ఎప్పటివలే శుక్రవారం ఉదయాన్నే కొత్తవలస చేరుకున్న దంపతులిద్దరూ షాపుల ముందు పనులు ముగించారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కొత్తవలస బస్టాప్‌లో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎస్.కోట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు వచ్చింది. శక్తిని కూడదీసుకుని బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బస్సు కాస్తా ముందుకు వెళ్లిపోవడంతో... అప్పటికే కాలువ నిర్మాణం కోసం తవి్వన మట్టిపోగులపై ఉన్న వృద్ధుడు ఒక్కసారి జారిపోయి బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఆయనపైనుంచి బస్సు వెళ్లడంతో గిలగిలా కొట్టుకుంటూ కన్నుమూశాడు. ఈ ఘటనను పక్కనే ఉన్న భార్య అప్పలకొండ చూసి గట్టిగా కేకేలు వేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసి కన్నీటిపర్యంతమైంది. క్షణాల్లో భర్త విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. మృతుడి భార్య అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సీఐ షణ్ముకరావు తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. ఊరికి చేర్చే బస్సు కిందే ఊపిరిపోయింది.. షాపుల ముందు చెత్త ఊడ్చే పనులు పూర్తిచేసి ఊరికి చేరుకునేందుకు వేచిచూసిన బస్సు కిందే ఊపిరి పోవడంతో స్థానికులు కన్నీరుపెట్టారు. రోదిస్తున్న వృద్ధురాలిని ఓదార్చారు. కొత్తవలస కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జిని ఆనకొని గోడను అధికారులు నిర్మిస్తున్నారు. ఈ గోడ నిర్మాణానికి కూడలిలోని కొంతభాగాన్ని తవ్వేసి మట్టిని గట్టులావేశారు. ఈ గట్టుపైనే నిల్చొని ప్రయాణికులు బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రమాదవశాత్తు గట్టుపై నుంచే జారిపడిన రాము బస్సు చక్రాల కింద పడడంతో మృతి చెందాడు.
అడవి పందుల బీభత్సం..!
పెంచికల్పేట్(సిర్పూర్): అడవుల జిల్లా కుమురంభీం ఆసిఫాబాద్‌లో అడవి పందులు బెంబేలెత్తిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలను ధ్వంసం చేయడంతోపాటు మనుషులపైనా దాడులకు తెగపడుతున్నాయి. రైతులు తమ విలువైన పంటలు కోల్పోతున్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అటవీశాఖ పరిహారం అందిస్తున్నామని చెబుతున్నా.. బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు.పంటలు ధ్వంసంజిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగు చేస్తారు. పత్తి చేలు అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్నాయి. దీంతో పందులు సీజన్ ముగిసే వరకు దాడులు చేస్తూ పత్తి చేలను ధ్వంసం చేశాయి. పలు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అడవి జంతువుల స్వైర విహారంతో చేతికందిన పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్లో సాగు చేసిన వరి కోతలు పూర్తయ్యాయి. దీంతో అడవి పందులు పత్తి, కంది పంటలపై పడ్డాయి. ఈ క్రమంలో పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కాపలా కాస్తున్న సమయంలో రైతులపైనా దాడులు చేస్తున్నాయి.పరిహారం కోసం ఎదురుచూపులుపంటలకు కాపలా వెళ్లే సమయంలో అన్నదాతలు ఎక్కువగా అడవి పందుల దాడుల్లో గాయపడుతున్నారు. రెండు నెలల క్రితం పెంచికల్పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన రైతు దూగుంట నారాయణ వరిపొలానికి వెళ్లిన సమయంలో అడవి పంది దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా తిర్యాణి మండలం గోయోగం గ్రామానికి చెందిన మేక భీమేశ్పైనా పందుల గుంపు దాడిచేసింది. వీటి భయంతో అన్నదాతలు, కూలీలు పంట చేలకు వెళ్లడానికి జంకుతున్నారు. నష్టపోయిన పంటలు, గాయపడిన వారికి అటవీశాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. క్షతగాత్రులకు గాయాల తీవ్రత ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పంట నష్టాన్ని వ్యవసాయాధికారులు అంచనా వేస్తే బాధితులకు సాయం అందించాలి. కానీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు.దరఖాస్తు ఇవ్వాలిఅడవి పందుల దాడిలో పంటనష్టపోయిన రైతులు అటవీశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలి. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు పరిహారం కోసం నివేదిస్తాం. గాయపడిన వారికి పరిహారం అందించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరాలు అందించాం. నిధులు మంజూరు కాగానే బాధితులకు అందిస్తాం.– అనిల్‌కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్పంట కాపలాకు వెళ్లిన రైతుపై దాడితిర్యాణి: అడవి పందుల దాడిలో ఒకరికి గాయాలైన ఘటన తిర్యాణి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోయోగం గ్రామానికి చెందిన మేక భీమేశ్ గురువారం గ్రామ సమీపంలోని పంట చేనుకు కాపలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగి వస్తుండగా అడవి పందుల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భీమేశ్ అరవడంతో పక్క చేనులో ఉన్న రైతులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
వీడియోలు
పిడుగురాళ్ల CI వేధింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం
చిరు, వెంకీ ఊరమస్ స్టెప్స్..!
ఆపరేషన్ సిందూర సమయంలో భారత్ దెబ్బకు పారిపోయి దాక్కున్నాం
హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్
అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్
ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..
ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు
సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్
సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్
టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

