టొరంటో: కెనడాలో కుంగుబాటు తదితర మానసిక సమస్యలతో బాధపడుతున్న భారతీయ మహిళల కోసం టొరంటోలోని కాన్సులేట్ జనరల్ కార్యాలయం ప్రత్యేకమైన హెల్ప్ డెస్క్ ప్రారంభించింది. ఇన్ స్టాప్ సెంటర్ ఫర్ విమెన్ (ఓఎస్సీడబ్ల్యూ)గా పిలిచే ఈ కేంద్రం నిరంతరం పనిచేస్తుంది. గృహ హింస , కుటుంబ సమస్యలు, అణచివేత, లైంగిక, ఇతరత్ర దోపిడీ, న్యాయ సవాళ్లు తదితరాలు ఎదుర్కొంటున్న మహిళలకు సకాలంలో సాయం అందించడమే దీని లక్ష్యమని కార్యాలయం తెలిపింది.


