దేశంలో బంగారం, వెండి ధరలు గత వారం చుక్కలు చూపించాయి. వారంలో ఒక్క రోజూ తగ్గకుండా వరుసగా భారీ పెరుగుదలను నమోదు చేస్తూ వచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన ఏడు రోజుల్లో పసిడి, వెండి ధరలు పెరిగిన తీరు తెన్నుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
బంగారం ధరలు
24 క్యారెట్ బంగారం తులం (10గ్రాములు) ధర డిసెంబర్ 21న రూ.1,34,180 ఉండగా సరిగ్గా వారం తిరిగేసరికి డిసెంబర్ 28 నాటికి రూ.
1,41,220 లకు చేరింది. అంటే వారంలో ఏకంగా రూ.7,040 ఎగిసింది.
ఇక 22 క్యారెట్ బంగారం విషయానికి వస్తే.. డిసెంబర్ 21న రూ.1,23,000 ఉన్న తులం ధర డిసెంబర్ 28 నాటికి రూ.1,29,450 లకు చేరింది. అంటే వారంలో రూ.6,450 పెరిగింది.
వెండి ధరలు
గత వారం వెండి ధరల పెరుగుల వేగం బంగారాన్ని మించిపోయింది. డిసెంబర్ 21న రూ.2,26,000 ఉన్న కేజీ వెండి ధర డిసెంబర్ 28 నాటికి రూ.2,74,000లను తాకింది. మొత్తంగా ఏడు రోజుల్లో రూ.48,000 దూసుకెళ్లింది.
పెరుగుదలకు కారణాలివే..
అంతర్జాతీయ పరిస్థితులు: అమెరికా వడ్డీ రేట్ల తగ్గుదల, గ్లోబల్ ఆర్థిక అస్థిరతలు
సేఫ్‑హేవెన్ డిమాండ్: పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెంచారు
ఎంసీఎక్స్/కామెక్స్ ధరల ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్ రేట్లు దేశీయ ధరలను నేరుగా ప్రభావితం చేశాయి.
దేశీయ వినియోగం, కొనుగోలు:భవిష్యత్తు అవసరాల కోసం స్థానిక కొనుగోలు పెరగడం.


