పరిచయాలు పెంచుకుని వారి ద్వారా కొంత ఉపకారం పొందుతారు. ఆత్మీయుల నుండి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఇంతకాలం వేధించిన ఒక సమస్య నుండి గట్టెక్కే సూచనలున్నాయి. ఇంట్లో అప్పగించిన బాధ్యతలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటర్వ్యూలు రాకతో నిరుద్యోగులు హుషారుగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని ఖర్చులు తగ్గించుకుంటారు. ఆస్తి ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఆలయాలు సందర్శించి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు తమ నైపుణ్యంతో లాబాలను గడిస్తారు ఉద్యోగస్తుల విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు సానుకూలమవుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుని తదనుగుణంగా అడుగులు వేస్తారు. ఆలోచనలను అమలు చేసేందుకు సిద్ధమవుతారు. ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా గడిచిపోతుంది. విద్యార్థుల్లో పట్టుదల పెరిగి అనూహ్యంగా కొన్ని అవకాశాలు సాధిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రక్రియలో ముందడుగు పడుతుంది.కష్టాల్లో ఉన్న మిత్రున్ని ఆదుకుంటారు. ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో వివాహాది వేడుకల కోసం సన్నాహాలు చేస్తారు. వ్యాపారస్తులు గత ప్రాభవం పొందుతారు. మరింత పుంజుకుని పెట్టుబడులు కూడా పెంచుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల ఆదేశాల మేరకు విధులు చక్కదిద్దుతారు. కళారంగం వారి ఆశలు ఫలించి మంచి అవకాశాలు పొందుతారు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక ఆందోళన. బంధువర్గం నుండి సమస్యలు రావచ్చు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

చీటికీమాటికీ ఆందోళన పరుస్తున్న ఒక వివాదాన్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. కొన్ని అదనపు ఖర్చులు తగ్గుతాయి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం రావచ్చు. ఇది మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే సూచనలు. సహనం, నేర్పుతో అందర్నీ సమాధానపరుస్తూ మీ ఆశయాల సాధనకు అడుగులు వేస్తారు. ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ప్రముఖ వ్యక్తులను పరిచయం చేసుకుని వారి ద్వారా సహాయం పొందుతారు. మీ నిర్ణయాలలో సోదరుల ప్రమేయం ఉంటుంది. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వచ్చి ఊహించని అవకాశాలు పొందుతారు వ్యాపారస్తులు మరో కొన్ని వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ సాయం అందవచ్చు. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆరోగ్యం సహకరించక కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మీపై వచ్చిన ఆరోపణలు లేదా విమర్శలను దీటుగా ఎదుర్కొంటారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అంది ఆశ్చరపడతారు. కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు నెలకొంటాయి.సోదరులు, సోదరీలతో విభేదాలు పరిష్కారం. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో మరింత అభివృద్ధి పరుస్తారు. ఉద్యోగాలలో పైస్థాయి నుండి తగినంత ప్రోత్సాహం. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.వారం ప్రారంభంలో. వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రమ పెరుగుతుంది. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వారం విశేషమైనదిగానే చెప్పవచ్చు. విద్యార్థులు శక్తియుక్తులను చాటుకుంటారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. వివాదాలు పరిష్కారమై ఊపిరిపీల్చుకుంటారు. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సొమ్ము చేతికందే అవకాశాలున్నాయి. రుణదాతలు ఒత్తిడులు తగ్గిస్తారు. కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు ఉంటాయి. సోదరులు మీకు విశేషంగా సహకరిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. భాగస్వాములతో కొత్త ఒప్పందాలకు సిద్ధపడతారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం వింటారు.పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ప్రయాణ సూచనలు. అత్యంత ఆప్తులతో వివాదాలు. మానసిక ఆందోళన. శ్రీవారాహీ స్తోత్రాలు పఠించండి.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తాయి.వ్యతిరేకులు మిత్రులుగా మారతారు. ఆస్తి వివాదాల నుంచి క్రమేపీ బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో .ఊహించని విధంగా లాభాలు, తద్వారా కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళాకారులకు మరిన్ని అవకాశాలు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదావేస్తారు. అనారోగ్యం. శ్రమకు తగిన ఫలితం కష్టసాధ్యం. శివారాధన మంచిది.

అనూహ్యమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఓర్పుతో క్లిష్టసమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విద్యావకాశాలు పెరుగుతాయి. ఆదాయానికి కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరతాయి. వారసత్వ ఆస్తుల విషయంలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారాలలో అనుకున్నరీతిలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ సామర్థ్యాన్ని చాటుకుంటారు. రాజకీయవేత్తల ఆశలు నెరవేరే సమయం. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. విశ్రాంతి అవసరం కావచ్చు.వృథా ఖర్చులు. విష్ణుధ్యానం చేయండి.

మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించే సమయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల ప్రేమను పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలను ముమ్మరం చేస్తారు. సమాజసేవపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటారు.భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆర్థికంగా మరింత ప్రోత్సాహకరమైన సమయం. సోదరుల నుంచి ధనలాభ సూచనలు.కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. ఆరోగ్యసమస్యలు తీరతాయి. వ్యాపారాలను అభివృద్ధిపర్చడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో విధులను చక్కదిద్దడంలో ఆటంకాలు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు సంతోషకర సమాచారం. వారం ప్రారంభంలో బంధుగణంVతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొత్త సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సమకూర్చుకుంటూ అప్పుల బాధల నుండి బయటపడతారు. కుటుంబంలోని అందరితోనూ సఖ్యతగా ఉంటారు. ఆరోగ్యపరంగా ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.వ్యాపారాలు కొత్త భాగస్వాముల చేయూత అందుతుంది. ఉద్యోగాలలో సంశయాలు తీరి విధులను సజావుగా పూర్తి చేస్తారు. పారిశ్రామిక, రాజకీయవర్గాల యత్నాలు సఫలం కాగలవు.వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. దేవీఖడ్గమాల పఠించండి.

ముఖ్యమైన కార్యక్రమాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలను ఎట్టకేలకు అమలులో పెడతారు. కార్యరూపం దాలుస్తాయి. చిరకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను అతిచాకచక్యంగా పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగావకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కొన్ని ముఖ్య నిర్ణయాలకు సోదరుల సలహాలు తీసుకుంటారు. రావలసిన సొమ్ము అందుకోవడంలో సఫలమవుతారు. ఇతరులకు సైతం కొంత సహాయం అందిస్తారు. దూరమైన వ్యక్తులు తిరిగి మీ చెంతకు చేరుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాల వైపు పయనిస్తారు. ఉద్యోగాలలో పైస్థాయి వారు మీ పనివిధానంపై సంతృప్తి చెందుతారు. రాజకీయవేత్తలకు సంతోషకరంగా గడుస్తుంది. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులే శత్రువులు కాగలరు. ప్రతి నిర్ణయంపై నిదానం అవసరం. శివపంచాక్షరి పఠించండి.

ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేరు. ఉద్యోగ యత్నాలలో విఘాతాలు. కాంట్రాక్టర్లకు మరింత ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇతరుల నుండి సొమ్ము తిరిగి రాకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలతో డీలాపడతారు. వ్యాపారాలలో సామాన్యమైన లాభాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఎటువంటి తొందరవద్దు. ఉద్యోగాలలో కొన్ని మార్పులకు అవకాశం ఉంది. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ఆహ్వానాలు రాగలవు. ధనలబ్ది. ఆదిత్య హృదయం పఠించండి.

దీర్ఘకాలిక సమస్యల నుండి ఎట్టకేలకు బయటపడతారు. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. కుటుంబంలో ఉల్లాసంగా గడుపుతారు. పనులు చకచకా పూర్తి చేస్తారు నిరుద్యోగుల యత్నాలు సఫలం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలను విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. మొత్తానికి లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకునే అవకాశం. రాజకీయవేత్తలు, క్రీడాకారుల సేవలకు తగినంత గుర్తింపు రాగలదు. వారం చివరిలో వృథా ఖర్చులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.