వైఎస్ జగన్.. అరుదైన (రేర్) ఫొటోలు
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుంటారు.. ఏదీ? రాదే? అందరికంటే ఎక్కువ కష్టపడిన ఇమ్మాన్యుయ్యేల్ను నాగార్జున సీజన్ అంతా ఆకాశానికెత్తారు. గోల్డెన్ స్టార్.. ప్రేక్షకుల సపోర్ట్ నీకే అంటూ మురిపించారు. గెలుపు గురించి ఢోకా లేదు, తడిగుడ్డ వేసుకుని పడుకో అన్నచందంగా బీబీ టీమ్ బిల్డప్ ఇచ్చింది. ట్రోఫీని ముద్దాడటమే ఆలస్యం అని గంపెడాశతో ఉన్న ఇమ్మాన్యుయేల్‌ను చివరకు నట్టేట ముంచారు. తప్పెవరిది?విన్నర్ కాదు కదా రన్నర్వి కూడా కాలేవంటూ నాలుగో స్థానంలో పడేశారు. అతడు పడ్డ కష్టానికి, వచ్చిన నాలుగో ర్యాంక్‌కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ తప్పెవరిది? బిగ్‌బాస్ టీమ్‌దా? ప్రేక్షకులదా? పోనీ ఇమ్మూ కేవలం కామెడీ మాత్రమే పంచాడా? అంటే కానే కాదు. తనకున్న తెలివితేటలు అమోఘం. నాగార్జున ఏం అడుగుతాడు? ఈ వారం జరగనుంది? అని ముందే ఊహించేవాడు. అతడు లెక్క ఎప్పుడూ తప్పవలేదు. తను ఊహించిందే జరిగింది. సంజనాను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తిసంజనా గుడ్డు దొంగతనం చేసినప్పుడు అందరూ కయ్యిమని అరుస్తూ ఆమెను నానామాటలు అంటుంటే ఇమ్మూ (Emmanuel) ఒక్కడే ఆమె గేమ్‌ప్లాన్ అర్థం చేసుకున్నాడు. తాను తిట్లుపడ్డా తప్పులేదు, కానీ ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించాలన్న ఆమె కసిని గమనించి ఫిదా అయ్యాడు. చంటిపాపను, కొడుకును వదిలేసి వచ్చిన ఆమెకు కొడుకయ్యాడు. ప్రేమను పంచాడు. ఆమె తప్పులు చేసినప్పుడు వారించాడు. కెప్టెన్సీ త్యాగంమాటలు తూలినప్పుడు హెచ్చరించాడు. నాగార్జున ముందు కూడా తప్పును తప్పే అని వాదించాడు. కానీ, తనను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేశాడు. కావాలంటే కెప్టెన్సీని మళ్లీ సంపాదిస్తానన్న ధైర్యం, అమ్మ కావాలన్న తపన.. రెండూ అతడిలో కనిపించాయి. ఎమోషనల్, తెలివితేటలు, మంచితనం, స్నేహబంధం వంటివెన్నో ఉన్నా అతడిలో కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. ఆటను చేజేతులా నాశనం చేసుకున్నాడా?మొదట నామినేషన్ అంటే భయం. ఆ భయమే తన ఓటమికి పునాది వేసింది. సీజన్ మొత్తంలో అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన ఇమ్మూ.. తన సత్తా ఏంటో చూపించాడు. టాస్కుల మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న అతడు టికెట్ టు ఫినాలేలో మాత్రం కల్యాణ్‌తో చేతులు కలిపాడు. ఇది అతడికి మరో మైనస్‌గా మారింది. సింగిల్ సింహంలా ఎన్నో గేమ్స్ ఆడి గెలిచిన ఇమ్మూ చివరికొచ్చేసరికి ఇలా మరొకరితో జోడీ కట్టి పక్కవాళ్లను ఓడించాలని చూడటం చాలామందికి నచ్చలేదు. మరోసారి రుజువైంది!కానీ ఇంతమాత్రానికే అతడిని నాలుగో స్థానంలో పెట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఇమ్మాన్యుయేల్ ఓడిపోలేదు.. అందరూ కలిసి అతడిని ఓడించారు. కమెడియన్లు ప్రాణం పెట్టి ఆడినా, కట్టే కాలేవరకు నవ్విస్తామన్నా వాళ్లను కేవలం జోకర్స్లాగే చూశారు. ఇప్పుడు అందరిలో జోకర్‌గానే నిలబెట్టారు. కమెడియన్స్ కప్పు గెలవలేరని మరోసారి రుజువు చేశారు!
ఆ విషయాలే ప్రధానంగా చర్చించాం: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్ఘాటించారు. ఈరోజు( ఆదివారం, డిసంబర్ 21వ తేదీ) బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తెలంగాణ భవన్లో జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం ఇదే విషయాన్ని కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. తాము నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించామన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. దాదాపు 8 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడింది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకే కేంద్రం దగ్గర అంగీకరించింది. దీన్ని నిరసిస్తూ జిల్లా, మండల స్థాయిలో నిరసనలు తెలపాలని నిర్నయించాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. దీనిపైనే ప్రధానంగా చర్చించాం. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం గురించి చర్చించాం. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కి.మీ మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లా వివక్షకు గురైంంది. పాలమూరు గురించి గరెటడు నీళ్లు అడిగే వాడే లేడు. ఏపీ ఏర్పాటుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. పాలప్రతిపాదిత ప్రాజెట్టులు మార్చొద్దని ఎస్ఆర్సీ స్పష్టంగా చెప్పింది. గతంలో చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్నారు. ఆయన ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేశారు. పాలమూరు ప్రాజెక్టు అనేది ఎత్తిపోతల ప్రాజెక్టు కాదు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయి. అయినా పాలమూరు జిల్లాలో విపరీతమైన కరువు. కేంద్రం, రాష్ట్రం కలిసి అన్యాయం చేశాయి’ అని కేసీఆర్ విమర్శించారు.
ఆ ఐదేళ్లు.. చరిత్రలో సువర్ణ అధ్యాయం
వైఎస్ జగన్.. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన నేత. జన సంక్షేమమే లక్ష్యంగా.. అవినీతి రహిత, నిష్పాక్షికమైన పాలన అందించారాయన. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులెన్నో తెచ్చారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ సేవలను ప్రతీ ఇంటి గడప దగ్గరకి చేర్చడం.. ఆయన్ని అందరివాడిగా మార్చేసింది. అలా జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించేది..ఇచ్చిన మాటకు కట్టుబడటం.. దానిని నిలబెట్టుకోవడం.. విలువలు, విశ్వసనీయత వైఎస్ జగన్ నైజం. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేశారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. ఓ వైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చారు.(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలూ, సంక్షేమ ఫలాలను అభిమానులు, ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమం అందక పేద, బడుగు, బలహీన వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి పాలన నుంచి విముక్తి కలిగి మళ్లీ జగనన్న రాజ్యం రావాలంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.వ్యవసాయరంగాన్ని పండగ చేశారు..రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అన్నదాతలకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వ్యవసాయరంగాన్ని పండగ చేసి చూపించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేశారు. ఐదేళ్లలో రైతుల రైతుల సంక్షేమం కోసం రూ.1,84,567 కోట్లు ఖర్చుచేసింది. రైతు భరోసా పథకంతో పెట్టబడి సాయం అందించి.. అందరికీ అన్నంపెట్టే రైతన్నకు వైఎస్ జగన్ తోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై ఆర్థిక భారం పడనీయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేసింది. ప్రభుత్వమే ప్రీమియం భారాన్ని భరించింది. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ, పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతు భరోసా కేంద్రాలు, ఇన్ ఫుట్ సబ్సిడీ, యంత్ర సేవా కేంద్రాలు, వైఎస్సార్ అగ్రిలాబ్స్, వైఎస్సార్ పశు సంరక్షణ, జగనన్న పాల వెల్లువతో అన్నదాతకు అభయం ఇచ్చారు.ప్రజారోగ్య ముఖచిత్రాన్ని మార్చేశారు..డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని ప్రజారోగ్య ముఖచిత్రాన్నే వైఎస్ జగన్ మార్చేశారు. గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యసేవలను విస్తరించారు. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. 108,104 సేవలు, గిరి పుత్రులకు బైక్ అంబులెన్స్‌లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైఎస్సార్ కంటి వెలుగు, తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్, డాక్టర్ వైఎస్సార్ టెలీ మెడిసిన్ వంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. కోవిడ్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. రూ.785 కోట్లతో వైఎస్సార్ సుజల ధార మంచినీటి ప్రాజెక్ట్, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్శించారు.చదువుల విప్లవం..విద్యారంగంలో కేవలం సంస్కరణల కోసమే రూ.73 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్ లు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, అమ్మ ఒడి, గోరు ముద్ద, విద్యాకానుక, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి పథకాలతో విద్యారంగం స్థితిగతులనే వైఎస్ జగన్ మార్చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలన్నది వైఎస్ జగన్ ఆకాంక్ష. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించారు.దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..వైఎస్సార్సీపీ పాలనలో అక్క చెల్లెమ్మలకు.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్ ప్రభుత్వం తోడుగా నిలిచింది. మహిళా సాధికారితే లక్ష్యంగా 33.15 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏటా రూ.18,750 చొప్పున 4 విడతల్లో రూ.75 వేలు అందించారు. రూ.19,189 కోట్లు ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా అక్కచెల్లెమ్మలకు గత ఐదేళ్ల పాలనలో రూ.2030 కోట్లు లబ్ధి కలిగింది.వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేదోడుగా నిలిచింది. ఐదేళ్ల పాలనలో రూ.1.05 లక్షల లబ్దిపొందారు. వైఎస్సార్ చేయూత, ఆసరాతో లక్షలాది మంది మహిళలకు వైఎస్ జగన్ అన్నలా నిలిచారు. ఈ పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు హయాంలో కుదేలైన పొదుపు సంఘాలకు తిరిగి జీవం పోశారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 16,44,029 మంది మహిళలకు లబ్ధి కలిగింది.అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వు..వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అవ్వాతాతల పట్ల మానవత్వాన్ని కనబరుస్తూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు.అన్ని వర్గాలకూ..వైఎస్సార్ వాహన మిత్ర, లా నేస్తం.. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు పథకం.. ఇలా ఎన్నో పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. సంక్షేమం అంటే మంచి.. వైఎస్ జగన్ పాలనలో అదే జరిగింది. అన్ని వర్గాలకూ పథకాలు అందాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా వైఎస్ జగన్ సుపరిపాలన అందించారు.కోవిడ్‌లోనూ సంక్షేమం..కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. విపత్కర పరిస్థితులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. కోవిడ్‌తో ఆదాయం అడుగంటినా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన వైఎస్ జగన్ 2021లో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేశారు. సంక్షోభంలో పేదలను గట్టెక్కించారు. ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్‌ను అనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కోవిడ్‌పై పోరులో సచివాలయ వ్యవస్థ కీలకంగా నిలిచింది. ముందుచూపుతో అందుబాటులోకి తెచ్చిన సచివాలయాల వ్యవస్థ ద్వారా కోవిడ్ మహమ్మారిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది.అభివృద్ధి పరుగులు..'అభివృద్ధి' అంటే ఏమిటో వైఎస్ జగన్ చేసి చూపించారు. అభివృద్ధి పరుగులు తీయించారు. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించారు. 17 మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టారు.వైఎస్ జగన్ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో రాష్ట్రం ఏటా అగ్రగామిగా నిలిచింది. 59 నెలల్లో రూ.1.02 లక్షల కోట్లు పారిశ్రామిక పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి వచ్చాయి. స్పష్టమైన విధానాలు, ప్రోత్సాహకాలు, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. కోవిడ్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దెబ్బతిన్న సమయంలోనూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పరిశ్రమలు నిలదొక్కుకొనేలా చర్యలు చేపట్టింది. ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకొంది.
జడ్జి బదిలీ జరిగినా జగన్‌పై విషం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
అవార్డులూ... సాహిత్యమూ
ముందు అసెంబ్లీకి రండి
రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి - మంత్రి నారా లోకేష్
నితీశ్ రెడ్డి సారథ్యంలో...
హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా రాహుల్
గుల్వీర్ రికార్డు
జెమీమా జోరు...
అంధకారంలో శాన్ఫ్రాన్సిస్కో
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్
అవసరమా ‘అఖండ’ కావరం?
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
అపర చెగూవేరా.. ఆపవేందిరా..
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం
రోహిత్ శర్మ యూటర్న్!
గిల్‌కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
అబ్బే.. రూ.అరకోటి ఇళ్లా!! మారిన డిమాండ్
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
బిగ్‌బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్‌కు తన్నుకొచ్చిన దుఃఖం
'బ్లాక్ అండ్ వైట్ బోర్'.. మరో లగ్జరీ కారు కొన్న లవ్ బర్డ్స్
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
జడ్జి బదిలీ జరిగినా జగన్‌పై విషం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
అవార్డులూ... సాహిత్యమూ
ముందు అసెంబ్లీకి రండి
రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి - మంత్రి నారా లోకేష్
నితీశ్ రెడ్డి సారథ్యంలో...
హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా రాహుల్
గుల్వీర్ రికార్డు
జెమీమా జోరు...
అంధకారంలో శాన్ఫ్రాన్సిస్కో
'బిగ్‌బాస్' తెలుగు విన్నర్‌ను ప్రకటించిన వికీపీడియా
అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్
మా తాతగారు తన కష్టాన్ని ఎప్పుడూ చెప్పలేదు: శోభన్‌బాబు మనవడు డా. సురక్షిత్
అవసరమా ‘అఖండ’ కావరం?
ఈసారి రికార్డులు బద్ధలు.. ఆ కంటెస్టెంట్‌దే గెలుపు!
సెలక్టర్ల కీలక నిర్ణయం.. మహ్మద్ షమీకి ఛాన్స్
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
బిజినెస్ రీఫార్మర్ అవార్డు లాంటివి ఇంకా ఎన్నో వస్తాయ్!
అపర చెగూవేరా.. ఆపవేందిరా..
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం
రోహిత్ శర్మ యూటర్న్!
గిల్‌కు భారీ షాక్.. వరల్డ్ కప్ జట్టులోకి ఎవరూ ఊహించని ప్లేయర్
అబ్బే.. రూ.అరకోటి ఇళ్లా!! మారిన డిమాండ్
సంజూ శాంసన్ కీలక నిర్ణయం
బిగ్‌బాస్ 9 ఫినాలే ప్రోమో: కల్యాణ్‌కు తన్నుకొచ్చిన దుఃఖం
'బ్లాక్ అండ్ వైట్ బోర్'.. మరో లగ్జరీ కారు కొన్న లవ్ బర్డ్స్
'అల్లు అర్జున్ తెలుగు హీరో అనుకోలేదు..' ఛాంపియన్ హీరోయిన్
తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఫొటోలు
బ్యాంకాక్ ట్రిప్‌లో తెలుగు సీరియల్ బ్యూటీ నవ్యస్వామి (ఫొటోలు)
జగన్ మావయ్యతో క్యూట్ మూమెంట్స్ (ఫొటోలు)
పుస్తకాల పండుగ వచ్చేసింది.. వెళ్దాం పదండి (ఫొటోలు)
వైఎస్ జగన్.. అరుదైన (రేర్) ఫొటోలు
ఏపీవ్యాప్తంగా వైఎస్ జగన్ ముందస్తు బర్త్ డే వేడుకలు (ఫొటోలు)
హ్యాపీ బర్త్ డే జగనన్న: జనం మెచ్చిన జననేత.. (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 20-27)
శ్రీలంక ట్రిప్‌లో ధనశ్రీ వర్మ.. ఫుల్ చిల్ అయిపోతూ (ఫొటోలు)
రెడ్ రోజ్‌లా 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)
సినిమా
సూట్‌కేస్ తీసుకున్న పవన్.. మొత్తం ఎంత వెనకేశాడంటే?
బిగ్‌బాస్ 9 నుంచి డీమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు, కాదు తనంతట తానే తలెత్తుకుని బయటకు వచ్చాడు. అగ్నిపరీక్ష పోటీలో గెలిచి షోలో అడుగుపెట్టినప్పుడు అసలు ఇతడికి ఎలా అవకాశమిచ్చారని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తన ఎంపిక ఏదో అల్లాటప్పా కాదని పవన్ నిరూపించాడు. రీతూతో బంధంపై విమర్శలు వచ్చినప్పటికీ టాస్కుల పరంగా తన బెస్ట్ ఇచ్చాడు. సూట్‌కేస్‌తో బయటకురెండుసార్లు కెప్టెన్ కూడా అయ్యాడు. ఏకంగా టాప్-3లో చోటు దక్కించుకున్నాడు. తెలివిగా మాస్ మహారాజ రవితేజ ఆఫర్ చేసిన రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేశాడు. సీజన్ అంతా పవన్‌ను తొక్కేసిన బిగ్‌బాస్.. జర్నీ వీడియోలో మాత్రం వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. మీ విల్ పవర్, ఫిట్నెస్ మాత్రమే కాదు, గెలుపు కోసం చివరివరకూ పోరాడే తత్వం మిమ్మల్ని నిజమైన యోధుడిగా మార్చేశాయి. ముందు తొక్కేసి తర్వాత పొగడ్తలుకామనర్గా అడుగుపెట్టిన పవన్ యోధుడిగా మారారు. అమాయకమైన చిరునవ్వు వెనకున్న డీమాన్ ఏంటో అందరికీ చూపించారు. నామినేషన్లలో ఎంతమంది మాటలతో దాడి చేసినా, మీరు మౌనంగా నిలబడ్డారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు' అని చెప్పుకొచ్చాడు. ఓ దశలో రీతూతో బంధం కారణంగా డీమాన్ ఆటతీరుపై చాలానే విమర్శలు వచ్చాయి. టాస్కుల బాహుబలికానీ వాటిని తట్టుకుని నిలబడ్డాడు. రీతూ ఎలిమినేట్ అయి బయటకెళ్లిపోయిన తర్వాత డీమాన్ అసలు గేమ్ బయటపడింది. పంచ్‌లేస్తూ కామెడీ చేయడం, టాస్కుల్లో బాహుబలిలా ఆడటం, గేమ్‌పై ఫుల్ ఫోకస్ లాంటి అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ స్పీడ్ ముందు నుంచి ఉండుంటే కచ్చితంగా విన్నర్ అయ్యేవాడే అని కూడా మాట్లాడుకున్నారు. ఏదేమైనా సెకండ్ రన్నరప్‌గా బయటకు వచ్చాడు.సంపాదన ఎంతంటే?ఇతడి రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. కామనర్స్ అందరికీ ఒకే పారితోషికం ఇచ్చారు. అలా డీమాన్‌కి కూడా వారానికి రూ.70 వేల పారితోషికం ఇచ్చేలా డీల్ కుదిరింది. ఓవరాల్‌గా 15 వారాలకుగానూ రూ.10.50 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. దీనికి రూ.15 లక్షలు తోడవడంతో మొత్తం రూ.25 లక్షలకు పైగా సంపాదించాడు. మొత్తానికి పవన్‌కు ఈ షోతో డబ్బుకు డబ్బు, పేరుకు తగ్గ గుర్తింపు వచ్చింది.
బిగ్‌బాస్ 9 విన్నర్‌గా కల్యాణ్.. రూ.50 లక్షలు సొంతం!
తెలుగు బిగ్‌బాస్ 9వ సీజన్ ముగిసింది. 105 రోజుల యుద్ధానికి తెర పడింది. నేడు (డిసెంబర్ 21న) జరిగిన గ్రాండ్ ఫినాలేలో సంజనా ఐదో స్థానంలో, ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలవగా పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తనూజపై కామనర్ పవన్ కల్యాణ్ పడాల గెలిచాడు. బిగ్‌బాస్ షోలో అడుగుపెడ్తే చాలనుకున్న స్టేజీ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు. సామాన్యుడు తల్చుకుంటే జరనిదంటూ ఏమీ ఉండదని నిరూపించాడు. అతడి సంకల్ప బలానికి, ప్రేక్షకుల అభిమాన బలం తోడైంది. ఫలితంగా విజేతగా నిల్చాడు. సెలబ్రిటీ తనూజను ఓడించి మరీ విజయ పతాకం ఎగరవేశాడు. అతడి గెలుపును సామాన్యులందరూ తమ విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తొలిసారి తెలుగు బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు.రెమ్యునరేషన్ ఎంత?సామాన్యులందరికీ ఒకటే రెమ్యునరేషన్ ఫిక్స్ చేసింది బిగ్‌బాస్ టీమ్. అలా అందరిలాగే కల్యాణ్‌కు సైతం ప్రతి వారానికి రూ.70,000 అందాయి. పదిహేను వారాలకుగానూ రూ.10.50 లక్షలు సంపాదించాడు. ట్రోఫీతోపాటు రూ.50 లక్షలు కూడా కైవసం చేసుకునేవాడే! కానీ, పవన్ రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకోవడంతో మిగిలిన రూ.35 లక్షలు తన సొంతం చేసుకున్నాడు. రాఫ్ టైల్స్ వారు మరో రూ.5 లక్షలు గిఫ్టిచ్చారు. అలా మొత్తంగా రూ.50 లక్షలకుపైగా సంపాదించాడు. డబ్బుతో పాటు మారుతి సుజుకికి చెందిన విక్టోరిస్ కారును సైతం తన సొంతం చేసుకున్నాడు. ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు విలువ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉంది.
ఆకాశానికెత్తి నట్టేట ముంచారు.. ఇమ్మూ కన్నీళ్లకు కారణమెవరు?
కష్టపడితే ఫలితం దానంతటదే వస్తుంటారు.. ఏదీ? రాదే? అందరికంటే ఎక్కువ కష్టపడిన ఇమ్మాన్యుయ్యేల్ను నాగార్జున సీజన్ అంతా ఆకాశానికెత్తారు. గోల్డెన్ స్టార్.. ప్రేక్షకుల సపోర్ట్ నీకే అంటూ మురిపించారు. గెలుపు గురించి ఢోకా లేదు, తడిగుడ్డ వేసుకుని పడుకో అన్నచందంగా బీబీ టీమ్ బిల్డప్ ఇచ్చింది. ట్రోఫీని ముద్దాడటమే ఆలస్యం అని గంపెడాశతో ఉన్న ఇమ్మాన్యుయేల్‌ను చివరకు నట్టేట ముంచారు. తప్పెవరిది?విన్నర్ కాదు కదా రన్నర్వి కూడా కాలేవంటూ నాలుగో స్థానంలో పడేశారు. అతడు పడ్డ కష్టానికి, వచ్చిన నాలుగో ర్యాంక్‌కు అసలు సంబంధమే లేదు. ఇక్కడ తప్పెవరిది? బిగ్‌బాస్ టీమ్‌దా? ప్రేక్షకులదా? పోనీ ఇమ్మూ కేవలం కామెడీ మాత్రమే పంచాడా? అంటే కానే కాదు. తనకున్న తెలివితేటలు అమోఘం. నాగార్జున ఏం అడుగుతాడు? ఈ వారం జరగనుంది? అని ముందే ఊహించేవాడు. అతడు లెక్క ఎప్పుడూ తప్పవలేదు. తను ఊహించిందే జరిగింది. సంజనాను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తిసంజనా గుడ్డు దొంగతనం చేసినప్పుడు అందరూ కయ్యిమని అరుస్తూ ఆమెను నానామాటలు అంటుంటే ఇమ్మూ (Emmanuel) ఒక్కడే ఆమె గేమ్‌ప్లాన్ అర్థం చేసుకున్నాడు. తాను తిట్లుపడ్డా తప్పులేదు, కానీ ప్రేక్షకుల్ని ఎలాగైనా అలరించాలన్న ఆమె కసిని గమనించి ఫిదా అయ్యాడు. చంటిపాపను, కొడుకును వదిలేసి వచ్చిన ఆమెకు కొడుకయ్యాడు. ప్రేమను పంచాడు. ఆమె తప్పులు చేసినప్పుడు వారించాడు. కెప్టెన్సీ త్యాగంమాటలు తూలినప్పుడు హెచ్చరించాడు. నాగార్జున ముందు కూడా తప్పును తప్పే అని వాదించాడు. కానీ, తనను ఎలిమినేషన్ నుంచి కాపాడుకునే ఛాన్స్ వచ్చినప్పుడు క్షణం ఆలోచించకుండా కెప్టెన్సీని త్యాగం చేశాడు. కావాలంటే కెప్టెన్సీని మళ్లీ సంపాదిస్తానన్న ధైర్యం, అమ్మ కావాలన్న తపన.. రెండూ అతడిలో కనిపించాయి. ఎమోషనల్, తెలివితేటలు, మంచితనం, స్నేహబంధం వంటివెన్నో ఉన్నా అతడిలో కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. ఆటను చేజేతులా నాశనం చేసుకున్నాడా?మొదట నామినేషన్ అంటే భయం. ఆ భయమే తన ఓటమికి పునాది వేసింది. సీజన్ మొత్తంలో అందరికంటే ఎక్కువ టాస్కులు గెలిచిన ఇమ్మూ.. తన సత్తా ఏంటో చూపించాడు. టాస్కుల మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న అతడు టికెట్ టు ఫినాలేలో మాత్రం కల్యాణ్‌తో చేతులు కలిపాడు. ఇది అతడికి మరో మైనస్‌గా మారింది. సింగిల్ సింహంలా ఎన్నో గేమ్స్ ఆడి గెలిచిన ఇమ్మూ చివరికొచ్చేసరికి ఇలా మరొకరితో జోడీ కట్టి పక్కవాళ్లను ఓడించాలని చూడటం చాలామందికి నచ్చలేదు. మరోసారి రుజువైంది!కానీ ఇంతమాత్రానికే అతడిని నాలుగో స్థానంలో పెట్టడం కరెక్ట్ కాదనే చెప్పాలి. ఏదేమైనా ఇక్కడ ఇమ్మాన్యుయేల్ ఓడిపోలేదు.. అందరూ కలిసి అతడిని ఓడించారు. కమెడియన్లు ప్రాణం పెట్టి ఆడినా, కట్టే కాలేవరకు నవ్విస్తామన్నా వాళ్లను కేవలం జోకర్స్లాగే చూశారు. ఇప్పుడు అందరిలో జోకర్‌గానే నిలబెట్టారు. కమెడియన్స్ కప్పు గెలవలేరని మరోసారి రుజువు చేశారు!
టాప్-5 నుంచి 'సంజన' ఎలిమినేట్.. భారీగా రెమ్యునరేషన్
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి సంజనా గల్రానీ టాప్- 5 నుంచి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రన్నర్‌గా ఆమె నిలిచారు. నటుడు శ్రీకాంత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. సంజన 105 రోజుల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నారు. మొదట ఆమె టాప్-5లో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. అయితే, కోడిగుడ్లు దొంగతనం చేసి నెట్టింట వైరల్ అయిపోయింది. అలా తన ఆట నెటిజన్లకు సులువుగా చేరిపోయింది. ఆ తర్వాత తల్లీకొడుకు బంధంతో ఇమ్మానుయేల్‌తో కనెక్ట్ అయిపోయింది. ఈ క్రమంలో ఇమ్ము నామినేషన్‌కు రాకపోవడంతో అతని అభిమానులు కూడా సంజనకు ఓట్లు వేస్తూ కాపాడారు. దీంతో సంజన సులువుగా టాప్-5 వరకు చేరుకుంది.సంజన ఆటలో ఇమ్ము చాలా కీలకం. అయితే, ఆమె చివరి వారాల్లో మాట్లాడిన తీరు, ఆట ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. బిగ్‌బాస్‌లో ఆమె ప్రయాణం ఎలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసిందో సంజన జర్నీ వీడియో చూస్తే అర్థం అవుతుంది. సంజనలోని ఫన్నీ, ఎమోషనల్, గొడవలు వంటి వాటిని బాగా బాగా చూపించారు.సంజన రెమ్యునరేషన్సంజన ఇప్పటికే సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. దీంతో ఆమె రెమ్యునరేషన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. టాప్-5 ఉన్నవారందరి రెమ్యునరేషన్ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలో సంజన గల్రానీ బిగ్‌బాస్ హౌస్‌లో మొత్తం 15 వారాలు కొనసాగారు. ఆమెకు రోజుకు 40 వేల వరకు రెమ్యునరేషన్ వచ్చినట్లు టాక్. అంటే ఒక వారానికి సుమారుగా రూ. 2.80 లక్షలు ఉంటుంది. అలా 15 వారాలు బిగ్ బాస్‌లో ఉన్నారు. దీంతో సుమారుగా రూ. 42 లక్షల వరకు పారితోషికాన్ని సంజన తీసుకున్నట్లు తెలుస్తోంది.
క్రీడలు
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో హిట్.. టెస్ట్‌ల్లో ఫట్..!
2025.. భారత పురుషుల క్రికెట్‌కు మిశ్రమ ఫలితాలు మిగిల్చిన సంవత్సరం. ఈ ఏడాది టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి. టెస్ట్ క్రికెట్లో చతికిలబడిన భారత్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం సత్తా చాటింది.షాకిచ్చిన దిగ్గజాలుఈ ఏడాది దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.అప్పటికే (2024 టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత) పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగిన రో-కో.. టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు. వారం వ్యవధిలో ఇది జరిగిపోయింది. భారత క్రికెట్ అభిమానులకు 2025లో ఇదే అతి పెద్ద షాక్. సుదీర్ఘ అనుభవం కలిగిన రోహిత్, కోహ్లి ఒకేసారి నిష్క్రమించడంతో, టెస్ట్‌ల్లో భారత్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. టెస్ట్‌ల నుంచి వైదొలుగుతూనే రోహిత్ వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పేశాడు. సాధారణ ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించాడు.గిల్ జమానా షురూదీంతో టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ శకం మొదలైంది. అయితే రోహిత్, కోహ్లి గైర్హాజరీలో గిల్‌కు టెస్ట్ జట్టు బాధ్యతలు మోయడం కాస్త కష్టమైంది. టెస్ట్ కెప్టెన్‌గా తొలి పర్యటనలో గిల్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చావుతప్పి కన్ను లొట్ట బోయిందన్న చందంగా ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలిగాడు. కానీ, ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ సిరీస్‌లో గిల్ వ్యక్తిగతంగా అత్యుత్తమంగా రాణించాడు.5 మ్యాచ్‌ల్లో 75.40 సగటున, నాలుగు శతకాల సాయంతో (ఓ డబుల్ సెంచరీ) 754 పరుగులు సాధించాడు. ఓ భారత క్రికెటర్ విదేశీ గడ్డపై కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్, పంత్, జైస్వాల్, సుందర్, సిరాజ్, బుమ్రా, ఆకాశదీప్ లాంటి వాళ్లు కూడా రాణించినా, రోహిత్, కోహ్లి లోటు మాత్రం భర్తీ చేయలేనిదిగా కనిపించింది.ఓటమితో ప్రారంభం2025 సంవత్సరాన్ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో కోల్పోయింది. ఈ ఓటమితో సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ జెర్సీల్లో కనిపించిన చివరి సిరీస్ ఇదే.విండీస్‌ను క్లీన్ స్వీప్ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌లు అయిన తర్వాత ఈ ఏడాది భారత్ స్వదేశంలో విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.సొంతగడ్డపై పరాభవంఈ ఏడాది భారత్‌కు టెస్ట్‌ల్లో సొంతగడ్డపైనే ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఓవరాల్‌గా చూస్తే, ఈ ఏడాది భారత్‌కు విండీస్‌పై మినహా ఒక్క టెస్ట్ సిరీస్ విజయం కూడా దక్కలేదు.వన్డేల్లో తిరుగలేని భారత్ఈ ఏడాది భారత్ వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శనలు చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి, ఈ ఏడాది ఘనంగా బోణీ కొట్టింది.మూడోసారి ఛాంపియన్అనంతరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆసీస్ చేతిలో భంగపాటుఈ ఏడాది ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసి, అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకున్న భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. ఆసీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.రెచ్చిపోయిన రోహిత్.. నిరాశపరిచిన కోహ్లిఈ సిరీస్‌లో రోహిత్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీతో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. విరాట్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటై నిరాశపరిచాడు. అయితే కోహ్లి మూడో వన్డేలో అర్ద సెంచరీతో రాణించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.పూనకాలు తెప్పించిన కోహ్లి.. సౌతాఫ్రికాకు చుక్కలుఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బందిపడిన కోహ్లి స్వదేశంలో సౌతాఫ్రికా జరిగిన వన్డే సిరీస్‌లో పూనకాలు తెప్పించాడు. వరుసగా రెండు సెంచరీలు చేసి ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ కూడా పర్వాలేదనిపించాడు. రో-కో చెలరేగడంతో భారత్ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైసవం చేసుకుంది. తద్వారా ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌ను ఘనంగా ముగించింది. ఆసీస్‌తో సిరీస్ మినహా టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించింది. ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై సిరీస్ విజయాలతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.పొట్టి ఫార్మాట్లో తిరుగులేని భారత్ పొట్టి ఫార్మాట్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే అద్భుతంగా రాణించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో జైత్రయాత్రను ప్రారంభించి.. సౌతాఫ్రికాపై 3-1 గెలుపుతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.ఈ మధ్యలో భారత్ ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఆ టోర్నీలో టీమిండియా పాక్‌ను (ఫైనల్ సహా) ముచ్చటగా మూడుసార్లు ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే టైటిల్ గెలిచాక ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు బాస్‌గా ఉన్న పాకిస్తానీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని కూడా తీసుకోలేదు. నఖ్వీ భారత ఆటగాళ్లకు ఇప్పటివరకు ట్రోఫీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.ఆసియా కప్ తర్వాత భారత్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించింది. ఓవరాల్‌గా చూస్తే.. భారత్ ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా నిలిచింది.
శ్రీలంకతో తొలి టీ20.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
వన్డే ప్రపంచకప్ గెలిచాక ఆడుతున్న తొలి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ప్రత్యర్ధిని 121 పరుగులకే పరిమితం చేసింది (6 వికెట్ల నష్టానికి).దీప్తి శర్మ (4-1-20-1) పొదుపుగా బౌలింగ్ చేసి లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. అరంగేట్రం బౌలర్ వైష్ణవి శర్మ (4-0-16-0) అంచనాలకు తగ్గట్టుగా రాణించి శభాష్ అనిపించింది. మరో బౌలర్ అరుంధతి రెడ్డి (4-0-23-0) కూడా పర్వాలేదనిపించింది. శ్రీచరణి (4-0-30-1), క్రాంతి గౌడ్ (3-0-23-1) కూడా రాణించారు.భారత బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. 39 పరుగులు చేసిన విష్మి గౌతమ్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈమె కాకుండా కెప్టెన్ చమారి (15), హాసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు కూడా అద్బుతమైన ప్రదర్శన చేశారు. నిలాక్షి డిసిల్వ (8), కవిష దిల్హరిని (6) రనౌట్ చేశారు.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్‌కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైటీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
శ్రీలంకతో తొలి టీ20.. తొలుత బౌలింగ్ చేయనున్న టీమిండియా
వన్డే ప్రపంచకప్ గెలిచాక భారత మహిళల క్రికెట్ జట్టు తొలి సిరీస్ ఆడుతుంది. ఇవాల్టి నుంచి (డిసెంబర్ 21) స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. విశాఖ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. మంచు ప్రభావం కారణంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలవగానే సంకోచించకుండా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో వైష్ణవి శర్మ అరంగేట్రం చేయనుంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది.మరోవైపు టాస్ ఓడిన శ్రీలంక కూడా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఆ జట్టు కెప్టెన్ చమరి అతపత్తు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. 17 ఏళ్ల శశిని గిమ్హనై అందరి దృష్టిని ఆకర్శిస్తుందని తెలిపింది.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్‌కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనైటీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి
పాక్ బౌలర్‌కు ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ
భారత్, పాకిస్తాన్ మధ్య ఇవాళ (డిసెంబర్ 21) జరిగిన అండర్-19 పురుషుల ఆసియా కప్ ఫైనల్లో ఉద్రికత్త చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా భారత బ్యాటర్లను పాక్ బౌలర్ అలీ రజా రెచ్చగొట్టాడు. తొలుత భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రేను టార్గెట్ చేసిన రజా.. ఆతర్వాత చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని గెలికాడు. ఇద్దరూ తగు రీతిలో రజాకు సమాధానం చెప్పడంతో వాతావరణం వేడెక్కింది.ఏమన్నావురా..?భారీ లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ ఆయుశ్ మాత్రే పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ దశలో అలీ రజా అద్బుతమైన బంతితో మాత్రేను ఔట్ చేశాడు. ఔట్ చేసిన ఆనందంలో రజా మాత్రే పట్ల దురుసుగా స్పందించాడు. ఇక చాలు వెళ్లు అన్నట్లు హావభావాలు ప్రదర్శించాడు. దీంతో చిర్రెత్తిపోయిన మాత్రే ఏమన్నావురా అన్నట్లు రజా మీదికి వెళ్లాడు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.वैभव सूर्यवंशी पाकिस्तानियों को उनकी औकात बताते हुए ।#INDvsPAK #vaibhavsuryavanshi pic.twitter.com/NpoPl5hBFA— सनातन सर्वोच्च🚩 मोदी का परिवार (@sanatani58) December 21, 2025నీ స్థాయి నా కాళ్ల కింద..!మాత్రేని గెలికి చీవాట్లు తిన్న రజా వైభవ్ సూర్యవంశీతో కూడా అలాగే ప్రవర్తించాడు. సిక్సర్‌తో ఛేదన ప్రారంభించిన సూర్యవంశీని (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) ఔట్ చేసిన రజా ఓవరాక్షన్ చేశాడు. సూర్యవంశీకి ఫియరీ సెండాఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. రజా ఓవరాక్షన్‌కు సూర్యవంశీ కూడా తగు రీతిలో బదులిచ్చాడు. నీ స్థాయి నా కాళ్ల కింద అన్నట్లు రజాకు బుద్ది చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.టీమిండియాకు పరాభవం348 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. 26.2 ఓవర్లలో 156 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా 191 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాశించాడు. మొహమ్మద్ సయ్యమ్, అబ్దుల్ సుభాన్, సుజైఫా ఎహసాన్ తలో 2 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టారు.భారత్ తరఫున చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (10 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) సిక్సర్‌తో ఛేదనను ప్రారంభించినా కొద్ది సేపటికే ఔటయ్యాడు. అంతకుముందే కెప్టెన్ ఆయుశ్ మాత్రే (2), స్టార్ ప్లేయర్ ఆరోన్ జార్జ్ (16) పెవిలియన్‌కు చేరారు. 86 పరుగులకే 6 వికెట్లు కోల్పోవడంతో ఆదిలోనే భారత ఓటమి ఖరారైంది.ఆఖర్లో దీపేశ్ దేవేంద్రన్ (36) కంటితుడుపుగా బ్యాట్ ఝులిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇతనే టాప్ స్కోరర్. మిగతా ఆటగాళ్లలో విహాన్ మల్హోత్రా 7, వేదాంత్ త్రివేది 9, అభిగ్యాన్ కుందు 13, కనిష్క్ చౌహాన్ 9, ఖిలన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6 పరుగులు చేసి ఔటయ్యారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఓపెనర్ సమీర్ మిన్హాస్ (113 బంతుల్లో 172; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అహ్మద్ హుసేన్ (56), ఉస్మాన్ ఖాన్ (35) పర్వాలేదనిపించారు. ఓ దశలో పాక్ 400 పరుగుల మార్కు దాటుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు పుంజుకోవడంతో పాక్ ఆఖర్లో త్వరితగతిన 5 వికెట్లు కోల్పోయింది. ఇదే సమయంలో స్కోర్ కూడా నెమ్మదించింది.భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు పడగొట్టగా.. హెనిల్ పటేల్, ఖిలన్ పటేల్ తలో 2, కనిష్క్ చౌహాన్ ఓ వికెట్ తీశారు. కాగా, ఈ టోర్నీ సెమీఫైనల్లో భారత్ శ్రీలంకను.. పాక్ బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్స్‌కు చేరాయి. గత ఎడిషన్‌లోనూ ఫైనల్లోనే ఓడిన (బంగ్లాదేశ్) భారత్ మరోసారి రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టే్ట్ రివర్స్... భారీగా క్షీణించిన స్థిరాస్తుల క్రయవిక్రయాలు, అవసరానికి అమ్ముకోలేక ప్రజల అవస్థలు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి!. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు... కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర మంత్రివర్గం
బిజినెస్
స్కూల్ యాన్యువల్ డే వేడుకల్లో నీతా అంబానీ
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) వార్షికోత్సవ వేడుకలను నీతా అంబానీ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ.. పూజా కార్యక్రమంతో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''కుటుంబం అంటే నిజమైన ప్రేమను అర్థం చేసుకునే ప్రదేశం, మన కష్టాలను ఆనందాలను పంచుకునే ప్రదేశం, విభేదాలను పరిష్కరించుకోవడం ఎలా అని తెలుసుకునే ప్రదేశం. విలువలు, సంస్కృతి అనేది తాతలు, తల్లిదండ్రుల నుంచి లభిస్తాయని పేర్కొన్నారు. నా అతిపెద్ద బలం, నా చీర్లీడర్ నా భర్త ముఖేష్" అని అన్నారు.ఈ వేడుకలకు ముకేశ్ అంబానీ, ఇషా అంబానీ మాత్రమే కాకుండా.. ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్ మొదలైన సెలబ్రిటీలు హాజరయ్యారు. View this post on Instagram A post shared by DAIS Mumbai (@daismumbai)
ఫుడ్ డెలివరీ యాప్‌లు వద్దు బాబోయ్..
దేశంలో ఫుడ్ డెలివరి యాప్‌లు విస్తృతంగా పెరిగిపోయాయి. వాస్తవంగా ఈ యాప్‌లు రెస్టారెంట్ పరిశ్రమకు కస్టమర్లను, ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ యాప్స్‌ను నమ్ముకుని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయా.. లేక రెస్టారెంట్లపై ఆధారపడి ఫుడ్ డెలివరి యాప్‌లు పనిచేస్తున్నాయా అంటే చెప్పడం కష్టం.అయితే ఇవే ఫుడ్ డెలివరి యాప్‌లు రెస్టారెంట్లకు ఆర్థికంగా, కార్యాచరణపరంగా ఒత్తిళ్లను కూడా తెస్తున్నాయి. ప్రోసస్ సౌజన్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ఫుడ్ డెలివరి యాప్‌లు, రెస్టారెంట్ల మధ్య నలుగుతున్న వివాదాస్పద ఘర్షణను వెలుగులోకి తెచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాల్లోని రెస్టారెంట్లతో నిర్వహించిన వివరణాత్మక సర్వేలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్‌లను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లలో 35 శాతం అవకాశం ఉంటే ఈ యాప్‌ల నుండి నిష్క్రమించాలనే అనుకుంటున్నాయి. అదే సమయంలో దాదాపు మూడింట రెండు వంతుల రెస్టారెంట్లు మాత్రం ఫుడ్ డెలివరీ యాప్‌లతో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నాయి.రెస్టారెంట్ల బేజారుకు కారాణాలివే..అధిక కమీషన్లు ఫుడ్ డెలివరీ యాప్‌లపై రెస్టారెంట్ల అసంతృప్తికి ప్రధాన కారణం ప్రతి ఆర్డర్‌పై అవి వసూలు చేపసే కమీషన్. నివేదిక ప్రకారం.. ప్లాట్ ఫామ్ కమీషన్లు కొన్నాళ్లుగా పెరిగిపోయాయి. బిల్లు మొత్తంలో వాటి వాటా గణనీయంగా ఉంటోంది. చాలా మంది రెస్టారెంట్ యజమానులకు, ఆర్డర్ వాల్యూమ్‌లు బలంగా ఉన్నప్పటికీ, కమీషన్ల కారణంగా ఆర్డర్‌కు వచ్చే నికర ఆదాయాలు తగ్గిపోయాయి. "సగటు 'పర్ ఆర్డర్' కమిషన్ 2019లో 9.6 శాతం ఉండగా 2023 వచ్చేసరికి అది 24.6 శాతానికి పెరిగింది. సొంత డెలివరీ యాప్‌ల వైపు రెస్టారెంట్లుఅధిక కమిషన్లు, నియంత్రణల కారణంగా అనేక రెస్టారెంట్లు ఇప్పుడు తమ సొంత డెలివరీ యాప్‌లు, వెబ్సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల అవసరం తగ్గుతుంది. కమిషన్ల భారం ఉండదు. కస్టమర్ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. లాభాల మార్జిన్ మెరుగుపడుతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్ద చైన్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, మధ్యస్థ స్థాయి హోటళ్లు కూడా వాట్సాప్ ఆర్డర్లు, లోకల్ డెలివరీ బాయ్స్ సహాయంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి.బ్రాండ్ విలువకు దెబ్బఫుడ్ డెలివరీ యాప్‌లు తరచూ భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఫెస్టివ్ డీల్స్ వంటి వాటిని రెస్టారెంట్లపై ఒత్తిడి చేసి అమలు చేయిస్తున్నాయి. దీని వల్ల రెస్టారెంట్ ధరల స్వతంత్రత కోల్పోతుంది. బ్రాండ్ విలువ తగ్గుతోంది. ఆఫ్‌లైన్ కస్టమర్లతో ధరల అసమతుల్యత ఏర్పడుతుంది.
వారం రోజులు.. మారిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతున్నాయి. తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గత వారం రోజుల్లో (డిసెంబర్ 14 – డిసెంబర్ 21) హైదరాబాద్ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయ మార్పులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు మొత్తంగా చూస్తే స్వల్పంగా పెరిగాయి.ధరల మార్పు ఇలా..డిసెంబర్ 14న రూ.1,33,910గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర.. పెరుగుతూ.. తగ్గుతూ డిసెంబర్ 21 నాటికి రూ.1,34,180 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల అనంతరం నికరంగా రూ.270 పెరిగింది.ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే డిసెంబర్ 14న రూ.1,22,750తో ప్రారంభమై, డిసెంబర్ 21న రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది. నిరకంగా చూస్తే వారం రోజుల్లో రూ.250 ఎగిసింది.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుబంగారాన్ని ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్టర్లు ‘సేఫ్-హేవెన్’గా కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం డిమాండ్.. ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ బంగారం ధరలు యూఎస్ డాలర్ బలం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ బలంగా మారితే బంగారం ఫ్యూచర్స్‌పై ప్రభావం పడుతుంది. ఇది స్థానిక ధరలను ప్రభావితం చేస్తుంది.డిసెంబర్లో పండుగలు, శుభదినాలు, పెళ్లి సీజన్ మొదలైన సందర్భాల నేపథ్యంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది.ఇక స్థానికంగా ఉన్న పన్నులు, సరఫరా, డిమాండ్ కూడా రోజువారీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది.
కొటక్ బ్యాంక్‌పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.61.95 లక్షలు జరిమానా చెల్లించాలని కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.జరిమానా ఇందుకే.. ‘బ్యాంకింగ్ సేవలు అందించడం - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ 'బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీ) చేపట్టాల్సిన కార్యకలాపాల పరిధి'పై ఆదేశాలను పాటించనందుకు అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.2024 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి బ్యాంక్ సూపర్వైజరీ మూల్యాంకనాన్ని (ISE 2024) తనిఖీ చేసిన ఆర్బీఐ.. ఇప్పటికే కనీస సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్లకు అలాంటి మరో ఖాతాను తెరిచినట్లు గుర్తించింది. అలాగే అనుమతించిన పరిధికి మించిన కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు అవకాశం కల్పించినట్లు కూడా గమనించింది. అంతేకాకుండా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి) తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తేల్చింది.
ఫ్యామిలీ
వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?
చాలామంది కాఫీ తాగడం అనేదాన్ని ఒక అనారోగ్యకరమైన అలవాటుగానే భావిస్తారు. అయితే కాఫీ సేవనం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాల్లో ఎక్కువ భాగం పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ల వల్లనే లభిస్తాయని, ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయని రిజిస్టర్డ్ డైటీషియన్, ఫుడ్ ట్రైనర్స్ వ్యవస్థాపకురాలు లారెన్ స్లేటస్ అంటున్నారు.ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవని, హిస్పానిక్ ఫుడ్ కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకురాలు సిల్వియా క్లింగర్ సైతం చెబుతున్నారు. శరీరంలోని అనేక విభిన్న అవయవాలకు మద్దతు ఇస్తుంది. కాఫీ అందించే ప్రధాన ప్రయోజనాలు.. ఓ ఆంగ్ల మీడియా వేదికగా వీరు చెబుతున్న ప్రకారం...–కాఫీ (Coffee) స్వల్పకాలిక ఏకాగ్రతకు సహాయపడటం తో పాటు దీర్ఘకాలంలో ఇది న్యూరోప్రొటెక్టివ్‌గా కూడా ఉంటుంది. చురుకుదనం, జ్ఞాపకశక్తి సహా మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు,డిప్రెషన్, పార్కిన్సన్స్ అల్జీమర్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. – కాఫీ తీసుకోవడం గుండె జబ్బులతో పాటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సమస్యల కారణంతో మరణించే ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.– కాలేయ వ్యాధి, ముఖ్యంగా ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటివి నివారిస్తుంది. అలాగే కాలేయం, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.–కాఫీ తాగేవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.కాఫీ మితంగా.. ప్రయోజనాలు అమితంగా...ఈ ప్రయోజనాలు లభించాలంటే మితమైన కాఫీ తీసుకోవడం అవసరం. అంటే షుమారుగా రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోకూడదు. అయితే ఈ పరిమాణం అనేది వ్యక్తుల్ని బట్టి వారి శారీరక స్థాయిలను బట్టి మారవచ్చు.– ఆరోగ్య ప్రయోజనాలను పెంచడానికి మూడు లేదా నాలుగు కప్పులు లేదా దాదాపు 300 నుంచి 400 మిల్లీగ్రాముల కాఫీ వరకూ ఓకే. దీని వల్ల హాని కంటే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే అవకాశం ఎక్కువ.– చాలా మంది విశ్వసించినట్టుగా కాఫీ డీహైడ్రేట్ చేయదు. కెఫీన్ తేలికపాటి మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉండి ఎక్కువగా మూత్ర విసర్జనకు కారణమవుతుంది. అయితే కాఫీలోని నీటి శాతం ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తుంది.–‘చక్కెర, ప్రాసెస్ చేసిన నూనెలు తీపి పదార్థాలు లాగా కాకుండా కాఫీ, దానికదే సహజమైనది, కల్తీ లేనిది, అందువల్లే పలు ప్రయోజనాలను కలిగి ఉంది. అదనపు కొవ్వు, కేలరీలు చక్కెరను జోడించడం కాఫీని అధిక కేలరీల పానీయంగా మారుస్తాయి. తద్వారా బరువు, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది.ఓట్ మిల్క్, సోయా మిల్క్, లాక్టోస్ లేని పాలు అయితే ఓకే. దాల్చిన చెక్క, వనిల్లా లేదా బాదం సారం, తియ్యని కోకో పౌడర్, స్టెవియా, మాంక్‌ఫ్రూట్ తక్కువ మొత్తంలో తేనె లేదా మాపుల్ సిరప్ వంటి సహజ పదార్ధాలను మేళవించవచ్చు. తక్కువ ఆమ్లత్వం, తియ్యని రుచిని కలిగి ఉండే కోల్డ్ బ్రూ కాఫీని ప్రయత్నించవచ్చు. బ్లాక్ కాఫీని తాగడం దుర్లభంగా భావించే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.కాఫీ తాగడానికి సరైన సమయం..?నిద్రకు అంతరాయం కలగకుండా ఉండటానికి, ఉదయం పూట కాఫీ తాగడం ఉత్తమం. ‘కాఫీకి ఎక్కువ అర్ధ–జీవితకాలం ఉంటుంది, అంటే‘ఇది చాలా మంది అనుకున్నదానికంటే ఎక్కువ కాలం మన శరీర వ్యవస్థలో ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత కాఫీని నిలిపివేయాలి. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు సమయం సహజ కార్టిసాల్ కదలికలకు అంతరాయం కలిగించకుండా శక్తిని పెంచడానికి అనువైనది.చదవండి: కమిట్మెంట్ అంటే అది!వ్యాయామం (Exercise) చేసే ముందు కూడా కాఫీ తాగొచ్చు. ఎందుకంటే ఇది పనితీరు ఓర్పును మెరుగుపరచడంలో సహకరిస్తుంది. అయితే ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు. ఇది కడుపులోని పొరలకు ఇబ్బంది కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ లేదా ఉబ్బరానికి దారితీస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను కూడా పెంచుతుంది, ఈ సమస్యలను నివారించడానికి కాఫీ తాగే ముందు గుడ్లు, అవకాడో టోస్ట్, తృణధాన్యాలు వంటి అల్పాహారం తినాలి. అలాగే భోజనానికి ముందు కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది శరీరం ఇనుమును గ్రహించనీయకుండా ఆటంకం కలిగిస్తుంది.(గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం)
క్రీస్తుపూర్వం బడి... నేటికీ ఉంది తెలుసా?
పిల్లలూ! మీ స్కూల్ కట్టి ఎన్నేళ్లయ్యింది? పదేళ్లు, ఇరవై ఏళ్లు..మహా అయితే యాభై ఏళ్లు. అయితే వేల సంవత్సరాల క్రితమే ఉన్న బడి గురించి తెలుసా? మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేటికీ అది నడుస్తోంది. అందులో విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే చైనా దేశంలోని చాంటూ షూషే ఉన్నత పాఠశాల.ఈ పాఠశాలను క్రీ.పూ.143–141 సంవత్సరాల మధ్య హాన్ రాజవంశపు గవర్నర్ వెన్ వెంగ్ నిర్మించారు. చైనాలో స్థానిక ప్రభుత్వం నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాల ఇదే. దీన్ని మొదట రాళ్లతో నిర్మించారు. అందుకే దీనికి ‘షూషే’ అంటారు. అంటే ’రాతి గది’ అని అర్థం. ఈ పాఠశాలను వెన్వెంగ్ షూషే అని కూడా పిలుస్తారు. చరిత్రలో నిలిచిన హాన్ రాజవంశ పండితుడు సిమా జియాంగ్రు ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. అనంతరం ఈ పాఠశాల అగ్నిప్రమాదంలో ధ్వంసమైంది. ఆపై క్రీ.శ.199లో పునర్నిర్మించారు. 17వ శతాబ్దంలో మింగ్ రాజవంశం పతనమైనప్పుడు జాంగ్ జియాన్ జాంగ్ యొక్క తిరుగుబాటు దళం ఈ బడిని నాశనం చేసింది.1661లో క్వింగ్ రాజవంశం అదే ప్రదేశంలో బడిని తిరిగి స్థాపించింది. తరువాత కాలంలో సిచువాన్ విశ్వవిద్యాలయంగా మారిన జిన్జియాంగ్ అకాడమీ 1740లో ఈ పాఠశాలలోనే స్థాపించారు.1902లో ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానంలో ఇది ‘చెంగ్డు ఫుక్సు చెంగ్డు నార్మల్ స్కూల్’గా మారింది. ఆ తర్వాత 1904లో ఇది చెంగ్డు మిడిల్ స్కూల్‌గా మారింది. 1940లో దీన్ని చెంగ్డు షూషే మిడిల్ స్కూల్‌గా మార్చారు. 1948 మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న మాధ్యమిక పాఠశాలలకు ఒక నమూనాగా గుర్తించారు. 1952లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించిన తర్వాత ఈ పాఠశాల పేరును చెంగ్డు నంబర్ 4 మిడిల్ స్కూల్‌గా మార్చారు. చైనాలోని టాప్ 100 హైస్కూల్స్‌లో ఇదీ ఒకటిగా నేటికీ నిలబడింది. ఎంతోమంది చైనా ప్రముఖులు ఈ బడిలో చదువుకున్నారు.
నెల్లూరు చేపల పులుసు
కావలసినవి: చేప ముక్కలు (కొరమీను / వంజరం / బొచ్చ చేప) – అర కిలో; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి); టమాటాలు – 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి); పచ్చిమిర్చి – 3–4 (నిలువుగా కట్చేసినవి); వెల్లుల్లి రెబ్బలు – 8–10 ( నిలువుగా కట్చేసినవి); అల్లం – చిన్న ముక్క; కరివేపాకు – 2 కొమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; చింతపండు రసం – కప్పు (పులుపు తగినంత); నూనె – 3 టేబుల్ స్పూన్లు; పులుసు మసాలా: కారం – 2 టీ స్పూన్లు; ధనియాలపోడి – 2 టీ స్పూన్లు; పసుపు – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; జీలకర్రపోడి – పావు టీ స్పూన్; మెంతులు – పావు టీ స్పూన్.తయారీ: చేప ముక్కలను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు, పసుపు రాసి పక్కన పెట్టాలి. మట్టిపాత్ర లేదా మందమైన వెడల్పాటి పాత్రలో నూనె వేసి, వేడి చేయాలి. అందులో మెంతులు వేసి, వేగాక ఉల్లి, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు వేసి బాగా వేయించాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. తర్వాత కారం, ధనియాలపోడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు రసం, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు చేప ముక్కలను జాగ్రత్తగా పులుసులో వేయాలి. కదపకూడదు. మూత పెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. పులుసు నుంచి నూనె పైకి తేలినప్పుడు జీలకర్రపోడి, కొత్తిమీర వేసి మంట తీసేయాలి. వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.దాల్ మఖనీసంప్రదాయ ఉత్తర భారతీయ వంటకం కావలసినవి: మినప్పప్పు – కప్పు; రాజ్మా – పావు కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్లు; నూనె – టేబుల్ స్పూన్; ఉల్లిపాయ – పెద్దది (సన్నగా తరిగినది); టమాటా గుజ్జు – 2 కప్పులు; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; పచ్చిమిర్చి – 1 (సన్నగా తరగాలి); కారం∙– టీ స్పూన్; ధనియాలపోడి – టీ స్పూన్; గరం మసాలా – పావు టీ స్పూన్; ఉప్పు – తగినంత; పాల మీగడ – పావు కప్పు; కొత్తిమీర – అలంకరణకు;తయారీ: పప్పులు రాత్రిపూట నానబెడితే ఉదయానికి ఉడికించడానికి రెడీగా ఉంటాయి. నానబెట్టిన పప్పులను కుకర్‌లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి పాన్ లో నూనె, టేబుల్ స్పూన్ వెన్న వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి టమాటా గుజ్జు వేసి, నూనె తేలేవరకు ఉడికించాలి. తర్వాత కారం, ధనియాలపోడి, ఉప్పు వేసి బాగా కలపాలి తర్వాత ఉడికించిన మినప పప్పు, రాజ్మా పై మిశ్రమంలో వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు వేసి మెల్లగా మరిగించాలి. సన్నని మంటపై అరగంటసేపు ఉడికిస్తే రుచి మరింత బాగుంటుంది. చివరగా మిగిలిన వెన్న, మీగడ, గరం మసాలా వేసి కలిపి, ఐదు నిమిషాలు ఉడికించి, స్టౌ ఆఫ్ చేయాలి. పై నుంచి మరికొద్దిగా పాల మీగడ, కొత్తిమీర వేసి సర్వ్ చేయాలిదాల్ మఖానీని నాన్, రోటీ, జీరా రైస్ లేదా కుల్చాతో వడ్డిస్తే అద్భుతమైన రుచి వస్తుంది.మటన్ రోగన్ ఘోష్ఇది కాశ్మీర్‌కు చెందిన ప్రసిద్ధ వంటకం. ఘుమఘుమలాడే మసాలా, మృదువైన మటన్ ముక్కలు, ప్రత్యేకమైన రంగు, రుచి ఈ వంటకం ప్రత్యేకత. కావలసినవి: మటన్ – పావు కిలో; పెరుగు – కప్పు; ఉల్లి పాయలు – 2 (సన్నగా తరిగినవి); అల్లం – వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; కాశ్మీరీ కారం – 2 టీ స్పూన్లు; కారం – పావు టీ స్పూన్ ; ధనియాలపోడి – రెండు టీ స్పూన్లు; జీలకర్రపోడి – టీ స్పూన్; సోంపుపోడి – 1 టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; యాలకులు – 3; లవంగాలు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; బిర్యానీ – 1; నూనె లేదా నెయ్యి – నాలుగు టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – అలంకరణకు.తయారీ: మటన్‌కు కొద్దిగా ఉప్పు, సగం అల్లం–వెల్లుల్లి పేస్ట్ రాసి, 30 నిమిషాలు ఉంచాలి. పాన్ లేదా ప్రెజర్ కుకర్‌లో నూనె/నెయ్యి వేడి చేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. మిగిలిన అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మటన్ ముక్కలు వేసి, మసాలాలో బాగా కలిపి 5–7 నిమిషాలు వేయించాలి. మంట తగ్గించి పెరుగు కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి. కశ్మీరీ కారం, కారం, ధనియాలు, జీలకర్ర, సోంపుపోడులు, ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి, కుకర్‌లో 4–5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బయట గిన్నెలో అయితే మటన్ మెత్తబడే వరకు ఉడికించాలి. మూత తీసి గ్రేవీ చిక్కగా అయ్యేవరకు ఉంచి, గరం మసాలా వేసి కలపాలి. కొత్తిమీర చల్లి, మంట తీసేయాలి.రోటీ, నాన్ లేదా అన్నంతో ఈ మటన్ రోగన్ ఘోష్ ను వడ్డించాలి.
లఘు చిత్ర వైభవం..
నగరం మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలికింది. సిటీలో మొట్టమొదటి సారిగా ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’ శుక్రవారం ప్రారంభమైంది. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 21 తేదీ వరకూ కొనసాగనుంది. నగరంలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి భారతదేశంతో పాటు స్పెయిన్, ఈజిప్‌్ట, యూకే, యూఎస్ఏ, సౌత్ కొరియా, శ్రీలంక, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ వంటి పలు దేశాల నుంచి 704 చిత్రాలు ఎంట్రీలు రావడం విశేషం. అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మొదటి రోజు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో అన్సెసావో, జహాన్ షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో భాగంగా 704 ఎంట్రీల నుంచి 60 అత్యుత్తమ షార్ట్ ఫిల్మ్‌లను ఎంపిక చేసి ప్రదర్శించనున్నారు. అన్సెసావో.. 30 నిమిషాల నిడివి గల కొంకణి లఘు చిత్రం ‘అన్సెసావో’.. టొరంటోలో జరిగిన 14వ అంతర్జాతీయ దక్షిణ ఆసియా చలనచిత్రోత్సవంలో ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్రం అవార్డును గెలుచుకుంది. మంగురీష్ జగదీష్ బండోద్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వృద్ధాప్యం, ఒంటరితనం తదితర సవాళ్లను ఎదుర్కోవడంలో మానవ ప్రయాణాన్ని సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించింది. ఈ చిత్రానికి నటి ప్రశాంతి తల్పంకర్ ఐఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఏలో అంతర్జాతీయ విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత పోరాటం, బలహీనతలతో సతమతమవుతున్న ఒక వృద్ధురాలి భావోద్వేగ లోతును, సంక్లిష్టతను ఆమె తన అద్భుతమైన నటనతో ప్రతిబింబించారు. జహాన్–ది లాస్ట్ గిఫ్ట్.. రాహుల్ శెట్టి దర్శకత్వం వహించిన జహాన్ చిత్రం.. సంయమనంతో కూడిన కథనంతో పాటు ఆకట్టుకునే దృశ్యాలను మిళితం చేసి, వాతావరణ మార్పుల వాస్తవాలను చూపిస్తుంది. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘు చిత్రాన్ని ఇటీవల వేవ్స్ సమ్మిట్ 2025లో ప్రదర్శించారు. ఇది పర్యావరణ బాధ్యత, వాతావరణ అవగాహనపై ప్రాధాన్యతను తెలిపింది. అంతేకాకుండా, ఇటీవల ముంబైలో జరిగిన లేక్‌సిటీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2025లో టైగర్ ష్రాఫ్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు.ప్యానెల్ చర్చలు.. మాస్టర్‌క్లాసులు.. ఎంపిక చేసిన 60 లఘు చిత్రాల్లో విజేతలకు రూ.3 లక్షల నగదు బహుమతి లభించనుంది. రెండు రోజుల పాటు ప్రసాద్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4, 5లలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీ సభ్యులు జూడీ గ్లాడ్‌స్టోన్, మైథిలిరావు, నాగేశ్ కునూరర్, లీమా దాస్, సుంజు బచుస్పతిమయుమ్, ఉత్పల్ బోర్పుజారి తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఈ ప్రాంతం నుండి వస్తున్న కొత్త ప్రతిభను హైలైట్ చేస్తూ..ఒక ప్రత్యేక ఈశాన్య పెవిలియన్ కింద 11 లఘు చిత్రాలు, ప్రేక్షకుల కోసం ఎంపిక చేసిన ఐదు క్లాసిక్ చిత్రాలు కూడా ప్రదర్శిస్తున్నారు. అదనంగా, భారతీయ సినిమాలో సమకాలీన సమస్యలపై ప్యానెల్ చర్చలు, యువ, ఔత్సాహిక చిత్రనిర్మాతల కోసం ఒక మాస్టర్‌క్లాస్ కూడా ఉంటుంది. టిక్కెట్లు జోమాటో యాప్‌లోని డిస్ట్రిక్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.
అంతర్జాతీయం
పార్లమెంట్ ముట్టడికి యత్నం
ఢాకా: ‘ఇంక్విలాబ్ మంచ్’నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వేలాది మంది జనం బంగ్లాదేశ్ పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శనివారం పార్లమెంట్ వైపు ర్యాలీగా దూసుకొస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అతికష్టంమీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అంతకుముందు పార్లమెంట్ ప్రాంగణంలో హదీ మృతదేహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్ –ఇ–ఇస్లామీ, నేషనల్ సిటిజెన్ పార్టీ నేతలు, కార్యకర్తలు సహా వేలాది మంది జనం తరలివచ్చారు. ‘ఢిల్లీ లేదా ఢాకా.. ఢాకా, ఢాకా’, ‘హదీ రక్తం వృథా కావడానికి వీల్లేదు’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ ఉనికి ఉన్నంతవరకూ హదీ జ్ఞాపకాలు ప్రజల హృదయాల్లో ఉంటాయని మహ్మద్ యూ నస్ నివాళులర్పించారు. హదీ అంత్యక్రియల సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హదీ మృతదేహాన్ని చూడడానికి సామాన్య ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. దేశవ్యాప్తంగా శనివారం సంతాప దినంగా పాటించారు. ఈ నెల 12వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం వెళ్తున్న హదీపై దుండగులు కాల్పులు జరిపారు. పరిస్థితి విషమించడంతో సింగపూర్ కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఈ వార్త తెలిసిన వెంటనే బంగ్లాదేశ్‌లో జనం ఆందోళనకు దిగారు. గురువా రం రాత్రి పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై, పత్రికా కార్యాలయాలపై దాడులు జరిగాయి. అల్లరిమూక దాడిలో హిందూ కార్మికుడు దీపూచంద్ర దాస్ మృతిచెందాడు. శుక్రవారం కల్లా పరిస్థితి అదుపులోకి వచ్చింది. శనివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని అధికారులు వెల్లడించారు. జాతీయ కవి సమాధి పక్కనే.. షరీఫ్ ఉస్మాన్ హదీ మృతదేహాన్ని పార్ల మెంట్ నుంచి ఢాకా యూనివర్సిటీ క్యాంపస్‌కు తరలించారు. క్యాంపస్ మసీదు సమీపంలో బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లామ్ సమాధి పక్కనే ఖననం చేశారు. 1976లో నజ్రుల్ ఇస్లామ్‌ను ఇక్కడ సమాధి చేశారు. ఆయన తిరుగుబాటు కవిగానూ పేరుగాంచారు. హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తన కవితలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. నజ్రుల్ ఇస్లామ్ కవితలను హదీ తన ప్రసంగాల్లో తరచుగా ప్రస్తావిస్తూ ఉండేవారు. దీపూచంద్ర హత్య కేసులో పది మంది అరెస్టు బంగ్లాదేశ్‌లో హదీ హత్య నేపథ్యంలో హిందూ కారి్మకుడు దీపూచంద్ర దాస్(25)ను కొట్టి చంపిన కేసులో పది మంది నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. గురువారం అల్లరి మూక దీపూచంద్రను దారుణంగా కొట్టి చంపి, దహనం చేసిన సంగతి తెలిసిందే.
ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం.. ఉలిక్కిపడ్డ అమెరికా,ఇజ్రాయెల్
జెరుసలేం: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఇరాన్ తన బాలిస్టిక్ మిసైల్ సామర్థ్యాన్ని విస్తరించుకుంటోందన్న ఆందోళనలతో అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చేవారం (డిసెంబర్29) కీలక సమావేశానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరనున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి.ఇరాన్ గత కొన్నేళ్లుగా తన బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌పై దృష్టిసారించింది. ఇటీవల 10,000 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త మిసైల్‌ను ఆవిష్కరించింది. ఇది అమెరికా ప్రధాన భూభాగాన్ని చేరగలదని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఈ పరిణామంపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందిస్తూ, ఇరాన్ తీరును ప్రపంచ దేశాల ఎదుట తీర్పారబట్టే ప్రయత్నాలు చేస్తోంది.ఇజ్రాయెల్ ఆందోళనఇరాన్ మిసైల్ శ్రేణి ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకునే స్థాయికి చేరుకుందని, ఇది మధ్యప్రాచ్య భద్రతకు తీవ్రమైన ముప్పు అని నెతన్యాహు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అమెరికా తక్షణ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ట్రంప్ ఇరాన్‌పై కఠిన వైఖరిని కొనసాగిస్తున్న నేపథ్యంలో, నెతన్యాహు ఈ సమావేశాన్ని ఒక అవకాశంగా చూస్తున్నారు. ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్‌పై యూరోపియన్ యూనియన్ సహా అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ మాత్రం మరింత కఠిన చర్యలు అవసరమని పట్టుబడుతోంది.భవిష్యత్ ప్రభావంఈ సమావేశం ద్వారా అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించేందుకు రెండు దేశాలు కలిసి వ్యూహాత్మక చర్యలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ భవిష్యత్తులో మధ్యప్రాచ్య శాంతి, భద్రతకు కీలక సవాలు అవుతుందని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో నెతన్యాహు–ట్రంప్ సమావేశం అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకోనుంది.
అధికబరువుతో బాధపడేవారికి గుడ్ న్యూస్
అధిక బరువు ఊబకాయంతో నానాబాధలు పడుతున్నవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. బరువు తగ్గడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడే ఒక కొత్త గట్ బాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. ఈ స్పెషల్ బాక్టీరియాను అమెరికాలోని ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలపై చేసిన అధ్యయనాలలో, టురిసిబాక్టర్ అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం గట్ బాక్టీరియా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని, బరువు పెరగడాన్ని తగ్గిస్తుందని ఉటా విశ్వవిద్యాలయం బృందం కనుగొంది. ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గించే ఇంజెక్షన్లు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజసిద్ధంగా ఈ సమస్యను అధిగమించేందుకు ఈ పరిశోధన మార్గం సుగమం చేయగలదని భావిస్తున్నారు.ట్యూరిసిబాక్టర్ (Turicibacter) అనే పేగు బాక్టీరియా బరువు పెరుగుదలను నియంత్రించడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఊబకాయం ఉన్నవారిలో టురిసిబాక్టర్ తక్కువగా ఉంటుంది. ఇది మానవులలో కూడా ఆరోగ్యకరమైన బరువుకు తోడ్పడుతుంది. గట్ బాక్టీరియాను సర్దుబాటు చేయడం ద్వారా బరువును నియంత్రించడానికి కొత్త మార్గాల అన్వేషణకు ఈ ఫలితాలు దారితీయవచ్చని సెల్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనంలో పరిశోధకులు జూన్ రౌండ్, కేంద్ర క్లాగ్ తెలిపారు. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిని, హైఫ్యాట్ డైట్‌లోని సెరామైడ్ స్థాయిలను రాడ్ ఆకారంలోని టురిసిబాక్టర్ సింగిల్ హ్యాండెడ్‌గా తగ్గిస్తుందని కను గొన్నామన్నారు. అయితే టురిసిబాక్టర్ ప్రభావాలు ప్రత్యేకంగా ఉండే అవకాశం లేదు; విభిన్నమైన గట్ బాక్టీరియా బహుశా జీవక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే జంతు నమూనాల ఆధారంగా ఈ ఫలితాలు ప్రజలకు వర్తించకపోవచ్చని కూడా చెప్పారు.అధిక కొవ్వు ఆహారంతో సెరామైడ్ స్థాయిలు పెరుగుతాయి. అధిక స్థాయి సిరామైడ్లు టైప్ 2 డయాబెటిస్ మరియు గుండె జబ్బులతో సహా అనేక జీవక్రియ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటాయి. కానీ టురిసిబాక్టర్ ఉత్పత్తి చేసే కొవ్వులు అధిక కొవ్వు ఆహారం మీద ఎలుకలకు కూడా సిరామైడ్ స్థాయిలను తక్కువగా ఉంచుతాయి. ట్యూరిసిబాక్టర్ చిన్న ప్రేగు ద్వారా గ్రహించబడే కొవ్వు అణువులను ఉత్పత్తి చేయడం ద్వారా జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎలుకలలో బరువు తగ్గడాన్ని గమనించినప్పటికీ, ఇది మానవులలో ఎంతవరకు సాధ్యపడుతుందని అనేది చూడాలన్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవక్రియను ప్రోత్సహించేందుకు, అధిక బరువు పెరగకుండా నిరోధించే చికిత్సలను అభివృద్ధి చేయడానికి టురిసిబాక్టర్, ఈ ప్రభావాన్ని చూపే లిపిడ్‌ను గుర్తించడం భవిష్యత్తులో ఇది తొలి ఫ్యాక్టర్ కాగాలదని పరిశోధకులు తెలిపారు. అలాగే వ్యక్తిగత సూక్ష్మజీవులను మరింత పరిశోధించడం ద్వారా, భవిష్యత్తులో సూక్ష్మ జీవులను ఔషధంగా తయారు చేయగలమనీ, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో వివిధ కీటకాల కన్సార్టియంను సృష్టించడానికి సురక్షితమైన బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉందని అని వర్సిటీ పరిశోధకుడు క్లాగ్ అన్నారు.గట్ మైక్రోబయోమ్లోని తేడాలు - గట్‌లోని బ్యాక్టీరియా, శిలీంధ్రాలు - ఊబకాయం మరియు బరువు పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటాయి, మైక్రోబయోమ్‌ను మార్చడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపడే అవకాశాన్ని పెంచుతుంది. కానీ వ్యక్తి ప్రేగులో వందలాది విభిన్న సూక్ష్మజీవుల జాతులు ఉంటాయి, ఏ జాతి సహాయపడుతుందో చెప్పడం కష్టతరం. అయితే ఈ ఫలితాలు మానవులకి కూడా వర్తిస్తే, ట్యూరిసిబాక్టర్-ఉత్పన్న సమ్మేళనాలు జీవక్రియ ఆరోగ్యం, ఆరోగ్యకరమైన బరువును ప్రోత్సహించడానికి ప్రభావవంతమైన చికిత్సా విధానాలుగా ఉంటాయనడంలో సందేహం లేదు.
చైనాకు షాక్.. తైవాన్‌తో యుఎస్ భారీ డీల్
చైనా-అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోన్న వేళ వాషింగ్టన్, డ్రాగన్ కంట్రీకి షాక్ ఇచ్చింది. తైవాన్‌తో 11బిలియన్ డాలర్ల భారీ డీల్ చేసుకుంది. ఒక ద్వీపానికి ఇంత పెద్దమెుత్తంలో ఆయుధాలు అమ్మడం యూఎస్ చరిత్రలో ఇదే తొలిసారని ఆదేశ వర్గాలు తెలిపాయి. ఈడీల్తో చైనా-యుఎస్ మధ్య సంబంధాలు మరోసారి భగ్గుమనే అవకాశాలున్నాయని అంతా భావిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలని ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నాడు. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏ సమయంలో పన్నులు పెంచుతాడో తెలియక ప్రపంచ దేశాలు తలపట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో డ్రాగన్ కంట్రీతో ట్రేడ్ వార్‌కు దిగారు. ఈ పన్నుల యుద్ధం కొంత తగ్గి ఇప్పుడిప్పుడే రెండు దేశాల బంధాలు కొలిక్కి వస్తన్నాయనే తరుణంలో ట్రంప్ మరో బాంబు పేల్చారు.చైనా తమ భూభాగంగా ప్రకటిస్తున్న తైవాన్‌తో, అమెరికా, 11 బిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రి అమ్మకానికి ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌లో ఆధునాతన రాకెట్ సిస్టమ్స్, యాంటీ టాంక్ మిస్సైల్స్, డ్రోన్స్ లాంటి అధునాతన ఆయుధ సామాగ్రి ఉన్నట్లు పెంటగాన్ ప్రకటించింది. తైవాన్ తన ప్రాంతాన్ని రక్షించుకోవడానికి ఈ ఒప్పందం ఎంతగానో సహకరిస్తుందని యుఎస్ తెలిపింది.ఈ భారీ ఒప్పందంపై తైవాన్ స్పందించింది. తమకు ఇంత భారీ మెుత్తంలో ఆయుధ సరఫరా చేస్తున్నందుకు అమెరికాకు కృతజ్ఞతలని తైవాన్ అధికారులు తెలిపారు. తన జాతీయ భద్రతను కాపాడడంలో ఎటువంటి రాజీపడేది లేదని వారు ప్రకటించారు. ఇటీవలే ఆయుధ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి 40 బిలియన్ డాలర్ల అదనపు బడ్జెట్ ప్రకటించినట్లు తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని చైనా ఖండించింది. ఈ ఆయుధాల ఒప్పందంతో తైవాన్‌లో శాంతి, స్థిరత్వం దెబ్బతింటాయని తెలిపింది.చైనా దేశం తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమే అని ఆరోపిస్తుంది. అయితే తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర పరిపాలన ప్రాంతంగా ప్రకటించుకుంటుంది. ఈ నేపథ్యంలో తరచుగా వివాదం చెలరేగుతుంది.
జాతీయం
చివరి ఊపిరి… ట్రక్కు కిందే!
చలికాలం.. మిట్ట మధ్యాహ్నాం.. సూర్యుడి వెచ్చని కిరణాల్ని ఆస్వాదిస్తూ తన ఇంటి ముందు ప్రశాంతంగా కూర్చున్నాడు ఆ పెద్దాయన. కానీ, ఒక్క నిమిషంలోనే ఆయన జీవితం తలకిందులైంది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో 90 ఏళ్ల గిర్రాజ్ శర్మ అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఒక ట్రక్కు కింద నలిగిపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నెట్టింటకు చేరాయి. డిసెంబర్ 19వ తేదీన మధ్యాహ్నాం 12-1 గంట మధ్య ఈ ఘటన జరిగింది.గిర్రాజ్ శర్మ తన ఇంటి వరండాలో కూర్చుని ఉన్నారు. ఇంతలో కంకర లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. ఆయన ఇంటి ముందు నుంచి మలుపు తిరిగింది. అయితే ఆ టర్నింగ్లో రోడ్డు సరిగ్గా లేక టైర్ పేలిపోయింది. ఈ పరిణామంతో వాహనం కంట్రోల్ కాకపోవడంతో.. పక్కకు ఒరిగి గిర్రాజ్ మీదకు ఒరిగిపోయింది. అలా ఊహించలేని దుర్ఘటన ఆ వృద్ధుడి ప్రాణం తీసింది.ఆరోగ్యంగా ఉన్న గిర్రాజ్ ఇలా అనూహ్యంగా ప్రాణం పొగొట్టకోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు.. రోడ్డు భద్రత, భారీ వాహనాల నిర్వహణపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. 𝑵𝒐 𝒐𝒏𝒆 𝒌𝒏𝒐𝒘𝒔 𝒘𝒉𝒆𝒏 𝒅𝒆𝒂𝒕𝒉 𝒘𝒊𝒍𝒍 𝒂𝒓𝒓𝒊𝒗𝒆…In Gwalior, Madhya Pradesh, 90-year-old Girraj Sharma was simply sitting outside his home, quietly soaking in the winter sun. In a cruel twist of fate, a gravel-laden dumper lost control after a tyre burst and… pic.twitter.com/uAdXECIaxM— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 21, 2025
ఉత్తరాదిపై మంచుదుప్పటి
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం సమీపిస్తున్న వేళ..ఉత్తర భారతంలో పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. పగలంతా దట్టమైన పొగమంచు కొనసాగుతుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో అక్కడక్కడా మంచు, వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తుందని తెలిపింది. కశ్మీర్లో 40 రోజులపాటు అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల కాలం చిల్లై కలాన్ ఆదివారం నుంచి మొదలుకానుంది. పుల్వామాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టంగా మైనస్ 3.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోగా, శ్రీనగర్‌లో మైనస్ 0.4 డిగ్రీ, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ ఉన్న పహల్గాంలో మైనస్ ఒక డిగ్రీగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని పేర్కొంది. శ్రీనగర్‌తోపాటు లోయలోని అత్యధిక ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుందని పేర్కొంది. అదేసమయంలో, హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్, మండి జిల్లాలతోఆపటు బాల్హ్‌లోయలో ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని తెలిపింది. ఈ నెల 25వ తేదీ వరకు పర్వత ప్రాంతాల్లో అక్కడక్కడా కొద్దిపాటి మంచు, వర్షం కురిసే అవకాశముందని అంచనా వేసింది. కుకుమ్‌సెరి, లాహోల్ స్పిటి జిల్లాలో మైనస్ 5.7 డిగ్రీలు, టాబోలో మైనస్ 2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ విభాగం తెలిపింది. ఢిల్లీలో ఆరెంజ్ అలెర్ట్ వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడిని మేఘాలు కమ్మేశాయి. దీంతో, దృగ్గోచరత క్షీణించింది. ఢిల్లీలో శీతల గాలుల సీజన్ శనివారం నుంచి మొదలైంది. ఈ నెలలోనే గరిష్ట ఉష్ణోగ్రత 16.9 డిగ్రీలు, అత్యల్ప ఉష్ణోగ్రత 5.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. గంటకు 10 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో వీస్తున్న గాలులు కాలుష్య కారకాలు చెల్లాచెదురయ్యేందుకు అనుకూలం కావని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం మరో రెండు రోజులపాటు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, కాన్పుర్, బరేలీ, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో దృగ్గోచరత 50 మీటర్లలోపునే ఉంది. పంజాబ్, హరియాణాలతో కూడా తీవ్ర శీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు కురుస్తోంది. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 4.9 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. రాజస్తాన్, జార్ఖండ్లలోనూ ఇవే పరిస్థితులున్నాయి.129 విమానాలు రద్దుఢిల్లీలో దట్టమైన పొగమంచు అలుముకున్న కారణంగా విమానాశ్రయం అధికారులు ముందు జాగ్రత్తగా కనీసం 129 విమాన సర్వీసులను రద్దు చేశారు. తక్కువ దృగ్గోచరత కారణంగా కొన్ని రోజులుగా ఢిల్లీ, ఇతర విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోని అత్యంత పెద్దది. నిత్యం ఇక్కడ 1,300 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
నాకీ బిడ్డ వద్దు!
గోరఖ్‌పూర్ (యూపీ): నమ్మిన భర్త నట్టేట ముంచాడన్న ఆవేదన.. అండగా ఉండాల్సిన సమయంలో మరో మహిళతో చెక్కేశాడన్న ఆగ్రహం.. ఆవేదన కలగలిసిపోయాయి. అవన్నీ ఆమెకు పుట్టిన పసికందుకు శాపంగా పరిణమించాయి. తనను మోసం చేసిన వ్యక్తి ఆనవాళ్లు బిడ్డలో ఉన్నాయి కాబట్టి.. పుట్టిన నవజాత శిశువును అంగీకరించేందుకు ఒక తల్లి నిరాకరించింది. గోరఖ్‌పూర్‌లో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలివి.రైలు ప్రయాణంలో ప్రసవంఢిల్లీలో పనిమనిషిగా జీవనం సాగిస్తున్న ఒక మహిళ, నిండు గర్భిణిగా ఉన్నప్పుడు భర్త తనను వదిలేసి వెళ్లిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. రైలు ప్రయాణంలో ఉండగా పురిటి నొప్పులు రావడంతో, రైల్వే పోలీసుల సాయంతో జిల్లా ఆసుపత్రిలో చేరింది. మగబిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, భర్తపై ఉన్న కోపంతో ఆ పసివాడికి పాలివ్వడానికి కూడా ఆమె నిరాకరించింది.కౌన్సెలింగ్‌తో కరిగిన మనసుఆసుపత్రి సిబ్బంది గంటల తరబడి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు ఆమెలో తల్లి మేలుకుంది. ‘వాడికి నా భర్త పేరు పెట్టను.. బిడ్డను నేనే పెంచుకుంటాను’.. అంటూ మనసు మార్చుకుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని, బిడ్డ ఆరోగ్యం మెరుగవ్వగానే డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ జై కుమార్ తెలిపారు.
పొగబట్టిన కాలుష్యం!
దేశంలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో 2022–24 మధ్య ఢిల్లీలోని ఆరు ప్రభుత్వ ఆసుపత్రులకు 2 లక్షల కంటే ఎక్కువ మంది బాధితులు వచ్చారంటే కాలుష్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ప్రచురితమైన 2024 అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం కలుíÙతమైన గాలిని పీల్చడం వల్ల భారత్‌లో ఏటా 15 లక్షల మంది మరణిస్తున్నారు.వాయు కాలుష్యం వల్ల దేశ సగటు ఆయుర్దాయం 3.5 ఏళ్లు తగ్గిందని షికాగో విశ్వవిద్యాలయం 2025 ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ) వెల్లడించింది. గాలి నాణ్యతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరి్టక్యులేట్ మ్యాటర్–2.5 (పీఎం) ఒక్కో క్యూబిక్ మీటర్‌కు 40 ్పమైక్రోగ్రాముల వరకు ఆమోదయోగ్యం. అంటే గాలిలో 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసంతో కలిసిన దుమ్ము, ధూళి, పొగ కణాలు అన్నమాట. గాలిలో ఈ కణాలు ఎన్ని ఎక్కువగా ఉంటే వాయు కాలుష్యం అంత తీవ్రంగా ఉన్నట్లు లెక్క.ఏడాది పొడవునా.. దేశంలో వాయు నాణ్యత సంక్షోభం అంతకంతకూ విస్తృతమవుతోంది. ఈ ఏడాది 256 నగరాలు, పట్టణాల్లో పరీక్షలు జరపగా 150 కేంద్రాల్లో వాయు కాలుష్యం నిర్దేశిత ప్రమాణాలను మించిపోయిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తెలిపింది. చాలా మంది పట్టణవాసులకు అనారోగ్యకర లేదా ప్రమాదకర గాలిని పీల్చడం ఏడాది పొడవునా నిత్యకృత్యంగా మారింది. 2025లో ఢిల్లీలో పీఎం–2.5 స్థాయి రోజుకు క్యూబిక్ మీటర్‌కు 107–130 మైక్రోగ్రాములుగా³ నమోదైంది. ఇది దేశంలో ఒక రోజు పరిమితి అయిన 60 మైక్రోగ్రాములు, డబ్ల్యూహెచ్ఓ నిర్దేశిత 15 మైక్రోగ్రాముల కంటే చాలా ఎక్కువ. తగ్గుతున్న ఆయుర్దాయం..దేశంలో 46% మంది ప్రజలు పీఎం–2.5 స్థాయి కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని ఏక్యూఎల్‌ఐ నివేదిక తెలిపింది. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రజలు 4.74 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నారని పేర్కొంది. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన కఠినమైన మార్గదర్శకాలను పాటిస్తే ఆయుర్దాయం 9.4 నెలలు పెరుగుతుందని అంచనా వేసింది.ఎనిమిదిలో ఒకటి..వాయు కాలుష్యానికి సంబంధించిన మరణాలను భారత్‌లో లెక్కించడం లేదని గ్లోబల్ క్లైమేట్, హెల్త్ అలయన్స్ చెబుతోంది. క్రమబద్ధమైన విధానాలు లేకపోవడమే అందుకు కారణమని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు వాయు కాలుష్యం రెండో ప్రధాన కారణమని స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ నివేదిక–2025 తెలిపింది. అన్ని దేశాల్లో కలిపి 2023లో 79 లక్షల మరణాలు వాయు కాలుష్యం వల్ల సంభవించాయని పేర్కొంది. అందులో పీఎం–2.5 స్థాయి కాలుష్యానికి గురై 49 లక్షల మంది మృతిచెందారని తెలిపింది. తగ్గిన సూర్యకాంతి.. 1993–2022 మధ్యకాలంలో గాలిలోని దుమ్ము, ధూళి కారణంగా దేశంలో సూర్యకాంతి దాదాపు 13% తగ్గింది. మేఘాలు అదనంగా 31–44% సూర్యకాంతి క్షీణతకు కారణమయ్యాయని ఐఐటీ కాన్పూర్‌లోని వాతావరణ శాస్త్రవేత్త సచ్చిదానంద్ త్రిపాఠి తెలిపారు. సూర్యకాంతి తగ్గితే వ్యవసాయం, సౌర శక్తితోపాటు రోజువారీ జీవితాలపైనా ప్రభావం చూపుతుందని వివరించారు. ఫొటోవోల్టాయిక్ సిస్టమ్స్‌ను బట్టి సౌర విద్యుత్ ఉత్పత్తి 12–41% పడిపోతుందని చెప్పారు. బీజింగ్ ఒక ఉదాహరణ.. చైనాలోని బీజింగ్ 20 ఏళ్ల క్రితం ప్రపంచ పొగమంచు రాజధానిగా పేరొందింది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా బొగ్గు ఆధారిత బాయిలర్స్‌ను మూసివేయడం, ప్రజారవాణా, పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించడం, సాంకేతిక సంస్కరణలు, ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం వంటి చర్యలను చైనా సర్కారు యుద్ధప్రాతిపదికన చేపట్టింది. ఫలితంగా పీఎం–2.5 స్థాయి 2013లో ఒక్కో క్యూబిక్ మీటర్‌కు 72గా ఉండగా గతేడాది 29.3 ్పమైక్రోగ్రాములకు తగ్గిపోవడం విశేషం.
ఎన్ఆర్ఐ
డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం
తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘనంగా నిలబెడుతున్న 'తెలంగాణ అమెరికా తెలుగు సంఘం' (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్రగ్స్‌పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రకటించి, కార్యక్రమాల వివరాలు తెలిపారు.TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్‌లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్‌లో భాగంగా సేవ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా. వాణి గడ్డం.. అమెరికా నుంచి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.TTA 10వ వార్షికోత్సవం2025 డిసెంబర్ 25న TTA తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు.“10K రన్”తో డ్రగ్స్‌పై అవగాహనటీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయకులు తెలిపారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది. 2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన)
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు.
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.
క్రైమ్
సిరిసిల్ల: పాడె పైనుంచి పోస్ట్‌మార్టం హాల్‌కి..
సిరిసిల్ల: గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్‌లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్‌రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కొడుకులు కాదు.. దుర్మార్గులు
ఆ పెద్దాయన్ని పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. హమ్మయ్యా.. అనుకుంటున్న టైంలో వారం వ్యవధిలోనే మరోసారి పాము కాటుకు గురయ్యాడు. ఈసారి ఆస్పత్రికి వెళ్లడం బాగా ఆలస్యమై ప్రాణం పోయింది. అయితే కొడుకుల దొంగ చూపులు.. పొంతన లేని సమాధానాలు.. వాళ్ల కాల్ డాటా.. తండ్రి ఇన్సూరెన్స్ సొమ్ము కోసం పడ్డ తాపత్రయం.. ఇది పక్కా స్కెచ్చేసి చేసిన హత్య అని బయటపెట్టాయి. తండ్రికి రూ.3 కోట్ల దాకా బీమా చేయించి.. ఆపై పాము కాటుతో చంపించిన అమానవీయ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. రకరకాల వ్యాపారాలు చేసి.. అప్పుల పాలైన ఇద్దరు తనయులు తమ స్నేహితుల సాయంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు నిర్ధారించారు. ఒకసారి స్థానికులు తండ్రిని రక్షించగా.. మరోసారి ఎలాంటి ఆటంకం లేకుండా తమ ప్లాన్‌ను అమలు పరిచారు ఈ దుర్మార్గులు. ఈ ఘోరం వివరాల్లోకి వెళ్తే.. పొదటూర్పేట్ గ్రామానికి చెందిన ఈపీ గణేశన్(56).. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అక్టోబర్ 22వ తేదీన పాము కాటుతో ఇంట్లోనే ఆయన చనిపోయారు. అయితే.. వారం తిరగకుండానే కుటుంబం ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడంతో ఆ కంపెనీ వాళ్లకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఈ విషయం చేరవేయడం.. వాళ్లు దర్యాప్తును ముమ్మరం చేయడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. గణేష్ కొడుకు మోహన్‌రాజ్(26), హరిహరన్(27) ప్రైవేట్ ఉద్యోగులు. అయితే ఆన్లైన్ బెట్టింగ్‌లు, ఇతర విలాసాల కోసం అడ్డగోలుగా అప్పులు చేసి ఉన్నారు. ఈ క్రమంలో తండ్రి పేరిట ఇన్సూరెన్స్‌లు చేయించి హతమార్చాలనే దుర్మార్గపు ఆలోచన చేశారు. దీనికి నలుగురు స్నేహితుల సాయం కోరారు. అక్టోబర్ 15వ తేదీన ఒక పామును గణేశన్ మీదకు వదిలారు. అది కాలి మీద కాటేయడంతో.. ఆయన నొప్పితో అరిచారు. దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించి రక్షించారు. వారం తర్వాత ఈసారి మరింత విషపూరితమైన పామును తెచ్చి మెడ మీద కాటు వేయించారు. ఈసారి ఆయన అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు. తలుపులు వేసి ఉండిపోయారు. ఆపై చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో పాము పగ బట్టి చంపిందంటూ స్థానికంగా ప్రచారం జరిగింది.అయితే.. వారం తిరగకుండానే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొడుకులు క్లెయిమ్‌కు దిగడంతో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చింది. ఏజెంట్‌తో దర్యాప్తు చేయించే క్రమంలో వరుసగా పాము కాటుకు గురికావడం, ఆస్పత్రికి ఆలస్యంగా వెళ్లడం లాంటి విషయాలు తెలిశాయి. దీంతో పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. డిసెంబర్ 6వ తేదీన నార్త్ జోన్ ఐజీ అస్రా గార్గ్.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఆ ఇద్దరు కొడుకుల ఫోన్ కాల్స్ రికార్డింగులు.. ఆర్థిక లావాదేవీల ఆధారంగా తండ్రిని పాము కాటుతో హత్య చేయించినట్లు నిర్ధారించుకున్నారు. నిందితులిద్దరితో పాటు వాళ్లకు సహకరించిన నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేశారు.
మీర్‌పేట మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట మాధవి హత్య కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. భర్త గురుమూర్తే ఆమెను కిరాతకంగా హతమార్చాడని పోలీసులు సైంటిఫిక్ ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధ వ్యవహారమే ఈ హత్యకు కారణమని నిర్ధారణ అయ్యింది.మీర్‌పేట మాధవి హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మరదలితో గురుమూర్తి వివాహేతర సంబంధం నడిపిన గురుమూర్తి.. దానికి అడ్డుపడుతోందనే భార్య మాధవిపై ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ మేరకు కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తాజాగా ఆధారాలతో సహా పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో.. వెంకట మాధవి(35) అనే మహిళ కనిపించడం లేదని ఆమె తల్లి మీర్‌పేట పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే విచారణలో తన భార్యను తానే చంపినట్లు భర్త పుట్టా గురుమూర్తి అంగీకరించాడు. మాజీ ఆర్మీ జవాన్ అయిన పుట్టా గురుమూర్తి(39).. డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలోనే భార్య మాధవితో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే చాలాసార్లు పంచాయితీ చేసినప్పటికీ గురుమూర్తి తీరు మారలేదు. ఈ క్రమంలోనే మాధవితో గొడవ పడి.. ఆమెను దారుణంగా హతమార్చాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. వివాహేతర సంబంధం విషయంలో మాధవి-గురుమూర్తి మధ్య గొడవ జరిగింది. మాధవిని గొంతు నులిమి చంపి ఆపై ముక్కలు చేసిన గురుమూర్తి.. శరీర భాగాలను కుక్కర్లో ఉడికించి.. ఎముకలను గ్రైండర్ చేసి జిల్లెలగూడలోని చెరువులో కలిపాడు. మాధవిది హత్యగా తెలిశాక పోలీసులు ఇంటి నుండి స్టౌ, కత్తి, రోలర్, వాటర్ హీటర్, బట్టలు వంటి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తిపై హత్య, ఆధారాలను నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో శరీర భాగాలు దొరకడం కష్టం కావడంతో ఈ కేసు వీగిపోతుందని అంతా భావించారు. అయితే.. అతికష్టం మీద సైంటిఫిక్ ఆధారాలను సేకరించిన పోలీసులు తాజాగా వాటిని కోర్టు ముందు ఉంచారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో.. హత్యకు గల కారణాలపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు వివాహేతర సంబంధం కారణంగానే మాధవిని గురుమూర్తి కడతేర్చినట్లు తేలింది.
సర్పంచ్ విజయోత్సవాల నడుమ దారుణం..
మహబూబ్‌నగర్ జిల్లా: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి పాల్పడడంతో ఆమె మృతి చెందింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతి (22) ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాలు జరుగుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన విష్ణు మాట్లాడాలని చెప్పి ఆ యువతిని రైతువేదిక వద్దకు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో అధిక రక్తస్రావం కావడంతో ఆ యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే అతను ఇతరుల సాయంతో స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. చుట్టు పక్కల వారు తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా అక్కడకు వచి్చంది. అప్పటికే ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికుల సాయంతో అంబులెన్స్‌లో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆ యువతి మృతి చెందినట్టు తెలిపారు. మృతదేహాన్ని అదే రోజు రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురిపై అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ఘటనా స్థలాన్ని మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సీఐ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో గ్రామంలో విచారణ జరిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్యాచారం, అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ వేణు చెప్పారు. యువకుడు ఒక్కడే అత్యాచారం చేశాడా... ఇతరుల ప్రమేయం ఉందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వీడియోలు
కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్
YS జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్..
ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
సినిమా హీరోలు కూడా సరిపోరు.. ఆరోజుల్లోనే జగన్ క్రేజ్ ఎలా ఉండేదంటే
హైదరాబాదులో ఘనంగా YSRCP అధినేత YS జగన్ జన్మదిన వేడుకలు
బీజేపీలో చేరిన సినీ నటి ఆమని
హాలీవుడ్ హీరోలా రోషన్.. ఛాంపియన్ బ్లాక్ బస్టర్ అంతే..!
జగన్ హయాంలోనే అభివృద్ధి.. ఆ రెండేళ్లు కోవిడ్ లేకపోతే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది
ఇందుకే.. అమిత్ షా చంద్రబాబును ఏకి పారేశాడు
గోదావరి నడి మధ్యలో.. జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

