Top Stories
ప్రధాన వార్తలు

కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్‌ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కలిశారు. చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, తిరువూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు

నంబాల ఎన్కౌంటర్.. 27 మంది మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (71) మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్–బీజాపూర్ జిల్లా సరిహద్దు అబూ జ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్జీ జవాను కూడా మృతి చెందగా పలువురు గాయపడినట్లు ఛత్తీస్‌గఢ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కేశవరావు మరణాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ మావోయిస్టు నేత ఎదురుకాల్పుల్లో మరణించడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ‘ఇదో అసాధారణ విజయం’ అని పేర్కొన్నారు. కేశవరావు తలపై కోటిన్నర రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. కాగా మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముక గా ఉన్న నంబాల మృతి మావోయిస్టు పారీ్టకి పెద్ద ఎదురుదెబ్బని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జి ల్లాలో జని్మంచిన కేశవరావు వరంగల్ ఆర్ఈసీ (ఇప్పటి నిట్)లో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లారు. పక్కా సమాచారంతో.. అబూజ్‌మఢ్ అడవుల్లో ఇంద్రావతి నది సమీపాన మావోయిస్టు అగ్రనేత షెల్టర్ తీసుకున్నారని, పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు మాడ్ డివిజన్ సీనియర్ కేడర్, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) సభ్యులు సైతం ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలకు తోడు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల డీఆర్జీ దళాలు మంగళవారం రాత్రి సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య మొదలైన కాల్పులు ఉదయం 11గంటల వరకు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మధు, నవీన్ అనే డివిజన్ స్థాయిæ నేతలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మధు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కాగా, నవీన్ మావోయిస్టు పార్టీ పత్రిక ‘జంగ్’ బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్ జరిగిన తీరుతెన్నులు, ఇతర మృతుల వివరాలను పోలీసులు ప్రకటించలేదు. అయితే 27 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా మావోయిస్టుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ల్యాప్‌టాప్‌లు, కీలక డాక్యుమెంట్లు ఆధారంగా.. గతనెల 18న నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు సంబంధించిన డంప్‌ను భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇందులో కీలక డాక్యుమెంట్లు, పుస్తకాలతో పాటు 11 ల్యాప్‌టాప్‌లు లభించాయి. వాటిలో లభించిన వివరాల ఆధారంగానే ఏప్రిల్ 21న తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రిగుట్టల్లో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ భారీ స్థాయిలో మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల ఆపరేషన్‌తో భారీ ఫలితం రాబోతుందని ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆపరేషన్ ముగిసేసరికి వేర్వేరు ఎన్కౌంటర్లలో 31 మంది సాధారణ స్థాయి మావోయిస్టులు చనిపోగా డంప్‌లు, ఆయుధ తయారీ పనిముట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మళ్లీ విశ్లేషించుకుని..‘వారి’ నుంచి సమాచారం తెప్పించుని.. డంప్‌లో లభించిన ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించుకోవడంలో జరిగిన పొరపాటు కారణంగానే కర్రిగుట్టలో ఆశించిన విజయం దక్కలేదని భావించిన దళాలు మరింత జాగ్రత్తగా సమాచారాన్ని విశ్లేషించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా నంబాల కేశవరావుకు రక్షణ కల్పించే 7వ నంబర్ కంపెనీలో పనిచేసి లొంగిపోయిన కొందరు మావోయిస్టుల నుంచి మరోసారి సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ కచ్చితత్వంతో డీకోడ్ చేయడం ద్వారా నంబాల ఎక్కడున్నాడనే అంశాన్ని భద్రతా దళాలు పసిగట్టి మెరుపుదాడి చేసినట్టు తెలుస్తోంది. అంత ఈజీగా ఎలా? సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈ వలయాన్ని ఛేదించుకుని వారి దగ్గరికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా స్వల్ప నష్టంతోనే పోలీసులు నంబాల దగ్గరికి ఎలా చేరుకున్నారనేది మిస్టరీగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం వరకు నంబాల కేశవరావుకు 70 మందితో కూడిన కంపెనీ రక్షణ కల్పించేది. ఇందులో కనీసం 40 మంది వద్ద ఏకే 47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, తన చుట్టూ ఉన్న బృందం ఆధునిక ఆయుధాలతో ఉంటే నంబాల తన చేతిలో ఎప్పుడూ ల్యాప్‌టాప్‌తో ముందుకు సాగుతారని తెలుస్తోంది. తాగునీరు, ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, రాత్రి వేళ సైతం రెండు, మూడు గంటల కంటే ఎక్కువ నిద్రించరని సమాచారం. అయితే ఇటీవల పెరిగిన నిర్బంధం కారణంగా భద్రతను 28 మందికి కుదించినట్టు తెలుస్తోంది.

ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.దశమి రా.8.47 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.49 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర,వర్జ్యం: రా.10.54 నుండి 12.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు,తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు,అమృత ఘడియలు: ఉ.6.10 నుండి 7.41 వరకు, హనుమజ్జయంతి.సూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.22రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వృషభం... శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మిథునం... బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కర్కాటకం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక ఆందోళన. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.సింహం.... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. సోదరులు, మిత్రుల నుండి సమస్యలు రావచ్చు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.కన్య.... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల.... దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.వృశ్చికం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.ధనుస్సు... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. మిత్రుల నుండి ఒత్తిడులు. లేనిపోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం.... ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. మీ ఖ్యాతి విస్తరిస్తుంది. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.కుంభం... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.మీనం... ముఖ్య∙కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు, ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

అగ్రరాజ్యానికో గోల్డెన్ డోమ్!
వాషింగ్టన్: ప్రపంచంలోనే అగ్రరాజ్యం, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ, అమేయమైన సైనిక శక్తి.. ఇలా అన్నీ ఉన్నా అమెరికాను సువిశాలమైన, విస్తారమైన భూభాగం భయపెడుతోంది. భూమి ఎక్కువుంటే ఎందుకు భయపడాలనే సందేహం రావొచ్చు. దేశం ఓ మోస్తరు విస్తీర్ణంలో ఉండే ఉన్న భూభాగమంతటికీ సమగ్ర స్థాయిలో రక్షణ కల్పించొచ్చు. అదే విశాల భూభాగమైతే శత్రు దేశ క్షిపణులు ఎక్కడ పడతాయో ఊహించడం కూడా కష్టం. అమెరికాను వేధిస్తున్న ఈ సమస్యకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో చెక్ పెడతానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో ప్రకటించారు. మొత్తంగా 175 బిలియన్ డాలర్ల వ్యయంతో గోల్డెన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాట్లుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2029 జనవరిలోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి యావత్ అమెరికా భూభాగాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ గోల్డెన్ డోమ్ వ్యవస్థను ఏర్పాటుచేయడం అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ స్పష్టంచేసింది. భూమి మీదే కాదు ఆకాశంలోనూ ఇందుకు సంబంధించి లేజర్ కాంతిపుంజం వెదజల్లే వ్యవస్థలను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది. ఇంతటి సంక్లిష్టమైన అధునాతన సాంకేతికతతో కూడిన అసాధారణ వ్యవస్థ నిర్వహణకు రాబోయే 20 సంవత్సరాల్లో ఏకంగా 542 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనావేసింది. ప్రస్తుతానికి అమెరికా పార్లమెంట్లో ట్రంప్ తొలి దఫాగా ప్రాజెక్ట్ కోసం కేవలం 25 బిలియన్ డాలర్లు మాత్రమే ప్రతిపాదించారని బడ్జెట్ ఆఫీస్ తెలిపింది.ఏమిటీ గోల్డెమ్ డోమ్?ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్ క్షిపణులను మన భూభాగంపై మోహరించిన సుదర్శన చక్ర(ఎస్–400) గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మార్గమధ్యంలోనే ఆ మిస్సైళ్లను కూల్చేసింది. గాజా భూభాగం మీద నుంచి హమాస్ సాయుధులు సంధించిన వందలాది క్షిపణులను సైతం ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ గగనతల రక్షణ వ్యవస్థ ఇలాగే నేలమట్టంచేసి తమ నేలను కాపాడుకుంది. ఎస్–400, ఐరన్‌డోమ్‌లు భూతలం మీద మొహరించిన రక్షణ వ్యవస్థలు. వాహనాలపై బిగించిన రాకెట్ లాంఛర్ ఇందులో కీలకం. అయితే అమెరికా సిద్ధంచేయబోతున్న గోల్డెన్ డోమ్ కాస్తంత భిన్నమైంది. ఇది భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మేళవింపు. లేజర్ కాంతి ఎంతటి కఠినమైన లోహాలనైనా కోసి పారేస్తుంది. ఆకాశంలోని ఉపగ్రహం లాంటి వ్యవస్థ ఈ లేజర్ కాంతి పుంజాన్ని శత్రు క్షిపణులపై ప్రయోగించి వాటిని సెకన్ల వ్యవధిలో నాశనం చేస్తుంది. గోల్డెన్ డోమ్‌లో ఈ లేజర్‌కాంతి విభాగమే అత్యంత కీలకమైంది. గోల్డెన్డోమ్లో భాగంగా పెద్దసంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి వాటిని నిఘా, దాడి వ్యవస్థలుగా తీర్చిదిద్దనున్నారు.లేజర్ కాంతి, సెన్సార్లు, శాటిలైట్ల సమ్మేళనంఈ గోల్డెన్ డోమ్‌ను లేజర్ కాంతి, సెన్సార్లు, పలు ఉపగ్రహాల, క్షిపణుల సమ్మేళనంగా చెప్పొచ్చు. అన్నీ కలిసి ఏకకాలంలో సమన్వయంతో పనిచేస్తూ నవతరం ‘మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్’గా నిలిచిపోనున్నాయి. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సెన్సార్లను భూతలం మీద ఉండే గగనతల రక్షణ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ఫలానా ప్రాంతం నుంచి శత్రు క్షిపణి దూసుకొస్తున్న విషయాన్ని భూతల, గగనతల సమ్మిళిత వ్యవస్థలు గుర్తించి వెంటనే ఆకాశంలోని లేజర్ కాంతిపుంజ విభాగానికి చేరవేస్తాయి. లేజర్‌కాంతి అవసరంలేని సందర్భాల్లో శత్రు క్షిపణిని అడ్డుకునేందుకు వెనువెంటనే క్షిపణులను ప్రయోగిస్తారు. సొంత క్షిపణితో పనికాదని నిర్ధారించుకోగానే అత్యంత తీక్షణమైన లేజర్ కాంతిని ఆ శత్రు క్షిపణిపై ప్రసరింపజేస్తారు. నేల మీద మొబైల్ లాంఛర్ నుంచి, యుద్ధవిమానం నుంచి వచ్చే క్షిపణులనూ ఈ లేజర్‌కాంతి నాశనం చేయగలదు. అలా అమెరికా గగనతలంలో కీలకమైన చోట్ల ఈ లేజర్‌బీమ్ లైటింగ్ సిస్టమ్స్‌ను సిద్ధంచేస్తారు. ఈ బహుళ అంచెల వ్యవçస్థలన్నీ ఎల్లవేళలా సమన్వయంతో పనిచేస్తూ అమెరికాను కంటికి రెప్పలా కాపాడతాయి. గోల్డెన్ డోమ్ ముఖ్యంగా నాలుగు పనులు చేస్తుంది. 1. ఫలానా చోట శత్రు క్షిపణి క్రియాశీలకంగా మారిందని గుర్తించగానే అది లాంఛర్‌ను దాటి బయటికొచ్చేలోపే నాశనంచేస్తుంది. 2. ఒకవేళ అప్పటికే బయల్దేరితే తొలిదశలోనే అడ్డుకుంటుంది. 3. లేదంటే మార్గమధ్యంలో నేలకూలుస్తుంది. 4. అప్పటికీ చేయిదాటిపోతే అది లక్ష్యాన్ని ఢీకొట్టే చిట్టచివరి నిమిషంలోనైనా మిస్సైల్‌ను మట్టుబెడుతుంది. ఈ పనులను కృత్రిమమేధ ఆధారిత కమాండ్ సిస్టమ్ చూసుకుంటుంది.స్టార్‌వార్స్ సిద్ధాంతం నుంచి..అంతరిక్షం నుంచి కాంతిపుంజాన్ని ప్రయోగించడమనేది ఇంకా ప్రయోగదశలోనే ఉందని అమెరికా ఎయిర్‌ఫోర్స్ సెక్రటరీ ట్రాయ్ మెయింక్ మంగళవారం వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ, యూఎస్ నార్తర్న్ కమాండ్లు సమష్టిగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టుపై పనిచేస్తు న్నాయి. ‘‘ సంప్రదాయక క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లతోపాటు అణ్వస్త్ర సామర్థ్య క్షిపణులనూ ఈ గోల్డెన్ డోమ్ విజయవంతంగా అడ్డుకుంటుంది’’ అని రక్షణ మంత్రి పీట్ హెగ్సత్ చెప్పారు. యూఎస్ స్పేస్‌ఫోర్స్ జనరల్ మైఖేల్ గెటెలిన్ ఈ ప్రాజెక్ట్‌కు సారథ్యంవహిస్తారు. ఫోర్స్టార్ జనరల్ అయిన గెటెటిన్కు వైమానిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. తాము సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా చేరతామని కెనడా తన ఆసక్తిని వెల్లడించింది. ఆయుధరంగ దిగ్గజం ‘లాక్‌హీడ్ మార్టిన్’ సంస్థ గోల్డెన్ డోమ్ ఉపకరణాలను అభివృద్ధిచేయనుంది. 80వ దశకంలో అమెరికా అధ్యక్షునిగా సేవలందించిన రొనాల్డ్ రీగన్ ‘స్టార్‌వార్స్’ సిద్ధాంతం, ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ వ్యవస్థల నుంచే గోల్డెన్ డోమ్ ఆలోచన పురుడుపోసుకుంది. క్షిపణులను అడ్డుకునే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, ఏగిస్ సిస్టమ్‌లనూ గోల్డెన్ డోమ్‌లో వినియోగించనున్నారు.సందేహాలు, అనుమానాలుఇంతవరకు అంతరిక్షంలో పరీక్షించని ఈ వ్యవస్థను కేవలం నాలుగేళ్లలోపు ఎలా అందుబాటులోకి తెస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గోల్డెన్ డోమ్‌లో పెద్ద సంఖ్యలో కొత్త ఉపగ్రహాలు, ఏఐ సెన్సార్లు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక రుణభారాన్ని మోస్తున్న అమెరికా సర్కార్ ఈస్థాయి కొత్త భారీ బడ్జెట్‌ను ఇంత తక్కువ సమయంలో సమకూర్చుకోగలదా? అసలు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం తొలినాళ్లలో ఒకేరోజు ఒకేసారి 20 నిమిషాల వ్యవధిలో హమాస్ 5,000 స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. వాటిని అడ్డుకోవడంలో ఐరన్‌డోమ్ విఫలమైంది. ఈ నేపథ్యంలో ఒక సాయుధ సంస్థే ఇన్ని మిస్సైళ్లను ప్రయోగించగల్గితే పేద్ద యుద్ధమే వస్తే రష్యాలాంటి దేశం ఇంకెంత స్థాయిలో విరుచుకుపడుతుందో ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ శక్తిసా మర్థ్యాలు ఏపాటివో అందుబాటులోకి వస్తేగానీ చెప్పలే మని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.చైనా, రష్యా నుంచి ముప్పు..రష్యా, చైనా తమ ఉపగ్రహాలకు అధునాతన శక్తిసామర్థ్యాలను సంతరింపజేశాయి. అవి అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యంచేయగలవు. ఈ నేపథ్యంలో గోల్డెన్ డోమ్ అవసరం ఏర్పడిందని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. కేవలం అంతరిక్షంలో వాడేందుకు రష్యా ఒక కొత్తతరహా అణ్వాయుధాన్ని తయారుచేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ అణ్వాయుధం అంతరిక్షంలో సంచరిస్తూ విడతలవారీగా పేలుతూ సమీప శత్రుదేశ ఉపగ్రహాలను నాశనంచేయగలదని అమెరికా వాదిస్తోంది. అమెరికా గోల్డెన్ డోమ్ ఆలోచనను ఇప్పటికే రష్యా, చైనాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శక్తివంతమైన లేజర్‌కాంతి వ్యవస్థలను అంతరిక్షంలో ఏర్పాటుచేసి ఉప గ్రహాలు సంచరించే కక్ష్యలను రణక్షేత్రాలుగా మార్చొద్దని ఇరు దేశాలు గోల్డెన్ డోమ్ ఆలోచనపై అభ్యంతరం వ్యక్తంచేశాయి.

తీగ కింద.. అవినీతిపైన
సాక్షి, అమరావతి: ఖజానాకు ధర్మకర్తగా వ్యవహరించాల్సిన వారే ప్రజాధనాన్ని అస్మదీయులకు దోచిపెడుతున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూగర్భ విద్యుత్ (అండర్ గ్రౌండ్ కేబుల్) లైన్ పనుల టెండర్లలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. నిబంధనల్ని తుంగలో తొక్కి కాంట్రాక్టు విలువ కంటే 8.98 శాతం అధిక ధర కోట్ చేసిన సంస్థకు రూ.1,082.44 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. 8.99 శాతం అధిక ధర కోట్ చేసిన మరో సంస్థకు రూ.390.06 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఈ రెండు టెండర్లలో సీఎం చంద్రబాబు సన్నిహితులకు రూ.114.68 కోట్లు దోచిపెడుతున్నారు. టెండర్ల వివరాలివీ రాజధాని ప్రాంతంలో ఎన్–10 రహదారి నుంచి ఎన్–13–ఈ–11 రహదారుల జంక్షన్ వరకూ 220 కేవీ ఎక్స్ట్రా హైవోల్టేజీ (ఈహెచ్‌వీ) లైన్‌ను అండర్ గ్రౌండ్(భూగర్భంలో)లో వేసేందుకు సంబంధించిన మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఒక ప్యాకేజీ కింద టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు రాజధానిలో ఏపీ ట్రాన్స్‌కో 18 కి.మీ. పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ (డైరెక్ట్ కరెంట్) లైన్స్‌లో మిగిలిన పనులు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) 20 కి.మీ. పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి రూ.283.57 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్యాకేజీ కింద సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 220 కేవీ ఈహెచ్‌వీ అండర్ గ్రౌండ్ లైన్లో పనుల పూర్తికి పిలిచిన టెండర్లలో కాంట్రాక్టు విలువ కంటే 8.98 శాతం అధిక ధరకు అంటే రూ.1,082.44 కోట్లకు కోట్ చేసిన బీఎస్సార్ ఇన్ఫ్రాటెక్ ఎల్–1గా నిలిచింది. ఏపీ ట్రాన్స్‌కో, పీజీసీఐఎల్ 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి పిలిచిన టెండర్లోనూ కాంట్రాక్టు విలువ కంటే 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ) ఎల్–1గా నిలిచింది. జీవో 133 ప్రకారం ఈ రెండు టెండర్లు రద్దు చేయాలి. కానీ.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 11న జరిగిన సీఆర్డీఏ అథారిటీ 45వ సమావేశంలో ఆ రెండు టెండర్లకు ఆమోదముద్ర వేశారు. దాంతో ఆ రెండు సంస్థలకు ఆ పనులను కట్టబెట్టేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్ 20న అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం.. కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధిక మొత్తాన్ని కాంట్రాక్టర్లు కోట్ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్ పిలవాలి. రెండుసార్లు టెండర్ పిలిచినా అదే పరిస్థితి పునరావృతమైతే ప్రభుత్వానికి నివేదించాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసే కమిటీ ఆ టెండర్‌పై తగిన నిర్ణయం తీసుకుంటుంది.ఖజానాపైరూ. 114.68 కోట్ల భారంబీఎస్సార్ ఇన్ఫ్రా టెక్ సంస్థ బలుసు శ్రీనివాసరావుకు చెందినది. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అందువల్లే నిబంధనలను తుంగలో తొక్కి 8.98 శాతం అధిక ధరకు కోట్ చేసిన ఆ సంస్థకు పనులు కట్టబెట్టారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.89.19 కోట్ల భారం పడుతుంది. ఇక పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్(జేవీ)కి సంబంధించి కొల్లిపర రామచంద్రరావు కూడా సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. అందుకే ఆ సంస్థ 8.99 శాతం అధిక ధరకు కోట్ చేసినా టెండర్ ఆమోదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.25.49 కోట్ల భారం పడుతుంది. ఈ రెండు ప్యాకేజీల పను ల్లో నిబంధనలను తుంగలో తొక్కడం వల్ల ఖజానాపై అదనంగా రూ.114.68 కోట్ల భారం పడుతుంది. ఆ మేరకు తన సన్నిహితులకు సీఎం చంద్రబాబు ప్రయోజనం చేకూర్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా కమీషన్లు చేతులు మారుతాయనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది.

పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్ గాందీ, బీఆర్ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రాజ్యాంగం, ‘సుప్రీం’ మధ్య విడదీయరాని బంధం
న్యూఢిల్లీ: దేశంలో ప్రాథమిక హక్కుల పరిధిని మరింత విస్తరింపజేయడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. 75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమని అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మధ్యవర్తిత్వం, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాల్లో మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా న్యాయస్థానం తీర్పులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని, ఇది చరిత్రాత్మక సందర్భమని వ్యాఖ్యానించారు. రెండింటి మధ్య విడదీయరాని బంధం కొనసాగుతున్నట్లు స్పష్టంచేశారు. ఇవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టును రాజ్యాంగమే సృష్టించిందని, రాజ్యాంగ ఆదేశాల ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తోందని ఉద్ఘాటించారు. అదేసమయంలో రాజ్యాంగానికి సుప్రీంకోర్టు అత్యుత్తమ రక్షణ కవచంగా వ్యవహరిస్తోందని జస్టిస్ గవాయ్ వివరించారు. జస్టిస్ ఓకా పని రాక్షసుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్.ఓకా తనకు మంచి మిత్రుడు, పని రాక్షసుడు జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. జస్టిస్ ఓకా ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టు అడ్వొకేట్–ఆన్–రికార్డు అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడారు. జస్టిస్ ఓకాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. జస్టిస్ ఓకా మాట్లాడుతూ.. జస్టిస్ గవాయ్ అసలైన ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు.

స్లీపర్ సెల్స్ సంగతి తేల్చండి
సాక్షి, అమరావతి: పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్లీపర్ సెల్స్‌ను గుర్తించే విషయంలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలో స్లీపర్స్ సెల్స్‌కు సంబంధించి తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని తేల్చిచెప్పింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.స్లీపర్ సెల్స్ ఉన్నా పట్టించుకోవడం లేదుపహల్గాం ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ రహస్యంగా పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నారని హైకోర్టు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఎ.శివకుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. వీరిలో 1,200 మంది ఏపీలోని నంద్యాల, గుంటూరు, వైఎస్సార్ తదితర జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నివేదికలిచ్చినా రాష్ట్ర హోంశాఖ, డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ హరినాథ్ ఇటీవల విచారణ జరిపారు. గౌతమి తరఫున కోనపల్లి నర్సిరెడ్డి, శివకుమార్ తరఫున బూదాటి జ్ఞానేంద్ర కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పహల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టు, వారంతా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాయని న్యాయవాది నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో పోలీసు యంత్రాంగం ఈ హెచ్చరికలను పట్టించుకోవడం లేదన్నారు. ఉగ్రమూకలకు సహకరిస్తున్న వారి విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.ఎన్ఐఏకు నోటీసులుఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని, స్లీపర్స్ సెల్స్ విషయంలో విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించారు. బాంబు పేలుళ్లు సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, తెలంగాణకు చెందిన సమీర్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

గూఢచర్యం జాడలివిగో!
గూఢచర్యానికి నిర్దిష్టమైన రూపురేఖలుండవు. దాన్ని సకాలంలో గుర్తించటం, కట్టడి చేయటం ఆషామాషీ కాదు. మన వేషభాషలతోనేవుంటూ, నిత్యం మనతో సన్నిహితంగా మెలగుతూ ప్రాణ ప్రదమైన మన రహస్యాలను బయటికి చేరేసేవారిని ఆనవాలు కట్టడం అంత సులభం కూడా కాదు. పహల్గామ్లో గత నెల 22న అమాయక పౌరులు 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నాక మన త్రివిధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వ హించి దాదాపు వందమందిని మట్టుబెట్టాయి. సింధూ నదీజలాల ఒప్పందంనుంచి వెనక్కి రాదల్చుకున్నట్టు ప్రకటించటంతోసహా అనేక అంశాల్లో పాకిస్తాన్‌కు ఇన్ని దశాబ్దాలుగా అందుతున్న ప్రయోజనాలను మన దేశం నిలుపుచేసింది. దానికి అనుబంధంగా దేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు సాగటం, పహల్గామ్లో భద్రతాలోపాలపై ప్రశ్నించినవారినీ, జవాబుదారీ తనాన్ని కోరినవారినీ ఉగ్రవాద సమర్థుకులుగా ముద్రేయటం మొదలైంది. ఇది అవాంఛనీయమైన పరిణామం. ఈ నేపథ్యంలో నిఘానేత్రాల కళ్లుగప్పి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరేస్తున్న 11 మందిని గుర్తించి అరెస్టు చేయటం కీలక మలుపు. అరెస్టయినవారిలో చాలామంది మధ్యతరగతి యువత. వారిలో జ్యోతి మల్హోత్రా అనే యువతి పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు కీలకమైన సమా చారం అందించిందన్నది పోలీసుల అభియోగం. సామాజిక మాధ్యమాల సందడి పెరిగాక ఒక కొత్త తరం బయల్దేరింది. విచక్షణా జ్ఞానం లోపించటం, లోతైన సమాచారం లేకుండానే దేనిపైన అయినా అభిప్రాయాలు ఏర్పర్చుకోవటం, ఆధారాలున్నాయా లేదా అనేదాంతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని వ్యాప్తిచేయటం, సామాజిక మాధ్యమాలపై మోజున్న యువతరానికి అలవాటుగా మారింది. సెల్‌ఫోన్‌తో దేన్నయినా చిత్రించటం, వెనకా ముందూ ఆలోచించకుండా అందరికీ చేరేయటం రివాజైంది. మనం కూడా ఏదో ఒకటి చేయాలన్న కుతూహలంతో మొదలై, అందరికన్నా ఎక్కువమంది వీక్షకుల్ని ఆకట్టుకోవటం లక్ష్యంగా మారటం, ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందటం, ప్రశంసలు, వాటి వెంబడే ఆదాయం మొదలవుతుంది. ఇక ఆ వ్యామోహం నుంచి వెనక్కిరావటం వాళ్లవల్ల కాదు. తాము చేసే పని ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడును ప్రోత్సహిస్తుందో గ్రహించేంత సామర్థ్యం లేకపోవటం సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన అత్యధిక యువతలో కనబడే ప్రాథమిక లక్షణం. ఇలాంటివారిని ఆకట్టుకుని, వీరితో సంబంధ బాంధవ్యాలు నెరపి దగ్గరకావటం పొరుగు దేశ గూఢచార సంస్థలకు సులభం. జ్యోతి మల్హోత్రా విషయంలో జరిగింది అదే. ఆమె తగిన పత్రాలను సమర్పించి ప్రభుత్వానికి తెలిసే విధంగానే పాకిస్తాన్ వెళ్లింది. అక్కడ వేర్వేరు వ్యక్తుల్ని కలిసింది. పాకిస్తాన్ జాతీయ దినోత్సవంలో పాల్గొన్నది. అక్కడున్నవారిని పరిచయం చేసింది. వారితో మాట్లాడించింది. విదేశాలకు పోవటం, అక్కడి ప్రాంతాలను సందర్శించటం, వారితో సంభాషించటం వగైరాలు సహజంగానే సాధారణ వీక్షకులకు ఎంతో ఆసక్తి అనిపిస్తాయి. జ్యోతి నిర్వహించే యూట్యూబ్ చానెల్‌కు దాదాపు 4 లక్షలమంది చందాదార్లుండటం, ఫేస్బుక్లో 3 లక్షలమందిపైగా ఆమె ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలను వీక్షించటం, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్షన్నరమంది చూడటం ఇందువల్లే. తమ అరకొర పరిజ్ఞానంతో గంటల తరబడి దేనిపైన అయినా అనర్గళంగా మాట్లాడటం నచ్చటంవల్లే ఇన్నేసి లక్షలమంది వారిని అనుసరిస్తుంటారు. శత్రు దేశాల మధ్య యుద్ధాలు సరిహద్దుల్లోనే జరగవు. అవి కేవలం సైనికుల మధ్యే సాగవు. అనేక రూపాల్లో నిరంతరం కొనసాగుతుంటాయి. కనీసం జ్యోతి ప్రభుత్వానికి తెలిసేవిధంగా పాకిస్తాన్ వెళ్లింది. కానీ చడీచప్పుడూ లేకుండానే శత్రుదేశానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరేసేవారుంటారు. పాకిస్తాన్ హైకమిషన్‌లో ఇటీవల వరకూ పనిచేసి బహిష్కరణకు గురైన డానిష్ అనే ఉద్యోగి అడిగిన సమాచారమంతా ఆమె అందించిందని నిఘా వర్గాలంటున్నాయి. ఆ పని చేయటం పర్యవసానంగా తోటి పౌరులే ప్రమాదాల్లో చిక్కుకుంటారని, అది దేశద్రోహమని వారికి అనిపించదు. డబ్బుకు ఆశపడటం ఒక్కటే ఇలాంటి కార్యకలాపాలకు కారణం అనుకోవటానికి లేదు. వేరే దేశానికి చెందినవారు వీడియోలను చూడటం, పొగడ్తలు గుప్పించటం, తమ ప్రాంతాలకొచ్చి అక్కడి విశేషాలను కూడా చూపాలని అడగటం వగైరాలు వారిని ఆకర్షిస్తాయి. తమ ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్న భ్రమ వారిని నిలకడగా ఆలోచించనీయదు. గూఢచర్యం కేవలం అవతలి దేశాన్ని నష్టపరచటానికో, చికాకుపరచటానికో పరిమితం కాదు. వారి ఆయుధాగారాల్లో వచ్చి చేరుతున్న రక్షణ సామగ్రి సామర్థ్యం ఏమిటో, ఎక్కడెక్కడ వారి సైనిక స్థావరాలు పనిచేస్తున్నాయో తెలుసుకోవటంతోపాటు పారిశ్రామిక, ఆర్థిక, పరిశోధనారంగాల్లో ఆ దేశం ఏం చేస్తున్నదో సమాచారాన్ని సేకరిస్తుండటం గూఢచారుల పని. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఎక్కడ మన వైఫల్యం వున్నదో, అందుకు కారణమేమిటో తెలుసుకునే పనిలో ప్రభుత్వం తలమునకలై వుండగా దేశభక్తి పేరిట కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్ట జూశారు. ఇప్పుడు పట్టుబడినవారి నేపథ్యం గమనిస్తే ఫలానా మతంవారే దేశద్రోహానికి పాల్పడతారన్నది ఎంత బూటకమో తెలుస్తుంది. శత్రువు కీలకమైన సమాచారాన్ని ఒడుపుగా తస్కరించగలుగుతున్నాడంటే నిస్సందేహంగా అది మన వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చి అసత్యాలు ప్రచారం చేయటానికి బదులు, లోపాలను సరిదిద్దుకుని పటిష్టమైన వ్యవస్థలు రూపొందించటం వర్తమాన అవసరం.

‘ప్లే ఆఫ్స్’కు ముంబై
తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలు... ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ తమ సీజన్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది... అయితే ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ముందంజ వేసింది. 2025 సీజన్లో ‘ప్లే ఆఫ్స్’లో చివరిదైన నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రారంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ‘ప్లే ఆఫ్స్’లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ (35 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. 2 ఓవర్లలో 48 పరుగులు... బంతి తక్కువ ఎత్తులో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), విల్ జాక్స్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీప్ తన తొలి ఓవర్లోనే రికెల్టన్ను వెనక్కి పంపగా, తిలక్ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు.ఆరంభంలో సూర్యకుమార్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 18 ఓవర్లలో ముంబై స్కోరు 132/5 మాత్రమే. కనీసం 160 పరుగులు కూడా దాటడం అసాధ్యంగా అనిపించింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పండగ చేసుకున్నారు. ముకేశ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి సూర్య సిక్స్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి నాలుగు బంతుల్లో నమన్ వరుసగా 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య ఒక్కడే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు లభించాయి. టపటపా... ఛేదనలో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ఏ దశలోనూ జట్టు విజయం దిశగా వెళ్లలేకపోయింది. తొలి 5 ఓవర్లలోపే డుప్లెసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషే పొరేల్ (6) అవుట్ కావడంతోనే గెలుపుపై ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విప్రాజ్ నిగమ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (2) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 66/5కు చేరింది. మరో ఎండ్‌లో రిజ్వీ కొంత పోరాడినా లాభం లేకపోయింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెగ్యులర్ కెపె్టన్ అక్షర్ పటేల్ జ్వరంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో డుప్లెసిస్ ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) మాధవ్ తివారి (బి) కుల్దీప్ 25; రోహిత్ (సి) పొరేల్ (బి) ముస్తఫిజుర్ 5; జాక్స్ (సి) నిగమ్ (బి) ముకేశ్ 21; సూర్యకుమార్ (నాటౌట్) 73; తిలక్ వర్మ (సి) రిజ్వీ (బి) ముకేశ్ 27; పాండ్యా (సి) ముకేశ్ (బి) చమీరా 3; నమన్ ధీర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–58, 4–113, 5–123. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–48–2, చమీరా 4–0–54–1, ముస్తఫిజుర్ 4–0–30–1, విప్రాజ్ నిగమ్ 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–22–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 11; డుప్లెసిస్ (సి) సాంట్నర్ (బి) చహర్ 6; పొరేల్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 6; రిజ్వీ (బి) సాంట్నర్ 39; నిగమ్ (సి అండ్ బి) సాంట్నర్ 20; స్టబ్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; అశుతోష్ శర్మ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 18; మాధవ్ తివారి (బి) బుమ్రా 3; చమీరా (నాటౌట్) 8; కుల్దీప్ (సి) రాజ్ బావా (సబ్) (బి) కరణ్ శర్మ 7; ముస్తఫిజుర్ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–27, 4–55, 5–65, 6–103, 7–104, 8–108, 9–120, 10–121. బౌలింగ్: బౌల్ట్ 4–0–29–1, చహర్ 3–0–22–1, జాక్స్ 1–0–16–1, సాంట్నర్ 4–0– 11–3, బుమ్రా 3.2–0–12–3, కరణ్ శర్మ 3–0–31–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X లక్నోవేదిక: అహ్మదాబాద్∙రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో
పొరపాటున నోరు జారి.. జపాన్ మంత్రి రాజీనామా
నేడు జేఈఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్
వృథా లైన్లతో ‘సంతోషం’!
దెబ్బతిన్న ముందుభాగంతోనే లాండింగ్
సొమ్ము సర్కారుది.. సోకు కాంట్రాక్టరుది..
ఐఎస్ఐ ఏజెంట్లను కలిశా
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ఉపాధ్యాయుల బదిలీలు షురూ
ఒక్క రోజు ముందు రిటైరయ్యేవారికీ నోషనల్ ఇంక్రిమెంట్
పొగాకు రైతుకు కంపెనీల కాటు
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
మంగళవారం రోల్ ఇక మర్చిపోండి: నటి రిక్వెస్ట్
ఈపీఎఫ్‌వోలోకి 14.58 లక్షల సభ్యులు
టారిఫ్ ప్రభావాలను భారత్ తట్టుకోగలదు
బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్‌రేప్
సెలవుల్లో పని చేయడానికి లాయర్లు ఇష్టపడడం లేదు
స్కూల్ సిలబస్‌లో యోగా
ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు!
ఎవరెస్టుపైకి యమా స్పీడుగా
నోటికాడి బువ్వ.. నీటిపాలు
సీఎం రేవంత్‌రెడ్డిది పర్సంటేజీ పాలన: కేటీఆర్
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా: ఎగబడిన జనం, ఘోరం ఏంటంటే!
సినిమా

కమల్ హాసన్ థగ్ లైఫ్.. 'షుగర్ బేబీ' వచ్చేసింది..!
కమల్‌హాసన్ , త్రిష జంటగా నటిస్తోన్న తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ హాసన్ జతకట్టారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. షుగర్ బేబీ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను అలెగ్జాండ్ర జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. (ఇది చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్)కాగా..ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో శింబు కీలక పాత్రలో కనిపించనున్నారు. శింబు సరసన సన్య మల్హోత్రా నటించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.

లెజెండ్‌కు నివాళులర్పించిన కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ సరసన హీరోయిన్గా త్రిష మెప్పించింది.అయితే అజిత్ కుమార్ కేవలం సినిమాలే కాదు.. కారు రేసింగ్‌లోనూ ఆయన దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన టీమ్ వరుసగా మూడు దేశాల్లో కప్‌లు కొట్టింది. తన చిన్నప్పటి నుంచి రేసర్ కావాలనేది ఆయన కోరిక అని.. యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి వచ్చానని గతంలోనే వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి వచ్చానని అజిత్ కుమార్ తెలిపారు. రేసింగ్ పట్ల తన అభిమానాన్ని ఏదో ఒక సందర్భంలో చాటుకుంటూనే ఉన్నారు.తాజాగా అజిత్ కుమార్ ఇటలీలోని ఇమోలాలో ఉన్న ఫార్ములా వన్ లెజెండ్ అయర్టన్ సెన్నా స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అజిత్ స్వయంగా 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా ఎఫ్‌వన్ రేసులో ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలో ఉన్న సెన్నా విగ్రహాన్ని ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.Ajith Sir paying tribute to Ayrton Senna at the Imola circuit. | #AK #Ajith #Ajithkumar | #GoodBadUgly | #AjithKumarRacing | #24HSeries | #AKRacing | #AyrtonSenna | pic.twitter.com/bWUJacUPSR— Ajith (@ajithFC) May 20, 2025 ThalaAjith pays respect to his Idol #AyrtonSenna 👏👏👏👏👏 pic.twitter.com/xU2t8yXG9l— Joker (@joker28_joker) May 20, 2025

మీ కుమారుడితో సినిమా తీస్తారా?.. కేజీఎఫ్ హీరో యశ్ తల్లి ఆసక్తికర సమాధానం..!
కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో యశ్. శాండల్‌వుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా యశ్‌కు గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో యశ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం యశ్ టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు.అయితే ఈ కన్నడ హీరో మాతృమూర్తి పుష్ప అరుణ్ కుమార్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె తాజాగా నిర్మించిన చిత్రం కోతలవాడి. ఈ మూవీకి శ్రీరాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన యశ్ తల్లి పుష్పకి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ కుమారుడితో మూవీ తీయాలనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారు? అని ఆమెను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.అయితే దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరికీ నవ్వులు తెప్పించింది. అసలు నేను యశ్‌తో సినిమా చేయనని షాకింగ్ సమాధానమిచ్చింది. ఎందుకంటే అన్నం లేనివాడికి పెట్టాలి కానీ.. అన్నీ ఉన్నవాడికి పెడితే వాటి విలువ తెలియదంటూ ఆమె మాట్లాడింది. నేను చెప్పేది నిజమా? కాదా? అంటూ అక్కడున్నవారిని అడిగింది. వాడికి అన్నీ ఉన్నాయి.. సినిమా కావాలనుకుంటే వాడే తీసుకుంటాడు.. నేను యశ్‌తో ఎలాంటి సినిమా చేయనంటూ ఖరాఖండిగా చెప్పేసింది ఆయన మాతృమూర్తి పుష్ప అరుణ్‌కుమార్. దీనికి అక్కడున్నవారంతా కాస్తా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే కన్నడకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో అనర్గళంగా మాట్లాడడం విశేషం.

గేమ్ ఛేెంజర్ హీరోయిన్‌పై ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు డిలీట్ చేసిన డైరెక్టర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వార్-2. ఈ మూవీలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ ఫుల్ యాక్షన్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ కియారా బికినీలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఆ హీరోయిన్ను అలా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.అయితే ఈ టీజర్ చూసిన టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం టీజర్ చూసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో కియారా అద్వానీ బికినీ డ్రెస్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదానికి దారితీసింది. ఆర్జీవీ పోస్ట్ చూసిన నెటిజన్స్ చెత్త పోస్ట్ అంటూ రాం గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మ భాయ్, ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్తా ఆలోచించండి.. అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చారు.తన ట్వీట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆర్జీవీ తన పోస్ట్‌ను సోషల్ మీడియాలో తొలగించాడు. కియారా అభిమానులు, నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా.. వార్- 2 లో హృతిక్ రోషన్ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధిలావాల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్

హామీలు నెరవేర్చలేకే రెడ్‌బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్

పాకిస్తాన్ తూటాలకు క్షిపణులతో బదులివ్వండి... ప్రతి దుశ్చర్యకూ మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెప్పాల్సిందే...
క్రీడలు

‘ప్లే ఆఫ్స్’కు ముంబై
తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలు... ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ తమ సీజన్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది... అయితే ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ముందంజ వేసింది. 2025 సీజన్లో ‘ప్లే ఆఫ్స్’లో చివరిదైన నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రారంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ‘ప్లే ఆఫ్స్’లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ (35 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. 2 ఓవర్లలో 48 పరుగులు... బంతి తక్కువ ఎత్తులో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), విల్ జాక్స్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీప్ తన తొలి ఓవర్లోనే రికెల్టన్ను వెనక్కి పంపగా, తిలక్ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు.ఆరంభంలో సూర్యకుమార్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 18 ఓవర్లలో ముంబై స్కోరు 132/5 మాత్రమే. కనీసం 160 పరుగులు కూడా దాటడం అసాధ్యంగా అనిపించింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పండగ చేసుకున్నారు. ముకేశ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి సూర్య సిక్స్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి నాలుగు బంతుల్లో నమన్ వరుసగా 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య ఒక్కడే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు లభించాయి. టపటపా... ఛేదనలో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ఏ దశలోనూ జట్టు విజయం దిశగా వెళ్లలేకపోయింది. తొలి 5 ఓవర్లలోపే డుప్లెసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషే పొరేల్ (6) అవుట్ కావడంతోనే గెలుపుపై ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విప్రాజ్ నిగమ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (2) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 66/5కు చేరింది. మరో ఎండ్‌లో రిజ్వీ కొంత పోరాడినా లాభం లేకపోయింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెగ్యులర్ కెపె్టన్ అక్షర్ పటేల్ జ్వరంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో డుప్లెసిస్ ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) మాధవ్ తివారి (బి) కుల్దీప్ 25; రోహిత్ (సి) పొరేల్ (బి) ముస్తఫిజుర్ 5; జాక్స్ (సి) నిగమ్ (బి) ముకేశ్ 21; సూర్యకుమార్ (నాటౌట్) 73; తిలక్ వర్మ (సి) రిజ్వీ (బి) ముకేశ్ 27; పాండ్యా (సి) ముకేశ్ (బి) చమీరా 3; నమన్ ధీర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–58, 4–113, 5–123. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–48–2, చమీరా 4–0–54–1, ముస్తఫిజుర్ 4–0–30–1, విప్రాజ్ నిగమ్ 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–22–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 11; డుప్లెసిస్ (సి) సాంట్నర్ (బి) చహర్ 6; పొరేల్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 6; రిజ్వీ (బి) సాంట్నర్ 39; నిగమ్ (సి అండ్ బి) సాంట్నర్ 20; స్టబ్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; అశుతోష్ శర్మ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 18; మాధవ్ తివారి (బి) బుమ్రా 3; చమీరా (నాటౌట్) 8; కుల్దీప్ (సి) రాజ్ బావా (సబ్) (బి) కరణ్ శర్మ 7; ముస్తఫిజుర్ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–27, 4–55, 5–65, 6–103, 7–104, 8–108, 9–120, 10–121. బౌలింగ్: బౌల్ట్ 4–0–29–1, చహర్ 3–0–22–1, జాక్స్ 1–0–16–1, సాంట్నర్ 4–0– 11–3, బుమ్రా 3.2–0–12–3, కరణ్ శర్మ 3–0–31–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X లక్నోవేదిక: అహ్మదాబాద్∙రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. ముకేశ్ కుమార్, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 25, రోహిత్ శర్మ 5, విల్ జాక్స్ 21, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, చాహర్, జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్ రిజ్వి (39) టాప్ స్కోరర్ కాగా.. విప్రాజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

IPL 2025, MI VS DC: సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి (ముంబైలో). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది.9 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేసింది. రికెల్టన్ (25), రోహిత్ శర్మ (5), విల్ జాక్స్ (21) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (13), తిలక్ వర్మ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.కుల్దీప్ సెంచరీఈ మ్యాచ్‌లో రికెల్టన్ వికెట్ తీయడంతో కుల్దీప్ ఐపీఎల్లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనతను కుల్దీప్ 97 మ్యాచ్‌ల్లో సాధించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పూర్తి చేసిన టాప్-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వీరు ముగ్గురు 83 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ఈ జాబితాలో చహల్ (84 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (86) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. కుల్దీప్ నాలుగో స్థానంలో నిలిచాడు.ప్లే ఆఫ్స్ సమీకరణలు ఇలా..ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇవాల్టి మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

ఇండియా ఏతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. వోక్స్, ఫ్లింటాఫ్‌కు చోటు
మే 30 నుంచి ఇండియా-ఏతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టును ఇవాళ (మే 21) ప్రకటించారు. ఈ జట్టుకు వెటరన్ పేసర్ క్రిస్ వోక్స్ ఎంపికయ్యాడు. వోక్స్ కాలి మడమ గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ గాయం కారణంగానే జింబాబ్వేతో రేపటి నుంచి ప్రారంభం కాబోయే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు వోక్స్‌ను ఎంపిక చేయలేదు.ఇండియా ఏతో సిరీస్‌కు ఎంపిక చేసిన లయన్స్ జట్టుకు జేమ్స్ ర్యూ సారథ్యం వహించనున్నాడు. వోక్స్‌తో పాటు రెహాన్ అహ్మద్, డాన్ మౌస్లీ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సిరీస్ కోసం భారత-ఏ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో సత్తా చాటే ఆటగాళ్లకు జాతీయ జట్లలో చోటు దక్కే అవకాశం ఉంది.భారత్-ఏతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ లయన్స్ జట్టు..జేమ్స్ ర్యూ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, రెహాన్ అహ్మద్, సోనీ బేకర్, జోర్డాన్ కాక్స్, రాకీ ఫ్లింటాఫ్, ఎమిలియో గే, టామ్ హైన్స్, జార్జ్ హిల్, జోష్ హల్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ, అజీత్ సింగ్ డేల్, క్రిస్ వోక్స్ఇంగ్లండ్ లయన్స్‌తో సిరీస్‌కు భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, హర్ష్ దూబే, తనుశ్ కోటియన్, ఇషాన్ కిషన్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, తుషార్ దేశ్‌పాండే, ముకేశ్ కుమార్, ఆకాశ్‌దీప్, ఖలీల్ అహ్మద్భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య అనధికారిక టెస్ట్ సిరీస్ షెడ్యూల్..మే 30-జూన్ 2- తొలి టెస్ట్ (కాంటర్బరీ)జూన్ 6-9- రెండో టెస్ట్ (నార్తంప్టన్)
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల వాతావరణంలో స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో 82,021 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ 410.19 పాయింట్లు (0.51 శాతం) పెరిగి 81,596.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 129.55 పాయింట్లు లేదా 0.52 శాతం లాభపడి 24,813.45 వద్ద ముగిసింది.బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు 1.87 శాతం వరకు నష్టపోయాయి.బీఎస్ఈలో ట్రేడైన 4,115 షేర్లలో 2,304 షేర్లు లాభాల్లో ముగియగా, 1,674 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 137 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.78 శాతం, 0.38 శాతం లాభాలతో ముగిశాయి.రంగాలవారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఎన్ ఎస్ ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లు లాభాల్లో స్థిరపడగా, నిఫ్టీ రియాల్టీ, ఫార్మా సూచీలు వరుసగా 1.72 శాతం, 1.25 శాతం లాభపడ్డాయి. మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ (ఇండియా వీఐఎక్స్) 0.93 శాతం పెరిగి 17.55 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఒకే కంపెనీలో 50,000 మందికి ప్రమోషన్
గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ జూన్ 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ సైకిల్‌ను ప్రకటించింది. ఇందులో భారతదేశంలో 15,000 మంది ఉన్నారు. ఐటీ కన్సల్టింగ్ డిమాండ్ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులపై పరిశీలన పెరగడంతో ఈ ప్రమోషన్లలో ఆరు నెలలపాటు జాప్యం జరిగింది. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు నిలిచిపోయిన ప్రమోషన్లను జూన్‌లో ప్రకటిస్తామని తెలిపింది. ఈమేరకు బ్లూమ్‌బర్గ్ వివరాలు వెల్లడించింది.సాంప్రదాయంగా యాక్సెంచర్ డిసెంబరులో ప్రమోషన్లను ప్రకటించింది. కానీ క్లయింట్ డిమాండ్, బడ్జెట్‌కు అనుగుణంగా ప్రమోషన్ చెల్లింపులు లేకపోవడంతో ఆ సైకిల్‌ను జూన్‌కు మార్చారు. స్థిరమైన వార్షిక షెడ్యూల్ ప్రకారం కాకుండా వ్యాపార అవసరాల ఆధారంగా ఉద్యోగులను ప్రమోట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమోషన్లు భారతదేశంలో 15,000, యూరప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (ఈఎంఈఏ) దేశాల్లో 11,000, అమెరికాలో 10,000గా ఉండనున్నాయి.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!అధిక వృద్ధి రంగాల్లోని ఉద్యోగులకు మూల వేతన పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే బోనస్, ఈక్విటీ ఆధారిత పరిహార నిర్ణయాలను 2025 డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ విధానం యాక్సెంచర్ పనితీరును, ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి అనుమతిస్తుందని చెబుతున్నారు. 2023లో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ప్రపంచ ఆర్థిక సవాళ్లకు సమర్థంగా ప్రతిస్పందించడానికి, మారుతున్న కస్టమర్ డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ 19,000 ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. ఆర్థిక వివేకాన్ని పాటిస్తూ ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని పెంపొందించేలా కొత్త ప్రమోషన్ వ్యూహాన్ని రూపొందించింది.

టెలిగ్రామ్ సీఈఓ.. ‘దేశం విడిచి వెళ్లకూడదు’
ముందస్తు అనుమతి లేకుండా టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఫ్రాన్స్ విడిచి వెళ్లేందుకు అధికారులు నిరాకరించారు. ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌తో చర్చల కోసం అమెరికా వెళ్లాలని దురోవ్ ఇటీవల అధికారులను విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన అభ్యర్థనను పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తోసిపుచ్చింది.పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం, దురోవ్ ప్రతిపాదిత యూఎస్ పర్యటనను ఉటంకిస్తూ ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు ‘ఈ పర్యటనకు కచ్చితంగా వెళ్లాలనేలా ఎలాంటి కారణాలు లేవు’ అని ఇటీవల తీర్పు ఇచ్చారు. 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో అరెస్టయినప్పటి నుంచి దురోవ్ ఎదుర్కొంటున్న న్యాయపరమైన అడ్డంకులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అరెస్టు చేసినప్పటి నుంచి ఆయనను కఠినమైన చట్టపరమైన నియంత్రణలో ఉంచారు. దురోవ్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న టెలిగ్రామ్‌లో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన తనపై ఆరు క్రిమినల్ అభియోగాలు మోపారు.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!టెలిగ్రామ్ సీఈఓపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్‌ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటివి ఉన్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్‌కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు. ఫ్రాన్స్ అధికారులు 2024 ఆగస్టులో ఫ్రెంచ్ విమానాశ్రయంలో దురోవ్‌ను అరెస్టు చేశారు.

టీవీఎస్ కొత్త ఈవీ త్రీవీలర్.. ధర ఎంతంటే..
టీవీఎస్ మోటార్ కంపెనీ ‘కింగ్ ఈవీ మ్యాక్స్’ అనే ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను తమిళనాడులో లాంచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఈవీ త్రీవీలర్ ధర రూ.2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉందని చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 179 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని పేర్కొంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం వల్ల కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 80% ఛార్జ్ అవుతుంది.టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఫీచర్లుబ్యాటరీ: హై పెర్ఫార్మెన్స్ 51.2వోల్ట్ లిథియం-అయాన్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ.గరిష్ట వేగం: 60 కి.మీ/గం గరిష్ఠ వేగంతో మూడు డ్రైవింగ్ మోడ్లతో వస్తుంది. ఎకో (40 కి.మీ/గం), సిటీ (50 కి.మీ/గం), పవర్ (60 కి.మీ/గం) వేగాన్ని కలిగి ఉంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!స్మార్ట్ కనెక్టివిటీ: టీవీఎస్ స్మార్ట్ఎక్స్కనెక్ట్ స్మార్ట్ఫోన్ల ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వెహికల్ డయాగ్నస్టిక్స్ వివరాలు అందిస్తుంది.
ఫ్యామిలీ

నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..!
ఎందరో మేధావులు, ప్రముఖులు జీవితంలో అనుభవించాల్సిన ఆనందమంతా పొంది, బాధ్యతలు కూడా నెరవేర్చి.. చరమాంకంలో ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేస్తుంటారు. ఇక వారి శేష జీవితాన్ని ఆ దేవుని సేవకు అంకితం చేసిన ఎందరో భక్తాగ్రేసులను చూశాం. అలా కాకుండా వారందరికంటే భిన్నంగా..ఓ వ్యక్తి ఆధ్యాత్మికత నుంచి ఆధునిక జీవన విధానంలోకి వచ్చాడు. ఆయన ఆధ్యాత్మికంగా పరిపక్వత చెంది..చివరికి ప్రాంపించిక జీవితంలోకి రావడమే గాక..కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి సీఈవోగా ఎదిగారాయన. అంతేగాదు కుటుంబ జీవనంలో బతుకుతూనే ఆధ్యాత్మికంగా బతకొచ్చు అని నిరూపించాడు. పైగా అది మన జీవితంలో భాగమే గానీ ఎక్కడో దేవాలయాల్లో, మఠాల్లోనూ పొందే సిద్ధాంతం కాదని అంటారాయన. అది మన జీవన విధానానికే పునాది..అదే కేంద్రం బిందువని చెప్పకనే చెప్పాడు.ఆయనే స్టోన్ సఫైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శోభిత్ సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సింగ్ చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతవైపు ఆకర్షితుడయ్యాడు. అలా తన చదువు పూర్తి చేసుకున్న వెంటనే..కేవలం 26 ఏళ్లకే రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. అక్కడే వేద అధ్యయనం చేశాడు. ఇక పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే నడవాలని భావించాడు. అలా ఆ రిషికేశ్ ఆశ్రమం మహర్షి సంస్థలో సభ్యుడిగా కూడా మారాడు. పూర్తి సన్యాసి జీవితం గడుపుతున్న శోభిత్ సింగ్ మఠాన్ని విడిచి పెట్టి..ప్రాపంచిక జీవితంలో గడుపుతూ ఆధ్యాత్మికంగా ఉండొచ్చు అని విశ్విసించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఆ ఆశ్రమంలో ఉండగానే ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు లేదా ఏకాంతం లేదా 'సంసారం' నుంచి నిష్క్రమించడం కాదని బోధపడింది. మన దైనందిన జీవితంలో ప్రతిపాత్రలో దీన్ని విలీనం చేసి బతికే జీవన విధానమే అది అని తెలుసుకున్నానని చెబుతున్నాడు శోభిత్. అప్పుడే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యా..అందరిలా జనజీవన స్రవంతిలో చేరి కార్పొరేట్ ప్రంపంచలో బతుకుతూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా బతకచ్చో ఆచరించి చూపాలని నిర్ణయించుకున్నారట శోభిత్ సింగ్ఆ నేపథ్యంలోనే కొత్తమంది స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా విజయాలను అందుకున్నానని అన్నారు. ఈ పోటీతత్వంతో కూడిన కార్పొరేట్ వరల్డ్‌లో కూడా తన ఆలోచన విధానంలో ఎట్టి మర్పు రాలేదని ధీమాగా చెబుతున్నారు శోభిత సింగ్. ఆశ్రమంలో లేదా వ్యాపారంలో అయినా..తాను ఆధ్యాత్మికత విద్యార్థినే అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత..వినయం, సానుకూలత, సానుభూతి, గ్రహణశక్తి తదితరాలను ప్రతిబింబిస్తే..వ్యాపారంలో రాణించాలంటే కూడా ఇవన్నీ అవసరం..అదే నన్ను వ్యవస్థాపక జీవితంలోకి తీసుకొచ్చాయని నవ్వుతూ చెబుతారాయన. అదే వ్యాపార సూత్రం..ఆధ్యాత్మికత ప్రాథమిక విలువలైనా..బహిరంగత, వినయం, సానుకూలత, సానుభూతి, ఆత్మపరిశీలన, గ్రహణశక్తి తదితరాలే నా వ్యాపార సూత్రాలంటారు ఆయన. వాటితోనే తాను అందరితో సంబంధాలు నెరపీ..వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తికి 200% జీవితం ఉంటుందట. అంటే 100% అంతర్గత (ఆధ్యాత్మిక), ఇంకో 100% బాహ్య జీవతానికి కేటాయించి ఉంటుందంటారు సింగ్. ఈ ఆధ్యాత్మికత ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా స్పష్టమైన వైఖరితో ఉండటం నేర్పిస్తుందట. పైగా అన్నివేళల మంచి స్పృహతో ఉంటారట. ఈ ఆధ్యాత్మికతలో మనల్ని మనం పరిశీలించటంతో జర్నీ మొదలవుతుంది..అక్కడ నుంచి మన దృక్కోణం మారుతుది..దాంతోపాటు జీవితం కూడా మారుతుంది. అలాగే ఏ విషయాలకు ఎలా స్పందించాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంటుంది. అది ఈ ప్రాపంచిక జీవన విధానంలో ఎలా మసులుకోవాలో నేర్పించడమే గాక జీవితంలో ఉన్నతంగా బతకడం వైపుకు మార్గం వేస్తుందని చెబుతున్నారు శోభిత్ సింగ్. కాగా, ఆయన కంపెనీ గుజరాత్‌కు చెందిన కాగితపు ఉత్పత్తుల సరఫరాదారు. దీని టర్నోవర్ కోట్లలో ఉంటుందట. అంతేగాదు ఇది ఆసియాలో అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సరఫరాదారులలో ఒకటి, పైగా US రిటైలర్ల కాగితపు ఉత్పత్తి అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా చిన్నారుల ఆర్ట్ సామాగ్రి, క్రాఫ్ట్ మెటీరియల్, పర్యావరణ అనుకూల స్టేషనరీ తదితర ఉత్పత్తులను అందిస్తుంది. (చదవండి: International Tea Day: 'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!)

కాన్స్‌లో బాలీవుడ్ నటి రుచి : ప్రధాని మోదీ ఫోటో నెక్లెస్‌పై చర్చ
78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Canne Film Festival 2025) వేడుక వైభవంగా జరుగుతోంది. ఫ్యాషన్ స్టైల్స్, గ్రామ్ లెన్స్, రెడ్ కార్పెట్ మెరుపులతో సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. అత్యంతప్రతిష్టాత్మక కాన్స్రెడ్ కార్పెట్‌పై ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటున్నారు. నటులు, మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా అందరూ ఫ్యాషన్ గేమ్‌ను నెక్ట్స్ లెవల్ అనిపించుకుంటన్నారు. తాజాగా బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar) లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్యారిస్‌లో జరుగుతోన్నకాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రుచి ధరించిన మూడు మోదీ ఫోటోలతో ఉన్న నెక్లెస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో ఉన్న నెక్లెస్‌తోపాటు, అందమైన లెహెంగాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దీనికితోడు రుచి అందమైన లెహంగాతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ఔరా అనిపించుకుంది. సాంప్రదాయ గాజులు, భారీ మాంగ్-టీకా, దానికి సరిపోయే చెవిపోగులతో, ఆమె తన లుక్‌ను అందంగా తీర్చిదిద్దుకుంది. లేత గోధుమ రంగు లెహంగాకు నక్సీ వర్క్ ఉన్న డీప్-ప్లంగింగ్ బ్లౌజ్, స్కర్ట్‌ను జత చేసింది. హర్యాన్వి బంధానీ దుప్పట్టా ఆకర్షణీయంగా నిలిచింది. స్కర్ట్ అంతా అద్దాలను పొందుపరిచారు. బంధానీ దుప్పట్టాను జరిబారికి చెందిన రామ్ రూపొందించారని, దీని ద్వారా రాజస్థాన్ ఆత్మను కప్పుకున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించింది. View this post on Instagram A post shared by Ruchi Gujjar (@ruchigujjarofficial)స్టేట్మెంట్ నెక్లెస్, హైలైట్కాన్స్లో రుచి గుజ్జర్ లుక్ చర్చకు దారితీసింది. పీఎం మోదీ ముఖంతో డిజైన్ చేసిన డబుల్ లేయర్డ్, నెక్లెస్ ధరించి తళుకున్న మెరిసింది. ఒకటి మినీ-పెర్ల్స్‌తో తయారు చేసిన చోకర్ కాగా, మరొకటి స్టేట్మెంట్ పీస్. స్పెషల్ నెక్లెస్‌పై మూడు కమలాల మోటిఫ్లో మోదీ ఫోటోను జతచేసి ఉండటం హైలైట్. తన నెక్లెస్ గురించి మాట్లాడుతూ..ఇది ప్రత్యేకమైందీ, ప్రతీకాత్మకమైనదని చెప్పింది రుచి. ఇది కేవలం నెక్లెస్ కాదు, భారతదేశం బలానికి ఉన్నతికి చిహ్నం. ప్రపంచ వేదికపై దేశం బలాన్ని, పటిష్టతను ఇది చాటి చెప్పుతుందని తెలిపింది. భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ప్రధాని మోదీని గౌరవార్ధం దీన్ని ధరించినట్టు చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. రుచి గుజ్జర్ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కొందరు ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. ఒక యూజర్ మాత్రం "యే క్యా బక్వాస్ హై" అని కామెంట్ చేశారు. మరొక యూజర్ "మీ తలపై హర్యాన్వి దుపట్టా" అని కామెంట్ చేశారు. మూడవ వినియోగదారుడు, "అన్నీ ఆర్గానిక్‌గా బాగున్నాయి కానీ మోదీజీ ఫోటో ఎందుకు?" అంటూ నిట్టూర్చాడు.

'కమ్యూనిటీ' ఆవకాయ..! ఒక్కరోజులోనే ఏకంగా..
ఆవకాయ.. ఇది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. విస్తర్లో ఎన్ని వంటకాలు ఉన్నా.. ఏదో ఒక మూల ఆవకాయ టేస్ట్ తగలకపోతే ఏదో వెలితి. ఆఖరికి పెరుగులో టచింగ్కైనా సరే. తెలుగు విందు భోజనాల్లో అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ఆవకాయ. అంతెందుకు దేశం దాటి వెళ్తున్న తమ వారి లగేజీల్లో ఆవకాయ పచ్చడి ఉండి తీరాల్సిందే. ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డ కుటుంబీకులకు పచ్చళ్లు పంపడానికి ఏకంగా కొరియర్ సర్వీసులు లెక్కకుమించి పుట్టుకొస్తున్నాయంటే తెలుగు ఆవకాయకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వేసవి విహారంలో విలేజీకి వెళ్లినప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి ఆవకాయ పట్టడం ఇప్పటికీ చూస్తునే ఉంటాం. అలాంటి మధుర జ్ఞాపకాలు పాత తరం వారి ప్రతిఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను తిరగేసుకుని మళ్లీ అలాగే అందరం కలిసి ఆవకాయ పడితే ఎలా ఉంటుందని ఆ అపార్ట్మెంట్ మహిళల మదిలో ఆలోచన తళుక్కుమనడమే కాదు..ఏకంగా పట్టాలెక్కించారు. ఆవకాయ పచ్చడి పట్టడానికి ఒక వేడుకగా మలచుకున్నారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మోతీనగర్ సమీపంలో కొత్తగా నిర్మితమైన బ్రిగేడ్ సిటాడెల్ హైరైజ్డ్ అపార్ట్మెంట్ అది. 1300 ప్లాట్లు కలిగిన ఈ అపార్ట్‌మెంట్స్‌లో ఇప్పుడిప్పుడే కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తున్నాయి. అలా దిగిన కుటుంబాలకు చెందిన 800 మంది మహిళలంతా ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనమందరం కలిసి ఆవకాయ పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని స్వాతి జ్యోతులకు వచ్చిన ఆలోచనను వాట్సప్ గ్రూపులో పంచుకుంది. దీనికి మిగతా మహిళల నుంచి కూడా ఆమోదం వచ్చింది. ఒక వంద కుటుంబాలు కలసికట్టుగా ఆవకాయ పచ్చడి పట్టుకుందామని ముందుకువచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పట్టడాన్ని ఒక పండుగలా, ఒక జాతరలా జరుపుకుని మహానగరంలో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారనే చెప్పవచ్చు.ఒక్కరోజులో 150 కిలోల పచ్చడి.. దాదాపు 100 కుటుంబాల డబ్బులు వేసుకుని సామూహిక ఆవకాయ పచ్చడికి సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడే ఒక హాల్‌ను బుక్ చేసుకున్నారు. పచ్చడి పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలతో పాటు చూడడానికి వచ్చిన వారితో ఈ ఈవెంట్ ఒక వేడుకగా మారింది. శంషాబాద్ శివారుల నుంచి 300 దాకా ఆర్గానిక్ మామిడి కాయలను ప్రత్యేకంగా కోసుకుని తీసుకువచ్చారు. గుంటూరు కారాన్ని తెప్పించారు. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పసుపు ఇలా అన్ని పదార్థాలూ సరిపడా సమకూర్చుకున్నారు. ఒక్కరోజులో 150 కిలోల పచ్చడిని పట్టి ఔరా అనిపించారు. తొలిసారి ప్రయత్నమే సక్సెస్ అందరం ఒకచోట చేరి ఒక పండుగలా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక ద్వారా ఐక్యత పెరుగుతోంది. బతుకమ్మ, సంక్రాంతి, దసరా పండుగలప్పుడు కలవడం సాధారణమే అయినా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అందరూ తలో చేయి వేసి సమిష్టిగా పచ్చడిని పెట్టుకోవడం నిజంగా అద్భుతమనిపించింది. మరుపురాని అనుభూతి మిగిల్చింది. – దీప్తి ధరణిప్రగడమధురానుభూతి.. కొత్తగా చేరిన కుటుంబాలంతా కలిసి తొలిసారిగా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించింది. ఒక కుటుంబమో, లేక ఆ కుటుంబంలోని బంధువులో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మామూలే. కానీ అపార్ట్మెంట్లోని మహిళలంతా కలిసి ఒక వేడుకగా జరుపుకోవడం ద్వారా అందరి మధ్య ఒక ఆత్మీయ బంధాన్ని ఆవకాయ ఏర్పరిచింది. – స్వాతి జ్యోతుల (చదవండి: Asli Mango 2.0: అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..)

అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ పురస్కరించుకుని ప్రముఖ కేఫ్ చైన్ బ్రాండ్ యమ్మీ బీ మామిడితో తయారైన డిసర్ట్స్ రూపొందించి అస్లీ మామిడి 2.0 కలెక్షన్ పేరిట నగరంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా యమ్మీ బీ వ్యవస్థాపకుడు మాజీ ఇండియన్ అండర్–19 క్రికెటర్ కూడా అయిన సందీప్ జంగాల మాట్లాడుతూ ఇవి చక్కెర రహిత, గ్లూటెన్ రహితంగా ఉంటాయని, శుద్ధి చేసిన పిండి వంటివి వినియోగించకుండా సహజ పదార్థాలతో తయారైనవని తెలిపారు. ఈ కలెక్షన్లో మ్యాంగో ఫ్లోరిడా పేస్ట్రీ, మ్యాంగో చీజ్‌కేక్ తదితర వెరైటీలు ఉన్నాయని వివరించారు. ఇవి నగరంలోని తమ అవుట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. (చదవండి: జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?)
ఫొటోలు


కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)


కుమారుడి టాలెంట్ చూసి మురిసిపోతున్నడైరెక్టర్ సుకుమార్ భార్య (ఫొటోలు)


Cannes 2025 : కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్ (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)


'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్ (ఫొటోలు )


మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)


ముంబైలో 'థగ్ లైఫ్' టీమ్.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)


ఆశ్రమం నుంచి అత్తారింటికి నక్క మానస (ఫొటోలు)


సరస్వతీ నది పుష్కర స్నానాలు..బారులు తీరిన భక్తజనం (ఫొటోలు)


గోవాలో స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న మను భాకర్ (ఫోటోలు)
అంతర్జాతీయం

World Bee Day... అప్పుడు మనిషి జీవితం నాలుగేళ్లే!
తేనె.. ఎంత రుచికరమో అంత ఆరోగ్యదాయకం. ప్రతిరోజూ తగిన మోతాదులో తేనె(Honey)ను తీసుకోవడం ద్వారా పలు అనారోగ్యాల బారి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. భూమిమీద కష్టించే జీవుల జాబితాలో తేనెటీగలు ముందుంటాయి. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూ, మరోవైపు మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్న తేనెటీగలకు సంబంధించిన చాలా విషయాలు మనకు తెలియదు. రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం భూమి మీద తేనెటీగలు లేకపోతే మనిషి జీవితం దుర్భరమవుతుంది. నేడు (మే 20) ప్రపంచ తేనేటీగల దినోత్సవం. ఈ సందర్భంగా తేనెటీగలు పర్యావరణానికి అందించే సాయాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి మీద బతికే హక్కు మనిషికి ఎంత ఉందో, మిగతా జీవరాశులకూ అంతే ఉంది. అయితే మనిషి తన అవసరాల కోసం మిగిలిన జీవుల ఉనికికి ముప్పు వాటిల్లే పనులు చేస్తున్నాడు. జీవ వైవిధ్యం(Biodiversity) కరువైతే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుంది. చివరికి ఆ ప్రభావం మనిషి మీదే పడుతుంది. రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు చెప్పినదాని ప్రకారం తేనెటీగలు లేని భూమి మీద మనిషి కేవలం నాలుగేళ్లు మాత్రమే బతకగలడు. మిగిలిన జీవులు కూడా దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంటాయి. నాడు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ కూడా ‘తేనెటీగలు లేకపోతే మనిషి నాలుగేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవించడం కష్టం’ అని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య అంతకంతకూ క్షీణిస్తోంది. దాదాపు 90 శాతం తేనెటీగలు ఇప్పటికే అంతరించిపోయాయి. ప్రస్తుతం పదిశాతం మాత్రమే మిగిలాయి. భవిష్యత్తులో తేనెటీగలను ల్యాబ్‌లలో ప్రత్యేకంగా పెంచుకోవావల్సిన పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచంలో పండించే 100 రకాల పంటలలో.. 90 రకాల పంటలు ఫలదీకరణం చెందాలంటే తేనెటీగలు ఎంతో అవసరం. దీని ప్రకారం చూస్తే, అధికశాతం శాతం వ్యవసాయం తేనెటీగల వల్లే జరుగుతోందని చెప్పుకోవచ్చు.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ వినియోగం మరింతగా పెరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్స్(Cell phone signals) తేనెటీగలకు హాని కలిగిస్తున్నాయి. అవి తాము కట్టుకున్న గూడుకు వెళ్లే దారిని మర్చిపోయేలా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తేనెటీగలు మరణిస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. మన పర్యావరణ వ్యవస్థలను సజీవంగా ఉంచడంలో తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉంది.ఇది కూడా చదవండి: Meghalaya: మూక దాడి.. 15 ట్రక్కులు ధ్వంసం

‘యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. కానీ’
కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని.. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. పుతిన్‌తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ కూడా చర్చించారు.ఈ క్రమంలో యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదంటూ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యా నియమాలు ఏంటో తనకు తెలియదన్న జెలెన్స్కీ.. ఈ యుద్ధంలో మేము చాలా కోల్పోయామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి కాల్పుల విరమణకు తాము సిద్ధం.. కానీ.. రష్యా అందుకు రెడీగా ఉన్నట్లు తనకు అనిపించడం లేదంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు.ముందుగా కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని.. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటూ జెలెన్స్కీ కోరారు. మరో వైపు, ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్‌ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.ఖతార్‌లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి

తక్షణ చర్చలకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయి: ట్రంప్
వాషింగ్టన్: కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు వెల్లడించారు. చర్చల విధి విధానాలను ఆ దేశాలే నిర్ణయించుకుంటాయని చెప్పారు. పుతిన్‌తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం జెలెన్స్కీతోనూ చర్చించారు.‘‘యుద్ధం ముగిశాక అమెరికాతో రష్యా భారీ ఎత్తున వ్యాపారం చేయాలని పుతిన్ అభిలషించారు. అందుకు నేను సరేనన్నాను’’ అని చెప్పుకొచ్చారు. తద్వారా ఉక్రెయిన్ కూడా భారీగా లబ్ధి పొందుతుందని అభిప్రాయపడ్డారు. యుద్ధానికి తెర దించడంపై పుతిన్, ట్రంప్ మధ్య ఇది మూడో ఫోన్ సంభాషణ కావడం విశేషం! చర్చల వివరాలను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ తదితర దేశాధినేతలతో పంచుకున్నట్టు అధ్యక్షుడు వివరించారు.
జాతీయం

బెంగళూరు: సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ కలకలం
బెంగళూరు: నగరంలో దారుణం జరిగింది. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్‌లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం హోసూర్ ప్రధాన రహదారిలోని పాత చందాపుర రైల్వే బ్రిడ్జి సమీపంలో, రైలు పట్టాల దగ్గర నీలం రంగులో ఉన్న ట్రావెల్ సూట్‌కేస్ పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.అందులో యువతి మృతదేహం ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ట్రావెల్ బ్యాగ్‌లోని యువతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతి వయస్సు 18 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదెక్కడి ‘పంచాయితీ’!
ఆమె ఓ గ్రామ సర్పంచ్. లక్షల్లో అప్పులు చేసింది. అది తీర్చడం కుదరకపోయేసరికి ఏకంగా పంచాయితీనే మరొక వ్యక్తికి లీజు కింద అప్పగించింది. అయితే ఇప్పటికిప్పుడు జరిగిందేం కాదు!. చాలా కాలం కిందటే ఆమె ఇలా కాంట్రాక్ట్ కుదుర్చుకుని పంచాయితీ ఆఫీస్‌ను అతని చేతిలో పెట్టిందట!. ఇదేం పంచాయితీ అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి.మధ్యప్రదేశ్ గుణ జిల్లాకు కరోడ్ గ్రామ పంచాయితీలో ఆ ఊరి సర్పంచ్ లక్ష్మీ బాయి సీట్లో మరో వ్యక్తి కూర్చోవడం ఉన్నతాధికారులను ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే అందుకు గల కారణం తెలిసి.. వెంటనే ఆ సర్పంచ్‌ను తొలగించి, ఇన్చార్జి సర్పంచ్‌గా మరొకరిని నియమించారు.లక్ష్మీ బాయి అదే గ్రామానికి చెందిన రణవీర్ సింగ్ కుష్వాహా అనే వ్యక్తి నుంచి 2020లో 20 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది. ఒకవేళ అప్పును తీర్చినట్లయితే.. పంచాయతీ పనులను తన పదవీకాలం ఉన్నంత వరకు ఆ వ్యక్తికి అప్పగిస్తానని ఒప్పందం కూడా చేసుకుంది. ఇందుకోసం100 రూపాయల స్టాంప్ పేపర్ ఒప్పందం చేసుకున్నారు.అయితే.. సకాలంలో అప్పు తీర్చకపోవడంతో ఆమె అన్నంత పని చేసింది. ఇది చాలదన్నట్లు కుష్వాహా ఓ నోటరైజ్డ్ అఫిడవిట్ ద్వారా కరోడ్ గ్రామ పంచాయతీని మూడో వ్యక్తికి అప్పగించారు. ఈ విషయం గునా జిల్లా యంత్రాగం దృష్టికి వెళ్లడంతో.. అధికారులు రంగంలోకి దిగారు. మే 9న సర్పంచ్ లక్ష్మీ బాయిని అధికారికంగా ఆమె పదవి నుంచి తొలగించి సమగ్ర విచారణకు ఆదేశించారు. అలాగే.. రణవీర్ సింగ్ కుష్వాహా, సర్పంచ్ కుర్చీలో కూర్చున్న మూడో వ్యక్తిపై సైతం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే.. 2022 పంచాయతీ ఎన్నికల సమయంలో తన ప్రచారానికి నిధులు సమకూర్చుకోవడానికి లక్ష్మీ బాయి ఈ రుణం తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను లక్ష్మీ బాయి భర్త శంకర్ సింగ్ ఖండించారు. తాము ఎవరి నుండి ఎటువంటి డబ్బు తీసుకోలేదని.. లక్ష్మీ బాయిని అన్యాయంగా పదవి నుండి తొలగించారని, ఇకనైనా తమను వదిలేయాలని అధికారులను వేడుకుంటున్నాడు.

ఆపరేషన్ కగార్.. భద్రత బలగాల నెక్ట్స్ టార్గెట్ అతడేనా?
ఛత్తీస్‌గఢ్: భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందడంతో భద్రత బలగాలు మరింత దూకుడు పెంచాయి. పార్టీలో కీలక నేతగా ఉన్న మడావి హిడ్మా టార్గెట్‌గా కేంద్ర హోంశాఖ ఆపరేషన్ మొదలుపెట్టింది.అంబుజ్‌మడ్ దండకారణ్యంలో హిడ్మా కోసం రెండు వేల మంది భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ హిట్ లిస్టులో హిడ్మా ఉండగా, మావోయిస్టు పార్టీలో 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించినట్లు సమాచారం.రాబోయే 10 నెలలు కీలక నేతలు టార్గెట్‌గా ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఎక్కడెక్కడ షెల్టర్ జోన్ తీసుకున్నారన్నదానిపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోంది. మరో వైపు నంబాల కేశవరావు మృతిపై మావోయిస్ట్ పార్టీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కేశవరావు మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. తాజా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అత్యవసర సమావేశమైంది.

మావోయిస్టులపై ఇది ఘన విజయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, సాక్షి: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. మావోయిస్టులపై ఇప్పటిదాకా సాధించిన ఇది అతిపెద్ద ఘన విజయం అని అన్నారాయన. ఈ క్రమంలో భదత్రా బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు.మావోయిస్టుల(Maoists)పై ఇది ఘన విజయం. నక్సల్స్ పై పోరాటంలో ఇదో మైలురాయి. భద్రతా బలగాలు సాధించిన విజయం చూసి గర్వంగా ఉంది. మా ప్రభుత్వం శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. అందుకే మావోయిజాన్ని మూలాలను చెరిపేస్తున్నాం. మావోయిజాన్ని అంతమొందించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారాయన. ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు(Nambala Keshava Rao) ఉండడంతో కేంద్రం ఇలా స్పందిస్తోంది. అంతకు ముందు.. హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ ఎన్‌కౌంటర్‌పై ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ప్రధాని మోదీ ఆ పోస్ట్‌కు పైవిధంగా స్పందించారు.ఇదీ చదవండి: నక్సలిజానికి వెన్నెముక.. నంబాల!
ఎన్ఆర్ఐ

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్‌రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్‌నేత్రాలయ ప్రకటించింది.
క్రైమ్

రహదారులు రక్తసిక్తం
హయత్‌నగర్ (హైదరాబాద్)/గద్వాల క్రైం: బుధవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్, కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతిచెందారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు వారి కుటుంబాల్లో ఒక్కరే మగపిల్లలు కాగా, కర్ణాటకలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబంలో ఒక్కరు తప్ప అందరూ మృత్యుఒడికి చేరారు. విషాదం మిగిల్చిన అతివేగం.. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో అతి వేగం నాలుగు కుటుంబాలలో పెను విషాదం మిగిల్చింది. వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్‌కు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్‌రెడ్డి (24), చుంచు వర్షిత్‌రెడ్డి (23), ఎలిమేటి పవన్‌కల్యాణ్‌రెడ్డి చిన్నప్పటినుంచి స్నేహితులు. బుధవారం తెల్లవారుజామున వారంతా పస్మాముల వైపు నుంచి కుంట్లూర్‌కు స్కోడా కారులో వస్తున్నారు. ఉదయం 5:40 గంటల సమయంలో కుంట్లూర్‌లోని నారాయణ కళాశాల సమీపంలోని గ్యాస్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న చంద్రసేనారెడ్డి, త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ పవన్కల్యాణ్రెడ్డిని కారులో నుంచి బయటికి తీసిన పోలీసులు చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, మంగళవారం రాత్రి ఓ రిసెప్షన్‌కు హాజరైన ఈ యువకులు మధ్యలో ఓ ఫాంహౌస్‌లో గడిపినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన వారు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా మృత్యుఒడిలోకి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు మృతి చెందగా, డ్రైవర్‌సీటు పక్కన కూర్చున్న పవన్‌కల్యాణ్‌రెడ్డి గాయాలతో బయటపడ్డాడు. అతను సీటు బెల్టు పెట్టుకోవడంతో బెలూన్ ఓపెన్ అయినట్లు పోలీసులు తెలిపారు. వారసులను కోల్పోయిన కుటుంబాలు... పిన్నింటి చంద్రసేనారెడ్డి, చుంచు త్రినాథ్‌రెడ్డి, చుంచు వర్షిత్‌రెడ్డి వారి కుటుంబాల్లో ఒకరే మగపిల్లలు. వీరిలో త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అన్నదమ్ముల కుమారులు. వారిద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో తమకు వారసులు లేకుండా పోయారని, చేతికి అందివచ్చిన కొడుకులు ఇలా మృతిచెందారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణం బీసీ కాలనీకి చెందిన తెలుగు భాస్కర్ (41) మహారాష్ట్రలో కెనరా బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి ప్రాంతం నుంచి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. దీంతో బుధవారం భార్య పవిత్ర (38), కుమార్తె జ్యోత్స్న (10), కుమారులు అభిరాం (8), ప్రవీణ్‌తో పాటు కర్ణాటకకు చెందిన డ్రైవర్ శివప్ప (45)తో కలిసి కారులో బయల్దేరారు. ఈ క్రమంలో కర్ణాటకలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో సోలాపూర్– చిత్రదుర్గ హైవేపై వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో స్కార్పియో కారు తుక్కుతుక్కు కాగా అందులో ఉన్న భాస్కర్, పవిత్ర, జ్యోత్స్న, అభిరాం, డ్రైవర్ శివప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలతో బయటపడిన ప్రవీణ్ కుటుంబసభ్యులను కోల్పోయి అనాథగా మిగిలాడు.

ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాల్లో కొలువుల పేరిట వందలాది మంది భారతీయులను విదేశాల్లోని చైనా సైబర్ కేఫ్‌లకు విక్రయించిన మానవ అక్రమ రవాణా డాన్ హితేశ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత విదేశాంగ శాఖ కోరిక మేరకు అతడిని మంగళవారం రాత్రి థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఇండియాకు డిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన హితేశ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విదేశాంగశాఖకు అప్పగించారు. మార్చిలో కరీంనగర్ పోలీసులు జారీచేసిన లుక్అవుట్ నోటీసుల ఫలితంగా హితేశ్ ఇండియా రాగానే అదుపులోకి తీసుకున్నారు. హితేశ్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన హితేశ్‌ను తెలంగాణ పోలీసుల కంటే ముందే ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుగజేసుకోవటంతో ఎట్టకేలకు హితేశ్‌ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. దీంతో కరీంనగర్ పోలీసులు అతన్ని సాయంత్రానికి కరీంనగర్‌కు తరలించారు. దేశవ్యాప్త నెట్వర్క్ గుజరాత్‌లోని పోర్బందర్కు చెందిన హితేశ్ మానవ అక్రమ రవాణా సూత్రధారి. ఇతను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడే కేఫ్‌లకు మనుషులను అక్రమంగా పంపిస్తాడు. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని, నెలకు రూ.లక్ష జీతమని నమ్మబలికి ఒక్కో వ్యక్తిని 3,000 డాలర్లకు చైనీస్ సైబర్ కేఫ్‌లకు విక్రయించేవాడు. మనదేశంలో ఇతనికి ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు అతడు దాదాపు 300 మందికిపైగా భారతీయులను విక్రయించాడని సమాచారం. ఇతని ఏజెంట్లలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్ ఒకడు. వీరిద్దరు కలిసి గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడిని మయన్మార్‌కు పంపారు. అక్కడ ఆ యువకుడు తిరగబడ్డాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’వరుస కథనాలతో వెలికితీయడంతో స్పందించిన బండి సంజయ్.. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. దీంతో తొలుత అక్కడ సైబర్‌కేఫ్‌లో చిక్కుకున్న 540 మందిని మయన్మార్ సైన్యం సాయంతో కాపాడారు.తెలంగాణ సైబర్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూరు, ఖానాపూర్‌లో హితేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే కరీంనగర్ పోలీసులు హితేశ్‌పై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. మరో కీలక నిందితుడు రాజశేఖర్ లావోస్‌లో తలదాచుకుంటున్నాడని సమాచారం. భారతీయ యువతీ యువకులను చైనీయులకు విక్రయించిన హితేశ్.. వారు తిరగబడితే చిత్రహింసలు పెట్టి చీకటిగదుల్లో వేయించేవాడు. చైనీయుల కోసం వందల మంది భారతీయులను అంగడి సరుకుగా విక్రయించాడు. చివరికి ఆ చైనీయులే అతన్ని చితకబాది థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టించడం కొసమెరుపు.

తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
షాబాద్, పరిగి(వికారాబాద్ జిల్లా): రంగాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన ముత్యాల మల్లేశ్‌కు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు మాన్యశ్రీ, ఆర్యాధ్య, కూమారుడు ప్రనిల్ ఉన్నారు. మల్లేశ్ మండల పరిధిలోని నాగర్‌గూడలో కులవృతి అయిన కటింగ్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆయన మృతి చెందడంతో భార్యాపిల్లలు దిక్కులేనివారయ్యారు. సోలీపేట్కు చెందిన మంగలి బాలమ్మకు ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. అందరి వివాహాలయ్యాయి. చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పెళ్లికి వెళ్లింది. రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడిక్కడే మృతి చెందగా, మోక్షిత నీలోఫర్‌లో చికిత్స పొందుతోంది.అనాథలయ్యామురా.. ‘తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా.. నేను, నా పిల్లలు అనాథలయ్యామురా’.. అంటూ పెళ్లి కుమారుడి (సతీష్) అక్క స్వప్న తన తమ్ముడి పట్టుకుని విలపించింది. తండ్రి రామస్వామి రాగానే నా బతుకు ఆగమయ్యింది నాన్నా అంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. న్యాయం జరిగేలా చూస్తాం.. రంగాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నాయకులు చేవెళ్ల స్వామి, డాక్టర్ రాజు, మాజీ ఎంపీటీసీ అశోక్, మాజీ సర్పంచ్‌లు జనార్దన్‌రెడ్డి, మహేందర్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, నరేందర్, రఫిక్, దయాకర్ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా కృషిచేస్తామని తెలిపారు. చదవండి: చిన్నవిందుకు హాజరై వస్తుండగా ప్రమాదం

కాళ్లకు పెట్టిన పారాణితోనే వరుడు పాడె ఎక్కాడు..
బయ్యారం(వరంగల్): మూడుముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్కటైన ఆ జంటపై దేవుడు చిన్న చూపు చూశాడు. అప్పటి వరకు పెళ్లి బా జాలు మోగిన ఆ ఇంట.. చావు డప్పు మో గాల్సి వచ్చింది. కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభమై 48 గంటలు గడవకముందే న వవరుడు కన్నుమూశాడు. రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి మృతి చెందాడు. భర్త తన కళ్లెదుటే కానరానిలోకాలకు వెళ్లడంతో ఆ నవవధువు స్పృహ తప్పడంతో బంధువులు చికిత్స ని మిత్తం ఆస్పత్రికి తరలించారు. కాళ్లకు పెట్టి న పారాణితోనే ఆ వరుడు పాడె ఎక్కిన విషాదకరఘటన పలువురిని కన్నీటిపర్యంతం చేసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం పంచాయతీ శివారు కోడిపుంజులతండాకు చెందిన ఇస్లావత్ బా ల, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. 14 సంవత్సరాల క్రితం బాల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు కుమారులు గణేశ్, నరేశ్(26)తో కలిసి తల్లి లక్ష్మి హైదరాబాద్‌లో ఉంటుండగా నరేశ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నరేశ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన బానోత్ జాహ్నవితో వివాహం నిశ్చియం కాగా స్వగ్రామంలో రిసెప్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రిసెప్షన్ కోసం ఇటీవల రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. ఆదివారం కంచికచర్లలో జాహ్నవితో వివాహం జరిపించారు.మోటారు రూపంలో బలితీసుకున్న కరెంట్..రిసెప్షన్ సందర్భంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే నరేశ్ ఇంటి వద్ద ఏర్పాట్లు మొదలు పెట్టారు. వంట చేసే వా రు భోజనాల తయారీలో నిమగ్నమయ్యా రు. వంట కోసం నీళ్లు అవసరం ఏర్పడడంతో నరేశ్‌ను మోటార్ ఆన్చేయని కోరారు. దీంతో నరేశ్ మోటర్ ఆన్ చేసే ప్రయత్నంలో విద్యుత్తీగలను సాకెట్లో పెడుతుండగా షాక్‌గురయ్యాడు. దీంతో కుటుంబీకు లు, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీంతో నరేశ్ మృతదేహం మీదపడి కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. మృత్యువు కరెంట్రూపంలో బలి తీసుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. చనిపోయే ముందు ఉప్మా అందించాడు..రిసెప్షన్ సందర్భంగా నరేశ్ ఉదయం తండాలోని పలువురు బంధువుల వద్దకు వెళ్లి ఉప్మా (అల్పాహారం) ఇచ్చి వచ్చాడు. ఆప్యాయంగా ఉప్మా అందించిన నరేశ్ ఇలా తమకు కన్నీటిని మిగిల్చి వెళ్తాడనుకోలేదని బంధువులు గుండెలవిసేలా రోదించారు.
వీడియోలు


మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్


తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా


పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ


ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు


మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..


కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం


కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్


సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు


Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా


సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు