
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
శ్రీనగర్: 220 మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరిన ఇండిగో విమానానికి పెనుప్రమాదం తప్పింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో ప్రయాణం ఆద్యంతం విమానం భారీ కుదుపులకు లోనైంది. పైలట్ అత్యవసరంగా శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించాడు.
తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే సాయంత్రం 6.30కు విమానాన్ని సురక్షితంగా లాండ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు లోనై దైవప్రార్థనలు చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలతో పాటు విమానం తాలూకు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైన ఫొటోలు వైరల్‌గా మారాయి. అది లాండింగ్‌కు ముందే విరిగిపోయిందని, చావు ముంగిటి దాకా వెళ్లొచ్చామని ఓ ప్రయాణికుడు చెప్పుకొచ్చాడు.