
న్యూఢిల్లీ, సాక్షి: ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై దేశ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. మావోయిస్టులపై ఇప్పటిదాకా సాధించిన ఇది అతిపెద్ద ఘన విజయం అని అన్నారాయన. ఈ క్రమంలో భదత్రా బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు.
మావోయిస్టుల(Maoists)పై ఇది ఘన విజయం. నక్సల్స్ పై పోరాటంలో ఇదో మైలురాయి. భద్రతా బలగాలు సాధించిన విజయం చూసి గర్వంగా ఉంది. మా ప్రభుత్వం శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. అందుకే మావోయిజాన్ని మూలాలను చెరిపేస్తున్నాం. మావోయిజాన్ని అంతమొందించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారాయన.

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు(Nambala Keshava Rao) ఉండడంతో కేంద్రం ఇలా స్పందిస్తోంది. అంతకు ముందు.. హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ ఎన్‌కౌంటర్‌పై ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ప్రధాని మోదీ ఆ పోస్ట్‌కు పైవిధంగా స్పందించారు.
ఇదీ చదవండి: నక్సలిజానికి వెన్నెముక.. నంబాల!