
ఛత్తీస్‌గఢ్: భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందడంతో భద్రత బలగాలు మరింత దూకుడు పెంచాయి. పార్టీలో కీలక నేతగా ఉన్న మడావి హిడ్మా టార్గెట్‌గా కేంద్ర హోంశాఖ ఆపరేషన్ మొదలుపెట్టింది.
అంబుజ్‌మడ్ దండకారణ్యంలో హిడ్మా కోసం రెండు వేల మంది భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐఏ హిట్ లిస్టులో హిడ్మా ఉండగా, మావోయిస్టు పార్టీలో 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించినట్లు సమాచారం.
రాబోయే 10 నెలలు కీలక నేతలు టార్గెట్‌గా ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఎక్కడెక్కడ షెల్టర్ జోన్ తీసుకున్నారన్నదానిపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోంది. మరో వైపు నంబాల కేశవరావు మృతిపై మావోయిస్ట్ పార్టీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కేశవరావు మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. తాజా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అత్యవసర సమావేశమైంది.