
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ సరసన హీరోయిన్‌గా త్రిష మెప్పించింది.
అయితే అజిత్ కుమార్ కేవలం సినిమాలే కాదు.. కారు రేసింగ్‌లోనూ ఆయన దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన టీమ్ వరుసగా మూడు దేశాల్లో కప్‌లు కొట్టింది. తన చిన్నప్పటి నుంచి రేసర్ కావాలనేది ఆయన కోరిక అని.. యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి వచ్చానని గతంలోనే వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి వచ్చానని అజిత్ కుమార్ తెలిపారు. రేసింగ్ పట్ల తన అభిమానాన్ని ఏదో ఒక సందర్భంలో చాటుకుంటూనే ఉన్నారు.
తాజాగా అజిత్ కుమార్ ఇటలీలోని ఇమోలాలో ఉన్న ఫార్ములా వన్ లెజెండ్ అయర్టన్ సెన్నా స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అజిత్ స్వయంగా 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా ఎఫ్‌వన్ రేసులో ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలో ఉన్న సెన్నా విగ్రహాన్ని ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Ajith Sir paying tribute to Ayrton Senna at the Imola circuit.
| #AK #Ajith #Ajithkumar | #GoodBadUgly | #AjithKumarRacing | #24HSeries | #AKRacing | #AyrtonSenna | pic.twitter.com/bWUJacUPSR— Ajith (@ajithFC) May 20, 2025
ThalaAjith pays respect to his Idol #AyrtonSenna
👏👏👏👏👏 pic.twitter.com/xU2t8yXG9l— Joker (@joker28_joker) May 20, 2025