‘ధురంధర్‌ 2’ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. తెలుగులో కూడా! | Dhurandhar 2 Telugu Version Release Date Update | Sakshi
Sakshi News home page

‘ధురంధర్‌ 2’ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. తెలుగులో కూడా!

Mar 21 2026 11:13 AM | Updated on Mar 21 2026 11:22 AM

Dhurandhar 2 Telugu Version Release Date Update

‘ధురంధర్‌ 2’ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. నేటి నుంచి(మార్చి 21) ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఆన్‌లైన్‌లో తెలుగు వెర్షన్‌కి కూడా బుకింగ్స్‌ ఓపెన్‌ చేశారు. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్‌ రోజే అంటే మార్చి 18న తెలుగులోనూ విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాలు, చివరి నిమిషంలో సెన్సార​్‌ బోర్డ సూచించిన మార్పుల వల్ల తెలుగు పాటు  తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. 

ప్రీమియర్స్‌ కోసం ముందే బుక్‌ చేసుకున్నవారికి థియేటర్ యాజమాన్యాలు రీఫండ్‌ చేశాయి. దీంతో కొంతమంది భాష తెలియకపోయినా హిందీలోనే ఈ సినిమాను వీక్షించించారు. అయితే శుక్రవారం ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు శుక్రవారం సెన్సార్‌ పూర్తయ్యింది.  కన్నడలో ఇంకా సెన్సార్‌ పూర్తి కాలేదు. దీంతో కన్నడ వెర్షన్‌ మినహా..మిగతా భాషలన్నింటిలోనూ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు.

ధురంధర్‌ 2 విషయానికొస్తే..బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్‌’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ఆదిద్యధర్‌ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సారా అర్జున్‌ హీరోయిన్‌గా నటించింది. తొలిరోజే ఈ చిత్రం రూ. 172 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టించింది. నేటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్‌ కూడా అందుబాటులో ఉండడంతో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement