మంగళవారం రోల్‌ ఇక మర్చిపోండి: నటి రిక్వెస్ట్ | Ace Movie Actress Divya Pillai Interesting Comments In Mangalavaaram Role | Sakshi
Sakshi News home page

Divya Pillai: మంగళవారం రోల్‌ ఇక మర్చిపోండి: నటి దివ్య పిళ్లై రిక్వెస్ట్

May 22 2025 6:41 AM | Updated on May 22 2025 7:44 AM

Ace Movie Actress Divya Pillai Interesting Comments In Mangalavaaram Role

కోలీవుడ్ స్టార్ విజయ్‌ సేతుపతి , రుక్మిణీ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్‌'. అరుముగ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 7సీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌పై అరుముగ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు హాజరైన నటి దివ్య పిళ్లై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మంగళవారం సినిమాలో చేసిన రోల్‌ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుంటుందని తెలిపింది. కానీ ఈ సినిమాతోనే నన్ను ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారని వెల్లడించింది. అందరూ ఆ పాత్ర గురించే మాట్లాడుతున్నారని సంతోషం వ్యక్తం చేసింది. మంగళవారం సినిమాలో విలన్‌ పాత్ర కావడంతో అది అంతా మర్చిపోవాలని కోరింది. ఈ మూవీలో అద్భుతమైన పాత్రలో కనిపిస్తానని నటి దివ్య పిళ్లై అంటోంది. 


 
ఇటీవలే ఏస్ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ ఫుల్ కామెడీ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్‌ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్‌ బ్యానర్‌పై బి.శివప్రసాద్‌ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. దీంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఓకే రోజు థియేటర్లలో విడుదల కానుంది.

ఇక దివ్య పిళ్లై విషయానికొస్తే.. దుబాయికి చెందిన మలయాళీ ఫ్యామిలీలో పుట్టింది. 2015లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సహాయ పాత్రలు చేస్తూ క్రేజ్ సంపాదించింది. గతేడాది సూపర్ హిట్ కొట్టిన 'మంగళవారం' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'తగ్గేదే లే' అని మరో మూవీ కూడా చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement