
మహిళ ఫిర్యాదు
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్‌ఎంసీ యార్డు పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది.
2023 జూన్‌లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్‌ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు.