
తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, సింగర్‌గా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శింబు అసలు పేరు సిలంబరసన్. అయితే అంతా ముద్దుగా శింబుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్ థగ్ మూవీ షూటింగ్ ప్రమోషన్‌లతో బిజిగా ఉన్నాడు శింబు. ఒకప్పుడు ఆయన ఫుడ్‌స్టైల్ అంత ఆరోగ్యకరమైన రీతీలో ఉండేది కాదని అంటున్నారు శింబు ఫిట్‌నెస్ ట్రైనర్. ఆయన ఎంతో పట్టుదలతో ఆరోగ్యకరమైన అలవాట్లును అనుసరిస్తూ దాదాపు 30 కిలోలు బరువు తగ్గారని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లను అనుసరించిన విధానం..ఆయన పాటించిన నియామాలు వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుందంటున్నారు. ఎందుకంటే తాము ఇచ్చే డైట్‌లోని ఆహారాలు శింబుకి అస్సలు నచ్చనవి అట. అయినా సరే అతడు పట్టుదలతో మంచి పోషకాహారాన్ని ఎలా ఇష్టంగా తినేవాడో వివరించారు. మరీ అంతలా బరువు తగ్గేందుకు అనుసరించిన ఫిట్‌నెస్ మంత్ర ఏంటో ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ మాటల్లో విందామా..!.
స్మార్ట్‌గా కనిపిస్తూ..యుంగ్ హీరోలకు తీసిపోని దూకుడుతో కనిపించే శింబు(42) పిట్‌నెస్ సీక్రెట్ గురించి ఓ ఇంటర్యూలో ప్రశ్నించగా..స్థిరత్వం, మితంగా ఆహారం తీసుకోవడమేనని సమాధానమిచ్చారు. ఆయన వెయిట్‌లాస్ జర్నీ ఎందిరికో స్ఫూర్తిగా నిలిచింది కూడా. 2020 నుంచి మంచి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించి బరువు తగ్గానని ఆయన చెప్పారు. ఇక ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ..శింబు ప్రతి ఉదయం 4.30 గంటలకు నడకతో తన రోజుని ప్రారంభిస్తాడని అన్నారు. ప్రారంభంలో వారానికి నాలుగురోజులు వ్యాయామాలు చేసేవాడని, ఆ తర్వాత ఐదు రోజులకు మార్చుకున్నాడని అన్నారు.
అంతేగాదు “ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు” ప్రాధాన్యత ఇచ్చేలా తన డైట్‌ని మార్చుకున్నాడని అన్నారు. కేలరీలు తక్కువుగా ఉండే సలాడ్‌లు, జ్యూస్‌లు ఎలా ఇష్టంగా తీసుకునేందుకు యత్నించాడో కూడా తెలిపారు. అలాగే రాత్రిపూట తేలికపాటి ఆహారమే తీసుకుని కొద్దిపాటి ఆకలితో నిద్రపోవడం వంటివి పాటించారట శింబు.
ఇలా రాత్రిపూట కొంచెం ఆకలితో నిద్రపోవడం మంచిదేనా..
ఇది సరైనదేనని న్యూట్రిషనిస్ట్ ఆశ్లేషా జోషి అంటున్నారు. కొంచెం ఆకలితో పడుకోవడం జీర్ణాశయానికి ఎంతో మంచిదని అంటున్నారు. ఎందుకంటే రాత్రిపూట మన జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల రాత్రిపూట అధిక కేలరీలతో కూడిన ఆహారం అధిక బరువు, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రిపూట అదిక కేలరీలను నివారించడమే అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు.
అలాగని ఆకలితో కాకుండా పోషకాహారంతో కూడిన ఆహారం మితంగా శరీరానికి అనుగుణంగా తీసుకోవడం ముఖ్యమని సూచించారు. ఇక్కడ అందరి ఆకలి సంకేతాలు ఒకేలా ఉండవు కాబట్టి ఆయా వ్యక్తుల వారి శరీర సంకేతానికి అనుగుణంగా తీసుకోవాలని అన్నారు.
ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఫుడ్..
పండ్లు కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు, ఆల్కలీన్ అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిపెట్టడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా అందుతుంది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..! వైరల్‌గా కొబ్బరిబోండాల వ్యాపారి)