simbhu
-
హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..
తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా, దర్శకుడిగా, సింగర్‌గా తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. శింబు అసలు పేరు సిలంబరసన్. అయితే అంతా ముద్దుగా శింబుగా పిలుచుకుంటారు. ప్రస్తుతం ఆయన కమల్‌హాసన్ థగ్ మూవీ షూటింగ్ ప్రమోషన్లతో బిజిగా ఉన్నాడు శింబు. ఒకప్పుడు ఆయన ఫుడ్స్టైల్ అంత ఆరోగ్యకరమైన రీతీలో ఉండేది కాదని అంటున్నారు శింబు ఫిట్నెస్ ట్రైనర్. ఆయన ఎంతో పట్టుదలతో ఆరోగ్యకరమైన అలవాట్లును అనుసరిస్తూ దాదాపు 30 కిలోలు బరువు తగ్గారని అన్నారు. మంచి ఆహారపు అలవాట్లను అనుసరించిన విధానం..ఆయన పాటించిన నియామాలు వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుందంటున్నారు. ఎందుకంటే తాము ఇచ్చే డైట్‌లోని ఆహారాలు శింబుకి అస్సలు నచ్చనవి అట. అయినా సరే అతడు పట్టుదలతో మంచి పోషకాహారాన్ని ఎలా ఇష్టంగా తినేవాడో వివరించారు. మరీ అంతలా బరువు తగ్గేందుకు అనుసరించిన ఫిట్నెస్ మంత్ర ఏంటో ఆయన ఫిట్నెస్ ట్రైనర్ మాటల్లో విందామా..!.స్మార్ట్‌గా కనిపిస్తూ..యుంగ్ హీరోలకు తీసిపోని దూకుడుతో కనిపించే శింబు(42) పిట్నెస్ సీక్రెట్ గురించి ఓ ఇంటర్యూలో ప్రశ్నించగా..స్థిరత్వం, మితంగా ఆహారం తీసుకోవడమేనని సమాధానమిచ్చారు. ఆయన వెయిట్‌లాస్ జర్నీ ఎందిరికో స్ఫూర్తిగా నిలిచింది కూడా. 2020 నుంచి మంచి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించి బరువు తగ్గానని ఆయన చెప్పారు. ఇక ఆయన ఫిట్నెస్ ట్రైనర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ..శింబు ప్రతి ఉదయం 4.30 గంటలకు నడకతో తన రోజుని ప్రారంభిస్తాడని అన్నారు. ప్రారంభంలో వారానికి నాలుగురోజులు వ్యాయామాలు చేసేవాడని, ఆ తర్వాత ఐదు రోజులకు మార్చుకున్నాడని అన్నారు. అంతేగాదు “ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు” ప్రాధాన్యత ఇచ్చేలా తన డైట్‌ని మార్చుకున్నాడని అన్నారు. కేలరీలు తక్కువుగా ఉండే సలాడ్లు, జ్యూస్‌లు ఎలా ఇష్టంగా తీసుకునేందుకు యత్నించాడో కూడా తెలిపారు. అలాగే రాత్రిపూట తేలికపాటి ఆహారమే తీసుకుని కొద్దిపాటి ఆకలితో నిద్రపోవడం వంటివి పాటించారట శింబు. ఇలా రాత్రిపూట కొంచెం ఆకలితో నిద్రపోవడం మంచిదేనా..ఇది సరైనదేనని న్యూట్రిషనిస్ట్ ఆశ్లేషా జోషి అంటున్నారు. కొంచెం ఆకలితో పడుకోవడం జీర్ణాశయానికి ఎంతో మంచిదని అంటున్నారు. ఎందుకంటే రాత్రిపూట మన జీవక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల రాత్రిపూట అధిక కేలరీలతో కూడిన ఆహారం అధిక బరువు, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు రాత్రిపూట అదిక కేలరీలను నివారించడమే అన్ని విధాల శ్రేయస్కరమని అంటున్నారు. అలాగని ఆకలితో కాకుండా పోషకాహారంతో కూడిన ఆహారం మితంగా శరీరానికి అనుగుణంగా తీసుకోవడం ముఖ్యమని సూచించారు. ఇక్కడ అందరి ఆకలి సంకేతాలు ఒకేలా ఉండవు కాబట్టి ఆయా వ్యక్తుల వారి శరీర సంకేతానికి అనుగుణంగా తీసుకోవాలని అన్నారు. ఆల్కలీన్ రిచ్, పోషకాలు అధికంగా ఉండే ఫుడ్..పండ్లు కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు, ఆల్కలీన్ అధికంగా ఉండే ఆహారాలపై దృష్టిపెట్టడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ పుష్కలంగా అందుతుంది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అతనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే..! వైరల్‌గా కొబ్బరిబోండాల వ్యాపారి) -
ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా?
చెన్నె: ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఓటేసేందుకు అగ్ర తారలు తరలివచ్చినప్పటికీ సాధారణ ఓటర్లు అంతగా ఆసక్తి కనబర్చలేదని పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. అయితే పోలింగ్ రోజు పలు ఆసక్తికర సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సినీ నటులు వినూత్నంగా ఓటేయడానికి ముందుకువచ్చారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓటేయడానికి వచ్చారు. తదనంతరం నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఓటేసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో అగ్రనటులు అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జయం రవి ముఖ్యంగా వారు వేసుకున్న మాస్క్‌లతో పరోక్షంగా డీఎంకే పార్టీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు నలుపు రంగు మాస్క్ ధరించి ఓటేసేందుకు వచ్చారు. డీఎంకే పార్టీ జెండాలో నలుపు ఉంటుంది. అందుకే ఆ పార్టీకి ఓటేయాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లుగా తమిళనాడులో చర్చ నడుస్తోంది. దీంతోపాటు విజయ్ సైకిల్ మీద రావడం తమిళనాడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే విజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడానికి నిరసనగా సైకిల్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున అభిమానులు, ఓటర్లకు ఆ విషయం గుర్తు చేసేందుకు విజయ్ సైకిల్ ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక నటుడు విక్రమ్ కూడా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించేందుకు నడుచుకుంటూ వచ్చాడని సమాచారం. శింబు ఈ చర్యలతో పరోక్షంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అందరూ భావిస్తున్నారు. దీనిపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక అగ్రనటుడు రజనీకాంత్, సూర్య, కార్తీ తెల్లటి మాస్క్ ధరించి వచ్చారు. ఓటేసే సమయంలో నటుడు అజిత్ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటేయడానికి వచ్చే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అతడి ఫోన్‌ను లాగేసుకున్నాడు. మరికొద్దిసేపటి తర్వాత వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ తిరిగిచ్చేశాడు. చదవండి: బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా.. -
లాక్డౌన్: 30 కిలోల బరువు తగ్గిన హీరో!
చెన్నై: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను సినీ సెలబ్రిటీలు సద్వినియోగం చేసుకున్నారు. కొంతమంది పెళ్లి పీటలు ఎక్కి వైవాహిక జీవితంలోకి అడుగుపెడితే.. మరికొంత మంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే, ఫిట్నెస్ పెంచుకోవడంపై దృష్టిసారించారు. కెరీర్ గ్రాఫ్ పెంచుకునే క్రమంలో అవకాశాలు అందిపుచ్చుకుని, షూటింగ్‌ల కోసం అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. దక్షిణాది హీరో శింబు కూడా ఇదే కోవలోకి వస్తాడు. లాక్డౌన్ కాలంలో కఠిన వర్కౌట్లు చేసి సుమారు 30 కిలోల మేర బరువు తగ్గినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియలో షేర్ చేసిన శింబు.. ‘‘ఈ ప్రయాణంలో నా వెనుక ఉండి మార్గదర్శనం చేసిన, నాకు సహకరించిన సర్వోన్నత శక్తికి ధన్యవాదాలు. అదే విధంగా నా మీద అనంతమైన ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. మీ ప్రేమే నాకు ప్రపంచం. అందుకు సదా మీకు రుణపడి ఉంటాను’’అంటూ తన రాబోయే సినిమా ఈశ్వరన్‌ను ఆదరించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. (చదవండి: పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?) నీ సంకల్ప బలానికి హ్యాట్సాఫ్: శింబు సోదరి ‘‘పరివర్తన చెందే క్రమంలో ఎంతో కఠిన శ్రమకు ఓర్చాడు. ఇది కేవలం బరువు తగ్గే ప్రక్రియ మాత్రమే కాదు.. తనలోని నిజమైన శక్తిని, లక్ష్యాలను చేరుకునే మార్గం. ఈ ప్రయాణంలో గత కొన్నిరోజులుగా నేను తనతో పాటే ఉన్నాను. తన అంకితభావాన్ని కళ్లారా చూశాను. అతడి సంకల్ప బలానికి హ్యాట్సాఫ్’’ అంటూ శింబు సోదరి ఇలకియా అభిలాష్, అతడి పోస్టును షేర్ చేస్తూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం దిండిగల్ షూటింగ్‌తో బిజీగా ఉన్న శింబు, ఈశ్వరన్ కోసం కాల్షీట్లు కేటాయించాడు. దిండిగల్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. He’s gone through a lot for this transformation. This transformation was not just for losing weight but to know his true self vision purpose and goals . I was with him for few days during this journey and I’ve seen him working so hard towards his goals and hats off 2his willpower https://t.co/uWUbmacqQj — TR Elakkiya Abhilash (@ELAKKS) October 29, 2020 -
మాజీ ప్రియురాలితో..
సినిమా: సంచలన నటుడు శింబు, నటి హన్సికల మధ్య సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. చాలా డీప్‌గా ప్రేమించుకున్న ఈ జంట ప్రేమాయణం పెళ్లి అంచుల వరకూ సాగి ఆగిపోయ్యింది. అలా మాజీ ప్రియురాలు అయిన హన్సిక 50వ చిత్రంలో అతిథిగా నటించడానికి ఎలాంటి అభ్యతరం చెప్పలేదు శింబు. అవును నటి హన్సిక నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది ఆమె సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే 50వ చిత్రం. దీన్ని ఎక్సట్రా ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. యుఆర్.జమీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. ఆరంభ దశలో దమ్మర దమ్ అంటూ హన్సిక దమ్ముకొట్టే ఫొటోలతో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్లను విడుదల చేసి హడావుడి చేశారు. ఆ తరువాత చల్లబడ్డారు. అసలు ఈ చిత్ర నిర్మాణం ఏ స్థాయిలో ఉందో కూడా తెలియని పరిస్థితి. కాగా తాజాగా ఒక ఫొటోను విడుదల చేశారు. అందులో నటి హన్సికపై శింబు పడుకుని కళ్లు మూసుకుని తన్మయత్నంలో ఉన్నట్లు దృశ్యం ఉంది. ఇంకే ముందు మరోసారి మహా చిత్ర ప్రచారం వేడెక్కిపోతోంది.ఈ ఫోటోను దర్శకుడు వెంకట్‌ప్రభు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అయితే మహా చిత్రానికి సంబంధించిన ఇతర ఏ వివరాలు లేకపోవడంతో ఇదంతా నిద్రాణ దశలో ఉన్న మహా చిత్రం గురించి మరోసారి హైప్ తీసుకురావడానికి చేసిన ట్రిక్ అని తెలుస్తోంది. ఏదేమైతేనేం మరోసారి మహా చిత్రం వార్తల్లోకి వచ్చింది. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు తెరపైకి రానుందో తెలియదు గానీ, తాజాగా విడుదల చేసిన శింబు, హన్సికల ఫొటో మహా చిత్రంపై ఆసక్తిని మాత్రం రేకెత్రిస్తోంది. అదీ గాక నటుడు శింబు నటించిన చిత్రం విడుదలై కూడా చాలా కాలమైంది. వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. ప్రస్తుతం కొత్తగా నటిస్తున్న చిత్రం కూడా ఏదీ లేదు. త్వరలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో సురేశ్‌కామాక్షి నిర్మించనున్న మానాడు చిత్రంలో నటించడానికి శింబు రెడీ అవుతున్నారు. ఈలోగా శింబు తన మాజీ ప్రియురాలు హన్సికతో రొమాన్స్ చేసిన మహా చిత్రం విడుదలయితే బాగుంటుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. -
శింబు ఇంట పెళ్లి కళ
పెరంబూరు: సంచలన నటుడు శింబు ఇంట పెళ్లి కళ తాండవిస్తోందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ల సంఖ్య చాలానే ఉంది. ముఖ్యంగా నటుడు విశాల్, ఆర్య, శింబు ఇలా చాలా మంది ఉన్నారు. వీరిలో నటుడు ఆర్య బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్ ప్రేమలో పడి పెళ్లికి రెడీ అయ్యారు. వీరి పెళ్లి ఈ నెల 10న హైదరాబాద్‌లో జరగనుంది. నటుడు విశాల్‌కు పెళ్లి త్వరలోనే జరిగే అవకాశం ఉంది. కాగా నటుడు శింబు పెళ్లెప్పుడన్నదే ప్రశ్నార్ధంగా మారింది. ఈ పరిస్థితుల్లో శింబు ఇంటి పెళ్లి కర్యాక్రమాలు చాలా సైలెంట్‌గా జరుగుతున్నాయనే ప్రచారం గుప్పుమంది. ఆ మధ్య తన చెల్లెలి పెళ్లి తరువాత తాను పెళ్లి చేసుకుంటానని శింబు తెలిపారు. ఆయన చెల్లెలు పెళ్లి జరిగి చాలా కాలం అయ్యింది. దీంతో ఇప్పుడు జరగనుంది శింబు పెళ్లే అని అనుకుంటున్నారేమో! కానీ ఆయన తమ్ముడు కురలరసన్ పెళ్లి అని తెలిసింది. బాల నటుడిగా పరిచయం అయిన టీ.రాజేందర్ రెండవ కొడుకు కురళరసన్ శింబు, నయనతార జంటగా నటించిన ఇదునమ్మ ఆళ్లు చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. ఈయన ఇటీవల ఇస్లాం మతాన్ని స్వీరించిన విషయం తెలిసిందే. తను ప్రేమ కోసమే మతం మారినట్లు తెలుస్తోంది. కురళరసన్ ప్రేమ పెళ్లి కోసమే ఇప్పుడు శింబు ఇంట పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. కురళరసన్ పెళ్లి ఏప్రిల్ 26న జరగనున్నట్లు సమాచారం. టీ.రాజేందర్ కుటుంబ సభ్యుల నుంచి దీనిపై అధికారక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
నటి ఓవియను అరెస్ట్ చేయాలి
పెరంబూరు: స్త్రీ స్వేచ్ఛను హరించడమే సమాజానికి చేటు అని నటుడు శింబు పేర్కొన్నారు. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ సంచలన నటుడు 90 ఎంఎల్ చిత్రంతో మరోసారి వార్తల్లోకెక్కారు. సంచలన నటి ఓవియా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్. మహిళా దర్శకురాలు అనితా ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కిం చుకుంది. విమర్శకుల నుంచి మాత్రం తీవ్ర వ్యతి రేకతను ఎదుర్కొంటోంది. అందుకు కారణం చిత్రంలో అమ్మాయిలు మద్యం సేవించడం, పొగ తాగడం, సహజీవనం సాగించడం లాంటి పలు అంశాలు చోటు చేసుకోవడమే. 90 ఎంఎల్ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ పొందింది. కాగా ఈ చిత్రానికి నటుడు శింబు సంగీతాన్ని అందించారు. ఈ విషయమే ఆయన్ని విమర్శల పాలు చేసింది. దీనికి స్పందించిన శింబు తొలిసారిగా మహిళల ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో మగవారిని కించపరచకుండా స్త్రీల స్వేచ్ఛ గురించి అనితా ఉదీప్ కథను తయారు చేశారని అన్నారు. అలాంటిది మనమే భావితరాలను, సమాజాన్ని నాశనం చేసే చిత్రం అని గగ్గోలు పెడుతున్నామన్నారు. స్త్రీ స్వేచ్ఛను అడ్డుకోవడమే సంప్రదాయాలకు చేటు అని పేర్కొన్నారు. తాను మహిళా వ్యతిరేకినని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారనీ, అందుకే ఈ చిత్రానికి మద్దతు ఇచ్చి, సంగీతాన్ని అందించాననీ చెప్పారు. దీన్ని అర్థం చేసుకున్న మగవారికి ధన్యవాదాలు అని శింబు పేర్కొన్నారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. నటి ఓవియను అరెస్ట్ చేయాలి కాగా 90 ఎంఎల్ చిత్రంపైనా, దర్శకురాలు, హీరోయిన్ ఓవియలపై తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా మహిళలను కించపరచే సన్నివేశాల్లో నటించినందుకు గానూ నటి ఓవియను అరెస్ట్ చేయాలంటూ ఇండియా దేశీయ లీగ్ పార్టీ మహిళా విభాగ నిర్వాహకులు సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
కమల్‌కు మనువడిగా శింబు?
సినిమా: విశ్వనటుడు కమలహాసన్‌కు సంచలన నటుడు శింబు మనువడుగా మారనున్నాడా? ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. కమలహాసన్ తన మక్కళ్ నీది మయ్యం పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో తన చివరి చిత్రం ఇండియన్–2కు సంబంధించిన పనుల్లో మునిగిపోయారు. 1996లో కమలహాసన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇండియన్. శంకర్ దర్శకత్వం వహించిన ఇది లంచగొండితనంపై ఆయన ఎక్కుపెట్టిన బాణం. సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న తరుణంలో శంకర్ రజనీకాంత్‌తో ఎందిరన్‌కు సీక్వెల్‌గా 2.ఓ చిత్రం చేశారు. ఇప్పుడు ఇండియన్‌కు సీక్వెల్‌ను చేసే పనిలో నిమగ్నమయ్యారు. సుమారు 22 ఏళ్ల తరువాత ఇండియన్‌కు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. ఇందులో కమల్ మళ్లీ తండ్రీ కొడుకులుగా నటించనున్నారా లేదా అన్నది పక్కన పెడితే ఆయనకు మనువడిగా శింబు నటించనున్నారనే ప్రచారం మాత్రం హల్చల్ చేస్తోంది. సాధారణంగా శంకర్ తన చిత్రాలకు సంబంధించిన విషయాల్లో చాలా సీక్రెట్‌ను మెయిన్‌టెన్ చేస్తుంటారు. అలాంటిది ఇండియన్–2కు సంబంధించి చాలా లీక్‌లు వస్తున్నాయి. ఇందులో నటి కాజల్‌అగర్వాల్ హీరోయిన్గా నటించనుంది. ఆమె కమల్‌హాసన్‌కు జంటగా నటించనుందని, దీంతో కాజల్లగర్వాల్ శింబుకు పోటీగా మారనుందనే వార్తలు కోలీవుడ్ ఆమెపై వస్తున్నాయి. ఇండియన్–2 చిత్రం ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉందని, కొన్ని అనివార్యకారణాల వల్ల ఆలస్యం జరిగిందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ నెలాఖరున చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారికపూర్వ ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. శింబు ప్రస్తుతం వందా రాజావాదాన్ వరువేన్ చిత్రాన్ని పూర్తి చేసి త్వరలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాదు చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. -
కోర్టుకెక్కిన శింబు.. విశాల్‌కు నోటీసులు
పెరంబూరు: నటుడు శింబు కోర్టుకెక్కి నటుడు విశాల్‌కు షాక్ ఇచ్చాడు. చర్చనీయాంశ నటుడిగా ముద్ర వేసుకున్న శింబు ఈసారి వార్తల్లోకి కాదు కాదు కోర్టుకెక్కారు. శింబు హీరోగా మైకెల్‌రాయప్పన్ 2017లో అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆధిక్. రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ కారణంగా శింబుకు నిర్మాత మైకెల్ రాయప్పన్‌కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో చిత్ర నిర్మాత శింబు సరిగా షూటింగ్‌కు రానందువల్ల, తను కథలో జోక్యం కారణంగానే చిత్రం ఫ్లాప్ కావడంతో పాటు తనకు భారీ నష్టాన్ని మిగిల్చిందని, కాబట్టి తనకు నష్ట పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. దీనిపై వివరణ కోరుతూ నిర్మాతల మండలి శింబుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఆ నోటీసులకు శింబు బదులివ్వలేదని, దీంతో ఆయనపై రెడ్ కార్డు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శింబు మాత్రం కొత్త చిత్రాల్లో నటిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రానికి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటుడు శింబు నిర్మాతల మండలి అ«ధ్యక్షుడు విశాల్, అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర నిర్మాత మైకెల్ రాయప్పన్‌లపై చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అందులో తాను నటించిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రానికి రూ.8 కోట్లు పారితోషికం ఒప్పందం చేసుకున్నా, ఆ చిత్ర నిర్మాత రూ.5 కోట్లే చెల్లించాడని, అంతేగాకుండా తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నాడు. అదే విధంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కట్ట పంచాయితీ చేస్తున్నాడని ఆరోపించాడు. తనపై అసత్య ప్రచారం చేసిన నిర్మాత మైకెల్ రాయప్పన్‌పై పరువు నష్టం దావా కింద కోటి రూపాయలను చెల్లించేలా ఆదేశించాలని, అదే విధంగా తన కొత్త చిత్రాల విషయంలో నిర్మాతల మండలి గానీ, నటీనటుల సంఘం కానీ జోక్యం చేసుకోరాదని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయమూర్తి కల్యాణసుందరం సమక్షంలో కోర్టులో విచారణ జరిగింది. శింబు తరఫు వాదనలను విన్న న్యాయమూర్తి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నిర్మాత మైకెల్‌రాయప్పన్, విశాల్‌కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18 తేదీకి వాయిదా వేశారు. -
తమిళంలో జోరుగా...
అందాల సుందరి రాశీఖన్నా హీరో శింబూకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి చెన్నై కోడంబాక్కమ్ వర్గాలు. ప్రముఖ దర్శకులు మణిరత్నం తెరకెక్కించిన ‘చెక్క చివంద వానమ్’ చిత్రం తర్వాత వరుసగా సినిమాలు సైన్ చేస్తున్నారు శింబు. తాజాగా సుందర్ సి. దర్శకత్వంలో ఆయన నటించిన ‘వందా రాజావాదాన్ వరువేన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ చిత్రంలో నటించనున్నారు శింబు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇందులో శింబు సరసన రాశీ ఖన్నాను కథానాయికగా తీసుకున్నారట. ‘ఇౖమైక్క నొడిగళ్’తో తమిళంలోకి అడుగుపెట్టి, ఇటీవల కథానాయికగా ‘అడంగామారు’తో మంచి విజయం అందుకున్నారు రాశీ ఖన్నా. మరోవైపు ‘టెంపర్’కి రీమేక్‌గా విశాల్ సరసన ఆమె నటించిన ‘అయోగ్య’ రిలీజ్‌కి రెడీగా ఉంది. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వంలో ‘సైతాన్ కా బచ్చా’ అనే మరో తమిళ చిత్రంలో నటిస్తున్నారు రాశీ. ఇప్పుడు శింబు ‘మానాడు’ సినిమా ఆఫర్. ఈ చిత్రం కోసం 28 రోజులు బ్యాంకాక్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారట శింబు. ఫిబ్రవరి 3న శింబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారని టాక్. -
ఇది పార్టీ టైమ్ బాస్
సినిమా: పార్టీ ఎక్కడుంటే అక్కడ నటి త్రిష ఉంటుందనే టాక్ కోలీవుడ్‌లో ఉంది. ఇక నటుడు శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలనాలకు కేంద్ర బిందువు ఆయన. అలాంటి శింబు చాలా కాలం తరువాత సెక్క సివందవానం చిత్ర విజయంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఇక సుందర్.సీ దర్శకత్వంలో నటించిన వందా రాజావాదాన్ వరువేన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబుతోంది. ఇలా శింబు మంచి జోష్‌లో ఉన్న తరుణంలో నూతన సంవత్సరం రావడంతో ఈ అకేషన్‌ను ఆయన తన అత్యంత సన్నిహితులతో సెలబ్రేషన్ చేసుకున్నారు. శింబు పార్టీ అంటే చెన్నై చిన్నది పాల్గొనకుండా ఉంటుందా? అసలే హిట్ పెయిర్. ఇంకా చిరకాల మిత్రులు. ఇదిలాఉండగా శింబు, త్రిష జంటగా నటించిన విన్నైతాండి వరువాయా చిత్రం వీరిద్దకి కేరీర్లోనూ ఒక మైలురాయిగా నిలిచే చిత్రం. కాగా నూతన సంవత్సరం సందర్భంగా నటుడు శింబు చెన్నైలోని తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో నటి త్రిషతో పాటు సోనియాఅగర్వాల్, మేఘాఆకాశ్, గాయత్రి రఘురాం, నటుడు శాంతను భార్య కీర్తీ, నటుడు కార్తీ, మహత్, దర్శకుడు సుందర్.సీ, వెంకట్‌ప్రభు తదితరులు పాల్గొన్నారు. కాగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో కార్తీ, శింబు వ్యతిరేక వర్గంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఆ తరువాత వీరిద్దరూ పాత విషయాలను మరచిపోయి మంచి మిత్రులైపోయారు. -
మళ్లీ మల్టీ స్టారర్ చిత్రం
సినిమా: దర్శకుడు మణిరత్నం అచ్చొచ్చిన బాటలోనే పయనించడానికి మొగ్గు చూపుతున్నారా? అంటే అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌ల్లో మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కుతున్నా, కోలీవుడ్‌లో ఆ ట్రెండ్ తక్కువేనని చెప్పాలి. ఇటీవలే మణిరత్నం, శంకర్ ఆ తరహా చిత్రాలకు తెర లేపారు. సెక్క సివంద వానం చిత్రంలో అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్‌లను నటింపజేసి మణిరత్నం సక్సెస్ అయ్యారు. ఇక శంకర్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్‌లతో 2.ఓ చిత్రం చేశారు. నిజానికి కొంతకాలం క్రితమే విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబులతో పొన్నియన్ సెల్వమ్ అనే చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించే ప్రయత్నం చేసినా, అది అప్పుడు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మళ్లీ అటకెక్కిన ఆ స్క్రిప్ట్‌ను దుమ్ముదులిపి వెండితెరపై ఆవిష్కరించడానికి మణిరత్నం సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో ఈ సారి విజయ్, విక్రమ్, శింబులను నటింపజేయడానికి మణిరత్నం వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. వారు ఈ మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కాగా ఇది చారిత్రక కథాంశంతో కూడిన చిత్రంగా ఉంటుంది. అయితే ఈ క్రేజీ చిత్రం గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదన్నది గమనార్హం. ఇకపోతే మణిరత్నంకు మల్టీస్టారర్ చిత్రాలు కలిసొచ్చాయనే చెప్పాలి. చాలా కాలం క్రితం రజనీకాంత్, మమ్ముట్టి, అరవిందస్వామిలతో రూపొందించిన దళపతి చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల సెక్క సివందవానంతో ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యింది. దీంతో మరోసారి మణిరత్నం అదే బాటలో పయనించి సక్సెస్ కొట్టాలనుకుంటున్నారన్నమాట. -
నెక్ట్స్ ఫిక్స్
తమిళ హీరో శింబు మరో చిత్రానికి సై అన్నారు. రీసెంట్గా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘చెక్కా చివందా వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నారు. ‘‘నా నెక్ట్స్ మూవీలో శింబు హీరోగా నటించబోతున్నాడు అని చెప్పడానికి ఆనందంగా ఉంది. సురేశ్ నిర్మించనున్నారు. సీక్వెల్ కాదు. కొత్త స్క్రిప్ట్. మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తా. సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది’’ అని దర్శకుడు వెంకట్ ప్రభు పేర్కొన్నారు. సో.. శింబు నెక్ట్స్ సినిమా ఫిక్స్ అన్నమాట. -
శింబు లేటెస్ట్ కంకణం
శింబు తెలుసు కదా! నయనతారతో ఒక పది వేల ఎపిసోడ్ల లవ్ స్టోరీ నడిచింది. అంటే మొగలిరేకుల కంటే ఎక్కువ రేకులు అన్నమాట. అంత హడావుడిగా ఉండే హీరో ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ, ఎందుకో అందుకు.. కుప్పలో కాలేయకుండా ఉంటాడా?! కుప్పలో కాలా! అలా రాస్తే శింబూకి కాలదూ? మరి కెరీర్ మీద ఫోకస్ లేకుండా, కేర్లెస్గా ఉంటే ఎక్కడ నడుస్తామో అర్థమౌతుందా?! అసలు పేరే శిలంబరసన్. ‘శిలంబు’ అంటే కాలికేసుకునే గండపెండేరం. ‘అరసన్’ అంటే రాజు. సన్ ఆఫ్ ది కింగ్ అని. అలాంటి కింగు గండపెండేరం వేసుకుని సరిగా వాకింగ్ చెయ్యకపోతే సినిమా ఇండస్ట్రీ రాకింగ్ చెయ్యదా? కాలరు పట్టుకుని మరీ రాకింగ్ చెయ్యదూ? రాకింగ్ అంటే ఊపేయడం లెండి. శింబు.. టైమ్‌కి రాడనీ, టైమ్‌కి వస్తే శింబు కాదనీ, ఆయన వల్ల కొంచెం టైమ్ వేస్ట్ అయినా పర్వాలేదు కానీ, ఏకంగా ఎయిటీన్ క్రోర్స్ వేస్ట్ అయిపోయాయనీ, ఓ నలుగురు నిర్మాతలు ‘నడిగర్ సంగం’ కి కంప్లయింట్ చేశారు. కంప్లయింట్లో సత్యాసత్యాలు తేలేదాకా.. శింబు యాక్టింగ్ చెయ్యకూడదని, బల్లల్ని గుద్దేశారు. ‘ఇదంతా అసత్య ప్రచారం, నేనేంటీ లేటేంటీ, నేనెప్పుడూ లేటెస్టే. కావాలంటే నయనతారను అడిగి కనుక్కోండి... నేనెంత సిన్సియరో’’ అని శింబు ఇప్పుడు యమాక్టింగ్ చేసేస్తున్నాడట. -
వదంతుల వలలోనయనతార
కొందర్ని చూస్తే మెచ్చబుద్ధి.. మరొకర్ని చూస్తే మొత్తబుద్ధి వేస్తుందనే సామెత ఉంది. అలానే నయనతారను చూస్తే ఏవేవో రాయాలనిపిస్తుందేమో. ప్రేమ వ్యవహారాల్లో ఇంతకు ముందు సంచలనాలు సృష్టించిన ఈ బ్యూటీపై ఇటీవల మళ్లీ వదంతుల పరంపర మొదలైం ది. శింబుతో ప్రేమాయణం, ఆ తర్వాత ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్లి కథ కంచెకు చేరిన విధంగా మారిన లవ్‌స్టోరీ ఆ మధ్యలో చాలా కలకలాన్ని సృష్టించాయి. కొంత కాలంగా వీటికి దూరంగా ఉన్న నాయనపై మళ్లీ వదంతుల ప్రవాహాని కి తెరలేసింది. అందుకు కారణం ఆమె మళ్లీ తన మాజీ ప్రియుడు శింబుతో జత కట్టడమే కారణం కావచ్చు. ఈ మధ్య ఆర్య సరసన రాజారాణి చిత్రం లో నటించినప్పుడు వీరిద్దరి గురించి కథలు కథలుగా ప్రచారం జరిగింది. ఆర్య నయనకు బిర్యాని విందునిచ్చారని, ఇద్దరూ నక్షత్ర హోటళ్లలో ఏకాం తంగా కలుసుకుంటున్నారని రకరకాల వదంతులు ప్రచారమయ్యాయి. అవ న్నీ వదంతులే అంటూ నయనతార ఖండించారు. తాజాగా శింబుతో సాన్నిహిత్యం గురించి మరోసారి గాసిప్సు గుప్పుమన్నాయి. వీటిపై నయనతార స్పందిస్తూ తన గురించి చాలా వదంతులు ప్రచారమవుతున్నాయన్నారు. ఆర్యను ప్రేమిస్తున్నట్లు, శింబుతో షికార్లు అంటూ ఇష్టమొచ్చినట్లు రాసేస్తున్నారన్నారు. వీటిలో ఏదీ నిజం కాదని చెప్పారు. తాము నటులమ ని, వృత్తిపై అంకితభావం చూపిస్తున్నామని అన్నారు. ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతామన్నారు. అంతేకానీ తమ మధ్య ఎలాంటి సం బంధం లేదని స్పష్టం చేశారు. అయి తే ఇలాంటి వదంతులకు కొందరు న టీనటులు ఇష్టపడతారనే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా బా లీవుడ్ తారలు ఇలాంటి గ్యాసిప్స్‌ను ప్రచారం చేస్తారని, తద్వారా వారు ఫలం పొందుతున్నట్లు చెబుతారని అన్నారు. అందువల్లే తమ గురిం చి వదంతులు ప్రచారం అయినప్పటికీ ఆనందిస్తారన్నారు. ఆ సంస్కృతి ఇప్పుడు కోలీవుడ్ లో మొదలయ్యిందని అన్నా రు. తెలుగులో ఇలాంటి పరిస్థితి లేదని నయనతార తెలిపారు. -
శింబు.. ఈ భామనీ వదల్లేదు!!
-
అనుష్కతో లవ్వా.. మీరలా అనుకుంటే..
-
శింబుతో నటించాలంటే ఆమాత్రం ఇవ్వాల్సిందే!
-
మేమూ పాడతాం..!
-
చలో హైదరాబాద్
సంచలనాలకు కేంద్ర బిందువు నయనతార. నటిగానే కాదు, వ్యక్తిగతంగాను ఈమె జీవితం పలు ఆసక్తికర అంశాలకు కొలువు. మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు, ఆ తరువాత టాలీవుడ్‌కు మళ్లీ కోలీవుడ్‌కు అంటూ నటిగా పల్టీలు కొడుతున్న నయనతార తాజాగా తన నివాసాన్ని హైదరాబాదుకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శింబు, ప్రభుదేవాతో ప్రేమ బెడిసికొట్టడంతో నయనతార నటనకు కొంతకాలం దూరంగా ఉన్నారు. తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి ఆరంభం, రాజారాణి, ఇదు కదిర్వేలన్ కాదల్ అంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామకు మళ్టీ టాలీవుడ్లో పలు అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం అనామిక (తమిళంలో ఎంగే నీ ఎన్ అన్భే) చిత్రంలో నటిస్తున్న నయనతారకు వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయట. అదే విధంగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నన్భేండా చిత్రంలో నటిస్తున్నారు. శింబుతో ఇదు నమ్మా ఆళు, జయంరవి సరసన ఒక చిత్రం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో నయన హైదరాబాద్ మకాం మార్చనుందనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ గాలం : నయనతారను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే తమిళనాడు, ఢిల్లీ కాంగ్రెస్ ముఖ్య నేతలు నయనతారతో రహస్య చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. నయనతార క్రేజ్‌ను వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇందుకు నయనతార సుముఖంగా లేదు. సినిమాలతో బిజీగా ఉన్న ఈమె రాజకీయ ప్రచారాలకు సమయం కేటాయించలేని పరిస్థితి. ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న నయనతార ఇప్పుడు ఒక పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తే మరోపార్టీ వాళ్లు దుమ్మెత్తి పోస్తారని భయపడుతున్నట్లు సమాచారం. -
అతణ్ణి ఎప్పటికీ క్షమించను!
అనుదినం వివాదాలు, అడుగడుగునా ఆటుపోట్లు.. కెరీర్ ప్రారంభించినప్పట్నుంచీ నయనతార జీవితం ఇదే. శింబుతో సాగించిన ప్రేమాయణం ఓ చర్చ. తర్వాత ఇద్దరూ విడిపోవడం ఓ రచ్చ. మళ్లీ ప్రభుదేవాతో లవ్వు. ఇంతలోనే కటీఫ్. పాపం... ఈ పరిణామాలు ఆమె కెరీర్‌పై కూడా అంతో ఇంతో ప్రభావం చూపించాయి. ఒకానొక దశలో సినిమాలకు దూరమైపోయారు కూడా. ప్రస్తుతం మాత్రం చాలా ప్రశాంత చిత్తంతో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు నయన. అయితే... తన పాత ప్రియుడు శింబుతో తాను నటిస్తుండటం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ‘ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ చిగురిస్తుందేమో!’... అని అక్కడి మీడియా కథనాలు కూడా ప్రసారం చేసింది. అయితే... నయన మాత్రం ఈ విషయంలో పెదవి విప్పకుండా జాగ్రత్తగా ముందుకెళుతున్నారు. కానీ... ఇటీవల ఓ తమిళ చానల్ అడిగిన ప్రశ్నకు నయన చెప్పిన సమాధానం అక్కడ పెద్ద దుమారాన్నే రేపింది. ‘‘శింబుతో నటించేస్తున్నారు. అలాగే... ప్రభుదేవాను కూడా క్షమించేసి ఆయన దర్శకత్వంలో కూడా నటించేయొచ్చు కదా?’’ అని సదరు చానల్ వారు అడిగితే -‘‘మొదటి వ్యక్తిని క్షమించాను కానీ... మీరు చెప్పిన ఆ రెండో వ్యక్తిని మాత్రం ఎప్పటికీ క్షమించను’’ అని సింపుల్‌గా చెప్పి అక్కడ్నుంచీ తప్పుకున్నారట నయన. ప్రభుదేవాపై తాను ఎంత కోపంతో ఉందో ఈ సమాధానమే చెబుతోందని కోలీవుడ్‌లో అందరూ అనుకుంటున్నారట! -
శింబూతో ఎందుకు విడిపోయినట్టు?
శింబు, హన్సిక... ఈ జంట విడిపోవడానికి కారణమేంటి? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. మీడియా ముందు మాత్రం అభిప్రాయాలు కలవకే శింబుకూ దూరమైనట్లు, శింబునీ, అతని కుటుంబాన్ని ఎప్పటికీ గౌరవిస్తానని చెప్పారు హన్సిక. అయితే... ఆమె సన్నిహితులు, స్నేహితులకు మాత్రం ఆమె చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయని వినికిడి. శింబు రాత్రుళ్లు ఫోన్లు చేసి తనను టార్చర్ పెట్టేవాడని, గంటల తరబడి మాట్లాడుతూనే ఉండేవాడని, ఆ టార్చర్ భరించలేకే అతనికి దూరమయ్యానని చెబుతున్నారట హన్సిక. ఇదిలావుంటే... శింబు, నయనతార కలిసి ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. మళ్లీ వీర్దిదరూ కలిసి పనిచేయడం హన్సికకు పుండుపై కారం పెట్టినట్టు ఉందట. ఆ బాధను తట్టుకోలేకే ఇలా సన్నిహితుల వద్ద హన్సిక వాపోతున్నారని ఓ టాక్. -
నయనతో శింబు లవ్ డ్యూయెట్లు
అప్పట్లో శింబు, నయనతార ఎంత ఘాటు ప్రేమయో అంటూ లవ్వాటాడుకున్నారు. తర్వాత వారి మధ్య ప్రేమ మాయమైంది. ఇటీవల శింబు, హన్సిక ఔను మేము ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకుంటాం అన్నారు. ఇప్పుడు వీరి ప్రేమ కథ కంచికి చేరిందంటున్నారు. అంతేకాదు మాజీ ప్రేయసి నయనతారతో శింబు మళ్లీ డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. శింబు, నయనతార ఇంతకుముందు వల్లవన్ చిత్రంలో జతకట్టారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ పుట్టింది. చాలా సన్నిహితంగా మెలిగారు. ఆ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేయడంతో వీరి ప్రేమకు ముసలం పుట్టింది. శింబునే వాటిని నెట్లో ప్రచారం చేశారన్న విషయం తెలిసి నయనతార మనసు విరిగిపోయింది. ఇటీవల శింబు లవ్‌లో పడ్డ హన్సికను పలువురు ఆక్షేపించారు. దీంతో పునరాలోచనలో పడ్డ హన్సిక శింబుకు దూరం అవుతూ వచ్చింది. ఇప్పుడు వీరి మధ్య పెద్ద అగాథం ఏర్పడినట్లు సమాచారం. శింబు తాజాగా నటిస్తున్న చిత్రంలో మాజీ ప్రియురాలు నయనతార హీరోయిన్గా నటించనున్నారట. ఈ విషయాన్ని స్వయానా ఆ చిత్ర దర్శకుడు పాండిరాజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో హన్సిక పోయే, శింబు నయన్‌తో మళ్లీ జోడి చేరే అంటున్నారు.