శింబు లేటెస్ట్‌ కంకణం | simbhu love story | Sakshi
Sakshi News home page

శింబు లేటెస్ట్‌ కంకణం

Nov 25 2017 1:26 AM | Updated on Nov 25 2017 1:52 AM

simbhu love story - Sakshi - Sakshi

శింబు తెలుసు కదా! నయనతారతో ఒక పది వేల ఎపిసోడ్‌ల లవ్‌ స్టోరీ నడిచింది. అంటే మొగలిరేకుల కంటే ఎక్కువ రేకులు అన్నమాట. అంత హడావుడిగా ఉండే హీరో ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ, ఎందుకో అందుకు.. కుప్పలో కాలేయకుండా ఉంటాడా?! కుప్పలో కాలా! అలా రాస్తే శింబూకి కాలదూ? మరి కెరీర్‌ మీద ఫోకస్‌ లేకుండా, కేర్‌లెస్‌గా ఉంటే ఎక్కడ నడుస్తామో అర్థమౌతుందా?! అసలు పేరే శిలంబరసన్‌. ‘శిలంబు’ అంటే కాలికేసుకునే గండపెండేరం.

‘అరసన్‌’ అంటే రాజు. సన్‌ ఆఫ్‌ ది కింగ్‌ అని. అలాంటి కింగు గండపెండేరం వేసుకుని సరిగా వాకింగ్‌ చెయ్యకపోతే సినిమా ఇండస్ట్రీ రాకింగ్‌ చెయ్యదా? కాలరు పట్టుకుని మరీ రాకింగ్‌ చెయ్యదూ? రాకింగ్‌ అంటే ఊపేయడం లెండి. శింబు.. టైమ్‌కి రాడనీ, టైమ్‌కి వస్తే శింబు కాదనీ, ఆయన వల్ల కొంచెం టైమ్‌ వేస్ట్‌ అయినా పర్వాలేదు కానీ, ఏకంగా ఎయిటీన్‌ క్రోర్స్‌ వేస్ట్‌ అయిపోయాయనీ, ఓ నలుగురు నిర్మాతలు ‘నడిగర్‌ సంగం’ కి కంప్లయింట్‌ చేశారు. కంప్లయింట్‌లో సత్యాసత్యాలు తేలేదాకా.. శింబు యాక్టింగ్‌ చెయ్యకూడదని, బల్లల్ని గుద్దేశారు. ‘ఇదంతా అసత్య ప్రచారం, నేనేంటీ లేటేంటీ, నేనెప్పుడూ లేటెస్టే. కావాలంటే నయనతారను అడిగి కనుక్కోండి... నేనెంత సిన్సియరో’’ అని శింబు ఇప్పుడు యమాక్టింగ్‌ చేసేస్తున్నాడట.

Advertisement
 
Advertisement
Advertisement