
శింబు
తమిళ హీరో శింబు మరో చిత్రానికి సై అన్నారు. రీసెంట్‌గా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘చెక్కా చివందా వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన ఆయన తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించనున్నారు. ‘‘నా నెక్ట్స్ మూవీలో శింబు హీరోగా నటించబోతున్నాడు అని చెప్పడానికి ఆనందంగా ఉంది. సురేశ్ నిర్మించనున్నారు. సీక్వెల్ కాదు. కొత్త స్క్రిప్ట్. మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తా. సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది’’ అని దర్శకుడు వెంకట్ ప్రభు పేర్కొన్నారు. సో.. శింబు నెక్ట్స్ సినిమా ఫిక్స్ అన్నమాట.