నీ సంకల్ప బలానికి హ్యాట్సాఫ్‌: నటుడి సోదరి

Simbu Sister Praises Him Works Hard Over Physical Transformation - Sakshi

చెన్నై: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను సినీ సెలబ్రిటీలు సద్వినియోగం చేసుకున్నారు. కొంతమంది పెళ్లి పీటలు ఎక్కి వైవాహిక జీవితంలోకి అడుగుపెడితే.. మరికొంత మంది ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తూనే, ఫిట్‌నెస్‌ పెంచుకోవడంపై దృష్టిసారించారు. కెరీర్‌ గ్రాఫ్‌ పెంచుకునే క్రమంలో అవకాశాలు అందిపుచ్చుకుని, షూటింగ్‌ల కోసం అన్ని రకాలుగా సిద్ధమయ్యారు. దక్షిణాది హీరో శింబు కూడా ఇదే కోవలోకి వస్తాడు. లాక్‌డౌన్‌ కాలంలో కఠిన వర్కౌట్లు చేసి సుమారు 30 కిలోల మేర బరువు తగ్గినట్లు సమాచారం.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియలో షేర్‌ చేసిన శింబు.. ‘‘ఈ ప్రయాణంలో నా వెనుక ఉండి మార్గదర్శనం చేసిన, నాకు సహకరించిన సర్వోన్నత శక్తికి ధన్యవాదాలు. అదే విధంగా నా మీద అనంతమైన ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు. మీ ప్రేమే నాకు ప్రపంచం. అందుకు సదా మీకు రుణపడి ఉంటాను’’అంటూ తన రాబోయే సినిమా ఈశ్వరన్‌ను ఆదరించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. (చదవండి: పెళ్లి పీటలు ఎక్కనున్న శింబు, త్రిష?)

నీ సంకల్ప బలానికి హ్యాట్సాఫ్‌: శింబు సోదరి
‘‘పరివర్తన చెందే క్రమంలో ఎంతో కఠిన శ్రమకు ఓర్చాడు. ఇది కేవలం బరువు తగ్గే ప్రక్రియ మాత్రమే కాదు.. తనలోని నిజమైన శక్తిని, లక్ష్యాలను చేరుకునే మార్గం. ఈ ప్రయాణంలో గత కొన్నిరోజులుగా నేను తనతో పాటే ఉన్నాను. తన అంకితభావాన్ని కళ్లారా చూశాను. అతడి సంకల్ప బలానికి హ్యాట్సాఫ్‌’’ అంటూ శింబు సోదరి ఇలకియా అభిలాష్‌, అతడి పోస్టును షేర్‌ చేస్తూ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశారు. కాగా ప్రస్తుతం దిండిగల్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్న శింబు, ఈశ్వరన్‌ కోసం కాల్షీట్లు కేటాయించాడు. దిండిగల్‌ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top