శింబూతో ఎందుకు విడిపోయినట్టు?
శింబు, హన్సిక... ఈ జంట విడిపోవడానికి కారణమేంటి? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. మీడియా ముందు మాత్రం అభిప్రాయాలు కలవకే శింబుకూ దూరమైనట్లు,
శింబు, హన్సిక... ఈ జంట విడిపోవడానికి కారణమేంటి? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. మీడియా ముందు మాత్రం అభిప్రాయాలు కలవకే శింబుకూ దూరమైనట్లు, శింబునీ, అతని కుటుంబాన్ని ఎప్పటికీ గౌరవిస్తానని చెప్పారు హన్సిక. అయితే... ఆమె సన్నిహితులు, స్నేహితులకు మాత్రం ఆమె చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయని వినికిడి. శింబు రాత్రుళ్లు ఫోన్లు చేసి తనను టార్చర్ పెట్టేవాడని, గంటల తరబడి మాట్లాడుతూనే ఉండేవాడని, ఆ టార్చర్ భరించలేకే అతనికి దూరమయ్యానని చెబుతున్నారట హన్సిక. ఇదిలావుంటే... శింబు, నయనతార కలిసి ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. మళ్లీ వీర్దిదరూ కలిసి పనిచేయడం హన్సికకు పుండుపై కారం పెట్టినట్టు ఉందట. ఆ బాధను తట్టుకోలేకే ఇలా సన్నిహితుల వద్ద హన్సిక వాపోతున్నారని ఓ టాక్.