'ఇది చాలా ప్రత్యేకం.. నా అభిమానులకు అంకితమిస్తున్నా': మోహన్ లాల్ | Mohanlal transforms into a warrior king again in Vrusshabha first look poster | Sakshi
Sakshi News home page

Mohanlal: 'ఇది చాలా ప్రత్యేకం.. నా అభిమానులకు అంకితమిస్తున్నా': మోహన్ లాల్

May 21 2025 8:10 PM | Updated on May 21 2025 8:19 PM

Mohanlal transforms into a warrior king again in Vrusshabha first look poster

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న తాజా చిత్రం వృషభ. ఎంపురాన్-2, తుడురుమ్ సూపర్ హిట్స్ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మోహన్ లాల్ ఫస్ట్‌ లుక్‌ రివీల్ చేశారు మేకర్స్. యోధుడి లుక్‌లో ఉన్న పోస్టర్‌ మోహన్‌ లాల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పెద్ద కత్తిని చేతిలో పట్టుకుని కనిపిస్తోన్న ఈ పోస్టర్‌ చూస్తుంటే   పౌరాణిక చిత్రంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఇది చాలా ప్రత్యేకమైనది.. నా అభిమానులందరికీ దీన్ని అంకితం చేస్తున్నా.. మీ నిరీక్షణ ఇక్కడితో ముగుస్తుంది. తుఫాను మేల్కోనుంది. గర్వం, శక్తితో వృషభ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరిస్తున్నా. ఇది మీ ఆత్మను మండించే కథగా కాలక్రమేణా ప్రతిధ్వనిస్తుంది. నా పుట్టినరోజున ఈ పోస్టర్ ఆవిష్కరించడం మరింత అర్థవంతంగా ఉండనుంది. మీ ప్రేమ ఎల్లప్పుడూ నాకు గొప్ప బలం' అంటూ పోస్ట్ చేశారు.  ఈ సినిమాను అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మోహన్ లాల్ వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement