ఆ తెలుగు సినిమా నా జీవితాన్ని మార్చేసింది: శృతిహాసన్ | Shruti Haasan Open About His Career In Tollywood Industry | Sakshi
Sakshi News home page

Shruti Haasan: ఆ సినిమాతో నా లైఫ్ మారిపోయింది: శృతిహాసన్

Jul 11 2025 7:56 PM | Updated on Jul 11 2025 8:18 PM

Shruti Haasan Open About His Career In Tollywood Industry

కోలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ప్రస్తుతం కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్రజినీకాంత్ నటిస్తోన్న సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మూవీ నుంచి మోనికా అంటూ సాంగే రెండో పాటను రిలీజ్ చేశారు. పాటలో హీరోయిన్ పూజా హేగ్డే తన డ్యాన్స్ అదరగొట్టేసింది. ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్న కూలీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ కూడా నటించారు.

అయితే ఇటీవల సోషల్ మీడియాకు గుడ్బై చెప్పిన శృతిహాసన్‌.. తాజాగా ఇంటర్వ్యూకు హాజరైంది. సందర్భంగా తన కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. తనకు లైఫ్ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీనే అని తెలిపింది.

తెలుగులో గబ్బర్ సింగ్సినిమా తన జీవితాన్నే మార్చిందని చెప్పుకొచ్చింది. కోలీవుడ్ తర్వాత నాకు సక్సెస్ ఇచ్చిందంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమేనని వెల్లడించింది. డైరెక్టర్ హరీశ్ శంకర్ సార్పట్టుబట్టి మరి రోల్ ఇచ్చారని గుర్తు చేసుకుంది. మా నాన్న ఫిల్మ్ ఫేర్ అవార్డ్ను తీసుకునేందుకు హైదరాబాద్కు వచ్చానని శృతిహాసన్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement