మోహన్ లాల్ బర్త్ డే.. అలాంటి పిల్లల కోసం కీలక నిర్ణయం! | Superstar Mohanlal announces liver transplant for children on his Birthday | Sakshi
Sakshi News home page

Mohanlal: మోహన్ లాల్ బర్త్ డే.. చిన్న పిల్లల కోసం కీలక నిర్ణయం తీసుకున్న హీరో!

May 21 2025 3:58 PM | Updated on May 21 2025 4:08 PM

Superstar Mohanlal announces liver transplant for children on his Birthday

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ రోజుతో 65 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మలయాళంలో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న హీరో మోహన్ లాల్ ప్రస్తుతం కన్నప్ప మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆయన బర్త్‌ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మోహన్ లాల్ బర్త్‌ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సూపర్ స్టార్ మమ్ముట్టి,  పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, నివిన్ పౌలీ, నిర్మాత ఆంటోనీ సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మే 21, 1960న జన్మించిన మోహన్‌లాల్ నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 400 కి పైగా చిత్రాలలో నటించారు. ఐదుసార్లు జాతీయ అవార్డు  పొందిన మోహన్‌లాల్‌కు 2019లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది.

తాజాగా ఇవాళ తన బర్త్‌డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రెండు గొప్ప కార్యక్రమాలను ప్రకటించారు. బేబీ మెమోరియల్ హాస్పిటల్‌తో కలిసి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అర్హులైన పిల్లలకు  తక్కువ ధరకే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. కేరళలో చాలా మంది పిల్లలు కాలేయ వ్యాధులతో బాధపడుతున్నారని.. వారికి కాలేయ మార్పిడి అవసరమని తెలిపారు. ఈ ప్రకటనతో అలాంటి కుటుంబాలకు సహాయం చేయడమే లక్ష్యమని మోహన్ లాల్ అన్నారు. అంతేకాకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'బి ఎ హీరో' అనే పేరుతో  మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాగా.. 2015లో మోహన్‌లాల్  విశ్వశాంతి ఫౌండేషన్ స్థాపించారు. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి  కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement