breaking news
liver trans plantation
-
మోహన్ లాల్ బర్త్ డే.. అలాంటి పిల్లల కోసం కీలక నిర్ణయం!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ రోజుతో 65 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మలయాళంలో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న హీరో మోహన్ లాల్ ప్రస్తుతం కన్నప్ప మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆయన బర్త్ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సూపర్ స్టార్ మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, నివిన్ పౌలీ, నిర్మాత ఆంటోనీ సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మే 21, 1960న జన్మించిన మోహన్‌లాల్ నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 400 కి పైగా చిత్రాలలో నటించారు. ఐదుసార్లు జాతీయ అవార్డు పొందిన మోహన్‌లాల్‌కు 2019లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది.తాజాగా ఇవాళ తన బర్త్‌డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రెండు గొప్ప కార్యక్రమాలను ప్రకటించారు. బేబీ మెమోరియల్ హాస్పిటల్‌తో కలిసి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అర్హులైన పిల్లలకు తక్కువ ధరకే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. కేరళలో చాలా మంది పిల్లలు కాలేయ వ్యాధులతో బాధపడుతున్నారని.. వారికి కాలేయ మార్పిడి అవసరమని తెలిపారు. ఈ ప్రకటనతో అలాంటి కుటుంబాలకు సహాయం చేయడమే లక్ష్యమని మోహన్ లాల్ అన్నారు. అంతేకాకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'బి ఎ హీరో' అనే పేరుతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాగా.. 2015లో మోహన్‌లాల్ విశ్వశాంతి ఫౌండేషన్ స్థాపించారు. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. -
నా భార్య వల్లే ఇలా: శుభవార్త చెప్పిన క్రికెటర్
ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సిమ్రన్‌జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.పంజాబ్‌కు ఆడిన సిమికాగా సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు.అవకాశాలు లేక ఐర్లాండ్‌కు వెళ్లిఅయితే, క్రికెట్‌పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గాఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు.నా భార్య వల్లే ఇదంతా‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది. నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
మద్యంతో కాలేయం చెడితే....
కండరాలు పట్టేయడానికి చాలా కారణాలుంటాయి! నా వయసు 36 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. నిద్రలో ఇలా జరిగినప్పుడు అకస్మాత్తుగా నిద్ర లేచి కుంటుతూ నడుస్తుంటాను. కండరం మరీ బిగుసుకుపోయినప్పుడు, నొప్పి తగ్గడానికి కాస్త మసాజ్ చేసుకుంటూ ఉంటాను. ఈ సమస్యనుంచి బయట పడటానికి పరిష్కారం చెప్పండి. – కె. రాజ్‌కుమార్, హైదరాబాద్ ఇలా కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో తమ శరీరంలోని నీటి పాళ్లు తగ్గినా (సింపుల్ డీహైడ్రేషన్ వల్ల ) కూడా మీరు చెప్పిన లక్షణాలు వ్యక్తమవుతాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి ఖనిజ లవణాలు తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇంకొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో విటమిన్ బి12, విటమిన్ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్ నర్వ్స్ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్య ఏమిటన్నది కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ మద్యంతో కాలేయం చెడితే....కాపాడే చికిత్స లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్! మావారి వయసు 54 ఏళ్లు. గడచిన 25 ఏళ్లు నుంచి మద్యం అలవాటు ఉంది. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురైతే ఆసుపత్రిలో చేర్పించాం. లివర్ దెబ్బతిన్నదని చెప్పారు. తాగడం మానేయమన్నారు. లేదంటే లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయన మానలేకపోయారు. ఇటీవల తరచూ చాలా నీరసంగా ఉంటుందంటున్నారు. ఎక్కువగా నిద్రపోతున్నారు. తిండి బాగా తగ్గించారు. దీంతో మా సొంత ఊరికి వచ్చేశాం. ఇప్పటికీ సర్జరీ చేయించుకోవచ్చా? దీనితో సమస్యలు ఏవైనా ఉన్నాయా? దయచేసి వివరంగా తెలపండి. – ప్రభావతి, నంద్యాల మితిమీరిన మద్యపానం వల్ల మీ భర్త కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నది. కాలేయం తనకు నష్టం కలిగిస్తున్న అలవాట్లు, వ్యాధులను గుర్తించి, వాటిని సరిచేసుకోడానికి రోగికి చాలా అవకాశం ఇస్తుంది. మద్యపానం వంటి అలవాట్ల వల్ల దెబ్బతిన్నా, తొలిదశలో యధావిధిగా పనిచేస్తుంది. కానీ నిర్లక్ష్యం చేసినా, నష్టం కలిగించే అలవాటును మానకపోయినా హఠాత్తుగా కుప్పకూలిపోతుంది. వ్యాధుల వల్ల కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి దానిని మూడు స్థాయులుగా గుర్తిస్తారు. వాటిని ఏ, బి, సి ‘చైల్డ్ పగ్ స్టేజెస్’ అంటారు. ‘ఎ’ ఛైల్డ్ స్థాయిలోనే డాక్టర్ వద్దకు రాగలిగితే మందులతో, అలవాట్లలో మార్పులతో చికిత్స చేసి, కాలేయ పనితీరును పూర్తి సాధారణ స్థాయికి పునరుద్ధరించవచ్చు. మొదటి రెండు (ఏ, బీ ఛైల్డ్ స్టేజెస్) స్థాయుల్లోనూ చాలావరకు తిరిగి కోలుకోవడానికి కాలేయం అవకాశం ఇస్తుంది. బీ, సీ స్థాయులలో వస్తే వ్యాధి తీవ్రత, వ్యక్తి తట్టుకోగల శక్తిని అంచనావేసి, కాలేయమార్పిడి చికిత్సను సిఫార్సు చేస్తారు. మీరు తెలిపిన వివరాలు, లక్షణాల ప్రకారం రెండేళ్ల క్రితమే మీ భర్త కాలేయ వ్యాధి ‘బి’ స్థాయికి చేరుకున్నది. మద్యం మానలేకపోవడం వల్ల అది చివరిదశ ప్రారంభంలోకి ప్రవేశించినట్లు ఉన్నది. ఇప్పుడు మద్యం పూర్తిగా మానివేయడంతో పాటు కాలేయ మార్పిడి ఒక్కటే ఆయనను కాపాడగలదు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ గూర్చి మీరు ఆందోళన పడాల్సిన పనిలేదు. కాలేయ వ్యాధుల చికిత్స ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో ఆధునికత సంతరించుకుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, శక్తిమంతమైన మందులు, కచ్చితమైన శస్త్రచికిత్సలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు అత్యధిక శాతం విజయవంతమవుతుండటం వల్ల కాలేయ వ్యాధుల సక్సెస్రేట్పై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి మీరు ఆందోళన పడకుండా మరోసారి మీ డాక్టర్‌ను కలిసి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడండి. ఇప్పుడు మన దగ్గర ఈ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స గతంలో మాదిరిగా ఖరీదైనదేమీ కాదు. మీరు దగ్గర్లోని అన్ని వసతులు ఉండే అన్ని సౌకర్యాలు గల పెద్ద ఆసుపత్రికి వెళ్లి, అక్కడి డాక్టర్లు సూచించిన విధంగా మీవారికి నిరభ్యంతరంగా, నిర్భయంగా శస్త్ర చికిత్స చేయించవచ్చు. డాక్టర్ పి.బాల చంద్రన్ మీనన్ సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్