
విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘సార్ మేడమ్’.పాండిరాజ్ దర్శకత్వంలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.
పెళ్లికి ముందు ఓ అమ్మాయికి మెట్టినింటి వాళ్లు చెప్పే మాటలతో మొదలయ్యే టీజర్ భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ గొడవతో సాగుతుంది. టీజర్ ప్రారంభంలో వంట మాస్టర్‌లా కనిపించిన విజయ్ సేతుపతి చివర్లో గన్ పట్టుకొని మాస్ యాక్షన్ లుక్‌లో కనిపించారు. ‘‘రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విజయ్, నిత్యల నటన హైలెట్‌గా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.