
శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఆధ్వర్యంలో జార్ఖండ్‌లో రెండు కంటి శస్త్రచికిత్స శిబిరాలు విజయవంతంగా నిర్వహించారు. గిరిధీహ్ జిల్లాలోని బొగ్గు , మైకా తవ్వకాల మధ్యన , గ్రామీణ ప్రాంతమైన గాండాలే ఈ శిబిరం గురించి అవగాహన కల్పించారు. ఉచిత కంటిదృష్టి పరీక్షలు , ముత్యబిందు శస్త్రచికిత్సలు నిర్వహించారు.
దేశంలోని అత్యంత వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లో ఉన్న రోగులకు నాణ్యమైన కంటి వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో, అనుభవజ్ఞులైన వైద్యులు ,సహాయక సిబ్బందిని బస్సుల ద్వారా అక్కడికి పంపించాలన్న ఆలోచనతో గొప్ప శంకర నేత్రాలయ స్థాపకుడు పద్మభూషణ్ డా. ఎస్.ఎస్. బద్రినాథ్ దూరదృష్టిని చూపించారు. ఆసుపత్రులకు చేరలేని ఆర్థికంగా బలహీనమైన గ్రామీణ ప్రజలకు, తమ స్వగ్రామంలోనే, ప్రయాణం లేకుండా, ఉచితంగా ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సా సదుపాయాలు ఎమ్ఈఎస్‌యూలు అందిస్తున్నాయి.

వీల్‌పై ఆపరేషన్ థియేటర్ అనే వినూత్న ఆవిష్కరణ ద్వారా, అన్నివిధాలా అవసరమైన సాంకేతిక సామగ్రితో కూడిన శస్త్రచికిత్సలు ఎంతో అవసరమైన వారికీ అద్దెనైనా లేకుండా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది కేవలం వైద్యసేవ మాత్రమే కాదు-ఇది ఒక జీవితాంతం గుర్తుండిపోయే దాతృత్వం అని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని ఎన్‌ఆర్‌ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
ముగింపు రోజు, అన్ని SN సిబ్బంది, స్కూల్ టీచర్స్, వాలంటీర్‌లకు గుర్తింపు ప్రదానం చేశారు. పిల్లల పాఠశాల వారు క్యాంప్ స్క్రీనింగ్ నిర్వహించేందుకు , 9 రోజులు క్యాంప్‌కు ప్రదేశం అందజేసేందుకు సహాయం చేసినందుకు బాక్సా ట్రస్ట్ RO వాటర్ ఫిల్టరింగ్ సిస్టమ్‌ను పాఠశాలలో ఏర్పాటు చేశారు. శంకర నేత్రాలయ స్పాన్సర్లు కన్నన్ వెంకటేశ్వర్ (MESU జార్ఖండ్ క్యాంప్ #113), స్వర్నిమ్ కనత్ , కార్టీక్ రామకృష్ణన్ (MESU జార్ఖండ్ క్యాంప్ #114), మరియు స్థానిక ప్రాయోజకుడు బాక్సా ట్రస్ట్ వారు ఈ రెండు MESU క్యాంప్‌లు #113 మరియు #114లో వారి సేవలను అందించి, గ్రామీణ భారతదేశంలో కంటి అనారోగ్యాన్ని నివారించడానికి మరొక అడుగు ముందుకేశారు.

బాల రెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ చైర్మన్ డాక్టర్ ఎస్. సురేంద్రన్, అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు, జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు కౌశిక్ అదికారి, ఉజ్జల్ సిన్హా మరియు సంకర నేత్రాలయ USA వ్యవస్థాపకుడు శ్రీ SV ఆచార్య, EVP శ్యామ్ అప్పలి, సెక్రటరీ వంశీ ఎరువరం, ట్రస్టీ మెహర్ లంకా వారి మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు గారికి ఈ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాధాలు తెలియజేశారు.