మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం | Nats Free Medical Camp in Missouri | Sakshi
Sakshi News home page

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

May 5 2025 4:26 PM | Updated on May 5 2025 4:55 PM

Nats Free Medical Camp in Missouri


అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్‌లోని మహాత్మగాంధీ సెంటర్‌లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. 

ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్  శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్  సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.

మరిన్ని  ఎన్‌ఆర్‌ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement