breaking news
bjp
-
నా ఖాతాలు బ్లాక్ చేయడం కాంగ్రెస్ కుట్ర: వర్షిత్
నల్లగొండ: బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ఖాతాలు కూడా బ్లాక్ అయినట్లు ఆయన తెలిపారు.ఇటీవల నల్లగొండలో మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడి ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై వర్షిత్ రెడ్డి సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు పోస్టు చేశారు. ఈ వీడియోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.దీంతో తన సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ అయ్యాయని వర్షిత్ రెడ్డి పేర్కొన్నారు. తన తల్లిపై దాడి జరిగిన నేపథ్యంలోనే ఆ ఘటనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ఆయన తెలిపారు.తన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడం వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని వర్షిత్ రెడ్డి ఆరోపించారు. అయితే, ఖాతాలు బ్లాక్ కావడానికి గల కారణాలపై సంబంధిత సోషల్ మీడియా సంస్థల నుంచి అధికారికంగా ఎలాంటి వివరాలు ఇంకా తెలియరాలేదు.ఇదీ చదవండి: 56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ? -
బ్రిక్స్‌తో మనకు లాభాలున్నాయండోయ్..!
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో మన దేశానికి పెద్దగా ఒరిగేదేం లేదని.. ఒకవేళ నిజంగా ప్రయోజనం ఉంటే అదేంటో చెప్పాలని కేంద్రానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సవాల్ విసిరారు. అయితే దీనికి బీజేపీ తీవ్రంగా స్పందించింది. అదే టైంలో.. కాంగ్రెస్ నుంచే కౌంటర్ రియాక్షన్ వచ్చింది. చిదంబరం వేసిన ప్రశ్నలకు సొంత పార్టీకే చెందిన మరో సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బదులిచ్చారు. ఆ ప్రయోజనాలు ఇవేనంటూ వివరించారు. ఈ వేదిక భారత్ దౌత్యపరమైన ప్రభావాన్ని, ప్రపంచ దేశాలను ఒకే వేదికపైకి తీసుకురాగల సామర్థ్యాన్ని చాటుతుందని పేర్కొన్నారు.‘గ్లోబల్ సౌత్‌కు కీలక వేదిక’ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ముందు మాట్లాడిన థరూర్.. గ్లోబల్ సౌత్‌కు బ్రిక్స్ ఒక ముఖ్యమైన వేదిక అని చెప్పారు. విస్తరించిన బ్రిక్స్‌లో 11 దేశాలు ఉన్నాయని, ఇవి ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయని వివరించారు. ఇలాంటి దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడం చిన్న విషయం కాదన్నారు.‘ప్రపంచ వేదికపై భారత్ దౌత్య బలం’బ్రిక్స్ సదస్సుకు పలువురు దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు హాజరవుతుండటం భారత్‌కు ప్రతిష్టాత్మక విషయమని థరూర్ అన్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ ‘డిప్లొమాటిక్ కన్వీనింగ్ పవర్’ను చూపిస్తుందని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్‌లో అన్నీ సానుకూల అంశాలే లేవని కూడా స్పష్టం చేశారు.ఇదీ సవాల్.. ఏకాభిప్రాయం కష్టమే!విభిన్న దేశాలు, విభిన్న ప్రయోజనాలు ఉన్నందున కీలక అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయం సాధించడం బ్రిక్స్‌లో పెద్ద సవాలని థరూర్ అన్నారు. మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఇరాన్-యూఏఈ మధ్య విభేదాల కారణంగా ఉమ్మడి ప్రకటన వెలువడలేదని గుర్తుచేశారు. దీంతో భారత్ చైర్ ప్రకటనతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా సదస్సులోనూ అలాంటి పరిస్థితి వస్తే అది బ్రిక్స్ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశం ఉందన్నారు.చిదంబరం ఏమన్నారు?ఇటీవల చిదంబరం మాట్లాడుతూ.. గత రెండు, మూడు బ్రిక్స్ సదస్సుల నుంచి భారత్‌కు వచ్చిన స్పష్టమైన ప్రయోజనాలు తనకు కనిపించలేదన్నారు. బ్రిక్స్‌తో పాటు ఎస్సీఓ, జీ20, క్వాడ్‌లో భారత్ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. వాటి నుంచి దేశానికి వస్తున్న స్పష్టమైన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.వాణిజ్య లోటుపైనా థరూర్ ఆందోళనమరోవైపు బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్యం పెరుగుతున్నప్పటికీ.. అది పూర్తిగా భారత్‌కు అనుకూలంగా లేదని థరూర్ అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు తగ్గుతుండగా.. దిగుమతులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. అంటే బ్రిక్స్ వేదిక భారత్‌కు దౌత్యపరంగా ప్రాధాన్యమైనదే అయినప్పటికీ.. వాణిజ్యపరంగా మరింత సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందన్నది థరూర్ వ్యాఖ్యల సారాంశం.ఇదీ చదవండి: పార్టీ కంటే పిల్లనిచ్చిన మామే ఎక్కువయ్యాడా? -
జనసేన, బీజేపీ సిగ్గుపడాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ జరగాలి.. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వినిపించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. స్కామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెట్టారు.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అర్హత లేని వారికి ఎవరు చెబితే పోస్టులు ఇచ్చారు?. టెట్ అర్హత లేకుండా పోస్టులు ఇచ్చామని ఒప్పుకున్నారు. స్పోర్ట్ సర్టిఫికెట్లు నిఖార్సయినవి కావని చెప్పలేకపోయారు. జూడో పోటీల్లో దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. లంచాలు తీసుకుని స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఏడుసార్లు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కూడా బోగస్సే. అసలు ఏ పరీక్ష లేకుండా ఉద్యోగాలివ్వడమే పెద్ద స్కాం....ఏపీపీఎస్సీలోనూ పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని చూశారు. దొడ్డిదారిన జీవో నెంబర్ 4 తేవాలని చూశారు. మా హయాంలో క్లియరెన్స్ పొందిన 814 పోస్టుల్లో.. పరీక్ష లేకుండా 40 పోస్టులు ఇవ్వాలని చూశారు. డీఎస్సీ స్కాం బయటకు రావడంతో ఆగిపోయారుచంద్రబాబు, లోకేశ్‌లు వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఆయన దగ్గర పని చేసే అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా?. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం. నిరుద్యోగ యువత కోసం కోర్టులోనూ పోరాడుతున్నాం అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు తగులుతాయి అంటూ డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యపైనా వైఎస్ జగన్ స్పందించారు. లోకేశ్, ఆయన తండ్రి చంద్రబాబు చెప్పే సమాధానాలు కూడా అబద్ధాల రూపంలోనే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. డీఎస్సీ స్కామ్‌పై ఇంతరాద్ధాంతం జరుగుతుంటే.. బీజేపీ, జనసేన మౌనంగా ఉండడంపై వైఎస్ జగన్ స్పందించారు. జగన్ అడిగే అంశం సరైందే అయినప్పుడు నోరు మెదపాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉంటుందని అన్నారు. బీజేపీ, జనసేన స్పందించకపోవడంపై వాళ్లనే అడగాలని మీడియాకు సూచించారు. ఇలాంటి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నందుకు.. ఇలాంటి వ్యవస్థను బలపరుస్తూ తప్పుచేసుకున్నందుకు వాళ్లు సిగ్గుపడాలని వైఎస్ జగన్ అన్నారు. -
బెంగాల్ రాజకీయాల్లో కొత్త సస్పెన్స్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి.. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం.. టీఎంసీలో చీలిక.. ఇలా వరుస ఎదురుదెబ్బలతో మమతా బెనర్జీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని అంతా భావిస్తున్న వేళ.. ఆమెకు అనూహ్యంగా మరో అవకాశం తలుపుతట్టింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇప్పుడు బెంగాల్లో కొత్త సస్పెన్స్‌కు తెరతీశాయి. రెండు స్థానాల్లో ఏదైనా ఒకదాని నుంచి దీదీ బరిలోకి దిగి.. మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.మమతా బెనర్జీ అసెంబ్లీలో ఉంటే బీజేపీ, ఇతర ప్రతిపక్షాలను నేరుగా ఎదుర్కోవడంతోపాటు ప్రజా సమస్యలను మరింత బలంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెను నందిగ్రామ్ లేదంటే రిజినగర్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన పార్టీలో మొదలైనట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో బలపడటం, టీఎంసీలో చీలికలు–ఫిరాయింపులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మమత స్వయంగా అసెంబ్లీలోకి రావడం పార్టీకి రాజకీయంగా కీలకమని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే..2026 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన సువేందు అధికారి, హుమాయున్ కబీర్ చెరో స్థానానికి రాజీనామా చేయడంతో నందిగ్రామ్, రిజినగర్ అసెంబ్లీ సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల్లో నందిగ్రామ్ మమతకు కొంత అనుకూలమైన ఎంపికగా కనిపిస్తోంది. 2021 ఎన్నికల్లో ఇక్కడ సువేందు అధికారి చేతిలో మమత 1,956 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ సువేందు అధికారి టీఎంసీ అభ్యర్థిపై 9,665 ఓట్ల మెజారిటీ సాధించారు. అయినప్పటికీ మమత స్వయంగా బరిలోకి దిగితే పోటీ స్వరూపం మారే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు ముర్షిదాబాద్ జిల్లాలోని రిజినగర్లో ముస్లిం ఓటర్లు సుమారు 65 శాతం ఉన్నారు. ఈ సామాజిక సమీకరణం మమతకు అనుకూలంగా మారొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు ఉన్న పాత రాజకీయ బలం దృష్ట్యా రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని టీఎంసీలోని కొందరు నేతలు సూచిస్తున్నారు.ఈసీ షెడ్యూల్ ప్రకారం బుధవారం (సెప్టెంబర్ 9) ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ కాగా.. సెప్టెంబర్ 17న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుగుతుంది. సెప్టెంబర్ 19 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 6న నందిగ్రామ్, రిజినగర్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.మరో సస్పెన్స్!ఇదిలా ఉండగా, ఉప ఎన్నికల్లో టీఎంసీకి అసలైన గుర్తు(గడ్డి కాడపై రెండు పూలు) దక్కుతుందా? అన్నది మరో కీలక ప్రశ్నగా మారింది. పార్టీ నుంచి విడిపోయిన రితబ్రత బెనర్జీ వర్గం తామే అసలైన టీఎంసీ అని ఇప్పటికే కోర్టుకెక్కింది. అటు ఎన్నికల సంఘంలోనూ అభ్యర్థన దాఖలు చేసుకుంది. అంతేకాదు ఆ రెండు స్థానాల్లోనూ తమ అభ్యర్థులు పోటీ చేస్తారని, పార్టీ గుర్తు తమకే వస్తుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే మమతా బెనర్జీ ప్రజల్లోనే ఉన్నారని, ఆమె తరఫున అభ్యర్థి తప్పకుండా పోటీ చేస్తారని టీఎంసీ నేత కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ కూడా రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. మమత రెండు చోట్ల పోటీ చేసినా మరోసారి ఓడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేత సజల్ ఘోష్ వ్యాఖ్యానించారు. దీంతో ఉప ఎన్నికలు కేవలం రెండు స్థానాల పోరుగా కాకుండా.. మమతా బెనర్జీ రాజకీయంగా మళ్లీ అసెంబ్లీలోకి వస్తారా? టీఎంసీపై ఆమె పట్టు ఎంతవరకు ఉంది? పార్టీ గుర్తు ఎవరికి దక్కుతుంది? అనే మూడు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పే ఎన్నికలుగా మారే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: పేరుతోనే అసలు విషయం చెప్పేసిన విజయ్ -
పూనావాలా ‘అంకుల్’ నా జోలికి రావొద్దు.. రియా కౌంటర్
న్యూఢిల్లీ: నీట్ లీకేజీ ఆందోళనల్లో వర్షంలో పోలీస్ వ్యాన్‌ను అరచేతితో అడ్డుకుని రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన రియా అహిర్, ఇటీవల ‘బిగ్ బాస్ 20’షోలోకి అడుగుపెట్టలేకపోవడం చర్చాంశనీయంగా మారింది. షో నిర్వాహకులు రియా అహిర్, పంజాబీ నటి లవ్ గిల్ మధ్య నిర్వహించిన ఆడియన్స్ పోలింగ్‌లో లవ్ గిల్ విజయం సాధించడంతో రియా అవకాశాన్ని కోల్పోయారు.హీరో, విలన్ కొట్టుకుని కమెడియన్‌ను చంపేసినట్లు.. ఒకవైపు పూనావాలా, రాహుల్ గాంధీల మధ్య రాజకీయం నడుస్తుంటే, ఈ గొడవలో బిగ్ బాస్ ఛాన్స్ మిస్సయ్యి రియా అహిర్ బలైపోయారనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తోందిఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, రాజకీయ విశ్లేషకుడు షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆందోళనల ద్వారా రియా వైరల్ కావడం యాదృచ్ఛికం కాదని, దాని వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ, రాజ్ థాకరే వంటి నేతల మద్దతుతో మోదీ వ్యతిరేక ఎజెండాను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకెళ్లాలని ఆమె ప్లాన్ చేశారు. అయితే, 99 ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్‌కు విజయం అందించలేని రాహుల్ గాంధీ మీకు ఆన్లైన్ మద్దతు ఎలా ఇవ్వగలరు?’ అని పూనావాలా ఎద్దేవా చేశారు.పూనావాలా విమర్శలపై రియా అహిర్ రెండు వీడియోల ద్వారా ఘాటుగా స్పందించారు. పూనావాలాను ‘అంకుల్’ అని సంబోధిస్తూ, తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు. చిన్న వయసున్న అమ్మాయిలను టార్గెట్ చేయడం మాని, తన ఈడువారితో రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు వాడే పాత, డొల్ల స్క్రిప్ట్ లాంటివేనని ఎద్దేవా చేశారు.తాను భారత సైన్యాన్ని కానీ, ఏ ఇతర వ్యవస్థను కానీ ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు. బిగ్ బాస్ లాంటి ఎంటర్టైన్మెంట్ షోలలోకి రాజకీయాలు, మతాలను లాగడం సరైనది కాదని హితవు పలికారు. ప్రస్తుతం ఈ పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ వార్ నెట్టింట వైరల్ అవుతోంది.👉ఇదీ చదవండి : మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా? -
కాంగ్రెస్‌కు మిత్రపక్షం నుంచే ఘాటు కౌంటర్
ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకాలం ఎన్నికలు.. సీట్ల పంపిణీ కారణం కాగా.. ఈసారి కాంగ్రెస్–నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మరో కారణం మాటల యుద్ధానికి దారి తీసింది. ఇదే అదనుగా బీజేపీ రంగంలోకి దిగి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘వందేమాతరం’ చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు కూటమి మిత్రపక్షాల మధ్య రాజకీయ పోరుగా మారింది.జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం జరిగిన తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో జాతీయ గీతం ‘జనగణమన’కు ముందు ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలు మొత్తం గీతం పూర్తయ్యే వరకు గౌరవంగా నిలబడ్డారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్–ఎన్సీ రెండూ ఇండియా కూటమిలో భాగస్వాములే కావడంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.‘పూర్తి గీతం మా వైఖరికి విరుద్ధం’శ్రీనగర్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘వందేమాతరం’ పూర్తి రూపం స్వాతంత్య్ర సమరయోధులు కోరుకున్నదానికి అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 1937లో ఆమోదించిన రూపాన్నే పాటించాలని, మిత్రపక్షాలు కూడా ఆ నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్ తదితర స్వాతంత్య్ర సమరయోధుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వేణుగోపాల్ పేర్కొన్నారు. మతపరమైన విభేదాలకు తావులేకుండా ఉండేందుకే కాంగ్రెస్ రెండు చరణాల రూపాన్ని అనుసరిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే దీనికి ఎన్సీ ఘాటుగా స్పందించింది.అంతమాత్రాన ఆదేశిస్తారా?కేసీ వేణుగోపాల్ ట్వీట్‌కు ఎన్సీ నేత బషీర్ అహ్మద్ బదులిచ్చారు. మిత్రపక్షంగా ఉన్న తమను ఏం పాడాలి, ఎంతవరకు పాడాలి అని కాంగ్రెస్ నిర్దేశించలేదని స్పష్టం చేశారు. ‘‘ఆయనకు తన అభిప్రాయాన్ని ‘ఎక్స్’లో వెల్లడించే హక్కు ఉంది. అయితే దాన్ని మిత్రపక్షాలపై విధించలేరు. ప్రజలపై ఏదైనా విషయాన్ని బలవంతంగా రుద్దడాన్ని మేం వ్యతిరేకిస్తాం అని స్పష్టం చేశారు.‘నాగ్‌పూర్ ఆదేశాలు పాటించొద్దు’ఎన్సీ స్పందనతో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలు ఇండియా కూటమిలో భాగస్వాములని గుర్తుచేసిన కాంగ్రెస్ నేతలు.. కూటమి నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. నాగ్‌పూర్ అంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయాలను అనుసరించవద్దంటూ ఎన్సీ నేతలపై విమర్శలు చేశారు.కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడిఈ వివాదాన్ని బీజేపీ కూడా అందిపుచ్చుకుంది. పూర్తి ‘వందేమాతరం’పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీని 21వ శతాబ్దపు ‘ముస్లిం లీగ్’గా మార్చిందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్ ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. మరో బీజేపీ నేత ఆర్ఎస్ పఠానియా కూడా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కశ్మీర్లో వేర్పాటువాదులు సైతం ‘వందేమాతరం’పై అభ్యంతరం వ్యక్తం చేయలేదని వ్యాఖ్యానించారు.కూటమిలో కొత్త రగడ?ఒకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ‘వందేమాతరం’ విషయంలో భిన్న వైఖరులు తీసుకోవడం ఇండియా కూటమి అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. శ్రీనగర్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటుచేసుకున్న ఈ పరిణామం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది.రెండు చరణాలకే కాంగ్రెస్ కట్టుబాటు‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో రెండు చరణాల రూపాన్నే ఆలపించాలని గత నెలలో సీడబ్ల్యూసీ నిర్ణయించింది. పూర్తి గీతం విషయంలో బీజేపీ విమర్శలు పెరగడంతో ఈ నిర్ణయం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు కేంద్రం కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, అధికారిక వేడుకల్లో పూర్తి ‘వందేమాతరం’ను ఆలపించే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉండగా.. అదే ఇండియా కూటమిలోని ఎన్సీ నేతలు శ్రీనగర్‌లో పూర్తి గీతానికి నిలబడటం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సర్ప్రైజ్!! బీజేపీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? -
బీజేపీ ఖజానాలో భారీ పెరుగుదల.. వివరాలివే..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కేంద్ర కార్యాలయానికి మొత్తం రూ.1,472.8 కోట్ల నిధులు అందాయి. ఎన్నికల అనంతరం పార్టీ ముగింపు నిల్వ రూ.7,627.2 కోట్లకు చేరింది. మార్చి 15, 2026న ఉన్న రూ.6,722.6 కోట్లతో పోలిస్తే ఇది రూ.904.6 కోట్ల పెరుగుదల. ఈ వివరాలను బీజేపీ.. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల వ్యయ, నిధుల నివేదికలో వెల్లడించింది.రూ.160 కోట్ల ఎన్నికల వ్యయంఅస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేంద్ర కార్యాలయంతో పాటు ఆయా రాష్ట్ర, జిల్లా విభాగాలను కలిపి మొత్తం రూ.160 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో అస్సాంలో రూ.96.3 కోట్లు, తమిళనాడులో రూ.51.6 కోట్లు, పుదుచ్చేరిలో రూ.11.9 కోట్లు వ్యయమయ్యాయి. ఈ ఎన్నికల్లో సాధారణ ప్రచారానికి పార్టీ సుమారు రూ.130.4 కోట్లు ఖర్చు చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికలకు సంబంధించిన వ్యయ వివరాలను మాత్రం ఎన్నికల సంఘం ఇంకా బహిర్గతం చేయలేదు.అస్సాంలో అధిక వ్యయంఅస్సాంలో బీజేపీ సాధారణ ఎన్నికల ప్రచారానికి రూ.76.7 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో కేంద్ర పార్టీ విభాగం రూ.23.1 కోట్లు, అభ్యర్థులపై రూ.19.5 కోట్లు వ్యయం చేసినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణాలకు రూ.27.3 కోట్లు, ప్రకటనలకు రూ.37 కోట్లు, ప్రచార సామగ్రికి రూ.8.9 కోట్లు, రాష్ట్ర విభాగం ఇతర ఖర్చులకు రూ.2.3 కోట్లు ఖర్చయ్యాయి. అభ్యర్థులకు మొత్తం రూ.19.4 కోట్లు చెల్లించగా, వారి నేర చరిత్ర ప్రచురణకు రూ.16.7 లక్షలు వెచ్చించారు.తమిళనాడులో రూ.51.6 కోట్లుతమిళనాడులో బీజేపీ మొత్తం రూ.51.6 కోట్లు ఖర్చు చేసింది. సాధారణ ఎన్నికల ప్రచారానికి రూ.44.5 కోట్లు, అభ్యర్థులపై సుమారు రూ.7 కోట్లు వ్యయమయ్యాయి. పుదుచ్చేరిలో మొత్తం ఎన్నికల వ్యయం రూ.11.9 కోట్లుగా నమోదైంది. ఇదిలా ఉండగా ఇదే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ గతంలో సమర్పించిన వ్యయ వివరాల్లో మొత్తం రూ.248.6 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.ఇది కూడా చదవండి: ముగ్గురు సన్నిహితులకు ట్రంప్ భారీ నజరానా! -
అభివృద్ధిని చూడలేని నారాజ్ మామ
వడోదర: ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ విషయంలో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా చూడలేక విమర్శకులు నిత్యం అసంతృప్తి చెందుతూ అలిగిన మామ(నారాజ్ ఫుఫా) లాగా ఫిర్యాదులు చేస్తూ, లేనిపోని సమస్యలను సృష్టిస్తారని అన్నారు. అలాగే ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగిస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. రాహుల్ నిర్వహిస్తున్న ఛాత్రోంకీ గూంజ్(విద్యార్థుల ప్రతిధ్వని) సభలను ఝూట్ కీ గూంజ్(అబద్ధాల ప్రతిధ్వని)గా కొట్టిపారేశారు. మోదీ మంగళవారం గుజరాత్లో పర్యటించారు. వడోదరలో ‘నమో ఫర్ వికసిత్ భారత్’కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.35,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. నవీ ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీని అనుసంధానించే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని మూడు కీలక సెక్షన్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వం వేగంగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు నత్తనడకలా సాగేవని ఆక్షేపించారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. తప్పులు వెతకడమే వారి పని ‘‘తప్పులు వెతకడమే ప్రతిపక్షాల పనిగా మారింది. కొత్తగా ప్రారంభించిన ఫ్రైట్ కారిడార్ వంటి ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోనూ ఎల్లప్పుడూ తప్పులు వెతుకుతారు. ముంబై ఓడరేవు నుంచి వడోదరకు ఇటీవల డబుల్–స్టాక్ కంటైనర్ సరుకు రవాణా రైలును నడిపించాం. దీనివల్ల ఒకే ప్రయాణంలో 250కి పైగా ట్రక్కులకు సమానమైన సరుకును ఆ రెండు నగరాల మధ్య రవాణా చేయగలిగాం. ఇప్పుడు నారాజ్ ఫుఫాజీ (అలిగిన మామగారు) నోటికి పని చెబుతారు. డబుల్–స్టాక్ కంటైనర్ రైళ్లు వస్తే ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ఏంటి? ట్రక్కులు ఎక్కడికి వెళ్తాయి? ప్రజలు కొనుగోలు చేసిన ట్రక్కుల మాటేంటి? అని ప్రశ్నిస్తారు. విమర్శలు చేయడానికి ఫుఫాజీకి ఇప్పుడు కొత్త విషయం దొరికింది. రవాణా కారిడార్‌పైనా వారికి సందేహాలు వస్తాయి. దేశ పురోగతికి వ్యతిరేకంగా విమర్శలు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకైనా వెళ్తాయి. ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి వారికి ఏదో ఒక సాకు కావాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్‌తో పోలిస్తే ఎన్డీయే పదేళ్ల పాలనలో ఆధునీకరణ వేగంగా జరిగింది. 2014 తర్వాత 50,000 ఆధునిక రైలు బోగీలను నిర్మించాం. గత ప్రభుత్వం పదేళ్లలో కనీసం 50,000 మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయింది. రాజకీయ ప్రసంగాల కంటే వాస్తవికతకే యువత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిపక్షాలు విసిరే వలకు చిక్కొద్దు. రాజకీయ తప్పుదారి పట్టించే చర్యలకు గురికావొద్దు. అబద్ధాలతో అడుగడుగునా తప్పుదోవ పట్టించేవారు కనిపిస్తారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. నేటి యువత సత్యం వైపే నిలబడుతుంది. సౌర, పవన, జల, అణు శక్తి వంటి రంగాల్లో ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్ధితో పనిచేస్తోందో యువతకు తెలుసు’’ అని మోదీ అన్నారు.ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ‘‘దేశంలో లక్షలాది మంది యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రతి ఏటా మన కుటుంబాల ఆదాయంలో చాలాభాగం కోచింగ్‌ల కోసమే ఖర్చవుతోంది. అందుకే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే మా లక్ష్యం’’ అని మోదీ స్పష్టం చేశారు. ‘నమో కమలం’ ప్రారంభం దక్షిణ గుజరాత్‌లోని నవసారి పట్టణంలో బీజేపీ నూతన కార్యాలయం ‘నమో కమలం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అధికార పార్టీకి ఉన్న అధికారం, పదవులు, సంస్థాగత బలం పూర్తిగా ప్రజాసేవ కోసమేనని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. బీజేపీలో సాధారణ క్షేత్రస్థాయి కార్యకర్త కూడా ఎప్పుడూ అధికార మదంతో విర్రవీగలేదని అన్నారు. తమ కార్యకర్తలు ప్రజాసేవకు కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. తమ దృష్టిలో అధికారం కేవలం సేవాభావం కోసమేనని తెలిపారు. -
యూపీ ఎన్నికల వేళ అఖిలేశ్ పార్టీలో ఖతర్నాక్ చేంజ్
లక్నో (ఉత్తరప్రదేశ్): సమాజ్‌వాదీ పార్టీ తన విద్యార్థి విభాగమైన సమాజ్‌వాదీ పార్టీ ఛాత్ర సభ దుస్తుల విధానాన్ని మార్చింది. ఇంతవరకు ఉన్న సంప్రదాయ ఎరుపు రంగుకు బదులుగా నీలిరంగు జీన్స్, నీలిరంగు టీషర్టులను కొత్త దుస్తులుగా నిర్ణయించింది.దళిత ఓటర్లు, యువతకు చేరువ కావాలనే ప్రయత్నంలో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. 2027 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం లక్నోలో జరుగుతున్న ఛాత్ర సభ సదస్సులో కొత్త దుస్తుల విధానం కనిపించింది. పార్టీ పదాధికారులు, కార్యకర్తలు కొత్త నీలిరంగు దుస్తులతో హాజరయ్యారు.ఈ మార్పును కేవలం సంస్థాగత నిర్ణయంగా కాకుండా దళిత యువతలో పార్టీకి ఆదరణ పెంచే రాజకీయ వ్యూహంగా కూడా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రంగులకు సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రాధాన్యం ఉంది. నీలిరంగు దళిత రాజకీయాలు, బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతంతో ముడిపడి ఉంది. సమాజ్‌వాదీ పార్టీ సంప్రదాయంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో గుర్తింపు పొందింది.ఇది రాజకీయ సందేశం! ఈ నేపథ్యంలో విద్యార్థి విభాగానికి నీలిరంగును ప్రధాన రంగుగా మార్చడం రాజకీయ సందేశాన్ని ఇస్తున్న చర్యగా భావిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తన సంప్రదాయ యాదవ్-ముస్లిం మద్దతు వర్గాలకు మించి దళిత ఓటర్లను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది.పార్టీ ప్రతిపాదించిన పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సమీకరణ సూత్రానికి 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాజకీయ ప్రాధాన్యం లభించింది. రాబోయే ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో, యువ ఓటర్లను సమీకరించే ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దుస్తుల మార్పు సమయానికి కూడా రాజకీయ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు.ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీలో 403 మంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు. వీరిలో 258 మంది భారతీయ జనతా పార్టీకి, 107 మంది సమాజ్‌వాదీ పార్టీకి, 13 మంది అప్నా దళ్‌కు చెందినవారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ ఉత్తర్‌ప్రదేశ్‌లో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. 2027 ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది. -
అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు కేవలం బిల్లులు, ప్రశ్నోత్తరాలకే పరిమితం కాకుండా వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై అధికార–ప్రతిపక్షాల మధ్య హోరాహోరీకి వేదికగా మారే అవకాశముంది. ఒకవైపు ప్రభుత్వం తన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టులు, నియోజకవర్గాల అభివృద్ధిని ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలు ప్రజా సమస్యలు, ఎన్నికల హామీలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఫీజు బకాయిలు, భూ వివాదాలు, జలవనరుల అంశాలతో సర్కారును ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది తొలిరోజు స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో ఖరారు కానుంది. నాలుగైదు పనిదినాలకే సమావేశాలు పరిమితమయ్యే అవకాశముంది. కాంగ్రెస్ అ్రస్తాలేంటి? అధికార కాంగ్రెస్ ప్రతిపక్షంపై, ప్రధానంగా ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరుకాకపోవడంపై ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడమేకాక.. ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. తమ వెయ్యిరోజుల పాలన, బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై గణాంకాలతో చర్చించడానికి సిద్ధమని సవాల్ విసురుతోంది. బీఆర్ఎస్ హయాంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, వాటిని చక్కదిద్దుతున్నామని ఎదురుదాడి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యాల పేరిట బీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. విపక్షాల అ్రస్తాలివీ... కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను కేంద్రంగా చేసుకుని బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే చార్జిïÙట్ను విడుదల చేశాయి. రేవంత్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు, రైతు రుణమాఫీ, ఎరువుల కొరత, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుపై బీఆర్ఎస్ ఇప్పటికే క్షేత్ర స్థాయిలో నిలదీస్తోంది. ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సంక్షేమ పథకాలు, సాగునీరు, కృష్ణా–గోదావరి జలాల అంశాలను ఆ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అసెంబ్లీ వేదికగా వీటిపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసుకుంది. బీజేపీ కూడా 22ఏ జీవో, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుంది. తాజాగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నిరసన, అరెస్టు నేపథ్యంలో ఈ అంశం సభలో మరింత వేడెక్కే అవకాశం ఉంది. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, కల్యాణలక్ష్మి నిధుల విడుదలలో జాప్యం, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, యూరియా కొరత, రైతుల ఇబ్బందులు కూడా అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌తోపాటు వివిధ రూపాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఏయే బిల్లులంటే... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) బిల్లు ఈ సమావేశాల్లో కీలకంగా మారనుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని పట్టణ ప్రాంతాల పాలనను సమగ్రంగా మార్చే ఉద్దేశంతో ఈ బిల్లును తేనున్నారు. అయితే ఆస్తి పన్ను, భూములు–భవనాల విలువ నిర్ధారణ వంటి అంశాలపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు హేట్ స్పీచ్, హేట్ క్రైమ్స్ నిరోధక బిల్లు కూడా చర్చకు రావచ్చు. అలాగే, చట్టసభల ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశముంది. 22ఏపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేలా పూర్తి వివరాలతో అధికారపక్షం సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. -
22ఏపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చిన భూములపై వెంటనే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, అధికారుల ప్రమేయంతో జరిగిన మార్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయి అవినీతికి, భూమాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రైవేట్, ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగా 22ఏ జాబితాలో పెట్టి, రెవెన్యూ శాఖను వ్యాపార సంస్థగా మార్చేశారని మండిపడ్డారు. తన కుటుంబ సంస్థల పేరిట ఉన్న రూ. 15 వేల కోట్ల ఆస్తులపై తన ప్రశ్నలకు బదులు ఇవ్వలేక పారిపోయిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద... భూభారతి– 22ఏ ద్వారా రైతుల భూములను అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ‘భూభారతి, 22ఏపై మహాధర్నా’ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ప్రారంభించారు. ఏలేటి, ఎంపీ ఈటల రాజేందర్, ఇతరనేతలు ఒకరోజు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక భూ భారతి పేరుతో గతంలోని దోపిడీ, అవినీతి కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలను 22ఏలో పెట్టి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిగ్గు లేకుండా మంత్రులే ఆదివారం ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తామంటున్నారని ఎద్దేవాచేశారు. బీజేపీ రెండురోజుల ధర్నాకు పరి్మషన్ ఇవ్వకుండా ఆదివారం ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పిక్నిక్, దావత్ చేసుకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలోని భూదందాలతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన ధరణి, కాళేశ్వరం, ఫార్ములా ఈ–రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ తదితర కుంభకోణాలపై సమగ్ర విచారణకు వెంటనే సీబీఐకి లేఖ రాయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్కార్‌ను దింపే దాకా విశ్రమించంప్రజల ఉసురు పోసుకుంటున్న రేవంత్ సర్కార్‌ను గద్దె దింపేవరకు విశ్రమించేది లేద ని శపథం చేస్తున్నామని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు. ‘రేవంత్ నీకు కేసీఆర్ కంటే దుర్మార్గమైన గతి పడుతుంది. రాహుల్, సోనియా గాంధీలకు రేవంత్ నెలకు 400 కోట్లు పంపిస్తున్నారు’అని ఆరోపించారు. 22ఏ సమస్యతో నష్టపోయిన ఒక బాధిత రైతు చేతుల మీదుగా నిమ్మరసం తాగి మహేశ్వర్ రెడ్డి, ఈటల తమ దీక్షను విరమించారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, రామారావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఆర్ఆర్ రియల్ ఎస్టేట్‌గా...: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణను రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ’గా (ఆర్ఆర్ రియల్ ఎస్టేట్)గా మార్చేశారని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 22ఏ జాబితా, భూముల అమ్మకాలు, ప్రైవేట్ సెటిల్మెంట్ల ద్వారా దోచుకున్న వేలకోట్లు ఢిల్లీకి కప్పం కడుతున్నారన్నారు. 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన రైతులు, ప్రజల భూములను బేషరతుగా తొలగించాలని డిమాండ్‌చేశారు. బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ... రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం మానవ హక్కుల ఉల్లంఘనే అని అన్నారు. ఈ జాబితా పేరుతో ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. తప్పు జరిగిందని సీఎం, మంత్రులే స్వయంగా ఒప్పుకుంటున్నప్పుడు అందుకు బాధ్యులైన ప్రభుత్వానికి శిక్ష పడాల్సిందేనన్నారు. -
ధురంధర్, ధూమ్ మచాయీ హై అంటూ.. మోదీ అదిరిపోయే స్పీచ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జెన్ జీని ఆకట్టుకునేలా ప్రసంగించారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది వేడుకల్లో శనివారం మోదీ పాల్గొని మాట్లాడారు. “ధురంధర్ కాకపోయినా, ధూమ్ మాత్రం మచాయీ హై” అని అన్నారు. ప్రతి రంగంలోనూ ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు.“ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థులు కూడా చాలా ప్రత్యేకమైనవారు. మీ భాషలో చెప్పాలంటే, ఇక్కడి పూర్వ విద్యార్థులు ఒరిజినల్ గ్యాంగ్ సభ్యులు. వారు ఎస్ఆర్సీసీ పేరును ప్రపంచవ్యాప్తంగా చాటారు. వివిధ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మన అరుణ్ జైట్లీ జీ ఇక్కడ చదువుకున్నారు. ఆయనతో జరిగిన సమావేశాల్లో బహుశా ఎస్ఆర్సీసీ రోజులకు సంబంధించిన ఒక సంఘటనను చెప్పని సమావేశం ఉండేది కాదు. కొన్నిసార్లు నాకు విసుగు వచ్చేది. ఎందుకంటే ఆయన అదే సంఘటనను పదేపదే చెప్పేవారు. ఇప్పటికీ నా బృందంలో ఉన్న సంజీవ్ సన్యాల్ ఎస్ఆర్సీసీ పూర్వ విద్యార్థే. ఇక్కడ చదువుకున్న మరెంతో మంది సహచరులు మనతో ఉన్నారు. ఎస్ఆర్సీసీ నుంచి ఆర్థిక రంగానికి చెందినవారు మాత్రమే వచ్చినట్లు కాదు. కళాకారుల నుంచి రాజకీయ నాయకులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల వరకు ప్రతి రంగానికి చెందినవారు ఇక్కడి నుంచి వెలుగులోకి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా నా 2013 ప్రసంగం గురించి మాట్లాడుకున్నారు. ప్రజలు దానిని గుర్తు చేసుకున్నారు, మళ్లీ విన్నారు, మళ్లీ చదివారు. కొత్త తరానికి చెందినవారు కూడా దానిని మరోసారి చూసి ఉండవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, ఆ ప్రసంగం ఒక అలను సృష్టించింది. ఒక అల ఉప్పొంగి వెళ్లింది. ఇప్పటికీ, 13-14 ఏళ్ల తర్వాత కూడా, ఆ సమావేశం, ఆ ప్రసంగం ప్రభావం కొనసాగుతోంది” అని అన్నారు.2013లో అలా ఉండేది.. మీకు తెలియదుగతంలోని విషయాలను నరేంద్ర మోదీ చెప్పారు. “2013లో మీ సీనియర్లు ఇక్కడ కూర్చున్నారు. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. అయితే దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలో సభ్యుడిగా కూడా ఉన్నాను. అప్పటి కేంద్ర ప్రభుత్వంపై సుదీర్ఘంగా, తీవ్రంగా దాడి చేస్తానని, ఆరోపణల వర్షం కురిపిస్తానని బహుశా ప్రజలు ఆశించి ఉంటారు. కానీ నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ, ఆ వేదికను ఆ ఉద్దేశం కోసం ఉపయోగించలేదు. ఒక దార్శనికతను వివరించాను. సానుకూలంగా మాట్లాడాను. అప్పుడు నేను చెప్పినదంతా నా నమ్మకం. ఆ ఆలోచనలు, కలలను నేను ఎప్పుడూ ఆచరణలో పెట్టాను. ఆ మార్గంలోనే కొనసాగాను. దేశానికి నా సంపూర్ణ అంకితభావాన్ని కొనసాగించాను. దేశం కోసం జీవించాలనే తపనను కలిగి ఉన్నాను. ఆ సమయంలో మీలో చాలామంది పాఠశాలలో ఉండి ఉండవచ్చు. కానీ ఈ రోజు మీరు ఇంటర్నెట్లోకి వెళ్లి 2013లో, ఆ కాలానికి సమీపంలోని రోజుల్లో వచ్చిన వార్తలను చదివితే, అప్పటి పరిస్థితి ఎలా ఉండేదో మీకు అర్థమవుతుంది” అని అన్నారు.పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నవారు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారని మోదీ అన్నారు. ‘‘పాకిస్థాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, భారత సాయుధ దళాలు వారి భూభాగంలోకి ప్రవేశించి దాడి చేస్తున్నాయి. జమ్మూకశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పెరిగింది. మావోయిస్టు ఉగ్రవాదం, నక్సలిజం వెన్ను విరిచాం. ఒకప్పుడు భారత విధాన స్తబ్ధత గురించి ఆందోళన చెందిన ప్రపంచం.. ఈ రోజు భారత విధాన చైతన్యం గురించి మాట్లాడుతోంది” అని అన్నారు. -
మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్
సినీనటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటారు. జన్మాష్టమి సందర్భంగా కంగనా ఆన్లైన్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను మనాలీలోని తన ఇంట్లో ఉన్నానని, పండుగ సందర్భంగా ప్రత్యేక భోగ్ తయారు చేస్తున్నానని ఆ వీడియోలో వెల్లడించారు. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. దీనిపై ఎక్స్‌లో ఓ వ్యక్తి స్పందిస్తూ.. కంగనా వంట చేస్తున్న పాత్ర నల్లగా ఉన్నప్పటికీ, ఆమె గ్యాస్ వెలిగించలేదని వ్యాఖ్యానించారు. దీనిని గమనించిన కంగనా వెంటనే ఆ వ్యక్తికి కామెంట్లోనే ఘాటుగా సమాధానం ఇచ్చారు.కంగనా ఏమన్నారు?కంగనా వంట చేస్తున్న పాత్ర అప్పటికే నల్లగా ఉన్నప్పటికీ, గ్యాస్ స్టవ్ వెలిగించడం మర్చిపోయారని ఎక్స్‌లో ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. దీనికి కంగనా స్పందిస్తూ.. “ఇది హల్వా కాదు, భోగ్. ఇందులో చాలా పదార్థాలను విడివిడిగా తయారు చేసి, ఈ దశలో అన్నింటినీ కలుపుతారు. ఆ తర్వాత దాన్ని సెట్ చేసి ముక్కలుగా కోస్తారు. తల్లిదండ్రులకు, ఈ గ్రహానికి భారంగా ఉన్న వ్యక్తుల నుంచి వంట నైపుణ్యాలను ఆశించలేం. మీరు తినడంపైనే దృష్టి పెట్టండి. వంట గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. Gas तो जला लो टंगना ड्रामेबाज़ 😁ओर कड़ाई देखो कितना काला है 😂🤣🤣 pic.twitter.com/OOWzM7lvjs— Queen 👸 (@Queen510619151) September 4, 2026కంగనా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్కంగనా ఇటీవల ఏసిన వ్యాఖ్యలు కొంతమంది యువ హిందూ మహిళలు బాధ్యత లేకుండా స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నారని కంగనా వ్యాఖ్యానించారు. వారిని ‘జనరేషన్ గట్టర్’ అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై యోగా గురువు స్వామి రామ్‌దేవ్ విమర్శలు చేశారు. ఇది ‘చెడిపోయిన మనస్తత్వానికి’ నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిని కంగనా తీవ్రంగా తప్పుబట్టారు. తనపై ఉన్న ఎస్సీ కేసును గమనించాలని రామ్‌దేవ్‌కు సూచించారు.రాఖీ సందర్భంగా వీరిద్దరి మధ్య బహిరంగ వివాదం ముగిసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కంగనా రామ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతున్న వీడియోను పంచుకున్నారు. తనతో ఉన్న వివాదాన్ని ముగించి, దాన్ని సంభాషణగా మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు రామ్‌దేవ్ అందులో చెప్పారు. రాఖీ సందర్భంగా తనకు వద్ద ఓ బహుమతి ఉందని, శుభదినాన ఫోన్ చేసి శుభాకాంక్షలు చెబుతానని కూడా ఆయన తెలిపారు.కంగనా పోస్ట్ చేస్తూ.. “పండుగ రోజు.. తప్పులు, పొరపాట్లన్నింటినీ క్షమించేందుకు ఉద్దేశించినది. నా సోదరుడు బాబా రామ్‌దేవ్ జీ వివాదం కాదు, సంభాషణ ఉండాలని చెప్పడం చాలా మంచిగా అనిపించింది” అని చెప్పారు. ఆమె రామ్‌దేవ్ ఆప్యాయతను స్వీకరిస్తూ.. “ఈ రక్షాబంధన్ రోజున ఆయన పంపిన స్వీట్లు, పెద్ద సోదరుడి ప్రేమ రెండింటినీ స్వీకరిస్తున్నాను. చాలా ధన్యవాదాలు. భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించాలి” అని పేర్కొన్నారు.కంగనా గతంలో కృతి సనన్, ఆమె వైరల్ అయిన ప్రకటనపై కూడా విమర్శలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. “మహిళగా ఉండటానికి ఇది అద్భుతమైన సమయం. మన అలమారాల్లో అనేక రకాల దుస్తులు ఉన్నాయి. నేటి మహిళ ప్రపంచ మహిళ. కాక్టెయిల్ డ్రెస్‌ల నుంచి లెహంగా చోళీల వరకు, జీన్స్ నుంచి చీరల వరకు, బికినీల నుంచి సల్వార్ కమీజ్ వరకు.. ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న ఇన్ని ఆప్షన్లలో మీ సోదరుడికి బికినీ లేదా లోదుస్తులతో రాఖీ ఎందుకు కట్టాలి? మీకు ఉన్న అన్ని స్టైలింగ్ ఆప్షన్లు ఏమయ్యాయి? హా హా.. ఆ ప్రకటన ఉద్దేశపూర్వకంగానే అసహజంగా కనిపిస్తోంది” అని విమర్శించారు. -
‘కొండా సురేఖ మా పార్టీలోకి కూడా వద్దు’
హైదరాబాద్: ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్కు గురైన కొండా సురేఖ ఏ పార్టీలో చేరుతుంది అనే డైలమా కొనసాగుతున్న తరుణంలోనే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీలు తమ స్వరం పెంచాయి. కొండా సురేఖ ఏ రాజకీయ పార్టీలో చేరతారు అనే దానిపై ఇంకా స్పష్టత రాకుండానే బీఆర్ఎస్, బీజేపీలు నేరుగానే దాడి ప్రారంభించాయి. కొండా సురేఖను తమ పార్టీలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని, తెలంగాణ భవన్ గేట్‌ను కూడా ఆమె తాకలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ నుంచి కూడా దాదాపు అదే స్వరం వినిస్తుంది. కొండా సురేఖ తమ పార్టీలోకి కూడా వద్దంటూ బీజేపీ సీనియర్ నేత మురళీధర్‌రావు తేల్చిచెప్పేశారు. కొండా సురేఖ బర్తరఫ్ అంశం తర్వాత బీజేపీలోకి చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేత మురళీదర్‌రావు సంచలన ట్వీట్ చేశారు. BJP అంటే BIN అనుకుంటున్నారా? అంటూ ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి బహిష్కృతం అయిన నేతలను తీసుకునే రాజకీయ డంపింగ్ గ్రౌండ్‌గా బీజేపీ ఉండదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం కనిపిస్తున్న సమయంలోనే ప్రతి ఊహాగానానికి బీజేపీని లింక్ చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. బీజేపీని చర్చలోకి తీసుకురావడం ద్వారా కాంగ్రెస్‌లోని అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నమా? అనే అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించుకునే లోపే బీజేపీ పేరును తెరపైకి తెచ్చి రాజకీయ నరేటివ్‌ను ముందుగానే మార్చే ప్రయత్నం జరుగుతోందా?, తెలంగాణ బీజేపీ లక్ష్యం కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్త నేతలకు ఆశ్రయం కల్పించడం కాదు.కాంగ్రెస్, బీఆర్ఎస్లకు విశ్వసనీయ సొంతంగా ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనుకుంటోంది. ఆ ప్రత్యామ్నాయ సంస్కృతి, వ్యక్తిత్వం, సిద్ధాంతం, రాజకీయ విధానాల్లో కనిపించాలి. బీజేపీకి కార్యకర్తల బలం, కేడర్ కమిట్మెంట్ కీలకం. పార్టీని కేవలం నేతల చేరికలతో బలోపేతం చేయడం కాదు. ప్రత్యేకమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే లక్ష్యం. అందుకే “BJP = BIN” అనే రాజకీయ నరేటివ్‌ను నమ్మొద్దు. ప్రస్తుతం వస్తున్న రాజకీయ ఊహాగానాల వెనుక ఇంకేదైనా రాజకీయ వ్యూహం ఉందా? అన్న కోణంలో కూడా చూడాలి. బీజేపీ ఒక ప్రత్యామ్నాయం.. మరో పార్టీకి పేరు మార్చిన రూపం కాదు’ అని స్పష్టం చేశారు.BJP is NOT a BIN.Why is the media so eager to drag BJP into every speculative political story—just when the Congress crisis appears to be unfolding?Is this an attempt to prematurely stop the game, divert the narrative, and help Congress nip its troubles in the bud?BJP…— P Muralidhar Rao (@PMuralidharRao) September 5, 2026 ఇవీ చదవండి: సురేఖ ఎపిసోడ్, కేబినెట్ విస్తరణపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు‘కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం’ -
కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక
-
POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్
-
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో బీజేపీ చీఫ్?
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పోటీ చేయనున్నారా? ఈ ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది మొదట్లో ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్–నల్లగొండ–ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలకు బీజేపీ జాతీయ ,రాష్ట్ర నాయకత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. సెపె్టంబర్ నెలలోనే కేంద్రం ఎన్నికల సంఘం నుంచి ఓటరు నమోదుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రధాన పార్టీల్లో ఆశావహులు, నేతలు ఈ రెండు సీట్లలో పోటీ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.కొత్త పట్టభద్ర ఓటర్లను చేర్చుకునే ప్రయత్నాలు మొదలు, మిగతా వారి వివరాలు, సమాచారం సేకరణ ఇలా ముందస్తు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థానం నుంచి పార్టీ టికెట్ కోసం పోటీలో ఇప్పటికే 26 మంది గట్టి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈసారి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి బీజేపీ గెలిచేందుకు అన్ని అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వానికి సైతం నివేదిక చేరిందట. అదీగాకుండా గతంలోనూ హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి రాంచందర్‌రావు గెలిచిన సంగతి తెలిసిందే.గత ఎన్నికల్లోనూ స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి చేతుల్లో ఓడిపోయారు. ప్రస్తుతం మారిన రాజకీయ వాతావరణం, గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్ కైవసం, గతంతో పోలి్చతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఇలా అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందడం పక్కా అనే అభిప్రాయం పార్టీనేతల్లో వ్యక్తమవుతోంది.దీంతో రాంచందర్‌రావునే బరిలో నిలిపితే సరిపోతుందనే అభిప్రాయానికి బీజేపీ అగ్రనేతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులుగా చట్టసభల్లో ప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు)కూడా ఉండడంతో ఇక్కడ కూడా రాంచందర్‌రావునే అభ్యర్ధిగా ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేయవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికైతే తాను రేసులో లేనని, పోటీ చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశిస్తే మాత్రం దానిని శిరసా వహించక తప్పని పరిస్థితి ఉంటుందని రాంచందర్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. -
ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్
-
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ.. ముగ్గురికి కత్తిపోట్లు
సాక్షి, నల్లగొండ: తిప్పర్తిలో ఈ రోజు (శుక్రవారం) మూడు ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. గంగన్నపాలెంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు సతీష్, శ్రీకాంత్, నరేష్ కు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో సతీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కాగా ఒక చిన్న వివాదం నేపథ్యంలో తలెత్తిన వివాదం కాస్త ముదిరి తీవ్ర ఘర్షణకు దారి తీసినట్లు సమాచారం. -
కేజ్రీవాల్, సీఎం మాన్, ఆయన భార్య.. రేప్ కేసుల సెటిల్మెంట్ దందా
న్యూఢిల్లీ: ఆప్ చీఫ్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఆయన భార్య రూ.5 కోట్ల వరకు లంచాలు తీసుకుని రేప్ కేసుల సెటిల్మెంట్ దందాను నడుపుతున్నారని బీజేపీ ఆరోపించింది. సీఎం కార్యాలయం అక్రమ దందాకు నిలయంగా మారిందని పేర్కొంది. ఓ రేప్ కేసును కొట్టివేసేందుకు పంజాబ్ సీఎం మాన్ భార్య గుర్ప్రీత్ కౌర్ రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటూ వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఆగస్ట్ 21వ తేదీన దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ భండారి మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్, సీఎం మాన్, ఆయన భార్య కలిసి పంజాబ్‌ను ఆప్ లూట్ మోడల్‌గా మార్చారన్నారు. అక్రమ డీల్స్ కోసం సీఎం, ఆయన భార్య పంజాబ్ వ్యాప్తంగా దళారులను నియమించుకున్నారన్నారు. మీడియా భేటీలో భండారి ఓ ఆడియో రికార్డింగ్‌ను వినిపించారు. అందులో దళారీగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి కేజ్రీవాల్‌ను సూపర్ సీఎంగా పేర్కొనడం, సీఎం సాబ్‌కు కూడా ఈ విషయం చెప్పాం, ఆయన కూడా జోక్యం చేసుకుంటున్నారంటూ ఆ దళారీ, నిందితుడి బంధువుతో చెప్పడం కూడా అందులో ఉన్నాయి. -
సురేఖ బర్తరఫ్.. విపక్షాలకు కొత్త అస్త్రం?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వేయి రోజుల పాలనపై నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్ష పార్టీలకు కొండా సురేఖ బర్తరఫ్ అంశం కొత్త అస్త్రాన్ని అందించింది. మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభా వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశముంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలపై రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం ఇకపై కాంగ్రెస్‌పై విమర్శల దాడికి మరింత పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు లక్ష్యంగా కొండా సురేఖ కూతురు చేసిన విమర్శలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ లోపలా, బయటా నిలదీసే అవకాశముంది. ఇన్నాళ్లూ కేబినెట్లో ఉన్న కొండా సురేఖ నుంచి వచ్చే ప్రతీ విమర్శ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ముందుకు ప్రభుత్వ వైఫల్యాలుసురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత గొడవలను కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇన్నాళ్లు ప్రభుత్వంలో భాగంగా ఉన్న సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా విచారణ కోసం బీఆర్ఎస్ పట్టు పట్టే అవకాశముంది. సీఎం సోదరుడికి రూ.200 కోట్ల విలువైన భూ కేటాయింపుపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఇన్నాళ్లూ మాజీ మంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా విమర్శలు చేస్తూ వచ్చిన రేవంత్‌పై ఎదురుదాడికి దిగేందుకు సురేఖ, ఆమె కుమార్తె చేసిన విమర్శలను అ్రస్తాలుగా మలుచుకునే అవకాశముంది. మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సురేఖ అడుగులు ఎటు?కొండా సురేఖ బర్తరఫ్ అంశాన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా పేర్కొంటూ విపక్షాల నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శలను ఇప్పటికే కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. అయితే సీఎం, ఆయన సోదరులు లక్ష్యంగా వస్తున్న ఆరోపణలపై సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర తిప్పికొడతారనే అంశంపై కాంగ్రెస్ శిబిరంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర స్వేచ్ఛగా ఉన్నారో అందరికీ తెలుసంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. విపక్షాల నుంచి అసెంబ్లీ వేదికగా ఒత్తిడి వస్తే ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే చర్చ కూడా జరుగుతోంది. సీఎంను తప్పుపడుతూ సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఎంత మేర ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంలోనూ కాంగ్రెస్‌లో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే సురేఖ వేసే భవిష్యత్తు రాజకీయ అడుగులపైనా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌లో కొనసాగుతూ అధిష్టానంతో రాజీ ధోరణితో వ్యవహరిస్తారా లేక సీఎం లక్ష్యంగా విమర్శలకు పదును పెడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌కు దూరమైతే గతంలో బీఆర్ఎస్తోనూ అనుబంధం ఉన్న సురేఖ భవిష్యత్తులో రాజకీయంగా ఏ పార్టీ దిశగా అడుగులు వేస్తారనే అంశంపైనా చర్చ జరుగుతోంది. -
సురేఖ చేరికపై బీజేపీ ఆచితూచి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, ముఖ్యనేతలు మహిళా సాధికారత గురించి గొప్పగా చెబుతూ... మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ను చేశారంటూ బీజేపీ నేతలు ఘాటుగానే స్పందించారు. అయితే కొండా ఫ్యామిలీ బీజేపీవైపు వస్తుందా? వస్తే ఏం చేయాలి? చేర్చుకోవాలా వద్దా? అన్న దానిపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఒకవేళ కొండా మురళి, సురేఖ, సుస్మిత బీజేపీలో చేరితే పార్టీకి ప్రయోజనమెంత? లాంటి అంశాలను విశ్లేషిస్తుతున్నారు. కేబినెట్ నుంచి సురేఖ ఉద్వాసనకు గురైన నేపథ్యంలో... కొండా ఫ్యామిలీ జాయినింగ్‌పై పార్టీ ముఖ్యనేతల్లో చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రి పదవిని వదులుకున్నాక ఆమె బీజేపీ వైపు వస్తారా? రావాలనుకుంటే పార్టీలో ఎవరితో చర్చలు జరుపుతారు? పార్టీలో చేరతానంటే చేర్చుకుంటే మంచిదా? కాదా? అన్న రకరకాల చర్చలు బీజేపీలో సాగుతున్నాయి. వారి ముందున్న మార్గాలేంటి? రాష్ట్ర రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ వ్యవహారశైలి, ఇప్పటివరకు చోటుచేసుకున్న పరిణామాలు తదితరాలు చర్చనీయాంశమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం ఎదుట ఉన్న మార్గాలేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కొండా ఫ్యామిలీ జనసేనలో చేరేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు ప్రచారాలు సాగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కొండాసురేఖ, బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ఎదురుపడినపుడు మర్యాదపూర్వకంగా పలకరించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సురేఖ రాజీనామా చేశాక అప్పుడు ఆలోచిస్తామంటూ ఊహాగానాలకు తెరలేపారు. అయితే బీజేపీ ముఖ్య నేతలు మాత్రం ఇటు బీజేపీ వైపు నుంచి గానీ, అటు కొండా ఫ్యామిలీ వైపు నుంచి గానీ ఎలాంటి సమాలోచనలు మొదలుకాలేదనే సంకేతాలు ఇస్తున్నారు. మంత్రి పదవి పోయినా సురేఖ ఎమ్మెల్యేగా కొనసాగుతానంటూ, పార్టీకి కూడా రాజీనామా చేయబోనని ప్రకటించిన విషయం విదితమే. ఇతర పార్టీల నేతలు చేరాలంటే ఆ పార్టీ సభ్యత్యానికి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాకే రావాలని బీజేపీ జాతీయ నాయకత్వం కండిషన్ పెట్టిన విషయాన్ని రాష్ట్ర పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అందువల్ల సురేఖ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుంటే పార్టీలో చేర్చుకునే ప్రసక్తే ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇంకా రెండేళ్లకు పైగా పదవీకాలం ఉండటంతో రాజీనామాకు సురేఖ సుముఖంగా లేకపోగా... పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా కండిషన్ అడ్డుగా నిలుస్తోందని చెబుతున్నారు. బీజేపీలో ఫ్యామిలీ ప్యాకేజీలు ఉండవని... ప్రత్యేక సందర్భాల్లోనే ఒక కుటుంబంలో ఒకరికి మించి టికెట్ ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. అందువల్ల బీజేపీలో కొండా ఫ్యామిలీ చేరడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదీగాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ పోటీకి క్లెయిమ్ చేస్తున్న సీట్లలో బీజేపీకి బలమైన నేతలు ఉన్నారని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు మంచి ఓటింగ్‌నే సాధించారని అంటున్నారు. అందువల్ల వారి చేరికతో పార్టీకి, నేతలకు కొత్త తలనొప్పి మొదలవుతుందనే గుసగుసలు కూడా బీజేపీలో వినిపిస్తున్నాయి. -
బీజేపీ సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు నేతృత్వంలో చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మెయిన్ గేటు వద్ద రాంచందర్‌రావుతో పాటు, ఎంపీ డీకే అరుణ, బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్కకొమరయ్య, పార్టీనేతలు డా.ఎన్.గౌతంరావు, బండారు విజయలక్ష్మి, బీజైవైఎం అధ్యక్షుడు గణేష్ కుండే తదితరులను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, పార్టీకార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొన్నిరోజుల క్రితం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో విద్యార్థుల వినతిపత్రాల సమర్పణకు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ను రాంచందర్‌రావు కోరారు. దీనిపై సీఎం కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రూ.15వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మందికి పైగా విద్యార్థుల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను ప్రభుత్వానికి సమర్పించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం చలో సెక్రటేరియట్‌కు బయలుదేరారు. సెక్రటేరియల్ మెయిన్‌గేట్ వద్దకు వారు చేరుకోగానే పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. రాంచందర్‌రావు, ఇతరనేతలు, కార్యకర్తలను తోపులాట మధ్య పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అరెస్టయిన సందర్భంగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఫీజు బకాయిలు ఇవ్వకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు, ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యారని మండిపడ్డారు. తాను ఇప్పటికే, ఈ అంశంపై రెండురోజుల నిరాహార దీక్ష చేశానని, సీఎంకు లేఖలు రాశానని గుర్తుచేశారు. విద్యార్థుల సహనం నశించడంతోనే వారి గొంతు కగా మారి నేరుగా సచివాలయానికి వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఫీజు బకాయిలన్నీ విడుదల చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తుందని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేసి,గద్దె దిగాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న తనను పోలీసులు అమానుషంగా ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అరెస్టు చేశారని మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ఫీజు పోరుపై బీజేపీ సచివాలయ మెరుపు ము ట్టడి అద్భుతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ నాయకుల అరెస్ట్‌ను పార్టీ తమిళనాడు, కర్ణాటక సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. వీరేందర్ గౌడ్, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్విసుభాష్ ఖండించారు. -
పెదవులు కదలాల్సిందేనని వారికి చెప్పాను: సీఎం సువేందు
కోల్‌కతా: 'వందేమాతరం'పై పాఠశాలలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పాఠశాల ప్రార్థనా సమయంలో 'వందేమాతరం' పూర్తి రూపాన్ని తప్పనిసరిగా పాడటాన్ని కచ్చితంగా పాటించకపోతే.. ఆర్థిక సాయం, ఇతర ప్రభుత్వ మద్దతును నిలిపివేస్తామని గురువారం పాఠశాలలను హెచ్చరించారు.కోల్‌కతాలోని గోల్పార్క్ రామ్కృష్ణ మిషన్‌లో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన వివేకానంద విద్యాభారతి వికాస్ పరిషత్ వార్షిక కార్యక్రమంలో సువేందు అధికారి ప్రసంగించారు. గతంలో ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర విద్యా వ్యవస్థ నాశనం అంచుకు చేరుకుందని ఆయన ఆరోపించారు.పాఠశాల విద్యలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయవాద విలువలను పునరుద్ధరించడానికి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని ఆయన చెప్పారు. "వందేమాతరం పూర్తి రూపం పాడటాన్ని కొందరు వ్యతిరేకించారు. ప్రభుత్వ సాయం ఆగిపోతుందని వారికి చెప్పాను. దాంతో వారు కొంతవరకే తగ్గారు. వారు నిలబడ్డారు కానీ పెదవులు విప్పలేదు. అప్పుడు పెదవులు కూడా కదలాలని వారికి చెప్పాను" అని ముఖ్యమంత్రి చిరునవ్వుతో అన్నారు.లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో ఆంగ్ల మాధ్యమ విద్యను తగ్గించారని, టీఎంసీ కాలంలో "తుష్టీకరణ రాజకీయం ద్వారా పాఠశాల పాఠ్యాంశాలను వికృతీకరించారు" అని అధికారి ఆరోపించారు. తుష్టీకరణ రాజకీయం అంటే ఓట్ల లాభం కోసం ఒక నిర్దిష్ట వర్గాన్ని ప్రత్యేకంగా ప్రీతిపరిచే రాజకీయ విధానం.పాఠ్యాంశాల్లో 'మా', 'జల్', 'ఆకాశ్' వంటి పదాలను ఉద్దేశపూర్వకంగా వరుసగా 'అమ్మ', 'పానీ', 'ఆస్మాన్' పదాలతో మార్చారని ఆయన చెప్పారు. ఈ సూక్ష్మ మార్పులు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద వంటి మహానుభావుల విద్యాబోధనా ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.విద్యాసంస్థల్లో నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)ను నిషేధించడం ద్వారా పూర్వ ప్రభుత్వం క్షమించరాని నేరం చేసిందని కూడా ముఖ్యమంత్రి ఆరోపించారు. "నేను ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి రెండు విజ్ఞప్తులు చేశాను. మొదటిది, రాష్ట్రంలో మరిన్ని సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరాను. రెండవది, పాఠశాలలు, కళాశాలల్లో ఎన్సీసీని తప్పనిసరి చేయడానికి అనుమతి కోరుతూ లేఖ రాస్తానని చెప్పాను. నేను ఇప్పటికే ఆ లేఖను పంపాను, అవసరమైనది చేస్తానని ఆయన హామీ ఇచ్చారు" అని ముఖ్యమంత్రి తెలిపారు.విద్యా విధానం, పాఠ్యాంశాల మార్పులు, ఉపాధ్యాయుల నియామకం, విద్యాసంస్థల్లో భావజాల పాత్రపై పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న రాజకీయ విభేదాల మధ్య సువేందు అధికారి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ నేతలు తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో ఉనికిని కాపాడుకోవడానికే ఒకరిని మించి ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. నిజంగా తెలంగాణ ప్రయోజనాలపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నేతలపై ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు ఏ విధంగా మంజూరవుతున్నాయో తెలంగాణ విషయంలో ఎందుకు అదే విధానం అమలు కావడం లేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే తమ ఉనికిని కాపాడుకోగలమని, పార్టీ అధిష్టానం తమను గుర్తిస్తుందని భావించడం సరికాదన్నారు.ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన బీజేపీ నేతలు కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. గతంలో పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక బకాయిలు పెట్టినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ, పాత బకాయిలను కూడా పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ తెలంగాణకు రావాల్సిన అనేక హామీలు, నిధులు, ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని మంత్రి అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో తెలంగాణకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదాయం కేంద్రానికి వెళ్తున్నప్పటికీ, తిరిగి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.తెలంగాణకు పెండింగ్‌లో ఉన్న మెట్రో రైల్, నవోదయ విద్యాలయాలు, కేంద్ర పాఠశాలలు, రీజినల్ రింగ్ రోడ్‌కు సంబంధించిన అంశాలు సహా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం వెంటనే అనుమతులు, నిధులు మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం వద్ద రాష్ట్ర హక్కులను సాధించడంలో బీజేపీ నేతలు ముందుకు రావాలని, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ తీసుకురావాలని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు.. తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ప్రశ్నించండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడే దమ్ము చూపించండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. -
అదంతా రాఘవ్ చద్దా ప్లానే.. ఆప్ ఎదురుదాడి
ఓటర్ జాబితాలో పేరు తొలగింపుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య మాటల యుద్ధం మొదలైంది. పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై చద్దా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పొరపాటు కాదని.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన పేరును తొలగించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ ఆప్ ఎదురుదాడికి దిగింది.ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఆగస్టు 13న విడుదలైన పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో రాఘవ్ చద్దా పేరు లేదు. ఆయన పేరును ‘పర్మినెంట్‌గా షిఫ్ట్ అయ్యారు’ అనే కారణంతో తొలగించినట్లు జాబితాలో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని చద్దా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. అయితే ఇదంతా చద్దా వ్యూహంలో భాగమేనని.. ఢిల్లీలో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆయన ‘బ్యాక్‌డేటెడ్’ విధానాన్ని ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది.‘బ్యాక్‌డేటెడ్ విధానం’ అంటే.. ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకుంటూ, గతంలోనే ఆ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రికార్డుల్లో చూపించడం. రాఘవ్ చద్దా ఢిల్లీలోని రాజిందర్ నగర్లో ఓటరుగా నమోదు చేసుకునే విషయంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని ఆప్ ఆరోపిస్తోంది. అంటే.. ఇప్పుడు జరిగే ఓటరు నమోదును గత తేదీ నుంచే అమల్లో ఉన్నట్లు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఆప్ వాదన.‘రాజకీయ కక్షతోనే’..అంతకు ముందు.. తన ఓటర్ ఐడీ పంజాబ్‌లోని మొహాలీలో నమోదై ఉందని చద్దా తెలిపారు. తాను పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ‘షిఫ్టెడ్’గా ఎలా గుర్తించారని ప్రశ్నించారు. ఇది సాధారణ క్లరికల్ తప్పిదం కాదని.. రాజకీయ కక్షతోనే తన పేరును తొలగించారని ఆరోపించారు. అయితే ఇది ముసాయిదా జాబితా మాత్రమేనని, అభ్యంతరాలు–దావాల ప్రక్రియ ద్వారా పేరు తిరిగి చేర్చుకునే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.ఆప్ ఎదురుదాడి..చద్దా ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. సర్ ప్రక్రియను నిర్వహించేది ఎన్నికల సంఘమే తప్ప పంజాబ్ ప్రభుత్వం కాదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో ఎవరి పేరు చేర్చాలి, ఎవరి పేరు తొలగించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని పేర్కొంది.అంతేకాదు.. ఢిల్లీలోని రాజిందర్ నగర్లో తన ఓటరు నమోదును గత తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా చేయడానికి చద్దా ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని తెలిపింది. ఇలాంటి బ్యాక్‌డేటెడ్ లేదంటే చట్టవిరుద్ధమైన ప్రక్రియ జరిగి ఉంటే దానిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.‘ఢిల్లీలోనే ఉంటున్నారు’చద్దా ప్రస్తుతం పంజాబ్‌లో కాకుండా ఢిల్లీలో నివసిస్తున్నారని ఆప్ పేర్కొంది. ఒకవేళ ఆయన పంజాబ్‌లో నివసించకపోతే తన ఓటర్ నమోదును కొనసాగించడమో లేదంటే మార్చుకోవడమో ఆయన వ్యక్తిగత బాధ్యతేనని తెలిపింది. ఇప్పుడు ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపునకు ఆప్, పంజాబ్ ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. సర్‌లో భాగంగా తొలగించిన పేర్లపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌లో విడుదల చేయనున్నారు.ఇదీ చదవండి: స్టాలిన్ ఆశలకు మద్రాస్ హైకోర్టు గండి -
సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నేతల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫీజురీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు (గురువారం) బీజేపీ చేపట్టిన సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ముట్టడికి పెద్దఎత్తున బీజేపీ నేతలు తరలివచ్చారు. సెక్రటేరియట్ ముందు బైఠాయించి ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.అనంతరం గేటు ఎక్కి మరి సచివాలయంలోకి వెళ్లడానికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అనంతరం అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ముట్టడిలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్నారు. -
ఇతర మహిళల్ని అవమానించొద్దు.. నటిపై భగ్గుమన్న బీజేపీ!
కృతి సనన్ రాఖీ యాడ్ దుమారం చల్లారక ముందే.. మరో నటి స్వరా భాస్కర్ రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాలోని ‘జౌహర్’ సన్నివేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. మహిళల త్యాగాన్ని అవమానించేలా మాట్లాడటం సరికాదని విమర్శించింది.ఢిల్లీలో ఇటీవల జరిగిన ‘వుమన్, లైఫ్, ఫ్రీడమ్’ కార్యక్రమంలో స్వరా భాస్కర్ ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశాన్ని ప్రస్తావించారు. సినిమాలో మహిళలు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాహుతి చేసుకున్నట్లు చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ లైంగిక హింసకు గురైన మహిళ ఈ సన్నివేశాన్ని చూస్తే.. తన జీవితాన్ని కొనసాగించాలనుకోవడం తప్పా అనే భావన కలగొచ్చని స్వరా ప్రశ్నించారు. ‘గౌరవం కోసం చనిపోకపోతే పిరికిదానిననే భావన కలుగుతుందా?’ అన్న కోణంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. లైంగిక హింసకు గురైన మహిళలకు కూడా బతికే హక్కు ఉందన్న సందేశమే సమాజానికి వెళ్లాలని ఆమె పేర్కొన్నారు.జౌహర్ (Jauhar) అంటే.. యుద్ధంలో శత్రు సైన్యం చేతిలో చిక్కి అవమానం, లైంగిక హింసకు గురికాకుండా ఉండేందుకు మహిళలు సామూహికంగా అగ్నిలోకి దూకి ఆత్మాహుతి చేసుకునే ఆచారం.‘ఆమె పిరికిదని అనలేదు’స్వరా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె వివరణ ఇచ్చారు. తాను రాణి పద్మావతిని కానీ, జౌహర్ చేసిన మహిళలను కానీ పిరికివాళ్లుగా పేర్కొనలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అనువదించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రశ్నించింది జౌహర్ చేసిన మహిళల ధైర్యాన్ని కాదని.. ఆ సన్నివేశం ఆధునిక సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందన్నదేనని వివరించారు.‘ఇతర మహిళలను గౌరవించాలి’ఈ వివాదంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రతి మహిళ ఇతర మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వరా పేరులోని ‘స్వర్’ (గొంతు/స్వరం)ను ప్రస్తావిస్తూ ఆమె వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ఆమె ఎవరి గొంతుతో మాట్లాడుతున్నారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. మహిళల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.పోలీసులకు ఫిర్యాదుఈ వివాదం రాజకీయ విమర్శలకే పరిమితం కాలేదు. బిహార్‌కు చెందిన బీజేపీ నేత కృష్ణకుమార్ సింగ్ స్వరా భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. హిందూ సమాజం, రాజ్‌పుత్ మహిళలను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో ఆరోపించినట్లు కథనాలు పేర్కొన్నాయి.కర్ణిసేన కూడా..పద్మావత్ విడుదల సమయంలోనే ఆ సినిమాలోని అంశాలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన కర్ణిసేన.. తాజా వివాదంలోనూ స్వరా భాస్కర్‌ను తప్పుబట్టింది. జౌహర్‌ను, రాజ్‌పుత్ మహిళల త్యాగాన్ని విమర్శించే ముందు చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. కర్ణిసేన మహిళా విభాగం నేత కీర్తి రాథోర్.. స్వరా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్ మహిళల త్యాగం, ధైర్యాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని హెచ్చరించారు.మళ్లీ తెరపైకి ‘పద్మావత్’ వివాదం2018లో విడుదలైన ‘పద్మావత్’లో రాణి పద్మావతి పాత్రను దీపికా పదుకొణె పోషించారు. ఆ సమయంలో కర్ణిసేన అభ్యంతరాలతో సినిమా టైటిల్ పద్మావతి కాస్త పద్మావత్‌గా మారింది. ఇక చిత్ర క్లైమాక్స్‌లో శత్రు సేనల చేతికి చిక్కకుండా రాజ్‌పుత్ మహిళలు సామూహికంగా జౌహర్ చేసినట్లు సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ సన్నివేశం అప్పట్లోనే తీవ్ర చర్చకు దారితీసింది. స్వరా భాస్కర్ కూడా సినిమా విడుదల సమయంలో దర్శకుడు భన్సాలీకి బహిరంగ లేఖ రాసి జౌహర్ చిత్రీకరణపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె మరోసారి అదే అంశాన్ని ప్రస్తావించడంతో వివాదం తాజాగా మళ్లీ రాజుకుంది.చరిత్రా? సమాజానికి సందేశమా?‘పద్మావత్’లో జౌహర్ చిత్రీకరణ చుట్టూ సాగుతున్న తాజా వివాదం.. చరిత్రను సినిమాల్లో ఎలా చూపించాలి? చారిత్రక ఘటనలను ఆధునిక సామాజిక విలువలతో ఎలా చూడాలి? అనే ప్రశ్నలను మరోసారి ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో ‘పద్మావత్’ రచయిత ప్రకాశ్ కపాడియా కూడా జౌహర్ సన్నివేశాన్ని సమర్థించారు. అది ఆ కాలంలోని వాస్తవ పరిస్థితుల ప్రతిబింబమని, నేటి ప్రమాణాలతో మాత్రమే దాన్ని అంచనా వేయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరా భాస్కర్ మాత్రం తన ఉద్దేశం ఏ మహిళనూ అవమానించడం కాదని స్పష్టం చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలకు బీజేపీ, కర్ణిసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో.. ‘పద్మావత్’ జౌహర్ వివాదం మరోసారి బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.వివాదాలు స్వరా భాస్కర్‌కు కొత్తేమీ కాదు. నటిగా ‘తను వెడ్స్ మను’, ‘రాంఝనా’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘నిల్ బట్టే సన్నాటా’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత తన వ్యాఖ్యలు, రాజకీయ వైఖరితోనూ తరచూ వార్తల్లో నిలిచారు. సీఏఏ-ఎన్ఆర్సీ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం నుంచి ‘వీరే ది వెడ్డింగ్’లోని ఓ సన్నివేశంపై వచ్చిన విమర్శల వరకు.. ఆమెపై పలు సందర్భాల్లో చర్చ జరిగింది. 2024లో యాహ్యా సిన్వార్పై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. ఇప్పుడు ‘పద్మావత్’లోని జౌహర్ సన్నివేశంపై వ్యాఖ్యలతో మరోసారి వివాదం రేగింది.ఇదీ చదవండి: పాతికేళ్ల జలయుద్ధానికి ఎట్టకేలకు తెర -
ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!
-
ఎన్నికల్లో బీజేపీ గెలుపునకే ‘సర్’
న్యూఢిల్లీ: బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకే భారత ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను నిర్వహిస్తోందని రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు న్యాయవాది కపిల్ సిబల్ బుధవారం ఆరోపించారు. సర్ కింద మూకుమ్మడిగా ఓటర్ల తొలగింపును సుప్రీంకోర్టు ఇప్పటికైనా అడ్డుకోవాలని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం సర్ పేరుతో చేస్తున్న ఓటర్ల జాబితా సవరణలు కూడా ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సాయపడేందుకేనని ఆయన విమర్శించారు. జార్ఖండ్ రాష్ట్రంలో మైనార్టీ ఓటర్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు బీజేపీ ఏజెంట్లు బ్లాక్ లెవల్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన ఒక కథనంపై కపిల్ సిబల్ ‘ఎక్స్’పై స్పందించారు. ‘సర్’ ఓటర్ల జాబితాను మార్చేందుకు జరుగుతున్న కార్యక్రమం. బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకు చేస్తున్నారు. అని వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ... జార్ఖండ్‌లో ఓటర్ల తొలగింపునకు సంబంధించిన ఫామ్–7లను అత్యధికంగా బీజేపీ కార్యకర్తలే దాఖలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఫామ్–7లను మూకుమ్మడిగా దాఖలు చేయవచ్చు. 45 లేదా వంద లేదా 400 ఫామ్స్ తీసుకుని ఏ ఏ పేర్లను తొలగించాలో చెప్పవచ్చు. అందుకే కారణాలేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ తప్పని తేలినా చేసేదేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఈ అంశంపై విచారణ జరిపినప్పుడు తొలగించమని కోరిన పేర్లలో అత్యధికం ముస్లింలకు చెందినవే ఉన్నాయని తెలిసిందన్నారు. పరిస్థితులు ఇలా ఉంటే ఎన్నికలు నిర్వహించిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు తొలగించాలని దరఖాస్తులిచ్చిన ముస్లింలలో ఎక్కువ మంది ఆ ప్రాంతాంలోనే కుటుంబాలతో కలిసి ఏళ్లుగా ఉంటున్నట్లు తెలిసిందని చెప్పారు. ఇంతటి తీవ్రమైన అంశం కాబట్టే దేశ అత్యున్నత న్యాయస్థానం దీనిగ ఉరించి పట్టించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘సర్’ నిస్పాక్షికంగా జరుగుతున్నట్లు, ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉన్నట్లు న్యాయస్థానం భావిస్తే ప్రజాస్వామ్యం అతిపెద్ద సమస్యలో పడినట్లేనని స్పష్టం చేశారు. కోట్ల పేర్లు తొలగించారు ‘‘ఉదాహరణకు ఢిల్లీలోనే 45 నుంచి 47 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారు. వీటిల్లో ఎన్ని పునరుద్ధరిస్తారో నాకు తెలియదు. కానీ ఢిల్లీలోని మొత్తం ఓట్లలో పేర్లు తొలగించిన వారు 23 – 24 శాతం మంది ఉన్నారు.’’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో 2.05 కోట్ల పేర్లు తొలిగాయని, ఇదేరకంగా ఇతర ప్రాంతాల్లోనూ కోట్లకు కోట్ల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. ‘సర్’ మొదలైనప్పటి నుంచి దేశం మొత్తమ్మీద ఇప్పటివరకూ సుమారు ఐదారుకోట్ల పేర్లు తొలగించారని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పరిశోధనాత్మక కథనం ప్రకారం ఇవన్నీ బీజేపీ కార్యకర్తలు మూకుమ్మడిగా ఫామ్–7లు దాఖలు చేయడం వల్ల తొలగినవేనని.. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే నిరూపితం కాగా... జాతీయ మీడియాలోనూ ఇప్పుడు కథనాలు వస్తున్నాయని వివరించారు. అదృష్టవశాత్తూ జార్ఖండ్‌లో బీఎల్ఓలు బీజేపీ కార్యకర్తల డిమాండ్లకు అభ్యంతరాలు చెబుతున్నారని, ప్రతిపక్షం అధికారంలో ఉండటం ఇందుకు కారణమైందని అన్నారు. అధికారంలోనూ బీజేపీనే ఉంటే ఎవరు అభ్యంతరం చెబుతారని ప్రశ్నించారు. -
కమలం.. కలవరం
సాక్షి, హైదరాబాద్: కమలదళంలో అసంతృప్త గళాలు మళ్లీ వినిపిస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం ఆదేశించినా ముఖ్యనేతల తీరులో మార్పు అంతంతే అని పార్టీవర్గాలు పెదవి విరుస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో గ్రూపుల నివారణ, జిల్లా స్థాయిలో అసంతృప్తుల బుజ్జగింపులకు రాష్ట్ర ముఖ్యనేతలు నాయకత్వ స్థాయిలో పూర్తిస్థాయి చర్యలు చేపట్టకపోవడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య మెరుగైన కోఆర్డినేషన్ కోసం ఒకవైపు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో జాతీయ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతర్గత భేటీల్లో నేతల మధ్య విభేదాలు, సమన్వయలేమికి కారణాలు కనుక్కుని వాటిని పరిష్కరించే యత్నాలు జరిగాయి. అయితే మరోవైపు వివిధ జిల్లాల్లో అసంతృప్తుల భేటీలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎంపీ ఏకపక్ష తీరు, వివాదాస్పద వ్యవహారశైలికి వ్యతిరేకంగా జగిత్యాలలో సీనియర్ నేతల సమావేశం జరిగింది. మొత్తంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై, స్థానిక ప్రజాప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) వ్యవహరిస్తున్న వైఖరిని ఈ భేటీలో పలువురు ఎండగట్టినట్టు తెలుస్తోంది. ఓ ఎంపీ నోటి దురుసు కారణంగా పార్టీ, నాయకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయినట్టు సమాచారం. ఉత్తర తెలంగాణలోని ఓ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సీటు పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల బాధిత నాయకులు పాల్గొని తమ సమస్యలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పార్టీలోని కొందరు ముఖ్యనేతలు వ్యవహారశైలిని వారు తప్పుబట్టడంతోపాటు, గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ ఫండ్ దురి్వనియోగం, గెలిచే స్థానాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పక్షపాతంతో వ్యవహరించడం తదితరాలను ప్రస్తావించినట్టు తెలిసింది. ఏదో ఒక జిల్లాలో ఏదో ఒకరూపంలో పార్టీలో నాయకుల అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతుండడంతో మెరుగైన సమన్వయం అనేది అందని ద్రాక్షగానే మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు జిల్లాల్లో సమన్వయలేమి ? పలు జిల్లాల్లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్య నేతలు, గతంలో రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకుల మధ్య సరిగ్గా పొసగడం లేదనే విమర్శలున్నాయి. కొన్ని జిల్లాల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వహించే వారికి సీనియర్లు సహకారం అందించకుండా సహాయ నిరాకరణకు దిగుతున్నట్టు తెలిసింది. గతంలో తాము పార్టీలో కీలకంగా వ్యహరించినా, ఇప్పుడు మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. కనీసం జిల్లా స్థాయిలో తమకు పార్టీలో తగిన గుర్తింపు లభించడం లేదని, తమ అనుభవాన్ని ఉపయోగించుకునే ప్రయత్నమే చేయకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలి పోవాల్సి వస్తోందని వారు ఆవేదన వెలిబుచ్చుతున్నారట. అన్ని జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తయినా ఇంకా జిల్లా స్థాయిలో కోర్ కమిటీలు ఏర్పడకపోవడం పట్ల కూడా వివిధ స్థాయిల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతల మధ్య సర్దుబాటు కాని సమస్యలను సమన్వయ కమిటీల ద్వారా పరిష్కరించే అవకాశమున్నా అది జరగడం లేదంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పుడు...కొందరు సీనియర్ నేతలు తమ నివాసాల్లో అసంతృప్తుల సమావేశాలు నిర్వహించారు. అప్పుడు పార్టీ ప్రతిష్ట దిగజారకుండా, నేతల మధ్య సమన్వయసాధన, భిన్నాభిప్రాయాలున్న వారికి సర్దిచెప్పేందుకు, ఇలాంటి భేటీల నివారణకు సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి (ప్రస్తుత త్రిపుర గవర్నర్)ఆధ్వర్యంలో కమిటీని వేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యనేతల అసంతృప్త నేతల వ్యవహారం ముదిరిపాకాన పడకుండా ఆయన సర్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా అదేవిధమైన చొరవ, చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సూచిస్తున్నారు. -
మాకే అడ్డొస్తావా? అంటూ హెల్మెట్ పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే
బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి డిప్యూటీ కమిషనర్ కార్యాలయం బయట బీజేపీ నిర్వహించిన నిరసనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారుల మధ్యలో నుంచి స్కూటర్‌పై వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ పాటిల్ టెల్కూర్ అడ్డుకున్నారు. అనంతరం అతడి హెల్మెట్‌ను నేలపై కొట్టారు. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని బీజేపీ కార్యకర్తలు కొట్టేంత పనిచేశారు. ఈ దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. నిరసన ప్రదేశంలో ద్విచక్ర వాహనాన్ని ఆపిన తర్వాత బీజేపీ కార్యకర్తలు దాని చుట్టూ గుమిగూడారు. నిరసన ప్రదేశం మధ్యలో నుంచి కాకుండా మరో మార్గంలో ఎందుకు వెళ్లలేదని నిరసనకారులు ఆ వ్యక్తిని ప్రశ్నించారు. ఆ స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి భయపడిపోయాడు. టెల్కూర్ అక్కడికి వచ్చి జరిగిన వాగ్వాదానికి దిగారు. బీజేపీ కార్యకర్తలు మోటార్‌సైకిల్ టైర్లలోని గాలిని కూడా తీసినట్లు సమాచారం. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.వాగ్వాదం కొనసాగుతున్న సమయంలో పలువురు నిరసనకారులు వాహనం చుట్టూ చేరారు. మరికొందరు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. చివరకు ఈ ఘటనలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ మధ్యలో స్కూటర్‌పై ఉన్న వ్యక్తిని నిరసన ప్రదేశం నుంచి దూరంగా తీసుకెళ్లారు. దీంతో అప్పటికప్పుడు నెలకొన్న ఉద్రిక్తత అదుపులోకి వచ్చింది.కలబురగిలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం కోసం బీజేపీ ఈ నిరసన నిర్వహించింది. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలోని 101 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఈ నిరసన జరిగింది. వీటిలో 89 తాలూకాలను తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా, 12 తాలూకాలను మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరించారు. -
తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్..!
-
రీల్స్.. ఫాలోవర్ల మోజు! పార్టీని పట్టించుకోరా?
పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాలన సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతుందనుకున్న వేళ.. ఓ ఎమ్మెల్యే సొంత పార్టీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని బలోపేతం చేయడం, ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాల్సిన నేతలు.. రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, సొంత ప్రచారానికే పరిమితమవుతున్నారని ఆరోపించారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే కొందరు నాయకులు ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు.బంకురా జిల్లా ఓండా నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అమర్నాథ్ షాకా(Amarnath Sakha).. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని కొందరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా బీజేపీతో కొనసాగుతున్నానని, తప్పు అనిపించిన విషయాలపై మౌనంగా ఉండలేనని పేర్కొన్నారు. ‘‘ఎవరినీ సంతోషపెట్టేందుకు నేను ప్రయత్నించను. తప్పు అనిపించిన దానిని వ్యతిరేకిస్తాను. అందుకే చాలామంది శత్రువులయ్యారు. అది నాకు సమస్య కాదు’’ అని ఆయన పేర్కొన్నారు.పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బీజేపీ నేతలు వాటిని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టడం లేదని షాకా విమర్శించారు. ‘‘ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కొందరు నేతలు సొంత ప్రచారంలోనే మునిగిపోతున్నారు. సీపీఐ(ఎం)కు కౌంటర్ లేదు.. నిరసన లేదు.. ఏమీ లేదు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకంటే బయటి ఈవెంట్లలో ఎక్కువ పాల్గొంటున్నారు. అందరూ రీల్స్ చేయడం, ఫాలోవర్లను పెంచుకోవడం, ఫ్యాన్ క్లబ్‌లు ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు’’ అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పార్టీని పతనం దిశగా..’బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు నేతల వైఖరిలో మార్పు వచ్చిందని షాకా ఆరోపించారు. పదవులు, అధికారంతో వచ్చే ప్రయోజనాలపైనే వారి దృష్టి ఉందని విమర్శించారు. ‘‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా.. అందరూ దాని ప్రయోజనాలను అనుభవించడంలో బిజీగా ఉన్నారు. సొంత కడుపులు నిండితే చాలు.. పార్టీ నరకానికి పోయినా పట్టించుకోరు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘సంపాదన మీదే దృష్టా?’’బీజేపీ కార్యకర్తలు వ్యక్తిగత నాయకుల అభిమానులుగా కాకుండా పార్టీ కోసం పనిచేయాలని షాకా పిలుపునిచ్చారు. ‘‘ఫలానా నాయకుడి అనుచరుడు అవ్వడం బదులు ముందుగా పార్టీకి అనుచరులుగా మారండి. నాయకులు వస్తారు.. పోతారు.. పార్టీ మాత్రం శాశ్వతంగా ఉంటుంది’’ అని సూచించారు.తాను పార్టీ కోసం వ్యక్తిగత జీవితాన్ని, యవ్వనాన్ని, కుటుంబాన్ని సైతం పక్కన పెట్టానని షాకా చెప్పుకున్నారు. సీపీఐ(ఎం) పాలనలో 34 ఏళ్ల హింస, రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొన్నానని, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పాలనలోనూ ఎన్నో ఇబ్బందులు చూశానని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారని అన్నారు.అయితే ఇప్పుడు కొందరి వ్యవహారశైలితో పార్టీ నష్టపోతోందని ఆరోపించారు. ‘‘పార్టీ బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. డబ్బు సంపాదించడంపైనే అందరి దృష్టి’’ అని వ్యాఖ్యానించారు.వామపక్షాల పునరాగమనంపై చర్చమమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసింది. దశాబ్దాల తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం టీఎంసీ పార్టీని పతన స్థితికి తీసుకెళ్లింది. ఇదే అదనుగా బెంగాల్లో సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష కూటమి మరోసారి సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. యువ నాయకులను ముందుకు తీసుకురావడంతో పాటు వీధి పోరాటాలను ముమ్మరం చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నాయకత్వంపై షాకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అయితే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. వామపక్ష కూటమి కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. 2021తో పోలిస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి ఓటు శాతం దాదాపు నాలుగు శాతం తగ్గింది. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు నెలల పాలన పూర్తి చేసుకోబోతున్న వేళ.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం లెఫ్ట్ పార్టీల జనాదరణ కాస్త పెరిగిందనే చెబుతున్నాయి.పార్టీ వేదికపైనే మాట్లాడాలి: బీజేపీ నేతషాకా సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలపై బీజేపీ స్పందించింది. ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన అంశాలను బహిరంగంగా కాకుండా అంతర్గత వేదికల్లో చర్చించాలని సూచించారు. షాకా పార్టీకి నమ్మిన బంటని.. సీనియర్ నాయకుడని, ఆయన అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉందని, పార్టీ అంతర్గతంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తే పరిశీలిస్తామని పేర్కొన్నారు.ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని కొందరు నేతలు పార్టీ కార్యకర్తలు, నాయకులు వసూళ్లు, కట్‌మనీ వంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో షాకా తాజా వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా బెంగాల్లో వామపక్షాలు తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. బీజేపీ అంతర్గతంగా నాయకత్వం, సంస్థాగత పనితీరు, సోషల్ మీడియా ప్రచారం చుట్టూ మొదలైన ఈ వివాదం పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది.ఇదీ చదవండి: పాక్ ప్రధాని సమక్షంలో మోదీ స్ట్రాంగ్ కౌంటర్ -
భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల బాహాబాహీ
సాక్షి యాదాద్రి: భువనగిరి జిల్లా కేంద్రంలోనూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం కార్యాలయాలపై దాడులకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ముందుగా బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం ఉదయం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ కుమార్‌రెడ్డిల ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులపై పెట్రోల్, డీజిల్, ఆయిల్‌తో పాటు కాషాయ రంగును చల్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేవైఎం దాడికి నిరసనగా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు భువనగిరి పట్టణ పరిధిలోని నల్లగొండ బైపాస్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై దాడికి యత్నించారు. ఈ క్రమంలో రెండు పార్టీల నాయకులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్–బీజేపీ శ్రేణులు ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ రాళ్లదాడిలో ఇరువర్గాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.రాష్ట్ర బీజేపీకి అండగా ఉంటాం: నితిన్నబీన్ తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్నబీన్ ఆరా తీశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావుకు ఫోన్ చేసిన నబీన్ ఈ రెండు రోజుల్లో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీకి, నేతలకు జాతీయ పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని రాంచందర్‌రావుకు నితిన్నబీన్ భరోసా ఇచ్చారు. ⇒ ‘ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? దాడులు చేసే వారిని కాపాడుతూ పరామర్శకు వెళ్లే వారిని అరెస్ట్ చేయడమేంటీ?’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.⇒ ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన..వెయ్యి మోసాల దగా కోరు పాలన. ఇది ప్రజా పాలన కాదు. చేతల్లో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన’అని బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. ⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. డీజీపీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం బీజేపీ కార్యాలయాలు, నాయకులపై జరిగిన దాడులపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. యూత్ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు బీజేపీ ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన సంత్ శిరోమణి రవిదాస్ చిత్రపటాల పోస్టర్లపై నల్లరంగు పూసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు పెట్టాలని అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఫిర్యాదు చేశారు.ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టులు సాక్షి, నెట్వర్క్: బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా మంగళవారం ట్యాంక్‌బండ్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్‌లను అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ⇒ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావును మంగళవారం పోలీసులు తార్నాకలోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డిని పరామర్శించేందుకు వెళుతుండగా, రాంచందర్‌రావును అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ రాంచందర్‌రావును అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
-
హై టెన్షన్.. టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అరెస్ట్
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయం, జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నల్గొండ వెళ్లడానికి సిద్ధమవ్వగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆయన్ని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని తార్నాకలోని రాంచందర్‌రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.మరో వైపు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నల్గొండలో పర్యటిస్తారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం దాడులు, నేతల పర్యటనల నేపథ్యంలో పోలీసుల అలర్ట్ అయ్యారు. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పార్టీ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ బందోబస్తు చేపట్టారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్‌లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు.బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న గేటుకు నల్ల రంగు పూసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. -
అసెంబ్లీని ముట్టడిస్తాం
సాక్షి, సిద్దిపేట: ‘22ఏ జాబితాలో చేర్చిన భూము లకు వెంటనే విముక్తి కల్పించాలి..లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్చరించారు. ధరణి కంటే దారు ణంగా భూభారతి మారిందన్నారు. 22ఏలో చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు హాజరై మాట్లాడారు. 22ఏ జాబితా విషయంలో పొరపాట్లు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా అంగీకరించారని, వాటిని వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఒక ఫ్యామిలీ.. ఇప్పుడు బ్రదర్స్ బాగుపడు తున్నారన్నారు. సీఎం ఇల్లు ఎలా బయటపడిందో చెప్పాలిజూబ్లీహిల్స్లోని 403 సర్వే నంబర్లో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే ప్రభుత్వ భూములని, మిగతా భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చా రని రాంచందర్‌రావు ఆరోపించారు. ఇదే జాబితాలో సీఎం రేవంత్‌రెడ్డి నివాసం కూడా ఉందని, ఆ ఇల్లు 22ఏ జాబితా నుంచి ఎలా బయటపడిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడుతున్నాయని చెప్పారు. 22ఏలో జరిగిన గందరగోళాన్ని సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి చేసిన దరఖాస్తు చూపించాలి: రఘునందన్‌రావు22ఏ జాబితాలో ఉన్న తన ఇల్లు తొలగింపు కోసం రేవంత్‌రెడ్డి చేసిన దరఖాస్తును ప్రజలకు చూపించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఎలాంటి దరఖాస్తు లేకుండానే సీఎం ఇల్లు నిషేధిత భూముల్లో నుంచి తొలగించారని ఆరోపించారు. ‘పొట్టోడికి పరిపాలన రాదు.. భూముల లిటికేషన్ పెట్టడం మాత్రం వచ్చు’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. -
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ /హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల దాడులు, నిరసనలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు కాంగ్రెస్ శ్రేణులు నల్లరంగు వేయగా, ప్రతిగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి దిగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై, బిహార్‌లో విద్యార్థులపై బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న గేటుకు నల్ల రంగు పూసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టి»ొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు యూత్ కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. గాం«దీభవన్ ముట్టడికి యత్నం.. బీజేపీ రాష్ట్ర కార్యాలయ గేటుకు యూత్ కాంగ్రెస్ శ్రేణులు నల్ల రంగు పూయడంపై బీజేవైఎం శ్రేణులు మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో గాం«దీభవన్ ముట్టడికి యతి్నంచారు. గాంధీభవన్‌పై కోడ్డిగుడ్లు విసిరేసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అట్టుడికిన నల్లగొండ బీజేపీ, కాంగ్రెస్ పరస్పర నిరసన దాడులతో నల్లగొండ జిల్లా కేంద్రం అట్టుడికింది. శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంపు కార్యాలయంపై (వ్యక్తిగత కార్యాలయం) సోమవారం బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నేతృత్వంలో కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. అక్కడే ఉన్న మంత్రి ప్లెక్సీకి నిప్పంటించారు. దీంతో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో దేవరకొండ రోడ్డు చైతన్యపురికాలనీలో ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారు. ఇంట్లోని టీవీ, డైనింగ్ టేబుల్, ప్రిజ్, తదితర వస్తువులను పగులగొట్టారు.అడ్డుకోబోయిన వర్షిత్‌రెడ్డి తల్లిని కాంగ్రెస్ కార్యకర్తలు తోసేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు ఆమె తలను టీవీకేసి కొట్టారని, దీంతో ఆమెకు గాయాలయ్యాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఆమెను చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చినట్టు పేర్కొన్నారు. అనంతరం కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వైపు వెళ్లి ఫ్లెక్సీలను ధ్వంసం చేసి రాళ్లు రువ్వారు.ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ తలకు గాయమైంది. మరోవైపు పార్టీ కార్యాలయం లోపలినుంచి బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడం, ఇరువర్గాలు ఎదురుపడితే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉండటంతో పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. వంద మంది వచ్చి నా ఇంటిపై దాడి చేశారని వర్షిత్‌రెడ్డి తల్లి శ్రీదేవి చెప్పారు.ప్రశ్నిస్తే దాడులేనా? – జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావు, ఏలేటి అధికారం అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం, ఇళ్లలోకి చొరబడి ఫరి్నచర్ ధ్వంసం చేయడం ఏమిటని కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండ సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడాన్ని ఇద్దరూ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. బీజేపీ కార్యాలయాలు, నాయకుల నివాసాలపై కాంగ్రెస్ శ్రేణుల దాడుల యత్నం పిరికిపంద చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న అరాచకానికి, గూండా రాజ్యానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ప్రత్యక్ష నిదర్శనమని బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. -
కోమటిరెడ్డి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తల దాడి
సాక్షి, నల్గొండ: జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో విరుచుకపడ్డారు. అనంతరం మంత్రి ఆఫీసును తగలబెట్టే యత్నం చేశారు. తమ పార్టీ ఆఫీసుపైకి వస్తే ప్రతిఘటన తప్పదని బీజేపీ శ్రేణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు సైతం దాడికి తెగబడ్డారు. నల్లగొండ బీజేపీ ఆఫీసుపై దాడికి తెగబడ్డారు. జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అసలు ఏమైందిఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ‘కాంగ్రెస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో అమిత్ షా దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లిన యూత్ కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ఆఫీస్ గేట్లకు నల్లరంగు పూయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.అనంతరం దీనికి ప్రతికారంగా గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. గాంధీ భవన్ వైపు వచ్చిన పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇరువర్గాల ఆందోళనల నేపథ్యంలో గాంధీ భవన్‌పై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గాంధీ భవన్ చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి ఆఫీసుపై మరోసారి బీజేపీ శ్రేణులు దాడి చేశారు. -
గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత..బీజేపీ Vs కాంగ్రెస్
-
అప్పుడు ఆరోపణలతో దూరం.. ఇప్పుడు ‘అస్త్రం’గా దూకుడు!
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సమాజ్‌వాదీ పార్టీ వ్యూహం స్పష్టమవుతోంది. ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కంటే ఇప్పుడు ఆయన భార్య, మైన్‌పురి ఎంపీ డింపుల్ యాదవ్ ఎక్కువగా రాజకీయ వేదికలపై కనిపిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ రాజకీయాల ఆరోపణలకు దూరంగా ఉంచిన ఆమెనే ఇప్పుడు బీజేపీని ఎదుర్కొనేందుకు అఖిలేశ్ కీలక అస్త్రంగా ముందుకు తెస్తున్నట్లు కనిపిస్తోంది.2017లో రాహుల్ గాంధీ చేసిన కుటుంబ రాజకీయాల విమర్శల నేపథ్యంలో అఖిలేశ్.. తన భార్య డింపుల్ యాదవ్ ఇక ఎన్నికల్లో పోటీ చేయరని ప్రకటించారు. కానీ ఆ హామీ ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో కన్నౌజ్ నుంచి పోటీ చేసి ఓడిన డింపుల్.. ములాయం సింగ్ యాదవ్ మరణం తర్వాత 2022లో మైన్‌పురి లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచారు. 2024లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వరుస విజయాలతో ఆమె కేవలం యాదవ్ కుటుంబ వారసురాలిగానే కాకుండా, సొంత రాజకీయ గుర్తింపు ఉన్న నాయకురాలిగా ఎదిగారు.జంతర్ మంతర్ నుంచి లక్నో వరకు..ఈ మధ్యకాలంలో డింపుల్ రాజకీయం మరింత దూకుడుగా కనిపిస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో ఆమె పాల్గొనడం, గాయపడిన నిరసనకారులను పరామర్శించడం చర్చనీయాంశమైంది. అఖిలేశ్ పార్లమెంట్లో ఉండగా.. డింపుల్ రోడ్డుపై నిరసనకారుల మధ్య కనిపించడం ఆమెకు నెక్ట్స్‌లెవల్ పొలిటికల్ ఇమేజ్ను తీసుకొచ్చింది.ఆగస్టు 26న లక్నోలోని లోహియా సభాగార్లో నిర్వహించిన కార్యక్రమంలోనూ డింపుల్ కేంద్రబిందువుగా నిలిచారు. మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిండిన వేదికపై అఖిలేశ్ ఒక్కరే ఉన్నారు. డింపుల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ను ప్రకటించారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన మహిళలకు ఏటా రూ.40 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం ద్వారా బీజేపీ మహిళా ఓటు బ్యాంకుపై నేరుగా గురిపెట్టారు.మహిళా ఓటర్లే లక్ష్యంఉత్తరప్రదేశ్లో సమాజ్‌వాదీ పార్టీకి చాలాకాలంగా మహిళా ఓటర్ల మద్దతు బలహీనంగా ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లలో బీజేపీకి ఎస్పీ కూటమిపై గణనీయమైన ఆధిక్యం లభించింది. గతంలో ఎస్పీ పాలనలో శాంతిభద్రతలు, మహిళల భద్రత అంశాలను బీజేపీ పదేపదే ప్రచారాస్త్రంగా ఉపయోగించింది.ఇప్పుడు డింపుల్‌ను ముందుకు తీసుకురావడం ద్వారా ఆ ప్రతికూల ముద్రను కొంతమేర మార్చాలని అఖిలేశ్ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మహిళల భద్రత, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలపై డింపుల్ గళం వినిపిస్తున్నారు. మహిళలను ‘ఆధీ ఆబాదీ’(మెజారిటీ సమాజం)గా పరిగణిస్తూ పీడీఏ(పిచ్డా(OBC), దళిత్, అల్పసంఖ్యక్) సామాజిక సమీకరణాన్ని మరింత విస్తరించాలన్న సంకేతాలను ఇస్తున్నారు.ఆ ఫలితాలే ధైర్యానిచ్చాయా?2024 లోక్‌సభ ఎన్నికలు ఎస్పీకి కొత్త ఊపునిచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీ 37 స్థానాలు గెలుచుకుంది. ఇండియా కూటమి మొత్తం 43 స్థానాలను దక్కించుకుంది. ఈ ఫలితాల నేపథ్యంలో లోక్‌సభ విజయాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని అఖిలేశ్ వ్యూహం రచిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లలో బీజేపీకి ఉన్న పట్టు సడలిస్తేనే అసెంబ్లీ పోరులో ఎస్పీకి గణనీయమైన లాభం చేకూరే అవకాశం ఉంది. అందుకే డింపుల్ యాదవ్‌ను మహిళా ముఖంగా ముందుకు తీసుకురావడం వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తోంది.రాజకీయంగా అఖిలేశ్ దూకుడైన నేతగా కనిపిస్తే.. డింపుల్ అదే పోరాటాన్ని మరింత సౌమ్యమైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లగలరన్న అంచనా ఉంది. కుటుంబ వారసత్వం నుంచి వచ్చినప్పటికీ రెండు విజయాలతో తనకు తానుగా ఓ రాజకీయ బలం సంపాదించుకున్నారన్నది ఎస్పీ వర్గాల నమ్మకం. అందుకే ఒకప్పుడు కుటుంబ రాజకీయాల విమర్శల నుంచి తప్పించేందుకు ఎన్నికలకు దూరంగా ఉంచిన డింపుల్.. ఇప్పుడు 2027లో అఖిలేశ్‌కు బీజేపీపై పోరులో అత్యంత కీలకమైన రాజకీయ అస్త్రంగా మార్చుతున్నారనే విశ్లేషణలు యూపీ రాజకీయాల్లో నడుస్తున్నాయి.ఇదీ చదవండి: విజయ్.. సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం! -
నన్ను కొట్టి ఫోన్ లాక్కొని.. బీజేపీ రవిప్రకాష్ కిడ్నాప్ పై భార్య సంచలన కామెంట్స్
-
యువతే లక్ష్యంగా బరిలోకి..!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని యువతకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ రంగం సిద్ధం చేస్తోంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకుని వారితో అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ అంశమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, యువతతో పార్టీ కమ్యూనికేషన్‌ను మరింత పటిష్టం చేసే వ్యూహాలను ఇందులో ప్రముఖంగా చర్చించారు. దీర్ఘకాలిక అభివృద్ధే అజెండాఢిల్లీలో శనివారం జరిగిన సమావేశంలో కొత్తగా నియ మితులైన బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు హేమంగ్ జోషితో పాటు మాజీ యువమోర్చా అధ్యక్షులు అను రాగ్ ఠాకూర్, పూనమ్ మహాజన్, తేజస్వీ సూర్య పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతీ ఇరానీ, గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్‡్ష సంఘవి, ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ, ఎంపీలు రవి కిషన్, కమలేశ్ పాశ్వాన్, గురు ప్రకాశ్, యోగేంద్ర చందోలియా, రాజు బిస్తా పాల్గొన్నారు. యువతకు పార్టీని చేరువగా తీసుకెళ్లడం, చర్చలు, అనుసంధానాన్ని మెరుగుపరిచే వ్యూహాలపై వీరు చర్చించారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం, దీర్ఘకాలిక అభివృద్ధిని ప్రధాన అజెండాగా ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల పై వారికి నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. సామాజిక మాధ్యమాలు, ఆధునిక కమ్యూనికేషన్ మార్గాలను విస్తృతంగా ఉపయోగించుకుని యువతతో మమేకం కావాలని సూచించినట్లు సమాచారం. యువత సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిపై పార్టీ స్పందించే విధానాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాస్తవంగా ప్రజలకు చేరుతున్నాయా లేదా అన్నది యువ నాయకత్వం క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని నబీన్ సూచించారు. ప్రభుత్వం–ప్రజల మధ్య పార్టీ వారధిగా వ్యవహరించాలని, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి అవసరమైన చోట ప్రభుత్వానికి చేరవేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని యువ నేతలకు నబీన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రజల్లో పార్టీపై విశ్వాసాన్ని పెంచేలా నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేయాలని నేతలకు సూచించారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించే విషయంలో పార్టీ నాయకులు సంయమనం, క్రమశిక్షణ పాటించాలని నబీన్ సూచించినట్లు సమాచారం. సంస్థాగత గౌరవాన్ని కాపాడుతూ వాస్తవాలు, క్రమబద్ధమైన వాదనల తో రాజకీయ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువ నేతలకు ఆయన మార్గనిర్దేశం చేసినటుŠల్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
మోదీగారు...‘శుద్దీకరణ’ నేరం!
న్యూఢిల్లీ: ‘శుద్దీకరణ’వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలకు దిగారు. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను భారతీయ జనతా పార్టీ నేతలు శుద్ధి చేయడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఒక నేరమని, ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా చూడాలని రాహుల్ గాంధీ శనివారం డిమాండ్ చేశారు. దళితులు బాగుంటే ఓర్చుకోలేని బీజేపీ–ఆర్ఎస్ఎస్ మనస్తత్వం ఇదని ఆయన న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. నేరం జరిగి 20 రోజులు అవుతున్నా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఎత్తి చూపారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడికి న్యాయం కల్పించండి. న్యాయ దక్కేలా చేయడం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఉత్తరాఖండ్ విభాగం అధ్యక్షుడు మహేంద్ర భట్ ‘శుద్ధీకరణ’ను సమర్థించుకున్నారని ఆరోపించిన రాహుల్.. ఆ ‘‘ఆ పని (శుద్ధీకరణ) చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నది మా డిమాండ్. ప్రధాని నరేంద్ర మోదీ తాను అన్ని కులాలకు చెందిన వాడినని, దేశానికి ప్రధానిని అని చెబుతూంటారు. కానీ ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మాత్రం శుద్ధీకరణను సమర్థించుకుంటున్నారు’’అని విమర్శించారు. శుద్దీకరణ చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్లని, వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ప్రధాని ఆదేశించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘హల్ద్వానీలో ఖర్గే ర్యాలీ జరిగిన రెండు రోజులకు ఆగస్టు పదవ తేదీన వాళ్లు శుద్దీకరణ చేశారు. ఇది నేరం. ఆగస్టు 13న ఖర్గే ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు’’అని గుర్తు చేశారు. ‘‘రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమిది. రాజ్యాంగాన్ని అందించిన బీఆర్ అంబేద్కర్ లాంటి వారు, మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలు ఒకపక్కన ఉంటే బీజేపీ–ఆర్ఎస్ఎస్ ఇంకోపక్కన ఉన్నాయి’’ అని అన్నారు.దళితులపై వేల ఏళ్లుగా హింసదళితులపై వేల ఏళ్లుగా హింస జరుగుతోందని, రాజ్యాంగం ప్రకారం ఇది అక్రమమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈనాటికి కూడా దళిత బిడ్డలతో పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారని, ఇదీ ఈ దేశపు వాస్తవం అని రాహుల్ ఆరోపించారు. దళితులు బావుల్లోంచి నీరు తాగకుండా, టీకొట్లలో రెండు గ్లాసుల పద్ధతి పాటిస్తున్నారని ఒకటి దళితులకు, ఇంకోటి ఇతరులకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. దళిత వరుడు గుర్రంపై ఊరేగుతూ ఎక్కడ తనను కొడతారో అన్న భయంతో హెల్మెట్ ధరించాల్సిన భారత్‌లో ఉన్నామని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే మాత్రమే కాకుండా రాజస్థాన్ నేత తికారామ్ జుల్లి, ఎన్డీయే మంత్రి జీతన్ రామ్ మాంఝీలు కూడా పలు సందర్భాల్లో శుద్దీకరణ అవమానాన్ని ఎదుర్కొన్నట్లు తెలిపారని రాహుల్ వివరించారు. దళితులు ఎంత సక్సెస్ సాధిస్తే అతడిపై దాడులు అంత తీవ్రంగా ఎక్కువవుతాయని ఆరోపించారు. ‘‘ఇది అంటరానితనానికి మరోపేరు’’అని చెప్పారు. -
విశాఖ, రాజమండ్రి మేయర్ స్థానాలు మనకే దక్కాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతానికి స్థానిక, మునిసిపల్ ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకోవాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ జాతీయ పెద్దలు సూచించినట్లు తెలిసింది. 2014–18 తరహాలో కాకుండా.. గెలిచే అవకాశం ఉన్న అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా రానున్న మునిసిపల్ ఎన్నికల్లో విశాఖపట్నం, రాజమండ్రి మేయర్ స్థానాలను తమకే కేటాయించాలని బీజేపీ కోరుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం మేయర్, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్‌లసహా అన్ని కేటగిరి స్థానాల్లో బీజేపీ తగిన వాటా పొందేలా రాష్ట్ర పార్టీ ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. నాలుగు జోన్లుగా విభజన.. కృష్ణా లేదా ఏలూరు జిల్లాల్లో ఏదో ఒక జెడ్పీ చైర్మన్ పదవిని అలాగే నరసాపురం, గుంటూరు, తిరుపతి, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పలు మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ స్థానాలను తమకు కేటాయించేలా ఒత్తిడి చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ క్రియాశీలకంగా వ్యవహరించేందుకు వీలుగా రాష్ట్ర నాయకత్వం రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే నాలుగు జోన్లుగా విభజించింది. ప్రతి జోన్‌కు వేర్వేరు ప్రణాళికలు సిద్ధం చేసింది.నాలుగు జోన్లకు బాధ్యతలు పొందిన నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ పోటీకి అనువుగా ఉన్న స్థానాలు, అభ్యర్థులను గుర్తించి ఓ జాబితాను రూపొందించారు. నామినేటెడ్ పదవుల నియామకాల్లో బీజేపీకి అంతంత మాత్రంగానే ప్రాధాన్యత లభించిందని, స్థానిక సంస్థల, మునిసిపల్ ఎన్నికల విషయంలో ఇలా ఎంతమాత్రం జరగడానికి వీల్లేదని పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం టీడీపీ పెద్దలకు తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. -
అర్వింద్‌పై బీజేపీ నేతల అసంతృప్తి.. నాంపల్లి కార్యాలయం ముట్టడికి పిలుపు
సాక్షి, జగిత్యాల: జిల్లా బీజేపీలో ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ అర్వింద్ వ్యవహారంపై స్థానిక జిల్లా నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ అంశమై ఈ రోజు ( శనివారం) రేకుంటలో బీజేపీ కౌన్సిలర్లు, ముఖ్యనేతలు కీలక సమావేశం నిర్వహించారు. అర్వింద్ వ్యవహారశైలికి నిరసనగా హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయ ముట్టడికి చేయాలని తీర్మానించారు. దీంతో జిల్లా కాషాయదళంలో లుకలుకలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి.ఎంపీ అర్వింద్ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణిని వెనుకేసుకురావడంపై నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఈ విషయమై ఇదివరకే పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీంతో తీవ్ర అసహానం వ్యక్తం చేసిన నేతలు నాంపల్లి కార్యాలయ ముట్టడికి నిర్ణయం తీసుకున్నారు. -
కేజీఎఫ్ వీడియో క్లిప్.. వివాదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంద్రాగస్టు నాడు ఎర్రకోట నుంచి చేసిన స్వాతంత్ర్య దినోత్సవ చేసిన ప్రసంగంలో 'దిమాగీ నక్సలైట్లు' అనే మాట వాడారు. మావోయిస్టు భావజాల మద్దతుదారులను ఆయన ఈ విధంగా వర్ణించారు. అంతేకాదు దిమాగీ నక్సలైట్లు అన్ని వ్యవస్థల్లోనూ పాతుకుపోయారని.. దేశంలో హింస, అరాచకాలను రెచ్చగొట్టే అవకాశాల కోసం కాపుకాచుకుని కూర్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు ఒంటికాలిపై లేచాయి. దిమాగీ నక్సలైట్ల పేరుతో అసమ్మతిని అణచడానికి మోదీ సర్కారు కుటిలయత్నం చేస్తోందని మండిపడ్డాయి.తాజాగా కర్ణాటక బీజేపీ విభాగం ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌పై వివాదం రాజుకుంది. దిమాగీ నక్సల్స్‌ను ఉపేక్షించబోమంటూ పెట్టిన పోస్ట్‌కు జత చేసిన వీడియోపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ''నెమ్మదించే సమస్యే లేదు.. సర్వశక్తులు ఒడ్డి దిమాగీ నక్సల్స్‌పై పోరాటం చేస్తామంటూ'' కర్ణాటక బీజేపీ అధికారిక ఎక్స్ పేజీలో ఈ నెల 27న ఒక పోస్ట్ పెట్టింది. దీనికి యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలోని వీడియో క్లిప్పింగ్ జతచేసింది. కొండపై నుంచి హీరో యశ్.. విలన్ సంజయ్‌దత్ గ్యాంగ్‌పై తుపాకులతో కాల్పులు జరుతున్న సన్నివేశంలోని క్లిప్ ఇది. ఇందులో ప్రతినాయకుల బృందాన్ని దిమాగీ నక్సల్స్‌గా పేర్కొంది.మీర్జాపూర్.. కేజీఎఫ్ఛత్తీస్గఢ్ బీజేపీ విభాగం ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌కు స్పందనగా కర్ణాటక కమలం పార్టీ ఈ పోస్ట్ పెట్టింది. 'దిమాగీ నక్సల్‌గా ఉండడం కంటే దేశ ప్రగతిలో పాలుపంచుకోవాలని' పేర్కొంటూ.. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లోని వీడియో క్లిప్‌ను జతచేసింది ఛత్తీస్‌గఢ్ కాషాయదళం. దీనికి ప్రతిస్పందనగా కర్ణాటక బీజేపీ, 'కేజీఎఫ్ 2' వీడియో క్లిప్ పెట్టింది. దీనిపై ప్రజాస్వామికవాదులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తన మాట వినని వారిని ప్రభుత్వం తుపాకులతో భయపెడుతోందంటూ దుయ్యబడుతున్నారు.ఇదీ చదవండి: 'ఎదురు చెప్పను.. ప్రెస్‌మీట్ పెట్టను'మిమ్మల్ని ప్రశ్నించే వారిని నిర్మూలిస్తారా?భయం, అహంకారంతో ప్రభుత్వం నిరంకుశత్వానికి పాల్పడుతోందని ధ్వజమెత్తున్నారు. యువత మాట వినాల్సిన ప్రభుత్వం వారిని తూటాలతో బెదిరిస్తోందనిచ మండిపడుతున్నారు. అధికార పార్టీకి చెందిన అధికారిక హ్యాండిల్లో బెదిరింపులు, బలప్రయోగ హెచ్చరికలు చేయడాన్ని ఖండించారు. బీజేపీ రాష్ట్ర ఐటీ సెల్లు దాదాపు ప్రతి పోస్టులోనూ ఒకే రకమైన బెదిరింపు, అహంకారం, ధిక్కారంతో హింసను, ద్వేషాన్ని, గూండాగిరిని ఎందుకు ప్రదర్శిస్తూనే ఉన్నాయని ప్రశ్నించారు. బీజేపీ ఇంతలా దిగజారుతుందని ఎప్పుడూ అనుకోలేదని పేర్కొన్నారు. 'మీ విధానాలు నచ్చని వారిని, మిమ్మల్ని ప్రశ్నించే వారిని నిర్మూలించాలని భావించడం సరికాదని' అన్నారు.No slowing down - taking on "Dimaagi Naxals" with full force! https://t.co/cYhIZmKJ6E pic.twitter.com/iqANzyrBRT— BJP Karnataka (@BJP4Karnataka) August 27, 2026 -
ఆ మూడింటి వల్లే.. సోనియా పుస్తకాన్ని ఆపేశారా!?
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకం భారత్‌లో ప్రచురణపై వివాదం ముదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పుస్తకాన్ని ప్రచురించేందుకు సిద్ధమైన పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా.. ఇక్కడ మాత్రం పబ్లిష్ చేయబోమని ప్రకటించింది. అయితే వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతోనే పెంగ్విన్ వెనక్కి తగ్గిందని అంటోంది.సోనియా గాంధీ రాసిన ఈ జ్ఞాపకాల పుస్తకాన్ని అమెరికాకు చెందిన ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్.. పెంగ్విన్ రాండమ్ హౌస్ గ్రూప్‌లోని సంస్థగా నవంబర్ 10న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే భారత్‌లో ఈ పుస్తకానికి పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురణకర్త కాదని తాజాగా స్పష్టం చేసింది. పుస్తకాన్ని ప్రచురించేందుకు తాము ఆసక్తి చూపామని, అయితే అందులో కొన్ని విషయాల్ని తాము నిజమా? కాదా? అని ధృవీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ క్రమంలో రచయిత(సోనియా గాంధీ)తో జరిగిన చర్చల పూర్తి ఫలవంతంగా జరగలేదని వెల్లడించింది. ఆ వివరాలు గోప్యమైనవని, వాటిపై మరింత వ్యాఖ్యానించబోమని తెలిపింది.మూడు అంశాలే అసలు వివాదమా?కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆటోబయోగ్రఫీలో మూడు కీలక అంశాలపై పెంగ్విన్ ఇండియాతో సోనియా గాంధీకి విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మొదటిది చైనా సరిహద్దు వివాదం, భారత భూభాగంలో చొరబాట్లు. రెండోది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, ఆయన పనితీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సోనియా గాంధీ అభిప్రాయాలు. మూడోది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రభావం, భారత రాజకీయాలు-సామాజిక వ్యవస్థపై దాని పాత్ర. ఈ అంశాలకు సంబంధించిన కొన్ని భాగాలను సవరించాలని లేదంటే పూర్తిగా తొలగించాలని పెంగ్విన్ ఇండియా సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన అనుభవాలు, అభిప్రాయాల ఆధారంగా రాసిన విషయాలను మార్చేందుకు సోనియా గాంధీ అంగీకరించలేదని సమాచారం.‘ఒత్తిడి ఉంది’.. కాంగ్రెస్ ఆరోపణఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్.. పెంగ్విన్ ఇండియా ప్రకటన బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్, ఇతర అంశాలపై పుస్తకాలను ప్రచురించేందుకు సంస్థ సిద్ధంగా ఉండగా.. సోనియా గాంధీ పుస్తకంపై ఎందుకు వెనుకడుగు వేసిందని ప్రశ్నించారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ కూడా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. ప్రపంచవ్యాప్తంగా అదే పుస్తకాన్ని ప్రచురిస్తున్నప్పుడు భారత్‌లో మాత్రం మార్పులు ఎందుకు కోరుతున్నారని నిలదీశారు. పుస్తకాన్ని ఒత్తిడితో అడ్డుకోవడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం అని ఆరోపించారు.‘కట్టుకథలు అల్లొద్దు’.. బీజేపీ కౌంటర్కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. పుస్తకంపై భయాందోళన వాతావరణం ఉందంటూ కాంగ్రెస్ తప్పుడు కథనాన్ని సృష్టిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేసవన్ విమర్శించారు. పుస్తకంలోని ఏ భాగాలకు వాస్తవ నిర్ధారణ అవసరమైందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత అజయ్ అలోక్.. పుస్తకంలో వాస్తవాలు, గణాంకాలు సరిగా లేకపోవడం వల్లే ప్రచురణకర్తలు వెనక్కి తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు.ఆత్మకథలో ఏముంది?‘Belonging: A Journey of Love’లో తన జీవితంలోని వ్యక్తిగత, రాజకీయ ప్రయాణాన్ని సోనియా గాంధీ వివరించారు. ఇటలీలో ఓ చిన్న పట్టణంలో గడిపిన బాల్యం నుంచి రాజీవ్ గాంధీ భార్యగా భారత్‌కు రావడం, ఇందిరా గాంధీ కోడలిగా మారడం, 1984లో ఇందిరా గాంధీ హత్య, 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత రాజకీయాల్లోకి రావడం వంటి కీలక ఘట్టాలను పుస్తకంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం కొనసాగిన తన రాజకీయ జీవితంతోపాటు.. 2004లో ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని తిరస్కరించిన నిర్ణయం గురించి కూడా తన జ్ఞాపకాలను పంచుకున్నట్లు ప్రచురణకర్త వెల్లడించింది.ఇక భారత్‌లో ఈ పుస్తకాన్ని ఎవరు ప్రచురిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పెంగ్విన్ ఇండియా నుంచి పుస్తక ప్రచురణ తప్పుకున్న నేపథ్యంలో హార్పర్‌కాలిన్స్ సహా పలు భారతీయ ప్రచురణ సంస్థలు హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అయితే పెంగ్విన్ అభ్యంతరాలపై కాంగ్రెస్-బీజేపీ మధ్య కౌంటర్లతో సోనియా గాంధీ పుస్తకం విడుదలకు ముందే రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా చుట్టూ వివాదాలు కొత్తేమీ కావు. గతంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రచించిన Four Stars of Destiny విషయంలోనూ ప్రచురణపై వివాదం చెలరేగింది. అలాగే వెండీ డోనిగర్ రచించిన The Hindus: An Alternative History పుస్తకాన్ని 2014లో న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో పెంగ్విన్ ఇండియా భారత మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. తాజాగా సోనియా గాంధీ Belonging: A Journey of Love విషయంలోనూ ప్రచురణపై వివాదం తెరపైకి రావడంతో పెంగ్విన్ వ్యవహారశైలి మరోసారి చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: మలాలా ఆత్మకథ చదివినందుకు.. పనిష్మెంట్! -
జెన్–జీ.. దగ్గరవడంలో లేజీ..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర నేతలకు కొత్త సమస్య వచ్చి పడింది. ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జెన్–జీ ఆందోళనలు తదనంతర పరిణామాల నేపథ్యంలో నవ యువతరానికి దగ్గరయ్యేది ఎలా అన్న మీమాంస పట్టిపీడిస్తోందట. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పార్టీ శాఖలు, సోషల్ మీడియా టీమ్‌లు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. జెన్–జీకి దగ్గర కావాలని, నేటి తరంతో మమేకం కావాలని ప్రధాని మోదీ కూడా కమలం నేతలకు సూచించారు. అయితే బీజేపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాఖలు మాత్రం వెనుకబడ్డాయని పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.తెలంగాణ బీజేపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌ను ఆ పార్టీ అభిమానులే వ్యంగ్యోక్తులు, మీమ్లతో ట్రోలింగ్ చేసే పరిస్థితి కూడా ఎదురవుతోంది. బీజేపీ నేషనల్ టీమ్, ఇతర రాష్ట్రాల సోషల్ బృందాలతో పోల్చుతూ రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులను ఉద్దేశించి హిందుత్వవాదుల వ్యంగ్యబాణాలు సంధిస్తుండడంలో అవాక్కు కావడం నేతల పనైంది.‘మీకు చేతకాకపోతే చెప్పండి... మేమైనా మీకు కంటెంట్ ఇస్తాం’అన్నంత వరకూ విమర్శలు వెళ్లాయి. వివిధ రాష్ట్రాల బీజేపీ అకౌంట్స్ రాహుల్‌గాంధీని, ‘దిమాగీ నక్సల్స్’లక్ష్యంగా అగ్రెసివ్ పోస్టులు పెడుతూ సినిమా డైలాగులు, సినిమా సీన్లు, ఏఐ జనరేటెడ్ కంటెంట్ పెట్టి రచ్చరచ్చ చేస్తుంటే, రెండు రాష్ట్రాల వారు చేష్టలుడిగి మిన్నకుండిపోతున్నారనే దాడి తీవ్రస్థాయికి చేరుకుంటోంది.దిద్దుబాటు చర్యల్లో రాష్ట్ర నేతలుతెలంగాణ బీజేపీ సోషల్ మీడియా టీమ్ మాత్రం బాగానే పోస్టింగ్‌లు పెడుతున్నామనే అభిప్రాయంతో ఉందట. అయితే పార్టీకి కాకుండా కొందరు లీడర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఈ టీమ్‌పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా యువత, విద్యార్థులకు దగ్గర అయ్యేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పార్టీ అధ్యక్షుడు మొదలు వివిధ స్థాయిల నేతలు, అనుబంధ విభాగాలు కాలేజీ క్యాంపస్‌ల సందర్శన మొదలైంది.ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై పార్టీపరంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో యువ క్రీడాకారులు, విద్యార్థులు ఖేలో ఇండియాకు సంబంధించిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. దీంతో దిద్దుబాటులో రాష్ట్రపార్టీ నిమగ్నమైందని, వివిధ అంశాలపై చురుగ్గా వ్యవహరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు స్పష్టమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కన్నీళ్లతో మంత్రి రాజీనామా.. ఇది తొలిసారి కాదు
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ నుంచి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ నేత బి.నాగేంద్ర ప్రకటించారు. ఆ సమయంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అవినీతి ఆరోపణలపై బీజేపీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన డీకే శివకుమార్ నేతృత్వంలోని కర్ణాటక మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఇదే వివాదం కారణంగా రెండేళ్ల క్రితం కూడా ఆయన రాజీనామా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆగస్టు మొదటి వారంలో నాగేంద్ర తిరిగి మంత్రివర్గంలోకి వచ్చారు.కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.89 కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ లేవనెత్తుతోంది. 2024 మేలో ఆ సంస్థ ఖాతాల అధికారి చంద్రశేఖరన్ పి.ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనధికారికంగా నిధులు బదిలీ చేశారని ఆరోపిస్తూ ఆయన ఒక లేఖను వదిలి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో సంస్థ బ్యాంకు ఖాతాల నుంచి భారీ మొత్తంలో డబ్బు వివిధ ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు తేలింది.సిద్ధరామయ్య మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన నాగేంద్ర ప్రముఖ ఎస్టీ నేత. కాంగ్రెస్ పార్టీ శివకుమార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించిన తర్వాత, ఈ వివాదం నేపథ్యంలో 2024 జూన్‌లో నాగేంద్ర రాజీనామా చేశారు. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆగస్టు 3న ఆయనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకున్నారు.శుక్రవారం నాగేంద్ర మాట్లాడుతూ, “నాకు రాజ్యాంగంపై నమ్మకం ఉంది... నాపై వచ్చిన ఆరోపణలపై అసెంబ్లీలో చర్చించేందుకు రావాలని బీజేపీని ఎన్నోసార్లు కోరాం. కానీ వారు రాలేదు” అని అన్నారు. బీజేపీ మనుస్మృతిని అమలు చేయాలని కోరుకుంటోందని, ఆ పార్టీకి గిరిజన వ్యతిరేక ఆలోచనా విధానం ఉందని ఆయన ఆరోపించారు.ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపేందుకు సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు రాయచూర్ నుంచి బళ్లారి వరకు 10 రోజుల పాదయాత్ర నిర్వహించనున్నట్లు కర్ణాటక బీజేపీ ప్రకటించింది. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడం ఈ 200 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రధాన అంశంగా మారుతుందని భావిస్తున్నారు. రైతుల ఇబ్బందులు, నిరుద్యోగం, నియామకాల్లో అవినీతి ఆరోపణలు కూడా ఇందులో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తెలిపారు. VIDEO | Bengaluru: "I am submitting my resignation to CM today to ensure party does not face any embarrassment", says Karnataka Minister Nagendra. pic.twitter.com/3ysOZovm5v— Press Trust of India (@PTI_News) August 28, 2026 -
బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?
భోపాల్: బీజేపీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. అధికారికంగా ప్రజా సేవల కోసం ఉపయోగించాల్సిన వనరుల వినియోగంపై ఈ ఘటనతో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో ఈ వ్యవహారంపై చర్చకు కారణమైంది. ఎమ్మెల్యేకు సంబంధించిన ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వనరులను ప్రజాప్రతినిధులు వ్యక్తిగత అవసరాలకు ఎలా వాడుకుంటారో ఈ ఘటన ద్వారా మరోసారి తేటతెల్లమైంది.మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో అధికారిక నివాసం బయట బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా వ్యక్తిగత కారును అగ్నిమాపక వాహనంతో కడుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అగ్నిమాపక వాహనానికి ఉన్న పైపులతో ముగ్గురు సిబ్బంది ఎమ్మెల్యే ఇన్నోవాపై నీటిని చల్లడం కనిపించింది. బిలోంజీలోని షా అధికారిక నివాసం బయట రోడ్డుపై ఆ వాహనం నిలిపి ఉంది.ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు..ఇదిలా ఉండగా, వీడియోను తాను చూసినట్లు షా తెలిపారు. నీటిని నింపేందుకు ఆ వాహనం మేయర్ చైర్మన్ ఇంటికి వెళ్లిందని, అక్కడ అనుకోకుండా నిలిపి ఉంచారని చెప్పారు. “మేము కూడా వీడియో చూశాం. ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ తన సొంత కారును కడుక్కోడు. అగ్నిమాపక వాహనం నీటి ట్యాంకును నింపేందుకు మేయర్ చైర్మన్ ఇంటికి వెళ్లిందని డ్రైవర్ చెప్పాడు. అక్కడ అనుకోకుండా వాహనాన్ని నిలిపి ఉంచారు. అందుకే దానిపై కొద్దిగా నీటిని చల్లాడు. ఇలాంటివి చేయకూడదని డ్రైవర్‌కు చెప్పాను” అని రామ్ నివాస్ షా తెలిపారు. ప్రైవేటు అవసరాల కోసం ప్రభుత్వ వనరులను ఉపయోగించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే కారును కడగడానికి ఏ నీటిని వాడారంటే?सिंगरौली में बीजेपी के माननीय विधायक जी की कार वाशिंग फ़ायर ब्रिगेड की गाड़ी से हो रही है pic.twitter.com/CM0YBheLMz— Brajesh Rajput (@drbrajeshrajput) August 25, 2026 -
రేవంత్ టూర్‌కు ‘నో’ పర్మిషన్.. కేంద్రం మరో కోణం ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమేపీ సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారనిపిస్తుంది. వీటిలో అత్యధికం ఆయన స్వయంగా సృష్టించుకున్నవేనేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు కేంద్ర ప్రభుత్వం నో చెప్పడం, మద్యలోనే యూకే నుంచే వెనక్కి రావల్సిన పరిస్థితి ఏర్పడడం,కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు పెరగడం,మంత్రి కొండా సురేఖ కుమార్తె ఏకంగా ఆయనపైనే తీవ్ర ఆరోపణలు సంధించడం, తదితర అంశాలు చికాకుగా తయారయ్యాయి. రేవంత్ యూకే, అమెరికాలోని ప్రఖ్యాత విద్యా సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటిని తెలంగాణకు తీసుకురావలన్న ఉద్దేశంతో ఈ యాత్ర పెట్టుకున్నారు. అంతవరకు సంకల్పం మంచిదే. కాని ఈ టూర్ లో ఆయన పెట్టుకున్న మరి కొన్ని ప్రోగ్రాంలు ఇబ్బందిలో పడేశాయి.భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకంగా రేవంత్ టూర్ వెనుక విదేశీ శక్తులు ఉన్నాయంటూ ఆరోపణ చేశారు. ఆ మరుసటి రోజే కేంద్రం రేవంత్ టూర్‌ను అడ్డుకుంది. సీఎం టూర్ షెడ్యూల్ లో స్పష్టత లేదన్నది ఒక వివరణ అయితే, ముఖ్యమంత్రి హోదా తో సంబందం లేకుండా,రెండు దేశాల సంబందాలపై ప్రభావం పడే అవకాశం ఉండే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించారన్నది కేంద్రం వాదనగా ఉంది. అందుకే రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీనికి ముందు రేవంత్ వివరణ తీసుకుని అనుమతికి నో చెప్పి ఉంటే ఎలా ఉండేదో. కేంద్రం ఏకపక్షంగా అనుమతి నిరాకరించడంతో ఇది బీజేపీ, కాంగ్రెస్ ల మద్య వివాదంగా మారింది. కావాలని రేవంత్ టూర్‌ను కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించి ఆక్షేపణ తెలిపారు. రేవంత్ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు విమర్శించారు. తనకు అనుమతి నిరాకరించడం తెలంగాణను అవమానించడమేనని రేవంత్ ఆరోపించారు. కాని బీజేపీ తెలంగాణ అద్యక్షుడు ఎన్.రమాచంద్రరావు మాత్రం ఆ ఆరోపణలను ఖండించి, ఇందులో రాజకీయం ఏమీ లేదని పేర్కొన్నారు. గతంలో కూడా కొందరు ముఖ్యమంత్రులకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనాలని రేవంత్ భావించారన్నది ఒక కారణంగా అనుమతి రాలేదని కొందరు చెబుతున్నారు.కాని దీనికన్నా రేవంత్ అమెరికాలో అత్యున్నత పదవులలో ఉన్నవారిని కలసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా కారణమని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారులను కాంటాక్ట్ చేయడానికి రేవంత్ తరపున ప్రయత్నాలు జరిగినట్లు అనిపిస్తుంది. దానికి ఒక ప్రాతిపదిక ఉంది. అమెరికా కాన్సలేట్ ఉన్న హైదరాబాద్ నానక్ రామ్ గూడకు ట్రంప్ అవెన్యూ అని రేవంత్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఆ విషయం ట్రంప్ దృష్టికి వెళ్లింది. దానికి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్పందించారు. అదే టైమ్ లో ట్రంప్ కంపెనీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ టవర్స్ నిర్మాణం చేయడానికి సన్నద్దం అయింది. దాంతో రేవంత్ ప్రభుత్వానికి ఉత్సాహం వచ్చింది. వీలైతే ట్రంప్ ను కలవాలని ఆలోచించింది. లేదా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ను అయినా కలిసే అవకాశాలపై ట్రై చేశారట.ఈ విషయాలన్ని కేంద్రానికి కూడా తెలిశాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేశ అధ్యక్షుడిని అధికారికంగా కలవడం సాధారణంగా జరగదు. ఈ నేపధ్యంలోనే కేంద్రం అనుమతి తిరస్కరించిందన్నది బీజేపీ వర్గాల కధనం.ఫలితంగా రేవంత్ వెనక్కి తిరిగి రాక తప్పలేదు.కాకపోతే యు.కె.లో కొన్ని యూనివర్శిటీలతో సమావేశం అయి సంప్రదింపులు చేశారు. అమెరికాకు తన అదికారులను మాత్రం పంపించారు. లండన్‌లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యారట.ఈ విషయాన్ని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.అయితే అమెరికా టూర్ కు సంబందించి రేవంత్ బృందం ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లడం కూడా సరైనది కాకపోవచ్చు.ఇక కాంగ్రెస్ లో కీచులాటలు ప్రజలలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ పైన,ఆయన సోదరుడిపైన తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. దానిపై కాంగ్రెస్ కూడా సీరియస్ గా స్పందించింది.కుమార్తె వ్యాఖ్యలకుగాను సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. తనకు ఆ వ్యాఖ్యలతో సంబందం లేదని ఆమె వివరణ ఇచ్చినా కమిటీ సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసు ఇవ్వగా, సురేఖ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించారు. తనకు వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేయించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇదంతా ఎవరో వెనుక ఉన్న అదృశ్యశక్తులు చేయిస్తున్న పని ఆమె ఆరోపించారు. పైగా కొన్ని బీసీ సంఘాలు సురేఖకు బాసటగా నిలవడానికి సిద్దం అయ్యాయి. పరకాల నియోజకవర్గంలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డే పోటీ చేస్తారని రేవంత్ ప్రకటన చేయడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. సాదారణంగా అభ్యర్దుల ఎంపిక అన్నది హైకమాండ్ అంశంగా చెప్పుకుంటారు. రేవంత్ అనవసర ప్రస్తావన చేయడం ద్వారా ఈ వివాదాన్ని కొనితెచ్చుకున్నట్లయింది. 1989-94 మధ్య కూడా మూడు గ్రూపులు కాంగ్రెస్ లో ఉండేవి. అప్పటి ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా కొందరు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి మాట్లాడేవారు. వాటిపై ప్రజలలో అసహనం కలిగేది. ఇప్పుడు దాదాపు అదే రీతిలో సురేఖకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మ్యేలు రేవంత్ వైపు మొహరించడం విశేషం. అయితే, 40 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారనుకుటే 17 మందే వచ్చారని బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. కారణం ఏమైనా రేవంత్ కూడా ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సలహా ఇచ్చారు. కానీ, అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిందని చెప్పాలి. నిర్ణయం హై కమాండ్‌కు వదలివేయడంతో సురేఖ ఇష్యూ పెండింగులో పడినట్లయింది.ఇది కూడా రేవంత్ కు కాస్త అసహనం మిగిల్చేదే. మరో వైపు సీనియర్ నేత చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ నేతలకు ఫిర్యాదు చేయడం, చిన్నారెడ్డి వర్గం గాంధీ భవన్ లో ధర్నా చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక మరో సీనియర్ నేత ,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏకంగా అసలు కాంగ్రెస్ వారికి నష్టం జరుగుతోందన్నట్లుగా మాట్లాడడం సంచలనం రేకెత్తించింది. అయితే ఆయన కూడా మద్యలో కొంతకాలం బీజేపీలోకి వెళ్లివచ్చారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి పొందడాన్ని ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తగినట్లే రేవంత్ కూడా తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారినే ఎక్కువగా నమ్ముతున్నారన్నది వీరి భావన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటనను కొందరు ఉదహరిస్తున్నారు. ఏపీకి చెందిన జనసేన ఎంపీ లింగమనని రమేష్ కుమారుడు సంజోష్ కారు రాష్ డ్రైవ్ వల్ల ఒక యువతి మరణించింది. ఆ కేసులో సంజోష్‌ని రక్షించడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారన్న ఆరోపణ గుప్పుమంది. జాతీయ మీడియాలో సైతం రేవంత్‌కు ,చంద్రబాబుకు మద్య హాట్ లైన్ నడుస్తుంటుందని, అందువల్లే ఎంపీ కుమారుడిని అరెస్టు చేయలేదని కధనాలు,వ్యాఖ్యలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం బలహీనంగా ఉన్న నేపధ్యంలో రేవంత్ కు ఈ పరిణామాలేవీ ప్రస్తుతానికి ఇబ్బంది పెట్టకపోవచ్చు. కాని 2028 ఎన్నికల నాటికి రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వపరంగా 22 ఎ, తదితర సమస్యలు ఏ రూపు దాల్చుతాయో అన్న ఆందోళన పార్టీలో ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఉద్యమం ఆగదు.. సర్కార్‌ను నిద్రపోనివ్వం
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు బకాయిల కోసం తన నిరాహార దీక్ష ముగిసినా, విద్యార్థుల హక్కుల కోసం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ఆగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రకటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం తన మొండివైఖరి వీడి రూ. 15 వేల కోట్ల బకాయిలను చెల్లించేవరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని, విద్యార్థులకు న్యాయం జరగకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ మెడలు వంచుతామని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి అండగా నిలిచిన విద్యార్థి లోకానికి, యువతకు, మేధావులకు, విద్యాసంస్థల ప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం మధ్యా హ్నం రెండు గంటల ప్రాంతంలో బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండురోజుల నిరాహారదీక్షను ఉపసంహరించిన సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడారు. మంగళవారం దీక్షా శిబిరానికి వచ్చిన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి రక్తపోటు, చక్కెరస్థాయిలు తగ్గాయని గుర్తించారు. నిరాహార దీక్ష ను కొనసాగిస్తే ఆయన ఆరోగ్యానికి ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఇతర నేతల చేతుల మీదుగా నిమ్మరసం స్వీకరించి నిరాహార దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రతీ ఏడాది యూపీఎస్సీ తరహాలో క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? రాహుల్ గాంధీ దీనిపై తెలంగాణ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘రేవంత్‌ను సీఎంను చేసినందుకు తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. భూములు అమ్మితే వచ్చిన వేల కోట్లు ఏం చేస్తున్నావు?.. పిల్లలకు ఫీజులు ఇవ్వడానికి మనసు రావడం లేదా ? విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరు ఆత్మహత్య చేసుకున్నా బాధ్యత రేవంత్‌రెడ్డిదే’అని హెచ్చరించారు. ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా ఆశల మీద నీళ్లు చల్లావని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోయిలేని సీఎంను చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది’అన్నారు. ఎమ్మెల్సీలు డా.చిన్నమైల్ అంజిరెడ్డి, మల్కకొమరయ్య, పార్టీనేతలు డా.ఎన్.గౌతంరావు, టి.వీరేందర్‌గౌడ్, ఎన్వీ సుభాష్, గణేష్ కుండే, పి.మురళీధర్‌రావు, ఇ.పెద్దిరెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సైదిరెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జి.మనోహర్‌రెడ్డి, బండా కార్తీకరెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడి పాల్గొన్నారు. 5, 6 తేదీల్లో బీజేపీ ప్రజాప్రతినిధుల నిరసన దీక్షలు: ఏలేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ముఖ్యమైన సమస్యలపై అనుసరిస్తున్న వైఖరిపై నిరసనగా...వచ్చేనెల 5, 6 తేదీల్లో బీజేపీ ఆధ్వ ర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. భూభా రతి అక్రమాలు, 22ఏ పేరుతో లక్షలాది ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం, తదితర సమస్యలపై సర్కార్ వైఖరిని ఎండగడతామన్నారు. అప్పటికీ ప్రభు త్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయకపతే, భూ కుంభకోణాలపై చర్యలు తీసు కోకపోతే బీజేపీ పక్షాన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభరోజైన 7న ’అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు తాండవిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాలో పర్యటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సర్కార్ భూభారతి పేరుతో దారుణమైన దోపిడీకి తెరలేపిందని ఆరోపించారు. -
5 రాష్ట్రాల ఎన్నికల ముందు బీజేపీకి డబుల్ ఛాలెంజ్
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఓబీసీ జనగణన, రిజర్వేషన్ల పరిధి పెంపునకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి విపక్షాలు మద్దతు ఇస్తుండగా, అగ్రవర్ణాల వర్గాలు రిజర్వేషన్లలో మార్పులు చేయాలని, అవసరమైతే వాటిని రద్దు చేసి ఆర్థిక ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి అటు అగ్రవర్ణాలను, ఇటు దళితులు, ఓబీసీలను ఒకేసారి సంతృప్తిపరచడం కష్టంగా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశం బీజేపీకి నష్టం కలిగించిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశం మరోసారి పార్టీకి రాజకీయంగా ఇరుకునపెట్టే పరిస్థితిగా మారింది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్షాలు కులగణనలో ఓబీసీ కాలమ్ చేర్చాలని, రిజర్వేషన్ల పరిధిని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అగ్రవర్ణ వర్గాలకు చెందిన యువత, సామాజిక సంస్థలు రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు చేయాలని, అవసరమైతే దాన్ని తొలగించి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన ‘రిజర్వేషన్ సంస్కరణ సత్యాగ్రహం’ లక్నోకు కూడా విస్తరించింది.బ్రజేశ్ పాఠక్‌ను కలిసిన ఆందోళనకారులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్న హర్ష్ దూబే తదితరులు ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్‌ను కలిశారు. వారి డిమాండ్లను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు కుల ఆధారిత రిజర్వేషన్లను తొలగించి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్ నిబంధన తీసుకురావాలని, ప్రస్తుత రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలని కోరుతున్నాయి. యూజీసీ తీసుకొచ్చిన దళిత, ఓబీసీ విద్యార్థులపై వివక్షను నిరోధించే నిబంధనలను కూడా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.బ్రజేశ్ పాఠక్ ఆందోళనకారులతో మాట్లాడటంతో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ బీజేపీపై విమర్శలు ప్రారంభించాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ రిజర్వేషన్ సంస్కరణ పేరుతో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం రిజర్వేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పునూ అంగీకరించబోమని హెచ్చరించారు. దీంతో రిజర్వేషన్ల అంశం బీజేపీకి ఒకవైపు అగ్రవర్ణ ఓటర్ల అసంతృప్తి, మరోవైపు దళిత-ఓబీసీ ఓట్లపై ప్రభావం అనే ద్వంద్వ సవాలుగా మారింది.బీజేపీకి ఇది కొత్త సవాలు కాదు రిజర్వేషన్ల అంశం బీజేపీకి కొత్త సవాలు కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశాలను ప్రధానంగా ప్రస్తావించడంతో విపక్షాలు బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందనే ప్రచారం చేశాయి. బీజేపీ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో పార్టీ 29 లోక్‌సభ స్థానాలను కోల్పోయింది. మహారాష్ట్ర, హరియాణా, బిహార్‌లోనూ ఎన్డీయేకు నష్టం జరిగింది. ఎన్నికల అనంతరం బీజేపీ సమీక్షలో రాజ్యాంగం-రిజర్వేషన్ అంశంపై విపక్షాలు నిర్మించిన ప్రచారం దళిత, ఓబీసీ ఓట్లపై ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతకుముందు 2015 బిహార్ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లను సమీక్షించాలన్న వ్యాఖ్య కూడా బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది.ఇప్పుడు బీజేపీ ముందున్న అసలు సమస్య అగ్రవర్ణ, ఓబీసీలు, దళితులను ఒకే రాజకీయ కూటమిలో కొనసాగించడం. గత దశాబ్దంలో బీజేపీ అగ్రవర్ణాలతో పాటు నాన్-యాదవ్ ఓబీసీలు, నాన్-జాటవ్ దళితులను తనవైపు తిప్పుకుని విస్తృత సామాజిక ఆధారం నిర్మించుకుంది. అయితే రిజర్వేషన్లపై అగ్రవర్ణ వర్గాల డిమాండ్లకు అనుకూలంగా అడుగు వేస్తే దళిత, ఓబీసీ ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎలాంటి మార్పు చేయకపోతే సంప్రదాయ సవర్ణ ఓటు బ్యాంకులో అసంతృప్తి పెరగవచ్చు. అందుకే ఎన్నికల ముందు రిజర్వేషన్ల అంశం బీజేపీకి 2024 తరహాలో మరోసారి ‘డబుల్ ఛాలెంజ్’గా మారే అవకాశముంది.ఇదీ చదవండి: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక -
దీక్ష విరమింపజేసిన రాంచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు దీక్ష విరమింపజేశారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ..బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఫీజు బకాయి -బీజేపీ లడాయి పేరుతో నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు (మంగళవారం) దీక్ష విరమింపజేశారు.కాగా నిన్నటి నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడంతో రాంచదంర్ రావు ఆరోగ్యం క్షీణించిందన వైద్యులు తెలిపారు. బీపీ డౌన్ అయిందంటున్న గ్లూకోజ్ ఎక్కించుకోవాలి అంటూ రాంచందర్ రావుకి వైద్యులు సూచన చేశారు. అయినప్పటికీ రాంచందర్ రావు దీక్ష కొనసాగించారు. అనంతరం మద్యాహ్నం సమయంలో దీక్ష విరమింపజేశారు. -
బీజేపీకి గుడ్‌బై.. ఆ వెంటనే విజయ్ TVK బంపర్ ఆఫర్!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన తమిళగ వెట్రి కజగం (TVK) రాజకీయంగా విస్తరించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకే పరిమితం కాకుండా.. పొరుగు రాష్ట్రాల్లోనూ అవకాశాలను ఇప్పటికే పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన నటుడు దేవన్‌కు మాంచి ఆఫర్ ఇచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా బీజేపీపై రగిలిపోతున్న ఆ సీనియర్ నటుడే ఓ జాతీయ మీడియా చానెల్‌కు వెల్లడించారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా అంది వచ్చిన అవకాశాన్ని విజయ్ టీవీకే సకాలంలో అందిపుచ్చుకుంది. అద్భుత విజయంతో అధికారం చేపట్టింది. అయితే ఇప్పుడు ఆ పార్టీ కన్ను పక్క రాష్ట్రాలపై పడింది. విజయ్ క్రేజ్, అలాగే.. రాజకీయ పరిస్థితులను బేరీజూ వేసుకుని విస్తరణకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే కేరళలో టీవీకే విస్తరణకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మలయాళ ఇండస్ట్రీలో సీనియర్ నటుడైన దేవన్‌కు.. టీవీకే పార్టీ తాజాగా కేరళ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆఫర్ చేసింది. దేవన్ ఆగస్టు 16న బీజేపీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన బీజేపీపై భగ్గుమన్నారు. దాదాపు ఐదేళ్లు పార్టీలో ఉన్నప్పటికీ తనకు ఎలాంటి బాధ్యత ఇవ్వలేదని, పనిచేయాలన్నా అవకాశం కల్పించలేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాజీనామా చేసిన మరుసటి రోజే సీఎం విజయ్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని దేవన్ తెలిపారు.#WATCH | Kollam, Keralam: On joining TVK after resigning from BJP, Malayalam actor Devan said, "...I've been working for the BJP very affirmatively, aggressively, taking a lot of risks. But they couldn't understand my mission and my planning. They are against all these things. I… pic.twitter.com/q9PW7Ur3Tp— ANI (@ANI) August 23, 2026ఆ తర్వాత టీవీకేకి చెందిన ఇద్దరు నేతలు తన ఇంటికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లు చెప్పారు. అనంతరం సీనియర్ నేతలతో గూగుల్ మీట్ ద్వారా కూడా చర్చలు జరిగినట్లు వెల్లడించారు. ఈ చర్చల్లో కేరళ TVK రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తనకు ఆఫర్ చేసినట్లు దేవన్ తెలిపారు.విజయ్‌తో భేటీ తర్వాతే ప్రకటనదేవన్ త్వరలో చెన్నై వెళ్లి విజయ్ను కలవనున్నారు. సెప్టెంబర్ 10 తర్వాత ఈ భేటీ జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విజయ్‌తో చర్చించిన అనంతరం TVKలో చేరిక, కేరళ పార్టీ బాధ్యతలు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.విజయ్, దేవన్‌కు సినిమా రోజుల నుంచే మంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆ అనుబంధమే ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త సమీకరణానికి దారితీస్తుందన్న ఆసక్తి నెలకొంది.తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే!మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన దేవన్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. బాషా, ధర్మక్షేత్రం, రౌడీ మొగుడు, శుభాకాంక్షలు, పెళ్లి చేసుకుందాం, చన్నకేశవరెడ్డి, దేశముదురు, ఏ మాయ చేశావె, ఢమరుకం, హార్ట్ ఎటాక్, రాజుగారి గది-2, సాహో వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. దేవన్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు. విద్యార్థి దశలో కాంగ్రెస్, KSUతో అనుబంధం ఉన్న ఆయన.. 2004లో కేరళ పీపుల్స్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో దాన్ని నవ కేరళ పీపుల్స్ పార్టీగా పునరుద్ధరించి, 2021లో బీజేపీలో విలీనం చేశారు. అనంతరం కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి TVK వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం కేరళలో అధికార, ప్రతిపక్ష కూటముల మీద జనాలకు అసంతృప్తి నెలకొందని, మాంచి స్ట్రాటజీతో ముందుకెళ్తే టీవీకే రాణించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారాయన.కేరళలో ‘కొత్త ప్రత్యామ్నాయం’..కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్.. ఈ రెండు కూటముల మధ్యే అధికార పంపిణీ రొటీన్‌గా మారింది. ఈ మధ్యలో బీజేపీ ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమోనని భావించినా ఫలితం దక్కలేదు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, విజయ్ నేతృత్వంలోని TVK వైపు యువత, విద్యార్థులు ఆసక్తి చూపించొచ్చని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్‌కు కేరళలో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఆయన డబ్బింగ్ సినిమాలు విపరీతంగా ఆడేవి. గతంలో అక్కడికి వెళ్లిన ఆయన.. అభిమానులతో దిగిన సెల్ఫీలు సైతం నెట్టింట పంచుకునేవారు. విజయ్ రాజకీయ ఎంట్రీ, విజయాన్ని సైతం అక్కడి ప్రజలు నిశితంగా గమనించారు. దీంతో ఆయన ఎంట్రీ ఇస్తే ఆదరణ దక్కవచ్చని దేవన్ అంటున్నారు. టీవీకేలోకి దేవన్ ఎంట్రీ జరిగితే.. కేరళలో TVKకి తొలి కీలక అడుగు పడినట్లే. అయితే ఒకవైపు తమిళనాడులో పార్టీని బలోపేతం చేస్తూనే.. కేరళలో సినీ రంగంలో పరిచయం ఉన్న నేతను ముందుకు తీసుకురావడం ద్వారా విజయ్ తన పార్టీని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారా అన్న చర్చ మొదలైంది.ఇదీ చదవండి: ఎస్ఐ చెంప పగలగొట్టిన ఎమ్మెల్యే కూతురు -
రాజకీయ సన్యాసం ప్రశ్నే లేదు: మమత
కోల్‌కతా: రాజకీయాల నుంచి తాను వైదొలిగే ప్రశ్నే లేదని, బీజేపీ గద్దె దిగేదాకా పోరాటం కొనసాగుతుందని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజలకు కేవలం నాలుగు నెలల్లోనే బీజేపీ అసలు స్వరూపం ఏమిటో తెలిసి వచ్చందన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో హనీమూన్ ముగిసి, మనీ–మూన్ దశ మొదలైందంటూ ఎద్దేవా చేశారు. ‘నన్ను అడుగడుగునా అడ్డుకుంటున్న బీజేపీ ప్రభుత్వం, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పొరపాటు పడుతోంది. బీజేపీ ప్రభుత్వం రాజకీయ అస్త్ర సన్యాసం తీసుకునే దాకా పోరాటం ఆపేది లేదు’అని మమత సోమవారం ఫేస్బుక్ లైవ్‌లో స్పష్టం చేశారు. ‘మమతా బెనర్జీ వర్గం టీఎంసీని సమర్థించ వద్దంటూ పోలీసులే ప్రజలకు చెబుతున్నారు. టీఎంసీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. పోలీస్ ఎస్పీలు, జిల్లా బీజేపీ అధ్యక్షుడుల మాదిరిగా తయారయ్యారు. ఇప్పటి దాకా కనీసం 14 వేల మంది కార్యకర్తలపై కేసులు పెట్టారు. కొందరు మోసగాళ్ల అండ చూసుకుని బీజేపీలో చేరాలంటూ ప్రచారం చేస్తున్నారు’అని మమత ధ్వజమెత్తారు. జాదవ్‌పూర్ వర్సిటీ ప్రాంగణంలో ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలకు కాషాయ పార్టీయే కారణమని ఆమె నిందించారు. రాజకీయ పార్టీలతో ఎటువంటి చర్చలు జరపకుండానే జనగణన ప్రక్రియను చేపట్టారని, దీని ద్వారా జాతీయ పౌర రిజిస్టర్‌ను అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జనగణన దరఖాస్తులపై సంతకం చేసేముందు, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ఆమె హెచ్చరించారు. అందులో వెల్లడించే వ్యక్తిగత సమాచారంతో బ్యాంకు అక్కౌంట్లలో దాచుకున్న మొత్తాలు కూడా మాయమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్ సమయంలో తొలగింపునకు గురైన లక్షలాది నిజమైన ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్పించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మమత తెలిపారు. -
Ayodhya: శ్రావణ మాసంలో చేపల కూరా?
పవిత్రమైన శ్రావణ మాసంలో అందునా.. అయోధ్య నగరంలో చేపల వంటకాల భోజనాలు ఏర్పాటు చేయడంపై కొందరు సాధువులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాముడు కొలువై ఉన్నచోట ఇలాంటి పనులు చేయడం ఘోర పాపమేనని తిట్టిపోస్తున్నారు. అయితే కార్యక్రమ నిర్వాహకుడు మాత్రం వ్యక్తిగత ఆహార స్వేచ్ఛ, సంప్రదాయాల పేరుతో ఈ ఏర్పాటును సమర్థించారు.అయోధ్య రామ మందిర విరాళాల గోల్మాల్ వివాదం కొనసాగుతున్న వేళ.. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ ఆదివారం అయోధ్యలో పర్యటించారు. తొలుత ఆయన శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గఢీ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తరుణ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత రామ్ నిహాల్ నిషాద్ ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అజయ్ రాయ్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ రాజ్‌పాల్ గౌతమ్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అఖిలేశ్ ప్రతాప్ సింగ్, పూర్వాంచల్ ఇన్చార్జ్ అభిషేక్ దత్ తదితరులు హాజరయ్యారు.అయితే ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అతిథుల కోసం రకరకాల వంటకాలు సిద్ధం చేయించారు. అందులో.. చేపల వంటకాలు స్పెషల్కాగా.. అదే వివాదానికి దారి తీసింది.వీడియోతో మొదలైన వివాదంకార్యక్రమ వేదిక వద్ద చేపలు వండుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలు కొందరు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. భారీ వర్షం పడుతున్న సమయంలోనే అక్కడ చేపలను తీసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. అయోధ్యలో చేపల కూర వడ్డింపుపై కొందరు స్థానిక సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రావణ మాసంలో అయోధ్య వంటి పవిత్ర ప్రాంతంలో చేపల విందు ఏర్పాటు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు.A Major Controversy at a Congress Event in AyodhyaA fish feast is allegedly being prepared in Ayodhya for the welcome of Uttar Pradesh Congress President Ajay Rai.Ajay Rai is scheduled to visit Arpit Lawn near the Hanuman Garhi temple, where fish is reportedly being prepared… pic.twitter.com/nY5K2SkTcy— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) August 23, 2026ఏం తినాలో మీరే చెప్తారా?అయితే కార్యక్రమ నిర్వాహకుడు రామ్ నిహాల్ నిషాద్ ఈ విమర్శలను తోసిపుచ్చారు. రాజ్యాంగం ప్రతి వ్యక్తికి తనకు నచ్చిన ఆహారం తీసుకునే హక్కును కల్పించిందని అన్నారు. సమాజంలో చేపల వేట, చేపలు తినడం సంప్రదాయంలో భాగమని పేర్కొన్న ఆయన.. శ్రావణం, భాద్రపదం వంటి నెలల పేరుతో వ్యక్తుల ఆహార అలవాట్లను ప్రశ్నించకూడదని వ్యాఖ్యానించారు.రాజకీయ దుమారంతన అయోధ్య పర్యటనలో చెలరేగిన ఈ దుమారంపై అజయ్ రాయ్ స్పందించారు. దేశంలో అణచివేత, అన్యాయం కొనసాగుతోందని యూపీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రామాలయంలో సమర్పించిన కానుకల విషయంలోనూ ఆయన ఆరోపణలు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని జైలుకు పంపాలని హనుమంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అయితే అయోధ్యలో చేపల విందు వివాదం ప్రస్తుతం ఆహార స్వేచ్ఛ, మత విశ్వాసాలు, రాజకీయ విమర్శల చుట్టూ కొత్త చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: అతను సీఎం పదవికి అన్నివిధాల అర్హుడు! -
బీజేపీ ‘సేవా సంకల్ప్ అభియాన్’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రధానిగా 12 ఏళ్లు అందించిన సుపరిపాలన, అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజెప్పడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో శనివారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కమిటీ సమావేశానికి కొనసాగింపుగా.. ఆదివారం పదాధికారుల విస్తృతస్థాయి సంస్థాగత సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి నితిన్ నబీన్ అధ్యక్షత వహించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో సహా ఏడు రాష్ట్రాల్లో జరగనున్న అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పలు సంస్థాగత అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ను ఒక మహత్తర ప్రజా ఉద్యమంగా చేపట్టాలని బీజేపీ శ్రేణులకు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ హయాంలో పెను మార్పులు సాధించిన ‘నయా భారత్’రూపురేఖలను, వాస్తవాలను, గణాంకాలను ప్రతి ఒక్కరికీ వివరించాలని సూచించారు. పేదల జీవితాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు, వేగంగా విస్తరించిన మౌలిక సదుపాయాలు, పేదరికం నుంచి కోట్లాది మంది బయటపడిన తీరు, ప్రపంచ వేదికపై భారత్‌కు దక్కుతున్న ప్రాధాన్యతను యువతకు తెలియజెప్పేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’స్ఫూర్తిని దేశంలోని అన్ని మూలలకు, అన్ని సామాజిక వర్గాలకు చేరవేసేలా సమగ్ర కార్యాచరణను ఖరారు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బి.ఎల్.సంతోష్, జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్ఛార్జ్లు, కొత్తగా నియమితులైన ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు. -
అత్యాచారం కేసు.. సీఎం సతీమణి రూ.5 కోట్లు డిమాండ్ నిజమేనా?
ఛండీఘడ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సీఎం భగవంత్ మాన్ సతీమణి డాక్టర్ గుర్ప్రీత్కౌర్ ఓ అత్యాచార కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.5కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సీఎం పదవికి భగవంత్ మాన్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్,శిరోమణి అకాళిదళ్ పార్టీలు సైతం సీఎం రాజీనామాకు పట్టుబడుతున్నాయి. ఇటీవల పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అత్యాచార కేసును నీరుగార్చేందుకు సీఎం భగవంత్ మాన్ సతీమణి డాక్టర్ గుర్ప్రీత్కౌర్ ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం ఆమె రూ.5కోట్ల వరకు డిమాండ్ చేశారని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ కేసుపై విచారణ చేపట్టాలని జస్టిస్ రంజిత్ సింగ్ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని (ఎన్హెచ్ఆర్సీ) కోరారు. జస్టిస్ రంజిత్ ఆరోపణలకు ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ వివాదం చెలరేగిన తర్వాత, గురుప్రీత్ కౌర్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్‌కు లీగల్ నోటీసు పంపారు. కాంగ్రెస్ నాయకుడు సుఖ్‌పాల్ ఖైరాకు ఈ మాజీ న్యాయమూర్తి బావమరిది అవుతారు. పంజాబ్‌లో ఎన్నికలకు కొన్ని నెలల ముందు తలెత్తిన ఈ భారీ వివాదం నేపథ్యంలో షిరోమణి అకాలీదళ్ కూడా ముఖ్యమంత్రి రాజీనామాను డిమాండ్ చేసింది. బీజేపీ, అకాలీదళ్ పార్టీలు రాబోయే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై దర్యాప్తు చేసి మాకు నివేదిక సమర్పించాలని పంజాబ్ చీఫ్ సెక్రటరీని, డీజీపీని ఆదేశించాం. అలాగే ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మహిళా భద్రతా విభాగానికి కూడా తెలియజేశాం’ అని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు వెల్లడించారు.పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మాన్ ఈ విషయంపై వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఆరోపణలు ఎందుకు వచ్చాయి, అసలు నిజం ఏంటనేది ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టం చేయాలి అని ఆయన అన్నారు. ఆప్ మహిళా వింగ్ చీఫ్ అమన్‌దీప్ కౌర్ అరోరా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి సతీమణి తీసుకున్న చట్టపరమైన చర్యలను ఆమె ఈ సందర్భంగా ఉదహరించారు.అబద్ధాలు హద్దులు మీరినప్పుడు, కేవలం రాజకీయంగానే కాకుండా చట్టపరంగా కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా బావమరిది అయిన రంజిత్ సింగ్ ఇటీవలే డాక్టర్ గురుప్రీత్ కౌర్‌పై నిరాధార ఆరోపణలు చేశారు. ఆమె.. ఆయనకు లీగల్ నోటీసు పంపుతూ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కోర్టు ద్వారా న్యాయపరమైన చర్యలు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. గత నాలుగున్నరేళ్లలో ఆప్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో ఏమి చేయలేక అకాలీదళ్, బీజేపీలు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాయని, అందుకే దీని వెనుక రాజకీయ ఎజెండా ఉందని ఆమె ఆరోపించారు. 👉ఇదీ చదవండి: నా లివర్ ఏమైనా ఐరన్‌తో చేశారా?: సీఎం భగవంత్ మాన్ -
జాతీయ నేతలు కూడా దేశద్రోహులేనా?
కలబురిగి: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ నేతలు నిర్ణయించిన వందేమాతరం వెర్షన్‌నే కాంగ్రెస్ అనుసరిస్తోందని చెప్పారు. వందేమాతరం సంక్షిప్త రూపంపై నిర్ణయం తీసుకున్న జాతీయ నేతలు కూడా దేశద్రోహులేనా? అని ప్రశ్నించారు. వందేమాతరం గీతాన్ని కేవలం రెండు చరణాలు మాత్రమే పాడాలన్న నిర్ణయం దేశ వ్యతిరేకమైనదని, చట్టాన్ని ధిక్కరించి ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. శనివారం కర్ణాటకలోని కలబురిగిలో మీడియాతో మాట్లాడారు. చరిత్ర చదవాలని అమిత్ షాకు సూచించారు. పండిట్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ తదితరులు కలిసి వందేమాతరం గీతాన్ని ఆరు చరణాల నుండి రెండు చరణాలకు తగ్గించాలని 1937లో నిర్ణయించారని తెలిపారు. మనమంతా గత 90 ఏళ్లుగా రెండు చరణాలు ఆలపిస్తున్నామని చెప్పారు. 90 ఏళ్లుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఆరు చరణాలు ఎందుకు ఆలపించలేదని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇన్నాళ్లూ ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. అవసరమైనప్పుడల్లా కొత్త సమస్యలను తెరపైకి తేవడమే బీజేపీ విధానమని ధ్వజమెత్తారు.దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి వందేమాతరం గీతాన్ని ఆలపించడానికి కాంగ్రెస్ ఎన్నడూ వ్యతిరేకం కాదని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. జనగణమన గేయాన్ని ఆలపించినట్లే తమ పార్టీ, సేవాదళ్ ఎన్నో ఏళ్లుగా వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్నాయని గుర్తుచేశారు. జనగణమన కూడా ఐదు చరణాలతో దీర్ఘంగా ఉండేదని, నేడు ఒక చరణాన్ని మాత్రమే పాడుతున్నారని తెలియజేశారు. దీనిని గేయ రచయిత రవీంద్రనాథ్ టాగోర్ కూడా ఆమోదించారని చెప్పారు. వందేమాతరంలో రెండు చరణాలు, జన గణ మనలో ఒక చరణం ఉన్నాయని, రెండింటికీ ఒకే సమయం పడుతుందని స్పష్టంచేశారు. జాతీయ నేతలు నిర్ణయించిన దానినే మనం ఈరోజు పాడుతున్నామని, వారు చెప్పినట్లు మనం పాడితే మనం దేశద్రోహులమా? అని ప్రశ్నించారు. -
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: భూభారతి పేరిట లక్షలాది ఎకరాల ప్రైవేటు భూములను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చి దందా చేస్తున్న వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత రెండు, మూడేళ్లలో 22ఏలో చేర్చిన, తొలగించిన భూములపై విచారణ జరగాలన్నారు. బాధితులకు మండలస్థాయి నుంచి హైకోర్టు వరకు బీజేపీ లీగల్ సెల్ ద్వారా పూర్తిగా ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. భూభారతిని అడ్డుపెట్టుకొని 22ఏ నిషేధిత జాబితా పేరిట భూదోపిడీ, సెటిల్మెంట్ల దందా జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగిన ధరణి కంటే ఇప్పుడు భూభారతి పేరుతో అంతకంటే తీవ్రమైన దోపిడీ జరుగుతోందని దుయ్యబట్టారు. పీనుగలు తినేవాడు పోయి ఏనుగులు తినేవాడు వచ్చినట్లుగా ప్రస్తుత పరిస్థితి తయారైందన్నారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 4 లక్షల ఎకరాల భూములను రాత్రికి రాత్రే అక్రమంగా 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ, దేవాదాయ భూములు మాత్రమే ఉండాల్సిన 22ఏలోకి దశాబ్దాలుగా మున్సిపల్ అనుమతులు పొంది, పన్నులు కడుతూ నివాసముంటున్న ప్రైవేటు ఇళ్లు, స్థలాలను ఉద్దేశపూర్వకంగా చేర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ‘భూముల క్లియరెన్స్‌కు గతంలో 10 శాతం బీఆర్ఎస్ వాటా తీసుకుంటే ఇప్పుడు 50 శాతం వాటా తీసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఆర్.ఆర్. రియల్ ఎస్టేట్ కంపెనీగా మార్చారు. వంద ఎకరాల భూమి క్లియరెన్స్ కావాలంటే 50 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు’అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో భూదందాలు, సెటిల్మెంట్లు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. ఉచిత బియ్యంపై రాష్ట్రం ప్రచారం మానకపోతే ప్రత్యామ్నాయం చూస్తాం... ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద దేశవ్యాప్తంగా కేంద్రమే 70 శాతానికిపైగా సబ్సిడీ భరిస్తూ ధాన్యం కొనుగోలు, రవాణా చేసి డీలర్ల కమీషన్ భరిస్తూ పేదలకు ఐదేసి కేజీల చొప్పున ఉచిత బియ్యం అందిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ లోగోను ముద్రిస్తుంటే తెలంగాణలో మాత్రం ప్రధాని మోదీ పేరు, కేంద్ర ప్రభుత్వ లోగో లేకుండా కేవలం సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలే వేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా ప్రచారం చేసుకోవడం మానుకోకపోతే కేంద్రమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లబి్ధదారులకు బియ్యం పంపిణీ ఏర్పాట్లను పరిశీలిస్తుందని హెచ్చరించారు. -
ఓట్ల కోసం వందేమాతరానికి అవమానమా?
సాక్షి, న్యూఢిల్లీ: బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వందేమాతర గీతాన్ని అవమానిస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. వందేమాతరాన్ని రెండు చరణాలకే పరిమితం చేస్తూ ఆగస్టు 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతనంగా ఏర్పాటైన జాతీయ పదాధికారుల తొలి సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వందేమాతరం ప్రతిష్టను, చారిత్రక ప్రాముఖ్యతను పరిరక్షించేందుకు 10 అంశాలతో కూడిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. వందేమాతరం గేయ విశిష్టతను చాటేలా, దాని ప్రాముఖ్యతపై యువతలో అవగాహన పెంచేలా దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించింది. వందేమాతరాన్ని రెండు చరణాలకే పరిమితం చేస్తూ కాంగ్రెస్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం దశాబ్దాల క్రితం ఆ పార్టీ చేసిన చారిత్రక తప్పిదాలకు కొనసాగింపేనని పదాధికారుల భేటీ అభిప్రాయపడింది. మరోవైపు, వందేమాతరానికి గేయం గౌరవాన్ని పునరుద్ధరించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేసిందని బీజేపీ వెల్లడించింది. ఇటీవల ఆగస్టు 15న 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై పూర్తి వందేమాతరాన్ని ఆలపించారు. కానీ అదే రోజు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం పాడుతుండగా, రెండో చరణం తర్వాత ఆపేయాలని సోనియా గాంధీ సైగ చేసినట్లు బీజేపీ ఆరోపించింది. 1937 నాటి నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ రెండు చరణాలు మాత్రమే పాడే సంప్రదాయాన్ని కొనసాగించాలని ఆగస్టు 19న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించడాన్ని బీజేపీ విమర్శించింది. ముస్లిం లీగ్ లాంటి శక్తుల అభ్యంతరాలకు తలొగ్గిన నాటి మనస్తత్వమే కాంగ్రెస్‌లో నేటికీ ఉందని మండిపడింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా, జాతీయ గీత పరిరక్షణ కోసం పదాధికారుల సమావేశంలో బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 19న సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా ఖండిస్తూ, పూర్తి వందేమాతరం గౌరవాన్ని పరిరక్షిస్తామని తీర్మానించింది. వందేమాతరం ఒక శక్తిమంతమైన సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదమని, శుద్ధమైన జాతీయ భావనకు ప్రతీక అని నాడు మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించింది. జాతీయ స్ఫూర్తిని రగిలించిన ఈ గీతాన్ని సంకుచిత రాజకీయాలకు వాడుకోవడాన్ని అడ్డుకుంటామని తీర్మానంలో స్పష్టం చేసింది. నూతన పదాధికారులతో ప్రధాని భేటీ న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన జాతీయ పదాధికారులతో ప్రధాని మోదీ శనివారం భేటీ అయ్యారు. కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథాల సమ్మేళనంగా పార్టీని మార్చేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా పదాధికారులను ఎంపిక చేసినట్లు వారితో మోదీ చెప్పారు. ‘‘సంస్థాగత సమావేశాలు అనేవి కొత్త ఆలోచనల సమ్మేళనంగా జరుగుతాయి. పార్టీని మరింత పటిష్టం చేసేందుకు, ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు కొత్త నాయకులు ఇచ్చే సలహాలు, సూచనలను వినేందుకు పార్టీ సమావేశాలు జరుగుతుంటాయి. పారీ్టలో కొత్త బాధ్యతలు భుజాలకెత్తుకున్న నూతన పదాధికారులతో భేటీ అద్భుతంగా సాగింది’’అని వాళ్లతో భేటీ తర్వాత ప్రధాని మోదీ ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. -
సీజేపీ ఎఫెక్ట్.. సంచలన విషయాలు వెలుగులోకి!
కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమంతో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులపై కొత్త చర్చ మొదలైంది. స్కూల్ ఠీక్ కరో పేరిట చేపట్టిన ఆ కార్యక్రమం.. నిన్న రాజస్థాన్‌లో తీవ్ర దుమారం రేపింది. జైపూర్ శివారులోని బాగ్రు గ్రామానికి వెళ్లిన ఆ బృందంపై దాడి జరిగింది. ఇది బీజేపీ చేయించిన పనేనని సీజేపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. తమపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డెడ్‌లైన్ కూడా విధించింది. ఈలోపు.. అక్కడి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీజేపీ తనిఖీ ఎఫెక్ట్ ఇప్పుడు అక్కడ రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. అసెంబ్లీలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు రాష్ట్ర విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టాయి. రాష్ట్రంలోని వందల ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు లేవని ప్రభుత్వం స్వయంగా అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే బాగ్రు స్కూల్ గురించి కూడా ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. అక్కడి ప్రభుత్వ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారడంతో గతంలో అధికారులు దానిని వినియోగానికి అనర్హంగా ప్రకటించారట. దీంతో విద్యార్థులను తాత్కాలిక ఏర్పాట్లలోకి తరలించారు. అయితే తరగతులు పశువుల కొట్టం తరహా ప్రదేశంలో కొనసాగుతున్నాయన్న ఆరోపణలతోనే CJP బృందం అక్కడికి వెళ్లింది. ఈ ఘటన తర్వాతే సంచలన విషయాలు బయటపడ్డాయి. సమగ్ర శిక్షా అభియాన్ కింద యూడీఐఎస్ఈ (UDISE) 2025–26 గణాంకాల ప్రకారం.. రాజస్థాన్‌లో 611 ప్రభుత్వ పాఠశాలలు సొంత భవనాలు లేకుండా కొనసాగుతున్నాయి. అందునా.. రాజధాని జైపూర్‌లోనే 38 పాఠశాలలకు భవనాలు లేవు. జలావర్ జిల్లాలోని అక్లేరా బ్లాక్‌లో అత్యధికంగా 23 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఖాన్పూర్లో 16, ఝల్రాపటన్లో 11 పాఠశాలలు భవనాల కోసం ఎదురుచూస్తున్నాయి. మొత్తం బడులలో.. 10 బాలికల పాఠశాలలకు భవనాలు లేవని తేలింది. భవనాలు ఉన్నా.. సదుపాయాల కొరతకేవలం భవనాల కొరత మాత్రమే కాకుండా.. ఉన్న పాఠశాలల్లోనూ మౌలిక వసతుల లోపాలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని 64,484 ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ.. 2,047 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మరో 1,049 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం లేదు. మరుగుదొడ్లు లేని పాఠశాలల్లో బన్స్వారా జిల్లా ముందంజలో ఉంది. అక్కడ 188 పాఠశాలల్లో టాయిలెట్ సౌకర్యం లేదు. దుంగర్‌పూర్‌లో 124, ఉదయ్‌పూర్‌లో 98 పాఠశాలలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. తాగునీటి సౌకర్యం లేని పాఠశాలలు దౌసా జిల్లాలో అత్యధికంగా 96 ఉన్నాయి.దిద్దుబాటు చర్యలుపాఠశాలల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మరమ్మతులు, పునరుద్ధరణ కోసం రూ.550 కోట్లు, భవనాలు లేని లేదంటే శిథిలావస్థలో ఉన్న పాఠశాలల నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా వివిధ పథకాల ద్వారా వచ్చే ఐదేళ్లలో పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.12,500 కోట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.బీజేపీ సర్కార్‌పై ఆగ్రహంభజన్లాల్ శర్మ సర్కార్‌పై ప్రతిపక్షం మండిపడుతోంది. వివరాలు దాస్తూ ప్రభుత్వం నీళ్లు నములుతోందని మండిపడింది. ఆడిట్ వివరాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేత టీకారామ్ జూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల పరిస్థితిపై సర్కార్‌కు స్పష్టమైన కార్యాచరణ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 3,768 ప్రభుత్వ పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, 83,783 తరగతి గదులు వినియోగానికి అనర్హంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల పరిస్థితి కారణంగా కొన్ని చోట్ల తరగతులు నిలిపివేయాల్సి వచ్చిందని, విద్యార్థుల చేరికలపై ప్రభావం పడుతోందని ఆరోపించారు.అయితే ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భద్రత, పాఠశాలల ప్రమాణాల మెరుగుదల తమ ప్రాధాన్య అంశాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం CJP తనిఖీల ఘటన నేపథ్యంలో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్ తనిఖీలపై సర్కారీ ఆంక్షలుఇంతేకాదు.. కొద్ది రోజుల ముందే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఓ ఉత్తర్వు కూడా చర్చకు దారితీసింది. ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని స్పష్టం చేసింది.విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం పేర్కొంది. అనుమతి లేకుండా ఎవరూ పాఠశాలల్లోకి ప్రవేశించకుండా, అనధికారిక చిత్రీకరణను నియంత్రించేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే ఈ ఉత్తర్వులపై ప్రతిపక్షాలు, విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సీజేపీ తనిఖీల నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఆగమేఘాల మీద తీసుకొచ్చారని మండిపడ్డారు. పాఠశాలల వాస్తవ పరిస్థితులను పరిశీలించే అవకాశం తగ్గించేలా ఈ ఆదేశాలు ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే CJP ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం, బాగ్రు ఘటన, ఆ తర్వాత బయటపడిన 611 పాఠశాలల గణాంకాలు మరింత చర్చకు దారితీశాయి. దీంతో వివాదాస్పద ఉత్తర్వులను సైతం ప్రభుత్వం వెనక్కి తీసుకునే నిర్ణయంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: రాహుల్ గాంధీ మీటింగ్.. కొట్టుకున్న స్టూడెంట్ యూనియన్లు -
బీజేపీలో నితిన్ మార్క్ షురూ.. తొలి రోజే ఎన్నికల రోడ్‌మ్యాప్ సిద్ధం!
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నూతనంగా నియమితులైన జాతీయ కార్యవర్గంతో శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, యువతకు మరింత చేరువకావడం తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. అత్యంత పిన్న వయస్కుడైన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నిలిచిన నబీన్.. త్వరలోనే వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. Delhi: BJP national president Nitin Nabin chaired an introductory meeting with the BJP’s new team of national office-bearers at the party headquarters in Delhi(Source: ANI Picture Service) pic.twitter.com/deDwtFmgNw— ANI (@ANI) August 22, 2026ఇటీవలే ప్రకటించిన 65 మంది సభ్యుల నూతన కార్యవర్గంలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఉపాధ్యక్షులుగా వసుంధర రాజే సింధియా, తీరథ్ సింగ్ రావత్, రామ్ మాధవ్ తదితరులు నియమితులయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత) బీఎల్ సంతోష్ కొనసాగుతుండగా, సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివప్రకాష్, సౌదాన్ సింగ్ వ్యవహరించనున్నారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, బిప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు.జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నియమితులయ్యారు. ఐటీ విభాగాధిపతిగా అమిత్ మాల్వియా స్థానంలో దీపక్ మ్హాస్కే, యువమోర్చా అధ్యక్షుడిగా తేజస్వి సూర్య స్థానంలో హేమాంగ్ జోషిని నియమించారు. నూతన కార్యవర్గానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్ ’వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. అనుభవం, యువశక్తి కలగలసిన ఈ బృందం ప్రజాసేవలో ముందంజలో ఉంటుందని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: అమెరికా వీసా రూల్స్ దెబ్బకు భారతీయ జంట విలవిల -
సీఎం ‘విదేశీ’ అనుమతులపై కాంగ్రెస్‌ది అనవసర రాజకీయం
సాక్షి, హైదరాబాద్: సీఎం అమెరికా పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు హితవు పలికారు. ఈ పర్యటన నిరాకరణ వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టంచేశారు. సీఎం ప్రతినిధి బృందానికి పెట్టుబడుల సమావేశాలకు వెళ్లేందుకు అనుమతులిచ్చినా రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా సీఎంలు లేదా మంత్రులు విదేశీ పర్యటనలకు అధికారిక ఆవశ్యకత, ఆహ్వానించిన సంస్థల నేపథ్యం, హాజరయ్యే వ్యక్తుల స్థాయి, అంతర్జాతీయ ప్రొటోకాల్, డిప్లొమాటిక్ అంశాలు, భద్రతా ఏర్పాట్లు, ఎఫ్సీఆర్ఏ నిబంధనలు తదితర కీలక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని వివరించారు. గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నపుడు అమెరికా వీసా రాకుండా కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు లేఖలు రాశారని రాంచందర్‌రావు గుర్తుచేశారు. రేవంత్ పెట్టిన అప్లికేషన్లో ఎక్కడో లోపాలు ఉండి ఉంటాయన్నారు. బీజేపీలో చేరిన ప్రముఖ కేన్సర్ నిపుణుడు, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్, కేన్సర్ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడు విజయేందర్, ఎల్బీ నగర్ మేఘనా హాస్పిటల్ చైర్మన్ ప్రమోద్, ఇతర వైద్యులను రాంచందర్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నీట్ ద్వారా ప్రవేశాలు పొందిన ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అక్రమంగా ఫీజులు వసూలు చేయడాన్ని ఖండించారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ జోక్యం చేసుకుని విద్యార్థులకు ఫీజులు రీఫండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
‘సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనే "వికసిత్ భారత్"లో తెలంగాణ రాష్ట్రం ఉండొద్దనే కుట్రలు ఉన్నాయని తమకు అర్ధం అవుతుందన్నారు.తెలంగాణలో పెట్టుబడులు కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని వీహెచ్ ఆరోపించారు. మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషాలో న్యాయం జరగాలన్న రాహుల్ గాంధీగారి లక్ష్యం కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కేంద్రం చేపట్టే జనగణన గణాంకాల్లో ఓబీసీ జనాభా లెక్కలు చూపకుండా బీజేపీ మోకాలడ్డుతుందని విహెచ్ విమర్శించారు. సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్న ప్రకారం ఈ నెల 25వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
రాజస్థాన్‌లో ఉద్రిక్తత : 24 గంటల్లో 'జంతర్ మంతర్ 2.0' సీజేపీ హెచ్చరిక
జైపూర్, రాజస్థాన్: స్కూల్ ఠీక్ కరో' (పాఠశాలలను బాగు చేయండి) ప్రచారంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) రాజస్థాన్‌లో చేపట్టిన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు దాడిచేయడంపై సీజేపీ స్పందించింది. సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, ఇతరులపై అమానుషంగా దాడిచేయడాన్ని,వాహనాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. తమపై ఎటాక్ చేసిన దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని రాజస్థాన్ పోలీసులను డిమాండ్ చేసింది. లేదంటే 24 గంటల తర్వాత రాజస్థాన్‌లో 'జంతర్ మంతర్ 2.0' ప్రారంభమవుతుంది; ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని హెచ్చరించింది. అయితే ఈ విషయంలో గ్రామస్తులను మాత్రం వేధించకూడదని స్పష్టం చేసింది. ఇందులో గ్రామస్తుల ప్రమేయం ఏమీ లేదనీ వెల్లడించింది. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ కూడా స్పందించింది. గ్రామ పాఠశాలను సందర్శించిన సందర్భంగా జరిగిన ఘర్షణ వాతావరణంపై కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ స్పందిస్తూ , "ప్రజలు, యువత , విద్యార్థులలో ఆగ్రహం ఉంది. ప్రభుత్వం దానిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించడం, ఫోటోలు తీయడం లేదా నివేదికలు ప్రచురించడం వంటివి చేయరాదని జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తప్పబట్టారు. శిథిలావస్థకు చేరిన భవనాలు, ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలను జారీ చేయడం సరైనది కాదన్నారు. పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్న పరిస్థితిని, సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టడానికి బదులుగా, ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి చేటున్నారు. అనుమతి లేకుండా పాఠశాలల్లోకి ప్రవేశించకుండా లేదా ఫోటోలు తీయకుండా ప్రజలను అడ్డుకోలేరన్నారు. వాస్తవానికి, ప్రభుత్వం వార్తలను అణచివేయడానికి , ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ <राजस्थान पुलिस को 24 घंटों का समय दिया गया है इन गुंडों को गिरफ्तार करें,बिना गांव वालो को परेशान किए इसमें गांव वालो का कोई योगदान नहीं है24 घंटे निकलने के बाद राजस्थान में शुरू होगा जंतर मंतर 2.0 , जो आगे होगा उसकी जिम्मेदार हम नहीं होंगे@Cockroachisback#schoolThikKaro pic.twitter.com/kRyFncu9Sj— Cockroach Janta party (@IAMVICKYFANS) August 21, 2026 కాగా సీజేపీ ప్రచారంలో భాగంగా జయపూర్ జిల్లాలోని బగ్రూ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న రాంపురా కన్వర్పురా గ్రామంలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేయడానికి వచ్చిన కార్యకర్తలను గ్రామస్తులు, సీజేపీ బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. సీజేపీ బృందం రాకముందే గ్రామస్తులు ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం సీజేపీ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీజేపీ కార్యకర్తలను గ్రామంలోనికి రానీయకుండా అడ్డుకుని, అక్కడినుంచి పంపించివేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.గతంలో సీజేపీ నిర్వహించిన తనిఖీల నేపథ్యంలో, రాజస్థాన్ విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు మరియు మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయంపై సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని దాచి పెట్టేందుకే విద్యాశాఖ మంత్రి ఇలాంటి ఆంక్షలు విధిసస్తోందని, తమ ప్రచారం ఆగదని పేర్కొన్నారు. 'స్కూల్ ఠీక్ కరో' ప్రచారంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు.#WATCH | Attack on Cockroach Janta Party (CJP) team in Jaipur village | Jaipur, Rajasthan: Congress MLA Sachin Pilot says, "State Govt has issued a fresh order that no journalist can enter a school, no photos can be taken, and nothing can be reported. They want to keep their… pic.twitter.com/Q4NTYATzVe— ANI (@ANI) August 21, 2026 ప్రస్తుతం ఈ పాఠశాల భవనం ప్రమాదకరంగా మారి మూతపడటంతో, సమీపంలోని పశువుల కొట్టంలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాల మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, స్థానిక ప్రయత్నాలతోనే పాఠశాలను బాగు చేసుకోవచ్చని గ్రామస్తులు, భాజపా కార్యకర్తలు తెలిపారు. అనంతరం వారు పాఠశాల వెలుపల ధర్నా చేపట్టి నినాదాలు చేశారు.సీజేపీ కార్యకర్త శివాంగి శర్మ మాట్లాడుతూ, "మమ్మల్ని ఉగ్రవాదులని, నక్సల్స్ అని అంటూ మా కార్యకర్తలపై దాడి చేశారు. ఈ బయటివాళ్ళు... లోపలివాళ్ళు... ఏంటిది... ఇది ఒకే దేశం. మేము ఏ పార్టీ నుంచో గానీ, మరో దేశం నుంచో గానీ రాలేదు. మేము మన సొంత దేశపు బిడ్డల గురించి మాట్లాడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్‌తో కలిసి రాహుల్‌గాంధీ ధర్నామరోవైపు తాము బీజేపీ కార్యక్తలం కాదని, సీజేపీ కార్యకర్తలే తమ కార్లను ధ్వంసంచేసుసుకున్నారని తెలిపారు. తమ పాఠశాలను బాగు చేసుకునే పనులను ఇప్పటికే ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఈ ఘటన గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని బగ్రూ డీఎస్పీ ధర్మేంద్ర శర్మ తెలిపారు.(14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’) -
గో బ్యాక్ సీజేపీ.. తరిమికొట్టిన గ్రామస్తులు!
కాక్రోచ్ జనతా పార్టీ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. రాజస్థాన్ జైపూర్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల పరిశీలనకు వెళ్లిన ఆ సంస్థ సభ్యుల్ని కొందరు అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పిడిగుద్దులతో తరిమి కొట్టారు. వాహనంలో వెళ్తున్న సమయంలో రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో పరస్పర ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది.సీజేపీ దేశవ్యాప్తంగా స్కూల్ ఠీక్ కరో పేరిట ఓ ఉద్యమం నడుపుతోంది. ఇందులో భాగంగా.. జైపూర్ రాంపురా–కన్వర్పురా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితులను పరిశీలించేందుకు ఆ సంస్థ బృందం వెళ్లింది. గత కొంతకాలంగా ఆ స్కూల్లో పశువుల పాక నడుస్తోందన్నది సీజేపీ ప్రధాన ఆరోపణ. పాఠశాలలో మౌలిక వసతులు, విద్యార్థుల పరిస్థితి, బోధనా సౌకర్యాలను పరిశీలించాలన్న ఉద్దేశంతో ఈ పర్యటన చేపట్టినట్లు పార్టీ తెలిపింది. ఈ కార్యక్రమంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా కూడా పాల్గొనాల్సి ఉంది.Very satisfying face off 🤣🤣🤣Rajasthan showing the way. Dipke got taste in Jaipur and now Ranka and team again in Rajasthan 🔥🤲🏻 pic.twitter.com/37rDnrgPov— Lala (@FabulasGuy) August 21, 2026VIDEO | Jaipur, Rajasthan: Cockroach Janata Party (CJP) co-convenor Ashutosh Ranka and others chased away by locals as they tried to visit Bagru village. Shivangi Sharma, CJP worker, says, "They attacked our workers, saying we are terrorists, Naxals. What is this outsider...… https://t.co/MqgiMSCt8R pic.twitter.com/U3VjdVgrl4— Press Trust of India (@PTI_News) August 21, 2026🇮🇳 #Breaking: #Villagers reportedly chased #CJP protestors down and beat them, while their vehicles were also attacked and car windows were smashed during the confrontation in #Jaipur .The incident reportedly took place during a CJP team’s visit to a government #school .… pic.twitter.com/XyAY8uHGzV— pradhyumn sharma (@pradhyu78651514) August 21, 2026అయితే.. ఆ సమయంలో కొందరు వాళ్లను అడ్డుకుని దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఈ పరిణామాలపై రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనపై అశుతోష్ రాంకా స్పందిస్తూ.. తమను అడ్డుకున్న వారు గ్రామస్తులు కాదని, బీజేపీ పంపించిన వ్యక్తులని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. "బీజేపీ పంపించిన గూండాలు" అంటూ విమర్శలు చేశారు.#WATCH | Jaipur, Rajasthan: CJP National Spokesperson Ashutosh Ranka says, "The entire country saw BJP's hooliganism live today. Stone pelting was already happening there but the Police remained mute spectators. Police said that they won't do anything. This has been done at the… pic.twitter.com/pYPCh3UCOP— ANI (@ANI) August 21, 2026ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికే తాము తనిఖీలు చేపడుతున్నామని సీజేపీ నేతలు తెలిపారు. అయితే సమస్యలను బయటకు రానివ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పాఠశాలల పరిస్థితిపై ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.అబ్బే జరిగింది అది కాదు: స్థానికులుఅయితే స్థానికుల్లో కొందరు మాత్రం సీజేపీ ఆరోపణలను ఖండించారు. పాఠశాలను కూల్చివేసే ప్రయత్నం జరుగుతుందనే అనుమానంతోనే తాము వ్యతిరేకించామని తెలిపారు. ‘‘వాళ్లు 250 మంది వచ్చారు. వాళ్లు చెబుతున్న దాంట్లో నిజం కూడా లేదు. ఆ పాఠశాలలో 20 నుంచి 25 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరమ్మతుల కోసం రూ. 12 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. బీజేపీనో, కాంగ్రెస్సో, మరేయితర రాజకీయ పక్షమో ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు. మా ఊరి అంశాన్ని రాజకీయం చేయొద్దని మేం అనుకుంటున్నాం. వాళ్లు నిరసన పేరిట స్కూల్‌కు నష్టం కలిగిస్తే ఎలా? విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పాఠశాల రక్షణ కోసం నిలబడ్డాం’’ అని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాదు.. తాము దాడి చేశామన్న దాంట్లో నిజం లేదని కూడా అంటుఉన్నారు.#WATCH | Jaipur, Rajasthan: A villager, Anu Sharma, says, "We opposed them because they are attempting to teardown this school...About 20-25 students come here to study. Where will they go?..We won't let them teardown the school. Funds (for repair) have already been… pic.twitter.com/kk86lCPUS4— ANI (@ANI) August 21, 2026స్కూల్ తనిఖీలపై సర్కారీ ఆంక్షలుఈ వివాదానికి కొద్ది రోజుల ముందే రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం.. ఓ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలకు బయటి వ్యక్తుల ప్రవేశంపై కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. పాఠశాలలను సందర్శించాలంటే ప్రధానోపాధ్యాయుడి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. ఫొటోలు, వీడియోలు తీసేందుకు కూడా రాతపూర్వక అనుమతి అవసరమని ఆదేశించింది. విద్యార్థుల భద్రత, గోప్యత, గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. అనధికారికంగా ఎవరూ పాఠశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.ప్రతిపక్షాల విమర్శలుప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించింది. రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత టీకారామ్ జూల్లీ.. ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించకుండా అడ్డుకునేందుకే ఈ నిబంధనలు తీసుకొచ్చారని ఆరోపించారు. ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఇదీ చదవండి: మంత్రుల కుక్కలకు మెరుగైన వసతులున్నాయి! -
పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో దీదీ క్లీన్ స్వీప్.. బీజేపీకి షాక్!
కోల్‌కతా: మూడు దశాబ్దాల తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి భారీ ఊరట దక్కింది. పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో టీఎంసీ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారు. అయితే, ఈ ఎన్నికలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగి ఉంటే టీఎంసీ ఇన్ని స్థానాల్లో గెలిచేవారు కాదని బార్ కౌన్సిల్లో బీజేపీ మద్దతు దారులు వ్యాఖ్యానిస్తున్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 23 స్థానాల్లో 15 స్థానాల్ని కైవసం చేసుకుంది. బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ చెరో మూడు స్థానాలను, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకున్నాయి. మహిళల కోసం రిజర్వ్ చేసిన ఐదు స్థానాల్లో టీఎంసీ నాలుగు, కాంగ్రెస్ ఒకటి గెలుచుకున్నాయి. గెలిచిన తృణమూల్ అభ్యర్థులను మమతా బెనర్జీ సిఫార్స్‌ల మేరకే పోటీ జరిగినట్లు సమాచారం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా అభ్యర్థుల నుండి అదనంగా ఇద్దరు మహిళా సభ్యులను నామినేట్ చేయనుంది. ఈ నామినేషన్లతో, పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ మొత్తం సభ్యుల సంఖ్య 25కు పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 75 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో టీఎంసీ 23 మంది అభ్యర్థులను, బీజేపీ 22 మందిని, లెఫ్ట్ ఫ్రంట్ 12 మందిని, 18 మంది స్వతంత్రులను బరిలోకి దింపాయి. ఫలితాల్లో బీజేపీ తన మునుపటి మూడు సీట్ల స్థానాన్ని నిలబెట్టుకోగా, కాంగ్రెస్ తన రెండు సీట్లను నిలుపుకుంది. అయితే, లెఫ్ట్ ఫ్రంట్ ప్రాతినిధ్యం గత ఎన్నికల్లోని నాలుగు సీట్ల నుండి ఈసారి మూడు సీట్లకు పడిపోయింది. బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత టీఎంసీ న్యాయవాదుల విభాగం సభ్యుడు సంజయ్ బర్ధన్ మాట్లాడారు. అన్ని జిల్లా కోర్టులలో ప్రాక్టీసింగ్ న్యాయవాదులు పాల్గొనడంతో ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని జిల్లా కోర్టులలో ప్రాక్టీసింగ్ న్యాయవాదులు వేసిన ఓట్ల ద్వారా గత మార్చిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఏర్పడింది. కొత్త నిబంధనల ప్రకారం, 23 సీట్లలో ఐదు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ మహిళా సీట్లలో నాలుగు సీట్లను తృణమూల్ దక్కించుకుంది అని బర్ధన్ అన్నారు.అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, మార్చి 9న పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఫలితాలు వెలువడటంతో టీఎంసీ త్వరలో పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ కొత్త బోర్డును ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ న్యాయవాద వర్గంలోని కొన్ని వర్గాలలో పార్టీ సంస్థాగత ప్రభావం చెక్కుచెదరలేదనడానికి ఈ ఫలితం ఒక సంకేతంగా పార్టీలో భావిస్తున్నారు.2011 నుండి వరుసగా మూడు సార్లు ఘనవిజయాలు సాధించి, 15 ఏళ్ల పాటు బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలయ్యారు. కేవలం 80 స్థానాలకే పరిమితమై ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్‌లో మూడు దశాబ్దాల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అంతర్గత తిరుగుబాటు మొదలైంది.పార్టీలోని మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో 58 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని కాదని తిరుగుబాటు పక్షాన నిలిచారు. అసెంబ్లీలోనే కాకుండా పార్లమెంటులో కూడా మమతకు గట్టి షాక్ తగిలింది. టీఎంసీకి ఉన్న 28 మంది లోక్‌సభ సభ్యులలో 20 మంది ఎంపీలు పార్టీకి దూరమై, కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రాభవం ఇంకా ఉందని బార్ కౌన్సిల్ ఎన్నికలు నిరూపించాయి. -
వందేమాతరం వివాదం.. సోనియాకు బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: వందేమాతరం గీతం ఆలాపనపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోనియా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. బీజేపీ తీవ్రంగా స్పందించింది. వందేమాతరం ఆలాపన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నలు సంధించారు.ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం ఆలాపన సందర్భంగా సోనియాగాంధీ వ్యవహరించిన తీరు తమకు తీవ్రంగా అభ్యంతరకరంగా అనిపించిందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వందేమాతరం మొత్తాన్ని ఆలపించడాన్ని ఆమె వ్యతిరేకించినట్లుగా కనిపించిందని వ్యాఖ్యానించారు. జాతీయ గీతం వంటి అంశంపై కాంగ్రెస్ కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామం అవమానకరమని విమర్శించారు.కాంగ్రెస్ మీడియా విభాగం దీనిపై ఇచ్చిన వివరణను కూడా రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం కుర్చీ ఏర్పాటు చేస్తున్నందుకే ఆ సమయంలో అలా జరిగిందన్న వివరణను ఆయన కొట్టిపారేశారు. అది సరైన వివరణ కాదని, వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపించిందని అన్నారు.గోవాలోనూ రెండు చరణాలే..ఆగస్టు 15న గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమాన్ని కూడా బీజేపీ నేత ప్రస్తావించారు. అక్కడ కూడా వందేమాతరంలోని రెండు చరణాలనే ఆలపించారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలపై కాంగ్రెస్ పార్టీ మొత్తం వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.‘స్వాతంత్య్ర ఉద్యమంపై గుత్తాధిపత్యం చెప్పుకోవద్దు’వందేమాతరం విషయంలో కాంగ్రెస్ ఇదే విధమైన వైఖరిని కొనసాగిస్తే.. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి తామే ఏకైక వారసులమని చెప్పుకోవడం మానుకోవాలని రవిశంకర్ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశభక్తికి ప్రతీకగా భావించే వందేమాతరంపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.సోనియా వ్యాఖ్యల నేపథ్యంలో..ఇదిలా ఉండగా.. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వందేమాతరం వివాదాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ కాంగ్రెస్‌పై దాడి చేసింది. -
బీజేపీ నయా టీమ్‌లో మహిళలకు పెద్దపీట!
-
BJPకి షాక్ ఇస్తూ.. విజయ్ ని మెచ్చుకున్న అన్నామలై..
-
65 మందితో నబీన్ కొత్త టీమ్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ తొలిసారి అత్యంత కీలకమైన జాతీయ కార్యవర్గంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 65 మందితో సోమవారం నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాబితాలో సీనియర్లతోపాటు యువత, మహిళలకు పెద్దపీట వేశారు. ఇందులో 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 16 మందిని జాతీయ కార్యదర్శులుగా నియమించారు.ఆంధ్రప్రదేశ్‌లో మూలాలున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాంమాధవ్‌ను ఢిల్లీ కోటాలో జాతీయ ఉపాధ్యక్ష పదవి అప్పగించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ అత్యంత కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలా వారిద్దరూ జాతీయ కార్యవర్గంలో పునఃప్రవేశించారు. అయితే తెలంగాణ నుంచి ఏ ఒక్కరికీ చోటుదక్కలేదు.ఇప్పటివరకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన డీకే అరుణకు కొత్త జాతీయ కార్యవర్గంలో చోటు లభించలేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి ఈ జాబితాలో స్థానం లభించింది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమితులవగా ఇప్పటివరకూ బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డికి జాతీయ కార్యవర్గంలో అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్తగా అవకాశం లభించింది. సీనియర్ నాయకులకు కీలక బాధ్యతలు... మహారాష్ట్రకు చెందిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. మాజీ ముఖ్యమంత్రులైన విప్లవ్ కుమార్ దేవ్ (త్రిపుర)కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తీరత్‌సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), వసుంధర రాజే సింధియా (రాజస్తాన్)లకు జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ బాధ్యతలు అప్పగించారు. వైజయంత్ జైపాండా (ఒడిశా), రేఖా వర్మ (ఉత్తరప్రదేశ్), తారిఖ్ మన్సూర్ (ఉత్తరప్రదేశ్) తమ జాతీయ ఉపాధ్యక్ష పదవులను నిలుపుకున్నారు. వినోద్ తావ్డే (మహారాష్ట్ర), సునీల్ బన్సల్ (ఢిల్లీ) జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగనున్నారు. కేరళంకు చెందిన అనిల్ ఆంటోని జాతీయ కార్యదర్శిగా, ఉత్తరాఖండ్‌కు చెందిన అనిల్ బలూని కీలకమైన జాతీయ మీడియా సమన్వయకర్తగా బాధ్యతలను కొనసాగించనున్నారు. మరికొందరు నాయకులకు సైతం పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు లభించింది. నూతనంగా నియమితులైన పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. -
కమిటీ పోయింది.. కేబినెట్ వస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ప్రకటించిన కొత్త జాతీయ కార్యవర్గం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో జరిపిన ఈ మార్పుచేర్పుల్లో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు చోటు దక్కలేదు. అయితే ఈ ‘విరుగుట’ వెనుక బీజేపీ అధిష్టానం ఒక పెద్ద ‘పెరుగుట’ వ్యూహాన్నే అమలు చేస్తోందన్న విశ్లేషణలు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ముందే సంకేతాలు అందాయా?ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పార్టీ తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో జాతీయ కమిటీ పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ భేటీలోనే కొత్త జాతీయ బృందంలో తెలంగాణ నేతలకు చోటు ఉండకపోవచ్చనే సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి?జాతీయ కమిటీలో తెలంగాణకు పదవులు దక్కకపోవడానికి త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండు పదవులు నిర్వహించేందుకు వీల్లేదు. జాతీయ కార్యవర్గ పదవుల కంటే కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. తెలంగాణ నుంచి ఒకరిద్దరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.మంత్రివర్గ రేసులో ఆ ముగ్గురు!కేంద్ర కేబినెట్ రేసులో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన ఈటల సీనియర్ నేత కావడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో ఆయనకు బెర్త్ ఖాయమనే ప్రచారం సాగుతోంది. అలాగే నిజామాబాద్‌లో వరుసగా రెండోసారి గెలిచి బలమైన నాయకుడిగా ఎదిగిన అర్వింద్‌కు అవకాశం ఇవ్వడం ద్వారా ఉత్తర తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయొచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఇక గిరిజన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గోడెం నగేశ్‌కు అవకాశం ఇస్తే సామాజిక సమీకరణలు కలసి వస్తాయని పార్టీ ఆలోచిస్తోంది. -
కొత్త కార్యవర్గంతో.. బీజేపీ మాస్టర్ ప్లాన్
ఢిల్లీ: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దేశంలో జరిగిన జెన్‌జీ ఉద్యమం నుంచి తమిళనాడులో విజయ్ వరకూ సోషల్ మీడియా ఆదారంగానే తమ ప్రచారాన్ని సాగించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. గత 11 ఏళ్లుగా సోషల్ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అమిత్ మాల్వీయా స్థానంలో దీపక్ మాస్కేకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ ఈ రోజు కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ బృందంలో భారీ మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా విభాగానికి దీపక్ మాస్కేను కన్వీనర్‌గా నియమించింది. ఆయనకు పృతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లు సోషల్ మీడియా కో-కన్వీనర్లుగా నియమించింది. రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియానే కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దీపక్ మాస్కే నేపథ్యందీపక్ మాస్కే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు. ఇటీవల జరిగిన బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ రాష్ట్రాల్లో పార్టీ అద్భుత విజయాలు సాధించడంలో ఆయన వ్యూహాలు తోడ్పడ్డాయి. ఎన్నికల డేటాను సేకరించడం, విశ్లేషించడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాను విశ్లేషించి, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి నివేదికలు రూపొందించారు.కమ్యూనికేషన్ వ్యూహానికి అనిల్ బలూనీపార్టీ కమ్యూనికేషన్ విభాగంలో సైతం కీలక మార్పులు చేసింది. మీడియా కోఆర్డినేటర్‌గా అనిల్ బలూనీని నియమించింది. ఆయనకు జాయింట్ కోఆర్డినేటర్లుగా ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారీ, సిద్ధార్థ్ యాదవ్‌లను నియమంచింది.రాజకీయ పార్టీలు ఓటర్లు, పార్టీ కార్యకర్తలను నేరుగా చేరుకోవడానికి డిజిటల్ వేదికలపై మరింతగా ఆధారపడుతున్న సమయంలో ఈ నియామకాలు జరిగాయి. తాజా బృందంలో అనుభవజ్ఞులైన నాయకులతో పాటు సంస్థాగత, క్షేత్రస్థాయి అనుభవం ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో కొత్త తరం నాయకులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు.మోదీ అభినందనలునూతనంగా ఏర్పాటైన కార్యవర్గ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.“కొత్తగా నియమితులైన ఈ బృందంలో సంస్థాగత అనుభవం, శక్తి, క్షేత్రస్థాయి అనుసంధానం కలిసివున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాసేవపై దృష్టి సారించడంలో వారు తమ వంతు కృషి చేస్తారని నమ్ముతున్నాను. వారికి నా శుభాకాంక్షలు” అని మోదీ పేర్కొన్నారు.మరోవైపు ఇప్పటివరకు బీజేపీ ఐటీ విభాగానికి సుదీర్ఘకాలంగా సేవలంధించిన అమిత్ మాలవీయ కొత్త బృందానికి అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా విభాగం అధిపతిగా తన స్థానంలో దీపక్ మాస్కే బాధ్యతలు స్వీకరించనున్నారని పేర్కొన్నారు.“దీపక్ మాస్కే జీకి ప్రత్యేకంగా అభినందనలు. ఆయన ఇకపై బీజేపీ సోషల్ మీడియా విభాగానికి నాయకత్వం వహించనున్నారు. అలాగే కో-కన్వీనర్లుగా నియమితులైన పృతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లకు శుభాకాంక్షలు” అని అమిత్ మాలవీయ తెలిపారు.బీజేపీ నయా టీమ్‌లో పలువురు సీనియర్ నేతలకు ప్రాధాన్యమైన బాధ్యతలు దక్కాయి. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, పీయూష్ గోయల్, బైజయంత్ జయ్ పాండా తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బీఎల్ సంతోష్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. ఆయనకు సహాయంగా శివప్రకాశ్, సౌదాన్ సింగ్‌లను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. -
సీఎం విజయ్‌కు జైకొట్టిన అన్నామలై.. ఇక TVKలోకేనా?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చకు తెరలేచింది. మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. అన్నామలై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ పాలనపై అన్నామలై సానుకూలంగా స్పందించడం ఇప్పుడు కొత్త ఊహాగానాలకు తెరతీసింది.విజయ్ ప్రభుత్వం ఇంకా కొత్తదేనని, దానికి కనీసం ఒక సంవత్సరం సమయం ఇవ్వాలని అన్నామలై అన్నారు. తొలి 100 రోజుల్లో ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం కనిపించిందని, అవినీతిని ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం నిజాయితీగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రస్తుతం విజయ్‌కు నా మద్దతు ఉందని చేశారు.అన్నామలై వ్యాఖ్యలు ఇక్కడితో ఆగలేదు. బీజేపీ నిర్ణయాలు మరింతగా ఢిల్లీ కేంద్రీకృతమవుతున్నాయని, రాష్ట్ర స్థాయి నాయకులకు మరింత స్వేచ్ఛ, అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ అభివృద్ధి విషయంలోనూ గుజరాత్ కేంద్రీకృత మోడల్ మారాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.ఒకవైపు బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు.. మరోవైపు విజయ్‌కు బహిరంగ మద్దతు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీంతో అన్నామలై తదుపరి రాజకీయ అడుగు ఏంటి? విజయ్ నేతృత్వంలోని టీవీకే వైపు ఆయన అడుగులు వేస్తారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటివరకు అన్నామలై టీవీకేలో చేరుతున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ ఊహాగానంగానే చూడాలి. విజయ్‌కు అన్నామలై మద్దతు ప్రకటించడం, అదే సమయంలో బీజేపీ నిర్ణయాలపై విమర్శలు చేయడం.. తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
బీజేపీ కొత్త టీమ్ ఇదే..! DK అరుణ, లక్ష్మణకు బిగ్ షాక్
-
కార్యకర్త నుంచి జాతీయస్థాయికి..
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రూప్ కుమారి చౌదరి (50) నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం లోక్‌సభలో మహాసముంద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తమర్ధ్వజ్ సాహుపై లక్షా 45 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.రూప్ కుమారి చౌదరి (Rupkumari Choudhary).. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఎదిగారు. ఆమె గతంలో జిల్లా పంచాయతీ సభ్యత్వంతో సహా పలు క్షేత్రస్థాయి పదవులను నిర్వహించారు. 2019లో బీజేపీ మహాసముంద్ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. 2013 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బస్నా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర బహదూర్ సింగ్‌ను 6,239 ఓట్ల తేడాతో ఓడించి ఆ స్థానాన్ని గెలుచుకున్నారు.చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌కు కీలక పదవి?తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని 2024 ఎన్నికల అఫిడవిట్లో రూప్ కుమారి చౌదరి పేర్కొన్నారు. తనకు రూ. 5.39 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. రూ. 21.1 లక్షల అప్పులు ఉన్నట్టు తెలిపారు.వ్యక్తిగత వివరాలుపూర్తి పేరు: రూప్ కుమారి చౌదరిపుట్టిన తేదీ: 5 జూలై 1976పుట్టిన ప్రదేశం: ధనపాలి, మహాసముంద్ జిల్లా, ఛత్తీస్గఢ్తల్లిదండ్రులు: ఖేమ్రాజ్ పటేల్, తీర్థకున్వర్ పటేల్పార్టీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)విద్యార్హత: ఎంఏ (రాజనీతి శాస్త్రం)పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం, రాయ్పూర్వివాహ తేదీ : 01 ఏప్రిల్ 1993భర్త పేరు : ఓం ప్రకాష్ చౌదరిభర్త వృత్తి: వ్యవసాయంసంతానం: కొడుకు, ఇద్దరు కుమార్తెలు -
కొత్త జాతీయ కార్యవర్గం ప్రకటించిన బీజేపీ
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ తన నూతన జాతీయ కార్యవర్గ బృందాన్ని ప్రకటించింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు పెద్దపీట వేస్తూ, ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత కల్పించారు.బీజేపీ నూతన జాతీయ టీమ్‌ను ప్రకటించింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులను నియమించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురందేశ్వరి సహా 13 మందికి అవకాశం కల్పించింది. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్‌ను కొనసాగించింది. అలాగే జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మరోసారి బాధ్యతలు అప్పగించింది. సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివ ప్రకాష్, సౌధాన్ సింగ్, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సునీల్ బన్సల్, వినోద్ తావుడే, విప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పునియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియాలకు చోటు కల్పించింది.పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా దీపక్‌ను, మీడియా కన్వీనర్‌గా అనిల్ బలోనిని నియమించింది. బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ హేమంగు జోషికి బాధ్యతలు అప్పగించింది. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రూప్ కుమారి చౌదరిని నియమించింది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అమరుపాల్ మౌర్య, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బన్సీలాల్ గుజర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా శివేష్ కుమార్ రామ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా మన్నన్లాల్ రావత్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా కొన్వార్ బాసిత్ అలీలను నియమిస్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.నూతన జాతీయ టీమ్‌లో అనుభవజ్ఞులతో పాటు యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేలా కూర్పు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు. -
ధర్మేంద్ర ప్రధాన్‌కు కీలక పదవి?
న్యూఢిల్లీ: జెన్ జీ పోరాటంతో కేంద్ర మంత్రి పదవి కోల్పోయిన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీలో కీలక పదవి దక్కనుందని వార్తలు వస్తున్నాయి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనను నియమించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ఊహాగానాలు వెలుడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త టీమ్‌పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులకు పార్టీలో కీలక పదవులు దక్కనున్నాయని ప్రచారం జరుగుతోంది.బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సీనియర్ నేతలు సతీష్ పూనియా, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, స్మృతి ఇరానీలకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ మాజీ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మకు కూడా పెద్ద బాధ్యత దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అది బీజేపీ సంస్థాగత వ్యవస్థలో కావొచ్చు లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కావొచ్చని సమాచారం. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ పేరు కూడా కీలక పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆ జాబితాపైనే ప్రధాన దృష్టి!నితిన్ నబిన్ కొత్త టీమ్‌లో అత్యంత కీలకమైన మార్పులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల విషయంలో ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీకి ఏడుగురు జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. వీరిలో అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాధామోహన్ దాస్ అగర్వాల్, బీఎల్ సంతోష్ ఉన్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత)గా ఉన్న బీఎల్ సంతోష్ మాత్రం కొనసాగడం దాదాపు ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పదవిని సాధారణంగా ఆర్ఎస్ఎస్కు చెందిన నేతకే కేటాయిస్తారు. అయితే ఆయనకు కొత్త డిప్యూటీలను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. దుష్యంత్ గౌతమ్, రాధామోహన్ దాస్ అగర్వాల్‌లకు విశ్రాంతి ఇవ్వడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.వారిద్దరికి కీలక బాధ్యతలు?ఇదే విభాగంలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, సతీష్ పూనియాలను తీసుకురావచ్చని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువత, అనుభవజ్ఞుల కలయికతో టీమ్‌ను ఏర్పాటు చేయాలన్న నితిన్ నబిన్ ఆలోచనలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్‌ను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ పేర్లపై బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఉత్తరాది నుంచి భాటియా పేరు!ఉత్తర భారతదేశం నుంచి హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ భాటియా (Sanjay Bhatia) పేరు కూడా బీజేపీ కొత్త టీమ్‌లో కీలక బాధ్యత కోసం వినిపిస్తోంది. ఆయనకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఏదైనా ముఖ్యమైన పదవి దక్కవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.చదవండి: ఇలా అయితే నేనే నిరసనకు దిగుతా.. బాబా రామ్దేవ్మొత్తంగా చూస్తే, నితిన్ నబిన్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు, పదవులపై ఊహాగానాలే తప్ప, తుది నిర్ణయాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
ఆర్థిక ఇబ్బందులతోనే బీజేపీని వీడుతున్నా: షెహజాద్ పూనావాలా
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా.. మరోసారి తన రాజీనామాను ఉద్ఘాటించారు. ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. అదే సమయంలో.. పార్టీలో కొందరి వైఖరి కూడా తన నిర్ణయాన్ని బలపరచాయని తాజాగా పార్టీకి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. తన రాజీనామా లేఖను పూనావాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తొలుత తన నిర్ణయాన్ని బీజేపీ నాయకత్వం గౌరవించి, రాజీనామా స్వీకరించకుండా పునరాలోచించాలని కోరిందని తెలిపారు. అయితే అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు క్రియాశీల సభ్యత్వం నుంచి తప్పుకోవాలని తుది నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో సమర్పించిన రాజీనామాను పార్టీ అంగీకరించకపోవడంతో.. మరోసారి బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు లేఖ రాసి తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. వీలైనంత త్వరగా ఆ పని చేయాలంటూ ఆయన కోరుతున్నారు.వ్యవస్థను వీడుతున్నా..తన నిర్ణయం వెనుక ప్రత్యేకమైన కారణాలేవీ లేవని పూనావాలా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లపై తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని తెలిపారు.‘‘నేను బీజేపీ వ్యవస్థ నుంచి మాత్రమే బయటకు వస్తున్నాను.. సిద్ధాంతాల నుంచి కాదు’’ అని పేర్కొన్నారు. తాను ఎప్పటికీ మోదీ వీరాభిమానినేనని.. భవిష్యత్‌లోనూ సాధ్యమైనంత వరకు బీజేపీ ఆలోచనా విధానానికి మద్దతుగా ఉంటానని చెప్పారు.ఆ కొందరు ఎవరు?గత కొన్ని రోజులుగా జరిగిన కొన్ని పరిణామాలు తన నిర్ణయాన్ని మరింత బలపరిచాయని పూనావాలా లేఖలో పేర్కొనడం గమనార్హం. అయితే ఆ వ్యక్తులు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. వారికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వంతో తాను చర్చలు కూడా జరిపినట్లు ఆయన చెప్పినట్లు తెలిపారు.అలాగే భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోనని.. రాజకీయాలను వదిలి ప్రైవేటు రంగంలోకి వెళ్లనున్నట్లు చెప్పారు. ‘‘అత్యవసర ఆర్థిక, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వివరించారు.కాంగ్రెస్ నుంచి బీజేపీకి..మహారాష్ట్రకు చెందిన 38 ఏళ్ల షెహజాద్ పూనావాలా న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యే ప్రక్రియను బహిరంగంగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. అనంతరం కాంగ్రెస్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు.బీజేపీలో చేరిన తర్వాత ఆయన పార్టీకి చెందిన ప్రముఖ ముస్లిం ముఖంగా ఎదిగారు. టీవీ చర్చలు, మీడియా సమావేశాల్లో పార్టీ తరఫున తరచూ ప్రాతినిధ్యం వహించారు. హిందుత్వాన్ని బాగా ప్రచారం చేయడంతో.. అధినాయకత్వం ఆయన్ని చేరదీసింది. 2021లో బీజేపీ ఢిల్లీ ఐటీ, సోషల్ మీడియా విభాగం బాధ్యతలు కూడా నిర్వహించారు.ఆ తర్వాత.. టీవీ డిబేట్లో పార్టీ తరఫున ప్రతినిధిగా పాల్గొనేవారు. పార్టీలో తనకు లభించిన అవకాశాలను గుర్తుచేసుకుంటూ.. గత ఐదేళ్లుగా అందించిన వేదిక, గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే తాజాగా ఆయన తీసుకున్న రాజీనామా నిర్ణయం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
విజయ్ తల్లిపై కామెంట్స్.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై ఫిర్యాదు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ఆయన తల్లిపై అవమానకర, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌పై తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు అందింది. డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని, సంబంధిత చట్టపరమైన నిబంధనల కింద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని, పరువునష్టం, బహిరంగ ప్రదేశంలో అనుచిత ప్రవర్తనకు సంబంధించి తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు పోలీసులను కోరారు.శనివారం చెన్నైలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కమలాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన రాజకీయ వివాదం నేపథ్యంలో ఈ ఫిర్యాదు వచ్చింది. అసెంబ్లీలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి విజయ్ చేసిన “కుట్టి కథై” (చిన్న కథ) వ్యాఖ్యలపై నాగేంద్రన్ విమర్శలు చేశారు.పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన నాగేంద్రన్.. అసెంబ్లీలో విజయ్ పదేపదే “తండ్రి” గురించి ప్రస్తావించడాన్ని ఎగతాళి చేశారు. “మీ తండ్రి ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలనుకునేవారు అసెంబ్లీలో సమాధానం కోసం వెతకకుండా ఇంట్లో మీ అమ్మను అడగాలి” అని అన్నారు.విజయ్, ఆయన తల్లిపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులను పరిశీలించి, కేసు దర్యాప్తులో భాగంగా వాటిని స్వాధీనం చేసుకోవాలని కూడా పోలీసులను కోరారు. 2026 ఏప్రిల్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి తర్వాత అసెంబ్లీలో విజయ్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది.డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తండ్రి ఎక్కడ ఉన్నారనే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ “కుట్టి కథై” చెప్పారు. ఇది కొళత్తూరులో డీఎంకే అధ్యక్షుడి ఓటమిని ఉద్దేశించిన హాస్యభరిత వ్యాఖ్యగా భావించారు.ఆ సమయంలో డీఎంకేతో పాటు పలు రాజకీయ పార్టీలు విజయ్ వ్యాఖ్యలను విమర్శించాయి. ముఖ్యమంత్రి చేసిన కామెంట్లపై స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రి.. తాను శాసనసభలో లేకపోయినా ప్రజల హృదయాల్లో ఉన్నానని అన్నారు. నాగేంద్రన్ తాజా వ్యాఖ్యలపై బీజేపీలోనూ, రాష్ట్ర ప్రభుత్వంలోనూ విమర్శలు వచ్చాయి.తమిళనాడు మంత్రి ఎ.రాజ్‌మోహన్ ఈ వ్యాఖ్యలను “అనాగరికమైనవి, అనుచితమైనవి”గా అభివర్ణించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యక్తిగత విమర్శలు ఎదురైనా రాజకీయాల్లో మర్యాద పాటించాలని విజయ్ తన సహచరులను ఎప్పటికప్పుడు కోరారని చెప్పారు.తమిళనాడు నేత కె.అన్నామలై కూడా నాగేంద్రన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అవి రాజకీయ మర్యాదకు ఉన్న హద్దులను దాటాయని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, రాజకీయ విభేదాలపై చర్చించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో సమర్థించదగిన అంశాలని అన్నామలై చెప్పారు. -
పూర్తి వందేమాతరం సోనియా వద్దన్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై ఆ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ అభ్యంతరం తెలిపారని శనివారం బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)బీఎల్ సంతోష్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘తల్లి(సోనియాగాం«దీ), కుమారుడు(రాహుల్ గాం«దీ), కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై నిరాశ చెందినట్లు కనిపిస్తున్నారు’అంటూ సంతోష్ వ్యాఖ్యానించారు. ఇలాంటి కొందరి మనస్తత్వాలు స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం కూడా ఏమార్పూ లేకుండా ఒకేలా ఉన్నాయన్నారు. వందేమాతర గేయం ఆరు చరణాలను ఆలపించేందుకు సోనియా గాంధీ విముఖత చూపడం సిగ్గు చేటని బీజేపీ ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ అన్నారు. ‘కాంగ్రెస్‌ది ఎమర్జెన్సీ మైండ్ సెట్, ఇటువంటి మైండ్‌సెట్‌ను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు. ఇకపైనా తిరస్కరిస్తూనే ఉంటారు’అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవంగా జరిగిందిదే: బీజేపీ నేతల ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో సోనియా గాంధీ వందేమాతర గేయంపై అభ్యంతరం తెలపడం లేదని, కేవలం ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గేకు కుర్చీ ఇవ్వాలని మాత్రమే ఆమె కోరుతున్నారని వివరించింది. 1937 అక్టోబర్ 28వ తేదీన కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో మహాత్మా గాం«దీ, నేతాజీ, పటేల్, అబుల్ కలాం ఆజాద్, నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్, రాజగోపాలాచారి పాల్గొన్నారు. ఈ సమావేశంలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఇచ్చిన సూచనల మేరకు వందేమాతరం ఆరంభం చరణాలను మాత్రమే కాంగ్రెస్ సమావేశాల్లో ఆలపించాలని నిర్ణయించారు’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అప్పటి చారిత్రక ఘటనను గుర్తు చేశారు. ‘అప్పట్నుంచి మా పార్టీ ప్రతి సెషన్లోనూ, సేవాదళ్ కార్యక్రమాల్లోనూ ఇలాగే ఆరంభ చరణాలను ఆలపిస్తున్నాం. ఇందులో ఎలాంటి వివాదం లేదు. శనివారం ఇందిరాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాత్రం పూర్తి గేయాన్ని ఆలపించాం, ఇది వాస్తవం’అని ఆయన వివరించారు. వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై పార్లమెంట్లో 16 గంటలపాటు జరిగిన చర్చల్లోనూ తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించామన్నారు. తాజాగా, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు -
బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో విద్వేష వ్యాప్తి
న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ–ఆర్ఎస్ఎస్లు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల మధ్య విభేదాలను పెంచుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో శాంతి, ఐక్యతలను పెంపొందించేందుకు తమ పార్టీ ప్రేమ దుకాణం తెరిచిందని చెప్పారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఖర్గే ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాం«దీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పేర్లు మారుస్తూ వాటిని ప్రధాని మోదీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే, మున్ముందు మోదీ మన జాతీయ జెండాను సైతం ఎగురవేయబోరంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రపంచాన్ని తానే సృష్టించానంటూ మోదీ చెప్పుకోలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా సలహా ఇచ్చి ఈ ప్రపంచాన్ని తానే రక్షించానంటూ చెప్పుకునే ఉండేవారన్నారు. అది మోదీ ఏర్పాటు చేసిన ట్రస్ట్ అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఆరోపణల అంశాన్ని ఖర్గే ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేద ప్రజలు భక్తితో ఇచ్చిన రూ. 50 విరాళానికి కూడా భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విరాళాల దొంగతనానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘తన ఘనతగా చెప్పుకునేందుకే ప్రధాని మోదీ రామాలయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, అందులోకి సొంతవాళ్లను నియమించుకున్నారు. సాధుసంతులతో పనిలేకుండా ఒంటరిగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నిజంగాదేశభక్తుడే అయితే ఆధ్యాతి్మకవేత్తలను, రామభక్తులను కలుపుకుని ఈ కార్యక్రమం పూర్తి చేసేవారు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి ధోరణి వల్ల, భవిష్యత్తులో మోదీ జాతీయ జెండాను కూడా కిందకు దింపేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉంది’అని ఆయన వ్యాఖ్యానించారు. నిరసన రాజ్యాంగ హక్కు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకో వడం అంటే ఆనాటి యోధులు కలలుగన్న దేశాన్ని సాకారం చేసే క్రమంలో ఆత్మ విమర్శ చేసుకునేందుకు వచ్చిన ఓ అవకాశమని ఖర్గే చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిర, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్, మన్మోహన్ వంటి కాంగ్రెస్ ప్రధానులు తమ హయాంలోని సవాళ్లకు అనుగుణంగా దేశాన్ని ముందుకు నడిపారని, భవిష్యత్ భారత్‌కు బలమైన పునాది వేశారని ఖర్గే అన్నారు. నేటి యువత ఆశలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో యువత తీవ్ర నిరాశకు గురై దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, హక్కుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడటం ఎంతమాత్రం దేశద్రోహం కాదని ఖర్గే స్పష్టం చేశారు. హక్కుల కోసం గొంతు విప్పుతున్న నేటి యువతను దేశద్రోహులుగా చిత్రీకరించవద్దని, స్వాతంత్య్ర పోరాటంతో సాధించిన హక్కులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. -
సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. రగులుతున్న తమిళనాడు రాజకీయం?
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తమిళగ వెట్రి కళగం అధినేత, ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో సీఎం విజయ్ ఓ చిన్న కథ చెబుతూ.. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి కౌంటర్‌గా చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో తండ్రి ఎక్కడ ఉన్నారని వెతికే బదులు..అంటూ.. సీఎం విజయ్ తల్లిని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు నేరుగా సీఎం విజయ్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన తల్లిని ఉద్దేశించినవేనంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యాఖ్యలపై అధికార టీవీకే పార్టీతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి అనాగరిక, అనుచిత వ్యాఖ్యలు బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తికి తగవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్‌మోహన్ తదితరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వయంగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై కూడా నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించారు. రాజకీయంగా విధానాలను, ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పులేదని, కానీ ఒక నాయకుడి కుటుంబాన్ని, ప్రత్యేకించి తల్లిని కించపరిచేలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది తమిళనాడు రాజకీయ సంస్కృతిని దిగజార్చేలా ఉందని మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ.. తాను ఎవరిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆ వ్యాఖ్యలు చేయలేదని, తన ప్రసంగాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించారని వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ మాతృమూర్తిని, మాతృభాషను గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఏదేమైనా, విజయ్ 'తండ్రి' వ్యాఖ్యలకు బీజేపీ 'అమ్మ' అంటూ ఇచ్చిన కౌంటర్ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
‘నన్నే ఆపుతావా?’.. పోలీసు అధికారిణిపై ఎమ్మెల్యే కుమార్తె దాడి
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. తుమకూరు రూరల్ బీజేపీ ఎమ్మెల్యే బి. సురేష్ గౌడ కుమార్తె ఐశ్వర్య, శ్రీరంగపట్టణంలోని ప్రసిద్ధ ఆరతి ఉక్కడ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిణిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భీమన అమావాస్య సందర్భంగా చోటుచేసుకుంది.ఆగస్టు 12న భీమన అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరంగపట్టణంలోని ఆరతి ఉక్కడ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో తీవ్రమైన రద్దీ నెలకొన్న తరుణంలో గర్భాలయంలోకి ప్రవేశించడానికి అందరూ నిబంధనల ప్రకారం కొంత సమయం వేచి ఉండాలని అధికారులు సూచించారు.ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కుమార్తె ఐశ్వర్యను నిబంధనల ప్రకారం వేచి ఉండాలని అక్కడ విధి నిర్వహణలో ఉన్న మహిళా పీఎస్ఐ సవిత కోరారు. ఒక్కసారిగా అందరినీ లోపలికి అనుమతిస్తే భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందని ఆమె వివరించడానికి ప్రయత్నించారు.అయితే, దీనిపై ఐశ్వర్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే కుమార్తెనని చెబుతూ పోలీస్ అధికారిణితో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అనుచిత పదజాలం ఉపయోగించినట్లు పీఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. విధులు నిర్వర్తిస్తున్న తనను అడ్డుకుంటున్నారనే కోపంతో ఐశ్వర్య పీఎస్ఐ సవితను చెంపదెబ్బ కొట్టారని, అంతేకాకుండా ఆమె కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించారని సమాచారం.పోలీసుల కేసు నమోదు ఈ ఘటనపై బాధితురాలైన పీఎస్ఐ సవిత మాండ్య మహిళా పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా యాతనహళ్ళి పోలీస్ స్టేషన్లో ఐశ్వర్యపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రతిస్పందించిన ఐశ్వర్య కూడా పోలీస్ అధికారిణి తనతో అసభ్యంగా,దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులకు తిరుగు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యురాలు పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలు రావడంతో ఈ ఉదంతం కర్ణాటక రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. -
‘హగ్’ కామెంట్ రచ్చ.. షీలా వీడియోతో బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నేతలతో కొనసాగించే సాన్నిహిత్యంపై విమర్శలు చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త మాటల యుద్ధానికి తెరలేపాయి. మరీ ముఖ్యంగా షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్‌పై బీజేపీ, మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. గురువారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాయంత్రం కాంగ్రెస్ నిర్వహించిన జాతీయ సదస్సులో పాల్గొన్న రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. ‘‘మోదీకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వింత ఆలోచనలు వస్తుంటాయి. ఇదే విదేశాంగ విధానం అనుకుంటున్నారు’’ అంటూ వేదికపైనే కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకున్నారు.RaGa is in full roast mode.🤣🔥Rahul Gandhi just gave the most savage demonstration of “hug diplomacy”.*Runs and hugs Sandeep Dikshit*The hall couldn’t stop laughing. This one will travel. pic.twitter.com/XodlA8MvS8— Rajat Jain (@RajatJain) August 13, 2026ఈ సమయంలో సందీప్ దీక్షిత్ స్పందిస్తూ.. ‘‘నన్ను మెలోనీ అనుకుని కౌగిలించుకున్నారా?’’ అని ప్రశ్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఘోల్లున నవ్వారు. దీనికి రాహుల్ గాంధీ.. ‘‘ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు’’ అంటూ బదులివ్వడంతో సభలో నవ్వులు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం మొదలైంది.మోదీ ‘హగ్ డిప్లమసీ’పై రాహుల్ సెటైర్పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని మోదీ కౌగిలించుకున్న సందర్భాలను ఉద్దేశించే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. విదేశాంగ విధానంలో దౌత్య సంబంధాల కంటే వ్యక్తిగత ఇమేజ్, ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కాంగ్రెస్ గతంలోనూ మోదీపై విమర్శలు చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ప్రధాని స్థాయిని, అంతర్జాతీయ సంబంధాలను ఎగతాళి చేసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించింది. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడింది.బీజేపీ–ఆర్ఎస్ఎస్పై రాహుల్ విమర్శలుఇదే కార్యక్రమంలో రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత పరిస్థితులపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ తన అసలు స్వరూపాన్ని కోల్పోయిందని, పెద్ద పారిశ్రామిక వర్గాల ప్రభావంలోకి వెళ్లిందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.‘‘మోదీ, అమిత్ షాకు నిద్ర లేకుండా చేస్తాం’’కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. అయితే తమ పోరాటం ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఉంటుందని చెప్పారు.సందీప్ దీక్షిత్ నేపథ్యంసందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లోకి రాకముందు సామాజిక అభివృద్ధి రంగంలో పనిచేసిన ఆయన.. ‘సంకేత్’ అనే సంస్థను నడిపించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగుతూ ఢిల్లీ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. షీలా దీక్షిత్ ప్రస్తావనతో బీజేపీ కౌంటర్ఈ వివాదంలో బీజేపీ నేతలు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పేరును తెరపైకి తెచ్చారు. 2024లో ప్రధాని మోదీ.. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ షీలా దీక్షిత్‌ను గౌరవిస్తూ, ఆమెపై వచ్చిన ఆరోపణల తీరుపై బాధపడ్డానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇప్పుడు అదే మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని బీజేపీ విమర్శిస్తోంది. మెలోనీ పేరును ప్రస్తావిస్తూ ఓ మహిళా దేశాధినేతను రాజకీయ వ్యంగ్యంలోకి లాగడం సరికాదని ఆరోపిస్తోంది. మరోవైపు.. పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం ఈ తరహా రాజకీయం సరికాదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. In 2024, PM Modi publicly said he was PAINED by the way Sheila Dikshit was "INSULTED" with baseless Corruption allegations.Today her own son, Sandeep Dikshit, stands on stage with Rahul & mocks the same Prime Minister 💔> He reduces a diplomatic gesture to a cheap joke by… pic.twitter.com/tALdiFnJhd— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) August 13, 2026‘‘మెలోనీ పేరు ప్రస్తావించలేదు’’రాహుల్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్థించింది. ఆయన ఎక్కడా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేరును ప్రస్తావించలేదని, కేవలం ప్రధాని మోదీ విదేశాంగ శైలిపై రాజకీయ విమర్శ మాత్రమే చేశారని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలు.. అంతర్జాతీయ దౌత్యంలో వ్యక్తిగత హావభావాలను ఎలా చూపిస్తున్నారనే అంశంపైనే రాహుల్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ప్రధాని మోదీ విదేశీ నేతలతో చేసే కౌగిలింతలను కాంగ్రెస్ గతంలోనూ విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.అయితే బీజేపీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేలా కనిపించడం లేదు.ట్రెండింగ్‌లో మెలోనీప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహపూర్వక సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది. ఆ ట్రెండ్‌ను పసిగట్టిన ఇద్దరూ.. అందుకు తగ్గట్లే మెలోడీ పేరుతో సరదా పోస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో యూరప్ పర్యటనకు వెళ్లిన మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్లు బహుకరించడం గమనార్హం. అంతెందుకు కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతోనూ ఈ మధ్య నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. అయితే.. తాజా రాహుల్ గాంధీ హగ్ పాలిటిక్స్.. బీజేపీ అభ్యంతరాల నేపథ్యంతో నెట్టింట మెలోనీ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. -
అది జోకర్ల గుంపు
న్యూఢిల్లీ: బీజేపీ–ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ను భారతదేశంపై అవగాహన లేని జోకర్ల గుంపుగా అభివరి్ణంచారు. దేశ చరిత్ర, సంస్కృతి, ప్రస్తుత వాస్తవికతపై బీజేపీ–ఆర్ఎస్ఎస్ గుంపునకు ఏమీ తెలియదని ఆరోపించారు. తమకు, మరికొందరికి ప్రయోజనం చేకూర్చే ఒక వ్యవస్థను దేశంపై రుద్దడమే బీజేపీ–ఆర్ఎస్ఎస్ రాజకీయ సిద్ధాంతమని మండిపడ్డారు. ప్రధాని మోదీ విదేశాంగ విధానం అంతా విదేశీ నాయకులను కౌగిలించుకోవడమేనని ఎగతాళి చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన రచనాత్మక కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన అసలైన స్వభావాన్ని ఎప్పుడో కోల్పోయిందని, ప్రస్తుతం అది అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల చేతిలో ఒక సాధనంగా మారిందని ఆరోపించారు. బడా బాబులు ఆర్ఎస్ఎస్ను తమ స్వలాభం కోసం వాడుకుంటున్నారని చెప్పారు. నేటి భారతదేశానికి ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. వివిధ అంశాలపై మీడియా ప్రభుత్వ వైఖరికి వంతపాడుతోందని అన్నారు. మీడియా పరిమితులను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. కొంతమంది విదూషకులు మనపై పెత్తనం చెలాయించకుండా చూడటమే జాతీయ స్ఫూర్తి అని స్పష్టంచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాజీనామాలు సమర్పించాల్సిందేనని, అప్పటిదాకా వారికి నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు. వారిని నిద్రపోనివ్వబోమని వ్యాఖ్యానించారు. ద్వేషం, హింస లేకుండానే అనుకున్నది సాధిస్తామని స్పష్టంచేశారు. మన సంస్కృతి కోసం పోరాడుతున్నామని వివరించారు. మన దేశం ద్వేషం, పగతో కాకుండా ప్రేమ, సోదరభావం, అహింసతో ముడిపడి ఉందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. -
MLC భరత్ తల్లిపై వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన BJP నేత
-
బీజేపీ ఆఫీస్‌లో అలా.. రైల్వే ఉద్యోగి ఇలా!
పంద్రాగస్టు వేడుకలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. జాతీయ పతాకం గౌరవంపై రెండు ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కేరళలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పతాకాలు మూలన పడేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ కావడంతో వివాదం రేగింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో వీడియో ద్వారా జాతీయ జెండా పట్ల గౌరవం, బాధ్యతపై చర్చ మొదలైంది.కేరళలోని కాసర్గోడ్ బీజేపీ జిల్లా కార్యాలయంలో కొన్ని త్రివర్ణ పతాకాలు ఒక మూలన పడేసినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. జాతీయ పతాకాన్ని అవమానించారంటూ డీవైఎఫ్ఐ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.జాతీయ పతాకాన్ని అవమానించడం చట్టం ప్రకారం ‘Prevention of Insults to National Honour Act, 1971’ కింద నేరమని అధికారులు గుర్తుచేస్తున్నారు. అయితే వైరల్ వీడియోపై బీజేపీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.BJP faces allegations of disrespecting Indian flag in Kerala's KasaragodSeveral Indian national flags were allegedly found piled up at the BJP district office in Kasaragod after a Tiranga Yatra under the Har Ghar Tiranga campaign. DYFI sought strict action and filed a complaint… pic.twitter.com/munNIIQwcJ— South First (@TheSouthfirst) August 12, 2026మరోవైపు.. రైల్వే ఉద్యోగి చేసిన ఓ చిన్న పని మాత్రం ప్రశంసలు అందుకుంది. దుమ్ముతో నిండిపోయిన రైలింజిన్ ముందు భాగంలో ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఓ ఉద్యోగి నీటితో శుభ్రం చేసి, వస్త్రంతో తుడిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాతీయ పతాకం పట్ల చూపిన గౌరవానికి నెటిజన్లు అభినందనలు తెలిపారు. సాధారణ విధుల్లో భాగంగా చేసిన పని అయినప్పటికీ.. జాతీయ చిహ్నాల పట్ల బాధ్యతను గుర్తుచేసేలా ఉందని పలువురు స్పందించారు.Yes, there may be dirt on the locomotive but the flag should be clean. Small gesture, big message! 🙏🤎 #HarGharTiranga #IndianRailways pic.twitter.com/iGlLXEtMM3— Ananth Rupanagudi (@AnanthOnTrack) August 12, 2026ఒకవైపు పతాకాల నిర్లక్ష్యంపై వివాదం.. మరోవైపు పతాకానికి గౌరవం తెలిపిన చర్య.. జాతీయ జెండా పట్ల మన బాధ్యతపై మరోసారి చర్చకు దారితీశాయి. -
సీఎం ఎదుట కన్నీళ్లు.. లంచం ఆరోపణలు.. అసలు ట్విస్ట్ ఇచ్చిన గోల్డ్ మెడలిస్ట్!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో 12వ తరగతి చదువుతున్న ఒక క్రీడాకారిణి అంతర్జాతీయ తైక్వాండో టోర్నమెంట్‌కు వెళ్లలేకపోయిన ఉదంతం రాజకీయ దుమారానికి దారితీసింది. ఆ విద్యార్థిని వద్ద రూ. 1.5 లక్షలు లంచం డిమాండ్ చేశారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించగా, ఆ తర్వాత సదరు విద్యార్థిని మరో వీడియో విడుదల చేసి అసలు వాస్తవాలను వెల్లడించింది.డెహ్రాడూన్‌లోని సీఎన్ఐ గర్ల్స్ స్కూల్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని శైరా, ఆగస్టు 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నిర్వహించిన ‘ముఖ్యమంత్రి యువ విద్యార్థి మంథన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యానని, అయితే రూ. 1.5 లక్షలు సమకూర్చుకోలేక ఆ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయానని సీఎం ఎదుట భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. దీంతో సీఎం ధామి ఆమెను ఓదార్చి, విద్యార్థిని వివరాలు సేకరించి తగిన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.లంచం ఆరోపణలతో కాంగ్రెస్ విమర్శలుఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థిని నుంచి రూ. 1.5 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. జాతీయ స్థాయిలో స్వర్ణం గెలిచిన ప్రతిభావంతురాలైన విద్యార్థినిని బీజేపీ అవినీతి పాలన వల్ల అంతర్జాతీయ వేదికకు దూరం చేశారని ధ్వజమెత్తింది. అంతేకాకుండా, ముఖ్యమంత్రి సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది.उत्तराखंड में एक बहादुर बेटी ने CM पुष्कर सिंह धामी के सामने खड़े होकर BJP सरकार के भ्रष्टाचार की पोल खोल दी।बच्ची ने बताया 👇मैंने ताईक्वांडो में नेशनल लेवल पर गोल्ड मेडल जीता था, लेकिन मैं इंटरनेशनल खेलने नहीं जा सकी, क्योंकि मुझसे 1.5 लाख रुपए की घूस मांगी गई।CM धामी ने… pic.twitter.com/D9kKJiyOm9— Congress (@INCIndia) August 12, 2026 అసలు వాస్తవం చెప్పిన విద్యార్థినిఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో శైరా మరో వీడియోను విడుదల చేసి పూర్తి వివరణ ఇచ్చింది. సీఎం కార్యక్రమంలో సమయం లేక పూర్తి విషయాన్ని చెప్పలేకపోయానని తెలిపింది. జమ్మూలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన తర్వాత రొమేనియాలో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ఎంపికైనట్లు పేర్కొంది. ఆ పర్యటనకు అయ్యే మొత్తం ఖర్చులో సంబంధిత క్రీడా సంస్థ సుమారు రూ. 1.70 లక్షలు భరించేందుకు అంగీకరించిందని, మిగిలిన రూ. 1.5 లక్షల ఖర్చును తానే స్వయంగా భరించాల్సి వచ్చిందని వివరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన మిగతా మొత్తాన్ని సమకూర్చుకోవడంలో సహాయం కోరాలని తన పాఠశాలకు గానీ, ఇతరులకు గానీ ముందుగా సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఈ రూ. 1.5 లక్షలు ఎవరూ అడిగిన లంచం కాదని, టోర్నమెంట్ ఖర్చుల్లో తాను చెల్లించాల్సిన వాటా మాత్రమేనని, ప్రభుత్వ అధికారులెవరూ తన వద్ద లంచం డిమాండ్ చేయలేదని శైరా స్పష్టం చేసింది. -
ఎమ్మెల్సీ భరత్‌కు క్షమాపణలు..బీజేపీకి వసంత్ రాజీనామా
కుప్పం : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కే.ఆర్.జె. భరత్ ఇంటిపై దాడికి యత్నించిన ఘటన, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ కుప్పం మండల యువమోర్చా నాయకుడు వసంత్ వెనక్కి తగ్గారు. పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో దిగివచ్చిన ఆయన, తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్సీ భరత్‌ను బహిరంగంగా క్షమాపణలు కోరారు. అదే సమయంలో తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా కుప్పంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో బీజేపీ నాయకుడు వసంత్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ భరత్ ఇంటి వైపు దూసుకెళ్లి దాడికి యత్నించడంతో పాటు, ఆయన తల్లిని ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పశ్చాత్తాపంతో రాజీనామా ప్రకటనపోలీసు కేసు నమోదు కావడంతో వ్యవహారం ముదరడంతో వసంత్ స్పందించారు. ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర తప్పిదమని, తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ భరత్ పెద్ద మనసుతో తనను క్షమించాలని కోరారు. ఈ వివాదం నేపథ్యంలో తాను కుప్పం మండల బీజేపీ యువమోర్చా బాధ్యతల నుంచే కాకుండా, బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. -
‘ఆ పార్వతీ దేవి రూపమే.. మా బిడ్డగా జన్మించింది’
భారత స్టార్ రెజ్లర్ బబితా ఫొగట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భర్త వివేక్ సుహాగ్‌తో కలిసి ఆడబిడ్డను తమ జీవితాల్లోకి ఆహ్వానించింది. కాగా హర్యానాకు చెందిన ప్రముఖ రెజ్లింగ్ సిస్టర్స్‌లో బబితా ఒకరు. మహవీర్ ఫొగట్ కుమార్తెల్లో ఒకరైన ఆమె.. అంతర్జాతీయ స్థాయిలో రెజ్లర్‌గా సత్తా చాటింది.కామన్వెల్త్ క్రీడల్లో బబితా ఫొగట్ మూడు పతకాలు సాధించింది. 2010లో రజతం గెలిచిన ఆమె.. 2014లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఇక 2018లో మరోసారి వెండి పతకంతో మెరిసింది. అదే విధంగా 2012 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లోనూ బబిత కాంస్య పతకం అందుకుంది.అంతేకాదు ఒలింపిక్స్‌లోనూ బబితా కుమారి పాల్గొంది. అయితే, కుస్తీకి స్వస్తి పలికిన తర్వాత ఆమె రాజకీయాల్లో ప్రవేశించింది. బీజేపీలో చేరి పార్టీకి సేవలు అందిస్తోంది.ఇక బబితా కుమారి వ్యక్తిగత విషయానికొస్తే.. తోటి రెజ్లర్ వివేక్ సుహాగ్‌ను ప్రేమించిన బబిత 2019లో అతడిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2021 జనవరిలో కుమారుడు జన్మించాడు. తాజాగా కుమార్తె కూడా రావడంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని బబిత దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.ఆ పార్వతీ దేవి రూపమే.. మా బిడ్డగా జన్మించిందిపాప పుట్టిన విషయాన్ని పంచుకుంటూ.. ‘‘ఆ మహాదేవుడి కృప వల్ల మాస శివరాత్రి రోజు నా జీవితంలోకి పార్వతీ దేవి వంటి చిన్నారి వచ్చింది. మా కుటుంబానికి దక్కిన విలువైన ఆశీర్వాదం. మా చిన్నారికి మీ దీవెనలు కావాలి’’ అని 36 ఏళ్ల బబితా ఫొగట్ బిడ్డతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. కాగా మహవీర్ ఫొగట్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఫొగట్ సిస్టర్స్‌కు దంగల్ సిస్టర్స్‌గా పేరు వచ్చింది. కాగా మహవీర్ ఫొగట్ తన నలుగురు కుమార్తెలతో పాటు తన సోదరుడి కుమార్తె వినేశ్ ఫొగట్‌ను సైతం మేటి రెజ్లర్‌గా తీర్చిదిద్దాడు. వినేశ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున హర్యానా ఎమ్మెల్యేగా ఉన్నారు. -
జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి యత్నం
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలో రణరంగంగా మారిన విద్యార్థుల ఉద్యమంలో పరీక్షార్థులపై పోలీసులు విచక్షణారహిత లాఠీచార్జ్ ఘటనను తీవ్రంగా నిరసిస్తూ విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో, బీజేపీ అనుబంధ అఖిలభారత విద్యార్థి పరిషత్ అసెంబ్లీ బయట తీవ్రస్థాయిలో తమ నిరసనను వ్యక్తంచేశాయి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ(జేఎస్ఎస్సీ)ల ఉద్యోగ నియామక ప్రక్రియలు, పరీక్షల్లో సంస్కరణల సాధన కోసం పరీక్షార్థులు సోమవారం రాంచీలో చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం తెల్సిందే. మంగళవారం వందలాది మంది ఏబీవీపీ కార్యకర్తలు పాత విధానసభ నుంచి కొత్త శాననసభకు నడుచుకుంటూ, బస్సులో ర్యాలీగా రాగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాట ఎక్కువవడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు 110 మంది కార్యకర్తలను అరెస్ట్‌చేశారు. వీరిలో మహిళా కార్యకర్తలూ ఉన్నారు. తోపులాటలో ఒక అమ్మాయి, అబ్బాయి స్పృహతప్పి పడిపోయారు. ‘‘నియామక ప్రక్రియలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తుంటే కారణంలేకుండా చాలా మందిని పోలీస్ వ్యాన్లలోకి పడేశారు. పలువురికి గాయాలయ్యాయి’’అని ఏబీవీపీ కార్యకర్త కుమార్ దివ్యాన్షు చెప్పారు. లాఠీచార్జ్‌ను ఖండిస్తూ బీజేపీ ఇచి్చన బంద్ పిలుపుమేరకు జార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, కళాశాలలు, పాఠశాలలు మూసేశారు. వ్యాపారసముదాయాలు మూసేయడం, ప్రజారవాణా వ్యవస్థలు స్తంభించడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీలో నిరసనలుఉద్యమిస్తున్న పరీక్షార్థులపై పోలీసులు లాఠీలకు పనిజెప్పడమేంటంటూ సోరెన్ సర్కార్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో నిలదీశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను స్తంభింపజేశారు. దీంతో ఉదయం సభ మొదలైన కొన్ని నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదాపడింది. 12 గంటలకు మొదలైనా నినాదాలు ఆగకపోవడంతో 2 గంటలవరకు వాయిదావేశారు. 2 గంటలకు అధికార, విపక్ష ఎమ్మెల్యేలు పోటాపోటీగా వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరీక్షల రద్దు, సంస్కరణల విషయంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోందని సభలో సీఎం హేమంత్ ప్రకటించారు. ‘‘ఉద్యమకారులను బీజేపీ తమ రాజకీయ పనిముట్లుగా వాడుకోవాలని చూస్తోంది. మా ప్రభుత్వం ఇప్పటికే ఉద్యమకారుల చాలా డిమాండ్లను అంగీకరించింది. నియామక పరీక్షల విధానంలో సంస్కరణలకూ ఓకే చెప్పా. బీజేపీ ఒక పరాన్నజీవి. స్వప్రయోజనాల కోసం పరీక్షార్థులను వాడుకోవాలని చూస్తోంది. బీజేపీ విషయంలో ఉద్యమకారులు జాగ్రత్తగా ఉండాలి’’అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేస్తూ నినాదాల హోరు పెంచారు. దీంతో షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే సభను స్పీకర్ నిరవధికంగా వాయిదావేశారు. రాంచీలో విద్యార్థుల మౌన ప్రదర్శననియామక పరీక్షల్లో అక్రమాలను ఎత్తిచూపుతూ జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ సంస్కరణ ల మంచ్ విద్యార్థులు, పరీక్షార్థులు మంగళవారం సాయంత్రం రాంచీలో మౌన ప్రదర్శన చేశారు. నిరాహార దీక్ష జరుగుతున్న జైపాల్‌సింగ్ స్టేడియం నుంచి ఆల్బర్ట్ ఎక్కా చౌక వరకు వందలాది మంది విద్యార్థులు మౌన ప్రదర్శనగా వెళ్లారు. ఉద్యమం, నిరాహార దీక్షలు మొదలై 17 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ మౌన ప్రదర్శన చేపట్టారు. జూలై 25వ తేదీన విద్యార్థుల ఉద్యమం ఆరంభమైన విషయం విదితమే. ఆరుగురు ఉద్యమనేతలు నిరాహార దీక్షకు కూర్చోగా వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రుల్లో చేరి్పంచారు. -
ఆగని వాయిదాల పర్వం!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దాదాపు నినాదాల హోరులో కొట్టుకుపోయాయి. ఇప్పటిదాకా లోక్‌సభలో 11 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం మినహా ఇతర కార్యక్రమాలేవీ సజావుగాసాగలేదు. రాజ్యసభలోనూ మంగళవారం ఇవే దృశ్యాలు పునరావృతమయ్యాయి. విద్యార్థులపై పోలీసుల దాడి అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని ప్రభుత్వం పేర్కొన్నా, పెల్లెట్ గన్స్ వినియోగంపై ఆదేశాలు ఎవరిచ్చారో స్పష్టంచేయాలని, ఇతర డిమాండ్లపై చర్చ జరగాలన్న విపక్షాల పట్టుదలతో పెద్దగా ఎలాంటి సభాకార్యకలాపాలు జరగకుండానే లోక్‌సభ బుధవారానికి వాయిదాపడింది. చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న స్పీకర్.. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. అమిత్‌షా సభకు రావాలంటూ నినాదాలతో సభను అడ్డుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టేందుకు అత్యంత ముఖ్యమైనదని స్పీకర్ ఓంబిర్లా అన్నారు. ‘‘సభ సవ్యంగా సాగకపోవడంతో నేనెంతో ఆవేదనకు గురవుతున్నా.సభలో ప్లకార్డులు ప్రదర్శించే సంస్కృతికి విపక్షసభ్యులు ఇకనైనా ముగింపు పలకాలి’’అని అన్నారు. అయినాసరే సభలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించడంపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. సభ్యులు నినాదాలు, నిరసనలకంటే చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇరుపక్షాలు దీనిపై ఓ అవగాహనకు రావాలని కోరారు. అయినప్పటికీ అంతరాయాలు కొనసాగడంతో లోక్‌సభను వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా విపక్షాల నిరసనలు కొనసాగడంతో సభాధ్యక్షుడు సభను బుధవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ వాగ్వాదం.. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల ప్రారంభంలోనే సభ్యుల నిరసనలతో కొంతసేపు గందరగోళం నెలకొంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించేందుకు అనుమతి లేదని చైర్మన్ స్పష్టం చేశారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చొని సభా కార్యక్రమాలను కొనసాగించేందుకు సహకరించాలని సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్నుద్దేశించి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.హోంమంత్రి ఒత్తిళ్లతో చైర్మన్ పనిచేస్తున్నారని అన్నారు. దీంతో చైర్మన్ స్పందించారు. ‘‘నాపై ఎవరి ఒత్తిడి లేదు. అందుకే ఎల్లప్పుడూ సభా మర్యాదలు, సభ్యుల బాధ్యతాయుతమైన వ్యవహారానికే ప్రాధాన్యం ఇస్తా’అని అన్నారు. ఈ సమయంలోనూ విపక్ష ఎంపీలు మరింత బిగ్గరగా నినాదాలు చేయడంతో మొదట మధ్యాహ్నం 12 గంటలకు తర్వాత 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ వివిధ బిల్లులపై చర్చను కొనసాగించింది. పోటాపోటీ ప్రదర్శనలు.. ఇరుసభల్లో వాదించుకునే అధికార, విపక్ష కూటమి సభ్యులు వర్షాకాల సమావేశాల్లో తొలిసారిగా పార్లమెంట్ ప్రాంగణంలో పోటాపోటీ నిరసన ప్రదర్శనలతో బల ప్రదర్శనకు దిగారు. మకర ద్వారం ప్రాంతం ఇందుకు వేదికైంది. నీట్ లీకేజీ, అయోధ్య రామాలయంలో చందా చోరీ, జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనలను ప్రస్తావిస్తూ విపక్షాల ‘ఇండియా’కూటమి పార్టీల ఎంపీలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వీళ్లకు పోటీగా ఎన్డీఏ ఎంపీలు నిరసన ప్రదర్శన చేశారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ హయాంలో రాంచీలో పరీక్షార్థులపై లాఠీచార్జ్ చేశారని, ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనంవహిస్తున్నారంటూ అధికార కూటమి ఎంపీలు నిలదీశారు. సోరెన్ సర్కార్ వైఖరిని తప్పుబడుతూ నిరసన ప్రదర్శన చేశారు. జార్ఖండ్ ఘటనపై రాహుల్ గాం«దీ, ప్రియాంకా గాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ముకేశ్ దలాల్ వద్దకు ప్రియాంకా గాంధీ వెళ్లి మాట్లాడే ప్రయత్నంచేశారు. జార్ఖండ్‌లో విద్యార్థులను రాహుల్ గాంధీ కలిశారని ప్రియాంక చెప్పగా, ముకేశ్ దలాల్ మాత్రం ‘రాహుల్ గాంధీ జార్ఖండ్‌కు ఎప్పుడు వెళ్తారు?’అంటూ ప్రశ్నించారు. రాహుల్ ఇప్పటికే జార్ఖండ్ విద్యార్థులను కలిశారని ప్రియాంక స్పష్టంచేశారు. రాంచీలో విద్యార్థులను దారుణంగా కొట్టారని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రశ్నలు సంధిస్తూ నిరసనకు దిగారు. జార్ఖండ్ ఘటనతో పాటు పలు అంశాలపై కేంద్రం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని కూడా కొందరు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. రామమందిరం విరాళాలకు సంబంధించిన అంశాలను సైతం వారు ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరుపక్షాల ఎంపీల మధ్య తోపులాట వంటి ఘటనలు జరక్కుండా భద్రతాబలగాలు మధ్యలో నిలబడ్డాయి. -
పార్లమెంటులో బిజేపీ వ్యూహమేంటి?
-
భాష ముఖ్యం బిగిలూ!
తమిళనాడులో భాషా రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. మంత్రి తమిళ ఉచ్చారణ, వ్యాకరణంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగా.. బీజేపీ కూడా రంగంలోకి దిగి తమిళ భాషను గౌరవించాలని డిమాండ్ చేసింది. దీంతో ‘భాషా ప్రేమ’ వర్సెస్ ‘వ్యక్తిగత శైలి’ అనే చర్చ మొదలైంది.ఆగస్టు 5న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ తమిళంలో ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగంలో పలుచోట్ల వ్యాకరణ, ఉచ్చారణ లోపాలు కనిపించాయని డీఎంకే ఎమ్మెల్యే టీ.ఎం. రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడాలి” అని తాజాగా జరిగిన చర్చలో ఆయన సూచించారు. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ వంటి కీలక ప్రసంగం చేస్తున్నప్పుడు భాషపై మరింత శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.‘నా తమిళం.. నా స్టైల్’డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి మేరీ విల్సన్ తీవ్రంగా స్పందించారు. తన మాట్లాడే విధానాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు. “నా తమిళం గురించి నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా ప్రత్యేక శైలి. నేను ఇలాగే మాట్లాడగలను. అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇదే నా శైలి. మీ కోసం నేను మార్చుకోలేను” అంటూ మంత్రి ఘాటుగా బదులిచ్చారు.వివాదం పెరగడంతో అసెంబ్లీ స్పీకర్ జోక్యం చేసుకుని సభ్యులు ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు అర్థం చేసుకునేలా మంత్రి ప్రసంగించారని, భాషపై చర్చను సానుకూలంగా చూడాలని కోరారు.మతం ప్రస్తావనతో మరింత వేడితనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ మంత్రి విల్సన్ తన మత విశ్వాసాలను ప్రస్తావించారు. “క్రైస్తవం నాకు ప్రేమ, సానుభూతి అనే ఒకే భాషను నేర్పింది. నేను బైబిల్ నుంచి దాన్ని నేర్చుకున్నాను. నేను పుట్టుకతో క్రైస్తవుడిని” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. భాషా వివాదంలోకి మత ప్రస్తావన రావడంపై పలువురు స్పందించారు.‘తప్పులను అంగీకరించాలి’: డీఎంకేడీఎంకే సీనియర్ నేత టీ.కే.ఎస్. ఇళంగోవన్ మంత్రి తీరుపై విమర్శలు చేశారు. “బడ్జెట్ చదివే సమయంలో అనేక చోట్ల తమిళంలో తప్పులు జరిగాయి. దాన్ని అంగీకరించకుండా సమర్థించుకోవడం సరికాదు. ఆర్థిక మంత్రి భాషను సరిగ్గా చదవగలగాలి” అని అన్నారు.తమిళంను అవమానించొద్దు: బీజేపీఈ వివాదంలో బీజేపీ కూడా జోక్యం చేసుకుంది. తమిళ భాషను తక్కువ చేసి మాట్లాడే వ్యాఖ్యలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. “మతం ఏదైనా కావచ్చు. కానీ భావోద్వేగం, గుర్తింపు పరంగా మనమంతా తమిళులమే. మీ మతాన్ని గౌరవించడంలో తప్పులేదు. కానీ తమిళ భాషను కించపరిచే వ్యాఖ్యలను అంగీకరించలేం. మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.విజయ్ సూచనతమిళ భాషపై రేగిన వివాదంపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రి విల్సన్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. “తమిళం మన అస్తిత్వం.. దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. భాష విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి” అంటూ సూచించినట్లు సమాచారం.భాషా గౌరవమా? వ్యక్తిగత స్వేచ్ఛా?ఈ వివాదం ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. ఒక వర్గం “తమిళం ప్రపంచంలోని పురాతన భాషల్లో ఒకటి.. దాన్ని సరిగ్గా మాట్లాడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అంటుండగా.. మరోవర్గం “భాషలో చిన్న తప్పుల కంటే ప్రజలకు అర్థమయ్యేలా పాలన అందించడం ముఖ్యం” అని వాదిస్తోంది. -
చంద్రబాబు కాకి లెక్కలు.. ఆ భయంతోనేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణాంకాలు చెప్పడంలో ఘనాపాటి అని ఒప్పుకోవాలి. కొందరు వాటిని కాకి లెక్కలు అనవచ్చు. మరికొందరు భలే లెక్కలు అనవచ్చు. కాని వాటిని విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఏపీ ప్రజలు వాటిని ఎంతవరకు నమ్ముతారో తెలియదు. ఆయన మాత్రం ఏకధాటిగా మూడు గంటలపాటు ప్రజెంటేషన్ ఇచ్చి ఏదో జరిగిపోతోందన్న భ్రమ కల్పించడానికి యత్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో ఇచ్చిన ప్రజెంటేషన్ రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి ఏపీ ఆర్థికంగా ఇబ్బందులలో ఉందన్న భయం. మరోపక్క లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రాంతి.. ఈ రెండు విషయాలు ఆయనే చెప్పగలరు. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ప్రజలకు బాండ్ పత్రాలు ఇచ్చారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తం లబ్ధి చేకూరుతుందో తెలిపారు. వీరిద్దరూ త్రికరణ శుద్దిగా ప్రమాణం చేసి బాండ్లు ఇస్తున్నామని అన్నారు. బాగానే ఉంది. త్రికరణ శుద్ది ఉంటే ఏమి చేసి ఉండాలి. నిజంగానే ఆయా కుటుంబాలకు ఈ రెండేళ్లలో ఎంతెంత ఇచ్చింది మళ్లీ లెక్కలు ఇవ్వాలి కదా! ఆ పని చేయకుండా ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నామని, అప్పులు చేసి సంక్షేమ స్కీములు అమలు చేస్తున్నామని చంద్రబాబు చెబుతున్నారు.గతంలో అప్పులు చేసేవారికి సంక్షేమ స్కీములు అమలు చేసే అర్హత ఉందా అని ఆయనే ప్రశ్నించేవారు. డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ గ్రోత్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియా ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది. సీమాంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్దే లక్ష్యమని ఆయన చెప్పారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇచ్చిన లెక్కలు చూస్తే మతి పోవల్సిందే. ఈ మూడు ప్రాంతాలలో కలిపి ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల ద్వారా సుమారు 46 లక్షల ఉద్యోగాలు వస్తాయట. అందులో 2032 లోపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందట. బహుశా 1956 నుంచి ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయో, లేదో తెలియదు. కాని విభజిత ఏపీలో మాత్రం అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబితే నమ్మగలమా? 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని ప్రచారం చేశారు. శ్వేతపత్రంలో వాటిని డబుల్ చేసేశారన్నమాట.ఒకవైపు ప్రపంచం అంతటా సంక్షోభం, ఎల్‌నినోలో ప్రభావం వంటివాటితో ఉపాధి సమస్యలు వస్తుంటే ఏపీలో మాత్రం ఈ రకంగా లక్షల ఉద్యోగాలు వస్తాయంటున్నారు. నిజంగా అలా చేయగలిగితే గొప్పపేరే వస్తుంది. దానిని అంతా స్వాగతిస్తారు. కాని కేవలం ప్రజలను మభ్య పెట్టేరీతిలో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం చేస్తే మాత్రం ఏపీకి తీరని అన్యాయం చేసినట్లవుతుందని గ్రహించాలి. చంద్రబాబు చెబుతున్నదాని ప్రకారం అమరావతి ఆర్థిక రీజియన్‌ను టెక్నాలజీ, పరిశ్రమలు మౌలిక వసతులు, ఇంధనం విభిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దుతారట. ఇక్కడ మొత్తం 6-8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రాథమిక అంచనా అట. వీటి ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చెబుతున్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో 49 ప్రాజెక్టులతో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయట. ఈ పెట్టుబడుల ద్వారా 24 లక్షల మందికి ఉపాధి లబ్ధిస్తుందని ఆయన అంటున్నారు. 2032 నాటికి పది లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందట. ఇక తిరుపతి ఆర్థిక రీజియన్‌లో 11-12 లక్షల కోట్ల పెట్టటుబడులు ఆకర్షించడం ద్వారా 2032 నాటికి పది లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం అని ఆయన తెలిపారు. ఏపీ ఆదాయంలో 40 శాతం రాయలసీమ నుంచే వచ్చేలా తయారు చేస్తారట. లక్ష కోట్లతో ఉద్యానవన హబ్‌ను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. ఒక పక్క మామిడి రైతులు తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో చీని తోటలు ఎండిపోతున్నాయని, టాంకర్లు తెచ్చి నీరు పెట్టుకోవల్సి వస్తోందని ఈ మధ్య ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. మరో వైపు చంద్రబాబు మాత్రం లక్ష కోట్ల ఉద్యానవన హబ్ అని ఊదరగొడుతున్నారు. ఇందులో కేంద్రం నలభైవేల కోట్లు ఇవ్వాలట. ఇవన్ని ఎప్పటికి జరిగేనో ఎవరు చెప్పగలరు? మరో విషయం ఏమిటంటే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రెండున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే విశాఖ, తిరుపతి రీజియన్లకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎంత పెట్టుబడి పెడతారన్నది క్లారిటీ లేదు కాని, అమరావతిలో నిర్మాణాలు, మౌలిక వసతులకోసం ఇంతవరకు 40887 కోట్ల మొత్తాన్ని సమీకరించామని ఆయన తెలిపారు. ఇటీవల ఏపీలో ఒక అసంతృప్తి ఏర్పడింది. ప్రభుత్వం వేల కోట్ల అప్పు చేసి మొత్తం అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తోందని మిగిలిన ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా విశాఖ, తిరుపతి రీజియన్లలో పెట్టుబడులు రాబోతున్నాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని నమ్మబలకాలని ఆశిస్తున్నట్లుగా ఉంది. ఇవన్ని చదువుతుంటే ఒకప్పుడు చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా 2002 ప్రాంతంలో విజన్ 2020 అంటూ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. అందులో కూడా ఏవేవో లెక్కలు రాస్తే అంతా చూసి నవ్వుకున్నారు. తదుపరి టీడీపీ 2004 ఎన్నికలలో ఓటమిపాలైంది. తిరిగి 2014లో విభజిత ఏపీలో టీడీపీ మళ్లీ పవర్లోకి వచ్చింది. ఆ టరమ్‌లో ఒక్కసారి కూడా విజన్ 2020 ఊసు ఎత్తినట్లు కనిపించలేదు. అప్పట్లో స్వర్ణాంధ్ర, 2029నాటికి దేశంలోనే నెంబర్ ఒన్ అంటూ కొత్త నినాదాలతో కాలం గడిచిపోయింది. 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. తిరిగి ఈ టరమ్‌లో 2047 విజన్‌తో పాటు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అని కొత్త పదాలు అందుకున్నారు. అంటే ఒక్కో టరమ్‌లో ఒక్కో నినాదంతో కథ నడిపేయడం, ప్రజలు వాటిని వినీ.. విని విసుగుచెంది ఓడించడం జరుగుతోందని అనుకోవాలా? మరి వచ్చే ఎన్నికలలో ఏమవుతుందో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రోడ్లపై ‘జాంబీలు?’.. హర్బజన్ సింగ్ వీడియోతో పెను దుమారం!
చండీగఢ్: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో పంజాబ్‌లో కొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. మత్తులో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల వీడియోను చూపిస్తూ.. పంజాబ్‌లో ‘జాంబీ డ్రగ్’ సంక్షోభం తీవ్రంగా ఉందంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ఆ వీడియో పంజాబ్‌కు చెందింది కాదని, రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో చిత్రీకరించిందని ఆప్ స్పష్టం చేయడంతో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఈ వీడియోను షేర్ చేశారు. పంజాబ్‌లో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర యువతకు ఇంతకంటే మెరుగైన భవిష్యత్తు కావాలని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ సమస్యపై నిజాయితీ, జవాబుదారీతనం, తక్షణ చర్యలు అవసరమని పేర్కొన్నారు. దీంతో ఈ వీడియోను పంజాబ్‌లో డ్రగ్స్ సమస్యపై ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ రాజకీయ అస్త్రంగా ఉపయోగించిందనే చర్చ మొదలైంది.హర్భజన్ సింగ్‌పై మంత్రి బాల్జీత్ కౌర్ ఫైర్బీజేపీ ఎంపీ హర్భజన్ సింగ్ వ్యాఖ్యలకు పంజాబ్ కేబినెట్ మంత్రి డాక్టర్ బాల్జీత్ కౌర్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. హర్భజన్ సింగ్ రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన వీడియోను పంజాబ్ ఘటనగా చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. బీజేపీ రాజకీయ పెద్దలను సంతృప్తిపరచేందుకే హర్భజన్ సింగ్ ఇలా చేస్తున్నారని ఆరోపిస్తూ.. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.అసలు వీడియోలో ఏముంది?వైరల్ అవుతున్న క్లిప్‌లో తలపాగాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపక్కన కనిపిస్తారు. వారు సరిగ్గా నిలబడలేకపోవడం, తడబడుతూ నడవడం, అయోమయంగా ప్రవర్తించడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో వారు మత్తు పదార్థాల వల్లే ఇలా విచిత్రంగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే వీడియోను ‘జాంబీ డ్రగ్’కు లింక్ చేస్తూ పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఆ వ్యక్తులు ఏదైనా మాదకద్రవ్యాన్ని తీసుకున్నారనే దానికి స్వతంత్రంగా ధ్రువీకరణ లేదు. అంతేకాదు.. ఈ ఘటన పంజాబ్‌లో కాకుండా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో చోటుచేసుకున్నట్లు సమాచారం.డ్రగ్స్ అంశమే రాజకీయ అస్త్రంగా..ఈ వీడియోతో మరోసారి పంజాబ్‌లో డ్రగ్స్ సమస్య రాజకీయ చర్చకు వచ్చింది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.మొత్తంగా.. రోడ్డుపక్కన ఇద్దరు వ్యక్తులు కనిపించిన ఓ వీడియోతో మొదలైన వ్యవహారం ఇప్పుడు పంజాబ్‌లో బీజేపీ-ఆప్ మధ్య మరో రాజకీయ పోరుగా మారింది. ఒకవైపు బీజేపీ దీన్ని రాష్ట్రంలోని డ్రగ్స్ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉపయోగిస్తుండగా.. మరోవైపు ఆప్ మాత్రం వీడియో మూలాన్ని ప్రశ్నిస్తూ బీజేపీపై ఎదురుదాడికి దిగుతోంది. Another case of "Zombie" drug. Video is from Sri ganganagar. pic.twitter.com/A39eRtGdbQ— DesiEsco🇮🇳 (@DesiEsco7) August 9, 2026 -
ఆగస్టు 15 తర్వాత ఉద్యమ కార్యాచరణ తీవ్రం
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 15 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులు, హామీల అమల్లో వెనుకడుగు, ఫీజు బకాయిలు తదితరాలపై ఉద్యమ కార్యాచరణ తీవ్రం చేయనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, విధానాలపై త్వరలోనే పాదయాత్ర, బస్సుయాత్ర ఇతర రూపాల్లో చేపట్టబోయే పోరుబాటపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈనెల 15 తర్వాత ‘క్యూర్’పై నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు వర్క్‌షాప్ నిర్వహిస్తామని చెప్పారు. క్యూర్లో పన్నుల విధానం, కార్పొరేటర్ల పాత్ర, పట్టణ ప్రణాళిక, నీరు–మురుగునీటి వ్యవస్థలను వేరు చేయడం వల్ల ఎదురయ్యే సమస్యలు, పన్నుల భారం వంటి ముఖ్యమైన విషయాలపై స్పష్టత కొరవడిందన్నారు.సోమవారం బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో రాంచందర్‌రావు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ’హిట్లర్, హిల్ట్, హైడ్రా’(త్రీహెచ్)తో రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయిందన్నారు. హైడ్రా సెలక్టివ్‌గా అక్రమ కట్టడాలను ధ్వంసం చేస్తోందని, ఎంఐఎంకు సంబంధించిన వాటి విషయంలో చర్యలేవీ తీసుకోవడం లేదని ఆరోపించారు. ‘రేవంత్ వరుణయాగం చేస్తే.. మేము వారు కొట్టుకుపోవాలని వాయుయాగం చేస్తాం’అని నవ్వుతూ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలు, పాలనా వైఫల్యాలతోనే అధికారులు కోర్టుల వద్ద పదే పదే మొట్టికాయలు తినాల్సి వస్తోందన్నారు. పరిపాలనా వ్యవస్థ దెబ్బతిన్నప్పుడే న్యాయవ్యవస్థ అడుగుపెడుతుందనే నానుడిని నిజం చేస్తూ ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఈ నెల 14న హైదరాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు తిరంగా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ నేతల సయోధ్య పూర్తయిందా అన్న ఓ విలేకరి ప్రశ్నకు ‘అది అయ్యింది.సర్జరీ తర్వాత పోస్ట్ ఆపరేషన్ కేర్ పూర్తయి లంచ్‌లు, డిన్నర్లు కూడా అయ్యాయి’అని నవ్వుతూ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి కొందరు జనసేనలో చేరుతున్నారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా ‘సినిమా పిచ్చి ఉన్నవారు కొంతమంది జనసేనలో పోతున్నారు. వెళ్లిన వారిని అడిగితే నేను పవన్ ఫ్యాన్ అని అంటున్నారు. గతంలో ఎందుకు వెళ్లలేదు అని అడిగితే అప్పుడు జనసేన తెలంగాణలో లేదు కాబట్టి వెళ్లలేదు అని అన్నారు. వెళ్లే వారిని అడ్డుకోలేం కదా’అని రాంచందర్‌రావు బదులిచ్చారు. -
రెబల్స్‌లో రెబల్స్.. బీజేపీతో బంధంపై చీలిక!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే అనామక పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాళ్లు ఎన్డీయే కూటమికి బయటి నుంచి మద్దతు ప్రకటించడం.. తాజాగా జరిగిన ఎన్డీయే ఎంపీల మీటింగ్‌లో ప్రధాని మోదీతో వాళ్లు భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే.. బీజేపీతో సాన్నిహిత్యంపై ఆ వర్గంలోనూ కొందరు అసంతృప్తితో తిరుగుబాటు బాట పట్టినట్లు తెలుస్తోంది. తమ వర్గం ఓట్ల నేపథ్యం కారణంగా.. బీజేపీతో కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని వాళ్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీలు అబూ తాహెర్ ఖాన్, ఖలీలుర్ రెహ్మాన్, యూసుఫ్ పఠాన్(మాజీ క్రికెటర్)లు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో సన్నిహిత సంబంధాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ముగ్గురు ఇటీవల ఎన్డీఏ ఎంపీల సమావేశానికి దూరంగా ఉండడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.‘బీజేపీతో వెళ్లం’.. ఎంపీల స్పష్టీకరణబీజేపీతో పొత్తు తమ రాజకీయ భవిష్యత్‌కు నష్టం కలిగిస్తుందని ఈ ఎంపీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో తమ సంప్రదాయ ఓటర్లకు దూరమవుతామనే భయం వారిలో ఉన్నట్లు సమాచారం. ‘‘మేము బీజేపీతో కలిసి వెళ్లబోమని ఇప్పటికే స్పష్టం చేశాం. ఎన్డీయేలో భాగస్వాములం కాబోం’’ అని ఎంపీ అబూ తాహెర్ ఖాన్ ప్రకటించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజా ప్రయోజనాల కోసం సహకరిస్తామని మాత్రం ఆయన తెలిపారు.అదంతా డ్రామా?: మమత వర్గం ఫైర్ఎన్సీపీఐలో కొనసాగుతున్న ఈ పరిణామాలపై మమతా బెనర్జీ వర్గం తీవ్రంగా స్పందించింది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తిరుగుబాటు ఎంపీలపై విమర్శలు గుప్పించారు. ‘‘వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్సీపీఐ అనేది ఎన్డీయేకు మిత్రపక్షమని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆరోపించారు.మరో తృణమూల్ నేత కునాల్ ఘోష్ కూడా విమర్శలు చేశారు. ‘‘బీజేపీకి బీ టీమ్‌గా మారిన వారు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు గెలిచింది మమతా బెనర్జీ పేరుతో, వ్యతిరేక ఓట్లతో’’ అని వ్యాఖ్యానించారు.ఢిల్లీలో మోదీ, షాతో భేటీలు.. మరోవైపు దూరంఆశ్చర్యకరంగా, బీజేపీతో దూరంగా ఉంటామని చెబుతున్న ఈ ముగ్గురు ఎంపీలు ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రధాని నివాసంలో జరిగిన అల్పాహార భేటీకి కూడా హాజరయ్యారు. అయితే ఎన్డీఏ ఎంపీల ‘మంగళ్ మిలన్’ సమావేశానికి మాత్రం గైర్హాజరయ్యారు. తిరిగి సొంత గూటికే?తిరుగుబాటు ఎంపీల్లో కొందరు తిరిగి మమతా బెనర్జీ వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నారని తృణమూల్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్సీపీఐ నేతలు మాత్రం పార్టీలో ఎలాంటి చీలిక లేదని, అభివృద్ధి అంశాలపై మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు.మొత్తానికి.. తృణమూల్ నుంచి వలసలతో బలపడిన ఎన్సీపీఐలోనే ఇప్పుడు అసంతృప్తి స్వరాలు వినిపించడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. బీజేపీతో సంబంధాలే ఈ సంక్షోభానికి కారణమా? లేదంటే ఎంపీల రాజకీయ పునరాలోచనా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
బీజేపీకి సంతోషం కలిగించే మాటలొద్దు!
కాంగ్రెస్‌లో జెన్‌జీ రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. పార్టీ లైన్‌ను దాటి కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆయన పేరును ప్రస్తావించకుండా వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని సంతోష పెట్టేలా మాట్లాడడం మానుకుంటే మంచిదంటూ సూచనలు చేసింది. రాహుల్ గాంధీ చేపట్టిన ‘యువత కార్యక్రమం’ కంటే.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలు జెన్‌జీ యువతను ఎక్కువగా ఆకర్షించాయని థరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించింది. కేరళ కాంగ్రెస్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ నేతల వ్యాఖ్యలు బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడేలా ఉండకూడదని పరోక్షంగా హెచ్చరించారు.థరూర్ వ్యాఖ్యలపై స్పందించిన వేణుగోపాల్.. ఆ వ్యాఖ్యలను తాను పూర్తిగా వినలేదని, మీడియా కథనాల ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. “కాంగ్రెస్ నేతలు పార్టీ విధానాలకు ఎప్పుడూ కట్టుబడి ఉండకపోయినా.. బీజేపీని సంతోషపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు వస్తే బీజేపీకి అది రాజకీయంగా లాభిస్తుందని వ్యాఖ్యానించారు. అయితే థరూర్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారని తాను భావించడం లేదని స్పష్టం చేశారు.జెన్‌జీపై రాహుల్ ప్రచారాన్ని సమర్థించిన కాంగ్రెస్ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన యువత కార్యక్రమాలను వేణుగోపాల్ గట్టిగా సమర్థించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమానికి వచ్చిన వారు సాధారణ కాంగ్రెస్ కార్యకర్తలు కాదని.. నిజమైన జెన్‌జీ యువతేనని పేర్కొన్నారు. కోటా, డెహ్రాడూన్‌లలోనూ ఇదే తరహా స్పందన వచ్చిందని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై రాహుల్ నిరంతరం పోరాడుతున్నారని అన్నారు.అసలు థరూర్ ఏమన్నారు?మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో శశిథరూర్.. రాహుల్ గాంధీ “ఛాత్రోంకీ గూంజ్” కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ కార్యక్రమం లేవనెత్తిన అంశాలే CJP నిరసనల్లోనూ ఉన్నాయని.. అయితే జంతర్ మంతర్ వద్ద జరిగిన CJP ఆందోళన స్థాయిలో కాంగ్రెస్ కార్యక్రమం ఎందుకు ప్రభావం చూపలేకపోయిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. “మనం యువత గొంతు విన్నామా? జెన్‌జీ నాడిని పట్టుకోగలిగామా?” అంటూ థరూర్ ప్రశ్నించారు.అయితే తన వ్యాఖ్యలు పార్టీపైనో, లేదంటే రాహుల్ గాంధీపై దాడి కాదని తర్వాత ఆయన వివరణ ఇచ్చారు. యువతకు రాజకీయాల్లో మరింత భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరాన్ని మాత్రమే చెప్పానని తెలిపారు.సీజేపీ ప్రభావంపై రాజకీయ చర్చనీట్ పరీక్ష అంశాలు, విద్యార్థుల సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అదే సమయంలో యువత సమస్యలను రాజకీయ పార్టీలు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాయన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అంతర్గత చర్చకు దారితీయగా.. వేణుగోపాల్ స్పందనతో పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ యువత కార్యక్రమాలకు పూర్తి మద్దతుగా నిలిచినట్లు స్పష్టమైంది. -
మమతకు నిరసన సెగ
కోల్‌కతా: టీఎంసీ చీఫ్, బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హాలిసహార్కు వెళ్తుండగా ఊహించని రీతిలో నిరసన వ్యక్తమైంది. మమత వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి ‘దొంగ, దొంగల రాణి’అంటూ నినాదాలు చేశారు. ఆమె కారుపైకి బురద, చెప్పులు, రాళ్లను విసిరారు. పోలీసులు లాఠీలు ఝళిపించి, నిరసనకారులను చెదరగొట్టారు. అనంతరం పోలీసు బందోబస్తు నడుమ ఆమె ప్రయాణం తిరిగి కొనసాగించారు.అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. ‘నా కారుపై దాడి జరిగింది. ఇదంతా బీజేపీ కుట్రే. పోలీసుల కళ్లెదుటే బీజేపీ గూండాలు రాళ్లు, ఇటుకలు, చెప్పులు, బురద, నీళ్ల బాటిళ్లు విసిరారు. కారు డోర్లు మూసి ఉండకపోతే నా తల పగిలిపోయి ఉండేది. నేను చచ్చిపోయేదాన్ని. పోలీసులకు నా పర్యటన గురించిన సమాచారం ముందుగానే అందజేశా. అయినప్పటికీ, వారు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. బీజేపీ ప్రభుత్వం గూండాలతో నన్ను లక్ష్యంగా చేసుకుంది’అంటూ ఆమె మండిపడ్డారు. ఇంత తీవ్ర స్థాయి నిరసను మునుపెన్నడూ తాను ఎదుర్కోలేదన్నారు.పోలీసులపై తనకు ఎలాంటి కోపం లేదన్న ఆమె..ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగిందని ఆరోపించారు. ‘పోలీసులు రౌడీ మూకలకు రక్షణ కల్పిస్తున్నారు. బెంగాల్ అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తమ పార్టీ చట్టపరంగా పోరాటం చేస్తుందన్నారు. అయితే, రాష్ట్రంలో ఉద్రిక్తతలను తిరిగి రాజేసేందుకే మమత బయటకు వచ్చారని బీజేపీ విమర్శించింది. స్థానికులే ఆమె రాకపై నిరసన తెలిపారని, తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. -
పంజాబ్ ఎన్నికలు: ఒంటరి పోరుకు కమలనాథులు సిద్ధం
చండీగఢ్: పంజాబ్ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది(2027) జరగనున్నాయి. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య భేటీ జరిగింది. దీనితో పంజాబ్ రాజకీయాల్లో మరోసారి చర్చలు ఊపందుకున్నాయి. కాగా పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నదని పార్టీ ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు.పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారని బీజేపీ ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు. సుఖ్బీర్ సింగ్ బాదల్, ప్రధాని మోదీల భేటీ గురించి మాట్లాడుతూ.. పంజాబ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై అకాలీదళ్ అధినేతతో ప్రధానితో చర్చించారని తెలిపారు. ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల నేతలను క్రమం తప్పకుండా కలుస్తుంటారని అన్నారు. ఈ సమావేశంలో పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, డ్రగ్స్ సమస్య, పేపర్ లీక్ తదితర కీలక అంశాలపై చర్చించారన్నారు. కాగా పంజాబ్ రైతులు ‘ఈ20’కి అనుకూలంగా ఉన్నారని బీజేపీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విషయంపై రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడాలని సూచించారు.ఇది కూడా చదవండి: క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్చల్! -
మీరు చేస్తారా.. మేము ఎంటర్ కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: ‘తెలంగాణలో పార్టీని అన్ని విధాలా ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యేలా మీరు నడుం బిగిస్తారా? లేక మొత్తం మేమే కంట్రోల్లోకి తీసుకొని నడిపించాలా ? దీనిపై త్వరగా తేల్చుకొని స్పష్టమైన రోడ్‌మ్యా ప్, కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోండి. లేనిపక్షంలో మా పద్ధతిలో పార్టీని ముందుకు నడిపిస్తాం’అని తెలంగాణ ముఖ్య నేతలకు బీజేపీ అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షం బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాల్సిందేనని, అందుకు అవసరమైన అన్నిరకాల కార్యక్రమాలను చేపట్టాలని సూచించినట్టు తెలిసింది.మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో బీఆర్ఎస్ నేతలను చేర్చుకునేందుకు వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించి అమలు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ విషయంలో ఎంపీలు ఏమాత్రం క్రియాశీలంగా వ్యవహరించకపోయినా, వెంటనే జాతీయ నాయకత్వం ఎంటరై తమ ప్రతినిధుల ద్వారా చేరికల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకొస్తుందని హెచ్చరికలు జారీచేసినట్టు సమాచారం. మరోవైపు బుధవారం నుంచి నాలుగు రోజులుగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో వరుస సమావేశాలు జరిగాయి. 3 నెలలకు ఓసారి వస్తా...పరిస్థితి సమీక్షిస్తా ప్రతీ మూడునెలలకు ఒకసారి తెలంగాణకు వచ్చి రాష్ట్రంలో పార్టీ వాస్తవ పరిస్థితి ఏమిటి..వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం రాష్ట్ర పార్టీ నేతల వ్యూహాలు, చేస్తున్న కృషిని సమీక్షిస్తానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. తెలంగాణలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన రాజకీయ కార్యాచరణపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బంyì సంజయ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, అరి్వంద్ ధర్మపురి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, గోడెం నగేశ్‌లతో నితిన్ నబీన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఇప్పటికే రాష్ట్రంలోని పార్టీ వ్యవహారాలు, ముఖ్య నేతల మధ్య నెలకొన్న వాతావరణం, సమన్వయం, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు తదితరాలపై అభయ్‌పాటిల్ జాతీయపార్టీకి సవివరమైన నివేదిక సమరి్పంచినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, వైఫల్యాలు, ప్రజల్లో వ్యతిరేకత, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మరో నివేదికను అందజేసినట్టు సమాచారం. డబుల్ ఇంజిన్ సర్కార్ దిశగా : బండి సంజయ్ రాష్టంలో పార్టీ కార్యకర్తల సమష్టి కృషితో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం దిశగా స్థిరంగా అడుగులు వేస్తోందని తాను విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. నితిన్ నబీన్‌తో సమావేశం అనంతరం ఆయన ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘ఎవరితోనూ పొత్తు లేదు’ తెలంగాణలో జనసేన పార్టీతో సహా ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు ఉండబోదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టంచేశారు. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికార సాధనే లక్ష్యంగా పార్టీ ముందు కెళుతోందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేయడమే బీజేపీకి నిజమైన రోడ్ మ్యాప్ అని నితిన్ నబీన్ స్పష్టం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కోర్ కమిటీ సభ్యులతో చర్చించి పాదయాత్రలు, బస్సు యాత్రలు వంటి ప్రజా చైతన్య కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్తామని వెల్లడించారు. సెపె్టంబర్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. -
చేనేతకు అండగా కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ ఆర్థిక వ్యవస్థతో పాటు సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం ప్రతీక అని, నేతన్నల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ అగ్రనేతలు పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో చేనేత రంగానికి ప్రోత్సాహం: కిషన్‌రెడ్డి వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ‘5ఎఫ్ విజన్’(ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్) ద్వారా ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలోని పత్తి రైతుల నుంచి మద్దతు ధర (ఎంఎస్పీ) కింద కేంద్రం రూ.69,860 కోట్లకు పైగా వెచ్చించిందని వివరించారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు వరంగల్ జిల్లాలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పీఎల్ఐ, ముద్రా పథకాలతో పాటు ఆర్టీఫిషీయల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతికతను చేనేతకు అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. భారతీయ ఆత్మకు ప్రతిరూపం చేనేత: బండి సంజయ్ చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, భారతీయ ఆత్మకు ప్రతిరూపమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’, ‘మేక్ ఇన్ ఇండియా’పిలుపుతో చేనేతను ప్రపంచ స్థాయికి మోదీ ప్రభుత్వం తీసుకెళ్తోందన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన ఉమ్మడి కరీంనగర్, సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం దేశానికే గర్వకారణమని కొనియాడారు. సబ్సిడీ నూలు, నైపుణ్య శిక్షణ, హ్యాండ్లూమ్ హ్యాకథాన్ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికుల వార్షికాదాయాన్ని రూ.5లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. దేశ ప్రగతికి సంకేతం: డాక్టర్ లక్ష్మణ్ ఖాదీ కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదని, అది దేశ స్వదేశీ స్ఫూర్తికి, ఆత్మనిర్భరతకు సంకేతమని ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ నేతన్నల జీవనోపాధికి చేయూతనందించాలని పిలుపునిచ్చారు. -
‘తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం..’
ఢిల్లీ: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే తెలంగాణలో పోటీకి దిగుతామన్నారు.ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో తెలంగాణ నేతల సమావేశం అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ‘ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తాం. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం. కీలక నేతలు మా పార్టీలో చేరేందుకు సమయం కోసం వేచి చూస్తున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలు లేవు... భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వస్తారు. ప్రజా సమస్యలపై పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. కలిసి పోరాటం చేయాలని నితిన్ నబీన్ నిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలు తర్వాత ఎంపీ , ఎమ్మెల్యేలతో కలిసి మరోసారి సమావేశం అవుతాం. రాష్ట్రంలో అధికారం రావడానికి రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. 937 మండలాలలో పార్టీని బలోపేతం చేస్తున్నాం. చాలా మంది నేతలు మా పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారు’ అని తెలిపారు. -
‘SIR’ ఎఫెక్ట్.. ఆవాస్ యోజన లబ్ధిదారులకు భారీ షాక్!
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు భారీ షాక్ తగిలింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియలో భాగంగా తమ ఓటు హక్కును కోల్పోయిన వారికి, ఇకపై ఆవాస్ యోజన వంటి సంక్షేమ పథకాల లబ్ధిని నిలిపివేయనున్నారు. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన పరిశీలనలో, ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన కనీసం 57,000 మంది పేర్లను ఆవాస్ యోజన లబ్ధిదారుల జాబితా నుండి కూడా తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దిలీప్ ఘోష్ అధికారికంగా వెల్లడించారు.రాష్ట్రంలో ఎస్ఐఆర్ నిర్వహించిన సమయంలో సుమారు 9.1 లక్షల మందిని ఓటర్ల జాబితా నుండి తొలగించారని, వారిలో 57,000 మంది ఆవాస్ యోజన లబ్ధిదారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేనందున వారందరినీ పథకానికి అనర్హులుగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర గృహనిర్మాణ పథకానికి చెందిన సుమారు 10.2 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులను బదిలీ చేయడంతో పాటు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. పథకం ద్వారా నిధులు పొందిన మొత్తం 30 లక్షల మంది లబ్ధిదారులలో, సుమారు 12,500 మంది అనర్హులుగా తేలారు. వారు అక్రమంగా నిధులు పొందినట్లు గుర్తించి చర్యలు చేపట్టాము. దీనిపై మరింత విచారణ జరుగుతోంది. ఇప్పటికే సుమారు 1,000 మంది అక్రమ లబ్ధిదారుల నుండి నిధులను తిరిగి వసూలు చేసే ప్రక్రియను ప్రారంభించాము" అని తెలిపారు.గతంలో బంధుప్రీతి, ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద పశ్చిమబెంగాల్‌కు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం 2024లో సొంత నిధులతో ‘బంగ్లార్ బారి’ అనే పథకాన్ని ప్రారంభించింది.అయితే, ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనర్హులైన వారి పేర్లను తొలగించేందుకు ప్రత్యేక సర్వేను నిర్వహించింది. ఇందులో భాగంగానే గురువారం నాడు 10,20,370 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.60వేల చొప్పున రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మిగిలిన లబ్ధిదారుల వివరాల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో, ఈ పథకం పేరును ‘బంగ్లార్ బారి’ నుండి ‘పశ్చిమ బంగా ఆవాస్ యోజన’గా మారుస్తూ ముఖ్యమంత్రి సువేందు అధికారి నిర్ణయం తీసుకున్నారు -
తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలుపునిచ్చింది. రేపు తెల్లవారు జామున హుటాహుటిన ఢిల్లీకి రాంచందర్ సహా ప్రజా ప్రతినిధులు బయలుదేరనున్నారు. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీలు.. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు.రేపు(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు టీబీజేపీ నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక భేటీ కానున్నారు. ఇవాళ నితిన్ నబీన్‌ను కలిసిన పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ అభయ్ పాటిల్ నివేదిక ఇచ్చారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, నేతల మధ్య సమన్వయం, ఇటీవల హైకమాండ్ ఆదేశాల అమలు సహా కీలక అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది. -
3 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా మూడు జిల్లాలకు అధ్యక్షులను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు నియమించారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా యు.రమేశ్, మేడ్చల్ మల్కాజిగిరి (అర్బన్) అధ్యక్షుడిగా డి.గిరివర్ధన్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సాయి మల్లేశం నియమితులయ్యారు. బుధవారం ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఎన్.గౌతంరావు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పార్టీపరంగా సంస్థాగత జిల్లాలు 38 కాగా...గతంలోనే 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. అయితే తనను సంప్రదించకుండానే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖరరెడ్డిని నియమించడాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యతిరేకించారు. దీంతో కొన్ని రోజులకు ఆ జిల్లా అధ్యక్షుడిని తప్పించారు. అదేవిధంగా సుదీర్ఘకాలంపాటు కేంద్రమంత్రి బండి సంజయ్–మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ల మధ్య వైషమ్యాలు కొనసాగడంతో వారికి సంబంధించిన రెండుజిల్లాల్లో అధ్యక్షుల నియా మకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వ చ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నివాసంలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సమక్షంలో సంజయ్–రాజేందర్ల మధ్య సయోధ్య కుదిరింది. తాజాగా బుధవారం ఢిల్లీలో లక్ష్మణ్‌తో సంజయ్, రాజేందర్, విశ్వేశ్వర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ మూడుజిల్లాల అధ్యక్షుల నియామకం విషయంలో ఏకాభిప్రాయం కుదరడంతో ఈ మేరకు ప్రకటన వెలువడినట్టుగా పార్టీ వర్గాల సమాచారం. -
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్తు తరాలు క్షమించవు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం దురదృష్టకరమని, బాధ్యత గల నాయకులు యువతకు ఆదర్శంగా నిలవాలని, కానీ రాహుల్ గాంధీ ఆ దిశగా వ్యవహరించడం లేదని అన్నారు.పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం బాధ్యత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనుకేసుకురావడం సరికాదని, రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఇదే విధంగా దూషిస్తే ఆయన అదే విధంగా స్పందిస్తారా అని ప్రశ్నించారు.అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై, తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు వచ్చినప్పటికీ ఆయన హుందాగా స్పందించారని, చిన్నారులు తప్పులు చేయడం సహజమని, వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదేనని మోదీ సూచించారు. ఆయన స్పందనలో క్షమాగుణం, బాధ్యత మాత్రమే కనిపించగా, విద్యార్థిని స్వచ్ఛందంగా క్షమాపణ చెప్పడం భారతీయ సంస్కృతి, విలువలకు నిదర్శనమని మంత్రి అన్నారు.అలాగే, భారతీయ సంప్రదాయాలు పెద్దలను గౌరవించడం, తప్పు చేసిన వారిని క్షమించి సరైన మార్గంలో నడిపించడం వంటి విలువలను బోధిస్తాయని వారు గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకుడిగా యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా వ్యవహరించాల్సిన సమయంలో రాహుల్ గాంధీ బాధ్యతాయుత రాజకీయాలను విస్మరించారు. అయితే, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానకరమైన భాషను ప్రోత్సహించే నాయకులను భవిష్యత్తు తరాలు తిరస్కరిస్తాయని, దేశ ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి యువత మద్దతు ఎప్పటికీ ఉంటుందని మంత్రి కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
ఏంది సామీ ఈ రచ్చ!.. బీజేపీ ఎంపీ 'క్రేజ్' ఖండాంతరాలు దాటింది!
లక్నో: అబ్బే ఇవ్వేం అయ్యే పనుల్లా కనిపించట్లేదే. పైగా.. ఫిజికల్‌గాను,మెంటల్‌గాను స్ట్రెయినూ,ఎవర్రా మీరంతా, నువ్వురా ఫ్రెండ్ అనే మీమ్ సోషల్ మీడియాలో కామన్ . కానీ ఇప్పుడు హెడ్‌క్వార్టర్స్ అనే సరికొత్త మీమ్ ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. మార్కెట్లోకి సరికొత్త ‘మీమ్ గాడ్' వచ్చేశారు! "నేను ఆడా ఉంటా.. ఈడా ఉంటా" అన్న రేంజ్లో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఒంటిచేత్తో ఊపేస్తున్నారు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు.. సినిమా స్క్రీన్ నుంచి ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ గ్రౌండ్ వరకు.. ఎటు చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్సే వినబడుతున్నాయి.ఇంతకీ నెటిజన్లను ఇంతలా పిచ్చెక్కిస్తున్న ఆ 'యాక్సిడెంటల్ మీమ్ గాడ్' ఎవరో కాదు.. ప్రముఖ సినీ నటుడు, ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎంపీ రవి కిషన్. ఈ వైరల్ క్రేజ్‌పై ఆయన స్పందిస్తూ.. అయ్యో.. ఆ మహాదేవుడి మీద ఒట్టు, నేనెందుకు ఇంతలా వైరల్ అవుతానో నాకే తెలియదు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.‘ది అలయన్స్’షో.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ సునామీ!అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల వచ్చిన ది అలయన్స్ రియాలిటీ షోతోనే ఈ మీమ్స్ కథ మొదలైంది. రవి కిషన్ తన కుమార్తె రివా కిషన్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. అయితే, తన నియోజకవర్గంలో పనుల కారణంగా ఆయన ఈ షో నుంచి మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది.ఆ సమయంలో ఆయన సెలవు తీసుకుంటూ.. తనకు దేశ సేవ కోసం హెడ్‌క్వార్టర్స్ నుంచి పిలుపు వచ్చిందని, వెంటనే వెళ్లాలని చెప్పిన స్టైల్ మీమర్ల చేతికి చిక్కింది. దీనికి తోడు, అదే షోలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనబోయి పొరపాటున హోమ్ ఫ్రమ్ వర్క్ అని ఆయన అనడం ఇన్‌స్టాగ్రామ్‌ను ఊపేసింది. ఈ రెండు క్లిప్పింగులు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అయ్యాయి.సరిహద్దులు దాటిన క్రేజ్.. రవి కిషన్ డైలాగ్స్‌కు ఫుట్‌బాల్ స్టార్స్ స్టెప్పులు!రవి కిషన్‌కు లభించిన ఈ మీమ్ పాపులారిటీ కేవలం ఇండియాకే పరిమితం కాలేదు.గ్లోబల్ లెవెల్‌కు రీచ్ అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఆడియో ఎంతలా వైరల్ అయిందంటే.. యూరప్‌లోని ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్బులు సైతం ఈ ట్రెండ్‌లోకి చేరాయి!.ఇటలీకి చెందిన ఐకానిక్ క్లబ్ జువెంటస్ జర్మనీకి చెందిన ప్రసిద్ధ క్లబ్ బోరుస్సియా డార్ట్మండ్ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో రవి కిషన్ డైలాగ్స్‌ను ఉపయోగించుకున్నాయి.Lord Ravi Kishan supremacy 🗿😎😭❤️JUVENTUS really posted Ravi Kishan 😭🖤🤍One of the biggest and most successful football clubs in Italy and Europe. Lord Ravi Kishan supremacy. pic.twitter.com/dzYplDzGvp— 𝙅𝙍𝙅49 (@jrj_49) August 4, 2026ఈ క్లబ్బులు తమ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్స్ ప్రాక్టీస్ వీడియోలు, గోల్స్ కొట్టిన విజువల్స్‌కు రవి కిషన్ హెడ్‌క్వార్టర్స్,హోమ్ ఫ్రమ్ వర్క్ ఆడియోలను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎడిట్ చేసి పోస్ట్ చేశాయి. జువెంటస్ క్లబ్ ఒక అడుగు ముందుకేసి, రవి కిషన్‌కు సంబంధించిన మోస్ట్ పాపులర్ వైరల్ క్లిప్స్ అన్నింటినీ కలిపి ఒక క్రేజీ కంపైలేషన్ వీడియోను విడుదల చేసింది. ఒకే ఒక్క మీమ్ దేశీయ సెలబ్రిటీని గ్లోబల్ ఐకాన్‌గా ఎలా మార్చగలవో చెప్పడానికి ఈ హెడ్‌క్వార్టర్స్ ట్రెండే ఒక సూపర్ ఎగ్జాంపుల్! -
కమల వ్యూహం బెడిసికొట్టింది అక్కడే..!
బిహార్ రాజకీయాల్లో ఓ చిన్న ఉప ఎన్నిక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. ఇది కేవలం ఓ అభ్యర్థి గెలుపు మాత్రమే కాదు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారింది. బీజేపీని ఓడించి తీరాలన్న కసి అక్కడి ఓటర్లలో కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కమల వ్యూహం ఎక్కడ బెడిసికొట్టింది? అనేది పరిశీలిస్తే.. పట్నా నగరంలోని బంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి బలమైన అడ్డాగా ఉంది. 1995 నుంచి ఈ స్థానంలో కమలం ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. తొలుత నితిన్ నబీన్ తండ్రి నవీన్ చంద్ర సిన్హా.. ఆ తర్వాత నితిన్ నబీన్ వరుస విజయాలతో ఈ సీటును బీజేపీ తన గుప్పిట్లో ఉంచుకుంది. అలాంటి నియోజకవర్గంలో ఈసారి అనూహ్య ఫలితం వెలువడింది.జనసూరాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 19,324 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పీకేకు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 44,827 ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.అక్కడే బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్బంకీపూర్ ఫలితాల్లో బీజేపీ వ్యూహ లోపం ప్రధానంగా అభ్యర్థి ఎంపిక దగ్గరే కనిపించిందనే చర్చ జరుగుతోంది. తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ ‘బంటీ’ చివరి సమయంలో తప్పుకోవడంతో.. పార్టీ నీరజ్ కుమార్ సిన్హాను రంగంలోకి దించాల్సి వచ్చింది. బీజేపీకి బలమైన పట్టు ఉన్న స్థానంలో చివరి నిమిషంలో మార్పు జరగడం క్యాడర్లో కొంత గందరగోళానికి కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ వ్యతిరేక ఓటును ఒకే వేదికపైకి తీసుకురావడంలో ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు సహజంగా ఆర్జేడీ వైపు మొగ్గు చూపేవారు. కానీ ఈసారి “బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయం ఎవరు?” అనే లెక్కలో కొంతమంది ఓటర్లు జనసూరాజ్ వైపు మళ్లినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.సంబంధిత వార్త: పీకే దాడికి ముందే బీజేపీ ప్లాన్ మార్చిందా?పీకే ఎంట్రీతో మారిన బిహార్ లెక్కలుఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం తొలి ప్రయత్నాల్లో పెద్ద విజయాన్ని అందుకోలేకపోయారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయితే బంకీపూర్ ఉప ఎన్నికలో ఆయన వ్యూహం పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఒక్క నియోజకవర్గంపై పూర్తి దృష్టి పెట్టి.. స్థానిక అంశాలు, ప్రత్యామ్నాయ రాజకీయాల నినాదంతో ప్రచారం సాగించారు. ఫలితంగా బీజేపీ కంచుకోటనే బద్దలు కొట్టారు. ఈ విజయం జనసూరాజ్కు అసెంబ్లీలో తొలి అడుగు మాత్రమే కాదు.. బిహార్‌లో మూడో రాజకీయ శక్తిగా ఎదగాలనే పీకే ప్రయత్నాలకు కొత్త ఊపునిచ్చింది.బీజేపీకి దెబ్బ.. ఆర్జేడీకీ హెచ్చరికబంకీపూర్ ఫలితంలో మరో కీలక అంశం ఆర్జేడీ వెనుకబడటం. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆర్జేడీ.. ఈ ఎన్నికలో మూడో స్థానానికి పడిపోవడం ఆ పార్టీకి కూడా ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్ బలంగా నిర్మించిన ముస్లిం–యాదవ్ ఓటు బ్యాంకు ఆర్జేడీకి ప్రధాన బలం. అయితే బీజేపీ వ్యతిరేక ఓటులో కొంత భాగం ఈసారి జనసూరాజ్ వైపు వెళ్లినట్లు కనిపించింది. ఈ ధోరణి కొనసాగితే.. ఆర్జేడీ రాజకీయ ఆధిపత్యానికి కూడా సవాల్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇద్దరిలో కారకులెవరూ?బంకీపూర్ ఓటమి ఇప్పుడు బీజేపీలో అంతర్గత చర్చకు దారితీసింది. బాధ్యత ఎవరిపై వేయాలన్న ప్రశ్నపై నితిన్ నబీన్, సమ్రాట్ చౌదరీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సొంత కుటుంబానికి మూడు దశాబ్దాలుగా పట్టున్న స్థానాన్ని కోల్పోవడం నితిన్ నబీన్‌కు వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అభ్యర్థి ఎంపిక, ప్రచార నిర్వహణ, స్థానిక నాయకులతో సమన్వయం వంటి అంశాల్లో లోపాలే ఓటమికి కారణమయ్యాయనే చర్చ సాగుతోంది.మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సమ్రాట్ చౌదరీకి ఇది తొలి పెద్ద రాజకీయ పరీక్ష. ప్రశాంత్ కిషోర్ తన ప్రచారంలో చౌదరీ నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో ఈ ఫలితం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఓ హెచ్చరికగా మారింది.అయితే ఒక్కరిని నిందించడం కంటే.. బంకీపూర్ ఓటమి బీజేపీ ఎన్నికల వ్యూహానికి వచ్చిన పరీక్షగా చూడాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.బంకీపూర్ ఇచ్చిన సంకేతం ఏంటి?బంకీపూర్ ఫలితం కేవలం ఓ ఉప ఎన్నిక తీర్పు కాదు.. బిహార్ రాజకీయాల్లో కొత్త పోటీకి సంకేతం. ఇంతకాలం బీజేపీ–ఆర్జేడీ మధ్య సాగిన పోరులోకి ఇప్పుడు జనసూరాజ్ ప్రత్యామ్నాయ శక్తిగా అడుగుపెట్టింది. బీసీ, అగ్రవర్ణాల ఓట్లు ఆ పార్టీకి మళ్లాయి. కమలానికి ఇది కంచుకోట కోల్పోవడమే కాదు.. బలమైన స్థానాల్లో కూడా ఓటర్ల నాడిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఫలితం. ఆర్జేడీకి తన సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన సవాలు ఎదురైంది.ప్రశాంత్ కిషోర్ గెలుపు ఒక్క సీటుతో మొదలైనప్పటికీ.. దీని ప్రభావం రాబోయే బిహార్ రాజకీయ సమీకరణాలపై ఎంతవరకు పడుతుంది? బీజేపీ తన కోటను ఎలా తిరిగి నిర్మించుకుంటుంది? జనసూరాజ్ ఈ విజయాన్ని ఎలా విస్తరిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
KSR Comments: ప్రశాంత్ కిషోర్ విజయం వెనుక..
-
ప్రశాంత్ కిశోర్ సంచలనం 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు
-
పీకే గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే: మీసా భారతి
బిహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో జనసూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించిన తర్వాత రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. 35 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న స్థానాన్ని కైవసం చేసుకున్న పీకే విజయంపై విపక్షాలు ప్రశంసలు కురిపిస్తుండగా.. లాలూ కూతురు, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి మాత్రం భిన్నంగా స్పందించారు. ప్రశాంత్ కిషోర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన గెలుపు వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఆరోపించారు.బంకీపూర్ ఫలితాలపై ఇండియా టుడేతో మాట్లాడిన మీసా భారతి.. బీజేపీ అధికారిక అభ్యర్థి నీరజ్ కుమార్ కాదని, అసలు అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ అని వ్యాఖ్యానించారు. బీజేపీ తన సొంత బలంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేమని భావించి పరోక్షంగా పీకేకు మద్దతిచ్చిందని ఆరోపించారు. “మీరు బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ అని అనుకుంటారు.. కానీ అసలు అభ్యర్థి ప్రశాంత్ కిషోర్” అని ఆమె పేర్కొన్నారు. బంకీపూర్ ఎప్పటి నుంచో బీజేపీ బలమైన ప్రాంతమని, అక్కడ బీజేపీ ఓడిపోయినా ఆ పార్టీకి నష్టం లేదని వ్యాఖ్యానించారు.“పీకే గెలిస్తే.. బీజేపీ గెలిచినట్టే”ప్రశాంత్ కిషోర్ విజయాన్ని బీజేపీకి అనుకూలంగా మలిచే ప్రయత్నం చేశారని మీసా భారతి మండిపడ్డారు. బీజేపీ అధికారిక అభ్యర్థి ఓడిపోయినప్పటికీ.. పీకే గెలవడం ద్వారా బీజేపీ తన లక్ష్యాన్ని సాధించిందన్నారు. బీజేపీ అభ్యర్థిని రాత్రికి రాత్రే ఎందుకు మార్చారని ప్రశ్నించిన ఆమె.. సొంతంగా గెలిచే నమ్మకం లేకపోవడం వల్లే ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దింపారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.“గుంటనక్క” అంటూ విమర్శలుప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయాణంపై విమర్శలు చేసిన మీసా భారతి.. ఆయనను “గుంటనక్క”గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు. ప్రజలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారని ఆరోపించారు.తేజస్వి గైర్హాజరుపై వివరణబంకీపూర్ ప్రచారంలో ఆర్జేడీ దూకుడుగా వ్యవహరించలేదన్న విమర్శలను మీసా భారతి ఖండించారు. ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్ వ్యక్తిగత పర్యటనలో ఉండటం వల్ల ప్రచారానికి రాలేకపోయారని సమర్థించారు. అదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ఆమె విమర్శలు చేశారు. విద్యార్థుల నిరసనలు జరుగుతున్న సమయంలో విదేశీ పర్యటనలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇదిలా ఉంటే.. విజయ సంబురాల్లో ఉన్న జన సురాజ్ పార్టీగానీ, ప్రశాంత్ కిషోర్గానీ మీసా భారతి ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. 36 రౌండ్ల పాటు ఆధిక్యం.. భారీ మెజారిటీతో విజయంబంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ తొలి ఎన్నికల విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 36 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఆయన ఆధిక్యాన్ని కొనసాగించారు. జనసూరాజ్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాకు 44,827 ఓట్లు వచ్చాయి. దాదాపు 19,324 ఓట్ల మెజారిటీతో పీకే విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి 14,273 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇదే స్థానం నుంచి నితిన్ నబీన్(98,299 ఓట్లు) రేఖా కుమారి(46,363 ఓట్లు)పై దాదాపు 52 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.35 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలుబంకీపూర్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి పట్టున్న ప్రాంతంగా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే తాజా ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం ద్వారా జనసూరాజ్ పార్టీకి అసెంబ్లీలో తొలి అడుగు పడింది.ఎన్నికల వ్యూహకర్తగా అనేక పార్టీలకు విజయాలు అందించిన ప్రశాంత్ కిషోర్.. రాజకీయ నాయకుడిగా మాత్రం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులను బరిలోకి దింపినా ఆశించిన ఫలితం సాధించలేకపోయారు. కానీ ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.అయితే బంకీపూర్ ఫలితం కేవలం బీజేపీకి ఎదురుదెబ్బ మాత్రమే కాదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విజయం ద్వారా ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీ రాజకీయ స్థలానికే సవాల్ విసిరారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లలో కొంత భాగం జనసూరాజ్ వైపు మళ్లడం ఆర్జేడీకి ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇప్పటివరకు బీహార్‌లో ప్రధాన ప్రతిపక్ష శక్తిగా ఉన్న ఆర్జేడీకి ముస్లిం–యాదవ్ (ఎంవై) ఓటు బ్యాంకు ప్రధాన బలంగా ఉండేది. అయితే బంకీపూర్‌లో సంప్రదాయంగా ఆర్జేడీ వైపు ఉండే కొన్ని వర్గాల ఓట్లు కూడా ప్రశాంత్ కిషోర్ వైపు మళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీని ఓడించగల ప్రత్యామ్నాయంగా జనసూరాజ్ను కొందరు ఓటర్లు చూడటం మొదలుపెడితే.. భవిష్యత్తులో బీహార్ ప్రతిపక్ష రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
సుమోటోగా విచారణ జరిపే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మనీ లూటింగ్ ఏజెంట్లుగా మారారని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి వైట్ మనీతో వేలానికి వెళ్లిన ఆస్తులను ఎమ్మెల్యే అయిన ఏడాదిలోనే రూ.470 కోట్లు కట్టి ఆస్తులను ఎట్లా విడిపించారని ప్రశ్నించారు. ఏడాదిలో రూ.470 కోట్ల అప్పు ఎలా కట్టారని, ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సుమోటోగా విచారణ నిర్వహించే దమ్మూధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్ సర్కార్‌కు ధైర్యముంటే ఆ ఎమ్మెల్యే పేరు బయట పెట్టాలి. ఆ ఎమ్మెల్యే అవినీతిపై నిజ నిర్ధారణ చేయాలి. అందులో సీఎం, డిప్యూటీ సీఎంలకు వాటా లేకపోతే వాస్తవం బయట పెట్టాలి’అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఇంత సంపాదన ఉంటే మంత్రులు, సీఎం ఎంత సంపాదించాలి అనేవిధంగా అనుమానాలు వస్తున్నాయన్నారు. ఏడాదిలో రూ.470 కోట్ల అప్పు కట్టిన ఆ ఎమ్మెల్యే ఎవరూ అని ప్రశ్నించారు. బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మహేశ్వర్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సోమవారం సాక్షి దినపత్రికలో ‘ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలోపే...అప్పుల కొండ కరిగించేశారు...!’ పతాక శీర్షికతో ప్రచురితమైన సంచలన కథనాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడంతోపాటు బీజేఎల్పీ నేతగానూ ఉన్న మహేశ్వర్‌రెడ్డి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు, వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఏ ఫైల్ కదిలినా 40 శాతం కమీషన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ గెలుస్తామా అన్న చందంగా దోపిడీకి పాల్పడుతూ ఎమ్మెల్యే నిర్వచనం మార్చేస్తున్నారని ఏలేటి ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలకు చీఫ్ మేనేజర్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ లూటీ చేసినట్టుగానే కాంగ్రెస్ పోటీ పడుతోంది. గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల లూటీ.. ప్రస్తుత అధికార ఎమ్మెల్యేల లూటీతో ప్రభుత్వం అప్పు తీరుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు’అని వ్యాఖ్యానించారు. ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్నారు. కోటి మంది మహిళలు దేవుడెరుగు వాళ్ల ఎమ్మెల్యేలను వేల కోట్లకు పడగలెత్తిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అయితే అవినీతి తాండవిస్తున్నదో... ఆ రాష్ట్ర అభివృద్ధి కుంటు పడుతుంది అందుకు నిదర్శనమే తెలంగాణ’అని అన్నారు. ‘ఈ ప్రభుత్వంలో ఏ ఫైల్ కదిలినా 40 శాతం కమీషన్ అంటున్నారు. ఉన్న సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టు ఎవరికి వారు పోటీ పడి లూటీ చేస్తున్నారు. మా కోసం కాదు ఢిల్లీకి మూటలు పంపాలని సినిమా డైలాగులు కొడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి’అని మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. -
బీహార్ బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలు : మంత్రి పొన్నం ప్రభాకర్
బీహార్ రాజకీయాల్లో సంచలన పరిణామంగా నిలిచిన బంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దశాబ్దాలుగా బీజేపీ కంచుకోటగా ఉన్న బంకిపూర్‌లో ఆ పార్టీ ఓటమిపాలవడం ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పుకు నిదర్శనమని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు చెందిన నియోజకవర్గంలోనే జన్ సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ భారీ మెజారిటీతో గెలవడం ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు.అయితే, అధికార బలం, ప్రభుత్వ యంత్రాంగం, విస్తృత ప్రచారం ఉన్నప్పటికీ ప్రజల తీర్పును ఎవరూ మార్చలేరు. దీనికి బంకిపూర్ ఫలితం మరో నిరూపన. ప్రజలు తమ ఓటుతో బీజేపీ అహంకారానికి గట్టి సమాధానం చెప్పారు. ప్రజల సమస్యలను విస్మరించి అహంకారపూరిత పాలన కొనసాగిస్తే తగిన సమయంలో ప్రజలు తీర్పు ఇవ్వడమే కాకుండా, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని మంత్రి గట్టిగా చెప్పుకొచ్చారు.ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని ప్రస్తావించిన మంత్రి.. దేశవ్యాప్తంగా యువతలో అసంతృప్తి పెరుగుతోందని, అలాగే, విద్యార్థులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందనే భావన బలపడుతోందని, అదే భావోద్వేగం బంకిపూర్ ఉపఎన్నిక ఫలితంలో ప్రతిబింబించిందని ఆయన అన్నారు.అలాగే, బంకిపూర్ తీర్పు కేవలం ఒక ఉపఎన్నిక ఫలితం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ప్రజల సంకల్పానికి ప్రతీక. దీంతో ప్రజల గొంతుకను అణచివేయాలని చూసే రాజకీయాలకు దేశ ప్రజలు సరైన సమయంలో సమాధానం చెబుతారని, బంకిపూర్‌లో బీజేపీ కంచుకోట బద్దలవడం దేశ రాజకీయాల్లో మరింత పెద్ద మార్పులకు నాంది పలుకుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. -
‘తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ వచ్చే ప్రసక్తే లేదు’
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అన్ని వర్గాల ప్రజల మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ‘హైదరాబాదులో ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. హిట్లర్ ఎన్ని దుర్మార్గాలకు వడిగట్టాడు అందరికీ తెలుసు. అలాంటి హిట్లర్ నాకు ఆదర్శం, స్ఫూర్తి అని సీఎం రేవంత్ అంటున్నారు. హైడ్రా నల్లచెరువులో బుచ్చమ్మ అనే మహిళ చనిపోయింది. హైడ్రా పేదల ఇళ్లను కూల్చే , వేధించే సంస్థ వచ్చింది. హైదరాబాద్ పోలింగ్ పెడితే దాన్ని బట్టి తెలుస్తుంది. హైడ్రా ప్రజల గూడును కూల్చే సంస్థగా ముద్ర పడింది. 95% ప్రజలు హైడ్రా అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి మాట కూడా హైడ్రా వినలేని పరిస్థితుల్లో ఉందనే విధంగా ప్రవర్తించారు. కిడ్నీ డయాలసిస్ పేషెంట్లను వికలాంగులుగా గుర్తించాలి. వికలాంగుల చట్టం లో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లను చేర్చాలి. కిడ్నీ పేషెంట్ కుటుంబాలలో అంధకారం నెలకొంది. హైదరాబాదులో అనేక చెరువులు కుంటలు, మాయమయ్యాయి. వాగులు, డ్రైనేజీలు కెమికల్ వేస్ట్‌గా మారిపోయాయి. హైదరాబాద్ అభివృద్ధి లో అవుతున్న కొత్త కాలనీలు చెరువు పక్కన ఇల్లు ఉంటే దుర్గంధం అవుతున్నాయి’ అని స్పష్టం చేశారు. -
జెన్ జీకి తొలి వికెట్.. ‘వైరస్’ అన్న నబీన్‌కు ఓటుతో బదులు
బిహార్‌లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ విజయ దుందుభి మోగించారు. బీజేపీ దాదాపు మూడు దశాబ్దాలుగా గెలుస్తున్న నియోజక వర్గంలో మరో పార్టీ గెలవడమంటే సామాన్యమైన విషయం కాదు. తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. జన్ సూరజ్ పార్టీకి ఇది తొలి అసెంబ్లీ విజయం. తొలిసారి చట్టసభలో అడుగుపెట్టనున్నారు ప్రశాంత్ కిశోర్. బీజేపీకి 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న బంకీపూర్‌లో కేవలం 30 రోజుల పాటు శ్రమించి (ఎన్నికల ప్రచారం చేసి) ఆయన గెలుపొందారు. బీజేపీ ఓటమి వెనుక పలు ముఖ్యమైన అంశాలున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల నిర్వహించిన ఆందోళనల నేపథ్యంలో బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితంపై చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలను జెన్ జీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇచ్చిన ఝలక్‌గా అభివర్ణిస్తున్నారు.4 సార్లు ఇక్కడే నబీన్ గెలుపురాజ్యసభకు వెళ్లేందుకు ఆయన స్వయంగా వదులుకున్న సొంత నియోజకవర్గం బంకీపూర్లోనే బీజేపీ ఓటమి చెందింది. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ గెలిచారు. అలాగే, 1995 నుంచి బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ ఎప్పుడూ కోల్పోలేదు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు ఓడించారు.సీజేపీని వైరస్‌తో పోల్చిన నబీన్నితిన్ నబీన్ సీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ దానిని "వైరస్"తో పోల్చారు. ఆయన ఇటీవల మాట్లాడుతూ.. "దేశంలో వైరస్, కాక్రోచ్‌లాంటి పార్టీలు వస్తున్నాయి. ఇవి దేశాన్ని లోపల నుంచి బలహీనపరచాలని చూస్తున్నాయి. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే టుక్డే-టుక్డే గ్యాంగ్‌లో ఇవి భాగం" అని అన్నారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందిస్తూ.. "మమ్మల్ని టెర్రరిస్టులు, వైరస్ అని పిలుస్తున్నారు. కానీ మేము విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నాం" అని చెప్పారు.జెన్ జీ ఎఫెక్ట్- సంప్రదాయ ఓటు బ్యాంక్‌లో చీలికబంకీపూర్లో బీజేపీ ఓటమి జెన్ జీ ఎఫెక్టే అంటూ నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. యువ ఓటర్ల తీర్పుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ ఓటమికి జెన్ జీ ఉద్యమం ప్రభావం ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యువ ఓటర్లలో పెరిగిన అసంతృప్తి ఎన్నికల ఫలితంపై స్పష్టంగా కనిపించింది. జెన్ జీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, విద్యా సంస్కరణల అంశాలను యువత బలంగా ప్రస్తావించింది. కాక్రోచ్ ఉద్యమంలో బిహార్ యువత కూడా పాల్గొన్నారు. జెన్ జీ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ యువ ఓటర్లను చైతన్యపరిచింది. మొదటిసారి ఓటు వేసిన యువతలో గణనీయమైన మార్పు కనిపించింది. ప్రతిపక్షాలకు మద్దతుగా డిజిటల్ ప్రచారం ఊపందుకుంది. జెన్ జీ ఉద్యమం స్థానిక సమస్యలను ఎన్నికల ప్రధాన అజెండాగా మార్చింది. దీంతో బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్‌లోనూ కొంత మేర చీలిక ఏర్పడినట్లు అంచనాలు ఉన్నాయి. ఈ ఫలితం యువత రాజకీయ ప్రభావాన్ని మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చింది. -
మారిన సీన్.. ధర్మేంద్ర ప్రధాన్‌కు బిగ్ చాన్స్?
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు.. మరో చాన్స్ దక్కనుందా?. స్వరాష్ట్రంలో లభించిన ఘన స్వాగతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. బీజేపీలో కీలక నేతగా ఎదిగిన ఆయనకు ఇకపై ఎలాంటి బాధ్యతలు దక్కబోతున్నాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆయనకు బిగ్చాన్స్ దక్కే అవకాశం ఉందన్న విశ్లేషణలు జోరందుకున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ బలానికి 2024 సంబల్పూర్ విజయం ఒక ఉదాహరణగా నిలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఒడిశాలోని సంబల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా 1,19,836 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2019లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నితేశ్ గంగా దేవ్ కేవలం 9,162 ఓట్ల స్వల్ప ఆధిక్యంతోనే గెలిచారు. ఐదేళ్ల వ్యవధిలో సంబల్పూర్లో బీజేపీ బలం ఎంతగా పెరిగిందో ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పు వెనుక ధర్మేంద్ర ప్రధాన్ చేసిన సంస్థాగత కృషి కీలకమని పార్టీ వర్గాలు భావిస్తాయి. చాలా కాలం ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. ఒడిశాలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందారు.మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఒడిశాకు తిరిగి వచ్చిన సమయంలో పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ పరిణామమే ఇప్పుడు కొత్త చర్చకు కారణమైంది. ఇది కేవలం ఓ నేతకు ఇచ్చిన స్వాగతమేనా? లేదంటే భవిష్యత్‌లో కీలక బాధ్యతలకు సంకేతమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఆయనకు జాతీయ రాజకీయాల్లో మరో అవకాశం కష్టమనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.రాజీనామా.. అవకాశంగా మారిందా?NEET వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయనకు మరో మంత్రి పదవి ఇవ్వడాన్ని.. అటు ఆందోళనకారులు, ఇటు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఆయనకు మరో అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. అయితే.. సాధారణంగా ఒక మంత్రి పదవి నుంచి తప్పుకోవడం రాజకీయంగా ప్రతికూల పరిణామంగానే భావిస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.రాజీనామా తర్వాత ఆయనకు లభించిన స్వాగతం, పార్టీ నేతల బహిరంగ మద్దతు.. ఆయన రాజకీయ ప్రాధాన్యం ఇంకా తగ్గలేదనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రజల్లో “ఒడిశాకు చెందిన కీలక నేత కేంద్రంలో బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు తిరిగి రాష్ట్రానికి వచ్చారు” అనే భావన కూడా ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.అయితే మరోవైపు.. NEET వివాదం ప్రభావం పూర్తిగా తగ్గిందా? అనేది కూడా ప్రశ్నగానే ఉంది. ముఖ్యంగా యువతలో ఆయనపై ఉన్న అభిప్రాయం ఎలా ఉందన్నది భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుంది.ఒడిశాలో అసలు బలం ఎంత?జాతీయ రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్నప్పటికీ.. ధర్మేంద్ర ప్రధాన్‌కు ఒడిశా రాజకీయాలపై పట్టు లేదనే వాదనకు ఆయన రాజకీయ ప్రయాణమే సమాధానంగా నిలుస్తుంది. విద్యార్థి దశలో ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. ఒడిశాలో బీజేపీ ఒక చిన్న శక్తిగా ఉన్న సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు చెబుతాయి.ప్రత్యేకంగా పశ్చిమ ఒడిశాలో పార్టీ విస్తరణ, కార్యకర్తల నెట్వర్క్ పెంచడం, ఎన్నికల వ్యూహాల్లో ఆయన పాత్ర ఉందనే గుర్తింపు ఉంది. 2024లో సంబల్పూర్లో వచ్చిన భారీ విజయం కూడా ఆయనకు ఉన్న క్షేత్రస్థాయి అనుబంధానికి నిదర్శనంగా బీజేపీ నేతలు చెబుతున్నారు.అయితే ఆయన బలం ఎక్కువగా సంస్థాగత రాజకీయాలు, వ్యూహ రచన, పార్టీ నాయకులతో సమన్వయం చేయడంలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాల్లో ఉండే రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన ఇమేజ్ను మాత్రం మరోసారి నిరూపించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.సీఎం రేసులో మళ్లీ ధర్మేంద్ర ప్రధాన్?2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి ఒడిశాలో అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. దీని వెనుక గిరిజన ఓటు బ్యాంక్, సామాజిక సమీకరణాలు కీలకంగా పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు భావించారు.ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే.. ఆయనకు ఉన్న అనుభవం, ఢిల్లీ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ వెంటనే సీఎం మార్పు చేయడం మాత్రం పార్టీకి అంత సులభమైన నిర్ణయం కాదని భావిస్తున్నారు.ఎందుకంటే మోహన్ చరణ్ మాఝీ ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి కావడంతో ఆయనను మార్చడం మరో రాజకీయ సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది.బీజేపీలో కొత్త సమీకరణాలు?ధర్మేంద్ర ప్రధాన్ పేరు మళ్లీ తెరపైకి రావడంతో ఒడిశా బీజేపీలో అంతర్గత సమీకరణాలపై కూడా చర్చ మొదలైంది. రాష్ట్ర బీజేపీలో అపరాజిత సారంగి, బైజయంత్ పాండా, మన్మోహన్ సామల్ వంటి నేతలు కూడా కీలక స్థానాల్లో ఉన్నారు. అందువల్ల ప్రధాన్ పాత్రను పెంచే విషయంలో పార్టీ అధిష్ఠానం సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్టీలో ఉన్న అనుభవం, జాతీయ స్థాయి పరిచయాలు ఆయనకు ప్రత్యేక బలంగా మారుతున్నాయి.ముందున్న దారులు ఏంటి?ధర్మేంద్ర ప్రధాన్ ముందు ప్రధానంగా రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. బీజేపీలో జాతీయ స్థాయిలో మరింత కీలకమైన సంస్థాగత బాధ్యతలు చేపట్టడం. ఎన్నికల వ్యూహాలు, పార్టీ విస్తరణలో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడం. రెండోది.. ఒడిశా రాజకీయాల్లోకి మరింత చురుగ్గా ప్రవేశించి రాష్ట్రంలో పార్టీకి మార్గనిర్దేశం చేయడం.వెంటనే ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా.. భవిష్యత్‌లో ఆయనకు కీలక బాధ్యతలు వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒకవైపు ఆయనపై వచ్చిన విమర్శలకు కారణమైనప్పటికీ.. మరోవైపు ఒడిశాలో ఆయన రాజకీయ బలాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది. సానుభూతి ఎంతవరకు పనిచేస్తుంది? బీజేపీ అధిష్ఠానం ఆయనకు ఎలాంటి పాత్ర ఇస్తుంది? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. -
పెన్షన్ కోసం పాత ఉద్యోగంలో చేరిన మాజీ ఎంపీ!
అధికారం, పదవులు ఎప్పటికీ శాశ్వతం కావు.. కానీ నేర్పించిన విద్య మాత్రం జీవితాంతం తోడుంటుంది. పార్టీకి ఆ ప్రాంత ముఖంగా.. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఓ మాజీ ఎంపీ.. ఇప్పుడు మళ్లీ తరగతి గదిలోకి అడుగుపెట్టారు. పదవి పోయిందని, అవమానాలు జరిగాయని కుంగిపోకుండా.. తనకు తెలిసిన విద్యా బాటనే ఎంచుకున్నారు. రాజకీయ కార్యకలాపాలకు దూరమై.. తిరిగి ఉపాధ్యాయ వృత్తిలో చేరడం ఆయన వ్యవహారం.. అందుకు చెప్పిన ఆసక్తికర కారణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.త్రిపురలోని తూర్పు త్రిపుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో బీజేపీ తరఫున గెలిచిన రిబతి త్రిపుర(49).. తాజాగా అగర్తలాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మళ్లీ ఉపాధ్యాయుడిగా చేరారు. రాజకీయాల్లో అనుకున్నంత క్రియాశీల పాత్ర లేకపోవడం, పార్టీ పదవుల్లో చోటు దక్కకపోవడంతో ఆయన తన పాత వృత్తి వైపు మళ్లినట్లు తెలుస్తోంది.ఎంపీగా ఎదిగిన ఉపాధ్యాయుడురిబతి త్రిపుర స్వస్థలం ధలాయ్ జిల్లా. చిన్న గ్రామం నుంచి వచ్చిన ఆయన రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2001లో అగర్తలాలోని మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసిన ఆయన 2014లో బీజేపీలో చేరారు. గిరిజన ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎదిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు తూర్పు త్రిపుర టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు.రాజకీయంగా తగ్గిన ప్రాధాన్యంఅయితే కాలక్రమేణా ఆయన రాజకీయ ప్రాధాన్యం తగ్గింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు బదులుగా తిప్రా మోతా పార్టీ అధినేత ప్రద్యోత్ కిశోర్ దెబ్బర్మన్ సోదరి కృతి దేవి దెబ్బర్మన్ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత కూడా రిబతి త్రిపుర బీజేపీ కోర్ కమిటీలో కొనసాగినప్పటికీ.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా చురుకుగా కనిపించలేదు. తాజాగా పార్టీ ప్రకటించిన కొత్త కార్యవర్గ జాబితాలోనూ ఆయన పేరు లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మరింత స్పష్టత వచ్చినట్లు అయింది. అయితే ఉద్దేశపూర్వకంగా ఆయన్ని పార్టీ పక్కన పెట్టిందనే ప్రచారం అక్కడ వినిపిస్తూ వచ్చింది. దానికి తగ్గట్లే ఆయన కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చేవారు.‘రెండున్నరేళ్లుగా పని లేదు.. అందుకే తిరిగొచ్చా’అయితే తన నిర్ణయంపై రిబతి త్రిపుర మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లుగా పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా తనకు ప్రత్యేక బాధ్యతలు ఏమీ లేవని తెలిపారు. “రాజకీయంగా నాకు ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక బాధ్యత లేదు. అందుకే నా పాత వృత్తి అయిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ ఉద్యోగానికి తిరిగి వచ్చాను” అని ఆయన పేర్కొన్నారు.తిరిగి బోధనలో సౌకర్యంగా ఉంటే కొనసాగుతానని, లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ గురించి ఆలోచిస్తానని చెప్పారు. అదే సమయంలో ఉపాధ్యాయ ఉద్యోగం తనకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కూడా ఇస్తుందని తెలిపారు. నెలకు సుమారు రూ.50 వేల వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.రాజకీయాల నుంచి.. తరగతి గదికిరిబతి త్రిపుర తిరిగి పాఠశాలలో చేరడాన్ని సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతించినట్లు తెలుస్తోంది. ఆయన నిబద్ధతతో బోధిస్తున్నారని పాఠశాల అధికారులు తెలిపారు. ఎంపీగా ప్రజా సమస్యలను ప్రస్తావించిన వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పనిలోకి రావడం ఆసక్తికర పరిణామంగా మారింది.రాజకీయాల్లో విజయాలు, పరాజయాలు సహజమే. కానీ తనకు తెలిసిన రంగంలో తిరిగి అడుగుపెట్టి స్థిరత్వాన్ని ఎంచుకున్న రిబతి త్రిపుర నిర్ణయం.. పదవి కంటే వృత్తి విలువను గుర్తుచేస్తోంది. -
బీజేపీకి బిగ్ టెస్ట్.. మరికాసేపట్లో పూర్తి ఫలితాలు!
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల నిరసనలు హోరెత్తిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. బీజేపీ పాలిత మూడు రాష్ట్రాలు.. బిహార్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. యువతలో పెరిగిన అసంతృప్తి ఓట్ల రూపంలో బయటపడుతుందా? లేదంటే బీజేపీ తన పట్టును కొనసాగిస్తుందా? అన్నది ఈ ఫలితాలతో తేలనుంది.బంకీపూర్, దాతియా, మంజల్పూర్ ఉప ఎన్నికల స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది. బంకీపూర్‌లో జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ ముందంజంలో కొనసాగుతున్నారు. ఇక దాతియా, మంజల్పూర్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దాటియాలో కాంగ్రెస్ అభ్యర్థి కాసేపు ఆధిక్యంలో కొనసాగినా.. కాసేపటికే మళ్లీ వెనుకంజలోకి వెళ్లారు.ఈ ఉప ఎన్నికలు సంఖ్యాపరంగా చిన్నవే అయినప్పటికీ.. రాజకీయంగా మాత్రం కీలకంగా మారాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు, పరీక్షల నిర్వహణపై ప్రభుత్వాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.బంకీపూర్.. బీజేపీ కంచుకోటలో ఆసక్తికర పోరుబిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పటి నుంచో బీజేపీకి బలమైన స్థానం. ఇప్పటివరకు ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఖాళీ ఏర్పడింది. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ తొలుత ప్రకటించిన అభ్యర్థి అభిషేక్ కుమార్ సిన్హా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో చివరి నిమిషంలో యువ మోర్చా నేత నీరజ్ కుమార్ సిన్హాను బరిలోకి దింపింది.ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు బీజేపీపై ఒత్తిడి పెరిగిందనే సంకేతంగా ప్రచారం చేశాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ కూడా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం ఈ నియోజకవర్గంపై ఆసక్తిని పెంచింది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. కుల, మతాలకు అతీతంగా తమ అభ్యర్థికి మద్దతు లభించిందని చెబుతూ అనూహ్య ఫలితాలపై ఆశలు పెట్టుకున్నారు.దాతియా.. బీజేపీ అంతర్గత అసంతృప్తికి పరీక్షమధ్యప్రదేశ్లోని దాతియా నియోజకవర్గం కూడా బీజేపీకి కీలకంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి అనర్హత వేటుకు గురికావడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆశుతోష్ తివారీ బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఘనశ్యామ్ సింగ్ పోటీ చేశారు.అయితే ఈ ఎన్నికలో అసలు చర్చ బీజేపీ అంతర్గత రాజకీయాలపైనే సాగింది. మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు ఈ నియోజకవర్గంలో బలమైన పట్టు ఉంది. ఆయన వరుసగా మూడు సార్లు దాతియా నుంచి గెలిచారు. ఈసారి అభ్యర్థి మార్పుపై నరోత్తమ్ మిశ్రా వర్గంలో అసంతృప్తి వ్యక్తమైంది. ఆయన అనుచరులు నిరసనలు కూడా చేపట్టారు. ఈ అంతర్గత విభేదాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.మంజల్పూర్.. గుజరాత్లో బీజేపీ ఆధిపత్యానికి పరీక్షగుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గం బీజేపీకి మరో కీలక పరీక్షగా మారింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ నేత యోగేష్‌భాయ్ నరేంద్రభాయ్ పటేల్ మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. బీజేపీ తరఫున మాజీ వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ సతీష్ గోవింద్‌భాయ్ పటేల్ పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి భిఖాభాయ్ రబారీ బరిలో నిలిచారు. గుజరాత్లో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉన్నప్పటికీ.. స్థానిక అంశాలు, అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికలో కీలకంగా మారాయి.యువ ఓటర్ల తీర్పు ఏంటి?ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా అందరి దృష్టి యువ ఓటర్ల తీర్పుపైనే ఉంది. పేపర్ లీక్‌లు, పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ ఆగ్రహం ఓటింగ్‌లో ప్రతిబింబిస్తుందా? లేక సాధారణ రాజకీయ అంశాలే ఆధిపత్యం చెలాయిస్తాయా? అన్నది ఫలితాల తర్వాత స్పష్టమవుతుంది.అయితే మూడు స్థానాల ఫలితాలు ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో లేకపోయినా.. ప్రజల మూడ్, ముఖ్యంగా యువత ఆలోచనా విధానంపై ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వనున్నాయి. బీజేపీ కంచుకోటలను కాపాడుకుంటుందా? లేదంటే విద్యార్థి నిరసనల ప్రభావం ప్రతిపక్షాలకు ఊరటనిస్తుందా? మరికాసేపట్లో వెలువడే ఉప ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నాయి. -
మోదీ పెద్ద మనసు.. తనను తిట్టిన అమ్మాయికి ‘కొత్త జీవితం’ ఇచ్చిన ప్రధాని!
సాక్షి,ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఆందోళనల్లో పాల్గొన్న ఓ మైనర్ బాలిక, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సదరు బాలిక తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ పెద్ద మనసుతో తన కుమార్తెను క్షమించి, ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించారని కొనియాడారు. ఈ సందర్భంగా తన కుమార్తెపై నమోదైన జీరో ఎఫ్ఐఆర్ను పూర్తిగా ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.చేతులు జోడించి ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాను. నా కుమార్తె చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ పెద్ద మనసుతో క్షమించారు. ప్రధాని కొత్త జీవితాన్ని ప్రసాదించడంతో ఆమె మళ్లీ జన్మించినట్లైంది’అని అన్నారు.కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలో బాలిక ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గత వారం నోయిడా పోలీసులు ఆమెపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో బాలిక పేరు రుచికా సింగ్, వయస్సు 25గా పొందుపరిచారు. అయితే ఆ ఎఫ్ఐఆర్లో తన కుమార్తె వివరాలు తప్పుగా ఉన్నాయని ఆమె తల్లి మోదీకి వివరించారు.మోదీపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఒకటే అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఆమెపై తప్పుడు పేరు, వయస్సుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను తొలగించండి. అప్పుడు ఆమె ప్రశాంతంగా జీవించగలదు. ఇప్పుడు ఆమె మీ పర్యవేక్షణలో ఉంది. మైనర్ పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలనుకునే వారికి సులభ లక్ష్యాలుగా మారతారని పేర్కొంటూ, వారిపై సోషల్ మీడియాను నిషేధించాలని కూడా ఆమె ప్రధానమంత్రిని కోరారు.విద్యార్థుల నిరసనల సందర్భంగా తనపై చేసిన దూషణాత్మక నినాదాల విషయంలో, ప్రధాని మోదీ గత శుక్రవారం సంయమనం పాటించాలని, క్షమించాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో ఆయన దూషణలు ఎప్పటికీ దేనినీ పరిష్కరించవు అని పేర్కొంటూ వారిని శిక్షించడం కాకుండా సమాజం వారికి మార్గనిర్దేశం చేయాలని కోరారు.వారు తప్పుదారి పట్టిన పిల్లలు. వారికి సరైన మార్గాన్ని చూపించడం మన బాధ్యత. వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం లేదా వేధించడం వల్ల పరిస్థితులేమీ మారవు. నేను వారిని క్షమించాలనుకుంటున్నాను. సమాజం కూడా నా మాటను అంగీకరించాలని కోరుతున్నాను’ అని ఆయన అన్నారు.తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై బాలిక ప్రధానికి క్షమాపణలు చెప్పారు. నిరసన సమయంలో ఇతరుల ప్రభావంతోనే తాను ప్రధానమంత్రిని ఉద్దేశించి అసభ్య పదజాలం వాడానని ఆమె పేర్కొన్నారు. నా వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. నేను చేసిన పని క్షమించరానిది. నేను అభ్యంతరకరమైన మాటలు అన్నాను. ఇదే నా మొదటి, చివరి తప్పు. దేశం మొత్తానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నా ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు. దయచేసి నన్ను క్షమించండి’ అని ఆమె చెప్పింది. -
బీజేపీకి గుడ్‌బై.. మోదీ వీరాభిమాని ఆస్తులెంతో తెలుసా?
షెహజాద్ పూనావాలా.. బీజేపీకి పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన నిష్క్రమణ వెనుక మరిన్ని కారణాలున్నాయా? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇటీవల దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నిరసనలు, అలాగే పార్టీ వైఖరి నేపథ్యంలోనే ఆయన నిర్ణయం తీసుకున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.షెహజాద్ పూనావాలా రాజీనామా వార్తలకు ముందు ఆయన తన ఎక్స్ (X) ఖాతా బయోలో కీలక మార్పులు చేశారు. తన ప్రొఫైల్ నుంచి బీజేపీ ప్రస్తావనను తొలగించారు. అయితే అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన అభిమానాన్ని మాత్రం కొనసాగించారు. తన ఎక్స్ బయోలో మోదీకి తాను “లైఫ్ లాంగ్ ఫాలోవర్” అంటూ పేర్కొన్నారు. దీంతో పార్టీకి దూరమైనా.. మోదీ పట్ల తన గౌరవం కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది.జెన్‌జీ నిరసనల ఎఫెక్ట్‌తోనేనా?షెహజాద్ పూనావాలా నిష్క్రమణపై మరో ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది. ఇటీవల నీట్ పేపర్ లీక్, విద్యార్థుల నేతృత్వంలో జరిగిన జెన్‌జీ నిరసనలు, వాటి చుట్టూ ఏర్పడిన రాజకీయ వాతావరణం తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పూనావాలా రాజీనామాకు జెన్‌జీ నిరసనలే కారణమని ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ వర్గాలు మాత్రం ఇది వ్యక్తిగత నిర్ణయమని చెబుతున్నాయి. దీంతో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.ఎవరీ షెహజాద్ పూనావాలా?1987 అక్టోబర్ 17న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన షెహజాద్ పూనావాలా న్యాయ విద్యను అభ్యసించారు. పుణే విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన.. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్టుగా పనిచేశారు. ఆయన కుటుంబ విషయానికి వస్తే.. తండ్రి సర్ఫరాజ్ పూనావాలా, తల్లి యాస్మిన్ పూనావాలా. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ అనుకూల వాదిగా పేరున్న తహసీన్ పూనావాలా ఆయన సోదరుడు. విద్యార్థి రాజకీయాలు, పబ్లిక్ డిబేట్లలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తన న్యాయ నేపథ్యంతో వాదనలను బలంగా వినిపించే నేతగా పేరు తెచ్చుకున్నారు.కాంగ్రెస్‌లో పంచాయితీతో.. షెహజాద్ పూనావాలా తొలుత కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. ఆ తర్వాత కాంగ్రెస్‌కు దూరమయ్యారు. 2021లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులై.. దేశవ్యాప్తంగా టీవీ డిబేట్లలో బీజేపీ వాణిని బలంగా వినిపించారు.బీజేపీకి బలమైన వాయిస్.. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో షెహజాద్ పూనావాలా పలు కీలక అంశాలపై పార్టీ తరఫున స్పందించారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, రాజకీయ చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలిచాయి.ఆస్తులు ఎంత, ఆదాయ వనరులు ఏంటంటే..షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ఎలాంటి లోక్‌సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో ఎన్నికల అఫిడవిట్ రూపంలో ఆయన ఆస్తులపై అధికారిక వివరాలు అందుబాటులో లేవు. అయితే కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఆయన ఆస్తి విలువ సుమారు 70 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.65 కోట్ల వరకు) ఉండొచ్చని అంచనా. ఆదాయ వనరుల్లో న్యాయవాద వృత్తి, టీవీ చర్చలు, రాజకీయ విశ్లేషణలు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రసంగాలు వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.ఎన్నికల బరిలోకి ఎందుకు రాలేదు?రాజకీయాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ షెహజాద్ పూనావాలా ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయనకు లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల టికెట్ కూడా లభించలేదు. అయితే దీనిపై ఆయన ఎలాంటి ప్రత్యేక కారణాన్ని బహిరంగంగా వెల్లడించలేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ప్రధానంగా పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వాయిస్‌గా గుర్తింపు పొందారు. టీవీ డిబేట్లు, రాజకీయ విశ్లేషణలు, పార్టీ విధానాలపై వివరణ ఇవ్వడం వంటి బాధ్యతల్లోనే ఎక్కువగా కనిపించారు.కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే సంస్థాగత బాధ్యతలకు, మీడియా ప్రతినిధిత్వానికి ప్రాధాన్యం ఉన్న నేతలను ఆ పాత్రల్లోనే కొనసాగిస్తాయి. పూనావాలా విషయంలోనూ అదే జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా తదుపరి రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. మోదీపై తన అభిమానాన్ని కొనసాగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా బయో స్పష్టం చేస్తోంది. అయితే ఆయన నిర్ణయం వెనుక అసలు కారణాలు ఏమిటి? జెన్‌జీ నిరసనల తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఉందా? లేక పూర్తిగా వ్యక్తిగత కారణాలేనా? అన్నదానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. -
సువేందు పీఏ కేసులో బీజేపీ కార్యకర్తల అరెస్ట్!?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్‌గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్‌లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్‌యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.హత్యకు ముందే వ్యూహం?సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్‌తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు. అప్పట్లో సువేందు ఆరోపణలు.. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. -
మన వాళ్లే సార్! యూత్‌ని ఆకర్షించడానికి ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నారు!
మన వాళ్లే సార్! యూత్‌ని ఆకర్షించడానికి ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నారు! -
యువతను ఆకట్టుకునే పనిలో బీజేపీ అగ్రనేతలు!
ఫేస్బుక్, ఎక్స్, వాట్సప్‌లకు ఇక కాలం చెల్లినట్లే! రాజకీయ నేతలు మరీ ముఖ్యంగా బీజేపీ వారు ఇక ఇన్‌స్టా మార్గం పట్టనున్నారు. రీల్స్ రాజకీయమే భేషన్న ప్రధాని మాటలు వారిపై సీరియస్ ప్రభావమే చూపాయి. జెన్–జీ ప్రియ నేస్తం ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్ర మంత్రులు సహా కాషాయ పార్టీ నేతల విన్యాసాలు ఎంతమేరకు రక్తికట్టిస్తాయో చూడాలి మరి! కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుణ్యమా అని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలకు తమ రాజకీయాన్ని పండించుకునేందుకు కొత్త అస్త్రం దొరికింది. నిన్న మొన్నటివరకూ అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తమ సందేశాన్ని వినిపిస్తూ వచ్చిన కాషాయ పార్టీ నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలపై విద్యార్థుల ఆందోళనల తరువాత రూటు మార్చింది. ఇన్‌స్టాగ్రామ్‌పై తన దృష్టిని కేంద్రీకరించింది. ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇన్‌స్టా సందేశం పంపడం, జెన్–జీని ఆకట్టుకోవాలంటే ఇదే మేలి మార్గమని ఆయన స్వయంగా ప్రకటించడం ఆ పార్టీ నేతల్లో జోష్ నింపిందని చెప్పాలి. అందుకేనేమో... ఒక్కరొక్కరుగా కేంద్ర మంత్రులు కూడా రీల్స్ చేయడం మొదలుపెట్టారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత కొత్త విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి కొత్తగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఓ నాలుగు పోస్టులు పెట్టారు అందులో. ప్రస్తుతానికి ఆయనకున్న ఫాలోయర్లు కేవలం 23 మంది మాత్రమే. మోదీ సందేశం, తనను విద్యాశాఖ మంత్రిగా నియమించడం, కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్‌తో చర్చలు, ప్రశ్న పత్రాల లీకేజీ విషయమై అధికారులతో చర్చలు మాత్రమే ఆయన పోస్టులు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, సీజేపీతో చర్చలు జరిపిన బీజేపీ నేత జేపీ నడ్డా, మాజీ మంత్రి జితేంద్ర సింగ్‌లు గతంలో వారానికి నాలుగైదు పోస్టులు మాత్రమే పెడుతూంటే.. తాజాగా ప్రతిరోజు బోలెడన్ని ఇన్‌స్టా పోస్టులు పెడుతున్నారు. ఇన్‌స్టాను వాడుకోండి అన్న ప్రధాని పిలుపునకు ముందు జేపీ నడ్డా ఇన్‌స్టాపై చివరగా పోస్టు చేసింది జూలై నాలుగున. అంతకు ముందు జూన్ 27న ఒక పోస్టు చేశారు. ఇప్పుడు మాత్రం రోజూ పోస్టులే పోస్టులు! పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా కొన్ని రోజులుగా ఇన్‌స్టా వేదికగా ప్రశ్న పత్రాల లీకేజీని అరికట్టేందుకు ఉద్దేశించిన బిల్లుపై పలు పోస్టులు చేస్తున్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ అంశాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా వర్ణించిన రిజిజు చర్చకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలకు చేసిన విజ్ఞప్తులను రీల్స్‌గా పోస్ట్ చేశారు.చదవండి: నీలేకనికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఇన్‌స్టా బాట పట్టారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ ప్రభుత్వం సత్వర చర్యలకు దిగిందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హామీ ఇచ్చిందని ఆమె ఈ మధ్యే పోస్టు పెట్టారు. ఇక బీజేపీని డిజిటల్ మార్గం పట్టించిన ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మలవీయా కూడా జెన్–జీకి దగ్గరైన ఇన్స్టాగ్రామ్పైకి రాక తప్పలేదు. సీజేపీ నిరసనల్లో అసంబద్ధమైన నినాదాలు ఉన్నాయని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రశ్న పత్రాల లీకేజీలపై వారెవరూ మాట్లాడకపోవడాన్ని ప్రశ్నించారు.టాప్‌లో పీఎం... భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉన్నారు. పది కోట్ల మందికిపైగా ఫాలోయర్లు ఉండగా... సీజేపీ నిరసనల సందర్భంగా అర్ధ రాత్రి చేసిన సెల్ఫీ వీడియోతో ఫాలోయర్ల సంఖ్య సుమారు పది లక్షల మంది పెరిగారు. మూడు నెలల క్రితం భారతీయ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్‌కు 9.5 లక్షల మంది ఫాలోయర్లు ఉండగా సీజేపీ కొన్ని గంటల్లోనే ఈ సంఖ్యను దాటిపోయింది. తరువాత సీజేపీ హ్యాండిల్‌పై నిషేధం వేటు పడటం.. కోర్టు కేసుల తరువాత హ్యాండిల్ మళ్లీ దక్కడం తెలిసిన విషయమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మల్లిఖార్జున ఖర్గే Vs జేపీ నడ్డా..దద్దరిల్లిన పార్లమెంట్..
-
దేవుడి విరాళాలే కాపాడలేదు పేపర్ లీక్ ఎలా అరికడతారు..?
-
ప్రకాష్ రాజ్‌ను చేపలకు ఆహారంగా వేస్తా: బీజేపీ ఎమ్మెల్యే
ఉడుపి: ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటకలోని ఉడుపికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్పాల్ సువర్ణ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. కళాకారుల మదిలో విషబీజాలు నాటడం మానుకోవాలని, లేనిపక్షంలో అరేబియా సముద్రంలో చేపలకు ఆహారంగా మారుస్తామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి నిరసనలో ప్రకాశ్ రాజ్ పాల్గొని, కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యశ్పాల్ సువర్ణ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జంతర్‌మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనలో పాల్గొన్నవారు అసలైన విద్యార్థులు కారనీ, వారి నేపథ్యాన్ని పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు.ఇలాంటి రాజకీయాలు కొనసాగితే బీజేపీ కార్యకర్తలు తగిన రీతిలో స్పందిస్తారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ జిల్లాకు చెందిన వీ. సునీల్ కుమార్‌తో సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు 'ఇండియా' కూటమి నేతలైన రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ తదితరుల ముఖాలతో ఉన్న బొద్దింకల ప్లకార్డులపై క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం గమనార్హం.ఇది కూడా చదవండి: కంగనాకు గట్టిగా ఇచ్చిపడేసిన ప్రముఖ సింగర్! -
ఆపదలో ఆదుకున్నది కేటీఆర్ అన్న మాత్రమే
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కష్టకాలంలో తమకు అండగా నిలిచి, దేవుడిలా ఆదుకున్నది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాత్రమేనని నేరెళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులు ఆవేదనతో తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నాయకులు తమను కేవలం వాడుకున్నారే తప్ప ఎలాంటి సాయం యలేదని మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హామీలు ఇచ్చి మోసం చేసిన బీజేపీ, కాంగ్రెస్ గోపాల్ కుటుంబ సభ్యులు మాట్లాడూతూ... ‘మమ్మల్ని అందరూ రాజకీయంగా వాడుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మా వద్దకు వచ్చి హామీలు ఇచ్చి వెళ్లిపోయారే తప్ప సహాయం చేయలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మా పక్క ఊరికి (రెండు కిలోమీటర్ల దూరంలోకి) వచ్చినా కనీసం పరామర్శించలేదు. మీకు రూ. 20 కోట్లు ఇప్పిస్తా’ అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ, రూపాయి సాయం చేయలేదు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వారి పీఏలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోలేదు’ అని ఆరోపించారు. బండి సంజయ్ విజయసంకల్ప యాత్ర చేసిన సమయంలో కూడా మమ్మల్ని కనీసం పరామర్శించే ప్రయత్నం చేయలేదని తెలిపారు.కుటుంబ సభ్యుడిలా అండగానిలిచిన కేటీఆర్ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో కేటీఆర్ అన్న స్వయంగా డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేలా చూశారు. ‘నేను మీ ఇంట్లో పెద్ద అన్నలాంటివాడిని, ఆస్పత్రి ఖర్చులు, ఆర్థికసాయం ఏది కావాలన్నా నేను చూసుకుంటా’ అని ధైర్యం చెప్పారని తెలిపారు. ‘చనిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పరామర్శించిన ఏకైక నాయకుడు కేటీఆర్ మాత్రమే అని, కల్వకుంట్ల కవిత అక్క కూడా మాతో మాట్లాడి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు’ అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ కుటుంబానికి కష్ట సమయంలో నిజమైన అండగా నిలిచింది కేటీఆర్ మాత్రమేనని, అందుకే తాము ఎప్పటికీ ఆయననే నమ్ముతామని స్పష్టం చేశారు. మాట్లాడిన వారిలో గోపాల్ భార్య గంధం లావణ్య, తల్లి బాలవ్వ, కూతుళ్లు అక్షిత, నిఖిత, కొడుకు అభినయ్, తమ్ముడు గొర్రె మహేశ్ ఉన్నారు. -
కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ కౌంటర్
సాక్షి,న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కౌంటర్ ఇచ్చింది. కంగనా వ్యాఖ్యలను ఆమె పార్టీ కూడా సీరియస్‌గా తీసుకోదని సౌరవ్ దాస్ అన్నారు. నేతలు ఉపయోగించే భాష గౌరవప్రదంగా ఉండాలని కోరారు. దేశ ప్రజాస్వామ్యంపై నమ్మకం పెంచేలా జెన్‌జీ చేసింది.అంతకుముందు సీజేపీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిరసన వీడియోలు వాంతి వచ్చేలా ఉన్నాయని సోషల్ మీడియా పోస్టులో అన్నారు. కాక్రోచెస్ మాట్లాడే విధానం,వాడుతున్న భాష అసభ్యంగా ఉన్నాయి. 75ఏళ్ల ప్రధాని, ఆయన తల్లిపైనా నోరుపారేసుకున్నారు. అలా మాట్లాడే వారిని ఏ కోణంలో విద్యార్థులుగా చూడాలి’అని పోస్టులో పేర్కొంది. కంగనా చేసిన వ్యాఖ్యలపై సీజేపీ పైవిధంగా స్పందించింది. -
నన్ను అడగొద్దు.. డిలీట్ చేయను: బీజేపీ ఎంపీ కూతురి సంచలన పోస్ట్
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆయన స్వంత రాష్ట్రం ఒడిశాకే చెందిన ఓ బీజేపీ ఎంపీ కూతురు సంచలన పోస్ట్‌తో రాజకీయ దుమారం రేపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సంబురంగా ఆమె ఓ పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఆ పోస్ట్ తొలగించాలంటూ తనపై ఒత్తిడి వస్తోందంటూ ఆమె అందులో పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి కుమార్తె అర్చిత సారంగి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఓ వార్తా హెడ్డింగ్ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన అర్చిత.. ఆ తర్వాత మరో పోస్ట్ పెట్టారు. “డీపీ (ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉద్దేశించి..) పీఏ నా తల్లికి మెసేజ్ చేసి ఈ స్టోరీని డిలీట్ చేయమని అడుగుతారని తెలుసు.. కానీ నేను డిలీట్ చేయను. ఇలాంటి విషయం ఇంతకుముందు కూడా జరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. కాబట్టి అడగాల్సిన అవసరం లేదు.. నేను డిలీట్ చేయను” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. అయితే కొంత సమయం తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్ అయినట్లు సమాచారం.ఎవరీ తల్లీకూతుళ్లు?అర్చిత సారంగి తల్లి అపరాజిత సారంగి ఒడిశాకు చెందిన బీజేపీ నాయకురాలు. 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణిగా పనిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో భువనేశ్వర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. పరిపాలనా రంగంలో అనుభవం ఉన్న అపరాజిత సారంగి.. బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక అర్చిత ఎంబీఏ పూర్తి చేసుకుంది. అంతకు మించి ఆమె గురించి వివరాలేవీ నెట్టింట సమాచారం. అయితే తన కుమార్తె చేసిన పోస్ట్ విషయంలో ఆమె మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌కు మద్దతుగా స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమె సమర్థిస్తూ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత తీసుకోవడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు.Our daughter, Archita, has been selected for the MBA course at UNIVERSITY OF OXFORD. We convey our deep sense of gratitude to all our friends and well wishers.Jai Jagannath ! 🙏 pic.twitter.com/sNejUZYf6s— Aparajita Sarangi, MP,( Lok Sabha) Bhubaneswar (@AprajitaSarangi) March 9, 2024ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు?ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ అవకతవకలపై విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజులకు పైగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. చివరకు ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా సందర్భంగా ఆయన.. విద్యార్థుల ఆకాంక్షలు, భవిష్యత్తు తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.కొత్త చర్చకు కారణంమంత్రికి మద్దతుగా ఆమె తల్లి నిలబడగా.. అదే సమయంలో కుమార్తె మాత్రం రాజీనామా వార్తను షేర్ చేయడం, దాన్ని తొలగించనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. అటు అస్సాంలోనూ ఎన్డీయే కూటమి మంత్రి కేశబ్ మహంతా(అస్సాం గణ పరిషత్ పార్టీ) కూతురు దిసాబా కూడా ఇలాగే నీట్ నిరసనల్లో ధర్మేంద్ర రాజీనామా కోరుతూ నినాదాలు చేశారు. ఇలా కుటుంబంలోనే.. అదీ అధికార పార్టీలకు చెందిన వాటిలో భిన్న స్వరాలు వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. -
రాజీనామా వెనుక..మోదీ మ్యాజిక్.. BJP అసలు వ్యూహం అదేనా..
-
మోదీపై అభ్యంతకర పోస్టర్.. నటిపై ఫిర్యాదులు
కోల్‌కతా:ప్రధాని నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' పోస్టర్‌ను ప్రదర్శించారనే ఆరోపణలతో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు నమోదైంది. కోల్‌కతాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలో మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించారని నటి శ్రీలేఖపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.నిన్న (ఆదివారం) ఆనంద్‌పూర్ పోలీసు స్టేషన్లో బీజేపీ నాయకురాలు కేయా ఘోష్, నటి శ్రీలేఖ మిత్రపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే చోట కాకుండా బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌తో సహా పలు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు దాఖలైనట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ అంశమై బీజేపీ నేత మాట్లాడుతూ.. "దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్‌ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అని పేర్కొన్నారు.నిరసన ప్రదర్శన నేపథ్యంNEET ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్‌కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన/అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.అయితే దీనిపై శ్రీలేఖ మిత్ర తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియో స్టేషను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు."నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి; నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. -
ప్రభుత్వం మీ సొంత జాగీరు కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని సొంత జాగీరులా నడపొద్దని బీజేపీ–ఆర్ఎస్ఎస్లకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలకవర్గానికి ఒక హెచ్చరిక అని స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని సొంత జాగీరుగా భావిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తే ఇప్పుడు జరిగిన దానికంటే పది రెట్లు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవినీతికి మారుపేరైన ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి నుంచి తప్పుకోవడం మంచి పరిణామం అని స్పష్టంచేశారు. విద్యార్థుల నిరసనను ప్రధాని మోదీ. ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘గతానికి’, భారతదేశ భవిష్యత్తుకు మధ్య జరుగుతున్న పోరాటంగా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తు గతాన్ని ఓడిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం ఆందోళన చేసిన విద్యార్థులను క్రూరంగా హింసించారని, వారికి ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిన హింసకు, వారిపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడానికి అనుమతించినందుకు హోంశాఖ మంత్రి అమిత్ షానే ప్రత్యక్ష బాధ్యులు అని పేర్కొన్నారు. విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరపడాన్ని కాంగ్రెస్ అంగీకరించదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని ప్రకటించారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారు భారతదేశ విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుని, చెదపురుగుల మాదిరిగా దానిని లోపలి నుంచే డొల్లగా చేస్తోందని రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ చెదపురుగును తొలగించాలని తేల్చిచెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిపక్షాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను, దేశ భవిష్యత్తును కాపాడడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశ భవిష్యత్తు అయిన మన విద్యార్థుల విజయమని అన్నారు. అధికార శక్తులకు ఎదురొడ్డి నిలిచారంటూ విద్యార్థులను ప్రశంసించారు. విద్యా విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారత విద్యా వ్యవస్థపై ఆర్ఎస్ఎస్ పట్టు తొలగాలని చెప్పారు. విద్యా వ్యవస్థను సంస్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది గానీ ప్రభుత్వం ఆ పని చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతదేశ విద్యా వ్యవస్థపై నేడు దాడులు జరుగుతున్నాయని, కొందరు కబ్జా చేస్తున్నారని, ప్రైవేటీకరిస్తున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. నేటి యువత ఉద్యమం విద్యా వ్యవస్థలో అక్రమాలకు, నిరుద్యోగానికి, దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు వ్యతిరేకంగా వచ్చిన స్పందన అని వ్యాఖ్యానించారు. దేశంలో ఉద్యోగ కల్పన వ్యవస్థ, విద్యా వ్యవస్థ, సంస్థాగత వ్యవస్థలు కనుమరుగైపోయాయని, అందుకే యువత రోడ్డెక్కుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఎవరికీ వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ముమ్మాటికీ ప్రజలకు చెందినదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేదని రాహుల్ అన్నారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల భద్రత, సంస్కరణల కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులు, కార్మికులు, పేదలు, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన ప్రతి వర్గం కూడా తమ గౌరవం కోసం రాజ్యాంగబద్ధమైన మార్గంలో ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చిందని తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు జంతర్‌మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న వారిని రాహుల్ కలిశారు. విద్యార్థులపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ!
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి ఆందోళనల నడుమ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సీజేపీ విధించిన 72 గంటల డెడ్‌లైన్, యువత నుంచి పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకత.. మోదీ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసింది.నిన్న శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన రెండో విడత చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అయితే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ తేల్చిచెప్పింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకునేందుకు 72 గంటల గడువు ఇస్తున్నామని.. లేనిపక్షంలో జూలై 20 నాటి తరహాలో మరోసారి పార్లమెంట్ ముట్టడికి దిగుతామంటూ సీజేపీ హెచ్చరించింది.నడ్డా, జితేంద్ర సింగ్ తాము నాయకత్వాన్ని సంప్రదించి ప్రభుత్వ నిర్ణయాన్ని తర్వాత తెలియజేస్తామని మాత్రమే బదులిచ్చారు. విఫలమైన చర్చల అనంతరం.. నడ్డా, జితేంద్ర సింగ్‌లు పరిణామాలపై హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు వర్గాలు తెలిపాయి. తెరవెనుక చర్చలు జరుగుతుండగానే, నిరసనకారులకు గట్టి సంకేతం పంపే ప్రయత్నంగా విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి చెందిన 47 మంది అధికారులను తొలగించింది.ఎన్టీఏ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని నియమించే ప్రక్రియను కూడా ప్రారంభించారు. విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం, పేపర్ లీక్ కేసులను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం సహా పరీక్షా విధానంలో సంస్కరణలను కూడా కేంద్రం ప్రకటించింది. అయినప్పటికీ ఈ చర్యలేవీ నిరసనకారులను సంతృప్తి పరచలేకపోయాయి.శనివారం మధ్యాహ్నం కేంద్రం సీజేపీతో చర్చల ముందు.. నడ్డా, జితేంద్ర సింగ్‌లు మళ్లీ అమిత్ షాను కలిశారు. అదే సమయంలో ప్రధాన్ తన రాజీనామాను ప్రధాని మోదీకి పంపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త ప్రసారం కావడం ప్రారంభమైన తర్వాతే నడ్డా, జితేంద్ర సింగ్.. సీజేపీ ప్రతినిధులను మళ్లీ కలిశారు. మూడో విడత చర్చలు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో జరిగాయి.ఒక వైపు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనలు, మరోవైపు దేశవ్యాప్తంగా బలపడుతున్న యువత ఉద్యమం కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాయి. ఈ కేవలం రాజకీయ ఆందోళన కాకుండా భవిష్యత్ తరానికి సంబంధించిన యువ ఉద్యమం కావడంతో ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం వెనుకాడింది. శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను సమర్పించారు. ప్రధాన్ నిష్క్రమణతో సీజేపీ పట్టువీడింది. తన ఆందోళనను విరమించింది.ఆందోళనకారులపై ఎలాంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని.. నీట్ పేపర్ లీక్ ఉదంతం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నరేంద్ర మోదీ హయాంలో ప్రజా వ్యతిరేకతతో ఒక సీనియర్ మంత్రి పదవి కోల్పోవడం అత్యంత అరుదైన పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించని చాలామందిని ఇది ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వరకు తమ సీనియర్ మంత్రుల్లో ఒకరిని వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే సంకేతాలు ఏమాత్రం లేవు. అయినప్పటికీ కేవలం 24 గంటల్లోపే ప్రధాన్ రాజీనామా చేశారు. ఆందోళనకారులతో ప్రభుత్వం మళ్లీ చర్చలు ప్రారంభించింది. చర్చలు సఫలం కావడంతో సీజేపీ తన నిరసనను ముగిస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ సమయంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
ఆందోళన విరమించిన సీజేపీ
ఢిల్లీ: కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. జంతర్‌మంతర్ దగ్గర ఆందోళన విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు మరోసారి చర్చలు జరిపారు. చర్చల్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు కొనసాగాయి. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సీజేపీ తెలిపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ మొదటి డిమాండ్ నెరవేరిందని.. మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని అశుతోష్ పేర్కొన్నారు.ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చిందన్న సీజేపీ.. ఆందోళన విరమించాలని నిర్ణయించింది. జంతర్‌మంతర్ దగ్గర నుంచి విద్యార్థులు వెళ్లిపోవాలని పిలుపునిచ్చింది. విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలన్న సీజేపీ.. నాలుగు వారాల తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పేర్కొంది. సీజేపీ 3 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు ఒప్పుకుంది. త్వరలోనే పరిహారం కూడా చెల్లిస్తామని వెల్లడించింది.వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. నవభారత్‌కు ఇదొక శుభపరిణామంగా అభివర్ణించారు. యువతకు అభినందనలు తెలిపిన ఆయన.. విద్యారంగంలో సమూల మార్పులు రావాలన్నారు. విద్యార్థులు సంయమనం పాటించాలని వాంగ్‌చుక్ కోరారు. -
2018 తర్వాత, ఇలా రిజైన్ చేసిన తొలి కేంద్ర మంత్రి ఈయనే
సాక్షి,న్యూఢిల్లీ: సీజేపీ ఆందోళనల నేపథ్యంలోఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీమానా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించారు. అలాగే తన లేఖ కాపీని మంత్రి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ధర్మేంద్ర రాజీనామాకు దారితీసిన పరిస్థితులతో పాటు, 2018లో లైంగిక వేధింపుల ఆరోపణలతో అప్పటి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీనామా అంశం ఇపుడు నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు దేశ వ్యతిరేక శక్తుల చేతిలోకి వెళ్లకుండా చూడటం, జాతీయ ఐక్యతను కాపాడటం తన బాధ్యత. భారతీయ విద్యార్థుల భవిష్యత్తు సుదీర్ఘ న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు ప్రశాంతంగా తమ చదువులపై, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే గౌరవ ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించాను అని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయాంలో ఒక మంత్రి ప్రజల లేదా విపక్షాల నిరసనల కారణంగా రాజీనామా చేయడం అత్యంత అరుదైన పరిణామం. గత చరిత్రను పరిశీలిస్తే, 2018 తరువాత అప్పటి కేంద్ర సహాయ మంత్రి ఎమ్జే అక్బర్ తన పదవికి రాజీనామా చేశారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నెక్ట్స్ విద్యాశాఖ మంత్రి ఎవరు? 2018 ఎమ్జే అక్బర్మోదీ హయాంలో వివాదాలు ఎదురైనప్పటికీ మంత్రులు రాజీనామా చేయరని, ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తుందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే #MeToo ఉద్యమంలో పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలతో 2018లో కేంద్ర సహాయమంత్రిగా ఎమ్జే అక్బర్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన అక్బర్, "ఆరోపణలు వైరల్ ఫీవర్లా మారాయి" అని వ్యాఖ్యానించారు. అయితే, వ్యక్తిగత హోదాలో కోర్టులో న్యాయపోరాటం చేసేందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు.కాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమానికి, పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం జరుగుతున్న పోరాటానికి ఒక మైలురాయిగా నిలిచింది ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP), విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలకు ఈ రాజీనామా ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. -
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సీజేపీ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. ఆయన రాజీనామాతో సీజేపీ పోరాటం ఫలించింది. సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశా. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు.‘‘భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు.. వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం...జంతర్-మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించాను...నరేంద్ర మోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.pic.twitter.com/VSArqS98OJ— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026 -
NTAలో 47 మందిపై క్రిమినల్ చర్యలు... BJP సీరియస్ యాక్షన్
-
బొద్దింకలను ఏరిపారేయండి.. మాజీ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంధ్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాక్రోచ్‌లను శాశ్వతంగా అంతం చేయాలని ప్రధాని మోదీని కోరారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్ఞాఠాకూర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో .. గతంలో ఎక్కడ బొద్దింకలు కనిపించినా వాటిని చీపురుతో ఊడ్చి పారవేసేవారని, కానీ ఇప్పుడు ఆ చీపురు, బొద్దింక స్నేహితులయ్యాయయని, తద్వారా దేశవ్యాప్తంగా మురికి వ్యాపిస్తోందని అన్నారు. ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దేశ నాయకుడు ఇకపై చీపురును నమ్మకూడదు. దానికి బదులుగా, బొద్దింకలను నిర్మూలించడానికి శాశ్వత ఏర్పాట్లు చేయాలి. దేశాన్ని శుభ్రంగా ఉంచాలి’అని పేర్కొన్నారు.ఠాకూర్ గతంలోనూ తన వ్యాఖ్యల కారణంగా వివాదాల్లో చిక్కుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఠాకూర్‌కు లోక్‌సభ టికెట్ నిరాకరించింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, అశోక చక్ర గ్రహీత, మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) చీఫ్ దివంగత హేమంత్ కర్కరేను, ఠాకూర్ పురాణాల్లోని ప్రతినాయకులైన రావణుడు, కంసుడితో పోల్చారు.26/11 ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో కర్కరే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో కర్కరే తనను అన్యాయంగా ఇరికించారని.. తాను శపించడం వల్లే ఆయన చనిపోయారని’ఠాకూర్ ఆరోపించారుమాలేగావ్ పేలుళ్ల కేసులో నిర్ధోషి2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ ప్రాంతంలోని మసీదు సమీపంలో మోటర్ సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ప్రగ్యాసింగ్ ఠాకూర్‌తో సహా ఏడుగురు నిందితులను గతేడాది జూలై నెలలో నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా? చేయరా?
కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు కొలిక్కిరాలేదు.. కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన సీజేపీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతోంది. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు కేంద్రం గడువు కోరింది. ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. డిమాండ్లపై రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తామన్న సీజేపీ.. జంతర్‌మంతర్‌లో ఆందోళనలు కొనసాగుతాయని పేర్కొంది.అయితే.. ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ వర్గాల సమాచారం. సమస్యలకు రాజీనామా పరిష్కారం కాదని.. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తోందని, ఆయన రాజీనామా చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రి రాజీనామా నిర్ణయం సులభమే.. కానీ దాంతో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు స్పష్టమైన ప్రజా తీర్పు ఇచ్చారని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జనతా పార్టీ (సీజేపీ) ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను విరమించబోమని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం సమస్యల మూలాలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఒకవైపు ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా, మరోవైపు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది. -
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి దేశ వ్యాప్తంగా విద్యార్థుల చేస్తున్న ఉద్యమంలో అరాచక శక్తులు చేరాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ బండి సంజయ్ విమర్శించారు. పోలీసులు, జర్నలిస్టులపై దాడులు చేశారని, ఆ దాడిలో 118 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 24వ తేదీ) నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నుంచి మాట్లాడిన బండి సంజయ్.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పాలనలో 18 సార్లు పేపర్లు లీకేజీలు జరిగాయని, కర్ణాటక, బెంగాల్, కేరళంలో పేపర్లు లీకైతే ఎవరూ రాజీనామా చేయలేదన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయని, బీఆర్ఎస్ హయాంలో పేపర్లు లీకైతే మీరు రాజీనామాలు చేశారా? అని ప్రశ్నించారు. విద్యార్థుల చేస్తున్న ఆందోళనలో దేశ వ్యతిరేక శక్తులు వచ్చి చేరాయన్నారు. నిరసనలు చేస్తుంది విద్యార్థులైతే.. వారి చేతుల్లో రాళ్లు, రాడ్లు ఎందుకున్నాయంటూ ప్రశ్నించారు. ‘ ఈ ఆందోళనలో పార్లమెంట్‌పై దాడికి కుట్ర చేశారు. సంఘ విద్రోహలపైనే పోలీసులు లాఠీలు వాడారు. విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి విష ప్రచారం చేస్తున్నారు. యూపీఏ హయాంలో 70 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. అన్ని రాష్ట్రాల్లో పేపర్ల లీక్ ఘటనలు జరిగాయి. ఆ సమయంలో వారు రాజీనామాలు చేశారా? అని బండి సంజయ్ నిలదీశారు. -
సీజేపీతో చర్చలు.. ఆ డిమాండ్‌పై రేపటిదాకా గడువు కోరిన కేంద్రం
ఢిల్లీ: సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు ముగిశాయి. ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లకు కట్టుబడి ఉన్నామన్న సీజేపీ ప్రతినిధులు.. ఈ డిమాండ్లకు నెరవేరేవరకు ఆందోళన విరమించేదిలేదని తేల్చి చెప్పారు. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ చర్చించారు. రెండు గంటలపాటు చర్చలు కొనసాగాయి.కాన్ట్సిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ చర్చల్లో డిమాండ్ల నోట్ కేంద్ర మంత్రులకు సీజేపీ నేతలు సమర్పించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. నీట్ పేపర్ లీక్ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు, కొత్త చట్టం తీసుకువస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 3 డిమాండ్లు కేంద్ర మంత్రుల ముందు ఉంచాం.. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని కోరాం. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని సౌరవ్ దాస్ తెలిపారు.‘‘మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్‌గా ఉంది. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరాం. మరోసారి కేంద్రం చర్చలు జరుపుతాం. ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు గడువు కోరారు. రేపటిలోగా ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తారని ఆశిస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించకపోతే మరోసారి ఆందోళనకు పిలుపునివ్వాల్సి వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు’’ అని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. -
మరోసారి పరువు పోయిందిగా..!
నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8.. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై వచ్చిన ఒక వార్తా కథనం. అంటే దీని అర్థం వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ మొదటి స్థానంలో ఉంటే, ప్రస్తుతం కూటమి పాలనలో అది ఎనిమిదో ర్యాంకుకు దిగజారిందన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆధారంగానే సాధారణంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, కీలక మంత్రి లోకేష్‌లు పదేపదే ఒక మాట చెబుతున్నారు. ఏపీకి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ఒకసారి, వచ్చేశాయని మరోసారి అంటారు. అలాగే 23 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కన్నా ఏడెనిమిది శాతం అధికంగా పెట్టుబడులు వస్తున్నట్లుగా ఊదరగొడుతుంటారు. మనెవ్వరికి కనబడకుండా ఈ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయి? పరిశ్రమలు వచ్చేశాయా?ఉద్యోగాలు వచ్చేశాయా? వస్తున్నాయా? అని ఆశ్చర్యపోవడం ప్రజలకు అలవాటైపోయింది. ఇది నిజమేనేమోలే అని నమ్మేవారు కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియా ఊపిరి ఆడకుండా స్టోరీలు అల్లి వడ్డిస్తుంటాయి.నిజంగా ఏ రాష్ట్రానికి అయినా పెట్టుబడులు వస్తుంటే అంతా సంతోషిస్తారు. కాని అతి ప్రచారం చేసుకుంటే మాత్రం ఇలాంటి నెగిటివ్ విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విషయం పార్లమెంటులో కూడ వెల్లడైపోయింది. లోక్ సభలో వైఎస్సార్సీపీ నేత మిధున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఏడువేల కోట్ల లోపే అని స్పష్టం చేసింది. దీంతో కూటమి సర్కార్ పరువు మరింత దిగజారినట్లయింది.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో నెంబర్ ఒన్ స్థానంలో ఏపీ ఉందంటే దానికి కారణం ఉంది. ఆ రోజుల్లో జగన్ ఆయా పరిశ్రమలవారితో మాట్లాడినప్పుడుకాని, సదస్సులలోకాని ఒక స్పష్టమైన ప్రకటన చేసేవారు. ఏ పారిశ్రామికవేత్తకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్క పోన్ కాల్ చేస్తే వెంటనే స్పందిస్తానని భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఎంతవరకు చేస్తున్నారో తెలియదు కాని పారిశ్రిమికవేత్తలను భయపెట్టడంలో మాత్రం రెడ్‌బుక్ బాగానే పనిచేస్తోందన్న విమర్శ ఉంది.మోసకారి నటి జత్వాని కేసును తీసుకోండి. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్‌ను కూడా ఇరికించి ముగ్గురు ఐపీఎస్‌లను చంద్రబాబు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జగన్‌కు సజ్జన్ సన్నిహితంగా ఉండి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండేవారు. అలాంటి వ్యక్తిపై వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం నానా రభస చేసింది. దాని ఫలితంగా జిందాల్ ఏపీ వైపు చూడకుండా, తాము మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు గతంలో ప్రకటించారు. దీంతో ఏపీకి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పైగా పారిశ్రామిక సర్కిల్స్‌లో ఏ స్థాయిలో ప్రచారం జరిగి ఉండవచ్చో ఊహించుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆయనతో రాజీ కుదుర్చుకున్నా జరగవలసిన డామేజీ జరిగి ఉంటుంది.అంతేకాదు.. విశాఖ వంటి కీలక నగరంలో 99 పైసలకే కొన్ని పరిశ్రమలకు భూములు ఇవ్వడం కూడా ప్రభుత్వ పరువు తీసి ఉండాలి. ఏపీకి పరిశ్రమలు రావడానికి వెనుకాడుతున్నందున వీరు ఈ భూమిని ఇంత కారుచౌకగా, వేల కోట్ల లాభాలు వచ్చే కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారన్న సంకేతం కూడా నష్టం చేసిందేమో తెలియదు. పైగా కొన్ని సంస్థలకే ఇలా ఇవ్వడం సహజంగానే వ్యతిరేకత తెస్తుంది. కార్పొరేట్ సంస్థల మాటున తమకు కావల్సినవారికి కూడా కారుచౌకగా ప్రభుత్వ భూములు ధారాదత్తం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఇక ప్రభుత్వపరంగా పాలనకన్నా, ప్రతీకార రాజకీయాలకు, రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు ప్రోత్సాహం ఇస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్న భావన సర్వత్రా ఏర్పడింది.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పలు నివేదికలలో ఏపీ ర్యాంకింగ్ బాగా తగ్గిపోయింది. అదే క్రమంలో నీతి అయోగ్ ఇచ్చిన తాజా నివేదికలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఒకటి నుంచి ఎనిమిదికి పడిపోయినట్లు వెల్లడైంది. నిజంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా, వచ్చినా నీతి అయోగ్ ర్యాంక్ ఇంత దిగజారిపోవడం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వం చేస్తున్న అప్పులు కూడా అందరికి తెలిసిపోతుంటాయి. మరో వైపు జగన్ 17 మెడికల్ కాలేజీలను తెస్తే, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడితే, వాటిని ప్రైవేటువారికి కట్టబెట్టే ప్రతిపాదనలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.రామాయంపట్నం పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్‌కు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వీటికి ప్రభుత్వం నుంచి సరైన జవాబు ఉండడం లేదు. జగన్ కాలంలో రెండేళ్ల కరోనా ఉన్నా, అన్ని వాగ్దానాలు అమలు చేసినా, ఆ ప్రభుత్వ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఎంతో సీనియర్‌ను అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ప్రభుత్వం రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసేసింది. ఇక పరిశ్రమలవారి నుంచి కొందరు కూటమి ఎమ్మెల్యేలు కప్పం వసూలు చేస్తున్న వైనం కూడా ఏపీ పరువు తీస్తోంది.కడప జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి బూడిద రవాణాపై ఒక బీజేపీ ఎమ్మెల్యే, మరో టీడీపీ నేత మధ్య జరిగిన రగడ ఇంత, అంతా కాదు. స్వయంగా బీజేపీ ఎంపీనే దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మరో ఎమ్మెల్యే తనకు మామూళ్లు ఇవ్వకపోతే వారి ఉత్పత్తులు రవాణా కానివ్వబోమని బెదిరించారు. ఇలా ఒకటి కాదు. అనేక చోట్ల కూటమి ఎమ్మెల్యేలు, నేతల అరాచకాలు పెచ్చుమీరాయి. పైగా టీడీపీ కార్యకర్తలు నేరాలు చేసినా కేసులు పెట్టవద్దని ఒక మంత్రే బహిరంగంగా చెబుతున్నారు. ఈ మధ్య మహిళలపై జరుగుతున్న ఘాతుకాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. చివరికి ఒక టీడీపీ నాయకుడు ఒక మహిళను వివస్త్రను చేయడం, అతనిపై కేసు లేకుండా చేయడానికి పార్టీ నేతలు ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం తెలిసిందే. ఇక లాకప్ మరణాలు సరేసరి. పోలీస్ వ్యవస్థ ధర్మంగా పనిచేయడం లేదన్న భావన నెలకొంది.జగన్ టైమ్‌లో పలు పరిశ్రమలు వచ్చినా, రానట్లుగా, ఆయన కాలంలో తరిమేసినట్లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం ఇప్పటికీ ఆపడం లేదు. తాజాగా అమరరాజా ఎప్పుడో తెలంగాణలో మరో పరిశ్రమ పెట్టుకుంది. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరిమివేయడం వల్లే జరిగిందని చెబుతూ లోకేష్ ఆ యాజమాన్యానికి క్షమాపణ చెప్పడం పిల్ల చేష్టగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. అమరరాజా సంగతి సరే! జగన్ టైమ్‌లో అది ఎక్కడకు వెళ్లలేదు. మరి హెరిటేజ్ ప్లాంట్ విస్తరణ తెలంగాణలో ఎందుకు చేశారు? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వచ్చాయి. దీనికి చంద్రబాబు, లోకేష్‌ల నుంచి సమాధానం లేదు.రెండేళ్ల కూటమి పాలన తర్వాత ఏపీ ర్యాంకు ఎనిమిదో స్థానానికి పడిపోవడానికి జగన్ పాలనలో జరిగిన విధ్వంసమని టీడీపీ నిస్సుగ్గుగా చెబుతోంది. ఇది చిత్రంగా అనిపించదూ! నిజంగా జగన్ పాలనలో విధ్వంసం జరిగి ఉంటే అప్పుడు నెంబర్ ఒన్ ర్యాంక్ ఎలా వస్తుంది? ప్రస్తుతం అంతా సజావుగా ఉంటే ర్యాంకు ఎందుకు పతనం అవుతుంది? ఈ మాత్రం లాజిక్ లేకుండా టీడీపీ నేతలు మాట్లాడడం అంటే వారి అతి తెలివితేటల ర్యాంకింగ్ కూడా ఆ స్థాయికి దిగజారిందని అనుకోవాలా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
నీళ్లు ఎత్తాలో.. వద్దో రాష్ట్రమే తేల్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయాలో, లేదో కేంద్రం నిర్ణయించజాలదని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మరమ్మతులు అవసరమైన మేడిగడ్డ సహా ఇతర బరాజ్‌ల ద్వారా నీటిని ఎత్తిపోసే అంశం కేంద్ర పరిధిలోనిది కాదని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు గురువారం రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రఘునందర్రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేశ్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సీనియర్ నేత వకులాభరణం కృష్ణమోహన్‌లు పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర నేతలు ఎన్డీఎస్ఏ నివేదికలపై పాటిల్ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వాస్తవ పరిస్థితులను ఇప్పటికే ఎన్డీఎస్ఏ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయాలను తెలుపుతూ, అందులో ప్రస్తావించిన అంశాలను వివరించారు. బరాజ్‌లకు అవసరమైన మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యతని, ఇందులో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నట్లు తెలిసింది. రాష్ట్రం తమ యంత్రాంగంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నట్లు తెలిసింది.మరమ్మతులు, నీటి ఎత్తిపోతలపై రాష్ట్రం నుంచి ఏదైనా ప్రతిపాదన వస్తే మాత్రం తమ విభాగాల తరఫున సాంకేతిక సహాయాన్ని అందిస్తామన్నట్లు సమాచారం. ఇదే సమయంలో బరాజ్‌ల మరమ్మతుల పనులను మూడేళ్లుగా చేయకుండా రాష్ట్రం అలక్ష్యం చేశారంటూ రాష్ట్ర ఎంపీలు చెప్పినట్లు తెలుస్తోంది. బరాజ్‌ల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేస్తే.. మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం మరో తప్పిదం చేసిందనే అభిప్రాయాలు సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. గత, ప్రస్తుత ప్రభుత్వాలు తప్పుచేసి, ఆ నిందను కేంద్రంపై మోపే కుట్రలు చేస్తున్నారని ఎంపీలు చెప్పగా, అలాంటి ప్రయత్నాలను అడ్డుకొని, వాస్తవాలను ప్రజలకు తెలపాలని పాటిల్ సూచించినట్లు తెలిసింది. మరమ్మతుల్లో జాప్యం రాష్ట్రానిదే: అర్వింద్ కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం అనంతరం ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘మేడిగడ్డ బరాజ్ మరమ్మతుల జాప్యానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే కారణం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన రూ.లక్ష కో ట్లపై సమగ్ర దర్యాప్తు జరగాలి. కేసీఆర్, కేటీఆర్ దగ్గర రేవంత్ ఎంత మింగారు? ప్రాజెక్టులో దోచుకున్న దాంట్లో రాహుల్ గాందీకి ఎంత ఇచ్చారు?’అని ఆరోపించారు. ‘మంత్రి ఉత్తమ్‌కుమార్ బీఆర్ఎస్లోనూ సభ్యుడే, కాంగ్రెస్‌లో కూడా సభ్యుడు, మంత్రి. ఈయన ఆల్‌పార్టీ మెంబర్’అంటూ ఎద్దేవా చేశారు. రఘునందన్ రావు మాట్లాడుతూ... ‘పొట్టోడు, పొడుగోడు కలిసి రైతుల కడుపు కొడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ దోషులే’అని చెప్పారు.


