భారత్ దెబ్బకు పాక్ సైనికులు వణకిపోయారు.. అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ అసలు రంగు బయట పడింది. లోన లొటారం పైన పటారం అన్న చందంగా ఇన్ని రోజులు ఆపరేషన్ సిందూర్‌పై పాక్ నేతలు చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బొక్కబోర్లాపడ్డారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ సైన్యం బంకర్లలో దాక్కున్నారని ఏకంగా ఆ దేశ అధ్యక్షుడే ఒప్పుకోవడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తాజాగా ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌పై భారత్ దాడులు చేసింది. ఈ సందర్బంగా భారత్ దెబ్బకు పాకిస్తాన్ సైన్యం బంకర్లలో దాక్కున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు అండర్ గ్రౌండ్లోకి వెళ్లారు. నన్ను కూడా బంకర్లలో దాక్కోవాలని సలహా ఇచ్చారు. కానీ, నేను అలా చేయలేదు అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ ఓవరాక్షన్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌ను పాక్ సైన్యం ధీటుగా ఎదుర్కొందని భారత్ యుద్ధ విమానాలనే కూల్చివేసినట్టు వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా జర్దారీ వ్యాఖ్యలతో పాక్ నేతలు, అధికారుల గాలి తీసినట్టు అయ్యింది.#BREAKING : Pakistan President Asif Ali Zardari says the Pakistani military was hiding in bunkers during Operation Sindoor. The remarks were made at a public rally.Pakistan President Asif Ali Zardari said the military advised him to take shelter in bunkers during Operation… pic.twitter.com/f6aBOoG5Gj— upuknews (@upuknews1) December 28, 2025కాగా, పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమవుతోంది. ఆపై అధ్యక్షుడు జర్దారీ చేసిన ఈ ప్రకటన పాకిస్తాన్ బలహీనమైన స్థితిని హైలైట్ చేస్తుంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అప్పులతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక సైనిక సంసిద్ధతకు సామర్థ్యం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో, పాకిస్తాన్ సైన్యం బంకర్లలో దాక్కోవడం దాని అంతర్గత అభద్రతా భావాన్ని, ఒత్తిడిని బహిర్గతం చేసింది.భారత్ దాడులు.. ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడి చేయడంతో పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. పాక్ వైమానిక కేంద్రాలు, యుద్ధ విమానాలు సైతం ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌తో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని సాక్షాత్తూ పాకిస్తాన్ సైన్యమే చెబుతోంది. భారత సైన్యం సత్తా ఏమిటో పొరుగు దేశానికి తెలిసొచ్చింది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సరిహద్దు అయిన నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కీలక ప్రాంతాల్లో కౌంటర్–డ్రోన్ వ్యవస్థలను మోహరించింది. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడితే సిందూర్ మళ్లీ ప్రారంభమవుతుందని భారత ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. అందుకే ఆపరేషన్ సిందూర్ 2.0 భయం పాకిస్తాన్‌ను వెంటాడుతోంది.
ఇంటి చిట్కాలకు మించి ఆలోచిద్దాం: హెయిర్ ఫాల్‌కి అసలైన పరిష్కారం ఏది?
కోల్‌కాతాకు చెందిన యానీ(28), ఢిల్లీకి చెందిన భావన(40) లకు, ఈ చిన్న చిన్న మార్పులే పెద్ద ఆందోళనగా మారాయి. వీరి కథ, ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలడం వల్ల ఇబ్బంది పడుతున్న ఎంతోమంది భారతీయ మహిళల కథ లాంటిదే.పోషకాహార లోపం, స్ట్రెస్ (stress), హార్మోన్ల మార్పుల వల్ల సిటీల్లో ఉండేవాళ్లకు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువవుతోందని డెర్మటాలజీ స్టడీస్ చెబుతున్నాయి. అందరిలాగే వీళ్ళు కూడా మొదట్లో ఇంటి చిట్కాలు, రకరకాల నూనెలు వాడి చూసారు. కానీ చివరికి క్లినికల్ ట్రీట్మెంట్ (clinical treatment) అవసరమని తెలుసుకున్నారు.ఇంటి చిట్కాలు పనిచేయకపోతే?యానీ, భావన ఇద్దరూ హెయిర్ ఫాల్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు.షాంపూ చేసుకున్నప్పుడు చేతి నిండా జుట్టు రావడం యానీకి గుర్తుంది. ''చేతిలో అంత జుట్టు చూసి నాకు భయమేసింది. అసలు ఏం జరుగుతోంది? నెక్స్ట్ ఏం చెయ్యాలి? అనిపించింది. ఆన్లైన్లో దొరికిన ప్రతి కిచెన్ రెమెడీ (kitchen remedy) ట్రై చేశాను. కానీ ఏదీ పనిచెయ్యలేదు. అవి ట్రీట్మెంట్ కోసం చేసినవి కాదు, జనరల్ చిట్కాలు మాత్రమే" అని అన్నారు.భావన కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లోనే ఉండేవారు. తల స్నానం చేసాక దువ్వెన నిండా జుట్టు వచ్చేది. కరివేపాకు, ఉల్లిపాయ రసం.. అన్నీ ట్రై చేశాను, కానీ లాభం లేకపోయింది. ఏ హెయిర్ సీరమ్ (hair serum) వాడాలో తెలియక దాదాపు ఒక నెల రోజులు అయోమయంలో ఉన్నానని ఆమె చెప్పారు.వీరి అనుభవం డాక్టర్లు చెప్పేదాన్ని నిజం చేస్తోంది: ఇంటి చిట్కాలు సేఫ్‌గా అనిపించినా, అవి దీర్ఘకాలిక హెయిర్ ఫాల్‌ను తగ్గించలేవు.సైన్స్ వైపు మలుపువీళ్లు తీసుకున్న నిర్ణయం ఒక్క రోజులో జరిగింది కాదు. నెలల తరబడి ఇంటి వైద్యం, డాక్టర్ల చుట్టూ తిరిగి విసిగిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయం. యానీ స్వయంగా ఫార్మాస్యూటికల్ సొల్యూషన్స్ గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఆమెకు ఆన్లైన్లో Bontress గురించి తెలిసింది."నేను ఒక మంచి ఫార్మా కంపెనీ ప్రొడక్ట్ కోసం వెతుకుతున్నాను. ఏదో పేరుకు కాకుండా.. నిజంగా ట్రీట్మెంట్ కోసం పనిచేసేది కావాలి." ఆమె అందులోని ఇంగ్రీడియంట్స్ (ingredients) చెక్ చేసి, గూగుల్‌లో రివ్యూస్ చదివిన తర్వాతే డిసైడ్ అయ్యాను'' అని యానీ చెప్పారు.భావనకు, ఆమె కజిన్ Bontress Pro+ గురించి చెప్పారు. జుట్టు పెరగడానికి ఇందులో సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. Nykaaలో రివ్యూస్ చూసాక ఆమె నమ్మకం ఇంకా బలపడింది. చాలామంది తమకు 'బేబీ హెయిర్' (baby hair) వస్తోందని, హెయిర్ ఫాల్ తగ్గిందని రాశారు. అది చూశాక నాకు నమ్మకం వచ్చింది" అని భావన అన్నారు.మార్పు నిశ్శబ్దంగా వచ్చినప్పుడుఇద్దరూ అద్భుతాలు జరుగుతాయని ఆశించలేదు. హెయిర్ ఫాల్ తగ్గడానికి 6-8 వారాలు, కొత్త జుట్టు రావడానికి కనీసం 3 నెలలు పడుతుందని సైన్స్ చెబుతోంది.యానీకి, నుదుటి దగ్గర సన్నని కొత్త వెంట్రుకలు రావడం కనిపించింది. మా అమ్మ నన్ను చూసి, 'నీకు చాలా బేబీ హెయిర్స్ వస్తున్నాయే' అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది నిజంగా పనిచేస్తోందని. ఆమె ప్రతి రాత్రి క్రమం తప్పకుండా (without fail) Bontress వాడారు.భావన ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఉంది. ''ఒకటిన్నర నెల తర్వాత, నాకు బేబీ హెయిర్ కనిపించింది. కానీ నాకు డౌట్ వచ్చింది. సో, పార్లర్‌కు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని చెక్ చేయమన్నాను. తను 'అవును మేడమ్, చిన్న వెంట్రుకలు వస్తున్నాయి'' అని చెప్పింది. అది వినగానే చాలా హ్యాపీగా అనిపించింది." దువ్వెనలో జుట్టు రావడం కూడా తగ్గిందని ఆమె గమనించారు.చిత్రం: Bontress Pro+తో భావన జుట్టు పెరుగుదల ప్రయాణంఎవరూ మాట్లాడని ఎమోషనల్ మార్పుజుట్టు పెరగడమే కాదు, ఇద్దరూ మానసికంగా కూడా చాలా రిలీఫ్ ఫీలయ్యారు. రిజల్ట్ రాకముందు పడ్డ టెన్షన్ గురించి.. ''ఇది పనిచేయడం మొదలుపెట్టాకే నేను ప్రశాంతంగా నిద్రపోగలిగాను. అంతకు ముందు వరకు చాలా కంగారుగా ఉండేది'' అని యానీ చెప్పారు.ఏ సీరమ్ కొనాలన్నా భావనకు మొదట్లో భయంగా ఉండేదట. "ఇవి చాలా కాస్ట్లీ (costly). డబ్బులు ఖర్చు పెట్టి రిజల్ట్ రాకపోతే బాధేస్తుంది కదా. Bontress వాడేటప్పుడు కూడా ఇది పనిచేస్తుందా లేదా అని డౌట్ ఉండేది. కానీ మార్పు కనిపించాక చాలా రిలీఫ్‌గా అనిపించింది'' అని అన్నారు.హెయిర్ ఫాల్ వల్ల ఆడవాళ్లు ఎంత ఎమోషనల్ స్ట్రెస్ ఫీలవుతారో వీరి కథలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా చిట్కాలను పక్కన పెట్టి, Bontress లాంటి క్లినికల్ సొల్యూషన్స్ వైపు వస్తున్నారు. యానీ చెప్పినట్టు: ట్రీట్మెంట్ అన్నాక టైమ్ పడుతుంది. మ్యాజిక్ లాగా జరగదు. కానీ ట్రీట్మెంట్ కోసం చేసిన ప్రొడక్ట్ అయితే కచ్చితంగా పనిచేస్తుంది. భావన కూడా.. టెన్షన్ పడకండి. సైన్స్ ప్రకారం పనిచేసే ప్రొడక్ట్ ఎంచుకోండని అన్నారు.
నకిలీ ఆరోగ్య ఉత్పత్తులతో జాగ్రత్త
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
ఆ గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం..!
ఇంతవరకు అధిక జనాభా అన్న మాటలే విన్నాం. భారత్, చైనా దేశాలు అనగానే అధిక జనాభానే గుర్తుకొస్తుంది. అత్యధిక జనాభా కలిగిన దేశాలు అంటే ఠక్కున గుర్తొచ్చేవి ఇవే. కానీ జనాభా తగ్గిపోయినా..ఒక్కసారిగా సంతానం కనుమరుగైతే పరిస్థితి ఎంత హృదయవిదారకంగా, ఘోరంగా ఉంటుంది అనేందుకు ఈ గ్రామమే ఉదాహరణ. ఏమైందో గానీ ఒక్కసారిగా ఆ దేశంలోని గ్రామం జనాభా కుంటుపడిపోయింది..అనూహ్యంగా వృద్ధుల జనాభా పెరుగుతోంది..పాఠశాలలకు వెళ్లే చిన్నారులు లేక మూతపడేపరిస్థితికి వచ్చేశాయ్. కారణం తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఇంతకీ ఈ దారుణమైన పరిస్థితి ఎక్కడంటే..ఇటలీలోని పర్వత గ్రామమైన పగ్లియారా డీ చిన్నగ్రామమైనప్పటికీ అక్కడ నెలకొన్న పరిస్థితి ఇటలీ అంతటా ఉన్న పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. అక్కడ పాఠశాలలు ఖాళీగా దర్శనమిస్తాయి. కేవలం వృద్ధ జనాభానే అధికంగా కనిపిస్తుంది. అక్కడి గ్రామాలు, పట్టణాలు మనుషులు సందడి లేక వెలవెలబోయాయి. అక్కడ ఎటుచూసినా యథేచ్ఛగా తిరుగుతున్న పిల్లులు దర్శనమిస్తుంటాయి. నిజానికి ఆ గ్రామంలో దశాబ్దాలుగా జనాభా క్షీణతతో నిశబ్దం అలుముకుంది. ఆ నిశబ్దాబ్న్ని చేధిస్తున్నట్టుగా సుమారు 30 ఏళ్ల తర్వా తొలి బిడ్డ జననం..ఒక్కసారిగా ఆ గ్రామాన్ని ఆనందకేళి ముంచెత్తింది. ప్రస్తుతం ఆ చిన్నారి రాకతో ఆ గ్రామ జనాభా 20కి చేరిందట. ఆ చిన్నారి పేరు లారా బుస్సీ ట్రాబుకో. ఆమెను చూసేందుకు చుట్టపక్కల గ్రామాలతో సహ, ఇంతవరకు ఈ పగ్లియారా డీ అనే గ్రామం పేరు వినని వాళ్లు సైతం ఇక్కడకు తరలి రావడం విశేషం. అక్కడ ప్రసవాలు అరుదు కావడంతో లారా ప్రధాన ఆకర్షణగా మారింది. లారా తల్లి సిన్జియా ట్రాబుకో..తన కూతురు జననంతో మా ఊరి పేరు కూడా వార్తల్లో నిలిచిందంటూ మురిసిపోయింది. కేవలం తొమ్మిదినెలలు వయసుకే ఎంత ఫేమస్ అయ్యిందో అంటూ కూతురుని చూసి తడిసి ముద్దవుతోంది ఆ తల్లి. ఇక్కడ ఆ చిన్నారి లారా జననం అక్కడ వారిందరిలో ఆనందాన్నినింపినప్పటికీ..ఈ ఘటన ఒకరకంగా ఆక్కడ ఉన్న తీవ్రమైన జనాభా సమస్యను హైలెట్ చేసింది. జాతీయ గణాంకాల ప్రకారం..2024లో అక్కడ జననాల సంఖ్య మూడు లక్షలకు పడిపోయింది. గత 16 ఏళ్లుగా పరిస్థితి అలానే కొనసాగుతోంది. అక్కడ సంతానోత్పత్తి రేటు కూడా రికార్డు స్థాయిలో కనిష్టానికి చేరుకుంది, అలాగే మహిళలు సగటున కేవలం 1.18 మంది పిల్లలను మాత్రమే కంటున్నారు. కారణాలు..సరైన ఉద్యోగం లేకపోవడం, యువత విదేశాలకు వెళ్లడం, ఉద్యోగం చేసే తల్లులకు మద్ధతు లేకపోవడం..దీనికి తోడు పురుషలలో వంధ్యత్వం సమస్యలు అధికంగా ఉండటం, కొందరు జంటలు పిల్లలను వద్దనుకోవడం తదితర కారణాల రీత్యా జనాభా క్షీణిస్తుండటం మొదలైంది. 2025 నాటి జననాల సంఖ్య మరింత దారుణంగా పడిపోతూ వచ్చింది. ఇది ఒక్క పాగ్లియారా డీ మార్సిలో కనిపిస్తున్న పరిస్థితి కాదు..మొత్తం ఇటలీలోనే ఇదే పరిస్థితి. ఇది ప్రభుత్వ సేవలు, ఆర్థివ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోందట. జనాభా క్షీణించినా కూడా .. పరిస్థితి ఇంత అధ్వానన్నంగా ఉంటుందా అని అనిపిస్తోంది కదూ..!.(చదవండి: 'వర్క్–లైఫ్'లలో ఏది ముఖ్యం? జెన్-జడ్ యువతరం ఏం అంటుందంటే..)
దేశానికి గర్వకారణం 2025: ప్రధాని మోదీ
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
'శంబాల' బిగ్‌ప్లాన్.. వర్కౌట్ అయితే 'ఆది'కి ఫుల్ డిమాండ్
చలికి వణికి.. ప్రాణం విడిచి
సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
రెనో కారు.. ఇక మరింత రేటు
మ్యూజిక్ డైరెక్టర్‌కు జోడీగా నటి 'కయదు లోహర్'
బాబూ.. సీఎం పోస్టు పీపీపీకి ఇచ్చేయండి: పేర్ని నాని
చిన్న అపార్ట్మెంట్.. ఇరుకు ఇళ్లకు ఇలాంటి డోర్లే బెస్ట్!
క్యాచ్ పట్టాడు.. కోటీశ్వరుడు అయ్యాడు! వీడియో వైరల్
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'దేవర' నటి
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
రాజ్‌తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
దేశానికి గర్వకారణం 2025: ప్రధాని మోదీ
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ది రాజా సాబ్ డైెరెక్టర్ కూతురు.. వీడియో వైరల్!
'శంబాల' బిగ్‌ప్లాన్.. వర్కౌట్ అయితే 'ఆది'కి ఫుల్ డిమాండ్
చలికి వణికి.. ప్రాణం విడిచి
సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
రెనో కారు.. ఇక మరింత రేటు
మ్యూజిక్ డైరెక్టర్‌కు జోడీగా నటి 'కయదు లోహర్'
బాబూ.. సీఎం పోస్టు పీపీపీకి ఇచ్చేయండి: పేర్ని నాని
చిన్న అపార్ట్మెంట్.. ఇరుకు ఇళ్లకు ఇలాంటి డోర్లే బెస్ట్!
క్యాచ్ పట్టాడు.. కోటీశ్వరుడు అయ్యాడు! వీడియో వైరల్
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
హరీ.. హరా..! సర్కారు వైఫల్యానికి ని‘దర్శనం’
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
రెండో బిడ్డకు జన్మనిచ్చిన 'దేవర' నటి
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్
వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
అర్ధరాత్రితో మారిపోయే ఆధార్ రూల్స్..
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ రికార్డు బద్దలు
రాజ్‌తో పెళ్లి తర్వాత తొలి క్రిస్మస్.. ఫోటోలు పంచుకున్న సమంత..!
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
శుభ్‌మన్ గిల్ కీలక నిర్ణయం..!
ఫొటోలు
అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ సందడి.. ఫోటోలు
బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)
చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ కర్ణ్ శర్మ (ఫొటోలు)
హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)
తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)
తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)
విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)
సినిమా
మారిపోయిన ప్రభాస్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
ప్రభాస్.. పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఫ్లాపు సినిమాలకు కూడా వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటి హీరో బయటకు వస్తే ఎంత హడావుడి చేయాలి? కానీ ప్రభాస్ చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్ హీరో అనే బిల్డప్ ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించదు. తన సినిమాల గురించి కూడా పెద్దగా గొప్పలు చెప్పుకోడు. సినిమా ఈవెంట్లో ఇచ్చే స్పీచులు కూడా ఒకటి, రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ ‘ది రాజాసాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో కొత్త ప్రభాస్ కనిపించాడు. ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువ సేపు స్పీచ్ ఇచ్చాడు.అందుకే పిలకరాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ దాదాపు 10 నిమిషాల వరకు మాట్లాడితే..అందులో ఎక్కువసేపు ఫ్యాన్స్ ప్రస్తావనే తెచ్చాడు. అభిమానుల కోసమే ది రాజాసాబ్ సినిమా చేశామని చెప్పాడు. అంతేకాదు ‘మీ కోసమే పిలక వేసుకొని వచ్చా’ అంటూ తన పిలక చూపించి..నవ్వించాడు. ఇక ఆయన స్పీచ్ మధ్యలో ఫ్యాన్స్ అంతా ‘బాహుబలి జయహో’ అంటుంటే.. ‘నా స్పీచ్ బోరింగ్‌గా ఉంటుందని మీరు అలా అంటున్నారు కదా.. ఏదో ఒకరోజు స్టేజ్‌పై ఎంటర్టైన్ చేస్తా..మీరంతా షాకైపోతారు’ అంటూ చిన్నపిల్లాడిలా ప్రభాస్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక తన పెళ్లిపై కూడా ఆయన ఫన్నీగా స్పందించారు. ‘ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?’ అని సుమ ప్రశ్నించగా.. ‘అది తెలియకనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు’ అంటూ నవ్వేశాడు. ఫ్యాన్స్: ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..?హీరో ప్రభాస్: అది తెలియకే ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు pic.twitter.com/VI5FzMAvFc— PulseNewsBreaking (@pulsenewsbreak) December 27, 2025ఇక సూట్లో వచ్చిన తమన్‌పై కూడా ప్రభాస్ పంచులు వేశాడు. ‘అంత ధైర్యం ఏంటి డార్లింగ్. సీరియస్‌గా చెబుతున్నా.. నేను కూడా ఇలా సూట్ వేసుకోని రావాలని అన్నీ రెడీ చేసుకుంటా. కబోర్డులో దాదాపు 200 వరకు డ్రెస్సులు ఉంటాయి. బాగా రెడీ అయి రావాలనుకుంటాను. కానీ ఓవర్‌గా ఉంటుందిలే అనుకొని సింపుల్‌గా వచ్చేస్తా. తమన్ లాంటి ధైర్యం నాకెప్పుడు వస్తుందో’ అని చెప్పడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఫుల్‌గా నవ్వేశారు. ఆ ఒక్క మాటతో..ప్రభాస్ ఎప్పుడూ తన సినిమాల గురించి డబ్బా కొట్టుకోరు. ‘మా సినిమా అదిరిపోయింది..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా’ అని ఎక్కడా చెప్పలేడు. కామ్‌గా సినిమా చేసుకొని పోతాడు.హిట్ అయినా, ఫ్లాప్ అయినా పెద్దగా మాట్లాడడు. ఈ సారి కూడా అలానే మాట్లాడారు. ‘ఈ పండక్కి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వాలి. అందులో మాది కూడా ఉంటే బాగుంటుంది’ అని మాత్రమే అన్నాడు. ఈ ఒక్క మాట చాలు.. మిగిలిన సినిమాలకు ప్రభాస్ ఎంత గౌరవం ఇస్తున్నాడో చెప్పడానికి. అంతేకాదు సీనియర్ హీరోలను కూడా ఆయన ఎంతో గౌరవిస్తాడు. ‘సీనియర్లు సీనియర్లే. వాళ్ల నుంచి మేమంతా నేర్చుకొన్నాం. వాళ్ల సినిమాలు బాగా ఆడాలి’ అంటూ సంక్రాంతి పోటీలో ఉన్న చిరంజీవి, రవితేజ లాంటి సీనియర్ హీరోలకు తన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాడంతే.. ఆయన సీనియర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక మారుతి ఎమోషల్ అయితే..దగ్గరకు వచ్చి ఓదార్చడమే కాదు.. `మూడేళ్ల కష్టం కన్నీళ్ల రూపంలో వచ్చింది` అంటూ తనదైన శైలీలో కవర్ చేశాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ.. ‘డార్లింగ్ పెన్నుతో రాశావా… మిషన్ గన్నుతో రాశావా’ అంటూ మారుతిపై ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు. They Call him 'Lottery Star' 💔#prabhas #RajaSaab pic.twitter.com/hS3uvAO2ao— Naa_istam 🚩 (@Grookk12) December 28, 2025మొత్తంగా ప్రభాస్ ఎప్పుడూ లేని విధంగా చాలా హుషారుగా, సరదాగా ఎక్కువ స్పీచ్ ఇచ్చాడు. తమ అభిమాన హీరో ఇలా ఓపెన్‌గా మాట్లాడడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
'మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి.. అంతే కానీ'.. శివాజీకి టాలీవుడ్ నిర్మాత కౌంటర్
టాలీవుడ్ నటుడు శివాజీ వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హీరోయిన్ల డ్రెస్సులను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ యావత్ మహిళా లోకం ఒక్కసారిగా విరుచుకుపడింది. సినీతారలతో పాటు సామాన్యులు సైతం శివాజీపై విమర్శలు చేశారు. ఇటీవల దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై వల్గర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత తాను ఆ రెండు పదాలు మాత్రమే వాడకుండా ఉండాల్సిందని సారీ చెబుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఇటీవల శివాజీ కామెంట్స్‌పై కేవలం మహిళలు మాత్రమే కాదు.. నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ రాం గోపాల్ వర్మ, నటుడు ప్రకాశ్ రాజ్ శివాజీ కామెంట్స్‌పై స్పందించారు. అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు.తాజాగా శివాజీ కామెంట్స్‌పై నిర్మాత ఎస్కేఎన్ తనదైన స్టైల్లో పంచ్‌లు వేశారు. పతంగ్ మూవీ సక్సెస్ మీట్‌కు హాజరైన ఎస్కేఎన్ హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడారు. అక్కడే హీరోయిన్ను చూసి మామూలు డ్రెస్ వేసుకొచ్చారేంటి?..మన తెలుగు అమ్మాయి కాస్తా గ్లామర్‌గా రావాల్సిందన్నారు. మన తెలుగు హీరోయిన్స్, తెలుగమ్మాయిలు మీకు ఏ డ్రెస్ కంఫర్ట్‌గా ఉంటే అదే వేసుకోండి.. ఏది కాన్ఫిడెంట్‌గా అదే వేసుకోండని అన్నారు. ఏ బట్టల సత్తిగాడి మాటలు వినాల్సిన పని లేదన్నారు. ఏం జరిగినా మన మనసు మంచిదైతే బాగుంటామని.. మన ఇంటెన్షన్ బాగుంటే అంతా మంచే జరుగుతుంది.. అంతే తప్ప మన డ్రెస్సుల్లో ఉండదని పరోక్షంగా శివాజీకి కౌంటరిచ్చారు ఎస్కేఎన్. #Counterఎ డ్రెస్ కంఫర్ట్ గా ఉంటె వేసుకోండి ఎ డ్రెస్ కాన్ఫిడెంట్ గా ఉంటే వేసుకోండి. ఎ బట్టల సతి గాడి మాట వినకండి!!- #SKN @ #Patang Event pic.twitter.com/ye0Knl85uQ— Telugu Bit (@Telugubit) December 27, 2025
చిన్న సినిమాకు టాలీవుడ్ హీరో సపోర్ట్.. ఉచితంగా టికెట్స్..!
ఇటీవల క్రిస్మస్ సందర్భంగా చిన్న సినిమాలన్నీ సందడి చేశాయి. శ్రీకాంత్ తనయుడి ఛాంపియన్, ఆది సాయికుమార్ శంబాల చిత్రాలపై కాస్తా బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. వీటితో బ్యాడ్ గాళ్స్, ఈషా, దండోరా లాంటి చిత్రాలొచ్చాయి. వీటి గురించి ప్రమోషన్స్ చేయడంఅయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మరో మూవీ పతంగ్. ఎలాంటి ప్రచారం చేయకపోయినా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. కేవలం మౌత్ టాక్‌తోనే పతంగ్ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మద్దతుగా నిలిచారు. ఈ మూవీ చూసే వారికోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతంగ్ చూసేందుకు తానే స్వయంగా 500 టిక్కెట్లను ఉచితంగా ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ ఆఫర్‌తో పతంగ్ చూసే అభిమానుల సంఖ్య మరింత పెరగనుంది. చిన్న సినిమా కోసం సందీప్ కిషన్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. Giving away 500 tickets for #Patang the film,with love for this Adorable/Passionate Team 🧿@PranavKaushikk @VPujit @Preethipagadal @praneethdirects Hearing Fab Things about the film..Please go check it out in Theatres now ♥️For tickets : pls contact @adithyamerugu pic.twitter.com/EbmBbRbAtI— Sundeep Kishan (@sundeepkishan) December 27, 2025
స్పిరిట్ డైరెక్టర్‌కు క్రేజీ ట్యాగ్ ఇచ్చిన రెబల్ స్టార్.. రాజమౌళికి కూడా!
రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చే ఏడాది సంక్రాంతికి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ది రాజాసాబ్తో రెడీ అయిపోయారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ఈ హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌పై అంచనాలు పెంచేశాయి. ఈ సందర్భంగా ది రాజాసాబ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరిగింది.ఈవెంట్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ స్టైలిష్‌గా కనిపించారు. ఈ సందర్భంగా ది రాజాసాబ్ టాలీవుడ్ డైరెక్టర్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన పనిచేసిన వారిపై అభిప్రాయాన్ని పంచుకున్నారు. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిచ్చారు. మీతో పని చేసిన దర్శకుల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏమంటారు? అని సుమ ప్రశ్నించింది.దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. నాగ్ అశ్విన్‌కు స్ట్రాంగ్ అని.. ప్రశాంత్ నీల్‌కు బ్యూటీఫుల్ పర్సన్‌గా.. ఎస్ఎస్ రాజమౌళిని జీనియర్ గారు..మారుతి అయితే క్యూట్ అని అన్నారు. అలాగే హనురాఘవపూడి వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని.. సుజీత్ ఫుల్ స్మార్ట్ అని.. పూరి జగన్నాధ్‌ను జీనియస్‌గా అభివర్ణించారు. ఇక యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను కల్ట్ అంటూ తన మనసులోని మాటను చెప్పేశారు. కాగా.. ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డివంగాతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి స్పిరిట్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రీ కనిపించనుంది. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
క్రీడలు
సన్‌రైజర్స్ శుభారంభం..
దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025-26 సీజన్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘనంగా ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం బోలాండ్ పార్క్ వేదికగా పార్ల్ రాయల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 137 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్.. 11.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే కుప్పకూలింది.సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి పార్ల్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. ఒక్కరంటే ఒక్కరు పట్టుమని పది నిమిషాల కూడా క్రీజులో నిలవలేకపోయారు. మొత్తం తొమ్మిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్ మిల్లర్(7) కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సన్‌రైజర్స్ స్పీడ్ స్టార్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ఆడమ్ మిల్నే, తరిందు రత్నాయకే తలా రెండు వికెట్లు సాధించారు.హెర్మన్ హాఫ్ సెంచరీ..అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జోర్డాన్ హెర్మన్(5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్వింటన్ డికాక్(42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.పార్ల్ రాయల్స్ చెత్త రికార్డు..ఈ మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌటైన పార్ల్ రాయల్స్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా రాయల్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ప్రిటోరియా క్యాపిటల్స్(52) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ప్రిటోరియాను రాయల్స్ అధిగమించింది.చదవండి: వరల్డ్‌కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు.. ఎవరీ ఆరోన్ జార్జ్?
వరల్డ్‌కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు.. ఎవరీ ఆరోన్ జార్జ్?
అండర్-19 ప్రపంచకప్ 2026కు భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు ఆయుశ్ మాత్రే సారథ్యం వహించనుండగా... విహాన్ మల్హోత్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే, నమీబియా వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు భారత యువ జట్టు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ మాత్రే, మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యాడు. దీంతో మాత్రే స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జట్టు బాధ్యతలను చేపట్టనున్నాడు.కాగా వరల్డ్‌కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్‌కు చోటు దక్కింది. ఆసియాకప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో ప్రపంచకప్ జట్టులోనూ సెలక్టర్లు కొనసాగించారు. సౌతాఫ్రికా పర్యటనలో సూర్యవంశీకి డిప్యూటీగా జార్జ్ వ్యవహరించాడు. దీంతో జార్జ్ గురుంచి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.ఎవరీ ఆరోన్ జార్జ్..?19 ఏళ్ల ఆరోన్ జార్జ్ పుట్టింది కేరళలో అయినప్పటికీ.. జానియర్ స్దాయి క్రికెట్లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జార్జ్‌కు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మిడిలార్డర్ ఆటగాడికి పరిస్థితులకు తగ్గట్టు ఆడే సత్తా ఉంది. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉందంటే అందరి చూపు జార్జ్‌పైనే ఉంటుంది.అతడి బ్యాటింగ్ శైలి టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను పోలి ఉంటుంది. అదేవిధంగా అతడికి మంచి కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. దాదాపు 38 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా హైదరాబాద్‌కు వినూ మాన్కడ్ ట్రోఫీని ఆరోన్ అందించాడు. విజయ్ మర్చంట్ ట్రోఫీ( 2022-23)లో బీహార్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించి తొలిసారిగా అందరి దృష్టిని జార్జ్ ఆకర్షించాడు. గత రెండు సీజన్లలో కలిపి 700 పైగా పరుగులు చేసి హైదబాద్ జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా గత నెలలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన అండర్-19 ట్రై-సిరీస్‌లో ఇండియా-బి జట్టుకు కెప్టెన్‌గా కూడా అతడు వ్యవహరించాడు.ఆసియాకప్ 2025లోనూ పాకిస్తాన్‌పై 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఐపీఎల్-2026 వేలంలో మాత్రం జార్జ్ అమ్ముడుపోలేదు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఒకవేళ ఎవరైనా గాయపడితే జార్జ్‌ను ప్రత్నమ్నాయంగా తీసుకునే అవకాశముంది. సీఎస్కే తరపున దుమ్ములేపుతున్న మాత్రే కూడా అలా వచ్చినవాడే.అండర్–19 వరల్డ్‌కప్‌నకు భారత జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు, హర్వర్దన్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్. దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత అండర్–19 జట్టు: వైభవ్ సూర్యవంశీ (కెపె్టన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెపె్టన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుండు, హర్వర్దన్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్.
సౌరవ్ గంగూలీకు భారీ షాక్.. తొలి మ్యాచ్‌లోనే?
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. హెడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ఓటమితో ఆరంభించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ప్రిటోరియా క్యాపిటల్స్ పరాజయం పాలైంది.మొదట బ్యాటింగ్ చేసిన జోబర్గ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(2) విఫలమైనప్పటికి రైలీ రూసో (48), వియాన్ ముల్డర్ (43) కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతో సూపర్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.ప్రిటోరియా బౌలర్లలో టైమల్ మిల్స్, కోడి యూసుఫ్ తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా జట్టుకు ఓపెనర్లు విల్ స్మీడ్ (34), బ్రైస్ పార్సన్స్ (41) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.ఒక దశలో 71/1తో పటిష్టంగా ఉన్నప్పటికీ.. ప్రిటోరియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రిటోరియా లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ కింగ్స్ బౌలర్లలో డువాన్ జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ రెండు వికెట్లు సాధించాడు.కాగా గంగూలీ ఓ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండడం ఇదే తొలిసారి. ప్రధాన కోచ్‌గా అరంగేట్రంలోనే ఓటమి ఎదురైంది. దాదా గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, దుబాయ్ క్యాపిటల్స్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించారు. ప్రిటోరియా క్యాపిటల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమనార్హం.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..
మాస్టర్ అథ్లెట్ దివ్యారెడ్డికి బెస్ట్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
కరీంనగర్ స్పోర్ట్స్: కరీంనగర్లో జరుగుతున్న 12వ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో భాగంగా బెస్ట్ మాస్టర్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మేడ్చల్ జిల్లాకు చెందిన మాస్టర్ అథ్లెట్, సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డి అందుకున్నారు. స్థానిక అంబేడ్కర్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ చాంపియన్ పోటీల్లో 45ఏళ్ల విభాగంలో 800 మీటర్ల రన్నింగ్‌ను 3.33 నిమిషాల్లో చేరుకుని దివ్యారెడ్డి బంగారు పతకాన్ని సాధించారు. కొన్నేళ్లుగా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 100, 400, 800 మీటర్ల రన్నింగ్ ఈవెంట్లలో పాల్గొంటూ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో పతకాలను కైవసం చేసుకొని జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నారు. ఆమెకు జ్ఞాపికతోపాటు బంగారు పతకం, సర్టిఫికెట్‌ను రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి అందించారు. తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, శాట్స్ రిటైర్డ్ ఏడీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
అభాగ్యులతో చంద్రబాబు సర్కారు చలగాటం... 19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్ కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
బిజినెస్
ఎకానమీకి దేశీ డిమాండ్ దన్ను
ముంబై: సమన్వయంతో కూడిన ద్రవ్య, పరపతి– నియంత్రణ విధానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు బలంగా కొనసాగడానికి సాయపడినట్టు ఆర్బీఐ తాజా బులెటిన్ పేర్కొంది. అయితే వెలుపలి రిస్క్‌ల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థకు పూర్తి రక్షణ లేకపోవడాన్ని గుర్తు చేసింది. స్థూల ఆర్థిక మూలాలు, ఆర్థిక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి కొనసాగించడం సామర్థ్యాలు, ఉత్పాదకత పెంపునకు సాయం చేస్తుందని.. వేగంగా మారిపోతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలబడేందుకు దారితీస్తుందని పేర్కొంది. 2025లో అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో టారిఫ్‌లతో నెలకొన్న అసాధారణ మార్పును ప్రస్తావించింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంపై ఈ ప్రభావం ఎంతమేర ఉంటుందన్న దానిపై స్పష్టత లేదంటూ.. అంతర్జాతీయ వృద్ధి అవకాశాలపై మాత్రం ప్రభావం ఉంటుందని పేర్కొంది. పటిష్టంగా దేశీ డిమాండ్ దేశీయంగా బలమైన డిమాండ్ మద్దతుతో 2025–26లో క్యూ2లో (సెపె్టంబర్ త్రైమాసికం) భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధిని నమోదు చేసినట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. నవంబర్ నెలకు సంబంధించి కీలక సంకేతాలు సైతం డిమాండ్ బలంగా ఉండడాన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. ద్రవ్యోల్బణం ఇప్పటికీ కనిష్ట స్థాయిలోనే కొనసాగుతుండడాన్ని గుర్తు చేసింది. 2025 ఏప్రిల్–అక్టోబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) గతేడాది ఇదే కాలంతో పోలి్చతే అధికంగా ఉన్నట్టు తెలిపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మాత్రం ప్రతికూలంగా ఉన్నట్టు తెలిపింది. భారత్–యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశి్చతులు, అధిక వ్యాల్యూషన్ల వద్ద ఎఫ్‌పీఐల అమ్మకాలు చేస్తున్నట్టు పేర్కొంది. ఇది రూపాయి విలువను సైతం ప్రభావితం చేస్తున్నట్టు తెలిపింది. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ అక్టోబర్‌లో 11.87 బిలియన్ డాలర్లు వెచి్చంచినట్టు వెల్లడించింది.
కొత్త ఏడాదిలో.. ఫిన్‌టెక్ ఐపీవోల జోరు
వచ్చే ఏడాది కూడా పబ్లిక్ ఇష్యూల జోరు కొనసాగనుంది. కొత్త సంవత్సరంలో సుమారు పది దిగ్గజ ఫిన్‌టెక్ కంపెనీలు సైతం లిస్టింగ్‌పై కసరత్తు చేస్తున్నాయి. ఫోన్‌పే, రేజర్‌పే, పేయూ, అయ్ ఫైనాన్స్, ఇన్‌క్రెడ్ హోల్డింగ్స్, ఇన్నోవిటీ, పేనియర్‌బై తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫాంలు ఎకో, టరి్టల్‌మింట్, ట్రావెల్ బ్యాంకింగ్ సంస్థ నియోలాంటివి కూడా ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికే ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచగా, మరికొన్ని సంస్థలు బ్యాంకర్లను నియమించుకునే పనిలో ఉన్నాయి. ఇంకొన్ని తమ లిస్టింగ్ ప్రణాళికలను ప్రకటించాయి. అయ్ ఫైనాన్స్, టరి్టల్‌మింట్ సంస్థలకు నియంత్రణ సంస్థ అనుమతి కూడా లభించింది. అయ్ ఫైనాన్స్ దాదాపు రూ. 1,450 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 885 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ విధానంలో మరిన్ని షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఇక రుణాలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగించే ఇన్‌క్రెడ్ హోల్డింగ్స్ కూడా తమ ఐపీవో పత్రాలను సెబీకి సమరి్పంచింది. వీటి ప్రకారం కంపెనీ దాదాపు రూ. 3,000–4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్‌పే కూడా ముసాయిదా పత్రాలను నియంత్రణ సంస్థకు సమరి్పంచినట్లు సెపె్టంబర్లో ప్రకటించింది. డీల్ వివరాలను వెల్లడించనప్పటికీ, దాదాపు రూ. 12,000 కోట్లు సమీకరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది రాబోయే అతి పెద్ద ఐపీవోల్లో ఇది కూడా ఒకటి కానుంది. దీనితో టైగర్ గ్లోబల్, జనరల్ అట్లాంటిక్, రిబిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్‌లాంటి ప్రారంభ దశ ఇన్వెస్టర్లు ని్రష్కమించేందుకు అవకాశం లభిస్తుంది. అటు ఇన్నోవిటి, పేయూ, పేనియర్‌బై, నియో సంస్థల మేనేజ్మెంట్లు కూడా తమ లిస్టింగ్ ప్రణాళికలను ధృవీకరించాయి. అయితే, ఇంకా ముసాయిదా పత్రాలను సమరి్పంచాల్సి ఉంది. ఎకో సంస్థ 2026–27లో లిస్టింగ్ ద్వారా 300–400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,700 కోట్లు – రూ. 3,600 కోట్ల వరకు) సమీకరించే దిశగా బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. స్టార్టప్‌లలో పెట్టుబడుల వెల్లువ .. గత రెండేళ్లుగా అంకుర సంస్థల్లోకి స్థిరంగా పెట్టుబడులు వస్తున్నాయ. అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న సంస్థల్లో ఈ–కామర్స్ తర్వాత ఫిన్‌టెక్ కంపెనీలు రెండో స్థానంలో ఉన్నాయ. పరిశ్రమ డేటా ప్రకారం 2025లో ఫిన్‌టెక్ కంపెనీలు 120 డీల్స్ ద్వారా 1.87 బిలియన్ డాలర్ల పైగా నిధులను సమీకరించాయి. 2024లో 140 డీల్స్ ద్వారా 1.61 బిలియన్ డాలర్లు సేకరించాయి. వ్యాపారాన్ని విస్తరిస్తూ, నష్టాలను తగ్గించుకుంటూ ఉండటం ద్వారా పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రమంగా లాభాల బాట పడుతున్నాయి. దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రో, పైన్ ల్యాబ్స్, మొబిక్విక్‌లాంటి కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి సానుకూల స్పందన లభించింది. దీంతో మరిన్ని కంపెనీలు కూడా లిస్టింగ్ బాట పడుతున్నాయి. ఇక ఫిన్టెక్లే కాకుండా 2026లో వివిధ విభాగాలకు చెందిన అంకురాలు కూడా పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, ఓయో, రెంటోమోజో, బోట్, క్యూర్‌ఫుడ్స్, జెట్వెర్క్, షిప్‌రాకెట్, షాడోఫ్యాక్స్ మొదలైనవి ఈ లిస్టులో ఉన్నాయి.జెప్టో ఐపీవో @ రూ. 11,000 కోట్లు సెబీకి పత్రాలు దాఖలు క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను కాని్ఫడెన్షియల్ విధానంలో మార్కెట్ల నియంత్రణ సంస్థకు సమర్పించింది. దీని ప్రకారం కంపెనీ సుమారు రూ. 11,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాదిలో కంపెనీ లిస్టయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ఐపీవో సజావుగా సాగితే కార్యకలాపాలు ప్రారంభించిన అత్యంత తక్కువ వ్యవధిలోనే లిస్టయిన యువ అంకుర సంస్థగా జెప్టో నిలుస్తుంది. అలాగే పోటీ సంస్థలు జొమాటో, స్విగ్గీ సరసన కూడా చోటు దక్కించుకుంటుంది. 10 నిమిషాల్లో డెలివరీ సర్వీసుల పేరిట ప్రారంభమైన జెప్టో 7 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఇప్పటివరకు ఇన్వెస్టర్ల నుంచి రూ. 16,000 కోట్లు సమీకరించింది. 2023 ఆగస్టులో 200 మిలియన్ డాలర్ల సమీకరణ ద్వారా యూనికార్న్ (బిలియన్ డాలర్ల కంపెనీ) హోదా దక్కించుకుంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డ్రాప్‌అవుట్స్ అయిన ఆదిత్ పలిచా, కైవల్య వోహ్రా కలిసి దీన్ని నెలకొల్పారు. 2025 సెపె్టంబర్ నాటికి కంపెనీకి 900 డార్క్ స్టోర్స్ ఉన్నాయి.
కారు మైలేజ్ పెరగాలంటే..
ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో.. చాలామంది కార్ల కొనుగోలుదారులు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లనే కొనుగోలు చేస్తుంటారు. అయితే క్రమంగా కొన్ని రోజులకు మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా.. మైలేజ్ పెరగాలంటే వాహనదారులు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.సరైన డ్రైవింగ్కారు మైలేజ్‌పై ఎక్కువ ప్రభావం చూపేది డ్రైవింగ్ విధానమే. ఆకాశమత్తుగా వేగం పెంచడం, సడన్ బ్రేక్స్ వేయడం వల్ల ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. కాబట్టి స్మూత్‌గా.. ఒక నిర్దిష్టమైన వేగంతో డ్రైవ్ చేయాలి. సాధారణంగా గంటకు 60 కిమీ నుంచి 80 కిమీ వేగం ఉత్తమ మైలేజ్‌కు అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా.. అవసరం లేనప్పుడు క్లచ్ నొక్కి ఉంచకుండా, సరైన గేర్‌ను ఉపయోగించాలి.వాహనాన్ని సక్రమంగా నిర్వహించడంవాహనాన్ని ఉపయోగించడం మాత్రమే కాకుండా.. మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తుండాలి. ఇది నిర్లక్ష్యం చేస్తే మైలేజ్ తప్పకుండా తగ్గుతుంది. టైర్ ప్రెషర్ సరిగా లేకపోతే ఇంజిన్‌పై ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి కంపెనీ సూచించిన టైర్ ప్రెజర్ మెయింటెనెన్స్ చేయాలి. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్ వంటి వాటిని సమయానికి మారుస్తుండాలి.అనవసర బరువు వేయొద్దుకారులో లోపల లేదా కారు డిక్కీలో అవసరం లేని లగేజ్ ఉంచకూడదు. బరువు పెరిగితే.. ఇంజిన్ పనితీరు ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. దీనివల్ల ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. కాబట్టి అవసరం లేని వస్తువులను తొలగించడం ద్వారా మైలేజ్ కొంత పెంచుకోవచ్చు.ఏసీ, ఎలక్ట్రిక్ పరికరాల వినియోయాగంకారులో అవసరం లేనప్పుడు ఏసీ ఆపేయాలి. ఏసీ వినియోగం కూడా ఇంధన వినియోగానికి కారణం అవుతుంది. ప్రత్యేకంగా నగరంలో తక్కువ వేగంతో డ్రైవ్ చేస్తున్నప్పుడు AC వాడకం మైలేజ్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా లైట్స్, ఇతర ఎలక్ట్రికల్ పరికరాలను ఆఫ్ చేసి ఉంచాలి.రూట్ ప్లానింగ్మీరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకోవడం ఉత్తమం. ఎందుకంటే.. భారీ ట్రాఫిక్ ఉన్న మార్గాల్లో ఎక్కువ సేపు ఇంజిన్ ఆన్‌లో ఉండటం వల్ల ఇంధనం వృథా అవుతుంది. కాబట్టి ముందుగానే రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోవడం మంచిది. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు, కారు ఇంజిన్ ఆప్ చేసుకోవడం ఉత్తమం.
గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!?
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమగ్ర ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ప్రతిపాదించిన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’(GCS)లో నాన్-క్రెడిట్ డేటాను చేర్చాలనే ఆలోచన కీలకంగా మారనుంది.బడ్జెట్ ప్రతిపాదనలు2025-26 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్(GCS)’ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అనుసరించి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ వంటి ప్రముఖ సీఐసీలు తమ సొంత గ్రామీణ క్రెడిట్ స్కోర్లను రూపొందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ స్కోర్లు కేవలం గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులు, క్రెడిట్ మిక్స్, వినియోగం వంటి సంప్రదాయ పారామీటర్ల ఆధారంగానే లెక్కించబడుతున్నాయి.నాన్ క్రెడిట్ డేటా ఆవశ్యకతగ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు ‘థిన్ ఫైల్’ కేటగిరీ కిందకు వస్తారు. అంటే వీరికి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న చరిత్ర (Credit History) చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కేవలం రుణ చరిత్రపైనే ఆధారపడితే, వీరికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనుకాడతాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి సీఐసీలు ఆర్బీఐ, ప్రభుత్వాన్ని నాన్ క్రెడిట్ డేటా వినియోగానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా..విద్యుత్తు బిల్లుల చెల్లింపులునీటి పన్ను, గ్యాస్ సిలిండర్ చెల్లింపులుల్యాండ్లైన్, మొబైల్ బిల్లులు వంటి యుటిలిటీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు.ప్రయోజనాలుయుటిలిటీ బిల్లుల చెల్లింపు రికార్డులను క్రెడిట్ స్కోర్‌లో చేర్చడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు చెల్లిస్తున్నారంటే, అతనికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. ఇది రుణగ్రహీత ‘క్రెడిట్వర్తినెస్’ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. గతంలో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి కూడా క్రెడిట్ స్కోర్ లభించడం వల్ల వారు సులభంగా రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ప్రవర్తనను లోతుగా విశ్లేషించడం ద్వారా మొండి బకాయిల ముప్పును తగ్గించుకోవచ్చు.చట్టపరమైన, సాంకేతిక సవాళ్లుప్రస్తుతం సీఐసీలు 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (CICRA) పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం, కేవలం ఆర్థిక లావాదేవీల డేటాను మాత్రమే సేకరించే వీలుంది. నాన్ క్రెడిట్ డేటాను వాడాలంటే ఈ చట్టపరమైన నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకే సీఐసీలు తమ అభ్యర్థనలో సీఐసీఆర్‌ఏ చట్టపరిధిని గౌరవిస్తూనే, కాలానుగుణంగా మార్పులు చేయాలని కోరుతున్నాయి.గ్రామీణ భారతం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో యుటిలిటీ బిల్లుల వంటి డేటాను క్రెడిట్ స్కోరింగ్‌లో చేర్చడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. ఇది కేవలం బ్యాంకులకే కాకుండా చిరు వ్యాపారులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరసమైన వడ్డీకి రుణాలు అందేలా చేస్తుంది. ఆర్బీఐ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే..
ఫ్యామిలీ
అమ్మ కెనడియన్, నాన్న ఇటలీ..పెరిగింది ఇండియాలో..!
కొన్ని కథలు చాల గమ్మత్తుగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడ పెరిగి..విభిన్న మనుషులను కలుస్తుంటాం. అది కెరీర్, లేదా ఉద్యోగం వల్ల అయినా. కానీ కొందరు విదేశీయలును పెళ్లాడి..మళ్లీ వాళ్ల పిల్లల్ను మరో దేశంలో పెంచిన కొన్ని స్టోరీలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి సరదా స్టోరీనే షేర్ చేసింది ఓ విదేశీయురాలు. ఇది ఆమె కథనే. కానీ రెండు వేర్వురు దేశాలకు చెందని పేరెంట్స్‌కి పుట్టిన ఆమె చిరుప్రాయంలో మన భరత గడ్డపై అడుగుపెట్టిన కథ ఆద్యంతం మనసుకు హత్తకునేలా అందంగా ఉంది. బాలికి చెందిన సంగీతకారిణి బియాంక నీడు తన బాల్యమంతా భారత్‌లోనే సాగిందంటూ తన స్టోరీని షేర్ చేసుకుంది. ఆ పోస్ట్‌లో నీడు ఇలా రాసుకొచ్చారు. కెనడియన్ తల్లి, ఇటాలియన్ తండ్రికి జన్మిచిన ఆమె మూడు నెలల వయసుకుకే భారత్‌కి వచ్చినట్లు పేర్కొంది. 16వ ప్రాయం వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత లండన్, బాలికి వెళ్లినట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు క్యాథీ నీడు, రాబర్టో నీడు భారత్‌లోని కలుసుకున్నారని, ఇక్కడే ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చింది.చివరికి ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కుని స్థిరనివాసం ఉన్నారని చెప్పుకొచ్చింది. తన చైల్డ్‌హుడ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన బాల్యంలో అజిల్ భవన్లో జరుపుకున్న హోలిపండుగ గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఏడాది అక్కడకు వెళ్లి హోలీ ఆడటం బాగా నచ్చేదని, అక్కడే పార్టీలు కూడా చేసుకునేవాళ్లమని తెలిపింది. అంతేగాదు ఈ పోస్ట్‌కి తాను తల్లిదండ్రులతో భారత్‌లో గడిపిన కొన్ని బాల్య జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ని చూసి చాలామంది నెటిజన్లు అద్భుతం, మీరు చాలా గ్రేట్ మీకు చాలా భాషలు వచ్చి ఉండొచ్చే అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.జీవితమే మారిపోయింది.. కాగా, బియాంకా నీడు తాను భారత్‌లో పెరగడం వల్ల తన లైఫ్ అద్భుతంగా మారిందని కూడా పేర్కొంది. భారత్‌లోని సంభాషణలు కారణంగా అప్యాయత, ఉదారతలు నేర్చుకున్నా, అలాగే ఆతిథ్యం అంటే ఏంటో తెలసుకున్నానని అంటోంది. అంతేగాదు అందరితో కలుపుగోలుగా ఉండాలో తెలిసింది. జీవితం అంటే మనం ఒక్కరమే కాదని, అందరితో కలిసి ఉండటం అని తెలిసింది అంటోంది. చివరగా పోస్ట్‌లో తాను ఇక్కడ పెరగడం వల్లే ప్రపంచంలో ఎలా జీవించాలో, ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకున్నా అని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాదు, నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది కూడా. View this post on Instagram A post shared by Bianca Nieddu (@biancanieddu) (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్)
హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
వారణాసి’మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు హీరో మహేశ్ బాబు. ఆ మూవీ కోసం ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు (Kalarippayattu) నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం బయటకు వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్ఫుల్ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇక కలరిపయట్టు ఇటీవల చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టంతో నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కోసం, మానసిక రుగ్మతల నుంచి బయటపడేందుకు దీన్ని నేర్చుకునేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి కలరియపట్టు యుద్ధ కళ? ఇది ఫిట్నెస్కి ఎలా ఉపకరిస్తుంది సవివరంగా తెలుకుందాం.!.ఇంతకముందు ఈ కలరిపయట్టుని సైనా నెహ్వాల్ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్ నటి పరిణితిచోప్రా కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా వెల్లడించారు కూడా. దీన్ని సాధన చేస్తే..బాడీ ఎంతో యాక్టివ్‌గా ఉన్నట్లు ఉంటుందని చెప్పుకొచ్చారామె. కలరిపయట్టు అంటే.కళరిపయట్టు లేదా కళరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. దీన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా అభివర్ణిస్తారు. దీన్ని కేరళ, తమిళనాడు, శ్రీలంక, మలేషియాలో ఉండే మలయాళీలు తప్పక ప్రదర్శిస్తారట. కలరిపయట్టు శిక్షణలోని వేగవంతమైన కదలికలు ప్రతిచర్యలు, కంటి-చేతి ఏకీకరణ వంటివి ప్రాథమిక మోటార్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అంతేగాదు మన శరీరం, మనస్సును అప్రమత్తంగా, చురుకుగా ఉంచుతాయి.ఎలా శిక్షణ ఇస్తారంటే..కలరి'గా పిలిచే ఒక ప్రత్యేక శిక్షణా స్థలంలో ఈ యుద్ధ కళ నేర్పుతారు. పోటీ పడుతున్న ప్రత్యర్థి కలరి అభ్యాసకుడికి కొత్త పోరాట కదలికలను నేర్పిస్తుంటాడు. శిక్షణ పొందే వ్యక్తి ఈ కొత్త విధానాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రతిఘటించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీన్ని తమిళ రాజ్యాలతో యుద్ధాల చేసే సమయంలో మళయాళులు దీన్ని ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు..కలరిపయట్టు శిక్షణలో బలం, ఓర్పు ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. ఇది శరరీ ధృడ్వత్వాన్ని పెంచుతుంది. హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది : ఇందులో వుండే వేగవంతమైన ఏరోబిక్ కదలికలు, శక్తివంతమైన దాడులు హృదయ స్పందన రేటును పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగ్గా ఉంటుందిప్రాథమిక మోటారు వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్‌తో బాధపడేవారికి, నరాల సమస్యలతో బాధపడేవారికి కలరిపయట్టుని నిపుణుల సమక్షంలో తర్ఫీదు పొందితే మంచి ఫలితం ఉంటుందట. అలా పలువురి విషయంలో నిరూపితమైందట కూడా. అంతేగాదు ఈ ప్రాచీన యుద్ధ విద్య పనిలో ఏకాగ్రత, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుందట. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కలరియపట్టుని నేర్చుకుని..ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. View this post on Instagram A post shared by kalari Hyderabad (@a_martialarts_space) (చదవండి: పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..!భారత్ ఆరోగ్య సంరక్షణపై ఎన్నారై ప్రశంసల జల్లు)
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్‌టాపిక్‌గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడమే గాకా ఆ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్‌లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్‌కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్‌కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్‌తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్‌లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్నారై పోస్ట్)
అరుదైన హిమాలయ 'సిక్కిం సుందరి'..! ప్రకృతి నేర్పే జీవిత పాఠం
వ్యాపార దిగ్గజం ఆనంద్మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను, ప్రేరణ కలిగించే సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. తాజాగా ఓ ట్రావెల్లో చూడదగ్గ విషయలతోపాటు అక్కడ మానవులకు ప్రేరణ కలిగించే ఓ అరుదైన హిమాలయ పర్వత మొక్క గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. అది పుష్పించే విధానం ప్రతి ఒక్కరిని మంత్రముగ్దుల్ని చేయడమే కాదు..ఆ కఠినమైన పర్వత ప్రాంతంలో తన మనుగడ కోసం అది చేఏ పోరాటం స్ఫూర్తిని రగిలిస్తుంది. మరి ఆ మొక్క ఎక్కడ ఉంది, దాని కథాకమామీషు ఏంటో చూసేద్దామా..!ఆనంద్ మహింద్రా సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో "సిక్కిం సుందరి" మొక్క గురించి పలు విషయాలను పంచుకున్నారు. ఇది అరుదైన పర్వత మొక్క అని పుష్పించేందుకు దశాబ్దాలుగా శక్తిని నిల్వచేసుకుని ఆకాశాన్నేతాకేలా పుష్పించిన విధానం చూస్తే పోతుందన్నారు. ఇది సముద్ర మట్టానికి 4,000–4,800 మీటర్ల ఎత్తులో చూసే మొక్క అట. ఈ అసాధారణ అధ్భుతాన్ని ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు మహీంద్రా. దీన్ని"గ్లాస్‌హౌస్ ప్లాంట్"గా పేర్కొన్నారు. పర్వతాలుకు వ్యతిరేకంగా మెరస్తున్న ఓ టవర్లా పుష్పిస్తుందని రాశారు పోస్ట్‌లో. తనకు సిక్కిం పర్యటనలో ఈ మొక్క గొప్ప ప్రేరణగా నలిచిందని అన్నారు. దీనిని శాస్త్రీయంగా రుమ్ నోబెల్ అని పిలుస్తారని చెప్పారు. ఈ మొక్క అపారదర్శక, పగోడా లాంటి పువ్వులను కలిగి ఉంటుంది. ఆ ప్పువులు కూడా సుమారు ఏడు నుంచి 30 ఏళ్ల పెరుగుదల అనంతరం వస్తాయట. వీటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుందట.శాస్త్రవేత్తలకు, పర్యాటకులకు ఇవి ఆకర్షణగానూ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మైనస్ సున్నా డిగ్రీ ఉష్ణోగ్రతలు ఉండే కఠిన వాతావరణంలో పెరిగే మొక్క. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్తక్కువగా, బలమైన గాలుల మధ్య పర్వాతానికి వ్యతిరేకంగా ఎత్తుగాపెరుగుతుంది. 'ఓర్పు'కి నిర్వచనం.ఈ మొక్క పుష్పించేందుకు ఏడు నుంచి 30 ఏళ్ల వరకు చాలా నిశబ్దంగా ఆక్కుల్లో శక్తిని నిల్వ చేసుకుంటూ చిన్న రోసెట్(ఆకకుల సముహంలా) పెరుగుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా అన్నే ఏళ్ల అనంతరం ఏకంగా రెండు మీటర్లు ఎత్తుకు అమాంతం దూసుకుపోయి ఆలయాల్లో ఉండే ఎత్తైన గోపురం మాదిగా నిలబడుతుంది. ఆ తర్వాత విత్తనాలను విడుదల చేసి చనిపోతుందని మహీంద్రా పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే పర్యాటకులు దీన్ని చూడటం కష్టమని అన్నారు. ఎందుకంటే ఎత్తైన పర్వతాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రదేశంలో ఉండటం వల్ల చూడటం కష్టమని చెప్పుకొచ్చారు. అంతేగాదు సిక్కిం టూర్లో ఇలాంటి ఎన్నో ప్రకృతి కమనీయ దృశ్యాలను తిలకిస్తామని అన్నారు. మంచుతో కప్పబడి ఉండే ఎత్తైన కాంచన్‌జంగా పర్వతం దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయన్నారు. అంతేగాదు ఈ సిక్కిం అద్భుతైన మంచు సరస్సులకు నిలయం అని, ఇక్కడ రుంటెక్, పెమాయాంగ్ట్సే, లాబ్రాంగ్ వంటివి పురాతన బౌద్ధానికి నిలయంగా ఉంటాయన్నారు. సిక్కిం పర్యటనకు అనుకూలమైన సమయం..మార్చి–జూన్: ఈ సమయంలో, సిక్కిం ఆహ్లాదకరమైన వాతావరణం, స్పష్టమైన ఆకాశం, రంగురంగుల పుష్పాలను ఆస్వాదించొచ్చు. ఇది ప్రకృతి నడకలకు సరైన సమయం.సెప్టెంబర్–డిసెంబర్: ఈ సమయంలో, సిక్కిం చల్లని, పొడి పరిస్థితుల వాతావరణం ఉంటుంది. ఇక కాంచన్‌జంగా శ్రేణి అతీంద్రియ దృశ్యాలను అందిస్తుంది.డిసెంబర్–ఫిబ్రవరి: ఇసిక్కిం మంచుతో కూడిన అద్భుత భూమిగా మారే సమయం ఇది.I knew nothing about this extraordinary marvel: the ‘Sikkim Sundari’Thriving at staggering altitudes of 4,000–4,800 meters, this "Glasshouse Plant" stands like a glowing tower against the mountains. Its life is a masterclass in patience. It is monocarpic, which means that… pic.twitter.com/keoMSmGcUl— anand mahindra (@anandmahindra) December 21, 2025 (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్)
అంతర్జాతీయం
పెళ్లి చేసుకోలేదంటే జరిమానా.. గ్రామస్తుల తీర్మానం
బీజింగ్: చైనాలోని ఓ గ్రామం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఆ దేశవ్యాప్తంగా, సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. గ్రామ కమిటీ ప్రత్యేకంగా రూపొందించిన నియమావళి ప్రకారం.. ఆ ఊరి గ్రామస్తులు ఆలస్యంగా వివాహం చేసుకోవడం, గర్భధారణకు సంబంధించిన నియమాలు పాటించని వారికి, అలాగే పిల్లల పెంపకం విధానాల్లో మార్పులు చేసిన వారికి జరిమానాలు విధిస్తూ ఆ ఊరి పెద్దలు తీర్మానించారు. జరిమానా వివరాలు• పెళ్లి కాకముందే గర్భం దాల్చితే 3,000 యువాన్ (సుమారు రూ.35,000).• పెళ్లి కాకముందే కలిసి నివసిస్తే సంవత్సరానికి 500 యువాన్ (సుమారు రూ.6,000).• బయటి ప్రావిన్స్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే 1,500 యువాన్ (సుమారు రూ.18,000).• అసత్య వదంతులు వ్యాప్తి చేస్తే 500 నుంచి 1,000 యువాన్ జరిమానా.ఈ వార్త వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఊరు పెద్దలు తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా మంది నెటిజన్లు ఈ నియమాలను వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. వివాహం ఎప్పుడు చేసుకోవాలి? పిల్లల్ని ఎప్పుడు కనాలి? అనేది వ్యక్తిగత నిర్ణయం. దానిపై గ్రామ కమిటీకి హక్కు ఎలా వస్తుంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం గ్రామంలో జనాభా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలుగా సమర్థిస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనాలో ప్రస్తుతం జనన రేటు తగ్గుదల (Demographic Winter) ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం జనన రేటు పెంచాలని ప్రయత్నిస్తున్న సమయంలో, గ్రామ స్థాయిలో ఇలాంటి జరిమానాలు విధించడం వ్యతిరేక ధోరణిగా కనిపిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న విధానాలకు విరుద్ధమని విశ్లేషకులు చెబుతున్నారు.ఈ సంఘటనతో చైనా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక నియంత్రణ ఎంత కఠినంగా అమలవుతోందో బయటపడింది. ఒకవైపు ఆధునికీకరణ, ఆర్థికాభివృద్ధి దిశగా చైనా దూసుకెళ్తుంటే, మరోవైపు గ్రామాల్లో ఇలాంటి నియమాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నార్థకంగా మార్చుతున్నాయి. మొత్తానికి, ఈ గ్రామం తీసుకున్న నిర్ణయాలు స్థానిక సమస్యగానే కాకుండా, జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.
రాకెట్ లాంటి రైలు.. 2 సెకన్లలోనే 700 KMPH వేగంతో పరుగులు..
బీజింగ్: చైనాలో మాగ్లేవ్ రైలు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రైలు కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని చేరి రికార్డు సృష్టించింది. చాంగ్షాలో నిర్వహించిన ఈ ప్రయోగం చైనాలో సాంకేతిక ఆధిపత్యాన్ని మరోసారి చాటింది.మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతలో రైలు పట్టాలపై నేరుగా నడవదు. బలమైన అయస్కాంత శక్తి సహాయంతో గాల్లో తేలుతూ ముందుకు సాగుతుంది. దీని వల్ల ఘర్షణ తగ్గి అత్యధిక వేగాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఈ రికార్డు స్థాయి వేగం భవిష్యత్తులో రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీయనుంది.నిపుణుల అంచనా ప్రకారం, బీజింగ్ నుంచి షాంఘై వరకు ప్రయాణం కేవలం రెండు గంటల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. పర్యావరణహితమైన ఈ రైలు ఇంధన వినియోగాన్ని తగ్గించడమే కాకుండా శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. చైనా ప్రభుత్వం దీన్ని జాతీయ గర్వంగా భావిస్తూ, రాబోయే దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా మాగ్లేవ్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విజయంతో చైనా ప్రపంచ రవాణా రంగంలో ముందంజలో నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.అమెరికా, జపాన్, యూరప్ వంటి దేశాలు కూడా మాగ్లేవ్ ట్రైన్ సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ, చైనా సాధించిన ఈ వేగం వారిని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా, ఈ ప్రయోగం కేవలం చైనాకే కాకుండా ప్రపంచ సాంకేతికతలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది.Reporter left speechless after witnessing Japan's new $70 million Maglev train in action at 310 mphpic.twitter.com/nexIApcmRh— Massimo (@Rainmaker1973) November 25, 2025
ష్.. 30 ఏళ్లగా నిశ్శబ్దం… లారా పుట్టింది.. గ్రామం మళ్లీ నవ్వింది!
రోమ్:ఇటలీ అబ్రుజ్జో పర్వత ప్రాంతంలోని పాగ్లియారా డై మార్సి అనే చిన్న గ్రామం. గత 30ఏళ్లుగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. యువకులు, కుటుంబాలు వలస వెళ్లిపోవడంతో పాఠశాలలు మూతపడ్డాయి, వీధులు వెలవెలబోయాయి. మిగిలిన కొద్దిమంది వృద్ధులు మాత్రమే అక్కడ జీవనం సాగిస్తున్నారు.అయితే ఈ నిశ్శబ్దాన్ని మార్చిన సంఘటన ఈ సంవత్సరం మార్చిలో చోటుచేసుకుంది. లారా బుస్సి ట్రాబుక్కో అనే చిన్నారి జననం గ్రామానికి కొత్త ఊపిరి పోసింది. ఆమె తల్లిదండ్రులు సింజియా ట్రాబుక్కో, పావ్లో బుస్సి. లారా పుట్టడంతో గ్రామ జనాభా 20కి చేరింది. ఒకప్పుడు పిల్లల కిలకిలారావాలు వినిపించని వీధులు ఇప్పుడు కొత్త ఆశతో నిండిపోయాయి.ప్రభుత్వం నుంచి బోనస్ఇటీవల యూరప్ దేశాలైన ఇటలీ,స్పెయిన్,జర్మనీలలో జననాల రేటు తగ్గిపోతుంది. దీంతో జనాభా రేటును పెంచేందుకు ఆయా దేశాలు ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సైతం పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు బేబీ బోనస్ కింద వెయ్యి యూరోలు ఇస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా లారా జన్మించడంతో ఆమె కుటుంబానికి 1000 యూరోలు (సుమారు రూ.90,000) విలువైన బేబీ బోనస్ అందించింది. లారా పుట్టుక ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా, ఇటలీ ఎదుర్కొంటున్న జనాభా సంక్షోభానికి ప్రతీకగా నిలిచింది. దేశంలో జనన రేటు తగ్గిపోవడం వల్ల అనేక గ్రామాలు వెలవెలబోతున్నాయి. పాగ్లియారా డై మార్సి గ్రామం ఈ సమస్యకు ప్రత్యక్ష ఉదాహరణ.గ్రామస్తుల స్పందనగ్రామస్తులు లారా పుట్టుకను కొత్త జీవంగా భావిస్తున్నారు. మా గ్రామం మళ్లీ బతికింది అని వారు ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల పుట్టుకతో గ్రామానికి మళ్లీ భవిష్యత్తు ఉందన్న నమ్మకం కలిగిందని వారు చెబుతున్నారు. 30 ఏళ్ల తర్వాత పుట్టిన లారా చిన్నారి పాగ్లియారా డై మార్సి గ్రామానికి కొత్త ఆశను తెచ్చింది. ఒక చిన్నారి పుట్టుకతో ఒక గ్రామం మళ్లీ జీవం పొందడం, దేశవ్యాప్తంగా జనాభా సంక్షోభంపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.
పాకిస్థాన్‌ను వీడుతున్న మేథోసంపత్తి
పాకిస్థాన్‌లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని జైలులో ఉంచడం, పాక్ ఆర్మీ చీఫ్‌గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు చేపట్టడం,ఉగ్రవాద ప్రభావితం అధికంగా ఉండడం తదితర కారణాలతో అంతర్గతంగా పాక్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం ఆదేశ మేథో సంపత్తిపై పడుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో పాక్ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు పెద్దఎత్తున వలస వెళ్లినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.ఏ దేశ భవిష్యత్తయిన అక్కడి మేథో సంపత్తిపై ఆదారపడి ఉంటుంది. దేశంలోనే ప్రతిభావంతులు ఉపాధి, శాంతి భద్రతలు, తదితర కారణాలతో దేశాన్ని వీడినట్లయితే ఆదేశ అభివృద్దికే ప్రమాదం. ప్రస్తుతం పాకిస్థాన్ ఆ పరిస్థితుల్లేనే ఉన్నట్లు తెలుస్తోంది. మిలిటరీచీఫ్‌గా ఆసిమ్ మునీర్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పాక్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొందని నివేదికలు పేర్కొంటున్నాయి.గడిచిన 24 నెలలో పాకిస్థాన్‌లోని అంతర్గత పరిస్థితుల కారణంగా దాదాపు 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు దేశాన్ని వీడారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మేథో సంపన్న వర్గం దేశాన్ని వీడడానికి అక్కడి ఆర్మీచీఫ్ ఆసిమ్ మునీర్ నిరంకుశ విధానాలే కారణమని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిస్థితిపై పాక్ ఆర్మీచీఫ్ వ్యంగ్యంగా స్పందించారు. వారి వలస దేశానికి "బ్రెయిన్ గేన్" మాట్లాడారు.పాకిస్థాన్ ప్రస్తుత పరిస్థితిపై ఆదేశ సెనెటర్ ముస్తఫా నవాజ్ కోకర్ స్పందించారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ ఎకానమీగా ఉందని తెలిపారు. ఇంటర్నెట్ షట్‌డౌన్స్ వల్ల 1.62 బిలియన్ డాలర్లు నష్టం జరిగిందన్నారు. అంతే కాకుండా 2.37 మిలియన్ల ఫ్రీలాన్సింగ్ జాబులు రిస్కులో పడ్డాయన్నారు. ఈ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలంటే ముందుగా రాజకీయాల్ని సరిదిద్దాలి అని తెలిపారు.2024 పాకిస్థాన్ నివేదికల ప్రకారం విదేశాలలో ఉద్యోగాల కోసం 7,27,381 మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకూ దాదాపు 6,87,246 మంది ఉపాధి కోసం అప్ల్పై చేసుకున్నారు. అంతేకాకుండా 2011-2024 మధ్య ఆదేశం వీడి వెళ్లిన ఆరోగ్య సిబ్బంది శాతం గతంతో పోలిస్తే 2,144 శాతం పెరిగిందని డేటా తెలుపుతుంది ఇదిలా ఉండగా పాకిస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కొంతమంది అక్కడి బిచ్చగాళ్ల మాఫియా మారారు. దీంతో దేశ పర్యాటక రంగం దెబ్బతింటుందని వారిని వెనక్కి పంపించి వేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ పరువు అంతర్జాతీయంగా మంటగలిసింది.
జాతీయం
బొగ్గు గని ప్లాంట్ వద్ద నిరసన సెగ
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో జిందాల్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించిన బొగ్గు గని ప్లాంట్ వద్ద స్థానికులు చేపట్టిన ఆందోళన శనివారం హింసాత్మకంగా మారింది. తమనార్ పరిధిలోని లిబ్రా గ్రామంలో ఉన్న కోల్ హ్యాండింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు తరలించే వాహనాలను అడ్డుకుంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉద్యమ నాయకుడు రాధేశ్యామ్ శర్మ, మరో 40 మందిని అరెస్ట్‌చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంచేశారు. అయితే సైకిల్‌పై వెళ్తున్న స్థానికుడిని మరో బొగ్గు ట్రక్కు ఢీకొట్టిందన్న వార్తతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తర్వాత ప్లాంట్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. కోల్ ప్లాంట్‌లోని కన్వేయర్ బెల్ట్, ట్రాక్టర్లు, పోలీస్ బస్సు, జీప్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. సెక్టార్–1 కోల్‌బ్లాక్ పరిధిలోని 14 గ్రామాలకు చెందిన వేయి మందికిపైగా గ్రామస్తులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారు. అయినాసరే పరిస్థితి అదపులోనే ఉందని జిల్లా ఎస్పీ శనివారం వెల్లడించారు.
57 ‘ఇండిగో’లు రద్దు
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ విమానా శ్రయాల్లో అననుకూల వాతావరణం కారణంగా శనివారం 57 విమానాలను రద్దు చేసినట్లు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తెలిపింది. అదేవిధంగా, ఆదివారం నడిపే మరో 13 విమానాలను సైతం రద్దు చేసింది. వీటిలో రెండు నిర్వహణ పరమైన కారణాలు, మిగతావి ప్రతికూల వాతావరణం నెలకొనవచ్చనే అంచనాతో రద్దు చేశామని వెల్లడించింది. ఈ నెలారంభంలో నిర్వహణ పరమైన కారణాలు చూపుతూ వేలాదిగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో తీవ్ర సంక్షోభం తలెత్తడం తెల్సిందే. అదేవిధంగా, గత వారం, పది రోజులుగా ఈ సంస్థ వాతావరణం సరిగా లేదనే కారణంతో పదుల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేస్తోంది. శనివారం రద్దయిన వాటిలో చండీగఢ్, అహ్మదాబాద్, హైదరాబాద్, అమృత్సర్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, పుణె మొదలైన చోట్ల నుంచి రాకపోకలు సాగించాల్సినవి ఉన్నాయి.
ఆపరేషన్ ఆఘాత్ 3.0
న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ ఢిల్లీ పోలీసులు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. శుక్రవారం వాయవ్య ఢిల్లీలో ‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’పేరుతో చేపట్టిన దాడుల్లో భారీ సంఖ్యలో ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మద్యంతోపాటు వాహనాలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా పలు నేరారోపణలపై 966 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకల సమయంలో నివాస ప్రాంతాలు, మురికివాడల్లో నేరాలకు పాల్పడే వారిని, వీధి ఘర్షణలను అదుపు చేసేందుకే ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు. ఆపరేషన్ ఆఘాత్ 3.0 సమయంలో 21 దేశవాళీ పిస్టళ్లు, 20 తూటాలు, 27 కత్తులను ఆయుధాల చట్టం కింద స్వా«దీనం చేసుకున్నామని వివరించారు. 12,258 క్వార్టర్ల అక్రమ మద్యం, 6కిలోల గంజాయితోపాటు రూ.2.36 లక్షల నగదును గ్యాంబ్లర్స్ నుంచి సీజ్ చేసినట్లు చెప్పారు. మొత్తం 310 సెల్ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు, ఒక కారును పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 600 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారన్నారు. నేరాలకు పాల్పడినట్లు తేలితే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 11, 112 కింద కేసులు నమోదు చేసి బహిష్కరణ దండన వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హిమాచల్‌లో వైద్యుల నిరవధిక సమ్మె
సిమ్లా: రెసిడెంట్ డాక్టర్ల నిరవధిక సమ్మె కారణంగా శనివారం హిమాచల్‌ప్రదేశ్ వ్యాప్తంగా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మినహా వైద్య సేవలు నిలిచిపోయాయి. రోగిపై చేయిచేసుకున్నాడనే కారణంతో వైద్యుడిని 48 గంటల్లోనే విధుల నుంచి తొలగించడం అన్యాయమని వైద్యులు వాదిస్తున్నారు. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్‌తో సమ్మెకు దిగారు. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీతోపాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు శుక్రవారం మూకుమ్మడి సెలవుపై వెళ్లారు. దీంతో, ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి సిమ్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచి్చన రోగులు, వారి సంబంధీకులు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. సిమ్లాతోపాటు ధర్మశాల, నహాన్, హమీర్పూర్, ఉనా తదితర జిల్లాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. శనివారం నుంచి జరుగుతున్న నిరవధిక సమ్మె సందర్భంగా ఎమర్జెన్సీ సేవలు మాత్రమే పనిచేస్తాయని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. ‘వైద్యుడు అవ్వాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వైద్యుడూ మానవమాత్రుడే. ఘటనలో అనుచిత ప్రవర్తనను మేమూ అంగీకరిస్తున్నాం. ఆరు గంటల్లో సస్పెండ్ చేశారు సరే. క్రమ శిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యుడైన వైద్యుడిని 48 గంటల్లోనే విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడం సరికాదు. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్నదే మా ఏకైక డిమాండ్’అని వివరించింది. ‘ప్రభుత్వ చర్య వైద్య వర్గాల్లో తీవ్ర వ్యతిరేక ప్రభావం కలిగించింది. ఏమాత్రం భద్రత లేదని వైద్యులు భావించే పరిస్థితికి వైద్యులు చేరుకున్నారు’అని తెలిపింది. ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ పల్మనరీ వార్డులో సోమవారం అర్జున్ సింగ్ అనే రోగి, రాఘవ్ నరులా అనే వైద్యుడిని నువ్వు అని సంబోధించడంతో మొదలైన గొడవ, ఇద్దరి మధ్య కొట్లాటకు దారితీసింది. డాక్టర్ రాఘవ్ నరులా రోగిపై ముష్ఠిఘాతాలు కురిపిస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారుల కమిటీ..ఇద్దరిదీ తప్పేనని తేలి్చంది. వైద్యుడు నరులా ప్రవర్తన ప్రజా సేవకుడి హోదాకు తగినట్లుగా లేదని పేర్కొనడంతో ప్రభుత్వం ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించింది. అయితే, హిమాచల్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, సిమ్లా అసోసియేషన్ ఆఫ్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ టీచర్స్, సిమ్లా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్లు డాక్టర్ నరులాకు మద్దతు ప్రకటించాయి. ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం సీఎం సుఖ్వీందర్ సింగ్‌కు వినతిపత్రం సమర్పించాయి.
ఎన్ఆర్ఐ
అమెరికాలో నల్లగొండ యువకుడు మృతి
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అమెరికాలో మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం పవన్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అంతలోనే పవన్ కుమార్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
బ్రిటన్, కువైట్‌లో వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజు
వేంపల్లె/కడప కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజును యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్‌లో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో–ఆర్డినేటర్లు ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, ఎల్.ఎన్.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడిగా, జననేతగా మాజీ సీఎం వైఎస్ ప్రఖ్యాతి పొందారన్నారు. ఆయన పుట్టినరోజును బ్రిటన్‌లో నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ యూకే కన్వీనర్లు సహాయ కన్వీనర్లు, కోర్ కమిటీ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, పెద్ద ఎత్తున యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కువైట్‌లో మెగా రక్తదానం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలు కువైట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో కువైట్‌లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్. ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్‌లో ఉన్న జగనన్న అభిమానులు భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చారని, కువైటీల ఇళ్లలో పని చేస్తున్న మహిళలు, డ్రైవర్లు అనుమతి తీసుకొని వచ్చి 82 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేసిన వారికి జగనన్న సంతకంతో కూడిన సరి్టఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్లు కె. రమణయాదవ్, మర్రి కళ్యాణ్, షా హుసేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేష్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మీ ప్రసాద్ యాదవ్, షేక్ రహమతుల్లా, షేక్ అఫ్సర్ అలీ, కార్యవర్గ సభ్యులు షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు.. అక్కడి ప్రవాస భారతీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా? అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీలోని బోండి బీచ్‌లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు.జాత్యహంకార కోరలుకొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అధికంగా కనిపిస్తుంది. ఈ జాబితాలోని దేశాలలో అమెరికా, కెనడా పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు (Hate Crimes) మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కెనడాలో భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో 2024 నుంచి ఇప్పటివరకు 11 మందికి పైగా భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది స్థానిక భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. డబ్లిన్‌లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి, సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అభద్రతా భావంవిద్యా కేంద్రాల్లో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులకు క్యాంపస్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల టెహ్రాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై దాడులు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా, స్థానిక అధికార యంత్రాంగం స్పందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విద్యాభ్యాసం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కనీస రక్షణ లేక జాత్యహంకార దాడులకు బలవుతుండటం గమనార్హం.సైద్ధాంతిక విద్వేషంవిదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు.. రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కూడా కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారాయి. సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడటం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాంగ శాఖ అప్రమత్తం విదేశాలలో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి సందర్భాల్లో విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పు అనుకున్నంతగా కనిపించడం లేదు. భారతీయ రాయబార కార్యాలయాలు విద్యార్థులకు, వలసదారులకు రక్షణ కల్పించడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పలువురు అంటున్నారు.భద్రతా సంక్షోభం?ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇవి పునరావృతం అవుతాయని పలువురు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. దీనిని గుర్తించి అయినా అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాలనే వాదన వినిపిస్తుంటుంది. ప్రవాస మేధావులు, విద్యార్థులపై దాడులు కొనసాగితే, అది ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుందనేవారూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేవలం నిరసనలు తెలపడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో విదేశీ కలలు కనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్
క్రైమ్
మృత్యువులోనూ వీడని స్నేహం
భీమడోలు: ఆ యువకులు ముగ్గురూ మంచి స్నేహితులు.. ముగ్గురూ కలిసి శుభకార్యాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పనిలో భాగంగా ముగ్గురూ కలిసే వెళ్తారు. శనివారం తెల్లవారుజామున డెకరేషన్ పుష్పాల కోసం వెళ్లి బైక్‌పై తిరిగి వస్తున్న వారిని ఏలూరు జిల్లా భీమడోలు వద్ద జాతీయ రహదారిపై ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఏలూరు నుంచి పొలసానిపల్లి వైపుగా ముగ్గురు యువకులు కలిసి వెళ్తుండగా వీరి బైక్ భీమడోలు వద్ద ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ద్వారకాతిరుమల మండలం తిమ్మపురానికి చెందిన మాండ్రోజు చరణ్‌కుమార్ (26), ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన సయ్యద్ రఫీ (22), కొయ్యగర శ్రీరాములు అలియాస్ బన్నీ (21) ఉన్నారు. ఘటనాస్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న బిడ్డలను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ ఎస్కే మదీనా బాషా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.దట్టమైన పొగమంచే కారణమా ?ద్వారకాతిరుమలలో ఆదివారం జరిగే ఓ ఫంక్షన్‌కు డెకరేషన్ కోసం పువ్వుల కొనుగోలుకు చరణ్‌కుమార్ తన తమ్ముడి కొత్త బైక్‌పై రఫీ, బన్నీతో కలిసి శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లాడు. ఏలూరులో ఫ్లవర్స్ ఆర్డర్ ఇచ్చి తిరిగి వస్తున్న వీరు భీమడోలు ఫ్లైఓవర్ సమీపంలో చనిపోయారు. దట్టమైన పొగమంచు కురుస్తుండడం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమడోలు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘ఓ’ పాజిటివ్‌కు బదులు ‘ఏ’ పాజిటివ్ బాలింత మృతి
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా, నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో ఇటీవల సంచలనంగా మారిన బాలింత మృతిపై జరిగిన విచారణలో దారుణ వాస్తవాలు వెల్లడయినట్లు తెలుస్తోంది. రక్త మార్పిడి విషయంలో ప్రభుత్వ డాక్టర్, బ్లడ్ బ్యాంక్ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని విచారణలో తేలినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన సాగరమ్మ (21) పురిటినొప్పులతో ఈ నెల 15వ తేదీన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు వచ్చింది. 17న కాన్పు చేశారు. శస్త్రచికిత్స తర్వాత ఆమెకు ‘ఓ’ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాలలో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తీసుకువచ్చారు. అయితే రక్తం ఎక్కించే సమయంలో ఆమె శరీరంపై దద్దుర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. తీవ్ర నిర్లక్ష్యం ‘ఓ’ పాజిటివ్ బదులుగా ‘ఏ’ పాజిటివ్ రక్తం ఎక్కించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇందుకు సంబంధించి విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. దీంతో రక్త గ్రూప్ నిర్ధారణ, క్రాస్ మ్యాచ్, డబుల్ చెక్.. వంటి ముఖ్య విధానాలను అటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది.. ఇటు వైద్యులు విస్మరించారన్న విషయం స్పష్టమైంది. విచారణ నేపథ్యంలో తప్పు మాది కాదంటే మాది కాదంటూ ఇటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, అటు వైద్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా వీరిపై చర్యలు తీసుకోవద్దంటూ ఉన్నతాధికారులపై అధికార పార్టీ నేత ఒకరు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. బ్లడ్ బ్యాంక్‌పై డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణసైతం పూర్తిగా కొరవడినట్లు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి వివాదాన్ని సర్ధుమణిగింపచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. త్వరలో చర్యలు.. బాలింత మృతిపై విచారణ జరిపి నివేదికను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వైద్యశాఖ ఉన్నతాధికారులకు పంపించాం. బాధ్యులపై త్వరలో చర్యలుంటాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – ఎం ప్రసూన, డీసీహెచ్ఎస్, పల్నాడు జిల్లా
దేవుడా.. నా తోడును తీసుకెళ్లిపోయావా...
అయ్యా.. కాపాడండయ్యా.. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు.. ఆస్పత్రికి తీసుకెళ్లండయ్యా.. ఈయనే నాకు దిక్కయ్యా.. బతికించండయ్యా.. దేవుడా... బస్సు చక్రాలకింద నా తోడును నలిపేశావా.. నా ఐదోతనాన్ని తీసుకెళ్లిపోయావా అంటూ భర్త తలవద్ద కూర్చుని ఓ వృద్ధురాలు రోదిస్తుంటే అక్కడివారిని కన్నీరుపెట్టించింది. కళ్లముందే తనువుచాలించిన భర్తను చూసి బోరున విలపించింది. ఈ హృదయవిదారక ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస పట్టణంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. కొత్తవలస: మండలంలోని నిమ్మలపాలెం గ్రామానికి చెందిన సంపర్తి పెదరాము(67), అప్పలకొండ వృద్ధ దంపతులు ప్రతిరోజు కొత్తవలస మండల కేంద్రంలోని పలు షాపుల ముందు చెత్తను ఊడ్చుతూ, నీళ్లు చల్లి ముగ్గులు పెట్టే పనులు చేస్తారు. షాపుల యజమానులు ఇచ్చిన కొద్దిపాటి పైకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారు ఉన్నా ఎవరిదారి చూసుకొని వారు వెళ్లిపోయారు. ఇద్దరూ ఒకరికి ఒకరు అన్నట్టు జీవనం సాగిస్తున్నారు. ఎప్పటివలే శుక్రవారం ఉదయాన్నే కొత్తవలస చేరుకున్న దంపతులిద్దరూ షాపుల ముందు పనులు ముగించారు. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కొత్తవలస బస్టాప్‌లో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఎస్.కోట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు వచ్చింది. శక్తిని కూడదీసుకుని బస్సు ఎక్కేందుకు సిద్ధమవుతున్న క్రమంలో బస్సు కాస్తా ముందుకు వెళ్లిపోవడంతో... అప్పటికే కాలువ నిర్మాణం కోసం తవి్వన మట్టిపోగులపై ఉన్న వృద్ధుడు ఒక్కసారి జారిపోయి బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఆయనపైనుంచి బస్సు వెళ్లడంతో గిలగిలా కొట్టుకుంటూ కన్నుమూశాడు. ఈ ఘటనను పక్కనే ఉన్న భార్య అప్పలకొండ చూసి గట్టిగా కేకేలు వేసింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను చూసి కన్నీటిపర్యంతమైంది. క్షణాల్లో భర్త విగతజీవిగా మారడంతో గుండెలవిసేలా రోదించింది. మృతుడి భార్య అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సీఐ షణ్ముకరావు తెలిపారు. శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. ఊరికి చేర్చే బస్సు కిందే ఊపిరిపోయింది.. షాపుల ముందు చెత్త ఊడ్చే పనులు పూర్తిచేసి ఊరికి చేరుకునేందుకు వేచిచూసిన బస్సు కిందే ఊపిరి పోవడంతో స్థానికులు కన్నీరుపెట్టారు. రోదిస్తున్న వృద్ధురాలిని ఓదార్చారు. కొత్తవలస కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జిని ఆనకొని గోడను అధికారులు నిర్మిస్తున్నారు. ఈ గోడ నిర్మాణానికి కూడలిలోని కొంతభాగాన్ని తవ్వేసి మట్టిని గట్టులావేశారు. ఈ గట్టుపైనే నిల్చొని ప్రయాణికులు బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. ప్రమాదవశాత్తు గట్టుపై నుంచే జారిపడిన రాము బస్సు చక్రాల కింద పడడంతో మృతి చెందాడు.
అడవి పందుల బీభత్సం..!
పెంచికల్పేట్(సిర్పూర్): అడవుల జిల్లా కుమురంభీం ఆసిఫాబాద్‌లో అడవి పందులు బెంబేలెత్తిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటలను ధ్వంసం చేయడంతోపాటు మనుషులపైనా దాడులకు తెగపడుతున్నాయి. రైతులు తమ విలువైన పంటలు కోల్పోతున్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. అటవీశాఖ పరిహారం అందిస్తున్నామని చెబుతున్నా.. బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు.పంటలు ధ్వంసంజిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, వరి పంటలు సాగు చేస్తారు. పత్తి చేలు అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్నాయి. దీంతో పందులు సీజన్ ముగిసే వరకు దాడులు చేస్తూ పత్తి చేలను ధ్వంసం చేశాయి. పలు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అడవి జంతువుల స్వైర విహారంతో చేతికందిన పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం వానాకాలం సీజన్లో సాగు చేసిన వరి కోతలు పూర్తయ్యాయి. దీంతో అడవి పందులు పత్తి, కంది పంటలపై పడ్డాయి. ఈ క్రమంలో పంటలను కాపాడుకోవడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కాపలా కాస్తున్న సమయంలో రైతులపైనా దాడులు చేస్తున్నాయి.పరిహారం కోసం ఎదురుచూపులుపంటలకు కాపలా వెళ్లే సమయంలో అన్నదాతలు ఎక్కువగా అడవి పందుల దాడుల్లో గాయపడుతున్నారు. రెండు నెలల క్రితం పెంచికల్పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన రైతు దూగుంట నారాయణ వరిపొలానికి వెళ్లిన సమయంలో అడవి పంది దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా తిర్యాణి మండలం గోయోగం గ్రామానికి చెందిన మేక భీమేశ్పైనా పందుల గుంపు దాడిచేసింది. వీటి భయంతో అన్నదాతలు, కూలీలు పంట చేలకు వెళ్లడానికి జంకుతున్నారు. నష్టపోయిన పంటలు, గాయపడిన వారికి అటవీశాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. క్షతగాత్రులకు గాయాల తీవ్రత ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పంట నష్టాన్ని వ్యవసాయాధికారులు అంచనా వేస్తే బాధితులకు సాయం అందించాలి. కానీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో బాధితులకు ఎదురుచూపులు తప్పడం లేదు.దరఖాస్తు ఇవ్వాలిఅడవి పందుల దాడిలో పంటనష్టపోయిన రైతులు అటవీశాఖ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలి. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు పరిహారం కోసం నివేదిస్తాం. గాయపడిన వారికి పరిహారం అందించాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరాలు అందించాం. నిధులు మంజూరు కాగానే బాధితులకు అందిస్తాం.– అనిల్‌కుమార్, ఎఫ్ఆర్వో, పెంచికల్పేట్పంట కాపలాకు వెళ్లిన రైతుపై దాడితిర్యాణి: అడవి పందుల దాడిలో ఒకరికి గాయాలైన ఘటన తిర్యాణి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోయోగం గ్రామానికి చెందిన మేక భీమేశ్ గురువారం గ్రామ సమీపంలోని పంట చేనుకు కాపలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి తిరిగి వస్తుండగా అడవి పందుల గుంపు ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భీమేశ్ అరవడంతో పక్క చేనులో ఉన్న రైతులు గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఫారెస్టు రేంజ్ అధికారి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
వీడియోలు
సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్
సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్
టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు
శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్
వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు
ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్
బ్రెజిల్ సముద్రంలో కూలిపోయిన విమానం.. పైలట్ మృతి
వంగలపూడి అనితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన కన్నబాబు
టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు
తండ్రి కంటే డేంజర్.. సిగ్గు శరం ఉందా కిరణ్..

