టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. హెడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ఓటమితో ఆరంభించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ప్రిటోరియా క్యాపిటల్స్ పరాజయం పాలైంది.
మొదట బ్యాటింగ్ చేసిన జోబర్గ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(2) విఫలమైనప్పటికి రైలీ రూసో (48), వియాన్ ముల్డర్ (43) కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతో సూపర్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.
ప్రిటోరియా బౌలర్లలో టైమల్ మిల్స్, కోడి యూసుఫ్ తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా జట్టుకు ఓపెనర్లు విల్ స్మీడ్ (34), బ్రైస్ పార్సన్స్ (41) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.
ఒక దశలో 71/1తో పటిష్టంగా ఉన్నప్పటికీ.. ప్రిటోరియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రిటోరియా లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ కింగ్స్ బౌలర్లలో డువాన్ జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ రెండు వికెట్లు సాధించాడు.
కాగా గంగూలీ ఓ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండడం ఇదే తొలిసారి. ప్రధాన కోచ్‌గా అరంగేట్రంలోనే ఓటమి ఎదురైంది. దాదా గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, దుబాయ్ క్యాపిటల్స్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించారు. ప్రిటోరియా క్యాపిటల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ కావడం గమనార్హం.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ..


