Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Ys Jagan Serious On Mannava Village Sarpanch Nagamalleswara Rao Incident1
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్‌ జగన్‌ శుక్రవారం (జులై 4) ఎక్స్‌ వేదికగా స్పందించారు.‘రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోంది. వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్‌ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్‌సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్‌ ఆర్డర్‌ కాపాడలేని ప‌రిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోంది. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యంకూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

Video Of Escaped Pet Lion In Pakistan Lahore Street2
Video: తప్పించుకుని వచ్చిన పెంపుడు సింహం.. జనాలపై దాడి

లాహోర్‌: పెంపుడు జంతువుల్లో మనం ఎక్కువగా చూసేది కుక్క. ఈ మధ్య క్రూర మృగాలను కూడా పెంచుకుంటున్న వారు కూడా లేకపోలేదు. క్రూర మృగాలను పెంచుకుంటే ఏమౌతుందో తాజా ఘటనతో అద్దం పడుతోంది,. పాకిస్తాన్‌లో ఓ కుటుంబం సింహాన్ని పెంచుకుంటుంది. ఇది వారి రాయల్టీకీ సింబాలిక్‌ ఏమిటో గానీ, ఇప్పుడు అదే సింహం ఇద్దరు చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది. సదరు ఇంటి నుంచి తప్పించుకుని వచ్చిన సింహం.. వీధుల్లో పడింది. తొలుత తప్పించుకున్న సింహం ఓ గొడపై మాటువేసి మరీ జనాలపై దాడి చేసింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో లాహోర్‌లోని షా దీ కోయి ఏరియాలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి తప్పించుకున్న సింహం.. షాపింగ్‌ వెళుతున్న మహిళపై ముందుగా దాడికి దిగింది. మహిళను వెంబడించి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాము పెంచుకుంటున్న సింహం.. జనావాసాలపై దాడి చేసిందనే వార్త తెలియగానే ఆ ఇంటి యజమానులు అది చూసి ఆనందించినట్లు పిల్లల్ని కోల్పోయిన తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగితే, శుక్రవారం సింహాన్ని పెంచుకుంటున్న యజమానులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత వారు ఇంటి నుంచి పారిపోయారని, కానీ 12 గంటల్లో వారిని అరెస్ట్‌ చేసినట్లు లాహోర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆపరేషన్స్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఆ సింహం 11 నెలల మగ సింహమని, దాన్ని పట్టుకుని వైల్డ్‌ లైఫ్‌ పార్క్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.A pet lion, illegally kept in Lahore's Shah Di Khoi area, mauled two children and a woman after escaping. The 5-year-old and 7-year-old are in critical condition at Jinnah Hospital. For more details: https://t.co/UwQpv7eXuA#Lahore pic.twitter.com/h2xI9RhSn5— Daily Pakistan English (@endailypakistan) July 4, 2025

Musheer Khan Scored Yet Another Hundred And 6 Wicket Haul In England Tour3
ఇంగ్లండ్‌లో కొనసాగుతున్న టీమిండియా యువ సంచలనం హవా.. మరో సెంచరీ, 6 వికెట్లు

ఇంగ్లండ్‌ పర్యటనలో భారత యువ సంచలనం ముషీర్‌ ఖాన్‌ హవా కొనసాగుతోంది. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఎమర్జింగ్‌ టీమ్‌ (MCA Colts) తరఫున ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న ముషీర్‌.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అదిరిపోయే ఆల్‌రౌండ్‌ ప్రదర్శనలతో అదరగొట్టాడు.Notts 2nd XIతో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో 123 పరుగులు (127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో) చేసిన ముషీర్‌.. ఆతర్వాత బౌలింగ్‌లో 6 వికెట్ల ప్రదర్శన (8.2 ఓవర్లలో 6/31) నమోదు చేశాడు.తాజాగా రెండో మ్యాచ్‌లోనూ ముషీర్‌ తొలి మ్యాచ్‌ తరహా ప్రదర్శనలు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో కూడా ముషీర్‌ సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి భారత క్రికెట్‌ అభిమానులు ముషీర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.భారత క్రికెట్‌కు మరో భవిష్యత్తు తార దొరికాడని ఆకాశానికెత్తుతున్నారు. ముషీర్‌కు సంబంధించిన తాజా వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది.కారు ప్రమాదం నుంచి బయటపడి..!20 ఏళ్ల ముషీర్‌ గతేడాది సెప్టెంబర్‌లో కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ముషీర్‌ మెడకు బలమైన గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత ముషీర్‌ ఆడుతున్న తొలి రెడ్‌ బాల్‌ టోర్నీ ఇదే. ముషీర్‌ తన చివరి రెడ్‌ బాల్‌ మ్యాచ్‌ను దులీప్‌ ట్రోఫీలో ఇండియా-బి తరఫున ఆడాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ముషీర్‌ ఐపీఎల్‌ 2025లో ఆడాడు (పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఓ మ్యాచ్‌). ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో ముషీర్‌ డకౌటై నిరాశపరిచాడు. ఆ మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ముషీర్‌ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్‌లో ముషీర్‌ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్‌ అగర్వాల్‌ వికెట​ పడగొట్టాడు.ముషీర్‌ ఖాన్‌ మరో టీమిండియా అప్‌ కమింగ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు. ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్‌.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్‌ సెంచరీ కూడా ఉంది.ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ముషీర్‌ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్‌ 2024 అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్‌ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్‌.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

Ferrari zips around Bengaluru for a year without tax made to pay Rs 1 4 cr after RTO steps in4
రూ.7.5 కోట్ల కారు.. బడా బిజినెస్‌మ్యాన్‌ కక్కుర్తి..

రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించకుండా బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న ఫెరారీ లగ్జరీ సూపర్ కారును ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులు పట్టుకున్నారు. ట్యాక్స్‌ కడతావా.. సీజ్‌ చేయమంటావా అని అధికారులు పట్టుబట్టడంతో కారు యజమాని రూ.1.42 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.రూ.7.5 కోట్ల విలువైన బ్రైట్‌ రెడ్‌ ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కారు కొన్ని నెలలుగా బెంగళూరు వీధుల్లో షికారు చేస్తోంది. ఈ లగ్జరీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిందని, అలాంటి వాహనాలపై అక్కడ లైఫ్‌టైమ్‌ ట్యాక్స్‌ రూ.20 లక్షలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. ‘మహారాష్ట్రలో ఇలాంటి కార్లపై పన్ను రూ.20 లక్షలు కాగా, కర్ణాటకలో ఇది దాదాపు రూ.1.5 కోట్లు. ఈ వాహనం రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది’ అని రవాణా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.జయనగర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారులు నగరంలో తరచూ కనిపిస్తున్న ఫెరారీ కారుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని డ్రైవర్ తొలుత చెప్పాడు. కారు రిజిస్ట్రేషన్‌ను పరిశీలించిన అధికారులు కర్ణాటక పన్ను చెల్లించకుండా 18 నెలలకు పైగా బెంగళూరులో ఈ వాహనం తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏం చేయాలని అధికారులు తమ ఉన్నతాధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఫెరారీ కారు యజమాని అదే రోజు పన్నులు, జరిమానాల రూపంలో రూ.1.4 కోట్లు చెల్లించాడు.కాగా ఈ ఖరీదైన ఫెరారీ కారు యజమాని ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోని 55 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్త తక్కువ పన్ను రేటు కారణంగా మహారాష్ట్రలో తన ఫెరారీ కారును రిజిస్టర్ చేయించుకుని బెంగళూరులో తిప్పుతున్నన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో ఏడాదికి పైగా బయటి రాష్ట్రాల వాహనాలను ఉపయోగించే వారు ఇక్కడ లైఫ్‌టైమ్‌ రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.పన్ను ఎగవేతకు పాల్పడిన లగ్జరీ కార్ల యజమానులపై బెంగళూరు ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కర్ణాటక వెలుపల రిజిస్టర్ అయిన హై ఎండ్ వాహనాల నుంచి రూ.40 కోట్ల బకాయిలు వసూలు చేశారు.

China urges India to act cautiously amid row over Next Dalai Lama5
మీరు అలా ఎలా అంటారు?: భారత్‌ వైఖరిపై చైనా

బీజింగ్‌: ప్రస్తుతం టిబెటన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసుడి ఎంపికపై చర్చ నడుస్తోంది. తమ అదుపులో ఉండే వ్యక్తిని నియమించుకోవాలని చైనా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అయితే 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉందని, ఆయన వారసుడిని నిర్ణయించే హక్కు ఆయనకు మాత్రమే ఉందని భారత్‌ స్పష్టం చేసింది. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందులో టిబెటన్ల జోక్యాన్ని నివారించేందుకు భారత్‌ చొరవ చూపితే బాగుంటుందని పేర్కొంది. అత్యంత గౌరవప్రదమైన ఈ వ్యవహారంలో టిబెటన్ల జోక్యాన్ని పక్కకు పెట్టేందుకు సహకరించాలని భారత్‌కు విన్నవించింది చైనా. ఇక ప్రస్తుత 14వ దలైలామా వ్యతిరేక వేర్పాటువాద స్వభావాన్ని భారత్‌ స్పష్టంగా తెలుసుకుని మాట్లాడితే మంచిదని, టిబెట్‌ సంబంధిత అంశాలపై తమ నిబద్ధతలను గౌరవించాలని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానమిచ్చారు.ఇదీ చదవండి: ఆ హక్కు ఆయనది మాత్రమే.. దలైలామా వారసుడి ఎంపికపై భారత్‌

AICC Chief Kharge Serious Warning To MLAs At TPCC Meeting6
‘మీలాంటోళ్లను చూసి భయపడం..’ టీపీఏసీ భేటీలో ఖర్గే వ్యాఖ్యలు

గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని తప్పుబడుతూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌, సాక్షి: ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నలుగురైదుగురు గ్రూపులు కడితే భయపడతాం అనుకుంటున్నారా?. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేనూ రాహుల్‌ అసలు పట్టించుకోం. వాళ్ల సంగతి పార్టీ క్రమశిక్షణా కమిటీ తేలుస్తుంది. అందుకే పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలి’’ అని సున్నితంగా హెచ్చరించారు. మరో సీనియర్‌ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నేతలకు చురకలంటించారు. ‘‘కాంగ్రెస్‌లో కొంత మంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మన ప్రతీ మూమెంట్ ప్రజలు గమనిస్తారు. అందుకే ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యవహార శైలితో పార్టీకి కొత్త నష్టం చేస్తే ఊరుకోం. పార్టీ ఉంటేనే మీరుంటారు. సొంత ఎజెండాతో పనిచేసే వారిపై వేటు తప్పదు. పార్టీ, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. జిల్లాల వారీగా ఆశావహుల లిస్టును పీసీసీ సిద్ధం చేయాలి అని సూచించారు. ఈ మీటింగ్‌ వేదికగా.. పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ఖర్గే టీపీసీసీకి డెడ్ లైన్ విధించారు. ‘‘ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలి. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దే బాధ్యత’’ అని ఖర్గే అన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌ కలగజేసుకుని ఇంచార్జీ మంత్రులు బాధ్యత తీసుకొని పదవుల భర్తీ కోసం లిస్టులు టీపీసీసీ చీఫ్‌కు పంపాలని చెప్పారు. ఆ వెంటనే ఖర్గే మరోసారి ‘పార్టీలో పనిచేసిన వారికి.. అర్హత ఉన్నవాళ్లకే పదవులు ఇవ్వాలి’’ అని సూచించారు. టీపీసీసీ విస్తృత స్థాయి, కార్యవర్గ సమావేశాల్లోనూ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ లో పరిపాలన బావుంది, పార్టీ కార్యకర్తల పనితీరు బావుంది. పార్టీ మీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలి. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ఖర్గే ప్రసంగించారు. జడ్చర్ల ఎమ్మెల్యేపై పీసీసీ చీఫ్‌ ఆగ్రహంజడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీని పీసీసీ చీఫ్‌ ఆదేశించారు. సోమవారం జరగబోయే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Actor Vijay Is TVK Official Chief Minister Candidate For TN Polls7
టీవీకే సీఎం అభ్యర్థిగా నటుడు విజయ్‌

తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్‌(Joseph Vijay Chandrasekhar) పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.శుక్రవారం ఉదయం చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయంలో విజయ్‌ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజయ్‌ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే కార్యవర్గం. అలాగే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ‘‘బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవు. ఈ ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదు’’:::విజయ్‌ వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అటుపై ఎన్నికల దాకా గ్రామగ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్‌ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది.అంతేకాదు.. తాజాగా అమిత్‌ షా చేసిన ఆంగ్ల భాష కామెంట్లు.. తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే పేర్కొంటూ ఖండించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. అలాగే.. ఎలక్టోరల్‌ రివిజన్‌ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీవీకే తప్పుబట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమేనని ఆరోపించింది. భారత సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్న విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాట మాత్రమే కాదు.. యావత్‌ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనూహ్యంగా.. 2024 ఫిబ్రవరి 2వ తేదీన సెక్యులర్ సోషియల్ జస్టిస్ అనే సిద్దాంతంతో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని విజయ్‌ ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో తొలి రాజకీయ మహాసభ నిర్వహించగా.. అది సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. ఆ మహాసభ వేదికగా.. తన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రకటించారాయాన. పెరియార్, అంబేడ్కర్, కామరాజ్, వేలు నాచియార్ తదితరుల ఆశయాలపై నడుస్తానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నీట్‌, జాతీయ నూతన విద్యా విధానం.. త్రిభాషా సిద్ధాంతం అమలు లాంటి అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ రాజకీయంగానూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

Ap Police Rudely Against Yoga Teachers8
లోకేష్‌ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసు జులుం

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం వద్ద యోగా టీచర్ల నిరసన రెండో రోజూ కొనసాగింది. ఆ సమయంలో మంతత్రి నారా లోకేష్‌ ఆదేశాలతో యోగా టీచర్లపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మాకు వేతనాలు చెల్లించాలి. యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలి’’ అని డిమాండ్‌ చేస్తూ నిన్నటి నుంచి 1,056 మంది యోగా టీచర్లు సీఎం నివాసం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అయితే.. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కనీసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను అయినా కలిచి తమ గోడును వినిపించాలని వాళ్లు ప్రయత్నించారు. అయితే అక్కడ ఉండడానికి వీల్లేదంటూ పోలీసులు వాళ్లను వెళ్లగొట్టే ప్రయత్నం చేయగా.. యోగాసనాలు వేస్తూ నిరసనలతో లోకేష్‌ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాళ్లను బలవంతంగా అక్కడి నుంచి పంపించారు. అయితే..ఇవాళ మళ్లీ నిరసనకు దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మంత్రి లోకేష్‌ ఆదేశాలతో పలువురిని అరెస్ట్‌ చేయగా.. మహిళలని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా నెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమ వద్ద నుంచి పోలీసులు ఫోన్లు లాక్కున్నారని, దురుసుగా ప్రవర్తించారని యోగా టీచర్లు వాపోయారు.

Cancer Gave Me 100 Days to Live Daughter Asked Will You Dance My Wedding9
నాన్నా నా పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తావా..? ఆ మాటలే ఊపిరి పోశాయి..

హాయిగా సాగిపోతున్న జీవితాన్ని భయానక వ్యాధులు ఒక్క ఊదుటన మొత్తం జీవితాన్నే తలికిందులు చేస్తాయి. వైద్యానికి అయ్యే ఖర్చులతో కుటుంబాన్నే రోడ్డుమీదకు తీసుకొచ్చేస్తాయి. వీటన్నింటికి తోడు ఆ మహమ్మారి పెట్టే భయాన్ని తట్టకోవాలంటే కొండంత ధైర్యం ఉండాల్సిందే. అలా అనితరసాధ్యమైన స్థైర్యంతో ఓ నాన్న కూతురు కోసం కేన్సర్‌ మహమ్మారిని ఎలా జయించాడో తెలిస్తే..హృదయం ద్రవించిపోతుంది. లెక్కలేనన్ని సర్జరీలు, బతుకుతానా లేదా అన్న నిరాశ నిస్ప్రహల నడుమ పోరాడి గెలిచిన ఓ తండ్రి కథ ఇది.అతడే 60 ఏళ్ల అర్జున్ సేన్. అతడు మార్కెటింగగ్‌ ఎగ్జిక్యూటివ్‌. అతను పాడ్‌కాస్ట్‌ హోస్ట్‌ రచయిత, వ్యవస్థాపకుడు కూడా. కానీ అతడి జీవితం ప్రతిక్షణం మరణం అనే పంజాను విసురుతూనే ఉండేది. కానీ ప్రతిసారి అతడి నవ్వు ముందుకు ఓడిపోయింది. ఆయకు 1996లో, కడుపుకు మెటాస్టాసిస్ అనే స్వరపేటిక కేన్సర్‌ వచ్చింది. వైద్యులు వంద రోజులకు మించి బతికే ఛాన్స్‌ లేదని చెప్పేశారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఆ వ్యాధి సోకినప్పడు అర్జున్‌కి 32 ఏళ్లు. వాస్తవానికి అర్జున్‌ అందరిని నవ్వించేవాడే..ఈ రోజు నిరాసనిస్ప్రుహలతో ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. సరిగ్గా అతడి కూతురు రాకా అతడిని చూసి.." నాన్న చనిపోవడం అంటే ఏమిటి, నువ్వు చనిపోతున్నావా..? మరి నా పెళ్లిలో డ్యాన్స్‌ చేయవా అంటూ అమాయకంగా అడిగిన కూతురు మాటలకు నిశ్చేష్టుడయ్యాడు. కాసేపటికి తేరుకుని అప్పుడే పెళ్లికి ఎందుకు తొందరపడుతున్నావ్‌ రా అనగానే కూతురు మోములోని సిగ్గు అతని ముఖంలోకి నవ్వు తెప్పించింది. పైగా కూతురిని దగ్గరకు తీసుకుని లేదు కచ్చితంగా నీ పెళ్లిలో ఈ నాన్న డ్యాన్స్‌ చేస్తాడు అని కూతురికి వాగ్దానం చేశాడు." అది అబద్ధమని తెలిసి కూడా అప్రయత్నంగా అర్జున్‌ ఆ మాటలు అనేశాడు. కానీ ఆ మాటలే ఆ తండ్రికి ఊపిరిపోశాయి..అప్పటి దాక ఉన్న బాధకు ఆ నవ్వు ఔషధంగా మారింది. తనకింకా వంద రోజుల కాదు వేల వందల 24 గంటలు ఉన్నాయన్నంత కొండంత ఆశను, ధైర్యాన్ని అందించాయి. అసలు ఈ మహమ్మారి ముందు చేతులు పైకెత్తేసి ఓడిపోవడం దేనికి పోరాడితే ఏముంది అనే శక్తిమంతమైన ఆలోచనను రేకెత్తించింది. ఆ ధైర్యంతోనే ఫిజియోథెరపీ చికిత్సలు తీసుకునేవాడు..ప్రతిసారి ట్రీట్‌మెంట్‌కి వెళ్లినప్పుడూ తాను బయటపడతానా అనే ప్రశ్న వైద్యులను అడిగేవారు..వాళ్లు కూడా బి పాజిటివ్‌ అనేవారే తప్ప..పర్లేదు బయటపడగలవు అనే భరోసా ఇవ్వలేకపోయేవారు. అయినా సరే అర్జున్‌కి తన కూతురు రాకా కోసం బతికి బట్టగట్టగాలి అనే మొండి ధైర్యాన్ని కొని తెచ్చుకుని మరి చికిత్స తీసుకునేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా 20 సర్జరీలు చేయించుకున్నాడు, మంచి ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకున్నాడు. అలా ఆ మహమ్మారి నుంచి బయటపడి కూతురికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేగాదు అతడి గాథని పికూ (2015), విక్కీ డోనర్ (2012) ఫేమ్ దర్శకుడు షూజిత్ సిర్కార్ ఐ వాంట్ టు టాక్ మూవీగా తెరకెక్కించాడు. ఈ మూవీలోని తండ్రి కూతుళ్ల మధ్య సైలంట్‌గా సాగే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. బాక్సాపీస్‌ వద్ద విమర్శకుల ప్రశంసలందుకుంది కూడా. అసలు ముందు మనమే సమస్యకు భయపడిపోతే ఎలా మన కంటి పాపల కోసమైన మృత్యువుతో పోరాడే చిన్న ‍ప్రయత్నమైనే చేయాలి అని చాటిచెప్పే భావోద్వేగా కథ ఇది.(చదవండి: కపిల్‌ శర్మ వెయిట్‌ లాస్‌​ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్‌..?)

Nithiin Starrer Thammudu Movie Review and Rating In Telugu10
తమ్ముడు మూవీ రివ్యూ

టైటిల్‌: తమ్ముడునటీనటులు: నితిన్‌, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్‌ తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్నిర్మాత : దిల్‌ రాజు, శిరీష్‌దర్శకత్వం: శ్రీరామ్‌ వేణుసంగీతం: అజనీష్‌ లోకనాథ్‌సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్‌ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడివిడుదల తేది: జులై 4, 2025నితిన్‌ ఖాతాలో హిట్‌ పడి చాలా ఏళ్లు అయింది. భారీ అంచనాలు పెట్టుకున్న రాబిన్‌ హుడ్‌ కూడా నితిన్‌ని నిరాశ పరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో పవన్‌ కల్యాణ్‌ ఆల్‌ టైం సూపర్‌ హిట్‌ ‘తమ్ముడు’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం నితిన్‌ని హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? లేదా? రివ్యూ (Thammudu Movie Review)లో చూద్దాం.కథజై (నితిన్‌) ఆర్చరీలో ఇండియాకి గోల్డ్ మెడల్ తేవాలనుకుంటాడు. కానీ ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేకపోతాడు. దానికి కారణం.. చిన్నప్పుడు తన అక్క స్నేహలత అలియాస్ ఝాన్సీ( లయ) విషయంలో చేసిన ఒక చిన్న తప్పు! ఆ తప్పు కారణంగా అక్క అతన్ని చిన్నప్పుడే దూరం పెడుతుంది. అక్కని కలిస్తే తప్ప తను ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టలేనని స్నేహితురాలు చిత్ర ( వర్ష బొల్లమ) తో కలిసి వైజాగ్‌ వస్తారు. అక్క కోసం వెతకగా ఆమె ఫ్యామిలీతో కలిసి అంబరగొడుగు జాతర వెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో జై అక్కడికి వెళ్తాడు. అక్కడ బిజినెస్‌మెన్‌ అజార్వాల్ మనుషులు ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తారు. అజార్వాల్ మనుషులు ఝాన్సీని ఎందుకు టార్గెట్ చేశారు? వారి బారి నుంచి అక్కని జై ఎలా రక్షించాడు? అతనికి గిరిజన యువతి రత్నం (సప్తమి గౌడ) ఎలాంటి సహాయం చేసింది? ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఝాన్సీ ఇచ్చిన మాట ఏంటి? చివరకు అది నెరవేరిందా లేదా? అక్క విషయంలో జై చేసిన తప్పు ఏంటి? చివరకు అక్కతో ప్రేమగా తమ్ముడు అనిపించుకున్నాడా లేదా అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే...అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు చేసిన పోరాటమే ఈ సినిమా కథ. చాలా రొటీన్ స్టోరీ. కానీ దర్శకుడు తనదైన స్క్రీన్‌ప్లేతో తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. సినిమాకి కీలకమైన అక్క- తమ్ముడు సెంటిమెంట్‌ను ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతిదీ మన ఊహకి అందేలా సాగడం, ఎమోషనల్ సన్నివేశాలు సరిగా పండకపోవడం సినిమాకి మైనస్ అనే చెప్పాలి.ఫ్యాక్టరీ ప్రమాదం సన్నివేశంతో చాలా ఎమోషనల్‌గా కథను ప్రారంభించాడు దర్శకుడు. విలన్ పరిచయం సీన్ డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు. భారీ ఎలివేషన్‌తో విలన్‌ను పరిచయం చేసి.. ఆ తరువాత కథని హీరో వైపు మళ్లించాడు. ఆర్చరీలో బంగారు పథకమే లక్ష్యం గా ఉన్న జై... అక్క విషయంలో చేసిన తప్పుని పదేపదే గుర్తు తెచ్చుకోవడం... కోచ్ చెప్పిన మాటతో అక్క కోసం వెళ్ళడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అంబరగొడుగు నేపథ్యం సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఊహించింది తెరపై జరుగుతుంటే కొన్ని చోట్ల ఎంజాయ్ చేస్తాం. ఇంటర్వెల్ వరకు కథనం సోసోగానే సాగుతుంది. అజార్వాల్ గ్యాంగ్ నుంచి ఝాన్సీ ఫ్యామిలీని జై ఎలా రక్షించాడు? అనేదే సెకండాఫ్ స్టోరీ. అయితే మధ్య లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. యాక్షన్ కొరియోగ్రఫీ కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌ రొటీన్‌గా సాగుతుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్‌ సినిమాకు ప్లస్‌ పాయింట్‌గా నిలిచింది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.ఎవరెలా చేశారంటే..జై పాత్రలో నితిన్ (Nithiin) చక్కగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. అయితే ఆయన ఈ సినిమాలో హీరో అనడం కంటే... కీలక పాత్రధారి అని చెప్పడం బెటర్. రత్నం పాత్రకి సప్తమి గౌడ న్యాయం చేసింది. ఝాన్సీగా లయ నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. చిత్రగా వర్ష బొల్లమ్మ బాగా నటించింది. మిగతావాళ్లందరూ తమ పాత్రలతో మెప్పించారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌ డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement