
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veera Mallu Movie) ట్రైలర్‌ను గురువారం (జూలై 3) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం. రత్నం సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. అందులో జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ కూడా ఉన్నాడు.
ఈవెంట్ మొదలైన కాసేపటికి అనుదీప్ (Anudeep K.V) స్టేజీపైకి ఎక్కేందుకు వెళ్లాడు. కానీ, అక్కడున్న పోలీసులు అతడిని అడ్డుకుని ముందుకు వెళ్లనివ్వలేదు. అనుదీప్‌ను గుర్తించక వెనక్కు నెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయ్యో, మా అనుదీప్‌ను గుర్తుపట్టలేదా? అందరిముందు పరువు పోయిందిగా అంటూ నెటిజన్లు పలు మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. పిట్టగోడ చిత్రంతో దర్శకుడిగా మారాడు అనుదీప్. రెండో సినిమా 'జాతిరత్నాలు'తో సూపర్ హిట్ అందుకున్నాడు. తమిళ హీరో శివకార్తికేయన్‌తో ప్రిన్స్ మూవీ తీశాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, కల్కి 2898 ఏడీ చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించాడు.
Paavam Anudeeep KV 😂😂🤣🤣😭😭
Andari mundhu paravu poindi ga 😭😭#HHVMTrailer #HariHaraVeeraMallu #HariHaraVeeraMalluTrailer pic.twitter.com/5vauW1ALXn— Vamc Krishna (@lyf_a_zindagi) July 4, 2025
చదవండి: బిగ్‌బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే!