
విజయవాడ: విదేశీ వైద్య విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఇగో ఏంటో అర్థం కావడం లేదని,. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉంటే తమకు ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చేది కాదని వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం అధ్యక్షులు సీదిరి అప్పలరాజు తెలిపారు. పర్మినెంట్ రిజస్ట్రేషన్ల కోసం ధర్మాచౌక్‌లో ఈరోజు(శుక్రవారం, జూలై 4వ తేదీ) సైతం నిరసన చేపట్టిన వైద్య విద్యార్థుల ఆందోళనకు డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తదితరులు తమ మద్దతు తెలిపారు. విద్యార్థుల శిబిరానికి చేరుకుని వైఎస్సార్‌సీపీ నేతల మద్దతు తెలిపారు.
దీనిలో భాగంగా సీదిరి అప్పలరాజా మాట్లాడుతూ.. ‘న్యాయమైన డిమాండ్ ను అడిగితే విద్యార్ధులను రోడ్డుకు ఈడుస్తారా?, విద్యార్ధినుల జుట్టుపట్టి కొట్టేస్తారా?, మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా ...తాలిబాన్ లో ఉన్నామా?, వైద్య విద్యార్ధులను జుట్టుపట్టి లాక్కెళ్లి అరెస్ట్ చేస్తారా?, ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది?, 13 నెలలుగా కాలయాపన చేసి చివరికి విద్యార్ధులను ఎండలో కూర్చోబెట్టారు. వైద్య విద్యార్ధుల ఏడుపు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించాలి. వైద్య రంగం సంపూర్ణంగా పనిచేయాలని జగన్ కృషి చేశారు.
50 వేల మందిని రిక్రూట్ చేశారు. జగన్ 17 మెడికల్ కాలేజీలు తెస్తే...ఈ ప్రభుత్వం వాటిని కట్టకుండా ఆపేసింది. ఏడాదిలో లక్షా 70 వేల కోట్లు అప్పు తెచ్చారు చంద్రబాబు. ఆరువేల కోట్లతో పూర్తయ్యే మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవంటున్నారు. లక్ష కోట్లతో బిల్డింగ్‌లు ,బొలేరోలు కొనుక్కోవడానికి డబ్బులున్నాయంటున్నారు. వైద్య ఆరోగ్యశాఖమంత్రి సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెడుతున్నారు. బ్లాకే మెయిల్ చేస్తారా అని సాక్షాత్తూ మంత్రే విద్యార్ధులను బెదిరిస్తున్నారు విద్యార్ధుల పట్ల మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదు’ అని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు.

ఇది ప్రభుత్వం చేతగానితనం
వైద్య విద్యార్తులు రోడ్డెక్కాల్సిన రావడం ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనిరవాసరెడ్డి. ‘ చంద్రబాబు,లోకేష్ పరిపాలనను గాలికొదిలేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పై దృష్టిపెట్టారు. ఎవరి పై కేసులు పెట్టాలి...ఎవరిని లోపల పెట్టాలనేదే వాళ్ల ఆలోచన. విద్యార్ధుల భవిష్యత్ తో ఆటలాడుకుంటున్నారు. ఏపీలో మినహా దేశంలో అన్ని రాష్ట్రాల్లో పర్మినెంట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తున్నారు. ఏపీలోనే ఎందుకు ఈ సమస్య వచ్చింది
మీకు ఇవ్వడం చేతకాకపోతే ఎన్ఓసి ఇవ్వండి వేరే రాష్ట్రానికి వెళ్లి తెచ్చుకుంటారు. 68 మంది విద్యార్ధుల పై కేసులు పెట్టారు. ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి తమ పిల్లలను చదివించుకున్న తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. చంద్రబాబు,లోకేష్ ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విడనాడండి. డాక్టర్లను రోడ్డు మీదకు వదిలేశారు. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి వైద్య విద్యార్ధుల సమస్యను పరిష్కరించాలి’ అని గోపిరెడ్డి శ్రీవినాసరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: