
బీజింగ్: ప్రస్తుతం టిబెటన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసుడి ఎంపికపై చర్చ నడుస్తోంది. తమ అదుపులో ఉండే వ్యక్తిని నియమించుకోవాలని చైనా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అయితే 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉందని, ఆయన వారసుడిని నిర్ణయించే హక్కు ఆయనకు మాత్రమే ఉందని భారత్ స్పష్టం చేసింది.
దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందులో టిబెటన్ల జోక్యాన్ని నివారించేందుకు భారత్ చొరవ చూపితే బాగుంటుందని పేర్కొంది. అత్యంత గౌరవప్రదమైన ఈ వ్యవహారంలో టిబెటన్ల జోక్యాన్ని పక్కకు పెట్టేందుకు సహకరించాలని భారత్‌కు విన్నవించింది చైనా. ఇక ప్రస్తుత 14వ దలైలామా వ్యతిరేక వేర్పాటువాద స్వభావాన్ని భారత్ స్పష్టంగా తెలుసుకుని మాట్లాడితే మంచిదని, టిబెట్ సంబంధిత అంశాలపై తమ నిబద్ధతలను గౌరవించాలని పేర్కొంది.
ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత కేంద్రమంత్రి కిరణ్ రిజుజు చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానమిచ్చారు.
ఇదీ చదవండి: