
ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేసి మరి ప్రపోజ్ చేస్తుంటారు. ఎలాంటి డిస్టబెన్స్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని మరి అందుకోసం ప్లాన్ చేసుకుంటారు. కాస్త ధనవంతులైతే..వారి రేంజ్కి తగ్గట్లుగా ఏ ఫ్లైట్ లేదా అత్యుద్భుతమైన పర్యాటక ప్రదేశంలోనో ప్లాన్ చేస్తారు. కానీ ఈ జంట ఎలాంటి ప్రదేశాన్ని ఎంచుకుందో చూస్తే నోరెళ్లబెడతారు.
అమెరికాకు చెందిన బ్రైస్ షెల్టన్, పైజ్ బెర్డోమాస్‌లకు ప్రకృతి వైపరిత్యాలను నిలయమైన ప్రదేశాలంటే అమితా ఆసక్తి. ఆ ఇష్టంతోనే విభిన్న వాతావరణ ప్రాంతాలున్న చోటులను అన్వేషిస్తూ టూర్లు చుట్టొస్తారిద్దరు. ఇద్దరు అభిరుచులు ఒక్కటే. మంచి స్నేహితులు కూడా. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ఇష్టం కాస్తా ప్రేమగా మారింది. అయితే ఓ మంచి టైంలో తన గర్ల్‌ఫ్రెండ్ బెర్డోమాస్కు ఆ విషయం తెలిపేలా ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.
అందుకోసం 18 వారాలుగా నిరీక్షించి మరీ షెల్టన్ తన గర్ల్‌ఫ్రెండ్ బెర్డోమాస్ని సౌత్ డకోటాకు తీసుకువస్తాడు. అక్కడ షెల్టన్ సరిగ్గా ప్రపోజ్ చేస్తుండగా..తను కోరుకున్నట్లుగా హఠాత్తుగా టోర్నోడో వస్తుంది. పైగా ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు షెల్టన్. అలాంటి భయంకర ప్రకృతి వైపరిత్యం టైంలోనే తన గర్ల్‌ఫ్రెండ్కి ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నా..కానీ సరిగ్గా ఆ టైంకి ఇలా జరుగుతుందా లేదా అని చాలా భయపడ్డానని చెబుతున్నాడు షెల్టన్.
ఇక్కడ షెల్టన్ చెప్పే సమయానికే ఆ టోర్నడో(సుడిగాలి) వారిని సమీపించేస్తోంది కూడా. కానీ ప్రేమకు అవేమి కనిపించవు అన్నట్లుగా మునిగిపోయారు ఇద్దరు. అతడి గర్ల్‌ప్రెండ్ సైతం ఈ సర్ప్రైజ్కి ఆశ్చర్యంతో ఉబితబ్బిబైంది.
How on earth could this day ever be topped. Experienced this in South Dakota with the love of my life and now FIANCE as he proposed in the most epic way imaginable. Cannot wait to spend the rest of my life with you @BryceShelton01 ❤️😭 pic.twitter.com/YwaaLF9tMm
— Paige Berdomas🌪 (@tornadopaigeyy) June 29, 2025
(చదవండి: "దాల్ తల్లి": ఆ విదేశీ బామ్మ నిస్వార్థ సేవకు మాటల్లేవ్ అంతే..!)