
చక్కగా ఫుడ్‌ని ఆస్వాదించి ఎలా ఉందో చెప్పే ఫీల్ భలే ఉంటుంది. మన ఇంట్లో మనం చెప్పేస్తాం. గానీ బయట రెస్టారెంట్లో టేస్ట్ చూసి చెప్పే సోషల్‌మీడియా ఔత్సాహికులను చూస్తే..ఆహా ఈ పేరుతో భలే అన్ని వంటకాలు రుచి చూస్తేస్తున్నారుగా అనిపిస్తుంది కదూ..!. అలానే ఇద్దరు ఫుడ్ బ్లాగర్‌లు ఒక రెస్టారెంట్లో ఫుడ్‌ని రుచి చూసి రివ్యూ ఇచ్చేలోపు చావు పరిచయమైంది. పాపం ఆ ఇద్దరు బాబోయ్ ఇలాంటి అనుభవం ఎవ్వరికి వద్దు అని దండం పెట్టేస్తున్నారు.
ఏం జరిగిందంటే..హుస్టన్‌కి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ నినా శాంటియాగో, తన తోటి కంటెంట్ క్రియేటర్ పాట్రిక్ బాలివుడ్‌తో కలిసి ఒక రెస్టారెంట్‌కి వచ్చారు. అక్కడ ఫుడ్ రివ్యూ ఇచ్చే ఒక వీడియోని రికార్డు చేస్తున్నారు ఇద్దరు. అందులో భాగంగా ఆ రెస్టారెంట్‌లోని శాండ్‌విచ్ శాంపిల్‌ని టేస్ట్ చేసి రేట్ ఇవ్వబోయే సమయానికి ఊహించని హఠాత్పరిణామం చోటు చేసుకుంది.
సరిగ్గా అదే సమయానికి ఓ ఎస్‌యూవీ కారు రెస్టారెంట్‌లోకి దూసుకొచ్చి వారి ఫుడ్ టేబుల్‌ని స్ట్రాంగ్‌గా ఢీ కొట్టింది. ఆ షాకింగ్ ఘటనకు శాంటియోగా కిందపడిపోగా, మరొకరు నిలదొక్కుకుని అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. చెప్పాలంటే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఆ ఫుడ్ బ్లాగర్లకి. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ..ఆ ఘటనలో తమకు ఎలాంటి గాయాలు అయ్యాయో కూడా పోస్ట్‌లో వివరించారు.
ఇదేదో పగ, కోపంతో చేసినట్లుగా అనిపించింది. చెప్పాలంటే అదే మాకు చివరి భోజనం ఏమో అనిపించేలా చావుని పరిచయం చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఆ భయానక ఆపద నుంచి సునాయాసంగా బయటపడ్డాం అని చెబుతున్నారు ఆ ఫుడ్ బ్లాగర్లు.
(చదవండి: టమాటాలతో 'బయోలెదర్'..! పర్యావరణ హితం, ఆ సమస్యకు చెక్ కూడా..)