
లాహోర్: పెంపుడు జంతువుల్లో మనం ఎక్కువగా చూసేది కుక్క. ఈ మధ్య క్రూర మృగాలను కూడా పెంచుకుంటున్న వారు కూడా లేకపోలేదు. క్రూర మృగాలను పెంచుకుంటే ఏమౌతుందో తాజా ఘటనతో అద్దం పడుతోంది,. పాకిస్తాన్‌లో ఓ కుటుంబం సింహాన్ని పెంచుకుంటుంది. ఇది వారి రాయల్టీకీ సింబాలిక్ ఏమిటో గానీ, ఇప్పుడు అదే సింహం ఇద్దరు చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది.
సదరు ఇంటి నుంచి తప్పించుకుని వచ్చిన సింహం.. వీధుల్లో పడింది. తొలుత తప్పించుకున్న సింహం ఓ గొడపై మాటువేసి మరీ జనాలపై దాడి చేసింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో లాహోర్‌లోని షా దీ కోయి ఏరియాలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి తప్పించుకున్న సింహం.. షాపింగ్ వెళుతున్న మహిళపై ముందుగా దాడికి దిగింది. మహిళను వెంబడించి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే తాము పెంచుకుంటున్న సింహం.. జనావాసాలపై దాడి చేసిందనే వార్త తెలియగానే ఆ ఇంటి యజమానులు అది చూసి ఆనందించినట్లు పిల్లల్ని కోల్పోయిన తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగితే, శుక్రవారం సింహాన్ని పెంచుకుంటున్న యజమానులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత వారు ఇంటి నుంచి పారిపోయారని, కానీ 12 గంటల్లో వారిని అరెస్ట్ చేసినట్లు లాహోర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆపరేషన్స్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆ సింహం 11 నెలల మగ సింహమని, దాన్ని పట్టుకుని వైల్డ్ లైఫ్ పార్క్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
A pet lion, illegally kept in Lahore's Shah Di Khoi area, mauled two children and a woman after escaping. The 5-year-old and 7-year-old are in critical condition at Jinnah Hospital.
For more details: https://t.co/UwQpv7eXuA#Lahore pic.twitter.com/h2xI9RhSn5— Daily Pakistan English (@endailypakistan) July 4, 2025