
పాకిస్థాన్ దాడులను భారత్ తిప్పికొట్టింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాకిస్థాన్ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి. యాంటి మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే భారత్ పేల్చేసింది. ఎస్-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు తెలిసిందని భారత రక్షణశాఖ వెల్లడిచింది. లోహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్ దెబ్బతీసింది. చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను పాకిస్థాన్ ఉపయోగిస్తోంది. ఉత్తర, పశ్చిమ తీరంలో పలు మిలటరీ స్థావరాలను పాక్ టార్గెట్ చేసింది.
అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్ ,లూధియానా, అదంపుర్, బఠిండా, ఛండీగఢ్, పలోడి, ఉత్తర లాల్, భుజ్‌లపై డ్రోన్లు, మిసైళ్లతో మిలటరీ స్థావరాలను పాక్ టార్గెట్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున పాక్ మిస్సైళ్లను భారత్ కూల్చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుదర్శన చక్రను భారత్ ఉపయోగించింది. పాకిస్తాన్ ఏ ప్రాంతాలను టార్గెట్ చేసిందో. అదే ప్రాంతాల్లో పాక్‌కు భారత్ గట్టి బుద్ధి చెప్పింది.
రావల్సిండి స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. రావల్సిండి స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి చేసింది. పాకిస్థాన్ లీగ్ మ్యాచ్‌కు ముందే భారత దళాలు దాడి చేయగా.. రావల్సిండి విడిచి వెళ్లిపోవాలని క్రికెటర్లను పాక్ ఆదేశించింది.
Pakistan Air defence System in Lahore destroyed completely #IndiaPakistanWar #OperationSindoor #LahoreBlast pic.twitter.com/jLe6GIed4m
— War Room Insights (@AppWarRoom) May 8, 2025