breaking news
defence system
-
చట్టం సవరించిన చైనా.. భారత్‌కు గట్టి హెచ్చరిక!
సరిహద్దుల్లో యుద్ధం మొదలైతే సైన్యం ముందుకు కదులుతుంది.. ఆయుధాలు రంగంలోకి దిగుతాయి. కానీ అదే సమయంలో దేశంలోని ఫ్యాక్టరీలు, టెక్నాలజీ కంపెనీలు, డేటా సెంటర్లు, రవాణా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు కూడా యుద్ధంలో భాగమైతే? చైనా ఇప్పుడు సరిగ్గా అదే దిశగా అడుగులు వేస్తోంది. తన జాతీయ రక్షణ సమీకరణ చట్టాన్ని సవరించడం ద్వారా అవసరమైనప్పుడు దేశంలోని ఆర్థిక, పారిశ్రామిక, సాంకేతిక, మానవ వనరులను ఒకేసారి రక్షణ అవసరాలకు మళ్లించే వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. తాజాగా రక్షణ సమీకరణ చట్టంలో చేసిన భారీ మార్పులు.. భారత్‌కు రాబోయే యుద్ధాల అసలు స్వరూపంపై గట్టి హెచ్చరిక ఇస్తున్నాయి.2010లో అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని తొలిసారిగా భారీగా సవరించిన జిన్‌పింగ్ ప్రభుత్వం.. ఆగస్టు 28న కొత్త నిబంధనలకు ఆమోదం తెలిపింది. 72 ఆర్టికల్స్‌ను 82కు పెంచిన ఈ సవరణలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. చైనా తాజా చట్టంలో అసలు కీలకమైన అంశం ఇదే. జాతీయ సార్వభౌమత్వం, భద్రత, ప్రాదేశిక సమగ్రతతో పాటు ఇప్పుడు ‘అభివృద్ధి ప్రయోజనాలు’ కూడా రక్షణ సమీకరణకు కారణంగా చేర్చింది. అంటే సరిహద్దుల్లో యుద్ధం మొదలైనప్పుడే దేశ వనరులను సమీకరించడం కాదు.. ఆర్థిక భద్రత, సాంకేతిక ప్రయోజనాలు, విదేశీ ఆస్తులు లేదా ఇతర వ్యూహాత్మక ప్రయోజనాలకు ముప్పు వచ్చినా జాతీయ వనరులను రక్షణ అవసరాలకు ఉపయోగించే అవకాశం పెరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే.. చైనా యుద్ధాన్ని కేవలం సైన్యం చేసే పనిగా చూడటం లేదు. మొత్తం దేశ సామర్థ్యాన్ని యుద్ధానికి సిద్ధంగా ఉంచే వ్యవస్థను తయారు చేస్తోంది.ఫ్యాక్టరీ నుంచి యుద్ధభూమి వరకు.. కొత్త చట్టం ప్రకారం అవసరమైనప్పుడు కంపెనీలను పరికరాలు, ముడి పదార్థాలు, సాఫ్ట్వేర్, టెక్నాలజీ, డేటా నిల్వ చేసుకునేలా ఆదేశించవచ్చు. నిపుణులైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. సమీకరణకు ఆదేశాలు వచ్చినప్పుడు ఉత్పత్తిని పెంచాలి. అయితే, ఇక్కడే భారత్‌కు అసలు సవాలు మొదలవుతుంది. ఒకవేళ ఎల్ఏసీ వద్ద దీర్ఘకాలిక ఉద్రిక్తత ఏర్పడితే.. చైనా తన పరిశ్రమలను వేగంగా రక్షణ అవసరాలకు మళ్లించగలిగితే, సైన్యానికి అవసరమైన పరికరాలు, డ్రోన్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర సాంకేతిక సామగ్రి సరఫరాను వేగంగా పెంచే అవకాశం ఉంటుంది.యుద్ధభూమిలో సైనికులు పోరాడుతుంటే.. వెనుక దేశంలోని పరిశ్రమలు ఆ సైన్యానికి నిరంతరం ‘ఇంధనం’ అందించేలా వ్యవస్థను సిద్ధం చేయడమే చైనా లక్ష్యం.తుపాకులే కాదు.. డేటా యుద్ధం కూడా!ఏఐ, సైబర్ ఆపరేషన్స్, డ్రోన్లు, రోబోటిక్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, డేటా వ్యవస్థలను కూడా చైనా రక్షణ సమీకరణలో భాగం చేసింది. దీంతో భవిష్యత్ ఘర్షణలో సరిహద్దుల్లో సైనిక ఒత్తిడితో పాటు సైబర్ దాడులు, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం, సమాచార యుద్ధం, కీలక మౌలిక వసతులపై ఒత్తిడి వంటి చర్యలు ఏకకాలంలో ఎదురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు.. సరిహద్దులో సైనిక ఉద్రిక్తత కొనసాగుతూనే భారత్‌లోని కీలక డిజిటల్ నెట్‌వర్క్‌లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేదా సమాచార వాతావరణంపై ఒత్తిడి పెరిగితే.. అది సంప్రదాయ యుద్ధం కంటే చాలా విస్తృతమైన సవాలుగా మారుతుంది.భారత్‌కు ప్రమాదం ఏంటి?చైనా ఈ చట్టాన్ని సవరించిందంటే వెంటనే యుద్ధం వస్తుందన్న అర్థం కాదు. కానీ భవిష్యత్‌లో యుద్ధం లేదా సుదీర్ఘ సంక్షోభం వస్తే తన జాతీయ శక్తిని ఎంత వేగంగా సమీకరించుకోవాలనుకుంటోందో ఈ చట్టం స్పష్టం చేస్తోంది. భారత్-చైనా మధ్య 2020 లద్దాఖ్ ఉద్రిక్తతల తర్వాత ఎల్ఏసీపై ఇరు దేశాలూ మౌలిక వసతులు, సైనిక సామర్థ్యాలను పెంచుతున్నాయి. అలాంటి పరిస్థితిలో మరోసారి దీర్ఘకాలిక సరిహద్దు సంక్షోభం తలెత్తితే.. చైనా సైనిక బలంతో పాటు తన పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాన్ని కూడా నిరంతరం ఉపయోగించగలగడం భారత్‌పై ఒత్తిడిని పెంచే అంశం.పాక్‌తో టెన్షన్.. ఇక్కడ మరో కీలక అంశం చైనా-పాకిస్తాన్ సమీకరణం. ఒకవైపు ఉత్తర సరిహద్దులో చైనాతో ఉద్రిక్తత.. మరోవైపు పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్‌తో సమస్యలు తలెత్తితే భారత్ తన సైనిక వనరులను రెండు దిశల్లో పంచుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో యుద్ధాన్ని ప్రారంభించడం కంటే దాన్ని సుదీర్ఘకాలం కొనసాగించగల సామర్థ్యం అత్యంత కీలకంగా మారుతుంది. సైన్యానికి ఆయుధాలు ఉండటం మాత్రమే కాదు.. వాటిని నిరంతరం ఉత్పత్తి చేయగలగాలి. సైనికులకు సరఫరాలు చేరాలి. రోడ్లు, రైల్వేలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయాలి. ఉపగ్రహాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లు సురక్షితంగా ఉండాలి. సైబర్ దాడులను తట్టుకోవాలి. ఈ మొత్తం వ్యవస్థను ముందుగానే సిద్ధం చేసుకునే దిశగా చైనా అడుగులు వేస్తోంది.భారత్ ఏం చేయాలి?చైనా మోడల్‌ను భారత్ కాపీ చేయాల్సిన అవసరం లేదు. కానీ దాని వ్యూహం ఇచ్చే హెచ్చరికను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దేశీయ రక్షణ ఉత్పత్తిని మరింత పెంచడం, మందుగుండు సామగ్రి-ముఖ్యమైన పరికరాల వ్యూహాత్మక నిల్వలను బలోపేతం చేయడం, సరిహద్దు మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయడం, సైబర్ భద్రతను జాతీయ రక్షణలో భాగంగా చూడటం అవసరం. అదే సమయంలో ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థలు, కమ్యూనికేషన్ కంపెనీల సామర్థ్యాన్ని అవసరమైనప్పుడు దేశ రక్షణకు ఉపయోగించుకునే విధానాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ట్రంప్ అన్నాడో లేదో.. మ్యాప్ మార్చేసిన వైట్‌హౌస్!చైనా కొత్త చట్టం వెనుక ఉన్న అసలు ఆలోచనను ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. యుద్ధం వచ్చినప్పుడు సైన్యాన్ని మాత్రమే సిద్ధం చేయడం కాదు.. యుద్ధం చేయగల దేశాన్నే ముందుగానే సిద్ధం చేయాలి. భవిష్యత్ యుద్ధం సరిహద్దుల్లో మాత్రమే జరగదు. అది ఆకాశంలో, సముద్రంలో, సైబర్ ప్రపంచంలో, ఆర్థిక వ్యవస్థలో, సమాచార రంగంలో, ఫ్యాక్టరీల్లోనూ సాగవచ్చు. అందుకే భారత్‌కు చైనా తాజా చట్టం తక్షణ యుద్ధ హెచ్చరిక కంటే దీర్ఘకాలిక వ్యూహాత్మక హెచ్చరిక. ఎవరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయన్నదే కాదు.. సంక్షోభం వచ్చినప్పుడు ఎవరు తమ మొత్తం దేశ శక్తిని వేగంగా సమీకరించగలరు? ఎవరు ఎక్కువకాలం సరఫరాను కొనసాగించగలరు? ఎవరి ఆర్థిక, సాంకేతిక, సైబర్ వ్యవస్థలు ఎక్కువకాలం నిలబడగలవు?. రాబోయే ఘర్షణల్లో విజేతను నిర్ణయించే ప్రశ్నలు ఇవే కావచ్చు. -
పాక్ మిస్సైల్ టెస్ట్.. కశ్మీర్‌పై అమెరికా ప్రకటన.. సీన్ మారుతోందా?
ఇస్లామాబాద్ ఒక్కసారిగా కదిలింది. 750 కిలోమీటర్ల మేర గగనతలంపై ఆంక్షలు.. పైలట్లకు నోటామ్ నోటీసులు.. దీంతో పాకిస్తాన్ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ మొదలైంది. ఆగస్టు 19-20 తేదీల్లో పాక్ జారీ చేసిన గగనతల ఆంక్షలు ఫతాహ్ సిరీస్ మిస్సైల్ పరీక్షకు సంకేతాలా? అన్న చర్చ రక్షణ వర్గాల్లో మొదలైంది. అయితే నోటామ్లో మిస్సైల్ పరీక్షను స్పష్టంగా పేర్కొనలేదని కూడా నివేదికలు చెబుతున్నాయి.సుదూర లక్ష్యాలను ఛేదించేందుకు పాకిస్తాన్ అభివృద్ధి చేస్తున్న ఫతాహ్ శ్రేణి రాకెట్ వ్యవస్థల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ‘ఫతాహ్-3 పరీక్షే’ అన్నది ప్రస్తుతం రక్షణ పరిశీలకుల అంచనా మాత్రమే. అధికారికంగా పాకిస్తాన్ ధృవీకరించిన సమాచారం కాదు. ఇదే సమయంలో కశ్మీర్‌పై అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు మరింత అసౌకర్యాన్ని కలిగించాయి. శ్రీనగర్ పర్యటనలో గోర్ జమ్మూకశ్మీర్ “భారత్‌లో ముఖ్యమైన భాగం” అని పేర్కొన్నారు. దీనిపై పాకిస్తాన్ అమెరికా దౌత్య ప్రతినిధిని పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఒకవైపు మిస్సైల్ పరీక్షపై ఊహాగానాలు.. మరోవైపు కశ్మీర్‌పై అమెరికా స్పష్టమైన వ్యాఖ్యలు.. ఈ రెండు పరిణామాలు ఒకేసారి తెరపైకి రావడంతో దక్షిణాసియా భద్రతా సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. పాక్ గగనతల ఆంక్షల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? నిజంగానే కొత్త మిస్సైల్ పరీక్షకు రంగం సిద్ధమైందా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న.ఫతాహ్లో పాకిస్తాన్ ఇప్పటికే పలు రకాల దీర్ఘశ్రేణి ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. ముఖ్యంగా ఫతాహ్-4కు 750 కిలోమీటర్ల వరకు పరిధి ఉన్నట్లు రక్షణ వర్గాల సమాచారం ఉంది. ఈ ఏడాది మేలో పాక్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ ఫతాహ్-4కు సంబంధించిన శిక్షణ ప్రయోగాన్ని నిర్వహించినట్లు రక్షణ విశ్లేషణ సంస్థలు పేర్కొన్నాయి. ఫతాహ్ శ్రేణి ఆయుధాల అభివృద్ధి పాక్ దీర్ఘశ్రేణి సంప్రదాయ దాడి సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా కనిపిస్తోంది. 2025 తర్వాత భారత్-పాక్ మధ్య క్షిపణి, డ్రోన్, రాకెట్ సామర్థ్యాల పోటీ మరింత చర్చకు వచ్చింది. పాకిస్తాన్ కూడా కొత్త తరం ఆయుధ వ్యవస్థలను ప్రదర్శిస్తూ వస్తోంది.అయితే, ఈ తాజా నోటామ్‌ను నేరుగా భారత్‌కు వ్యతిరేకమైన చర్యగా లేదా కశ్మీర్ పరిణామాలకు ప్రతిస్పందనగా నిర్ధారించడం తొందరపాటు అవుతుంది. క్షిపణి పరీక్ష కోసం గగనతలాన్ని ఖాళీ చేయడం సైనిక భద్రతా ప్రక్రియలో భాగం కావచ్చు. అసలు ఏ క్షిపణిని పరీక్షించబోతున్నారు? దాని పరిధి ఎంత? ప్రయోగం ఎక్కడి నుంచి ఎక్కడికి జరగనుంది? అనే వివరాలపై అధికారిక సమాచారం వెలువడితేనే పూర్తి స్పష్టత వస్తుంది. -
జపాన్ సంచలన నిర్ణయం.. 80 ఏళ్ల శాంతివాదానికి స్వస్తి?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శాంతివాద విధానాలను అనుసరించిన జపాన్ ఇప్పుడు రక్షణ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, చైనా సైనిక దూకుడు, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల నేపథ్యంలో రక్షణ సామర్థ్యాల పెంపు అత్యవసరమని జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించాలంటే ముందుగా దానిని అడ్డుకునే శక్తి ఉండాలని ఆయన పేర్కొనడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం జపాన్ చేపడుతున్న చర్యలు ఆసియా భద్రతా సమీకరణాల్లో కీలక మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధాన్ని పూర్తిగా తిరస్కరించిన దేశం ఇప్పుడు ఎందుకు సైనిక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం వచ్చిందనే ప్రశ్నకు ఈ వ్యాఖ్యలే సమాధానంగా కనిపిస్తున్నాయి.ఒకప్పుడు యుద్ధాన్ని పూర్తిగా త్యజించి శాంతివాద దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన జపాన్.. ఇప్పుడు రక్షణ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చైనా సైనిక విస్తరణ, ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతకు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన.. యుద్ధాన్ని నివారించాలంటే ముందుగా దానిని అడ్డుకునే శక్తి ఉండాలి. శాంతిని కాపాడుకోవాలంటే ప్రత్యర్థి దాడి చేయాలనే ఆలోచనకే భయపడేంత శక్తి మన దగ్గర ఉండాలి. అందుకే జపాన్ తన రక్షణ రంగంలో భారీ మార్పులు తీసుకువస్తోందని ఆయన స్పష్టం చేశారు. దీంతో, ఆ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.జపాన్‌లో ఈ మార్పుకు కారణం?ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన ప్రాంతంగా మారింది. ముఖ్యంగా చైనా సైనిక శక్తి పెరుగుదల జపాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత పదేళ్లలో చైనా తన నౌకాదళం, వైమానిక దళం, క్షిపణి వ్యవస్థలను విస్తృతంగా అభివృద్ధి చేసింది. తైవాన్ చుట్టూ తరచూ నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు, తూర్పు చైనా సముద్రంలో జపాన్ నియంత్రణలో ఉన్న సేన్కాకు దీవుల సమీపంలో చైనా నౌకల సంచారం, దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దూకుడు టోక్యోలో భద్రతా ఆందోళనలను పెంచుతున్నాయి.జపాన్‌కు కేవలం చైనా మాత్రమే కాదు. ఉత్తర కొరియా కూడా మరో పెద్ద సవాల్‌గా మారింది. తరచూ నిర్వహిస్తున్న బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు, అణ్వాయుధ కార్యక్రమాలు జపాన్ భద్రతకు నేరుగా ముప్పుగా భావిస్తున్నారు. ఉత్తర కొరియా ప్రయోగించిన కొన్ని క్షిపణులు జపాన్ గగనతలంపై నుంచి దూసుకెళ్లడం అక్కడ ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దాడి కూడా జపాన్ విధానంలో పెద్ద మార్పునకు కారణమైంది. శాంతి కోసం ఒప్పందాలు సరిపోవు.. అవసరమైతే శక్తి కూడా ఉండాలి అనే భావన జపాన్ విధాన నిర్ణేతల్లో బలపడింది.శాంతివాద దేశం నుంచి సైనిక శక్తి వైపు..1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జపాన్ రాజ్యాంగంలోని 9వ అధికరణం ప్రకారం యుద్ధాన్ని శాశ్వతంగా త్యజించింది. దాడి చేసే సైన్యాన్ని కాకుండా కేవలం రక్షణ కోసం మాత్రమే ‘సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్’ను ఏర్పాటు చేసింది. ఇలా దశాబ్దాల పాటు జపాన్ ప్రపంచానికి శాంతివాద దేశంగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచ భద్రతా సమీకరణాల్లో వచ్చిన మార్పులు జపాన్ను తన వ్యూహాన్ని పునఃపరిశీలించేలా చేశాయి.ఇటీవల జపాన్ ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని భారీగా పెంచే నిర్ణయం తీసుకుంది. గతంలో జీడీపీలో కేవలం 1 శాతం మాత్రమే రక్షణకు కేటాయించగా, ఇప్పుడు దాన్ని 2 శాతానికి పెంచుతోంది. ఇది జపాన్ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ విస్తరణగా భావిస్తున్నారు.జపాన్ ఏం చేస్తోంది ?జపాన్ ప్రస్తుతం పలు కీలక రక్షణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది.అమెరికా నుంచి అత్యాధునిక టోమాహాక్ క్షిపణుల కొనుగోలుదీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం కలిగిన క్షిపణుల అభివృద్ధిసైబర్ యుద్ధ సామర్థ్యాల పెంపుకృత్రిమ మేధ (AI) ఆధారిత రక్షణ వ్యవస్థలుడ్రోన్ టెక్నాలజీ విస్తరణఅంతరిక్ష భద్రతా వ్యవస్థల బలోపేతంబ్రిటన్, ఇటలీలతో కలిసి ఆరో తరం యుద్ధ విమానాల అభివృద్ధిఇవన్నీ కేవలం రక్షణ కోసమేనని జపాన్ చెబుతున్నప్పటికీ, ఆసియా భద్రతా సమీకరణాల్లో ఇవి కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.చైనా స్పందన ఏంటి?జపాన్ చర్యలను చైనా తీవ్రంగా విమర్శిస్తోంది. జపాన్ మళ్లీ సైనికవాదం వైపు వెళ్తోందని బీజింగ్ ఆరోపిస్తోంది. అయితే, కోయిజుమి ఈ విమర్శలను ఖండించారు. అణ్వాయుధాలు లేని, ఇతర దేశాలపై దాడి చేసే విధానం లేని జపాన్ను సైనికవాద దేశంగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. నిజానికి ప్రాంతీయ అస్థిరతకు కారణం చైనా సైనిక విస్తరణేనని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.అమెరికా పాత్ర ఎంత కీలకం?జపాన్ భద్రతలో అమెరికా ప్రధాన భాగస్వామి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన భద్రతా ఒప్పందం ప్రకారం జపాన్‌పై దాడి జరిగితే అమెరికా రక్షణకు రావాల్సి ఉంటుంది. జపాన్‌లో దాదాపు 50 వేల మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాను సమతుల్యం చేయడంలో అమెరికా-జపాన్ భాగస్వామ్యం కీలకంగా మారింది. అందుకే జపాన్ రక్షణ సామర్థ్యాల పెంపు కేవలం టోక్యో నిర్ణయం మాత్రమే కాదు.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కూడా అనుగుణంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.జపాన్ పంపుతున్న సందేశం..జపాన్ తాజా వ్యూహం వెనుక ఒకే సందేశం ఉంది. శాంతి కోసం బలం అవసరం అని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశం ఇప్పుడు యుద్ధాన్ని నివారించేందుకు సైనిక శక్తిని పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జపాన్ చెబుతోంది. చైనా, ఉత్తర కొరియా, రష్యా వంటి భద్రతా సవాళ్ల మధ్య జపాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆసియా భవిష్యత్తు భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది. అయితే, జపాన్ ప్రస్తుతం చేపడుతున్న రక్షణ విస్తరణ కేవలం ఆయుధాల కొనుగోలు కాదు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతివాద విధానానికి అతిపెద్ద మలుపు. రాబోయే దశాబ్దంలో జపాన్ ఆసియాలో మరింత ప్రభావవంతమైన సైనిక, వ్యూహాత్మక శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అత్యంత శక్తివంత దేశాలను వణికిస్తున్న ఇరాన్.. అసలైన బలం అదే..!
-
నావికా దళంలోకి ‘ఐఎన్ఎస్ మాహె’
ముంబై: భారత సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. దాదాపు 80 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్ఎస్ మాహె’ నౌక భారత నావికా దళంలో చేరింది. సైలెంట్ హంటర్‌గా పిలిచే ఈ నౌక సముద్ర అంతర్భాగంలో శత్రుదేశాల జలాంతర్గాములను నిశ్శబ్దంగా వేటాడగలదు. తీర ప్రాంతంలో గస్తీతోపాటు సముద్రం లోపల సహాయక చర్యల్లోనూ పాల్గొంటుంది. ఇది మొట్టమొదటి మాహె–క్లాస్ యాంటీ–సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో–వాటర్ క్రాఫ్ట్. కేరళలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ అధునాతన నౌకకు మలబార్ తీరంలోని మాహె నగరం పేరుపెట్టారు. సోమవారం ముంబై తీరంలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ఐఎన్ఎస్ మాహెను నావికాదళానికి లాంఛనంగా అప్పగించారు. నావల్ షిప్‌ను నౌకా దళంలో ప్రవేశపెట్టే కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం. నౌక డిజైన్, నిర్మాణంలో పాలుపంచుకున్న సిబ్బందిని ఉపేంద్ర ద్వివేది సత్కరించారు. ఐఎన్ఎస్ మాహె నౌక ఇకపై వెస్ట్రన్ సీ బోర్డు ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించనుంది. → ఐఎన్ఎస్ మాహెలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు పొందుపర్చారు. సముద్రం ఉపరితలంపై, లోపల ముప్పును అత్యంత కచ్చితత్వంతో గుర్తించి, అంతం చేయగలదు. → ఇందులో టార్పెడోలు, యాంటీ–సబ్‌మెరైన్ రాకెట్లు ఉన్నాయి. సముద్రం లోపల శత్రుదేశాల జలాంతర్గాములను తుత్తునియలు చేస్తుంది. → యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో మన ఆత్మనిర్భరతకు ఐఎన్ఎస్ మాహె ఒక ప్రతీక అని భారత నావికాదళం అభివరి్ణంచింది. నౌక పైభాగంలె ‘ఉరుమి’ అనే ఖడ్గాన్ని అమర్చారు. ఇది కేరళ ప్రాచీన యుద్ధక్రీడ అయిన కలరిపయట్టులో ఉపయోగించే ఆయుధం. → నౌక మస్కట్(చిహ్నం) చిరుతపులి. నౌక నుంచి చాలా తక్కువ శబ్దం వెలువడుతుంది. అందుకే శత్రువులు సులువుగా గుర్తించలేరు. → పొడవు 78 మీటర్లు. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. సముద్రంలో సహాయక చర్యల్లో క్రియాశీలకంగా పనిచేస్తుంది. -
నా దేశం.. శత్రుదుర్భేద్యం!
శ్రీకృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం స్ఫూర్తితో.. దేశానికి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించారు. దీంతో ప్రపంచదేశాల దృష్టి ఒక్కసారిగా మనపై పడింది. నిజమే.. రక్షణ రంగంలో ఇప్పుడున్నది ఒకప్పటి భారత్ కాదు. గత పదేళ్లలోనే రక్షణ రంగంలో ఉత్పత్తుల విలువ పెరగడం.. దిగుబడులు తగ్గడమే ఇందుకు నిదర్శనం. అప్పట్లో మన ఆయుధాల్లో 65 శాతం దిగుమతులే. అది ఇప్పుడు 35 శాతానికి పరిమితం చేయగలిగాం. ‘మేడిన్ ఇండియా’ ఆయుధాలతో మన సత్తా ఏంటో ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రపంచానికి చాటాం. – సాక్షి, స్పెషల్ డెస్క్త్వరలో దేశానికి సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ రానుంది. ఇందులో భాగంగా దేశంలోని కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని ఏర్పాటు చేయనున్నారట. అంతేకాదు, ప్రతిదాడి వ్యవస్థను కూడా రూపొందిస్తారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటి వాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ తరహాలో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్షణ ఉత్పత్తుల్లో మన దేశం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందనడానికి ప్ర‘బల’ నిదర్శనం. ఉత్పత్తుల్లో రికార్డు2013–14లో దేశ రక్షణ రంగ బడ్జెట్ రూ.2.53 లక్షల కోట్లు. 2025–26లో అది 2.6 రెట్లు పెరిగి రూ.6.81 లక్షల కోట్లకు చేరింది. 2024–25లో మనదేశం రికార్డు స్థాయిలో రూ.2.09 లక్షల కోట్ల విలువైన 193 డిఫెన్స్ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇందులో రూ. 1.69 లక్షల కోట్ల విలువైన 177 కాంట్రాక్టులు దేశీయ సంస్థలవే కావడం గమనార్హం. 2014–15లో దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.46,429 కోట్లు. 2024–25లో ఇది రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు చేరిందని ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. అంటే మూడు రెట్లకుపైగా పెరిగింది! 2019–20లో ఇది కేవలం రూ.79,071 కోట్లే. అంటే 5 ఏళ్లలోనే దాదాపు రెట్టింపయిందన్నమాట. ఎగుమతుల జోరు» 2013–14లో రూ.686 కోట్లుగా ఉన్న మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు.. 2024–25 నాటికి ఏకంగా 34 రెట్లు పెరిగి రూ.23,622 కోట్లకు చేరాయి. ఈ ఎగుమతుల్లో రక్షణ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల వాటా 77 శాతం కాగా.. ప్రైవేటు రంగ వాటా 23 శాతం కావడం విశేషం. వీలైనంత త్వరలో రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. మనదేశ రక్షణ ఉత్పత్తులు అమెరికా, ఫ్రాన్స్ వంటి 100 దేశాలకు వెళ్తున్నాయి. అమెరికా వాటా 10% లోపే!గత దశాబ్దకాలంలో మనదేశ రక్షణ దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. మనకు ప్రధాన ఎగుమతిదారులు రష్యా, ఫ్రాన్స్. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) గణాంకాల ప్రకారం.. » మన మొత్తం దిగుమతుల్లో సుమారు 40 శాతం రష్యా నుంచే వస్తున్నాయి. » 2020లో ఫ్రాన్స్ నుంచి దిగుమతులు 25 శాతానికిపైగా ఉంటే.. 2021లో ఏకంగా 50 శాతానికి పెరిగాయి. ఆతరవాత తగ్గుతూ 2024లో సుమారు 15 శాతానికి పరిమితమయ్యాయి.» మొత్తం దిగుమతుల్లో ఇజ్రాయెల్ నుంచి 2022 వరకు 10 శాతంగానే ఉన్న వాటా.. 2023లో ఒక్కసారిగా 40 శాతానికి చేరింది. 2024లో అది సుమారు 28 శాతానికి చేరింది. » 2020 నుంచి చూస్తే అమెరికా వాటా ఎప్పుడూ 20 శాతం కూడా దాటలేదు. ప్రస్తుతం 10 శాతంలోపే ఉంది.ఆ మూడు దేశాలే..మనదేశానికి యుద్ధ విమానాల సరఫరాలో ఫ్రాన్స్ కీలకపాత్ర పోషిస్తోంది. 2020–25 మధ్య రికార్డు స్థాయిలో 2,543 సరఫరా చేయగా, రష్యా నుంచి 1,280 దిగుమతి చేసుకున్నాం. ఇక మిసైళ్ల విషయానికొస్తే రష్యా నుంచి 1,149, ఇజ్రాయెల్ నుంచి 802 వచ్చాయి. శత్రువుల దాడులను తట్టుకోగలిగే దుర్భేద్యమైన రక్షణ వాహనాలు రష్యా నుంచి మాత్రమే 963 వచ్చాయి. గగన తల భద్రతా వ్యవస్థలు రష్యా నుంచి 390, ఇజ్రాయెల్ నుంచి 376 వచ్చాయి. ఫ్రాన్స్ నుంచి 899, రష్యా నుంచి 304 షిప్స్ దిగుమతి చేసుకున్నాం. ఏయే ఆయుధాల కోసం ప్రధానంగా ఏయే దేశాలపై ఆధారపడుతున్నామంటే..విమానాలు: ఫ్రాన్స్, రష్యా, అమెరికాగగనతల రక్షణ వ్యవస్థలు: రష్యా, ఇజ్రాయెల్దుర్భేద్యమైన రక్షణ వాహనాలు: రష్యామిసైళ్లు: రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్సెన్సర్లు: ఇజ్రాయెల్, జర్మనీ, ఫ్రాన్స్షిప్స్ : ఫ్రాన్స్, రష్యా -
అణుఫైటర్ల కొనుగోలు
లండన్: వరుస ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో యూకే తన రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టింది. అణ్వస్త్ర వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే ఎఫ్–35 ఏ ఫైటర్ జెట్లు 12 అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కియిర్ స్టార్మర్ ప్రకటించారు. ‘తీవ్రమైన అనిశ్చితి యుగంలో ఈ విమానాలు మన సాయుధ దళాలను బలోపేతం చేస్తాయి. మన రక్షణ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైన్యానికి మద్దతు ఇస్తాయి’ అని స్టార్మర్ తెలిపారు. కొత్త విమానాలను నార్ఫోక్లోని ఆర్ఏఎఫ్ మార్హామ్లో ఉంచుతారు. శత్రు దాడులను నివారించడానికి, నాటో సభ్యుల మధ్య అణుశక్తిని పంచుకునే కార్యక్రమంలో భాగంగా ఇవి ఉంటాయి. యూకే అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. ‘దేశవ్యాప్తంగా 100 వ్యాపారాలకు, 20,000 కంటే ఎక్కువ ఉద్యోగా కల్పించే ఈ ఎఫ్35 డ్యూయల్ కెపాసిటీ విమానాలు మన రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో కొత్త శకానికి నాంది పలుకుతాయి. మన దేశాన్ని, మన మిత్రదేశాలను బెదిరించే శత్రువుల నుంచి ముప్పును అరికడతాయి’ అని స్టార్మర్ అన్నారు.స్వాగతించిన నాటో.. ఈ ప్రకటనను నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే స్వాగతించారు. ఆయన దీనిని బ్రిటన్ నుంచి కూటమికి బలమైన సహకారంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం నాటో ఫస్ట్ వ్యూహ్యాన్ని బలపరచడమే కాదు, యూకే ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుందని రక్షణ కార్యదర్శి జాన్ హీలీ అన్నారు. బ్రిటిష్ భూభాగంపై భవిష్యత్తులో దాడులు జరిగే అవకాశం ఉందని యూకే రక్షణ వ్యవస్థ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. రష్యా అతిపెద్ద ముప్పుగా మిగిలిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ కొనుగోళ్ల ప్రకటన వెలువడింది.బలమైన అణుబంబాలను మోసుకెళ్లే జెట్లు..ఎఫ్–35ఏ విమానం బీ61–12 అనే ప్రత్యేకమైన బాంబును మోసుకెళ్ల గలదు. అవి 0.3, 1.5, 10, 50 కిలో టన్నుల పేలుడు పదార్థాలను మోయ గలవని అమెరికన్ సైంటిస్ట్స్ సమాఖ్య తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై వేసిన బాంబు బరువు 15 కిలోటన్నులు. ఈ జెట్ విమానాలను యూఎస్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసింది. ఎఫ్–35ఏ పాత ఎఫ్–35బీ కంటే ఖరీదు తక్కువని, ప్రతి విమానంపై 25% వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. -
అమెరికా గోల్డెన్ డోమ్.. భారత్ ఐరన్ డోమ్ ఇదే
ఢిల్లీ: అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో అటు ఇరాన్, ఇటు హిజ్బొల్లాలు ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేశాయి. అయితే ఈ దాడిలో రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డంగించింది.రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేసి తన సామర్థ్యం ఏంటో ఇజ్రాయెల్ ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థపై ప్రపంచ దేశాలు కన్నేశాయి. మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్‌డోమ్‌తో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడీ ఐరన్ డోమ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాను బాలిస్టిక్,క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు 175 బిలియన్ డాలర్ల వ్యవస్థతో గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తోంది?వంటి వివరాలు చూద్దాం.గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి?గోల్డెన్ డోమ్ అనేది అమెరికా కోసం రూపొందించబడిన అంతరిక్ష ఆధారిత క్షిపణి నిరోధక కవచం. శుత్రువులు ప్రయోగించిన రాకెట్లను భూమి మీదకు చేరుకునే లోపే అడ్డుకునేలా టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌లు భూమి మీద ఉన్న ఇంటర్సెప్టర్లు (Interceptors) ఆధారంగా పనిచేస్తే, అమెరికా గోల్డ్ డోమ్ పూర్తిగా అంతరిక్షంలో శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. ఈ గోల్డెన్ డోమ్‌లో శాటిలైట్స్ ఉంటాయి. ఇవి క్షిపణులు ఎగురటం ప్రారంభమైన వెంటనే వాటిని గుర్తించి, ప్రారంభ దశలోనే వాటిని నిలువరించే సామర్ధ్యం సత్తా దీని సొంతం.ఈ సాంకేతికత అమెరికా భూమిపైకి మాత్రమే కాకుండా ఇతర ఖండాల నుండి లేదా అంతరిక్షం నుండి వచ్చే క్షిపణుల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇది చైనా, రష్యా, ఉత్తర కొరియా, భవిష్యత్తులో ఇరాన్ లాంటి దేశాలు తలపెట్టే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా రూపొందిస్తోంది.బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి దేశాన్ని రక్షిస్తోంది. గోల్డెన్ డోమ్‌లో అవుటర్ లేయర్ స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ (SBIRS),గ్రౌండ్-బేస్డ్ రాడార్స్తో పాటు,మిసైల్ లాంఛర్లను అడ్డుకుంటుంది. భారత్‌కు ఆకాశ్ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా గోల్డెన్‌డోమ్.. భారత్‌కు ఆకాశ్. ఆకాశ్ భారత్ క్షిపణి రక్షక వ్యవస్థ. 30 కి.మీ. దూరంలో, 18,000 మీ. ఎత్తులో ఎగురుతున్న శత్రు విమానాల్ని కూల్చేస్తుంది. గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులనూ నిర్వీర్యం చెయ్యగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచరులో మూడేసి క్షిపణులూ ఉంటాయి. ఇందులో ఒక రాజేంద్ర 3డీ పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎర్రే రాడార్ కూడా ఉంటుంది. ప్రతీ బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాలను పరిశీలిస్తుంది. వాటిలో 12 లక్ష్యాలను ఛేదించగలదు.ఒక్కో క్షిపణిలో 60 కిలోగ్రాము శకలాలతో కూడుకున్న వార్‌హెడ్ ఉంటుంది.ఆకాశ్ వ్యవస్థ తేలిగ్గా ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు. -
పాకిస్థాన్ దాడులను తిప్పికొట్టిన భారత్
పాకిస్థాన్ దాడులను భారత్ తిప్పికొట్టింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాకిస్థాన్ మిస్సైళ్లను భారత దళాలు కూల్చివేశాయి. యాంటి మిస్సైల్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే భారత్ పేల్చేసింది. ఎస్-400 మిస్సైళ్లను ఉపయోగించి పాక్‌కు భారత్ బుద్ధి చెప్పింది. గత రెండు రోజులుగా భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నిస్తుండగా, వీటిని భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుంటున్నాయి.ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసమైనట్లు తెలిసిందని భారత రక్షణశాఖ వెల్లడిచింది. లోహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్ దెబ్బతీసింది. చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను పాకిస్థాన్ ఉపయోగిస్తోంది. ఉత్తర, పశ్చిమ తీరంలో పలు మిలటరీ స్థావరాలను పాక్ టార్గెట్ చేసింది.అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్ ,లూధియానా, అదంపుర్, బఠిండా, ఛండీగఢ్, పలోడి, ఉత్తర లాల్, భుజ్లపై డ్రోన్లు, మిసైళ్లతో మిలటరీ స్థావరాలను పాక్ టార్గెట్ చేసింది. దీంతో పెద్ద ఎత్తున పాక్ మిస్సైళ్లను భారత్ కూల్చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుదర్శన చక్రను భారత్ ఉపయోగించింది. పాకిస్తాన్ ఏ ప్రాంతాలను టార్గెట్ చేసిందో. అదే ప్రాంతాల్లో పాక్‌కు భారత్ గట్టి బుద్ధి చెప్పింది.రావల్సిండి స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. రావల్సిండి స్టేడియంపై భారత్ డ్రోన్ దాడి చేసింది. పాకిస్థాన్ లీగ్ మ్యాచ్‌కు ముందే భారత దళాలు దాడి చేయగా.. రావల్సిండి విడిచి వెళ్లిపోవాలని క్రికెటర్లను పాక్ ఆదేశించింది. Pakistan Air defence System in Lahore destroyed completely #IndiaPakistanWar #OperationSindoor #LahoreBlast pic.twitter.com/jLe6GIed4m— War Room Insights (@AppWarRoom) May 8, 2025 -
రక్షణ రంగ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: డజనుకు పైగా డీఆర్డీవో పరిశోధన సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో హైదరాబాద్ రక్షణ రంగ హబ్‌గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. దేశంలోనే తొలి ‘సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రం’ఏర్పాటుకు సంబంధించి వీఈఎం(వెమ్) టెక్నాలజీస్ కంపెనీకి, తెలంగాణ ప్రభుత్వానికీ మధ్య ఆదివారం ఒప్పందం కుదిరింది. జహీరాబాద్ సమీపంలోని ఎల్గోయి వద్ద దాదాపు 511 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి విమాన, రక్షణ రంగ విదేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో వేయికి పైగా లఘు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు (ఎస్ఎంఎస్ఈ) ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో పలు ఎంఎస్ఎంఈలు పెద్ద కంపెనీలుగా ఎదిగిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎన్ని సైద్ధాంతిక విభేదాలున్నా రక్షణ రంగం లేదా పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని, దేశాభివృద్ధికి ఇది కీలకమని స్పష్టం చేశారు. రక్షణ రంగంలో అతి కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మెగాప్రాజెక్టు హోదా కల్పించడమే కాకుండా, అన్ని రకాల సహకారం అందిస్తోందని అన్నారు. క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేసేందుకు అనువుగా ఉన్న ఈ కేంద్రం కోసం వెమ్ టెక్నాలజీస్ రూ.వెయ్యికోట్ల పెట్టుబడి పెట్టనుందని, రెండు వేల కంటే ఎక్కుమందికి ఉపాధి అవకాశం కల్పించనుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కంపెనీ భారతదేశ లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికాలో అతిపెద్ద రక్షణ రంగ తయారీ సంస్థ) అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదని మంత్రి కొనియాడారు. లక్ష కోట్ల రూపాయలకుపైబడే: సతీశ్ రెడ్డి రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ చాలాకాలం కేంద్రంగా ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా వీటికి మరింత ఊతం లభించిందని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. ఆకాశ్, ఎంఆర్ సామ్ వంటి అనేక క్షిపణులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని వేర్వేరు కేంద్రాల్లో తయారవుతున్నాయని, వీటన్నింటి విలువ లక్ష కోట్ల రూపాయలకుపైబడే ఉంటుందని తెలిపారు. వెమ్ టెక్నాలజీస్ కొత్తగా ఏర్పాటు చేయనున్న సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రంలో ఎగుమతుల కోసం ప్రత్యేక విభాగం ఉండటం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ వీకే సారస్వత్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధవిమానం తయారు చేయడమే లక్ష్యం: వెంకట్ రాజు కూకట్‌పల్లిలోని ఓ చిన్న ఇంటిలో 1988లో మొదలైన వెమ్ టెక్నాలజీస్ ఈ 33 ఏళ్లలో ‘‘అసిబల్’’పేరుతో సొంతంగా ఓ క్షిపణిని తయారు చేసే స్థాయికి ఎదిగిందని వెమ్ టెక్నాలజీస్ అధ్యక్షుడు వెంకట్ రాజు అన్నారు. భారత్‌లో 2029 కల్లా ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. వాషింగ్ మెషీన్ల టైమర్లతో మొదలుపెట్టి.. ఒక క్రమపద్ధతిలో రక్షణ రంగంలోని వేర్వేరు విభాగాలకు చెందిన విడిభాగాలను తయారు చేయడం మొదలుపెట్టామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు కేంద్రాలు ఉండగా.. జహీరాబాద్ సమీపంలోని యల్గోయి వద్ద సమీకృత రక్షణ వ్యవస్థల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. యుద్ధవిమానం తయారీ కోసం ప్రత్యేకంగా ఒక ఇంజనీరింగ్ కేంద్రం అవసరమని, ఐదువేల మంది ఇంజనీర్లతో దీన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆయన ‘‘సాక్షి’’కి వివరించారు. -
రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి ఉజ్వల భవిత
సాక్షి, హైదరాబాద్ : రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి మంచి భవిష్యత్తు ఉం దని హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయ ల్ రీఫ్‌మన్ అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అమెరికా భారత్ రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఢిల్లీ రాయబార కార్యాలయ అధికారి కెప్టెన్ డేనియల్ ఇ ఫిలియన్, ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విశాఖలో అమెరికా, భారత్ త్రివిధ సైనిక దళాలు ప్రదర్శించిన సైనిక విన్యాసాలు రక్షణ రంగంలో ఏపీ సామర్థ్యానికి అద్దం పట్టాయన్నారు. ఏపీ, తెలంగాణతో అత్యున్నత రక్షణ సాంకేతిక సహకార బంధం ఏర్పర్చుకునేందుకు అమెరికన్ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయన్నారు.డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో రెండు రాష్ట్రాలకు అనేక అనుకూలతలున్నాయని తెలిపారు. అమెరికా విద్యాసంస్థల్లో చదివే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీసాల జారీని కొనసాగించడంతో పాటు, భవిష్యత్తులో పెంచుతామని చెప్పా రు. తాజాగా అమెరికా భారత్ నడుమ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఒప్పందానికి తుది రూపునిచ్చినట్టు తెలిపారు. -
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలో చైనా మిసైల్
-
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలో చైనా మిసైల్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ వాయు రక్షణ వ్యవస్థలో చైనా తయారు చేసిన ఎల్వై-80 ఉపరితల, వాయు మిసైల్‌ను ఉపయోగించనున్నట్లు ఆదివారం ఆ దేశ ఆర్మీఅధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పాకిస్థాన్ ఉపరితల రక్షణ కోసం దీన్ని ప్రవేశపెడ్తున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బజ్వా తెలిపారు. మొబైల్ వాయు ఢిపెన్స్ వ్యవస్థతో పని చేసే ఇది ఎక్కువ దూరాల్లో నుంచి శత్రువులు చేసే దాడులను గుర్తిస్తుందన్నారు. ఎల్వై-80, పాక్ వాయు రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుందని, వాయు బెదిరింపులను తిప్పికొడుతుందని తెలిపారు.


